మల్లుగారి నర్సాగౌడ్, బల్మూరి వనిత, రవీందర్‌రెడ్డి
భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీఆర్‌ఎస్, మహాకూటమి అభ్యర్థులకు దీటైన పోటీ ఇచ్చే అవకాశం ఉన్నచోట గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. తొలి, మలి విడతల్లో ఇప్పటికే ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం.. మిగతా స్థానాల్లో గట్టిగా తలపడి గెలిచే అవకాశం ఉన్న వలస నేతల కోసం వేచి చూస్తోంది. చొప్పదండి (ఎస్సీ), వేములవాడ, మంథని నియోజకవర్గాలకు సంబంధించి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, కూటమిల నేతలు కొందరు అధిష్టానంతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు.
ఈ మూడింట్లో సొంత పార్టీ నుంచి పోటీదారులు ఉన్నా.. ప్రకటించకుండా ఉండటానికి అదే కారణంగా చెప్తున్నారు. ఇదే సమయంలో పెండింగ్‌లో హుజూరాబా ద్, హుస్నాబాద్ నియోజకవర్గాలలో వివిధ పార్టీల నుంచి నుంచి అవకాశం దక్కని ముఖ్య నేతలకు ఆయా స్థానాలను కేటాయించే విషయమై దృష్టి సారించినట్లు పార్టీవర్గాలు చెప్తున్నాయి. గత నెల 10న కరీంనగర్‌లో అమిత్‌షా బహిరంగ సభ అనంతరం బీజేపీ నాయకత్వం గట్టి పోటీ ఇచ్చే వలస నేతలను ఆహ్వానించి అవకాశం కల్పించే యోచనను ముమ్మరం చేసింది. ఆ మేరకు పలువురు ఈనెల 9 తర్వాత తమ నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉండగా, మిగతా సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ ఆచీతూచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో ముగ్గురు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అక్టోబర్ 21న తొలివిడతగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, రెండో విడతగా మరో మూడు నియోజకవర్గాలకు శుక్రవారం ఖరారు చేసింది. జగిత్యాలకు ముదుగంటి రవీందర్‌రెడ్డి, రామగుండంకు బల్మూరి వనిత, సిరిసిల్లకు మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు. ఆ పార్టీలో కీలకంగా ఉం టూ, ఆయా నియోజకవర్గాల్లో మొదటి నుంచి ప్రజలను అంటిపెట్టుకున్న నేతలకు తొలి, మలి జాబితాల్లో అవకాశం కల్పించారు. తొలి జాబి తాలో గుజ్జుల రామకృష్ణారెడ్డి (పెద్దపల్లి), బండి సంజయ్‌కుమార్ (కరీంనగర్), గడ్డం నాగరాజు (మానకొండూరు), కన్నం అంజయ్య (ధర్మపురి (ఎస్సీ)), కోరుట్లకు జేఎన్ వెంకట్ (కోరుట్ల)ను ప్రకటించారు.
దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలకు మొదటి, రెండో విడతల్లో ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య ఎనిమిది మందిని ప్రకటించగా, మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల ప్రకటన నుంచే బీజేపీ ఉమ్మ డి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో ఆశావహులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధిష్టానం మాత్రం వ్యూహాత్మకంగా టిక్కెట్లను ప్రకటిస్తోంది. గతంలో పోటీ చేసి గెలిచిన, ఓడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఆయా ని యోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజిక వర్గాలు, నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుం టోంది. ఇదే క్రమంలో పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తుండగా, మిగిలిన ఐదు స్థానాల పై మాత్రం మరింత వ్యూహాత్మకంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
వలస నేతలకు అవకాశం కోసం.. ఐదు స్థానాలపై తర్వాతే నిర్ణయం..
అభ్యర్థులను ప్రకటించని ఐదు స్థానాల్లో మూడు చోట్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూటమిల నుంచి టచ్‌లో ఉన్న నేతలకు బీజేపీ అవకాశం కల్పించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. వేములవాడ నుంచి టికెట్ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎన్‌ఆర్‌ఐ గోలి మోహ న్ దరఖాస్తు చేసుకున్నారు. తొలి, మలి విడతల్లో ఏకంగా జిల్లా అధ్యక్షునికే అవకాశం ఇవ్వలేదు. ఆయన గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రచారానికి సహకరించలేదన్న ఆరోపణలు ఉండగా, ఈ స్థానం కోసం టీఆర్‌ఎస్‌లోని ఓ కీలక నేత బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారన్న చర్చ జరగుతోంది. చొప్పదండి నుంచి కొరివి వేణుగోపాల్, లింగంపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య తదితరుల పేర్లుండగా, కొరివి వేణుగోపాల్ ఇటీవలే బీజేపీకి రాంరాం చెప్పారు. మిగిలిన ఇద్దరు కాకుండా ఈ నియోజకవర్గం నుంచి సైతం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలకనేత కమలం గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో చొప్పదండికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదంటున్నారు. అదేవిధంగా మంథనిలో రేండ్ల సనత్‌కుమార్, కొండపాక సత్యప్రకాష్, బోగోజు శ్రీనివాస్, ఉప్పరి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో ఇటీవలే చేరిన కమాన్‌పూర్ జెడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్, ఖ్యాతం వెంకటరమణ, పొన్నం సదానం దం దరఖాస్తు చేసుకోగా.. 2014, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఓ నేత పార్టీలో చేరే అవకాశం ఉం దంటున్నారు. ఈ నేపథ్యంలో మంథని అభ్యర్థిని ప్రకటించలేదంటున్నారు. హుజూరాబాద్ నుంచి కోమల్ల రాజేం దర్‌రెడ్డి, కటంగూరి అనిల్‌రెడ్డి, పుప్పాల రఘు, కనుమల్ల గణపతి, ఉప్పు రవి, గంగడి కృష్ణారెడ్డి, పోరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు 14 మంది దరఖాస్తు చేసుకున్నారు.
బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొత్త శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో హుస్నాబాద్ కోసం సైదాపూర్ మండలం అమ్మనగుర్తి చెందిన పల్నే ని వేణుగోపాల్‌రావు, చాడ శ్రీనివాస్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ, బీజేపీలో కీలకంగా పనిచేసిన వేణుగోపాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సైదాపూర్ మండలంలో మెజార్టీ స్థానాలు రావడానికి కృషి చేశారు. అయితే.. హుజూరాబాద్, హుస్నాబాద్‌లో కూడా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూట మి నుంచి కొందరు నాయకులు చేరనున్నారన్న ప్రచారంతో ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా అభ్యర్థులను ప్రకటించ లేదని పార్టీ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment