వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎన్నికల్లో ఓటర్లు ఆకర్షించేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ కొత్త ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పేరులోని ‘కమల’ అనే పదాలను మాత్రమే వాడుతున్నారు. ‘కమల’ అనే పిలవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.
కాగా, ఎన్నికల సమయంలో ఓటర్లతో మంచి సంబంధాన్ని పెంపొందించడానికి ప్రచారంలో ఆమె మొదటి పేరు ‘కమలా’ను స్వీకరించారు. మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామా, పలువురు నేతల సూచనల మేరకు కమలా హారీస్ తన పేరును ‘కమల’గా మార్చుకుని ముందుకు సాగుతున్నారు. ఇక, డెమోక్రటిక్ మద్దతుదారులు కూడా ఆమెను కమలా.. కమలా అని నినాదాలు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు కమలా అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. కమలా అంటే ఆమె తల్లి పెట్టిన సాంస్కృతిక మరియు జాతి పేరు.
ఇదిలా ఉండగా.. కమలా హారీస్‌ను డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించిన 48 గంటల్లో పార్టీ ప్రచార సోషల్ మీడియాను 'బిడెన్ హెచ్‌క్యూ' నుండి 'కమలా హెచ్‌క్యూ'కి త్వరగా రీబ్రాండ్ చేసింది. 'హారీస్' నుండి 'కమల'కి మారడం ద్వారా తన ప్రచారంలో ఓటర్లకు దగ్గర కావడానికి ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమె పలుమారు కమలా అని సంబోంధించడంతో ఈజీగా ఆ పేరు ప్రజల్లోకి వెళ్తుందనే కారణంగానే ఇలా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment