ట్రంప్‌ను ఓడించేవాడిని: బైడెన్‌ పశ్చాత్తాపం | Joe Biden asserted that he would have defeated Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ను ఓడించేవాడిని: బైడెన్‌ పశ్చాత్తాపం

Published Sat, Jan 11 2025 11:54 AM | Last Updated on Sat, Jan 11 2025 12:09 PM

Joe Biden asserted that he would have defeated Donald Trump

వాషింగ్టన్‌: ఇలీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై అధ్యక్షుడు జోబైడెన్‌ పశ్చాత్తాపపడ్డారు. నాడు తాను తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి చెందారు. మీడియా సమావేశంలో అధ్యక్షుడు బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

మొన్నటి అమెరికా ఎన్నికల్లో తాను పోటీ చేసి ఉంటే డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)ను తప్పకుండా ఓడించేవాడినన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్ ‘ఎన్నికల్లో పోటీ చేయకూడదని మీరు నిర్ణయించుకున్నందున, అది ట్రంప్‌కు మళ్లీ అధికారం అప్పగించడంలో సహాయపడిందని, ఇటువంటి భావన మీకు కలిగిందా? అని అడిగారు. దీనికి బైడెన్‌  సమాధానమిస్తూ ‘నేను పూర్తిగా అలా అనుకోవడం లేదని, కానీ నేను గనుక పోటీ చేసి ఉంటే, ట్రంప్‌ను కచ్చితంగా ఓడించేవాడిననే  నమ్మకం నాకు ఉంది’ అని అన్నారు.
 

డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించే విషయంలో కమలా హారిస్‌ (Kamala Harris) కూడా సమర్థురాలని బైడెన్‌ పేర్కొన్నారు. ఆమె అద్భుతంగా పని చేస్తారని, అందుకే ఆమె ట్రంప్‌ను ఓడించగలరనే నమ్మకం తనకు కలిగిందని, అటువంటి నమ్మకంతోనే ఆమెకు మద్దతునిచ్చానని బైడెన్‌ పేర్కొన్నారు. అయితే డెమోక్రటిక్ పార్టీ(Democratic Party)లో ఐక్యత కోసమే తాను పోటీ నుంచి తప్పుకున్నాట్లు బైడెన్‌ తెలిపారు.

బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించినప్పటికీ ఆరోగ్య సమస్యలు, సొంత పార్టీ లోని వ్యతిరేకత రావడంతో పోటీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అనంతరం తమ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలాహారిస్‌కు మద్దతు ప్రకటించారు. నిరంకుశత్వం కంటే దేశం గొప్పదని బైడెన్ వ్యాఖ్యానించారు. కమలా హ్యారిస్ 2028లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  తప్పకుండా మళ్లి పోటీ చేస్తారని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: మదురో అరెస్టుకు ఆధారాలందించండి: బైడెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement