దావోస్: ఏపీలో మంత్రులు, టీడీపీ నేతలు నారా లోకేష్(Nara Lokesh) భజన చేస్తున్నారు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, డిప్యూటీ సీఎం చేయాలని పచ్చ నేతలు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి టీజీ భరత్(TG Bharath) కూడా అదే లిస్ట్‌లోకి చేరుకున్నారు. నారా లోకేష్‌ను ఏకంగా ముఖ్యమంత్రిని చేయాలని మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), నారా లోకేష్ పలువురు మంత్రులు దావోస్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
ఇదిలా ఉండగా.. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. నారా లోకేష్ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. దీంతో, లోకేష్ విషయంలో కూటమి రాజకీయంలో రసవత్తరంగా మారింది.
మరోవైపు.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే కామెంట్స్‌పై అటు జనసేన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై తాజాగా జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్(Pawan Kalyan)ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటరిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment