వాషింగ్టన్: మరికొన్ని గంటల్లో అమెరికాకు అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే సమయంలో జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధ్యక్ష స్థానంలో బైడెన్ పలువురికి క్షమాభిక్షలు కల్పిస్తున్నారు.
వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడిగా తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో చివరి గంటల్లో జో బైడెన్(joe Biden) క్షమాభిక్షలు ఇస్తున్నారు. మరికొద్ది గంటల్లో జో బైడెన్ అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలోనే అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష జారీ చేశారు. అలాగే, క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకూ కూడా ఉపశమనం కల్పించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతీకార చర్యలు తీసుకునేందుకు వీలులేకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. దీంతో, క్షమాభిక్షల వ్యవహారం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. 2021, జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడులు జరిగిన విషయం తెలిసిందే.
ఈ సందర్బంగా బైడెన్ మాట్లాడుతూ.. ఈ ప్రజా సేవకులు మన దేశానికి గౌరవంగా, విశిష్టతతో సేవ చేశారు. అన్యాయంగా, రాజకీయంగా ప్రేరేపించబడిన నేరాల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారు. ఇవి అసాధారణమైన పరిస్థితులు అంటూ చెప్పుకొచ్చారు.
Biden Grants Last Minute Gutless Preemptive Pardons to Protect Allies from the Legal Process
In a spineless final act before leaving office, President Joe Biden issued preemptive pardons to several individuals he believed could be prosecuted by the incoming Trump administration. pic.twitter.com/2KEgLr0iMe— RICKY YUNG (@RickyYung33770) January 20, 2025
మరోవైపు.. అమెరికా అధ్యక్ష పీఠం దిగబోతున్న జో బైడెన్ తన పదవీకాలంలో చివరి రోజున దక్షిణ కరోలినాలో గడిపారు. 2020లో డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గినప్పటి నుంచి ఆ ప్రాంతంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం శ్వేతసౌధానికి చేరింది. పదవి ముగుస్తున్న తరుణంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు. గతంలో తన విజయానికి కారకులైనవారికి అక్కడి నుంచి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. శ్వేతసౌధాన్ని బైడెన్ ఖాళీచేసి వెళ్లడానికి, ట్రంప్ అందులోకి రావడానికి కావాల్సిన ఏర్పాట్లను ఐదు గంటల్లో పూర్తి చేయాల్సి ఉండటంతో సంబంధిత సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
🚨BREAKING: Joe Biden just left Air Force One for the last time as President.
pic.twitter.com/UMRCk7rRag— Benny Johnson (@bennyjohnson) January 20, 2025
Comments
Please login to add a commentAdd a comment