సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ ఎన్నికల కమిటీ.. 38 మందితో కూడిన తొలి జాబితాకు ఆమోదం తెలిపింది. అంతకుముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైంది. ఈ సందర్భంగా పోటీ లేని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను షాకు అందజేసి చర్చించారు. అనంతరం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
ఇందులో అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, జేపీ నడ్డా, థావర్‌చంద్ గెహ్లాట్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, రాంలాల్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ ఎన్నికల బాధ్యులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 38 మందితో కూడిన తొలి జాబితాతోపాటు మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. శనివారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన డాక్టర్ జె.వెంకట్ కోరుట్ల నుంచి బరిలోకి దిగనున్నారు. ఆయన సతీమణి జెడ్పీటీసీ సునీత కూడా బీజేపీలో చేరారు.
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | నియోజకవర్గం |
1 | కె. లక్ష్మణ్ | ముషీరాబాద్ |
2 | జి. కిషన్ రెడ్డి | అంబర్‌పేట్ |
3 | చింతల రామచంద్రా రెడ్డి | ఖైరతాబాద్ |
4 | ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ | ఉప్పల్ |
5 | టి. రాజా సింగ్ | గోషా మహల్ |
6 | ఎన్. రామచందర్‌రావు | మల్కాజ్‌గిరి |
7 | పేరాల శేఖర్ రావు | ఎల్బీనగర్ |
8 | జి రామకృష్ణారెడ్డి | పెద్దపల్లి |
9 | సక్కినేని వెంకటేశ్వర్రావు | సూర్యాపేట్ |
10 | పి. మోహన్‌రెడ్డి | మేడ్చల్ |
11 | టి. ఆచారి | కల్వకుర్తి |
12 | జి. మనోహర్ రెడ్డి | మునుగోడు |
13 | కొండపల్లి శ్రీధర్ రెడ్డి | పాలేరు |
14 | బండి సంజయ్ | కరీంనగర్ |
15 | ఎమ్ రఘునందన్ రావు | దుబ్బాక |
16 | బాబు మోహన్ | ఆందోల్ |
17 | కుంజ సత్యవతి | భద్రాచలం |
18 | పాయల్ శంకర్ | ఆదిలాబాద్ |
19 | పదకంటి రమాదేవి | ముథోల్ |
20 | కె రతంగ పాండు రెడ్డి | నారాయణ్‌పేట్ |
21 | బి. కొండయ్య | మక్తల్ |
22 | ఎన్. శ్రీ వర్ధన్‌రెడ్డి | షాద్ నగర్ |
23 | పి. విజయ చంద్రారెడ్డి | పరకాల |
24 | చందుపట్ల కీర్తి రెడ్డి | భూపాలపల్లి |
25 | మాధవి రాజు | భోథ్ |
26 | కొయ్యల ఏమాజి | బెల్లంపల్లి |
27 | వెంకట రమణా రెడ్డి | కామారెడ్డి |
28 | కేశ్‌పల్లి ఆనంద్ రెడ్డి | నిజామాబాద్ రూరల్ |
29 | సంతోష్ కుమార్‌చందా | పినపాక |
30 | ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి | ఆర్మూర్ |
31 | కన్నం అంజయ్య | ధర్మపురి |
32 | గడ్డం నాగరాజు | మానకొండూరు |
33 | పటేల్ రవిశంకర్ | తాండూర్ |
34 | టి. అమర్‌సింగ్ | కార్వాన్ |
35 | గద్వాల్ వెంకటాద్రి రెడ్డి | గద్వాల |
36 | మల్లేశ్వర్ మేడిపూర్ | అచ్చంపేట్ |
37 | నంబూరి రామలింగేశ్వర రావు | సత్తుపల్లి |
38 | జె. వెంకట్ | కోరుట్ల |
Comments
Please login to add a commentAdd a comment