వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్న వేళ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోందని అన్నారు. అలాగే, కొద్దిమంది అతి సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ ఉండబోతుంది అంటూ హెచ్చరించారు. దీంతో, ఆయన కామెంట్స్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మరో ఐదు రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో ఓవల్ కార్యాలయం నుండి తన వీడ్కోలు ప్రసంగం చేశారు బైడెన్. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ..‘నేడు అమెరికాలో విపరీతమైన సంపద, శక్తి కలిగిన ఒక సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోంది. ఇది మొత్తం ప్రజాస్వామ్యాన్ని, మన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అమెరికా ప్రజలు తప్పుడు ప్రచారాలను చూడాల్సి ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ క్షీణిస్తోందని హెచ్చరించారు. ఇది ఆందోళనకరంగా మారే ఛాన్స్ ఉందన్నారు.
ఇదే సమయంలో ఇది అధికార దుర్వినియోగానికి వీలు కల్పిస్తుందన్నారు. సోషల్ మీడియాలో అసత్య కథనాలు భారీగా స్థాయిలో వెలుగు చూస్తాయి. అధికారం కోసం నిజం అణిచివేయబడుతోందంటూ ఘాటు విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగాన్ని అదుపు చేయకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అలాగే, ప్రతీ అమెరికా పౌరుడు తమ హక్కులను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
Biden: "I want to warn the country of some things that give me great concern. That's the dangerous concentration of power in the hands of a very few ultra wealthy people and the dangerous consequences if their abuse of power is left unchecked. Today, an oligarchy is taking shape" pic.twitter.com/3JFO40udS3
— Aaron Rupar (@atrupar) January 16, 2025
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే పలు దేశాల అధినేతలకు ఆహ్వానం వెళ్లింది. దీంతో, పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment