సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ కేసుల విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేమని జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. ఈ కేసులను హైకోర్టు చూసుకుంటుందన్నారు. త్వరగా విచారణ జరపాలని కోరుతామని వెల్లడించారు.
ఈ కేసుతో మీకు సంబంధం ఏంటని రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐ తరఫు న్యాయవాది ఈ కేసులో వాదనలకు సమయం కోరారు. దాంతో విచారణను వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేసులు విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తుందని సీనియర్ న్యాయవాది ముకుల్.. కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ముకుల్ తెలిపారు. రాజకీయపరమైన పిటిషన్‌గా ముకుల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తనది రాక్షసపాలనే అని చెప్పడమే బాబు ఆంతర్యమా?
Comments
Please login to add a commentAdd a comment