సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 55 మంది పేర్లను ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉదయం ఢిల్లీలో ఈ జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోని మొత్తం 55 స్థానాల్లో.. 17 మంది రెడ్లు, ఏడుగురు వెలమ, 12 మంది బీసీ, ముగ్గురు ముస్లిం, ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులకు చోటు కల్పించారు.
వీటితోపాటు 12 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావు ఇద్దరికీ సీట్లు దక్కాయి. మరోవైపు ఎంపీ ఉత్తమ్‌తోపాటు ఆయన భార్య పద్మావతిలకు తొలి జాబితాలోనే సీట్లు కేటాయించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎల్బీనగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తదితర సీనియర్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
లెఫ్ట్ పొత్తు తేలాక రెండో జాబితా
ఇండియా కూటమిలో భాగంగా వామపక్షాలతో పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వచి్చన తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు పూర్తిచేసి విడుదల చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ తొలి జాబితా ఇదీ..
1) కొడంగల్: ఎనుమల రేవంత్‌రెడ్డి
2) మధిర (ఎస్సీ): మల్లు భట్టి విక్రమార్క
3) ఆందోల్ (ఎస్సీ): దామోదర రాజనర్సింహ
4) హుజూర్‌నగర్: ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
5) కోదాడ: ఎన్.పద్మావతి
6) నల్గొండ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
7) మంథని: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
8) సంగారెడ్డి: తూర్పు జగ్గారెడ్డి
9) ములుగు (ఎస్టీ): ధనసరి అనసూయ (సీతక్క)
10) భద్రాచలం (ఎస్టీ): పోడెం వీరయ్య
11) కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు
12) మల్కాజ్‌గిరి: మైనంపల్లి హన్మంతరావు
13) మెదక్: మైనంపల్లి రోహిత్‌రావు
14) నాగార్జునసాగర్: జయవీర్‌రెడ్డి
15) జగిత్యాల: టి.జీవన్‌రెడ్డి
16) బెల్లంపల్లి: గడ్డం వినోద్
17) మంచిర్యాల: కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు
18) నిర్మల్: కూచాడి శ్రీహరిరావు
19) ఆర్మూర్: పి.వినయ్‌కుమార్
20) బోధన్: పి.సుదర్శన్‌రెడ్డి
21) బాల్కొండ: సునీల్‌కుమార్ ముత్యాల
22) ధర్మపురి(ఎస్సీ): అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
23) నకిరేకల్(ఎస్సీ): వేముల వీరేశం
24) వేములవాడ: ఆది శ్రీనివాస్
25) రామగుండం: ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్
26) పెద్దపల్లి: సీహెచ్.విజయరామారావు
27) మానకొండూరు (ఎస్సీ): కవ్వంపల్లి సత్యనారాయణ
28) జహీరాబాద్(ఎస్సీ): ఆగం చంద్రశేఖర్
29) గజ్వేల్: తూముకుంట నర్సారెడ్డి
30) మేడ్చల్: తోటకూర వజ్రేశ్ కుమార్
31) కుత్బుల్లాపూర్: కొలను హన్మంతరెడ్డి
32) ఉప్పల్: ఎం.పరమేశ్వర్‌రెడ్డి
33) చేవెళ్ల(ఎస్సీ): పమేన భీంభారత్
34) పరిగి: టి.రామ్మోహన్‌రెడ్డి
35) వికారాబాద్ (ఎస్సీ): గడ్డం ప్రసాద్‌కుమార్
36) ముషీరాబాద్: అంజన్‌కుమార్ యాదవ్
37) మలక్‌పేట్: షేక్ అక్బర్
38) సనత్‌నగర్: కోట నీలిమ
39) నాంపల్లి: మహ్మద్ ఫిరోజ్‌ఖాన్
40) చాంద్రాయణగుట్ట: బోయ నగేశ్ (నరేశ్)
41) కార్వాన్: ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ హజ్రీ
42) గోషామహల్: మొగిలి సునీత
43) యాకూత్‌పుర: కె.రవిరాజు
44) బహదూర్‌పుర: రాజేశ్‌కుమార్ పులిపాటి
45) సికింద్రాబాద్: దామ్ సంతోష్‌కుమార్
46) అలంపూర్(ఎస్సీ): ఎస్.ఏ.సంపత్‌కుమార్
47) అచ్చంపేట(ఎస్సీ): చిక్కుడు వంశీకృష్ణ
48) గద్వాల: సరితా తిరుపతయ్య
49) నాగర్‌కర్నూల్: కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి
50) కల్వకుర్తి: కసిరెడ్డి నారాయణరెడ్డి
51) షాద్‌నగర్: కె.శంకరయ్య
52) ఆలేరు: బీర్ల ఐలయ్య
53) స్టేషన్ ఘన్‌పూర్: సింగాపురం ఇందిర
54) నర్సంపేట: దొంతి మాధవరెడ్డి
55) భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణరావు
55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
Published Mon, Oct 16 2023 1:50 AM | Last Updated on Mon, Oct 16 2023 6:49 PM
Comments
Please login to add a commentAdd a comment