వైఎస్సార్, సాక్షి: టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రయత్నాలకు జనసేన మోకాలడ్డు వేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కూటమిలో చిచ్చు రగల్చింది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్‌ను డీ.సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ డిమాండ్‌కు జనసేన పార్టీ అంతే ధీటుగా.. ఘాటుగా కౌంటర్‌లిస్తోంది.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి(R Srinivasulu Reddy) వాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై జననేత ఘాటుగా స్పందిస్తోంది. ఒకవేళ.. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తమ అధినేత పవన్‌ను సీఎం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర మంత్రిగా వెళ్తే బాగుంటుందని కొందరు జనసేన నేతలు శ్రీనివాసులుకు సూచిస్తున్నారు. పైగా ఆ బాధ్యతలను శ్రీనివాసులు రెడ్డినే తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు జనసేన ఉమ్మడి కడప జిల్లా నేత విశ్వం రాయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. మరోవైపు..
బాబుకు వయసైపోయింది!
నారా లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్(Nara Lokesh Babu)కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. అయితే..
లోకేష్‌ను డిప్యూటీ సీఎం(Deputy CM) చేయడం ద్వారా పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు చెక్ పెట్టొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తూ ఉండొచ్చు. ఈ క్రమంలోనే తమ పార్టీ కీలక నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేసి ఉండొచ్చు. తద్వారా వాళ్ల డిమాండ్‌ను చూపించి.. లోకేష్‌ను డీ.సీఎం. చైర్‌లో కూర్చోబెట్టడమే ఆయన ఆలోచనగా స్పష్టమవుతోంది. అదే జరిగితే తమ అధినేత పరిస్థితి ఏంటో? అనే ఆందోళనలో జనసేన ఉందిప్పుడు. ఈ క్రమంలోనే ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.
ఇదీ చదవండి: ‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’
Comments
Please login to add a commentAdd a comment