కార్పొరేట్ల గుప్పెట్లో పాలకపక్షాలు: సీపీఐ | Corporate mercy   Weekly: CPI | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ల గుప్పెట్లో పాలకపక్షాలు: సీపీఐ

Published Sun, Apr 13 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

Corporate mercy    Weekly: CPI

అభ్యర్థుల తొలి జాబితా విడుదల

 హైదరాబాద్: పాలకపక్ష పార్టీలపై కార్పొరేట్ శక్తులు పట్టు బిగిస్తున్నాయని సీపీఐ అభిప్రాయపడింది. బూర్జువా రాజకీయ పార్టీలలో ఫిరాయింపులు అసహ్యకరంగా పెరిగాయని పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులను, ప్రజాస్వామ్యవాదులను గెలిపించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం శనివారం జరిగింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎన్నికల కమిటీలను నియమించింది. తెలంగాణ కమిటీకి చాడ వెంకటరెడ్డిని, ఆంధ్రప్రదేశ్‌కు కె.రామకృష్ణను కన్వీనర్లుగా నియమించినట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ఒక లోక్‌సభ, 23 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేశారు.

 విశాఖపట్నం లోక్‌సభ: మానం ఆంజనేయులు

 అసెంబ్లీ అభ్యర్థులు:  కూరంగి మన్మథరావు (పాలకొండ), చాపర వెంకటరమణ (పలాస), జన్ని రాము (సాలూరు), పి.కామేశ్వరరావు (ఎస్.కోట), జి.దేముడు (పాడేరు), జేవీ ప్రభాకర్ (పాయకరావుపేట), ఏజే స్టాలిన్ (గాజువాక), చలసాని రాఘవేంద్రరావు (విశాఖ పశ్చిమ), దేవరకొండ మార్కండేయులు (విశాఖ తూర్పు), కొంపెల్లి కృష్ణమాచారి (ఏలూరు), సోడెం వెంకటేశ్వరరావు (పోలవరం), మండల నాగేశ్వరరావు (తాడేపల్లి గూడెం), కొరగంజి దుర్గాంబ (విజయవాడ పశ్చి మ), దోనేపూడి శంకర్ (విజయవాడ తూర్పు), నవనీతం సాంబశివరావు (విజయవాడ సెంట్రల్), పి.తిరుమలయ్య (యర్రగొండపాలెం), కరవది సు బ్బారావు (ఒంగోలు), శిఖరం నరహరి (సర్వేపల్లి), పి.బాలకృష్ణ (వెంకటగిరి), కె.శ్రీనివాసులు (సూళ్లూరుపేట), జి.ఈశ్వరయ్య (కడప), ఎస్.వెంకటసుబ్బయ్య (బద్వేల్), పి.రామచంద్రయ్య (పత్తికొండ).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement