first list of candidates
-
హస్తినలో మొదలైన ఎన్నికల హడావుడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగియడంతో క్రమంగా వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే తమ ఎన్నికల కసరత్తును బీజేపీ, ఆప్ పార్టిలు ముమ్మరం చేసి దాడి, ఎదురుదాడులను మొదలు పెట్టాయి. ఆప్ నేత కైలాశ్ గహ్లోత్ బీజేపీలో చేరిన తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో ఢిల్లీ ప్రజలతో సంప్రదింపులు జరుపుతుండగా, మరోవైపు బీజేపీ తమ ఢిల్లీ నేతలను క్రియాశీలం చేసింది. గురువారం 11 మందితో ఆప్ తొలిజాబితాను సైతం విడుదల చేసింది. పోటీపోటీగా ఆప్, బీజేపీ..వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక, వ్యూహాల అమలులో ఆప్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతో పాటు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్‌లపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బీజేపీ, అనంతరం సైతం ఏమాత్రం తగ్గకుండా అంతకంతకూ పెరుగుతున్న యమునా నది కాలుష్యం, పెరిగిన వాయు కాలుష్యం, తాగునీటి ఎద్దడి, ముంపు ప్రాంతాల్లో బాధితులకు అందని సహకారం వంటి అంశాలపై గడిచిన నాలుగు నెలలుగా తన పోరాటాన్ని ఉధృతం చేసింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై గడిచిన వారం రోజులుగా పోస్టర్ వార్తో పాటు వీధి పోరాటాలు చేస్తోంది. ఇక ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోందని ఆప్ ఎదురుదాడి చేస్తోంది. ప్రజా ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వకుండా.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అసాధారాణ అధికారాలు కట్టబెట్టి, సమస్యలను జటిలం చేస్తోందని ఆప్ సైతం తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. ఈ పరిణామాలు ఓ పక్క జరుగుతున్న సమయంలోనే ఆప్ కీలక నేత, మాజీ మంత్రి కైలాశ గహ్లోత్ బీజేపీలో చేరారు. దీనికి బదులుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝాని తన పార్టీలో చేర్చుకుంది ఆప్. ఈడీ కేసుల భయంతోనే గహ్లోత్ పార్టీ మారారని ఆప్ ఆరోపిస్తే, కేజ్రీవాల్‌కు రాజకీయ ఆశయాలు పెరగడం వల్లే ఆయన పార్టీ మారారని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. ఇక మరోపక్క ఎన్నికల అభ్యర్థులను త్వరగా ఖరారు చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్ సచ్‌దేవా ఇప్పటికే పార్టీ స్టీరింగ్ కమిటీ, మెనిఫెస్టోకమిటీతో భేటీలు జరుపగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ వీధి సభలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 70 స్థానాలకు గానూ 2015లో 67, 2020లో 62 స్థానాలు గెలిచిన ఆప్ తిరిగి 60కి పైగా స్థానాలను గెలిచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. పొత్తు లేదు.. కాంగ్రెస్‌తో పోరే ఇక ఢిల్లీ ఎన్నికల సన్నాహాల్లో పూర్తిగా వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోటీ చేసినా రెండు పార్టిలు ఏడింటిలో ఒక్క సీటును గెలుచుకోలేకపోయాయి. ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీచేసి అన్నిచోట్ల పరాజయం పాలయ్యాయి. అనంతరం జరిగిన హరియాణా ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ఉంటుందని భావించినా, సీట్ల సర్దుబాటు కుదరక రెండు పార్టిలు ఒంటరిగానే పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లోనూ రెండు పార్టిలు విడివిడిగానే కొట్లాడుతాయని ఇప్పటికే సంకేతాలు వెళ్లడంతో కాంగ్రెస్ ఆప్ ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షిత్‌లు న్యాయ్ యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆప్ తొలి జాబితా విడుదలఆరుగురు ఇతర పార్టిల నుంచి వచ్చిన వారే సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే సిద్ధమైంది. 2025, ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 11మంది అభ్యర్థులతో తొలి జాబితాను జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ గురువారం విడుదల చేశారు. ఛత్తర్పూర్ అభ్యర్థిగా బ్రహ్మసింగ్ తన్వర్, బదార్పూర్ అభ్యర్థిగా రామ్‌సింగ్ నేతాజీ, లక్ష్మీనగర్ అభ్యర్థిగా బీబీ త్యాగీ, సీలంపూర్ అభ్యర్థిగా చౌదరి జుబిర్ అహ్మద్, సీమాపురి అభ్యర్థిగా వీర్‌సింగ్ ధింగాన్, రోహ్తాస్ నగర్ అభ్యర్థిగా సరితాసింగ్, ఘోండా అభ్యర్థిగా గౌరవ్ శర్మ, విశ్వాస్‌నగర్ అభ్యర్థిగా దీపక్ సింగ్లా, కర్వాల్‌నగర్ అభ్యర్థిగా మనోజ్ త్యాగి, కిరారీ అభ్యర్థిగా అనిల్‌ఝా, మటియాలా అభ్యర్థిగా సోమేశ్ షోకీన్‌ల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. 11మంది అభ్యర్థుల జాబితాలో ఆరుగురు ఇతర పార్టిల నుంచి వచ్చినవారే ఉన్నారు. వీరిలో ముగ్గురు బీజేపీ, ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చివారు కావడం గమనార్హం. ఛత్తర్పూర్, కిరాడీ అభ్యర్థులుగా ఖరారైన బ్రహ్మ సింగ్ తన్వర్, అనిల్ ఝాలు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు. వీరు ఈ ఏడాది ఆ పార్టీకి రాజీనామా చేసి ఆప్‌లో చేశారు. వీరు ఇరువురూ రెండుసార్లు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా కూడా గెలిచారు. ఇక, దీపక్ సింఘ్లా కిందటి ఎన్నికల్లో బీజేపీ నేత ఓమ్ ప్రకాశ్ శర్మ చేతిలో ఓటమిపాలయ్యారు. సరితా సింగ్ ఆప్ విద్యార్ధి విభాగం ఛత్ర యువ సంఘర్షణ సమితి అధ్యక్షురాలు. రోహతాస్ నగర్ నుంచి గతంలో గెలిచారు. -
బారామతి బరిలో అజిత్
సాక్షి, న్యూఢిల్లీ/ ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పారీ్టలు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. వీరిలో 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పుణె జిల్లాలో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం బారామతి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. బారామతి ఎంపీ స్థానం శరద్ పవార్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటోంది. అందుకే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌పవార్ కుమార్తె సుప్రియాసూలేపై అజిత్ తన భార్య సునేత్రా పవార్‌ను పోటీకి నిలిపినా సునేత్రా ఓటమిని చవిచూడటం తెల్సిందే. ఛగన్ భుజ్‌బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. 45 మందితో శివసేనజాబితా విడుదల మంగళవారం అర్ధరాత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 45 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి కోప్రి పాచ్ పాఖాడి నుంచి పోటీచేయనున్నారు. విలాస్ సందీపన్ భూమ్రే పైఠాన్ నుంచి, మంత్రి ఉదయ్ సమంత్ రత్నగిరి నుంచి బరిలో దిగనున్నారు. రాష్ట్రంలోని అధికార మహాయుతి కూటమి ఇప్పటివరకు 182 పేర్లను ప్రకటించింది. ఇందులో బీజేపీ నుంచి 99 మంది, శివసేన నుంచి 45 మంది, ఎన్సీపీ నుంచి 38 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడు అమిత్ ఠాక్రేను మాహిం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపారు. శివసేన(యూబీటీ) తొలిజాబితా ఉద్ధవ్‌ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) బుధవారం 65 మంది అభ్యర్థుల పేర్లతో తొలిజాబితాను విడుదలచేసింది. పార్టీ నేత, మాజీ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే సెంట్రల్ ముంబై పరిధిలోని వర్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. యువసేన నేత, ఆదిత్య బంధువు వరుణ్ సర్దేశాయ్ బాంద్రా(ఈస్ట్) నుంచి పోటీచేస్తారు. పార్టీ నుంచి చీలిపోయి పార్టీ పేరు, గుర్తును కైవసం చేసుకున్న ఏక్నాథ్ షిండే పోటీచేస్తున్న కోప్రి పాచ్ పాఖాడి నియోజకవర్గంలో శివసేన(యూబీటీ) తరఫున కేదార్ దిఘే బరిలో దిగుతున్నారు. షిండే రాజకీయగురువు ఆనంద్ దిఘే మేనల్లుడే కేదార్. -
BJP: 71 మంది సిట్టింగ్‌లకు టికెట్లు
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 99 మందితో బీజేపీ ఆదివారం మొదటి జాబితా విడుదల చేసింది. వీరిలో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌కు చోటు దక్కింది. ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, మంత్రులు గిరీశ్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ వంటి ప్రముఖులు ఉన్నారు. జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్, కల్యాణ్ ఈస్ట్, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.బరిలో మరాఠా అభ్యర్థులు: జరంగేముంబై: మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు, దీక్షలు చేపట్టిన ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే ఎన్నికల వేళ మరో సంచలన ప్రకటన చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మరాఠాలు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో మరాఠా అభ్యర్థులను బరిలోకి దించుతానని ఆయన ప్రకటించారు. గెలుపునకు అవకాశం చోట మాత్రమే మరాఠా అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని మరాఠాల రిజర్వేషన్లకు మద్దతిచ్చే అభ్యర్థులకు పార్టీ, మతం, కులంతో సంబంధం లేకుండా తోడుంటామని ఆయన స్పష్టంచేశారు. తమ షరతులకు అంగీకరిస్తూ అభ్యర్థులు లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని జరంగే వెల్లడించారు. -
మహారాష్ట్ర పోల్స్.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్
ముంబయి:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఆదివారం(అక్టోబర్20) విడుదల చేసింది.99 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.ఈ జాబితాలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఉన్నారు. ఫడ్నవిస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే కామఠీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ భోకర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. శివసేన,ఎన్సీపీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గాలకు నవంబరు 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.ఇదీ చదవండి: వయనాడ్ ఎవరిది..? నవ్య వర్సెస్ ప్రియాంక -
UP: సింగిల్‌గా పోటీ.. ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను తొలివిడతలో 16 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తు పుకార్లను కొట్టిపారేస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము స్వతంత్రంగానే పోటీ చేయాలని నిర్ణయించారు. బీఎస్పీ తొలి విడత జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నౌర్, నగీనా, మురాదాబాద్, రాంపూర్, సంభాల్, అమ్రోహా, మీరట్, బాగ్పట్ స్థానాలతో సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. సహరాన్పూర్ నుంచి మాజిద్ అలీ, కైరానా నుంచి శ్రీపాల్ సింగ్, ముజఫర్‌నగర్ నుంచి దారా సింగ్ ప్రజాపతి, బిజ్నోర్ నుంచి విజయేంద్ర సింగ్, నాగినా (ఎస్సీ స్థానం) నుంచి సురేంద్ర పాల్ సింగ్, మొరాదాబాద్ నుంచి మహ్మద్ ఇర్ఫాన్ సైఫీలను బరిలోకి దించింది. ఇక రాంపూర్ నుంచి జిషాన్ ఖాన్, సంభాల్ నుంచి షౌలత్ అలీ, అమ్రోహా నుంచి మొజాహిద్ హుస్సేన్, మీరట్ నుంచి దేవవ్రత్ త్యాగి, బాగ్పత్ నుంచి ప్రవీణ్ బన్సాల్‌లకు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రాజేంద్ర సింగ్ సోలంకి, బులంద్‌షహర్ (ఎస్సీ స్థానం) నుంచి గిరీష్ చంద్ర జాతవ్, అయోన్లా నుంచి అబిద్ అలీ, పిలిభిత్ నుంచి అనిస్ అహ్మద్ ఖాన్ అలియాస్ ఫూల్ బాబు, షాజహాన్‌పూర్ (ఎస్సీ) నుంచి దోదరం వర్మ బరిలోకి దిగనున్నారు. -
నలుగురికే లైన్‌క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, నల్లగొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయనున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోక్‌సభ స్థానాలు కేటాయిస్తామంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధిష్టానం.. ప్రస్తుతం ప్రకటించిన నలుగురు అభ్యర్థులకు తొలి జాబితాలోనే చోటు కల్పించింది. -
Congress List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్, తెలంగాణ అభ్యర్థులు వీళ్లే..
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగగ్రెస్ తొలి జాబితాకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో శుక్రవారం సాయంత్రం 36 మందితో కూడిన తొలి జాబితాను అధికారికంగా రిలీజ్ చేయనుంది. ఇందులో తెలంగాణలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిస్ట్‌లో .. జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, నల్లగొండ కందూరు రఘువీర్‌రెడ్డి, చేవెళ్ల సునీతా మహేందర్‌రెడ్డి, మహాబూబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ తొలి జాబితాలో హోల్డ్‌లో ఉంచిన స్థానాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటరీ స్థానం కూడా ఉంది. మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి పేరును టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ వంశీ పేరును ఏఐసీసీ హోల్డ్‌లో ఉంచడం గమనార్హం. మరోవైపు ఆ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ టికెట్‌ను కేటాయించింది ఏఐసీసీ. కిందటి ఏడాదే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను.. రాజ్‌నంద్‌గావ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించబోతోంది కాంగ్రెస్. కేసీ వేణుగోపాల్ మరికాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించి తొలి జాబితాను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. -
Lok Sabha elections 2024: వారణాసి నుంచే... మళ్లీ మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీ లోక్‌సభ సమర శంఖం పూరించింది. విపక్ష ఇండియా కూటమి ఇంకా పొత్తుల ఖరారు ప్రయత్నాల్లో ఉండగానే, ఎన్నికల షెడ్యూలైనా రాకముందే ఏకంగా 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది! ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీ చేయనున్నారు. ఈసారి మరింత బంపర్ మెజారిటీతో ఆయన ఘనవిజయం సాధిస్తారని తావ్డే ధీమా వెలిబుచ్చారు. పలు రాష్ట్రాల్లో మరింతగా చొచ్చుకుపోయి ఎన్డీఏ కూటమిని ఇంకా బలోపేతం చేయడమే లక్ష్యంగా జాబితాను రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. ఇక గుజరాత్‌లోని గాం«దీనగర్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్‌లోని కోటా నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బరిలో దిగుతున్నారు. యూపీలో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో 2019లో ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాం«దీని మట్టికరిపించి సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. అప్పట్లో రెండుచోట్ల పోటీ చేసిన రాహుల్ వాయనాడ్ నుంచి నెగ్గారు. తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు చోటు దక్కింది. మన్సుఖ్ మాండవీయ (పోరుబందర్), భూపీందర్ యాదవ్ (ఆళ్వార్), శర్బానంద సోనోవాల్ (దిబ్రూగఢ్), గజేంద్రసింగ్ షెకావత్ (జోధ్‌పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనేర్), జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), కిరణ్ రిజిజు (అరుణాచల్ వెస్ట్), రాజీవ్ చంద్రశేఖర్ (తిరువనంతపురం), అర్జున్ ముండా (కుంతీ), జ్యోతిరాదిత్య సింధియా (గుణ) తదితరులు వీరిలో ఉన్నారు. టికెట్ దక్కిన మంత్రుల్లో ఏడుగురు రాజ్యసభ సభ్యులు కావడం విశేషం. తొలి జాబితాలోనే ఏకంగా మూడో వంతుకు పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా బీజేపీ దూకుడు కనబరచడమే గాక కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఢిల్లీలో నలుగురి మార్పు దేశ రాజధాని ఢిల్లీని ఈసారి బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అక్కడి ఏడు లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పారీ్టకి ఈసారి కూడా ఏ అవకాశమూ ఇవ్వొద్దని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో భాగంగా ఢిల్లీలో ప్రకటించిన ఐదు స్థానాల్లో ఏకంగా నాలుగింట సిట్టింగులను పక్కన పెట్టడం విశేషం! వారిలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్, పరేశ్ వర్మతో పాటు బీఎస్పీ ఎంపీపై మతపరమైన వ్యాఖ్యలతో పెను వివాదానికి తెర తీసిన రమేశ్ బిధూరి ఉన్నారు. మనోజ్ తివారీ మాత్రమే ఈశాన్య ఢిల్లీ నుంచి మళ్లీ బరిలో దిగుతున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి లేఖి బదులుగా దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బాసురీ పోటీ చేయనుండటం విశేషం. ఇక భోపాల్ నుంచి వివాదాస్పద ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్లకు మొండిచేయి చూపారు. ఆమె స్థానంలో అలోక్ శర్మకు చాన్స్ దక్కింది. మరో కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలీకి కూడా టికెట్ దక్కలేదు. పుష్కలంగా గ్లామర్ సినీ నటులకు తొలి జాబితాలో బాగానే చోటు దక్కింది. భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్ సింగ్ పశి్చమ బెంగాల్‌లోని అసన్సోల్ నుంచి బరిలో దిగుతున్నారు. సిట్టింగులు హేమమాలిని (మథుర), రవికిషన్, మహేశ్‌శర్మ, బఘేల్, సాక్షి మహారాజ్‌కు చాన్స్ దక్కింది. ఇద్దరు మాజీ సీఎంలు బీజేపీ తొలి జాబితాలో ఇద్దరు మాజీ సీఎంలున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ విదిశ స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఘనవిజయం సాధించినా అధినాయకత్వం ఆయన్ను సీఎంగా కొనసాగించలేదు. ఇక త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌దేవ్ త్రిపుర వెస్ట్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు ఖేరి నుంచి మళ్లీ అవకాశమివ్వడం విశేషం. ఆయన కుమారుడు ఆశిష్‌పై 2021లో యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి కారు పోనిచ్చి నలుగురిని పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపణలున్నాయి. యూపీ నుంచి 51 మంది బీజేపీకి అత్యంతకీలకమైన ఉత్తరప్రదేశ్‌కు తొలి జాబితాలో అగ్రతాంబూలం దక్కింది. 195లో యూపీ నుంచి 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 2019లో యూపీలో 80 సీట్లకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గింది. మధ్యప్రదేశ్‌లో 24, పశి్చమ బెంగాల్లో 20, గుజరాత్, రాజస్తాన్‌ల నుంచి 15 చొప్పున, కేరళ నుంచి 12, అసోం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ నుంచి 11 చొప్పున, తెలంగాణ నుంచి 9, ఢిల్లీ నుంచి 5, ఉత్తరాఖండ్ నుంచి 3, అరుణాచల్‌ప్రదేశ్, జమ్మూ కశీ్మర్ నుంచి రెండేసి సీట్లతో పాటు గోవా, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యూ స్థానాలకు కూడా అభ్యర్థుల వెల్లడి జరిగింది. 195 మందిలో 28 మంది మహిళలు, 57 మంది ఓబీసీలు, 27 మంది ఎస్సీలు, 18 మంది ఎస్టీలకు స్థానం లభించింది. 47 స్థానాల్లో 50 ఏళ్ల లోపువారికి అవకాశం కల్పించారు. సుదీర్ఘ చర్చల తర్వాతే... తొలి జాబితా రూపకల్పన కోసం బీజేపీ భారీ కసరత్తే చేసింది. ప్రకటనకు ముందు గురువారం రాత్రి పొద్దుపోయేదాకా మోదీ సారథ్యంలో అగ్ర నాయకత్వం సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరిపింది. సిట్టింగుల పనితీరుపై నిశిత పరిశీలన, కొంతకాలంగా జరిపిన పలు లోతైన సర్వేలతో పాటు నమో యాప్ తదితర వివరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు చెబుతున్నారు. తొలి జాబితాలో ప్రకటించిన 195 స్థానాల్లో 155 చోట్ల 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. ఆ 155 మంది సిట్టింగుల్లో ఏకంగా 20 శాతం మందికి ఈసారి టికెట్లివ్వకపోవడం విశేషం! ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370కి పైగా, ఎన్డీఏ కూటమి 400 పై చిలుకు స్థానాల్లో నెగ్గాలని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. -
BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే
ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మొత్తం 195 స్థానాల్లో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీళ్లలో ముగ్గురు సిట్టింగ్‌లే ఉండగా.. ఓ సిట్టింగ్‌కు మొండిచేయి ఎదురైంది. సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లే పోటీ చేస్తారని తెలిపింది. అలాగే.. చేవెళ్ల నుంచి కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్, నాగర్‌కర్నూల్ నుంచి పీ.భరత్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్‌కు అవకాశం ఇచ్చింది. ఇక హైదరాబాద్ నుంచి కొంపెల్ల మాధవీలతకు ఛాన్స్ ఇచ్చారు. హాట్ నియోజకవర్గం భావిస్తున్న మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇక.. ఇటీవలె బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములుకి మొండిచేయి ఎదురైంది. ఆ స్థానంలో పీ.భరత్‌కు అవకాశం ఇచ్చారు. ఇక తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ప్రకటనతో.. ఆదిలాబాదు, పెద్దపల్లి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను బీజేపీ పెండింగ్‌లో ఉంచినట్లయ్యింది. సంబంధిత వార్త: టార్గెట్ 370.. బీజేపీ హాట్ ఫస్ట్ లిస్ట్ -
రేపు తెలంగాణ బీజేపీ తొలి జాబితా
-
రేపు బీజేపీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కా నుంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర పడడంతో మార్చి 3న తొ లి జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చే యనుంది. గురువారం రాత్రి 10:50 గంటలకు ప్రారంభమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సుమారు నాలుగు గంటల పాటు జరిగింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్ర నాయకత్వాలు తయారు చేసిన అభ్యర్థుల జాబితాలపై ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడి విడిగా భేటీ అయి కూలంకషంగా చర్చించింది. అందులో భాగంగా తె లంగాణకు సంబంధించి ఆరు స్థానాలకు అభ్యర్థులపై సీఈసీ ఏక గ్రీ వంగా ఆమోదముద్ర వేసిందని సమాచారం. సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజా మాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లు మరోసారి బరిలో దిగేందుకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. ఇక భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి భరత్‌ల అభ్యర్థిత్వాలపై కూడా సీఈసీ ఆమోదముద్ర వేసిందని సమాచారం. ఆచితూచి నిర్ణయం బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నందున వివిధ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావ్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారని తెలిసింది. అయితే జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకోవడంతో.. ఆ స్థానంలో బీజేపీ ఎంపీగా ఆయనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతున్న మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ సహా ఇతర స్థానాలపై మరోసారి చర్చించిన తర్వాతే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కారు దిగనున్న మరో ఎంపీ! ఖమ్మం నుంచి బరిలో దిగేందుకు మరో బీఆర్ఎస్ ఎంపీ కాషాయ కండువా కప్పుకొనే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధమౌతున్నారని సమాచారం. -
బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ..అభ్యర్థులు వీరే
-
సీనియర్లకు చంద్రబాబు షాక్
సాక్షి, అమరావతి: అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పలువురు ముఖ్యులు, సీనియర్ నాయకులకు ఝలక్ ఇచ్చారు. తొలి జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయి. అందులో కొందరు మాజీ మంత్రులు కూడా ఉండడం గమనార్హం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారికి సైతం సీట్లు దక్కలేదు. శ్రీకాకుళం జిల్లాలో కళా వెంకట్రావు పేరు తొలి జాబితాలో లేకపోవడంతో పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఎన్నికలకు సీటు మార్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రస్తుతం సీటు లేకుండా చేశారు. ఆయన కోరుకున్న సీటు ఇచ్చేందుకు నిరాకరించిన చంద్రబాబు.. విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. గంటా అందుకు ఒప్పుకోకపోవడంతో తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కూడా చంద్రబాబు షాకిచ్చారు. పవన్ కళ్యాణ్ అభ్యంతరంతో ఆయనకు సీటు ఇచ్చేందుకు వెనుకాడుతూ తొలి జాబితాలో ఆయనకు సీటు ఖరారు చేయలేదు. దీంతో చింతమనేనికి సీటు ఇవ్వడం అనుమానంగా మారింది. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పీతల సుజాతకు సైతం మొండిచేయి చూపారు. యరపతినేనికి ఎసరు ఎన్టీఆర్జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు దక్కలేదు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన హడావుడి చేస్తున్నా తొలి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. ఆయనకు సీటు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సీటు ఖరారు చేయలేదు. దీన్నిబట్టి ఆ నియోజకవర్గంలో మరొకరికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లాలో సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుకు గురజాల సీటు ఇవ్వకపోడం చర్చనీయాంశంగా మారింది. తొలి జాబితాలో ఆయన పేరు లేదంటే ప్రత్యామ్నాయంగా వేరే ఎవరికైనా ఇస్తారా అనే చర్చ నడుస్తోంది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు తొలి జాబితాలో సీటు దక్కలేదు. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరు ఈ జాబితాలో గల్లంతైంది. ఇప్పటికే ఐదుసార్లు ఆయన ఓడిపోవడంతో ఈసారి సీటు ఇవ్వడం కష్టమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావును పక్కనపెట్టి ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కు సీటివ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో కొట్టుకుపోతున్న నేతలు జనసేన పొత్తులో కొన్ని సీట్లు పోవడంతో పలువురు సీనియర్లకు సీట్లు గల్లంతయ్యాయి. తెనాలి సీటు నాదెండ్ల మనోహర్‌కు ఇవ్వడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాజమండ్రి రూరల్ సీటు పొత్తులో పోయే అవకాశం ఉండడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మొండిచేయే మిగలనుంది. తనకు సీటు గ్యారంటీ అని ఆయన చెప్పుకుంటున్నా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టమైంది. అవనిగడ్డలో సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్‌కు జాబితాలో చోటు లేకుండా పోవడానికి ఆ సీటు జనసేన పొత్తు ప్రభావమేనని చెబుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి సీటును బండారు సత్యనారాయణమూర్తికి ఖరారు చేయలేదు. దీంతో ఆసీటు జనసేనకు ఇవ్వడం ఖాయమైనట్లు తెలుస్తోంది. -
టీడీపీ తొలి జాబితా: సీనియర్లు ఇంటికేనా..?
సాక్షి,గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో చాలా వరకు పార్టీ సీనియర్లకు చోటు దక్కలేదు. పార్టీకోసం రక్త తర్పణం చేసిన బుద్దావెంకన్న, ఏపీ టీడీపీ మాజీ చీఫ్‌గా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు, గుంటూరు జిల్లాలో యరపతినేని, ఆలపాటి రాజా, పెద్దకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, ఉండి నుంచి వేటుకూరి శివరామరాజు పేర్లు తొలి జాబితాలో లేవు. ఈ ఎన్నికల్లో వీరందరికీ బాబు హ్యాండిచ్చినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. విజయనగరం గజపతినగరం టీడీపీలో ఇప్పటికే అసంతృప్తి రగిలింది. కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ కేటాయించి డా.కె.ఎ.నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై కేడర్ లో అసంతృప్తి భగ్గుమంది. భవిష్యత్ కార్యాచరణపై డా.కె.ఎ.నాయుడు కేడర్‌తో చర్చిస్తున్నారు. బుచ్చయ్య.. ఆక్ పాక్.. కరివేపాక్.! రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పార్టీ సూపర్ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి ఈసారి నో ఛాన్స్ అన్నట్లే కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ నేతల్లో నమ్మకం కుదరని పరిస్థితి కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ, జనసేన ఆశావహులు ఇద్దరూ పోటీ చేస్తారని బాబు అన్నారు. వీరిలో ఒకరు రాజమండ్రి రూరల్, మరొకరు వేరే చోట పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇదీ చదవండి.. టీడీపీ తొలి జాబితా: బండారు, గంటాకు హ్యాండ్ -
టీడీపీ తొలి జాబితా: బండారు, గంటాకు హ్యాండ్!
సాక్షి,విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు లాంటి బడా నేతలతో పాటు పల్లా శ్రీనివాస్‌కు కూడా తొలి జాబితాలో చంద్రబాబు మొండిచేయి చూపించారు. మరోపక్క అనకాపల్లిలో పీలా గోవింద్, బుద్ధ నాగ జగదీష్ అనకాపల్లిలో సీటు ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంపై తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. అసలు బలమేలేని జనసేనకు అనకాపల్లి సీటు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. కిమిడి వర్గానికి షాక్ .. తొలి జాబితాలో జాబితాలో జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వర్గానికి చంద్రబాబు షాకిచ్చారు. జాబితాలో కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. రాజాంలో కొండ్రు మురళిని వ్యతిరేకించి కళా వెంకట్రావు భంగపడ్డట్లు తెలుస్తోంది. కళా వెంకట్రావు వర్గాన్ని మొత్తం బాబు దూరం పెట్టినట్లు చెబుతున్నారు. కొణతాలకు టికెట్టా..? జనసేన సీనియర్ల ఆగ్రహం కాగా, ఉమ్మడి విశాఖలో అటు జనసేనకు చెందిన పలువురు సీనియర్లు పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డారు. వీరిలో పంచకర్ల రమేష్, తమ్మిరెడ్డి శివశంకర్, బోలిశెట్టి సత్య, సుందరపు విజయ్ కుమార్, సుందరపు సతీష్, వంశి, కోన తాతారావు తదితరులున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అనకాపల్లి సీటు కేటాయించడంపై టికెట్ దక్కని జనసేన నేతలంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇదీ చదవండి.. టీడీపీ తొలి జాబితా.. కిమిడి వర్గానికి షాక్ -
టీడీపీ తొలి జాబితా: విజయనగరంలో ‘కిమిడి’ వర్గానికి షాక్
సాక్షి,విజయనగరం: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో జాబితాలో జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వర్గానికి చంద్రబాబు షాకిచ్చారు. జాబితాలో కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. రాజాంలో కొండ్రు మురళిని వ్యతిరేకించి కళా వెంకట్రావు భంగపడ్డట్లు తెలుస్తోంది. టీడీపీ రాజాం టికెట్‌ను మాత్రం కొండ్రు మురళీమోహన్ సాధించుకున్నారు. జిల్లాలోని చీపురుపల్లి సెగ్మెంట్లోనూ కిమిడి కళా వెంకటరావు తమ్ముడి కుమారుడు కిమిడి నాగార్జునను టీడీపీ అధిష్టానం పక్కనపెట్టడంపై కిమిడి వర్గం నేతలు పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కిమిడి వర్గం నేతలుగా ముద్ర పడ్డ ఎవరికీ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంపై ఆయన క్యాడర్ మొత్తం టీడీపీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తొలి జాబితాలో జిల్లాలోని గజపతినగరం టీడీపీ టికెట్ కొండపల్లి శ్రీనివాస్‌కు దక్కింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడును టీడీపీ హై కమాండ్ పక్కన పెట్టింది. అధిష్టానం తీరుతో అప్పలనాయుడు వర్గం భగ్గుమంటోంది. జిల్లాలోని నెల్లిమర్ల స్థానం జనసేనకు కేటాయించడంపై టీడీపీ శశ్రేణులు భగ్గుమంటున్నారు. ఇక్కడ టికెట్ ఆశించిన టీడీపీ నేత శివరామకృష్ణ ఆశాభంగం చెందారు. జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామికి కూడా తొలిజాబితాలో చోటు దక్కలేదు. ఇదీ చదవండి.. టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ పావలా వంతు కూడా ఇవ్వలేదు -
బీజేపీ తొలి జాబితా రెడీ!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు పూర్తయింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో, లేదా ఉన్నతస్థాయి సమావేశంలో అభ్యర్థులపై చర్చించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాధాన్యతాంశాల వారీగా తెలంగాణ అభ్యర్థుల జాబితాపై చర్చ రాత్రికల్లా ముగిస్తే వెంటనే 40మందితో తొలి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ముఖ్య నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే శుక్రవారం ఉదయం లేదా తర్వాతిరోజున విడుదల చేయనున్నారని పేర్కొంటున్నారు. అయితే సీఈసీ/ఉన్నతస్థాయి భేటీకన్నా ముందే.. అంటే గురువారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అభ్యర్థుల తొలి జాబితాకు సంబంధించి తమ కసరత్తు, 40మంది అభ్యర్థుల ముసాయిదాపై చర్చించి.. సీఈసీకి సమర్పించే జాబితాకు తుదిరూపం ఇవ్వనున్నట్టు తెలిసింది. వీలైతే సాయంత్రం ప్రధాని మోదీతోనూ రాష్ట్ర నేతల బృందం సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రోజంతా కసరత్తు చేసి.. బీజేపీ ముఖ్య నేతలు బుధవారం పొద్దంతా హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో, పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమక్షంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. బీసీ ఎజెండాతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు.. 40కి మందికిపైగా బీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సీట్లపై ఏకాభిప్రాయం రాష్ట్ర నేతల చర్చల సందర్భంగా పోటీలేని, బలమైన క్యాండిడేట్లు ఉన్న నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందులో అంబర్‌పేట (కిషన్‌రెడ్డి), హుజూరాబాద్ (ఈటల రాజేందర్), గద్వాల (డీకే అరుణ), దుబ్బాక (ఎం.రఘునందన్‌రావు), మునుగోడు (కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి), మహబూబ్‌నగర్ (ఏపీ జితేందర్‌రెడ్డి), సూర్యాపేట (సంకినేని వెంకటేశ్వర్రావు), కల్వకుర్తి (టి.ఆచారి), నిర్మల్ (మహేశ్వర్‌రెడ్డి), వరంగల్ ఈస్ట్ (ఎర్రబెల్లి ప్రదీప్‌రావు), వర్ధన్నపేట (కొండేటి శ్రీధర్), బోథ్ (సోయం బాపూరావు), ఖానాపూర్ (రమేశ్ రాథోడ్), మహబూబాబాద్ (హుస్సేన్‌నాయక్), చొప్పదండి (బోడిగె శోభ), మహేశ్వరం(అందెల శ్రీరాములు యాదవ్), భూపాలపల్లి (చందుపట్ల కీర్తి) తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి రెండు పేర్లలో జాబితాను రూపొందించినట్టు తెలిసింది. ఇక బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్ వంటి ముఖ్యనేతలు పోటీచేసే సెగ్మెంట్ల విషయానికొస్తే.. కామారెడ్డిలో ధర్మపురి అర్వింద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్, సిరిసిల్లలో బండి సంజయ్.. ఇలా బీజేపీ ముఖ్య నేతలను బరిలో నిలపాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. జనసేన పోటీ నుంచి విరమించుకునేలా? బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ బుధవారం ఉదయం జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కార్యాలయానికి వెళ్లి చర్చించారని.. తెలంగాణలో పోటీచేయాలనే ఆలోచనను విరమించుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించాలని కోరినట్టు తెలిసింది. తెలంగాణలో పోటీ చేయాలని జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉందని పవన్ వివరించగా.. పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని, పోటీ విరమించుకుని మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా హైదరాబాద్‌లో సమావేశాలు ముగిశాక ప్రకాశ్ జవదేకర్, బన్సల్, కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు. -
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తులు..రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
-
బీజేపీ అభ్యర్థుల జాబితాపై రాజకీయవర్గాల్లో ఆసక్తి
-
లైన్ ‘క్లియర్’ కొందరికే!
సాక్షి, హైదరాబాద్: కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. మొత్తం 55 మందితో తొలి జాబితాను ప్రకటించినా.. కీలక నేతలు ఉన్న చాలా సీట్లను వదిలేసింది. తొలి జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతోపాటు గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, టి.రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, దొంతి మాధవరెడ్డి వంటి వారికి చోటు దక్కింది. ఎస్సీలకు రిజర్వ్ అయిన 12, ఎస్టీలకు రిజర్వ్ అయిన 2 స్థానాలు పోగా.. రెడ్డిలకు 17, వెలమలకు 7, బ్రాహ్మణులకు 2, మైనార్టీలకు 3, బీసీలకు 12 స్థానాలు దక్కాయి. అయితే బీసీల్లో ప్రధాన కులాలైన గౌడ, పద్మశాలి కులాల నేతల పేర్లు తొలిజాబితాలో కనిపించలేదు. యాదవ వర్గానికి 4, మున్నూరుకాపులకు 2, ముదిరాజ్, వాల్మికి, మేరు, వంజర, చాకలి, బొందిలి కు లాలకు ఒక్కొక్కటి దక్కాయి. ఎస్సీల్లో మాదిగలకు 9, మాలలకు 3 స్థానాలు కేటాయించగా.. ఎస్టీల్లో 2 ఆదివాసీలకే ఇచ్చారు. లంబాడా నేతలకు తొలి జాబితాలో చోటు లభించలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్ (3), నిజామాబాద్ (3), కరీంనగర్ (7), మెదక్ (5), రంగారెడ్డి (7), హైదరాబాద్ (10), మహబూబ్‌నగర్ (8), నల్లగొండ (6), వరంగల్ (4), ఖమ్మం (2) స్థానాలకు టికెట్లను ప్రకటించారు. ప్రముఖుల పేర్లు లేకుండానే! కాంగ్రెస్ తొలి జాబితాలో ఆ పార్టీ ప్రముఖులు కొందరి పేర్లు కనిపించలేదు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీలు సురేశ్ షె ట్కార్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, పీఏసీ కన్వినర్ షబ్బీర్‌అలీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన కొండాసురేఖ, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వంటివారి పేర్లు తొలి జాబి తాలో లేకపోవడం గమనార్హం. కచ్చితంగా తొలి జాబితాలో ఉంటాయని భావించిన కొందరి పేర్లు లేకపోవడం, అనూహ్యంగా మరికొందరి పేర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అను బంధ సంఘాలకు తొలి జాబితాలో ప్రాధాన్యం దక్కలేదు. టికెట్లు ఆశిస్తున్న యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, ఫిషర్మెన్, ఎస్సీసెల్, కిసాన్ కాంగ్రెస్, బీసీ సెల్ నేతలు ఆశిస్తున్న టికెట్లు ప్రకటించలేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు గోషామహల్ స్థానం ఇచ్చారు. ఓయూ విద్యార్థి నేతలకూ తొలి జాబితాలో లభించలేదు. గెలుపు ఆశల్లేని స్థానాలే బీసీలకు? కాంగ్రెస్ తొలి జాబితాపై బీసీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. బీసీలకు మొత్తంగా 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ముఖ్యనేతలు చెప్పినా ఆ ప్రాధాన్యత కనిపించడం లేదని అంటున్నాయి. తొలి జాబితాలో 12 మంది బీసీల పేర్లు ఉన్నా.. సగం వరకు పెద్దగా గెలుపు ఆశలు లేనివేననే విమర్శలు వస్తున్నాయి. బీసీలకు ఇచ్చిన 12 సీట్లలో.. మేడ్చల్, గద్వాల, ముషీరాబాద్, ఆలేరు స్థానాలను యాదవ సామాజిక వర్గాలకు, సికింద్రాబాద్, వేములవాడ స్థానాలను మున్నూరుకాపులకు, గోషామహల్‌ను ముదిరాజ్ మహిళకు కేటాయించారు. రామగుండం (బొందిలి), షాద్‌నగర్ (రజక)లను ఎంబీసీ కులాలకు ఇచ్చారు. మిగతా మూడు సీట్లను ఎంఐఎం ప్రాబల్యం ఉండే పాతబస్తీలో కేటాయించారు. అందులో చాంద్రాయణగుట్ట (వాల్మికి), యాకుత్‌పుర (మేరు), బహుదూర్‌పుర (వంజర) ఉన్నాయి. పారాచూట్లకు చాన్స్ కాంగ్రెస్ తొలి జాబితాలో పారాచూట్ నేతలకు గణనీయంగానే సీట్లు దక్కాయి. కూచాడి శ్రీహరిరావు (నిర్మల్), వినయ్‌కుమార్‌రెడ్డి (ఆర్మూరు), సునీల్‌రెడ్డి (బాల్కొండ), మైనంపల్లి రోహిత్‌రావు (మెదక్), ఆగం చంద్రశేఖర్ (జహీరాబాద్), మైనంపల్లి హన్మంతరావు (మల్కాజ్గిరి), కోట నీలిమ (సనత్‌నగర్), సరితా తిరుపతయ్య (గద్వాల), కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్), కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వేముల వీరేశం (నకిరేకల్) ఇటీవల కాంగ్రెస్‌లో చేరినవారే. తొలి జాబితాలో ఆరుగురు మహిళలకు అవకాశం లభించింది. ఇందులో డాక్టర్ కోట నీలిమ, మొగిలి సునీత, సరితా తిరపతయ్య, సింగాపురం ఇందిర, సీతక్క, నలమాద పద్మావతి ఉన్నారు. మైనార్టీలకు నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట స్థానాలను కేటాయించారు. గాందీభవన్ వద్ద నిరసన సెగలు తొలి జాబితా విడుదలతోనే కాంగ్రెస్‌లో నిరసనల సెగలు కూడా మొదలయ్యాయి. పలు చోట్ల టికెట్లు ఆశించిన నేతలు, వారి అనుచరులు గాందీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. గద్వాల టికెట్‌ను అమ్ముకున్నారంటూ ఆ నియోజకవర్గ నేత కుర్వ విజయ్‌కుమార్ నేతృత్వంలో నిరసన తె లిపారు. మైనార్టీల ప్రాబల్యం ఉండే పాతబస్తీలో ఆ వర్గం నేతలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారంటూ కొందరు మైనార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఉప్పల్, మేడ్చల్ వంటి చోట్ల కూడా టికె ట్లు రాని వారి అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను, దిష్టిబోమ్మలను దహనం చేశారు. -
55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 55 మంది పేర్లను ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉదయం ఢిల్లీలో ఈ జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోని మొత్తం 55 స్థానాల్లో.. 17 మంది రెడ్లు, ఏడుగురు వెలమ, 12 మంది బీసీ, ముగ్గురు ముస్లిం, ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులకు చోటు కల్పించారు. వీటితోపాటు 12 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావు ఇద్దరికీ సీట్లు దక్కాయి. మరోవైపు ఎంపీ ఉత్తమ్‌తోపాటు ఆయన భార్య పద్మావతిలకు తొలి జాబితాలోనే సీట్లు కేటాయించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎల్బీనగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తదితర సీనియర్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. లెఫ్ట్ పొత్తు తేలాక రెండో జాబితా ఇండియా కూటమిలో భాగంగా వామపక్షాలతో పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వచి్చన తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు పూర్తిచేసి విడుదల చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ తొలి జాబితా ఇదీ.. 1) కొడంగల్: ఎనుమల రేవంత్‌రెడ్డి 2) మధిర (ఎస్సీ): మల్లు భట్టి విక్రమార్క 3) ఆందోల్ (ఎస్సీ): దామోదర రాజనర్సింహ 4) హుజూర్నగర్: ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 5) కోదాడ: ఎన్.పద్మావతి 6) నల్గొండ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 7) మంథని: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 8) సంగారెడ్డి: తూర్పు జగ్గారెడ్డి 9) ములుగు (ఎస్టీ): ధనసరి అనసూయ (సీతక్క) 10) భద్రాచలం (ఎస్టీ): పోడెం వీరయ్య 11) కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు 12) మల్కాజ్గిరి: మైనంపల్లి హన్మంతరావు 13) మెదక్: మైనంపల్లి రోహిత్‌రావు 14) నాగార్జునసాగర్: జయవీర్‌రెడ్డి 15) జగిత్యాల: టి.జీవన్‌రెడ్డి 16) బెల్లంపల్లి: గడ్డం వినోద్ 17) మంచిర్యాల: కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు 18) నిర్మల్: కూచాడి శ్రీహరిరావు 19) ఆర్మూర్: పి.వినయ్‌కుమార్ 20) బోధన్: పి.సుదర్శన్‌రెడ్డి 21) బాల్కొండ: సునీల్‌కుమార్ ముత్యాల 22) ధర్మపురి(ఎస్సీ): అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 23) నకిరేకల్(ఎస్సీ): వేముల వీరేశం 24) వేములవాడ: ఆది శ్రీనివాస్ 25) రామగుండం: ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్ 26) పెద్దపల్లి: సీహెచ్.విజయరామారావు 27) మానకొండూరు (ఎస్సీ): కవ్వంపల్లి సత్యనారాయణ 28) జహీరాబాద్(ఎస్సీ): ఆగం చంద్రశేఖర్ 29) గజ్వేల్: తూముకుంట నర్సారెడ్డి 30) మేడ్చల్: తోటకూర వజ్రేశ్ కుమార్ 31) కుత్బుల్లాపూర్: కొలను హన్మంతరెడ్డి 32) ఉప్పల్: ఎం.పరమేశ్వర్‌రెడ్డి 33) చేవెళ్ల(ఎస్సీ): పమేన భీంభారత్ 34) పరిగి: టి.రామ్మోహన్‌రెడ్డి 35) వికారాబాద్ (ఎస్సీ): గడ్డం ప్రసాద్‌కుమార్ 36) ముషీరాబాద్: అంజన్‌కుమార్ యాదవ్ 37) మలక్‌పేట్: షేక్ అక్బర్ 38) సనత్‌నగర్: కోట నీలిమ 39) నాంపల్లి: మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ 40) చాంద్రాయణగుట్ట: బోయ నగేశ్ (నరేశ్) 41) కార్వాన్: ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ హజ్రీ 42) గోషామహల్: మొగిలి సునీత 43) యాకూత్‌పుర: కె.రవిరాజు 44) బహదూర్‌పుర: రాజేశ్‌కుమార్ పులిపాటి 45) సికింద్రాబాద్: దామ్ సంతోష్‌కుమార్ 46) అలంపూర్(ఎస్సీ): ఎస్.ఏ.సంపత్‌కుమార్ 47) అచ్చంపేట(ఎస్సీ): చిక్కుడు వంశీకృష్ణ 48) గద్వాల: సరితా తిరుపతయ్య 49) నాగర్‌కర్నూల్: కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి 50) కల్వకుర్తి: కసిరెడ్డి నారాయణరెడ్డి 51) షాద్‌నగర్: కె.శంకరయ్య 52) ఆలేరు: బీర్ల ఐలయ్య 53) స్టేషన్ ఘన్పూర్: సింగాపురం ఇందిర 54) నర్సంపేట: దొంతి మాధవరెడ్డి 55) భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణరావు -
‘ఫస్ట్’కాదు.. ఫేక్లిస్ట్!’ అభ్యర్థుల జాబితాపై బీజేపీ ఫైర్..
ఆదిలాబాద్: బీజేపీ అభ్యర్థులు తొలి జాబితా ఇదేనంటూ.. సోషల్ మీడియాలో పలువురు అభ్యర్థుల పేర్లతో వైరల్ అవుతోంది. ఇది పార్టీ ప్రకటించిన జాబితా కాదని, ఫేక్ లిస్ట్ అని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ జాబితాలో మొత్తం 11 నియోజకవర్గాలు–అభ్యర్థుల పేర్లు ఉండగా ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయి. నిర్మల్– ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్–లాలా ఓంప్రకాశ్ జైస్వాల్, ఖా నాపూర్(ఎస్టీ)–రాథోడ్ రమేశ్, బోథ్(ఎస్టీ)– సో యంబాపురావు, సిర్పూర్–పాల్వాయి హారీశ్బాబు ల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. మిగితా నియోజకవర్గాలు కూడా అనుమానం రాకుండా ఉండేందుకు కిషన్‌రెడ్డి, బండిసంజయ్, ఈటెల, కోమటిరెడ్డిల పేర్లు పెట్టారు. చాలామంది ఈ జాబితా వాస్తవమే అనుకుని, వారూ ఫార్వర్డ్ చేశారు. చివరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియా ద్వారానే ఈ జాబితా పార్టీ ప్రకటన కాదని స్పష్టంచేశారు. ఫేక్ ప్రచారాలు చేయొద్దు.. బీజేపీ అభ్యర్థులను ప్రకటించారంటూ సోషల్‌మీడి యా ద్వారా నకిలీ ప్రచారాలను చేయొద్దని పార్టీ జి ల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి కోరారు. సో షల్‌మీడియాలో గురువారం వైరల్ అయిన జాబి తాపై ఆమె స్పందిస్తూ ఇది పూర్తిగా ఫేక్ అన్నారు. పార్టీ ఏ విషయానైన్నా ప్రజలందరికీ తెలిసేలా ప్రకటిస్తుందన్నారు. ఇలాంటి నకిలీ ప్రచారాలతో ప్రజలను పక్కదోవ పట్టించడం సరికాదన్నారు. ఇది కూడా చదవండి: ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు: కల్వకుంట్ల కవితకు విజయశాంతి సానుభూతి! -
Elections 2024: ముందస్తు ఎంపిక వెనుక
ఇంకా ఎన్నికల వేడి రాజుకోలేదు.. నోటిఫికేషన్ నగారా మోగలేదు అయినా బీజేపీ అయిదు రాష్ట్రాల ఎన్నికల కసరత్తు ముందుగానే ప్రారంభించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల తొలి విడత అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కమలనాథులకు ఎందుకీ తొందర? అభ్యర్థుల ఎంపిక వెనుక వ్యూహమేంటి? భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. మధ్యప్రదేశ్‌లో 39 మందితో, ఛత్తీస్‌గఢ్‌లో 21 మందితో తొలిజాబితా విడుదల చేసి ప్రత్యర్థి పార్టీల్లో ఎన్నికల వేడి పెంచింది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ) రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వెనుక దాగి ఉన్న వ్యూహంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్ నియోజకవర్గం నుంచి ఆయన సమీప బంధువు, బీజేపీ ఎంపీ విజయ్ భగేల్‌ను రంగంలోకి దింపి ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందనే సంకేతాలు పంపింది. గతంలో ఒకసారి భూపేష్ భగేల్‌ను ఓడించిన ఘనత విజయ్‌కు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా తదితరులు హాజరైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలోనే ముందస్తుగా అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. సీట్లలో ఏబీసీడీ వర్గీకరణ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందు అసెంబ్లీ స్థానాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు – ఏ కేటగిరీ మిశ్రమ ఫలితాలు వచి్చన స్థానాలు – బీ కేటగిరీ బలహీనంగా ఉన్న స్థానాలు – సీ కేటగిరీ ఇప్పటివరకు గెలవని స్థానాలు – డీ కేటగిరీ సీ, డీ కేటగిరీ సీట్లపై దృష్టి సారించిన కమలనాథులు ఆయా సీట్లకే తొలి జాబితా విడుదల చేశారు. ఆదివాసీ ప్రాంతాలే గురి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటివరకు బీజేపీ పాగా వెయ్యలేకపోయింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్‌కే పట్టు ఉంది. వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే ముందస్తుగా కసరత్తు పూర్తి చేసి బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించిన 21 స్థానాల్లో 10 ఎస్టీలకు రిజర్వ్ చేయబడినవే. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 13 స్థానాలు ఎస్టీ రిజర్వ్ సీట్లు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేయడానికి వీలుగా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చేదు ఫలితాల్నే మిగిల్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ఇక మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు గాను 109 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 114 సీట్లతో మెజారీ్టకి ఒక్క సీటు దూరంలో మిగిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2020లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదనే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముందస్తుగా మొదలు పెట్టింది. అంతర్గత సర్వేలు ఏం చెబుతున్నాయి ? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అంతర్గత సర్వేలు కాస్త ఆందోళన పుట్టించేలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 40% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వెల్లడైంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు గాను 30 నుంచి 32 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీ ఇక ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అత్యంత కీలకమైన హిందీబెల్ట్‌లో ఒక్క రాష్ట్రంలో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన పార్టీ అగ్రనాయకుల్లో ఉంది. ముందస్తు జాబితాతో మేలే బీజేపీ అగ్రనాయకులు ఎంతో కసరత్తు చేసి తాము బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారు. ‘‘ఈసారి ఎన్నికల్లో కొత్త వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వ్యూహంలో భాగమే. అభ్యర్థులు నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించి ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.’’అని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే ఇలా ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల రెబెల్స్ బెడద కూడా ఉంటుంది. ఆ రిస్క్ తీసుకొని మరీ కమలనాథులు ముందడుగు వేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Assembly Elections 2023: అసెంబ్లీ సమరానికి బీజేపీ సన్నద్ధం
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడలేదు. అయినా బీజేపీ ఈ రాష్ట్రాలకు సంబంధించి తమ అభ్యర్థుల తొలి జాబితాలను గురువారం విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది, మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక్కో రాష్ట్రంలో ఐదుగురు చొప్పున మహిళలకు అవకాశం కల్పించింది. ఛత్తీస్‌గఢ్‌లోని పఠాన్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌పై పోటీగా తమ పార్టీ ఎంపీ, సీనియర్ నేత విజయ్ బఘేల్‌ను బరిలోకి దించుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. అంతకంటే ముందు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నాయి. -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు... 80 మందితో ఆప్ జాబితా
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 80 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం విడుదల చేసింది. మేలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం 224 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఆప్ రాష్ట్ర చీఫ్ పృథ్వీ రెడ్డి చెప్పారు. మొదటి జాబితాలోని అందరూ ఉన్నత విద్యావంతులే. వీరిలో 13 మంది లాయర్లు, ముగ్గురు డాక్టర్లు, నలుగురు ఐటీ నిపుణులు ఉన్నారు. అభ్యర్థుల్లో సగం కంటే ఎక్కువ మంది 45 ఏళ్లలోపు వారేనని, వీరందరినీ సర్వే ద్వారా ఎంపిక చేసినట్లు పృథ్వీ రెడ్డి వెల్లడించారు. మొదటి జాబితాలో సుప్రీంకోర్టు లాయర్ బ్రిజేశ్ కాలప్ప, బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)మాజీ అధికారి కె.మత్తయి, బీటీ నాగన్న, మోహన్ దాసరి, శంతల దామ్లే, అజయ్ గౌడ తదితరులున్నారని పృథ్వీ రెడ్డి చెప్పారు. -
Gujarat Assembly Election 2022:: 38 మంది సిట్టింగ్‌లకు బీజేపీ మొండిచెయ్యి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఏకంగా 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచెయ్యి చూపడం గమనార్హం. వీరిలో ఐదుగురు మంత్రులు సైతం ఉన్నారు. తీగల వంతెన దుర్ఘటన జరిగిన మోర్బీ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బ్రిజేశ్ మెర్జాకు టికెట్ నిరాకరించారు. మరో నలుగురు మంత్రులు.. రాజేంద్ర త్రివేది, ప్రదీప్ పర్మార్, అరవింద్ రైయానీ, ఆర్.సి.మక్వానాకు తొలి జాబితాలో స్థానం దక్కలేదు. శాసనసభ స్పీకర్ నీమాబెన్ ఆచార్యకు కూడా నిరాశే ఎదురయ్యింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన సొంత నియోజకవర్గం ఘాట్లోడియా నుంచి మరోసారి బరిలోకి దిగబోతున్నారు. పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ తొలి జాబితాలో స్థానం దక్కించుకున్నారు. విరామ్‌గామ్ స్థానం నుంచి హార్దిక్ పటేల్, జామ్‌నగర్ నార్త్ స్థానం నుంచి రివాబా జడేజా అధికార పార్టీ టికెట్లపై వారు పోటీ చేయబోతున్నారు. 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. వారి అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తొలి జాబితాలో 69 మంది సిట్టింగ్‌లు గుజరాత్లో తొలి దశలో డిసెంబర్ 1న 89 స్థానాలకు, రెండో దశలో 5న 93 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగున్నాయి. తొలి దశ ఎన్నికలకుగాను 84 స్థానాల్లో, రెండో దశ ఎన్నికలకు గాను 76 స్థానాల్లో తమ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అభ్యర్థుల పేర్లను బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బుధవారం ఖరారు చేసింది. 160 మందిలో ఓబీసీలు 49 మంది, పటేళ్లు 40 మంది, క్షత్రియులు 19, బ్రాహ్మణులు 13 మంది ఉన్నారు. జైన వర్గానికి చెందిన మరో ఇద్దరు చోటు సంపాదించారు. తొలి జాబితాలోని మొత్తం అభ్యర్థుల్లో 35 మంది 50 ఏళ్లలోపువారే కావడం విశేషం. తొలి జాబితాలో 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి పోటీచేసే అవకాశం కల్పిస్తున్నామని, వీరిలో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలు ఉన్నారని భూపేంద్ర యాదవ్ తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌తోపాటు మరికొందరు సీనియర్ నాయకులు ఈ ఎన్నికల్లో పోటీపడొద్దని నిర్ణయించుకున్నారని, ఈ విషయాన్ని పార్టీకి లిఖితపూర్వకంగా తెలియజేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మరోసారి విజయం సాధించబోతున్నామని, గత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ 1995 నుంచి మధ్యలో రెండేళ్లు మినహా అవిచ్ఛిన్నంగా అధికారంలో కొనసాగుతోంది. -
Himachal Pradesh assembly elections: హిమాచల్‌లో బీజేపీ తొలి జాబితా
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 62 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. కేబినెట్ మంత్రి మహేంద్రసింగ్‌తో పాటు 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపింది. అయితే మహేంద్రసింగ్ కుమారునికి టికెట్ దక్కింది. ఇద్దరు మంత్రుల స్థానాలు మార్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర అత్యున్నత నేతలతో కూడిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం జాబితాను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. సీఎం జైరాం ఠాకూర్ మళ్లీ సెరాజ్ అసెంబ్లీ స్థానం నుంచే బరిలో దిగుతున్నారు. మాజీ సీఎం, సీనియర్ నేత ప్రేమ్‌కుమార్ ధుమాల్ (78)కు టికెట్ దక్కలేదు. -
బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల తొలి జాబితా విడుదల
బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయ(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీలో 2022–23 విద్యాసంవత్సరం ప్రవేశాల తొలి జాబితాను వర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో 1,404 సీట్లకుగాను మెరిట్ జాబితాను ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ విడుదల చేశారు. జాబితాను వర్సిటీ అధికా రిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో తొలిజాబితాలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 212 సీట్లు దక్కగా, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాకు 07 సీట్లు మాత్రమే దక్కాయి. ఎంపికైనవారిలో 99 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులేనని అధికారులు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా పాలిసెట్‌లో మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీచేయడంతో 60 శాతం సీట్లు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకే దక్కాయి. కానరాని ఆసిఫాబాద్, నారాయణపేట తొలి జాబితాలో కుమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాలకు ఒక్క సీటూ దక్కలేదు. బాసర ట్రిపుల్ ఐటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండగా, ఇదే ప్రాంతానికి చెందిన ఆసిఫాబాద్ జిల్లాకు చోటు లభించకపోవడం గమనార్హం. పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 258 సీట్లు దక్కగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేవలం 63 సీట్లు రావడం గమనార్హం. మొదటిదశ కౌన్సెలింగ్ మూడురోజులపాటు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 28న 1 నుంచి 500 వరకు, 29న 501 నుంచి 1,000 వరకు, 30న 1001 నుంచి 1,404 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. మొదటిసారి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం(140) సీట్లను కేటాయించినట్లు తెలిపారు. తొలి జాబితాలో73 శాతం బాలికలే ఉన్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. -
159 మందితో ఎస్పీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో దిగారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపక్షాల నుంచి వచ్చిన సవాళ్ళ నేపథ్యంలో మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు సోమవారం పార్టీ ప్రకటించిన 159 మంది అభ్యర్థుల తొలి జాబితాలో అఖిలేశ్ పేరు ప్రథమంగా ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి.. ముఖ్యంగా యాదవులకు కంచుకోటగా ఉన్న కర్హల్... మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. 2002 ఎన్నికల్లో మినహా 1993 నుంచి కర్హల్‌లో సమాజ్‌వాదీ జెండా ఎగురుతోంది. 2017లో ఎస్పీ అభ్యర్థి సోబ్రాన్‌సింగ్ యాదవ్ 38 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. పార్టీకి బలమైన స్థానం కావడంతో అఖిలేశ్ సైతం ఇక్కడి నుంచే పోటీకి మొగ్గు చూపారు. 2012లో ఎస్పీ ప్రభుత్వం ఏర్పడి అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పటికీ, శాసనమండలి సభ్యుడిగానే ఉన్నారు. 2000 నుంచి 2012 వరకు కన్నౌజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన అఖిలేశ్ 2019 ఎన్నికల్లో ఆజంఘఢ్ నుంచి ఎంపీగా గెలిచారు. -
మహా అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ తొలి జాబితా
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 125 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ సౌత్ నుంచి పోటీ చేయనుండగా, మంత్రి చంద్రకాంత్ పాటిల్ కొత్రుడ్ నుంచి బరిలో ఉంటారని తొలి జాబితాలో ప్రకటించారు. శివాజీ మహరాజ్ కుటుంబీకుడు శివేంద్ర సింగ్ సతారా నుంచి పోటీ చేస్తారు. ఇక తొలి జాబితాలో వినోద్ తవ్దే, ఏక్నాథ్ ఖడ్సే, సుధీర్ ముంగంతివర్ వంటి నేతలకు చోటు దక్కకపోవడం గమనార్హం. తొలి జాబితాలో 91 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కగా, 12 మంది సిట్టింగ్‌లకు మొండిచేయి చూపారు. తొలి జాబితాలో కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన ఐదుగురు నేతలు, ఎన్సీపీని వీడిన నలుగరు, ఇద్దరు ఇండిపెండెంట్లకు సీట్లు కేటాయించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేనతో పొత్తు ఖరారైందని బీజేపీ వెల్లడించిన మరుసటి రోజే కాషాయ పార్టీ తన తొలి జాబితాను విడుదల చేయడం గమనార్హం. అక్టోబర్ 21న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 24న వెల్లడిస్తారు. -
బీజేపీ జాబితాలో బబిత, యోగేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు 78 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేయనుండగా ప్రముఖ క్రీడాకారులు బబితా పొగట్, యోగేశ్వర్ దత్‌లకు కాషాయ పార్టీ నుంచి టికెట్లు దక్కాయి. తొలి జాబితాలో 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి పోటీ చేసే అవకాశం లభించగా, ఏడుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తొహన నుంచి, పొగట్ దరి నుంచి బరిలో నిలుస్తారు. యోగేశ్వర్ దత్‌కు బరోడా స్ధానం కేటాయించారు. అక్టోబర్ 21న హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 24న ఫలితాలు వెల్లడిస్తారు. -
మోదీ మళ్లీ వారణాసి నుంచే
న్యూఢిల్లీ: అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ అగ్ర నాయకుడు ఎల్కే అడ్వాణీ స్థానంలో గాంధీనగర్‌లో పోటీచేయబోతున్నారు. హోలీ పర్వదినం సందర్భంగా బీజేపీ బుధవారం 184 మంది అభ్యర్థులతో గురువారం తొలి జాబితాను విడుదలచేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్(28), మహారాష్ట్ర(16), తెలంగాణ(10), పశ్చిమ బెంగాల్(28), అస్సాం(8), ఉత్తరాఖండ్(5), తమిళనాడు(5), ఛత్తీస్‌గఢ్(5), జమ్మూ కశ్మీర్(5), కర్ణాటక(21), కేరళ(13), ఒడిశా(10), రాజస్తాన్(16), తమిళనాడు(5), అరుణాచల్ ప్రదేశ్(2), ఆంధ్రప్రదేశ్(2) తదితర రాష్ట్రాల్లో బీజేపీ తన అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢీకొనబోతున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లక్నోలో, రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో, హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్‌ప్రదేశ్(పశ్చిమ)లో పోటీచేయబోతున్నారు. కేంద్ర మంత్రులు వీకే సింగ్(ఘజియాబాద్), మహేశ్ శర్మ(గౌతమబుద్ధనగర్–నోయిడా)లు తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకున్నారు. బిహార్‌లోనూ 17 మంది అభ్యర్థులను ఖరారుచేసిన బీజేపీ ఆ జాబితాను రాష్ట్ర యూనిట్‌కు పంపింది. మిత్రపక్షాలతో కలిసి అందులోని పేర్లను వెల్లడిస్తామని నడ్డా చెప్పారు. యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి నుంచి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత మంది సిట్టింగ్‌లను తప్పించే అవకాశాలున్నాయి. ముఖ్యాంశాలు ► క్రిష్ణరాజ్(షాజహాన్‌పూర్) మినహా లోక్‌సభ ఎంపీలైన దాదాపు అందరు కేంద్ర మంత్రులకు టికెట్లు దక్కాయి ► యూపీలో ప్రకటించిన 28 మందిలో ఆరుగురు సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించారు. అందులో ఎస్సీ కమిషన్ చైర్మన్, ఆగ్రా ఎంపీ రామ్‌శంకర్ కఠారియా, క్రిష్ణరాజ్ ఉన్నారు. ► మాజీ కేంద్ర మంత్రి బీసీ ఖండూరి(గార్వాల్), ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్‌సింగ్ కోషియారి(నైనిటాల్)ల స్థానంలో కొత్తవారికి చోటు కల్పించారు. ► ఇటీవలే మిజోరం గవర్నర్‌గా వైదొలిగిన కుమ్మనం రాజశేఖరన్‌కు కేరళలోని తిరువనంతపురం టికెట్ కేటాయించారు. ► తమిళనాడు యూనిట్ చీఫ్ తమిళిసాయి సౌందరరాజన్ తూత్తుకుడిలో డీఎంకే అభ్యర్థి కనిమొళితో పోటీపడనున్నారు. ► మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ కుమారుడు సుజయ్ విఖే పాటిల్‌కు అహ్మద్‌నగర్ టికెట్ దక్కింది. ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు. ► మహారాష్ట్రలో వారసత్వ రాజకీయ నేపథ్యమున్న పూనమ్ మహాజన్(ప్రమోద్ మహాజన్ కూతురు), ప్రీతమ్ ముండే(గోపీనాథ్ ముండే కూతురు), రక్షా ఖడ్సే(ఏక్నాథ్ ఖడ్సే కోడలు)లకు జాబితాలో చోటు దక్కింది. మరోసారి రాహుల్ వర్సెస్ స్మృతి అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల మధ్య మరోసారి ఆసక్తికర పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ చేతిలో స్మృతి లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలైనా స్ఫూర్తిదాయక ప్రదర్శనే చేశారు. మరోవైపు, ముంబై నార్త్ సెంట్రల్లో పూనమ్ మహాజన్(బీజేపీ), సంజయ్ దత్ సోదరి ప్రియాదత్(కాంగ్రెస్)ల మధ్య ఇలాంటి పోరే జరిగే అవకాశాలున్నాయి. క్రితంసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాదత్‌ను పూనమ్ మహాజన్ ఓడించారు. అడ్వాణీ రాజకీయ జీవితానికి తెర! బీజేపీ తొలి జాబితాలో 91 ఏళ్ల కురువృద్ధుడు, అగ్ర నేత ఎల్కే అడ్వాణీ పేరును విస్మరించడం ఆశ్చర్యపరిచింది. గాంధీనగర్ నియోజకవర్గంలో ఆయన స్థానంలో పోటీచేస్తున్న అమిత్ షా తొలిసారి లోక్‌సభ బరిలో దిగబోతున్నారు. దీంతో అడ్వాణీ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని భావిస్తున్నారు. 1998 నుంచి అడ్వాణీ గాంధీనగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తొలినాళ్లలో ఆయనకు అమిత్ షా ప్రచార బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. ప్రస్తుతం కూడా గాంధీనగర్ ఎంపీగా ఉన్న అడ్వాణీ ఆ స్థానం నుంచి ఐదు సార్లు గెలుపొందారు. 2014లో మోదీ–షా ద్వయం బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అడ్వాణీ ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ లోక్‌సభలో 92 శాతం పార్లమెంట్ సమావేశాలకు హాజరైనా ఆయన మాట్లాడింది కేవలం 350 పదాలే. అడ్వాణీకి సీటు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ స్పందిస్తూ..అగ్ర నేతను తొలుత బలవంతంగా మార్గదర్శన్ మండలికి పంపిన బీజేపీ ఇప్పుడు ఆయన నుంచి గాంధీనగర్ స్థానాన్ని లాగేసుకుందని ఎద్దేవా చేసింది. 75 ఏళ్లు నిండిన నాయకులను ఇప్పటికే ప్రభుత్వానికి దూరంగా పెట్టిన బీజేపీ ఇక వారిని పోటీయుత రాజకీయాల నుంచి కూడా తప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
టీడీపీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు, అలాగే ఇప్పటివరకు ప్రకటించకుండా మిగిలిన అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను సోమవారం రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత విడుదల చేశారు. తొలి జాబితాలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా, మలి జాబితాలో 15 మందిని ప్రకటించారు. తాజాగా 36 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే తొలిజాబితాలోని నెల్లూరు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరడంతో ఆయన స్థానంలో అజీన్‌ను ఎంపిక చేశారు. తొలిజాబితాలో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి శ్రీరాం మాల్యాద్రిని ఎంపిక చేయగా, తాజాగా ఆయన్ను బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా మార్చారు. ఆయన స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు టిక్కెటిచ్చారు. కాగా భీమిలి అసెంబ్లీ సీటును పార్టీలోకి చేరకుండానే సబ్బం హరికి కేటాయించారు. అసెంబ్లీ అభ్యర్థులు: విజయనగరం జిల్లా: నెల్లిమర్ల – పతివాడ నారాయణస్వామి నాయుడు, విజయనగరం– అదితి గజపతిరాజు, విశాఖ జిల్లా: భీమిలి–సబ్బం హరి, గాజువాక– పల్లా శ్రీనివాసరావు, చోడవరం– కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు, మాడుగుల– గవిరెడ్డి రామానాయుడు, పెందుర్తి– బండారు సత్యనారాయణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం– అయితాబత్తుల ఆనందరావు, పశ్చిమగోదావరి జిల్లా: నిడదవోలు– బూరుగుపల్లి శేషారావు, నర్సాపురం– బండారు మాధవనాయుడు, పోలవరం– బొరగం శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా: తాడికొండ– తెనాలి శ్రావణ్‌కుమార్, బాపట్ల– అన్నం సతీష్ ప్రభాకర్, నరసరావుపేట– డాక్టర్ అరవిందబాబు, మాచర్ల – అంజిరెడ్డి, ప్రకాశం జిల్లా: దర్శి– కదిరి బాబూరావు, కనిగిరి–ముక్కు ఉగ్రనర్సింహారెడ్డి, నెల్లూరు జిల్లా: కావలి– విష్ణువర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్– అబ్దుల్ అజీజ్, వెంకటగిరి– కె.రామకృష్ణ, ఉదయగిరి– బొల్లినేని రామారావు, వైఎస్సార్ జిల్లా: కడప– అమీర్ బాబు, కోడూరు– నర్సింహప్రసాద్, ప్రొద్దుటూరు– లింగారెడ్డి, కర్నూలు జిల్లా: కర్నూలు– టీజీ భరత్, నంద్యాల– భూమా బ్రహ్మానందరెడ్డి, కోడుమూరు– బి.రామాంజనేయులు, అనంతపురం జిల్లా: గుంతకల్లు– ఆర్.జితేంద్రగౌడ్, సింగనమల– బండారు శ్రావణి, అనంతపురం అర్బన్– ప్రభాకర్ చౌదరి, కల్యాణదుర్గం– ఉమామహేశ్వర్‌నాయుడు, కదిరి– కందికుంట వెంకట ప్రసాద్, చిత్తూరు జిల్లా: తంబళ్ల పల్లె– శంకరయాదవ్, సత్యవేడు– జేడీ రాజశేఖర్, గంగాధర నెల్లూరు– హరికృష్ణ, పూతలపట్టు– తెర్లం పూర్ణం ఎంపీ అభ్యర్థులు: శ్రీకాకుళం – కింజారపు రామ్మోహన్నాయుడు, విజయనగరం – అశోక్ గజపతి రాజు, విశాఖపట్నం – ఎం.భరత్, అనకాపల్లి – ఎ.ఆనంద్, అరకు – కిశోర్ చంద్రదేవ్, కాకినాడ – చలమలశెట్టి సునీల్, అమలాపురం – గంటి హరీష్, రాజమండ్రి – మాగంటి రూప, నరసాపురం – వి.శివరామరాజు, ఏలూరు – మాగంటి బాబు, మచిలీపట్నం – కొనకళ్ల నారాయణ, విజయవాడ – కేశినేని వెంకటేశ్వర్లు(నాని), గుంటూరు – గల్లా జయదేవ్, నరసరావుపేట – రాయపాటి సాంబశివరావు, బాపట్ల – శ్రీరాం మాల్యాద్రి, ఒంగోలు – శిద్ధా రాఘవరావు, నెల్లూరు – బీద మస్తాన్‌రావు, కడప – ఆదినారాయణ రెడ్డి, రాజంపేట – డి.సత్యప్రభ, నంద్యాల – శివానందరెడ్డి, కర్నూలు – కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, అనంతపురం – జేసీ పవన్ రెడ్డి, హిందూపురం – నిమ్మల కిష్టప్ప, తిరుపతి – పనబాక లక్ష్మి, చిత్తూరు – శివప్రసాద్ -
కాంగ్రెస్ అభ్యర్థుల వెల్లడి మరికాస్త ఆలస్యం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల మరికాస్త ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి పలు వాయిదాల అనంతరం పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ ముఖ్యులు వెల్లడించారు. అందులో భాగంగా ఎలాంటి వివాదం లేని స్థానాల నుంచి బరిలో నిలిచే అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తరఫున దాదాపు 10 స్థానాలకు పోటీ చేసే నేతల పేర్లను అధిష్టానం ఆమోదించింది. ఆయా స్థానాల్లో అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ టీపీసీసీ ముఖ్యనేతలు మేనిఫేస్టో రూపకల్పనలో భాగంగా దుబాయి పర్యటనకు వెళ్లారు. దీంతో అభ్యర్థుల పేర్లను శనివారం వెల్లడించే అవకాశం అనుమానమేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే వారి విషయమై ఏకాభిప్రాయం కోసం పరిశీలన సాగుతోంది. ఇంకా కాంగ్రెస్‌లో అసంతృప్తులను బుజ్జగించి ఒకేసారి నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యే 12వ తేదీనే మొత్తం అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీకి మాత్రమే స్థానం కాంగ్రెస్ నేతృత్వంలో రూపం సంతరించుకున్న మహాకూటమి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాగస్వామ్య పక్షాలకు స్థానం దక్కడం లేదని తెలుస్తోంది. కేవలం కూటమిలోని టీడీపీకి మాత్రమే రెండు స్థానాలు మాత్రమే కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క స్థానం కోసం తీవ్రంగా పట్టుబడుతోంది. స్థానం దక్కించుకోవడానికి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు సైతం చేస్తోంది. అయితే టీజేఎస్ కోరుతున్న మహబూబ్‌నగర్ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా టీడీపీ తరఫున బీసీ అభ్యర్థిని నిలబెడుతుండడంతో... టీజీఎస్‌కు సర్దుబాటు చేసే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. టీజేఎస్ తరఫున బరిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలంగాణ ఇంటి పార్టీకి కూడా అవకాశం దక్కడం లేదని తెలుస్తోంది. తెలంగాణ ఇంటి పార్టీ తరఫున బరిలో నిలవాలని భావిస్తున్న యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం మహబూబ్‌నగర్ స్థానం కోసం పట్టుబడుతున్నారు. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా సర్దుబాటు చేసే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
కాంగ్రెస్ 9.. సీపీఐ 1
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: మహాకూటమి సీట్ల కేటాయింపుపై ఓవైపు భాగస్వామ్య పక్షాలు అసంతృప్తితో ఉన్నప్పటికీ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా శనివారం హైదరాబాద్‌లో 74 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో కూడిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆమోదం తెలిపిన ఈ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎనిమిది మంది పేర్లు ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమచారం. సీపీఐకి కేటాయించిన బెల్లంపల్లి మినహా మిగతా తొమ్మిది స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేయనుంది. ఈ సీట్లపై ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ, పీసీసీ కోర్ కమిటీ సుధీర్ఘ కసరత్తు జరిపింది. బోథ్ సీటు విషయంలో స్క్రీనింగ్ కమిటీ సోయం బాపూరావు పట్ల మొగ్గు చూపినా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు అభ్యంతరం తెలుపడంతో పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. ఒకరి కన్నా ఎక్కువ మంది పోటీ పడుతున్న సీట్లలో పలు సమీకరణాలను క్రోఢీకరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపినప్పటికీ... చివరి నిమిషంలో కూడా మార్పులు చోటుచేసుకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్‌లో జాబితా వెల్లడయ్యేంత వరకు ఏమీ చెప్పలేని స్థితి. ఢిల్లీలో గురువారం రాత్రి వరకు చోటుచేసుకున్న పరిణామాలను బట్టి కాంగ్రెస్ తొలి జాబితాలో ఎనిమిది మంది పేర్లు ఉంటాయని విశ్వసనీయ సమాచారం. ఎక్కువ మంది సీటును ఆశించిన స్థానాల్లో అనుకూల, ప్రతికూల అంశాలను అంచనా వేస్తూ సీట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంచిర్యాల సీటుపైనే అందరి దృష్టి మంచిర్యాల నియోజకవర్గం సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే జి.అరవింద్‌రెడ్డి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సీటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకు ప్రతిష్టాత్మకంగా మారింది. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా అరవింద్‌రెడ్డికి సీటు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ప్రేంసాగర్‌రావుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు భట్టి విక్రమార్క, ఎ.రేవంత్‌రెడ్డి, డీకే.అరుణ తదితర నేతలంతా మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో ఆశావహులతో సమావేశమైనప్పుడు స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్తచరణ్‌దాస్ బృందం సైతం ప్రేంసాగర్‌రావు అభ్యర్థిత్వం పట్లనే మొగ్గుచూపినట్లు సమాచారం. తుది జాబితాలో ప్రేంసాగర్‌రావు అభ్యర్థిత్వమే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చెన్నూరు నుంచి వెంకటేష్ నేత గ్రూప్–1 అధికారిగా ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన మంచిర్యాల జిల్లాకు చెందిన బోర్లకుంట వెంకటేష్ నేత తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు ద్వారా చెన్నూరు సీటు లక్ష్యంగా ఆయన కార్యకలాపాలు నిర్వర్తించారు. ఈ నియోజకవర్గం నుంచి టికెట్టు ఆశించిన మాజీ మంత్రి బోడ జనార్ధన్ కూడా రేవంత్‌రెడ్డితో పాటు తెలుగుదేశం వీడి కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే సంజీవరావు తదితరులు సైతం టికెట్టు ఆశించినప్పటికీ, చివరికి పోటీ వెంకటేష్ నేత, బోడ జనార్ధన్ మధ్యనే సాగింది. స్క్రీనింగ్ కమిటీ వెంకటేష్ నేత వైపు మొగ్గు చూపగా, రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి జనార్ధన్‌కే ఇవ్వాలని పట్టుపట్టినట్లు తెలిసింది. వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని వెంకటేష్ నేతకే టికెట్టు ఖరారు చేస్తూ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో పాటు చెన్నూరు ఎంపీపీ కళావతి, చెన్నూరు, కోటపల్లి మండలాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం వెంకటేష్‌నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ముథోల్‌లో రామారావు పటేల్ వైపే మొగ్గు ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఆయనకు సమీప బంధువైన రామారావు పటేల్ మధ్యనే టికెట్టు పోటీ నెలకొంది. అయితే నాలుగేళ్లుగా ప్రజల మధ్య ఉన్న రామారావు పటేల్‌కే హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ ముందు నారాయణరావు పటేల్ హాజరు కాకపోవడంతో అధిష్టానం రామారావు పటేల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌లో మహిళా నేతగా సుజాత ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మధ్య నెలకొన్న పోరులో స్క్రీనింగ్ కమిటీ సుజాత వైపే మొగ్గు చూపింది. టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జోగు రామన్న సామాజిక వర్గానికే చెందిన సుజాత ఆదిలాబాద్‌లో సరైన అభ్యర్థిగా పార్టీ భావించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి టీఆర్ఎస్ తరుపున ఇద్దరు మహిళలు పోటీలో ఉండడం కూడా సుజాతకు అనుకూలించిన అంశంగా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి ఒక మహిళా అభ్యర్థికి స్థానం కల్పించిన అంశం ప్రజల్లో సానుకూలతగా ఉంటుందని సీఈసీ భావించినట్లు తెలుస్తోంది. సిర్పూరులో పాల్వాయి హరీష్‌బాబు సిర్పూరు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన రావి శ్రీనివాస్, ఎన్నికల ప్రకటన తరువాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దివంగత ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్బాబుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. రావి శ్రీనివాస్‌కు టికెట్టు ఇప్పేంచుకు రేవంత్‌రెడ్డి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే స్థానికత అంశం ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపినట్లు సమాచారం. తాజా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సెటిలర్ కాగా, ఆయనకు సమీప బంధువు రావి శ్రీనివాస్ అవడంతో స్క్రీనింగ్ కమిటీ హరీష్‌బాబు వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో హరీష్‌బాబు చేస్తున్న పర్యటనలు కూడా ఆయనకు అనుకూలించాయి. దీంతో హరీష్‌బాబు పేరు తొలిజాబితాలో ఉన్నట్లు తెలిసింది. ఖానాపూర్ సీటు రమేష్ రాథోడ్‌కే... కాంగ్రెస్ టికెట్టు హామీతోనే పార్టీలో చేరిన రమేష్ రాథోడ్‌కే ఖానాపూర్ సీటును ఖరారు చేశారు. దీం తో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన హరి నాయక్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్ ముందు హరినాయక్‌కే టికెట్టు ఇవ్వాలని ఆయన మద్ధతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. ∙నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే. వారికే సీఈసీ ఆమోదముద్ర వేసింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన 74 మందిలో చివరి నిమిషంలో ఏవైనా మార్పులు జరిగితే తప్ప ఈ పేర్లనే శనివారం ప్రకటించనున్నారు. -
20లోపు కాంగ్రెస్ తొలి జాబితా సిద్ధం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ తొలి జాబితాను ఈ నెల 20లోపు ప్రకటించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా స్పష్టం చేశారు. ఈ నెల 16,17 తేదీల్లో మరోసారి ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమవుతుందని వెల్లడించారు. శనివారం ఇక్కడ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థిత్వాల ఖారరుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన ఆశావహుల జాబితాను కమిటీ సభ్యులందరికీ అందించారు. అయితే, ఈ జాబితాలో ఇతర పార్టీల నేతల పేర్లు సైతం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లతో జాబితా సిద్ధం చేసి సెంట్రల్ కమిటీకి పంపించేందుకు మూడు సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. గెలిచేవాళ్లు, పార్టీ విధేయులు, జనాల్లో పాపులారిటీ ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది. కుటుంబానికి ఒక్క టికెట్ చొప్పున పరిశీలన ఉంటుందని, మినహాయింపు విషయంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీదే తుది నిర్ణయమని కమిటీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పార్టీలో కోహినూర్ వజ్రాల కంటే అమెరికా డైమండ్ల హడావుడి ఎక్కువైందని కొంతమంది నేతలు మాట్లాడటం మిగతా నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యాఖ్యలు ఎవరు ఎవరిని ఉద్దేశించి చేశారన్న దానిపై నేతలు బయటకు చెప్పడంలేదు. మరోవైపు ఎన్నికల కమిటీ సమావేశంపై తమకు సమాచారం లేకపోవడంతో సీనియర్ నేతలు సర్వే సత్యనారాయణ, గీతారెడ్డి అలక బూనినట్టు తెలుస్తోంది. కొంచెం సమాచారంలోపం ఏర్పడిందని, ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని, ఈ సమయంలో యూనిటీగా ఉండాలని భట్టి విక్రమార్క వారికి సర్ది చెప్పినట్టు తెలిసింది. టికెట్ల కేటాయింపులో అనుబంధ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించేలా చూడాలని నిర్ణయించారు. ముందుగా అభ్యర్థిత్వాల పోటీ లేని స్థానాలు... తొలిజాబితా వ్యవహారం వేగవంతం చేయాలని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. నియోజకవర్గాల్లో çటెకెట్ కోసం పోటీలేని స్థానాల అభ్యర్థులను ముందుగా ప్రకటించాలని నేతలు నిర్ణయించారు. ఈ పేర్ల జాబితాను త్వరలో సెంట్రల్ ఎన్నికల కమిటీకి పంపించి ఆమోదముద్ర వేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మిగిలిన స్థానాల్లో ముగ్గురు పేర్ల చొప్పున స్క్రీనింగ్ కమిటీకి పంపించి ఆ తర్వాత సెంట్రల్ ఎన్నికల కమిటీకి చేరేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి రానుందని, ఇంతలోపు షార్ట్ లిస్టు రూపొందించుకోవాలని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచించిన పేర్లను ఏఐసీసీ సెంట్రల్ కమిటీకి చేర్చాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముందు మాసబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్లో కోర్ కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల జాబితా, ప్రచార వ్యవహారాలు, ప్రచారం షెడ్యూల్ విడుదలపై కమిటీ చర్చించింది. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఊకే అబ్బయ్య శనివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో సీపీఐలో ఉండగా ఇల్లెందు నుంచి, టీడీపీలో బూర్గూపహాడ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అందని కూటమి పార్టీల జాబితా మహాకూటమిగా ఏర్పాటవుతున్న తరుణంలో ఇప్పటి వరకు సీపీఐ నుంచి మాత్రమే అభ్యర్థుల జాబితా వచ్చిందని, టీడీపీ, జన సమితి, ఇతర పార్టీల నుంచి జాబితాలు రాలేదని కమిటీ దృష్టికి నేతలు తీసుకువచ్చారు. త్వరలోనే కూటమి పార్టీలతో కీలక సమావేశం ఏర్పాటు చేసి స్థానాలు, జాబితాపై తుది కసరత్తు చేయాలని కమిటీ నిర్ణయించింది. సమావేశంలో కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భట్టి, సీనియర్ నేతలు జానా, రేవంత్, పొన్నం, సలీం అహ్మద్, బోసు రాజు, శ్రీనివాసకృష్ణన్, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, పొన్నాల, పి.వినయ్‌కుమార్, వీహెచ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ, మర్రి శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, కోదండరెడ్డి, నేరెళ్ల శారద, సీతక్క, సుదర్శన్‌రెడ్డి, మల్లు రవి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కటకం మృత్యుంజయం, సంభాని చంద్రశేఖర్, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడుగురు సిట్టింగ్లతో మజ్లిస్ తొలిజాబితా
సాక్షి,హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్–ఏ– ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారం ప్రకటించింది. ప్రకటించిన జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోమారు అవకాశం కల్పించింది. ఇద్దరు సిట్టింగ్‌లకు స్థానాలు మార్పు చేయగా, ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలను యథాతథం స్థానాలకు ఖరారు చేసింది. చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీని యాకుత్‌పురా నియోజకవర్గానికి, యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను చార్మినార్ నియోజకవర్గ అభ్యర్థులుగా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, బహదూర్‌పురాకు ముహమ్మద్ మోజం ఖాన్, మలక్‌పేటకు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, నాంపల్లికి జాఫర్ హుస్సేన్ మేరాజ్, కార్వాన్కు కౌసర్ మొహియుద్దీన్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. వారం రోజుల్లో మరో జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కొత్తగా పార్టీలోకి వచ్చినోళ్లకూ బీజేపీ టికెట్లు
బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు దగ్గరికొస్తున్న తరుణంలో ఇటీవలే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన అనేక మందికి ఆ పార్టీ టికెట్లు కేటాయించింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా 72 మంది అభ్యర్థుల జాబితాను తొలి విడతగా బీజేపీ ఆదివారం విడుదలచేయడం తెల్సిందే. వీరిలో 11 మంది ఇతర పార్టీల నుంచి ఇటీవల బీజేపీలోకొచ్చినవారే. వీరిలో చాలా మంది శాసనసభ సభ్యులే. కొంత మంది గతంలో మంత్రులుగా చేశారు. బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాలో పేర్లున్నవారిలో దాదాపు అందరూ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారే. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప షికారిపుర నుంచి పోటీ చేయనున్నారు. 72 మంది అభ్యర్థుల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు. -
కార్పొరేట్ల గుప్పెట్లో పాలకపక్షాలు: సీపీఐ
అభ్యర్థుల తొలి జాబితా విడుదల హైదరాబాద్: పాలకపక్ష పార్టీలపై కార్పొరేట్ శక్తులు పట్టు బిగిస్తున్నాయని సీపీఐ అభిప్రాయపడింది. బూర్జువా రాజకీయ పార్టీలలో ఫిరాయింపులు అసహ్యకరంగా పెరిగాయని పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులను, ప్రజాస్వామ్యవాదులను గెలిపించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం శనివారం జరిగింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎన్నికల కమిటీలను నియమించింది. తెలంగాణ కమిటీకి చాడ వెంకటరెడ్డిని, ఆంధ్రప్రదేశ్‌కు కె.రామకృష్ణను కన్వీనర్లుగా నియమించినట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ఒక లోక్‌సభ, 23 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేశారు. విశాఖపట్నం లోక్‌సభ: మానం ఆంజనేయులు అసెంబ్లీ అభ్యర్థులు: కూరంగి మన్మథరావు (పాలకొండ), చాపర వెంకటరమణ (పలాస), జన్ని రాము (సాలూరు), పి.కామేశ్వరరావు (ఎస్.కోట), జి.దేముడు (పాడేరు), జేవీ ప్రభాకర్ (పాయకరావుపేట), ఏజే స్టాలిన్ (గాజువాక), చలసాని రాఘవేంద్రరావు (విశాఖ పశ్చిమ), దేవరకొండ మార్కండేయులు (విశాఖ తూర్పు), కొంపెల్లి కృష్ణమాచారి (ఏలూరు), సోడెం వెంకటేశ్వరరావు (పోలవరం), మండల నాగేశ్వరరావు (తాడేపల్లి గూడెం), కొరగంజి దుర్గాంబ (విజయవాడ పశ్చి మ), దోనేపూడి శంకర్ (విజయవాడ తూర్పు), నవనీతం సాంబశివరావు (విజయవాడ సెంట్రల్), పి.తిరుమలయ్య (యర్రగొండపాలెం), కరవది సు బ్బారావు (ఒంగోలు), శిఖరం నరహరి (సర్వేపల్లి), పి.బాలకృష్ణ (వెంకటగిరి), కె.శ్రీనివాసులు (సూళ్లూరుపేట), జి.ఈశ్వరయ్య (కడప), ఎస్.వెంకటసుబ్బయ్య (బద్వేల్), పి.రామచంద్రయ్య (పత్తికొండ). -
టీడీపీ తొలి జాబితా విడుదల
సిట్టింగ్‌లు, సీనియర్లకు ప్రాధాన్యం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన పలమనేరు నుంచి ఆర్వీ సుభాష్‌చంద్రబోస్‌కు అవకాశం చిత్తూరు ఎంపీ స్థానం నుంచి మళ్లీ శివప్రసాద్‌కు టికెట్టు సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో ఆ పార్టీ అధినేత పోటీ చేసే కుప్పం సహా శ్రీకాళహస్తి, నగరి, పలమనేరు అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు లోక్‌సభకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో వివాదాస్పద సెగ్మెంట్ల జోలికి వెళ్లలేదు. సీనియర్లు, సిట్టింగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్క పలమనేరు నియోజకవర్గానికి మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న ఆర్వీ. సుభాష్‌చంద్రబోస్‌కు అవకాశం దక్కింది. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన వారికి ఈ జాబితాలో స్థానం కల్పించలేదు. పార్టీ మార్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారన్న అపప్రధ రాకుండా తొలి జాబితాకు రూపకల్పన జరిగినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో కుప్పం నుంచి చంద్రబాబునాయుడు, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నగరి నుంచి గాలి ముద్దుకృష్ణమ నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలే. చిత్తూరు నుంచి లోక్‌సభ స్థానానికి ప్రకటించిన ఎన్. శివప్రసాద్ కూడా సిట్టింగ్ ఎంపీ కావడం గమనార్హం. సిట్టింగ్ స్థానాల్లో సత్యవేడు ఒకటి. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమలతకు ఈ జాబితాలో స్థానం దొరకలేదు. చంద్రబాబు జరిపించిన సర్వేల్లో హేమలతపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం ఉంది. తొలిజాబితాలో ఆమెకు అవకాశం కల్పించకపోవడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. కాగా, కుప్పం నుంచి ఆరోసారి చంద్రబాబు బరిలోకి దిగుతున్నారు. ఈయన వరుసగా గెలుపొందుతున్నప్పటికీ ప్రతిసారి ఓట్లు గణనీయంగా తగ్గుతున్నాయి. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈయన 2004 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రం ఓడిపోయారు. నగరి నుంచి పోటీ చేస్తున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు ఏడోసారి శాసనసభకు పోటీ చేస్తుండగా ఒక్కసారి ఓటమి చవిచూశారు. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి కిందటి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన శివప్రసాద్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పలమనేరు పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరున్న ఆర్వీ. సుభాష్‌చంద్రబోస్ కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉంది. సుబాష్ సోదరుడు ఆర్వీ.బాలాజీ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అయితే ఆయనను కాదని సోదరుడు సుబాష్‌కు అవకాశం ఇచ్చారు. అసలు పరీక్ష ముందుంది.. తొలిజాబితా విడదల తరువాత జిల్లా తెలుగుదేశం పార్టీలో పెద్దగా స్పందన లేదు. సిట్టింగ్‌ల పేర్లే ప్రకటించడంతో ఈ జాబితాపై ఎక్కడా చర్చకు అవకాశం లేకుండా పోయింది. తిరుపతి లోక్‌సభ, మదనపల్లె అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించనున్న విషయం తెలిసిందే. మదనపల్లె అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టికెట్టు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. చిత్తూరు అసెంబ్లీ టికెట్టు ఆశించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు రెండు రోజుల కిందట వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తరువాత అసంతృప్తులు చెలరేగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి అభ్యర్థి ఎంపిక తరువాత ఆ పార్టీలో పరిణామాలు శరవేగంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ తదితరుల పేర్లు మలివిడత జాబితాలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.