Raghu Rama Krishna Raju
-
చిన్న బిడ్డను కూడా వదలరా.. ఛీ మీ బతుకులు చెడ
-
రఘురామ ‘క్వాష్’ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఆయన మనుషులు గతంలో ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామ వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.శుక్రవారం(ఫిబ్రవరి 14) జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. అయితే బాధితుడు ఫరూక్ భాషా తరఫున వకాలత్ దాఖలు చేయడానికి ఆయన లాయర్ సమయం కోరారు. దీంతో.. అందుకు రెండు వారాల గడువు ఇచ్చింది కోర్టు. అలాగే.. ఈ పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.నరసాపురం ఎంపీగా ఉన్న టైంలో.. విధుల్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ ఫరూక్ భాషపై రఘురామ, ఆయన తనయుడు భరత్ కలిసి దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. 2022 జులైలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కానిస్టేబుల్ ఫరూక్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి రఘురామ మనుషులు ఆయన నివాసంలోనే చితకబాదారు. ఆపై అనుమానితుడిగా పోలీసులకు అప్పగించారు. అయితే..రఘురామ, ఆయన మనుషులు తనను చిత్రహింసలకు గురి చేశారని ఫరూక్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో జులై 4వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రఘురామ, ఆయన తనయుడు, రఘురామ పీఏ, సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఊరట కోసం తెలంగాణ హైకోర్టులో రఘురామ క్వాష్ వేయగా చుక్కెదురైంది. ఆ వెంటనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
రఘురామ సీఐడీ కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట
-
రఘురామ కృష్ణంరాజు కేసులో డాక్టర్ ప్రభావతికి ఊరట
ఢిల్లీ : సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. విచారణకు సహకరించాలని డాక్టర్ ప్రభావతికి ఆదేశించింది. డాక్టర్ ప్రభావతి పిటీషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు గతంలో రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రభావతిని ఏ5గా పేర్కొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారంటూ రఘురామ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. -
సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణంరాజుకు షాక్
-
రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ(జనవరి 27, సోమవారం) విచారణ జరిపింది. అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం.. ‘‘కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా?’’ అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఒకానొక తరుణంలో పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది.. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. వాదనలు ఇలా.. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. అయితే.. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని.. ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అన్నివైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మస్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. -
రఘురామ కృష్ణంరాజు లాయర్‌కు సుప్రీంకోర్టు అక్షింతలు
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ కేసుల విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేమని జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. ఈ కేసులను హైకోర్టు చూసుకుంటుందన్నారు. త్వరగా విచారణ జరపాలని కోరుతామని వెల్లడించారు.ఈ కేసుతో మీకు సంబంధం ఏంటని రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐ తరఫు న్యాయవాది ఈ కేసులో వాదనలకు సమయం కోరారు. దాంతో విచారణను వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేసులు విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తుందని సీనియర్ న్యాయవాది ముకుల్.. కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ముకుల్ తెలిపారు. రాజకీయపరమైన పిటిషన్‌గా ముకుల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: తనది రాక్షసపాలనే అని చెప్పడమే బాబు ఆంతర్యమా? -
29లోగా రఘురామను అరెస్టు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: అంబేడ్కర్ ఫ్లెక్సీని చించి దళితులను అవమానించడంతోపాటు ఎస్సీలను దూషించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై కేసు నమోదు చేసి ఈ నెల 29లోగా అరెస్ట్ చేయాలని మాల సంఘాల జేఏసీ, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయకపోతే ఈ నెల 30న రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం వద్ద మాల సంఘాల జేఏసీ, దళిత సంఘాల నేతలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లి రాజే‹Ù తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్‌బుక్’ పడగ -
వంద రోజుల్లో దళితులపై వంద దాడులు
మదనపల్లె: టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం దళిత వ్యతిరేక పాలన చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వంద రోజుల కూటమి పాలనలో దళితులపై వంద దాడులు జరిగినా.. దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగినా ఏమీపట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. ‘వంద రోజుల టీడీపీ కూటమి ప్రభుత్వం.. దళితులపై 100 దాడుల ప్రభుత్వం’ పేరిట బీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేస్తూ దళితులు నిరసన తెలిపారు. ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నాలుగేళ్ల కాలంలో జరిగిన దాడులు, టీడీపీ పాలనలో కేవలం నాలుగు నెలల్లోనే జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందన్నారు. బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును బర్తరఫ్ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడిచేసి దూషణకు పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వంద రోజుల కూటమి పాలనను గమనిస్తే.. దళితులనే లక్ష్యంగా పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంపై దళితులంతా ఆగ్రహంతో ఉన్నారని, ఇదే పంథాలో పాలన కొనసాగిస్తే టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. బీఎస్పీ నేతలపై కేసులు నమోదుసబ్ కలెక్టరేట్ ఎదుట టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సబ్ కలెక్టరేట్‌కు చేరుకుని బీఎస్పీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురిని బలవంతంగా పోలీసు జీపులోకి ఎక్కించి, వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై ధర్నా నిర్వహించినందుకు ఐపీసీ సెక్షన్ 188, సెక్షన్ 290, పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ 341, సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేశారు. బీఎస్పీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వ చర్యల్ని బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు బి.పరంజ్యోతి ఖండించారు. -
ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: అంబేద్కర్ ఫ్లెక్సీని చించి అవమానించిన ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. కాకినాడలో దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీపైన, రఘురామకృష్ణరాజుపైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. బుధవారం హైకోర్టు ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల ఫోరం ఆధ్వర్యంలో న్యాయవాదులు భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. రఘురామకృష్ణరాజు, నానాజీలను అరెస్ట్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించి రఘురామకృష్ణరాజు కుల అహంకారాన్ని ప్రదర్శించారని, ఇది క్షమించరాని నేరమని న్యాయవాదులు పేర్కొన్నారు. ఆర్థిక నేరస్తుడిగా పరిగణించబడుతున్న రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి భర్తరఫ్ చేసి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన వైద్యుడిపై ఎమ్మెల్యే దాడి హేయమని, ఫ్రొఫెసర్కే రక్షణ లేకపోతే సామాన్యుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి అంబేడ్కర్ విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. -
దళిత సంఘాల కన్నెర్ర
సాక్షి నెట్వర్క్: ఎమ్మెల్యేలు కె.రఘురామకృష్ణరాజు, పంతం నానాజీ దురాగతాలపై దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. వారిద్దరి తీరుపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి తెగబడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నేతలు నినదించారు. విశాఖ ఎల్ఐసీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత హక్కుల పోరాట సమితి, భీమ్‌సేన, కేవీపీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రఘురామకృష్ణరాజు దురాగతాన్ని హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావును దూషించి దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుడి ఘటనపై స్పందించని కాకినాడ ఎస్పీ, కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని కోరారు. కాగా.. ఉండి ఎమ్మెల్యే రఘురామ తీరుపై పల్నాడు జిల్లా అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. రఘురామను శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నాయకుడు తోకల సూరిబాబు, మండల సీఐటీయు కార్యదర్శి బి.సూరిబాబు, వైఎస్సార్సీపీ కారి్మక విభాగం నాయకుడు దారా ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు అంబేడ్కర్‌ను అవమానపరిచిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు బాపట్ల జిల్లా రేపల్లెలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైభీమ్ యాక్సెస్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. తక్షణ చర్యలకు కార్పొరేటర్ల డిమాండ్ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్టరాజు, దళిత డాక్టర్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను, దళిత డాక్టర్‌ను అవమానించిన ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలను అడ్డుకునేందుకు జనసేన, టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారు వెనక్కి తగ్గలేదు.డీజీపీకి మెమోరాండం అంబేడ్కర్ ఫొటోతో ఫ్లెక్సీ చించేసి దళితుల్ని అవమానపర్చిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, దళిత ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు పీవీ రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ విజయవాడలో తెలిపారు. మంగళవారం డీజీపీని కలిసి ఈ మేరకు మెమోరాండం అందజేసినట్టు తెలిపారు. ఇద్దర్నీ అరెస్ట్ చేయాల్సిందే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. -
రఘురామరాజు అరెస్ట్ ? బాబుకు దళిత నేతలు వార్నింగ్
-
రఘురామను సస్పెండ్ చెయ్యాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/చిలకలపూడి (మచిలీపట్నం)/తణుకు అర్బన్/భీమవరం/పాలకొల్లు సెంట్రల్/నగరి/తిరుపతి కల్చరల్/మంగళగిరి/ కోటవురట్ల/కాకినాడ క్రైం : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని చింపి ఆయన్ను అవమానించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు, నేతలు డిమాండ్ చేశారు. అలాగే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం పలు చోట్ల రఘురామ దిష్టి బొమ్మను దహనం చేశారు. అలాగే దళిత డాక్టర్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సత్యవేడు ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకున్న చంద్రబాబు.. రఘురామపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. దళిత వర్గాలకు ఒక న్యాయం, అగ్రవర్ణాల వారికి ఒక న్యాయమా అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో దళిత నేతలు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా నిరసనలుఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఉమ్మడి పశ్చిమ జిల్లావ్యాప్తంగా సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ తీరుపై దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే అణచివేత ధోరణిలో ప్రభుత్వం పోలీసులతో కేసులు నమోదు చేయిస్తోందని దళిత నేతలు మండిపడ్డారు. అనేక నియోజకవర్గాల్లో రఘురామ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. భీమవరంలో దళిత సంఘాలు తలపెట్టిన భారీ ధర్నాను అడ్డుకునేలా హౌస్అరెస్టులు కొనసాగాయి. రఘురామను బర్తరఫ్ చేయాలికృష్ణాజిల్లా మచిలీపట్నం ధర్నాచౌక్ వద్ద దళిత యాక్షన్ కమిటీ నాయకులు నిరసన తెలిపారు. రఘురామను ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి జక్కుల ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. ఎస్సీలను నోటికొచ్చినట్లు మాట్లాడి రఘురామకృష్ణరాజు అవమానించారన్నారు. ఆ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలన్నారు. న్యాయవాదుల రాస్తారోకో.. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం చట్టం కింద, దళిత వైద్యుడిపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని ఆలిండియా పూలే–అంబేడ్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది పొట్ల సురేశ్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసిన వారిపై ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయిస్తోందని మండిపడ్డారు. కూటమి ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా తణుకులో సోమవారం బార్ అసోసియేషన్ న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలి కూటమి ఎమ్మెల్యేల కుల దుహంకార చర్యలను నిరసిస్తూ అంబేడ్కర్ భవన్ అసోసియేషన్, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం తిరుపతిలోని బాలాజీ కాలనీలో పూలే విగ్రహం వద్ద ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రఘురామపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల సంఘాల రాష్ట్ర జేఏసీ కన్వీనర్ గుర్రం రామారావు డిమాండ్ చేశారు. సోమవారం మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘురామపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ దిష్టిబొమ్మ దహనంచిత్తూరు జిల్లా, నగరి బస్టాండు వద్ద అంబేడ్కర్ సర్కిల్లో ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నేతలు రఘురామ కృష్ణరాజు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నిందపడగానే సస్పెండ్ చేసిన చంద్రబాబు.. అంబేడ్కర్‌ను అవమానించిన రఘురామను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. రఘురామ, నానాజీపై కఠిన చర్యలు తీసుకోండిడా.బీఆర్ అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై, దళిత వైద్యుడిపై దాడి చేసిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కఠిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎం.అప్పలరాజు, అంబేడ్కర్ గ్లోబల్ మిషన్ నాయకుడు కంచా లోవరాజు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే నానాజీపై నిరసనలు వద్దు..వైద్యులు, వైద్య విద్యార్థులకు పోలీస్, వైద్య శాఖల అధికారుల ఫోన్లుసాక్షి, అమరావతి: రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరావుపై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులపై చర్యలు తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం తరఫున పోలీసులు, వైద్య శాఖ ఉన్నతాధికారులతో వైద్యులు, వైద్య విద్యార్థులకు ఫోన్లు చేయిస్తూ నిరసనలు ఆపాలంటూ ఒత్తిడి తెస్తోంది.ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారని.. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలంటూ సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు, వైద్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదు చేసి చేతులు దులుపుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో వైద్యులు, వైద్య విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలు, ఆస్పత్రి ప్రాంగణంలో ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. వైద్యులకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోతోందంటూ నినాదాలు చేశారు. ఊరుకుంటే.. ఉద్యమిస్తాండాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఇంతటి దాష్టీకం జరిగినా ప్రభుత్వ అధినేతలెవరికీ చీమకుట్టినట్టయినా లేదని వైద్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నానాజీని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడిలో పాల్గొన్న తూము బన్నీ సహా ఇతర అనుచరులను గుర్తించి శిక్షించాలని కోరారు. ఇంత జరుగుతున్నా పట్టనట్టు ఊరుకుంటే మాత్రం ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం హోరు వానలో కాకినాడ జీజీహెచ్ వద్ద వైద్యులు నిరసన తెలిపారు. -
భగ్గుమన్న దళితులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అవమానించడంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళితులను దుర్భాషలాడుతూ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేయడంపై తీవ్రంగా స్పందించాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. తక్షణమే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. పెద్ద ఎత్తున నిరసనలు » ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దళిత నాయకులు ఆదివారం ఏలూరుపాడుకు చేరుకుని రా్రïÙ్టయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిõÙకం చేశారు. రఘురామకృష్ణరాజుపై 24 గంటల్లో అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, దళిత నాయకులు చీకటిపల్లి మంగరాజు, పెండ్ర వీరన్న, సుధామ, నల్లి రాజే‹Ù, గుమ్మాపు వరప్రసాద్, తాళ్లూరి మధు తదితరులు ఏలూరుపాడు గ్రామాన్ని సందర్శించి దళిత నాయకులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం సాయత్రం భీమవరం అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. » ఏపీ బహుజన జేఏసీ, జై భీమ్ సేవాదళ్ ఆధ్వర్యాన భీమవరం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. జాతులు, కులాల మధ్య గొడవలు సృష్టించే విధంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రవర్తించారని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. » తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట సామాజిక న్యాయ పోరాట సమితి, జై భీమ్ యువజన సంఘం, సమత యువజన సంఘం, తణుకు అడ్వొకేట్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబేడ్కర్‌ను అవమానించి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, కాకినాడలో దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తణుకు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, నరేంద్ర సెంటర్లలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. » చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోటలో దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంభం విజయరాజు మద్దతు తెలిపారు. » నూజివీడులో మాల యోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. రఘురామకృష్ణరాజుపై నూజివీడు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సరికాదు. ఏలూరుపాడులో ఆయన స్వయంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించడం దారుణం. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలకు, అంబేడ్కర్ వాదులు అందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి. –పెండ్ర వీరన్న, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్బాబు పాలనలో దళితులపై దాడులు చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు సర్వసాధారణం. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన రఘురామకృష్ణరాజు ఏకంగా రాజ్యాంగ నిర్మాతనే అవమానించడంపై గవర్నర్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి. కాకినాడలో డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ దాడి చేయడం సిగ్గుచేటు. ఇద్దరు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి. – నల్లి రాజే‹Ù, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడుఅట్రాసిటీ కేసు నమోదు చేయాలి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించిన రఘురామకృష్ణరాజు ఇప్పటికైనా తన తీరు మార్చుకుని అంబేడ్కర్‌కు క్షమాపణ చెప్పాలి. లేకపోతే దళితులంతా ఆయనకు తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారు. – కాకిలేటి ఆనందకుమార్ (మధు), వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శికులాల మధ్య చిచ్చుకే..ఏలూరుపాడులో ప్రపంచ మేధావి అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే ఓ చదువుకోలేని అనామకుడిలా ప్రవర్తించి ఫ్లెక్సీలు చించివేయడం దారుణం. దళితుల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి గౌరవం లేదు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చుపెట్టి హీరో అవ్వాలని దురుద్దేశంతో ఫ్లెక్సీని చించి అంబేడ్కర్‌ని అవమానించారు. – గుమ్మాపు సూర్య వరప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, పీవీ రావు మాల మహానాడుకుల, ధన అహంకారంతోనే.. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన కుల, ధన అహంకారంతో రెచి్చపోయి అంబేడ్కర్ ఫొటో ఉన్న ఫ్లెక్సీని చించివేశారు. ఆ ఫ్లెక్సీ తొలగించే క్రమంలో ఆయన వాడిన భాష, బూతులు దారుణం. రఘురామకృష్ణరాజు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – పేరూరి మురళీకుమార్, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపకుడు, తణుకుజాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాలినెహ్రూనగర్/గోపాలపట్నం: టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు నిరసన వ్యక్తంచేశారు. భీమ్ సేన సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపు నీలాంబరం మాట్లాడుతూ అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చించివేయడం, దళితులను దుర్భాషలాడటం సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుని రఘురామకృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకుని దళితుల మనోభావాలు కాపాడాలని కోరారు. అదేవిధంగా కాకినాడలో దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావును దుర్భాషలాడటంతోపాటు, దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, పంతం నానాజీలపై అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత సంఘాల నాయకులు విద్యాసాగర్, చిన్నం డేవిడ్ విలియమ్స్, బత్తుల అనిల్, మనోజ్‌కుమార్, మస్తాన్‌రావు, మనోహర్, విజయరాజు, జోసెఫ్, శంకర్, కాంతారావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలికాకినాడలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్‌పై ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం, అంబేడ్కర్ ఫ్లెక్సీని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చించివేయాన్ని ఖండిస్తూ విశాఖపట్నంలోని ఎన్ఏడీ కొత్త రోడ్డులో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వెల్ఫేర్ సంఘం సభ్యులు నిరసన తెలిపారు. పంతం నానాజీ, రఘురామకృష్ణరాజులను ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వెల్ఫేర్ సంఘం సభ్యులు వెంకటేశ్వరరావు, ప్రసాద్, సోడదిశి సుధాకర్, అప్పారావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.వీధిరౌడీలా వ్యవహరించారు రఘురామకృష్ణరాజు ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక వీధిరౌడీలా వ్యవహరించారు. నిజంగా అక్కడ వారికి ఫ్లెక్సీ అడ్డుగా ఉంటే పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా తీయించాలి. ఇందుకు విరుద్ధంగా ఎమ్మెల్యే బూతులు తిడుతూ ఆయనే తొలగించడం దారుణం. – గొల్లపల్లి అంబేడ్కర్ సీనియర్ న్యాయవాది, తణుకు -
రఘురామపై ‘సుప్రీం’ అసహనం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టులను శాసించొద్దని, అలా అనుకోవడం ఎంత మాత్రం సరికాదని హితవు పలికింది. క్షేత్రస్థాయి కోర్టుల్లో ఏం జరుగుతున్నాయో తమకు తెలియదని, అందువల్ల నిర్దిష్టంగా ఇలాగే విచారణ జరపాలంటూ నియంత్రించజాలమని తేల్చి చెప్పింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసుల్లో అన్ని విషయాలను సంబంధిత ట్రయల్ కోర్టే చూసుకుంటుందని తెలిపింది. రాజకీయ నేతల కేసుల్లో ఎలా వ్యవహరించాలో ఆదేశాల రూపంలో దేశవ్యాప్తంగా దిగువ కోర్టులకు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పామని గుర్తు చేసింది. సీబీఐకి కూడా చెప్పాల్సింది చెప్పామని పేర్కొంది. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ పిటిషన్.. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. జగన్ బెయిలు రద్దు చేసి విచారణను వేగవంతం చేసేలా కింది కోర్టును ఆదేశించాలని కూడా రఘురామ కోరారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్‌ఖన్నా , జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.విచారణ ముందుకు వెళ్లకుండా నిందితులు డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పదేళ్లుగా డిశ్చార్జి పిటిషన్ల వల్ల సమయం వృథా అవుతోందని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సీఐబీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు ఎక్కడ ఉన్నారని ఆరా తీసింది. ఆయన మరో కోర్టులో ఉండటంతో విచారణను మధ్యాహా్ననికి వాయిదా వేసింది.రఘురామపై కూడా సీబీఐ కేసులున్నాయి.. మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభం కాగానే రఘురామ తరపు న్యాయవాది మరోసారి డిశ్చార్జి పిటిషన్ల గురించి ప్రస్తావించడంతో ‘‘డోన్ట్ డిక్టేట్ అజ్’’ అంటూ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో ట్రయల్ కోర్టులో ఏం జరుగుతుందో తమకు తెలియదని, అన్ని విషయాలను ఆ కోర్టే తేలుస్తుందని తేల్చి చెప్పింది. 100 నుంచి 200 వరకూ రాజకీయ నేతలపై కేసులు ఉన్నాయని, వాటన్నింటినీ తాము నియంత్రించగలమా? అని ప్రశి్నంచింది.ఈ సమయంలో వైఎస్ జగన్ తరఫు సీనియర్ న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషనర్ రఘురామకృష్ణరాజుపై కూడా సీబీఐ కేసులు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆయనపై రూ.800 కోట్ల వరకూ బ్యాంకులను మోసం చేసిన కేసులు ఉన్నాయని తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ తరఫు న్యాయవాది రాజు అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను నవంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే వారంలో చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
రఘురామపై సుప్రీంకోర్టు సీరియస్
సాక్షి, ఢిల్లీ: ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును డిక్టేట్ చేయవద్దని జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం రఘురామపై సీరియస్ అయ్యింది.వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులను వేగంగా విచారించాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టులను తాము కంట్రోల్ చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులపై కేసులను వేగవంతంగా విచారించాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు అవుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే సమయంలో డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు అవుతున్నాయో, వాటి వివరాలు ఏవీ తమకు తెలియదని వ్యాఖ్యానించింది. అలాగే, అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించేందుకు ట్రయల్ కోర్టులు ఉన్నాయి. ప్రతీ దాన్ని మేము కంట్రోల్ చేయాలంటే వందల కేసులు ఉంటాయని తెలిపింది. కోర్టును డిక్టేట్ చేయవద్దని రఘురామపై సీరియస్ అయ్యింది.విచారణ సందర్భంగా రఘురామపైనే సీబీఐ కేసులు ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ జనరల్ నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామ ముద్దాయి అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కేసుల విచారణను ట్రయల్ కోర్టులే చూసుకుంటాయని జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను నవంబర్‌కు వాయిదా వేసింది. -
రఘురామపై మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అక్రమ కేసుల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులపై, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్త తనను షాక్‌కు గురిచేసిందని అన్నారాయన. ఈ క్రమంలో రఘురామ వ్యవహారశైలిపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్ జగన్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్నిఆర్ఎస్సీ తన ట్వీట్లో తప్పుబట్టారు. ఈ అంశాన్ని అప్పట్లోనే కోర్టులు విచారించాయని.. అయితే అందులో ఏమీ బయటకు రాలేదని అభిప్రాయపడ్డారు. అధికారం మారడం తప్ప మూడేళ్లలో ఏం మారిందని.. మూడేళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. .. దురదృష్టవశాత్తూ నిజాయితీగల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాల్లో బాధితులుగా మారుతున్నారన్న ఆర్ఎస్పీ.. గోద్రా మారణహోమంలో సత్యం, న్యాయానికి అండగా నిలిచినందుకు గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు రఘురామకృష్ణరాజుపైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. అబద్ధాలడడం అలవాటుగా ఉన్న ఇదే రాజకీయ నాయకుడు(రఘురామను ఉద్దేశిస్తూ..).. 2021లో పార్లమెంటులో నాపై నిరాధార ఆరోపణలు చేశారు. పైగా పేదలకు విద్య అందించే విషయంలోనూ ఈ వ్యక్తి ఏనాడూ సానుకూలంగా లేడు. అలాంటిది ఆయన ఎలా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనేదీ ఆశ్చర్యంగా ఉంది అని ఆర్ఎస్పీ ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర చోట్ల సీనియర్ పోలీస్ అధికారులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను సైతం ట్యాగ్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.Shocked to hear the news of FIR on senior IPS officers(DGP rank) of AP Cadre Mr PV Sunil Kumar and Mr PSR Anjaneyulu along with former CM of AP, @ysjagan. This matter pertained to the alleged custodial torture of former MP of YSRCP, RaghuRamaKrishnam Raju @ RRR in in AP in 2021.…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 13, 2024 -
బాబు మెయిన్ టార్గెట్ ఇదే.. షర్మిలకు నా సూటి ప్రశ్న..
-
జగన్‌పై ద్వేషంతోనే ఈ తప్పుడు కేసు: పొన్నవోలు
గుంటూరు,సాక్షి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక ప్లాన్ ప్రకారమే తప్పుడు కేసు నమోదు చేశారని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ మండిపడ్డారు. రఘురామ రాజు ఆరోపణలపై, కేసును పోలీసులు స్వీకరించిన పరిణామాలపై పొన్నవోలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.‘‘మాజీ సీఎం వైఎస్ జగన్ తోపాటు మరికొందరు అధికారులపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. కేవలం దురుద్దేశంతో, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారు. వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామ కృష్ణంరాజు ఈ పని చేశారు. అరెస్ట్ చేశాక తనని కస్టడీలో వేధించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. కానీ, అయన్ని అరెస్టు చేసిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు. తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామ మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో కేసులో ఏకంగా మాజీ సీఎం జగన్ పేరు రాశారు. కేవలం జగన్ పై రఘరామ ద్వేషం పెంచుకుని మూడేళ్ల తర్వాత ఈ కేసు పెట్టారు. అధికారులు పీవీ సునీల్, సీతారాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదు?. .. డాక్టర్లు కూడా రఘురామ ఒంటిపై కొట్డిన గాయాలు లేవని చెప్పారు. అయినాసరే అత్యంత దారుణంగా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు. రఘురామ జూన్ 11వ తేదీన ఫిర్యాదు చేస్తే.. 10వ తేదీనే పోలీసులు ఎలా లీగల్ ఒపీనియన్ కి రాశారు?. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయటానికి చేసిన కుట్ర అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి? అని పొన్నవోలు అన్నారు. పైగా.. ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యాన్నే చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని, మరి మూడేళ్ల తర్వాత రఘురామ కేసులో జగన్, ఇతర అధికారులపై ఎలా కేసు నమోదు చేస్తారు? అని పొన్నవోలు నిలదీశారు. రాష్ట్రంలో అత్యంత దారుణంగా హత్యలు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయని పరిస్థితి చూస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారాయన.ఎవర్నో ఇబ్బందులు పెట్టాలన్న కక్ష్యతోనే ఇలాంటి తప్పుడు కేసు పెట్టారని, ఇలాంటి తప్పుడు ఒరవడినే అవలంభిస్తే రాబోయే రోజుల్లో కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని అన్నారాయన. ‘‘రెడ్ బుక్ రాసుకుని అధికారాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడవద్దు. అదే జరిగితే అధికారులు ఎవరూ సరిగా ఉద్యోగం చేయలేరు. కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు మానుకోవాలి అని పొన్నవోలు హితవు పలికారు. -
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
స్వస్థలం ఉండి నియోజకవర్గమైనా.. ఉండేది మాత్రం రాజధానుల్లోనే.. సంక్రాంతి కోడిపందాల సమయంలో హడావుడి తప్ప మిగిలిన రోజుల్లో నియోజకవర్గానికి వచ్చింది అరుదే.. రచ్చబండంటూ.. అందలమెక్కించిన వారిపై నోరుపారేసుకోవడం తప్ప ఎంపీగా తనను గెలిపించిన ప్రజల వైపు కన్నెత్తి చూసింది లేదు.. ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు.. ఆయనే మాజీ ఎంపీ, టీడీపీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో తన బిల్డప్ పాచికలు పారకపోవడంతో ఉండిలో టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్నారు. సాక్షి, భీమవరం: బ్యాంకు అప్పులకు సంబంధించిన వ్యవహారాలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్ చేసుకునేందుకు ఎంపీ సీటుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు రఘు రామకృష్ణరాజు. తానే నరసాపురం కూటమి అభ్యర్థినంటూ తాడేపల్లిగూడెం జెండా సభలో స్వయంగా ప్రకటించేసుకున్నారు. ఇంతకన్నా భారీ సభ ఏర్పాటు చేస్తానంటూ బిల్డప్‌లూ ఇచ్చారు. అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. కేంద్రంలో ఆయన పలుకుబడి ఏ పాటిదో సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయింది. బీజేపీ సీటు మరొకరికి ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు. మరికొద్ది రోజుల్లో మంచి మాట వింటారంటూ మీడియా ముందు బిల్డప్‌లు ఇస్తూ ఎన్ని పైరవీలు చేసినా, జిల్లాలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరితో సంప్రదింపులు చేయించినా బీజేపీ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఏదో క చోట నుంచి పోటీ చేయకపోతే తన బిల్డప్‌లు పనిచేయవనుకున్నారేమో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీటుకు ఎసరుపెట్టి ఉండి అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు. గెలుపు కోసం ఆపసోపాలు గత ఎన్నికల ప్రచారంలో తప్ప స్వతహాగా రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య తిరిగింది ఏమీలేదు. నియోజకవర్గానికి వచ్చినా సొంత సామాజికవర్గంలోని కొందరితో తప్ప మిగిలిన సామాజిక వర్గాల వారిని పట్టించుకున్నది లేదు. నిత్యం తన సొంత వ్య వహారాల్లో తలమునకలై ఉండే ఆయనకు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి కష్టాలు, మౌలిక పరమైన అవసరాల గురించి అవగాహన ఏ మేరకు ఉందనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్యగా తయారైందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎల్లప్పుడూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి అహరి్నశలు పాటుపడిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, మరోపక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిగి, ప్రస్తుతం టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అధికారపక్ష అభ్యర్థి పీవీఎల్‌కు లాభించే అంశం కావడంతో పాటు ఇప్పటికే ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు. దళితులు, క్రైస్తవులపై చిన్నచూపు దళితులు, క్రైస్తవులు టీడీపీకి ఓట్లే వేయరన్న భావనలో రఘురామకృష్ణరాజు వారిని చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదంటున్నారు. ఎప్పు డూ ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరని, సామాన్యులకు అపాయింట్మెంట్ దొరకడం కష్టమేనంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం రఘురామను ఇరకాటంలో పడేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారానికి పెద్దగా స్పందన లేకపోవడం, రోజురోజుకూ విజయావకాశాలు సన్నగిల్లుతుండటంతో నిరాశకు లోనై చిన్నపాటి విషయాలకు కేడర్‌పై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం. అసమ్మతి సెగలు టీడీపీకి చెందిన కొందరు నేతలు పార్టీని వీడి రెబల్‌గా పోటీలో ఉన్న శివరామరాజు వెంట వెళ్లిపో గా మిగిలిన వారిలో అధిక శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వర్గమే. సీటు మార్చొద్దంటూ రామరాజుకు మద్దతుగా ఆందోళన చేసిన టీడీపీ నాయకులను బెట్టింగ్రాయుళ్లని రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీలో అంతర్గతంగా అసమ్మతి జ్వాలలు రగిలిస్తూనే ఉంది. పైకి రామరాజుతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నా సిట్టింగ్ సీటును లాక్కోవడంపై ఆయన వర్గం ఎంత వరకు తనకు సహకరిస్తారనే అనుమానం రఘురామను వెంటాడుతోందంటున్నారు. జనసేన కేడర్‌పైనే ఆయన నమ్మకం పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాపులను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపు యువకులపై కేసులు పెట్టి స్టేషన్లో పెట్టించిన సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘మీరు కాపు కాసేవారు మీ పని మీరు చేసుకోండి.. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరంటూ’ ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన కేడర్ అన్నీ మర్చిపోయి ఆయనకు ఎంతవరకు కలిసివస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రఘురామ కేసులో స్టే ఎత్తేయండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఇండ్–భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్ బ్యాంకులను మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై దర్యాప్తు కొనసాగించడానికి వీలుగా స్టే ఎత్తేయాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. ఆర్బీఐ సర్క్యులర్‌కు సంబంధించి క్రిమినల్ చర్యల్లో ఎఫ్ఐఆర్ కొనసాగుతోందన్నారు. దీనికి సంబంధించి తీర్పు ఉందని తెలిపారు. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగకుండా సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు. దర్యాప్తు కొనసాగించడానికి వీలుగా స్టే ఎత్తేయాలని అభ్యర్థించారు. రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా కేసును కొద్దిసేపు వాయిదా వేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని కేసును వాయిదా వేసింది. రూ.వందల కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఇండ్–భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్, రఘురామకృష్ణరాజు మరో 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏర్పాటు చేస్తామన్న కంపెనీని నెలకొల్పకుండా.. ఇతర బ్యాంకుల్లో ఆ సొమ్ములు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వాటిపై మళ్లీ రుణం తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. రంగంలోకి దిగిన ఈడీ మరోవైపు ఇండ్ – భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. తన సంస్థ కోసమని రఘురామ 2011లో మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ.202 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే రూ.200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) దృష్టిలో పడింది. దీంతో విషయాన్ని లోతుగా పరిశీలించిన ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీ ఇండ్ –భారత్ సన్ ఎనర్జీకి రూ.202 కోట్లు అందినట్లు గుర్తించారు. అలాగే మరుసటి రోజే ఇండ్ –భారత్ ఎనర్జీ లిమిటెడ్‌కు ఈ మొత్తం బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు. రఘురామరాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రూ.40 కోట్లు జరిమానా కూడా విధించింది. ఎన్సీఎల్టీని ఆశ్రయించిన బ్యాంకులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం దివాలా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించింది. ఇండ్–భారత్ థర్మల్ రూ.1,383 కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా, చాలాకాలంగా బకాయిలు చెల్లించడం లేదని బ్యాంకుల కన్సార్టియం ఫిర్యాదు చేసింది. రఘురామ కంపెనీ తనఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం రూ.872 కోట్లే ఉండటంతో ఈ కంపెనీ దివాలా తీసినట్లుగా భావిస్తూ దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కోరింది. దీంతో బ్యాంకుల వాదనతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియకు అనుమతించింది. బ్యాంకులను నిండా ముంచిన రఘురామకృష్ణరాజు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని వాటిని నిండా ముంచిన రఘురామకృష్ణరాజుపై దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. గతంలో సీబీఐ దర్యాప్తును ఆపాలంటూ ఆయన తెచ్చుకున్న స్టేను ఎత్తివేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరోసారి రఘురామ మోసాలు చర్చనీయాంశంగా మారాయి. ఇండ్– భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో ఆయన వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్ల రుణాలను తీసుకున్నారు. ఈ మొత్తాలను కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తన వారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకులను నిండా ముంచారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ ఆ బ్యాంకు సీబీఐని ఆశ్రయించడంతో రఘురామ మోసాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవడం, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2020 అక్టోబర్‌లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించాయి. వీటిలో పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నాయి ఈ సందర్భంగా సంస్థకు చైర్మన్‌గా ఉన్న రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. -
కడప ఎంపీగా రఘురామ కృష్ణంరాజు పోటీ ?
-
సీఎం జగన్ పై రఘురామ రాజు ప్రకటన దేవులపల్లి అమర్ కౌంటర్
-
అమాయకుడేమి కాదు..రఘురామకు హైకోర్టు చురకలు
-
రఘురామ అమాయకుడేమీ కాదు..
సాక్షి, అమరావతి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆయన తన వ్యక్తిగత కక్షతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. అంతేకాక.. తన గురించి అనేక వాస్తవాలను తొక్కిపెట్టి ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యం రిట్, పిల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. తనపై కేసుల గురించి కనీస స్థాయిలో కూడా ఆయన ప్రసా్తవించలేదన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదు గురించి, జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందున్న కోర్టు ధిక్కార ప్రోసీడింగ్స్‌ను కూడా తన వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. పైపెచ్చు తనపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేవంటూ డిక్లరేషన్ కూడా ఇచ్చారని ఏజీ శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అసలు రఘురామ చట్ట నిబంధనల గురించి తెలియని అమాయకుడేమీ కాదన్నారు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయన బాగా తెలుసన్నారు. అలాగే, కోర్టుల్లో జరిగే కేసుల విచారణలపై వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకు తెలుసునని తెలిపారు. పైగా ఆయన పార్లమెంట్ సభ్యుడని, అలాంటి వ్యక్తికి చట్ట నిబంధనల గురించి తెలియకపోవడానికి ఏముంటుందని శ్రీరామ్ చెప్పారు. అన్నీ తెలిసే ఆయన ఉద్దేశపూర్వకంగా తనకు సంబంధించిన కీలక విషయాలను పిటిషన్లో బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారని కోర్టుకు వివరించారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారం చేయడాన్నే రఘురామకృష్ణరాజు పనిగా పెట్టుకున్నారన్నారు. కోర్టులు ఒకవైపు కేసులను విచారిస్తుంటే మరోపక్క ఆయన మీడియా ముందు ఆ కేసుల గురించి మాట్లాడటమే కాక, వ్యక్తులపై విషం చిమ్ముతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారని ఏజీ వివరించారు. ఆయన పలు మీడియా ఛానెళ్లతో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ పెద్దల గురించి మాట్లాడిన మాటల తాలూకు వీడియోలను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. ఆ వీడియాలను తమ కౌంటర్‌తోపాటు జతచేశామని తెలిపారు. వాటిల్లో మాట్లాడిన మాటలను యథాతథంగా కౌంటర్లో పొందుపరిచామన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. ఈ వీడియోలను తాము ఇంటి వద్ద చూస్తామని, కౌంటర్లో రాసిన అంశాలను చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సంక్షేమ పథకాల నిర్ణయాలపై పిల్.. రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతోపాటు వాటివల్ల పలువురికి లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రఘురామ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని విచారణార్హతపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం లేవనెత్తింది. దీంతో ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులందరినీ ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేశారు. తాజాగా.. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. రఘురామ దురుద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని, ఇలాంటి వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. అడ్వొకేట్ జనరల్‌గా తాను కోర్టులకు సహకరిస్తుంటానని, తాను మొదట కోర్టు ఆఫీసర్నని, తనపై కూడా ఆయన నిందారోపణలు చేశారని తెలిపారు. ఆ వీడియోలనూ పరిశీలించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. విచారణార్హతపై వాదనలకే పరిమితం కావాలి అంతకుముందు.. రఘురామ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు నాయకులంటే ఎలా ఉండాలో వివరించడం మొదలుపెట్టారు. ధర్మాసనం ఆయన్ను వారిస్తూ, కేసు గురించి వాదనలు చెప్పాలని స్పష్టంచేసింది. దీంతో సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందుకే తాము ఈ పిల్ దాఖలు చేశామన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. -
రఘురామకృష్ణరాజు పిల్‌పై విచారణ 23కి వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతో పాటు వాటి వల్ల పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులు 41 మందిలో నోటీసులు అందుకున్న వారందరూ ఈ పిల్ విచారణార్హతపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణార్హతపై కౌంటర్లు దాఖలు చేసిన తరువాత వాటిని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఉన్నం శ్రవణ్‌కుమార్‌కు అందజేయాలని ప్రతివాదుల తరఫు న్యాయవాదులను ఆదేశించింది. కౌంటర్లు అందుకున్న తరువాత వాటికి సమాధానం (రిప్లై) దాఖలు చేయాలని శ్రవణ్ కుమార్‌ను ఆదేశించింది. ఈ నెల 23న పిల్ విచారణార్హతపై వాదనలు వింటామంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసుల జారీపై ఆరా తీసిన ధర్మాసనం.. అంతకుముందు ఈ పిల్ విచారణకు రాగానే, గతంలో తాము ప్రతివాదులకు జారీ చేసిన నోటీసులు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదో ధర్మాసనం ఆరా తీసింది. కొందరికి ఈ–మెయిల్ ద్వారా నోటీసులు పంపామని రఘురామకృష్ణ తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు. ప్రతివాదులందరికీ నోటీసులు అంది, వారు కౌంటర్లు దాఖలు చేసిన తరువాతే పిల్ విచారణార్హతపై వాదనలు వింటామని గత విచారణ సమయంలో మీరు (ధర్మాసనం) చెప్పారని ఏజీ గుర్తు చేశారు. మిగిలిన అధికారిక ప్రతివాదులందరూ సీఎస్ కౌంటర్‌నే అన్వయింపచేసుకుంటారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) వేలూరి మహేశ్వరరెడ్డి తెలిపారు. దీంతో ధర్మాసనం నోటీసులు అందుకున్న అనధికారిక ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేయాలని, ఆ కాపీలను పిటిషనర్ న్యాయవాదికి అందచేయాలని ఆదేశించింది. -
విషం చిమ్మడమే పని.. వ్యక్తిగత వైరంతోనే రఘురామ పిల్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతో పాటు ఆ పథకాలవల్ల పలువురికి లబ్దిచేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న వారిలో నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా, ఈ–మెయిల్ ద్వారా నోటీసులు అందజేసేందుకు పిటిషనర్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ పిల్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి దాఖలు చేసిన కౌంటర్‌కు తదుపరి విచారణ నాటికి బదులివ్వాలని రఘురామకృష్ణరాజును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు.. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ గురువారం మరోసారి విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ ఈ పిల్‌పై అభ్యంతరం తెలుపుతూ సీఎస్ ప్రాథమిక కౌంటర్ దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం.. ధర్మాసనం ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న 41 మందిలో ఎంతమందికి నోటీసులు అందాయి? ఎంతమందికి నోటీసులు అందలేదన్న విషయం గురించి ఆరాతీసి నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు పిటిషనర్‌కు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సీఎం, ప్రభుత్వంపై రోజూ విషం.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని సీఎస్ తన ప్రాథమిక కౌంటర్లో హైకోర్టుకు నివేదించారు. ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ పిల్ దాఖలు చేయలేదని రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో పేర్కొన్నప్పటికీ ఆయన ప్రతీరోజూ వ్యక్తిగత వైరంతోనే మీడియా ముందు సీఎంతో పాటు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని సీఎస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి ముఖ్యమంత్రిపై రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా ఛానెళ్లలో మాట్లాడిన మాటలను జవహర్‌రెడ్డి తన అఫిడవిట్లో పొందుపరిచారు. కోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనలను కూడా తప్పుపట్టారన్నారు. వీటిని పరిశీలించి ముఖ్యమంత్రి, ప్రభుత్వంపట్ల పిటిషనర్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని జవహర్‌రెడ్డి తన అఫిడవిట్లో కోర్టును కోరారు. మీడియాలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి ప్రచారం కోసమే ఆయన ఈ పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మీడియాతో మాట్లాడే సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్యపదజాలం వాడారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి శరీరాకృతి గురించి.. మంత్రులు, కార్యదర్శులు, ఇతర అధికారులు, అదనపు అడ్వొకేట్ జనరల్ గురించి ఆయన మాట్లాడిన మాటలన్నీ ప్రజాబాహుళ్యంలో ఉన్నాయన్నారు. నిజానికి.. బ్యాంకును మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసిందని సీఎస్ అందులో గుర్తుచేశారు. ఇక పిటిషనర్ దాఖలు చేసిన పిల్ అసలు హైకోర్టు నిబంధనలకు అనుగుణంగాలేదని, అందువల్ల ఇది పిల్ నిర్వచన పరిధిలోకి రాదన్నారు. వ్యక్తిగత వైరంతోనే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని వివరించారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక రఘురామకృష్ణరాజు ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు. -
ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్మడమే రఘురామ ధ్యేయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదిస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. సంక్షేమ పథకాల్లో అక్రమాలు జరిగాయని, పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్, ఎంపీ వి.విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేయడంపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. దురుద్దేశాలతోనే వీరందరినీ వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారని నివేదించారు. ప్రభుత్వంపై, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై రఘురామ విషం చిమ్మడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. వ్యక్తిగత కక్షతోనే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను తప్పుబడుతూ వ్యాజ్యం దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్న రఘురామ అందులో సంబంధం లేని వారిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన తరువాత సీఎంను వదిలేదిలేదంటూ మీడియా సమావేశాలు నిర్వహించి ప్రకటనలు చేశారని నివేదించారు. అందుకు అనుమతించొద్దు ప్రజా ప్రయోజనం పేరుతో వ్యాజ్యం దాఖలు చేసిన రఘురామ వాస్తవాలను కోర్టు ముందు ఉంచలేదని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను పిల్లో పేర్కొన్నట్లు డిక్లరేషన్ ఇచ్చిన రఘురామ వాస్తవానికి పలు కీలక విషయాలను తొక్కిపెట్టారన్నారు. ఆయన చైర్మన్, ఎండీగా వ్యవహరించిన కంపెనీ పలు రుణ సంస్థలకు రూ.700 కోట్లకు పైగా రుణాలను ఎగవేసిందన్నారు. పిటిషనర్ సీబీఐ కేసు కూడా ఎదుర్కొంటున్నారని శ్రీరామ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వివరాలను ఆయన వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో రఘురామపై నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు అందిన విషయాన్ని కూడా దాచి పెట్టారని తెలిపారు. వ్యక్తిగత, రాజకీయ అజెండాతో.. వ్యక్తిగత, రాజకీయ అజెండాతో రఘురామ ముందుకెళుతున్నారని, అందుకు ఈ వ్యాజ్యమే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై విషం చిమ్మేందుకు కోర్టులను వేదికగా చేసుకుంటున్నారని తెలిపారు. ఇందుకు ఎంత మాత్రం అనుమతించొద్దని కోర్టును ఏజీ అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం విచారణార్హతపై తమకు అభ్యంతరం ఉందన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే ముందు రఘురామకృష్ణరాజు దురుద్దేశాలను, ఆయనకెంత విశ్వసనీయత ఉందో పరిశీలించాలని కోరారు. ముందు దీన్ని తేల్చిన తరువాతే ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను చేపట్టాలన్నారు. పిల్ నిబంధనల ప్రకారం ప్రతివాదుల జాబితా నుంచి ఎవరినైనా తొలగించే అధికారం ధర్మాసనానికి ఉందన్నారు. ఆ విచక్షణాధికారాన్ని ఇప్పుడు వినియోగించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న వారిని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించవచ్చన్నారు. అంతేకాక వారికి నోటీసులు కూడా అవసరం లేదన్నారు. ముందు విచారణార్హతపై తేలుస్తాం.. వాదనలు విన్న హైకోర్టు తొలుత రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఈ వ్యాజ్యం విచారణార్హతపై తేలుస్తామని స్పష్టం చేసింది. ఆ తరువాతే తదుపరి ప్రక్రియ చేపడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులందరూ విచారణార్హతపై అభ్యంతరాలు తెలియచేయాలని, అందువల్ల వారందరికీ నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. రేపు ఎవరూ తమకు వాదనలు వినిపించే అవకాశం రాలేదని అనకూడదని పేర్కొంది. న్యాయ ప్రయోజనాల నిమిత్తం అందరికీ నోటీసులు జారీ చేస్తున్నామంది. నోటీసులు జారీ చేయడం అందరికీ మంచిదని హైకోర్టు స్పష్టం చేసింది. పలువురికి నోటీసులు జారీ... ఈమేరకు వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలు కంపెనీలకు, డైరెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, గనులు, పరిశ్రమలు, సమాచార పౌర సంబంధాలు, వైద్య, ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు సైతం నోటీసులు జారీ చేసింది. మొత్తం 41 మందికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు వారందరినీ రఘురామకృష్ణరాజు వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరాలను తెలియచేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు.. మధ్యంతర ఉత్తర్వుల కోసం తాము అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, దాన్ని అనుమతించాలని రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు కోరారు. ఇసుక, మద్యం పాలసీలకు సంబంధించిన రికార్డులను జాగ్రత్త చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఆ పాలసీలకు సంబంధించిన రికార్డులను ధ్వంసం చేస్తున్నారని, వాటిని సీజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ ప్రభుత్వ హయాంలో కోర్టులో రికార్డులను మాయం చేసిన ఘటన కూడా చోటు చేసుకుందని వ్యాఖ్యలు చేయడంపై అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోర్టులో రికార్డులు మాయం అయిన ఘటనను ప్రభుత్వానికి ఆపాదించడం తగదన్నారు. ఇలా ఏదిపడితే అది మాట్లాడితే తాము కూడా అదే విధంగా మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రతివాదులకు తాము వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు అనుమతినివ్వాలని మురళీధరరావు కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు రిజిస్ట్రీనే నోటీసులు పంపుతుందని తేల్చి చెప్పింది. -
అదొక పార్టీ..వాడొక నాయకుడు: స్పీకర్ తమ్మినేని సీతారాం
-
పొన్నవోలుపై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే.. డోలు కడతాం
-
రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంలో భంగపాటు
సాక్షి, ఢిల్లీ: ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ రుణాలు కేసులో.. నర్సాపురం(ఆంధ్రప్రదేశ్) పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు శుక్రవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ రుణాలు కేసులో గతంలో ఆయనకు ప్రతికూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పైగా కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందడం సవాల్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ అప్పట్లోనే ఆయనకు చివాట్లు పెట్టింది కూడా. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే.. తీర్పు వెలువడి ఎనిమిది నెలలు పూర్తి కావడంతో.. ఆలస్యం కారణంగా జోక్యం చేసుకోదల్చుకోలేమని పేర్కొంటూ ఆయన వేసిన పిటిషన్‌ను ఇప్పుడు డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు. ఇదీ చదవండి: సంక్షేమ పథంలో సాహసోపేతమైన అడుగులు -
రఘురామ కృష్ణంరాజు చెప్పేవన్నీ అబద్దాలే మహానాడులో ఎన్టీఆర్ ను కబ్జా చేశారు
-
తనపై రెండు కేసులు కొట్టేయాలంటూ రఘురామకృష్ణరాజు పిటిషన్లు
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో తనపై నమోదైన రెండు కేసులను కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాలను పరిశీలించిన న్యాయమూర్తి.. విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పిటిషనర్ న్యాయవాది ఉమేష్‌చంద్ర చెప్పారు. దీంతో ఈ వ్యాజ్యాలను మరో న్యాయమూర్తి ముందుంచేందుకు ఫైళ్లను సీజే ముందుంచాలని జస్టిస్ శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రీని ఆదేశించారు.. -
AP: వాటిని బహిర్గతం చేయాలా?వద్దా? తేలుస్తాం: హైకోర్టు
సాక్షి, అమరావతి: పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరాలను బహిర్గతం చేయాలా? వద్దా? అన్న అంశంపై లోతుగా విచారించి తేలుస్తామని హైకోర్టు తెలిపింది. అలా కేసులు నమోదు చేయకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టు స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు హోంశాఖ న్యాయవాది వి. మహేశ్వరరెడ్డి గడువు కోరడంతో హైకోర్టు తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్లలో తనపై నమోదైన కేసుల వివరాలు, వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు కేసులు నమోదు చేయని ఫిర్యాదుల వివరాలను తనకు అందజేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ రాయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. రఘురామరాజు తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్ వాదనలు వినిపిస్తూ, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసి వాటిలో పిటిషనర్‌ను అరెస్టుచేసే అవకాశం ఉందన్నారు. పిటిషనర్ విషయంలో పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆ ఫిర్యాదుల వివరాలను వెల్లడించలేదన్నారు. ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇది ఊహాజనితమైనదన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గడువునిస్తూ విచారణను పది రోజులకు వాయిదా వేశారు. -
ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు.. హాజరుకాకుంటే అరెస్ట్ తప్పదు
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు(మంగళవారం) సిట్ ముందు హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10:30కి కమాండ్ కంట్రోల్ సెంటర్ కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొంటూ సిట్ ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆర్థిక మూలాలపై సిట్ విచారణ ముమ్మరం చేసింది. నిందితులతో రఘురామ కృష్ణరాజు ఫోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ1, ఏ2లతో ఎంపీ రఘురామకు దగ్గర సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. 41ఏ నోటీసులు అందుకున్న నలుగురిని సిట్ నిందితుల జాబితాలో చేర్చింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ చేస్తామని సిట్ పేర్కొంది. ఇప్పటికే సిట్ విచారణకు హాజరుకాని ఇద్దరిపై లుకౌట్ నోటీసులుజారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరుకానున్న ఎంపీ రఘురామకృష్ణరాజు సిట్ విచారణ కీలకం కానుంది. చదవండి: (ఎమ్మెల్యేలకు ఎర కేసు: నందుతో ఏం మాట్లాడారు?) -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్కడి ‘ఎమ్మెల్యేలకు ఎర’ వేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు జారీచేసింది. ఇప్పటికే అరెస్టయిన హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్ వ్యాపారి నందుకుమార్‌తో.. రఘురామకు సత్సంబంధాలు ఉన్నట్లుగా సిట్ గుర్తించడంతో ఆయనకు నోటీసులు అందజేసింది. నిందితుల సెల్ఫోన్లలో రఘురామకృష్ణరాజు దిగిన ఫొటోలు, ఇతర కీలక వివరాలు బయటపడడంతో ఎంపీని విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. దీంతో 41–ఏ సీఆర్పీసీ కింద గురువారం ఆయనకు నోటీసులు జారీచేశారు. ఈ నెల 29న ఉ.10:30 గంటలకు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని అందులో తెలిపారు. సహేతుక కారణం లేకుండా గైర్హాజరైతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టుచేస్తామని ఎంపీకి పంపిన ఈ–మెయిల్లో పేర్కొన్నారు. మరోవైపు.. ఎంపీకి ప్రత్యక్షంగా నోటీసులు అందించేందుకు సిట్ అధికారులు గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రఘురామ నివాసానికి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన సిట్ బృందం ఆయన నివాసంలో నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి రఘురామకు ముందే సమాచారం ఉందేమోనని, ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన నగదు సమకూర్చడంలో ఎంపీ పాత్ర ఉందేమోనని సిట్ అనుమానిస్తోంది. ఏడుకు చేరిన నిందితుల సంఖ్య ఈ కేసులో తాజాగా మరో నలుగురిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, కర్ణాటక బీడీజేఎస్ చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొన్నారు. అలాగే, ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గుస్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ అలాగే జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) ప్రతాపన్‌లు విచారణకు గైర్హాజరు కావటంతో తాజాగా 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేశారు. ఈసారి కూడా హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు.. జగ్గు ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. చదవండి: (వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..) -
ఎంపీ రఘురామకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దుకు హైకోర్టు నిరాకరించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. వైఎస్ జగన్ బెయిల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. అయితే సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. జగన్‌పై ఉన్న చార్జిషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, ఆయన బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం విచారణ చేపట్టారు. వైఎస్ జగన్ అధికార పదవిని దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఎలాంటి సాక్ష్యాలను పిటిషనర్ చూపలేదని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించిన ఒక్క సందర్భం కూడా లేదన్నారు. వాదనలు విన్న సీజే.. సీబీఐ న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ, బెయిల్ రద్దు చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించారు. రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ను కొట్టివేశారు. -
ఎంపీ రఘురామ ఓ బఫూన్
సాక్షి, రాజమహేంద్రవరం: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ బఫూన్ అని ఎంపీ మార్గాని భరత్‌రామ్ మండిపడ్డారు. పొద్దున లేచిన దగ్గర నుంచి మీడియా ముందు కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఆయన చేయగలిగిందేమీ లేదన్నారు. సొంత కేడర్ కూడా లేని ఆయనకు సీఎంను విమర్శించే స్థాయి లేదని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలోని ఎంపీ కార్యాలయంలో గురువారం ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో రెండు ఫ్లై ఓవర్లు మంజూరయ్యాయని.. ఈ విషయమైనా ఎంపీ రఘురామకు తెలుసా? అని ప్రశ్నించారు. జాతీయ మీడియా సర్వేలన్నీ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే విజయం దక్కుతుందని స్పష్టం చేస్తున్నాయన్నారు. దీంతో రఘురామ వాటిని తప్పుదోవ పట్టించేందుకు దొంగ సర్వేల నాటకం మొదలుపెట్టాడని దుయ్యబట్టారు. రఘురామ సొంత నియోజకవర్గానికి వెళ్తే ప్రజలే తరిమికొడతారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గతంలో ఏ సంక్రాంతికో తన సొంత నియోజకవర్గం కుప్పానికి వెళ్లేవారని ఎంపీ భరత్ గుర్తు చేశారు. ఇప్పుడు జగనన్న దెబ్బకు నెలకు మూడుసార్లు కుప్పం వెళ్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే నాటికి ప్రభుత్వ ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. 14 ఏళ్లు సీఎంగా వ్యవహరించిన బాబు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి వెళ్లడం ఏంటని నిలదీశారు. సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తే నానా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన పర్యటనతోనే పోలవరం ఇరిగేషన్ అథారిటీలో కదలిక వచ్చిందన్నారు. అలాగే మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక జాతీయ రహదారులు మంజూరయ్యాయన్నారు. -
ఎంపీ రఘురామ కుమారుడిపై బలవంతపు చర్యలొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కాని స్టేబుల్‌పై దాడి చేశారంటూ ఎంపీ రఘురామ కుమారుడు భరత్‌పై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు బలవంతపు చర్యలొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీ సులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయా లంటూ ఎంపీ రఘురామ, భరత్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఆగస్టు 12న ఇదే పిటిషన్ విచారించి కొట్టివేశామని, ఆర్డర్ ఇచ్చే సమయంలో మరికొన్ని ఆర్డర్లు కనిపించాయని ధర్మాసనం పేర్కొంది. అవి కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, అనంతరం సుప్రీంకోర్టు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సకు అను మతివ్వడానికి సంబంధించిన ఆర్డర్లని ఎంపీ రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు తెలిపారు. రెండూ ఒకే అంశా నికి చెందినవా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వేర్వేరు కేసులని న్యాయవాది స్పష్టం చేశారు. తర్వాత గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు పిటిషనర్లపై తదుపరి ఆదే శాలవరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ.. ధర్మాసనం హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. చదవండి: (సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి) -
రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ
Raghu Rama Krishna Raju.. సాక్షి, న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. తన సెక్యూరిటీ, తనయుడిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని వేసిన రఘురామ పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. శుక్రవారం డిస్మిస్ చేసింది. కాగా, ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి కేసులో రఘురామ.. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక, విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు లాయర్ అదనపు సమాచారం కోసం సమయం కోరారు. ఈ క్రమంలో ధర్మాసనం.. కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది కదా.. విచారణ కానివ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఇదిలా ఉండగా... రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో కూడా చుక్కెదురైన విషయం తెలిసిందే. గచ్చిబౌలి పీఎస్‌లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. అయితే, రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారన్న విషయంలో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణలో భాగంగా.. కోర్టులో పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్ అయ్యారని తెలిపారు. దీంతో, పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల -
చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది: భరత్
-
హైకోర్టులో రాఘురామకృష్ణరాజుకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఎంపీ రాఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గచ్చిబౌలి పీఎస్‌లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారన్న విషయంలో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, పిటిషన్‌పై విచారణలో భాగంగా.. కోర్టులో పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు.. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్ అయ్యారని తెలిపారు. దీంతో, పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: గుట్కా దందా.. తమ్ముళ్ల పంథా -
Raghurama Krishnam Raju: ఎంపీ రఘురామపై క్రిమినల్ కేసు
సాక్షి, అమరావతి/గచ్చిబౌలి (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రత విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాను కిడ్నాప్ చేసి, తీవ్రంగా హింసించిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్‌పై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా (ఎ1గా) ఎంపీ రఘురామకృష్ణరాజు, ఏ 2గా ఆయన కుమారుడు భరత్, ఏ 3 గా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎన్.సందీప్ సాధు, ఏ 4 గా సీఆర్పీఎఫ్ ఏఎస్సై కె. గంగారామ్, ఏ 5గా ఎంపీ పీఏ శాస్త్రి, మరికొందరిపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 365, 332, 384, 323, 324, 342, 504, 506, 294(బి) రెడ్ విత్ 34, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ షేక్ ఫరూక్ బాషా విధులకు ఆటంకం కలిగించడం, కిడ్నాప్ చేసి నిర్బంధించడం, దాడి చేసి బెదిరించడం వంటి ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు. ఇందులో రఘురామ వద్ద భద్రత విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందినీ నిందితులుగా చేర్చారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ఆందోళనలు చేసేందుకు కొన్ని పార్టీలు, సంఘాలు నిర్ణయించాయని ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఏపీ నుంచి కూడా కొందరు హైదరాబాద్ వెళ్లినట్టు గుర్తించారు. దాంతో భద్రత ఏర్పాట్లలో భాగంగా ఇంటెలిజెన్స్ అధికారులు తమ సిబ్బందిని హైదరాబాద్ పంపించారు. అందులో భాగంగా సోమవారం ఐఎస్బీ గేటు వద్ద స్పాటర్‌గా నియమించారు. అనుమానిత వ్యక్తులు, వారి కదలికల్ని గుర్తించడం ఇతడి విధి. విధి నిర్వహణలో ఉన్న ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామ కుటుంబసభ్యులు, ఆయన భద్రతకు నియమితులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కొందరు దాడిచేశారు. నడిరోడ్డుపైనే దాడి చేయ డం, సెల్‌ఫోన్, పర్సు, ఐడీ కార్డు లాక్కోవడం, కారులో కిడ్నాప్ చేయడం తదితరాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ సమయంలో అక్కడున్నవారు కూడా ఈ దృశ్యాల ను సెల్ఫోన్లలో రికార్డు చేశారు. ఫరూక్ తమపై నిఘాకు వచ్చినట్లుగా ఎంపీ వర్గీయులు ఆరోపిస్తు న్నారు. అది అవాస్తవమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఫరూక్ విధులు నిర్వర్తిస్తున్న ఐఎస్బీ గేట్ ప్రాంతానికి, ఎంపీ రఘురామ ఇంటికి సంబం ధం లేదు. రఘురామ ఇల్లు అక్కడికి 1.3 కిలోమీ టర్ల దూరంలోని బౌల్డర్ హిల్స్‌లో ఉంది. ఫరూక్‌ను నడిరోడ్డుపై కొట్టుకుంటూ బౌల్డర్ హిల్స్‌లోని ఎంపీ విల్లా ఎ–74కు తీసుకువెళ్లారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఎంపీ ఇంట్లో చిత్ర హింసలకు గురిచేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్ కూడా ఫరూక్‌పై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముందుగా భరత్, శాస్త్రి, సీఆర్పీఎఫ్ ఏఎస్సై కె.గంగారామ్, కానిస్టేబుల్ సందీప్‌తోపాటు మరికొందరు సీఆర్పీఎఫ్ సిబ్బం ది ఫరూక్‌పై దాడిచేశారు. సీఆర్పీఎఫ్ ఏఎస్సై, కానిస్టేబుల్ సందీప్ ఆయన కాళ్లు, చేతులపై లాఠీలతో కొట్టారు. భరత్, శాస్త్రి కానిస్టేబుల్ ఫరూక్ మెడ, కడుపుపై పిడిగుద్దులు కురిపించారు. కాళ్లూ చేతులు విరగ్గొట్టండి.. షాక్ ఇవ్వండి అంతవరకు ఇంటి లోపల ఉన్న ఎంపీ రఘురామరాజు బయటకు వచ్చి ఫరూక్‌ను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నీ కాళ్లు చేతులు విరగ్గొట్టిస్తా’ అంటూ బూతులు తిడుతూ విరుచుకుపడ్డా రు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్ వద్ద ఫైబర్ లాఠీ తీసుకుని స్వయంగా ఫరూక్ బాషాపై దాడి చేశారు. జుట్టుపట్టుకుని గోడకేసి తోసివేశారు. అ నంతరం భరత్, శాస్త్రి, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్‌లను ఉద్దేశిస్తూ ‘నేను ఢిల్లీ వెళ్తున్నా. వీడికి కరెంట్‌షాక్ ఇవ్వండి’ అని చెప్పారు. ఐడీ కార్డు, ప ర్స్, బంగారు ఉంగరం తీసుకోండి అని చెప్పారు. సీఆర్పీఎఫ్ ఏఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్ విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్‌పై దాడిని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దాడిలో పాల్గొన్న సీఆర్పీఎఫ్ ఏఎస్సై కె.గంగారామ్, కానిస్టేబుల్ ఎన్.సందీప్ సాధును సస్పెండ్ చేస్తూ సీఆర్పీఎఫ్ కమాండెంట్ మహేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లపై కూడా ఉన్నతాధికారులు విచారి స్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇంకా ఎందరు నిందితులున్నారో తెలియాల్సి ఉంద ని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. -
Raghu Rama Krishna Raju: కానిస్టేబుల్‌పై రఘురామ కుటుంబం దాడి
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, కిడ్నాప్ చేశారు. కొందరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లతో వచ్చి నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. అతని ఐడీ కార్డు లాక్కొని, ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటలకు పైగా చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్లోనే ఉండటం గమనార్హం. తనపై దాడికి పాల్పడిన రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు, కొందరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లపై ఫరూక్ బాషా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రధాని మోదీ ఏపీ, తెలంగాణ పర్యటన సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) మార్గదర్శకాల ప్రకారం రెండు రాష్ట్రాల పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో ప్రధానికి నిరసన తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని సంఘాలు వచ్చినట్లు సమాచారం అందింది. చదవండి: (Somu Veerraju: ప్రధాని పర్యటనలో భారీ కుట్ర) విజయవాడ, భీమవరంలలో కూడా ఆందోళనలకు కొందరు సిద్ధమవుతున్నట్టు గుర్తించారు. దాంతో ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన సంఘాల ప్రతినిధులు, ఆందోళనకారులు, అనుమానితుల కదలికలను గుర్తించేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కొందరు కానిస్టేబుళ్లను హైదరాబాద్‌లో స్పాటర్స్‌గా నియమించింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం ఇది అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు అనుసరించే విధానమే. ఆ విధంగా ఏపీ అధికారులు అనంతపురానికి చెందిన కానిస్టేబుల్ ఫరూక్ బాషాను హైదరాబాద్‌లోని ఐఎస్బీ గేటు వద్ద స్పాటర్‌గా నియమించారు. ఫరూక్ సోమవారం ఉదయం ఐఎస్బీ గేటు వద్ద విధుల్లో ఉన్నారు. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో ఉన్న ఎంపీ నివాసానికి ఇది దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంది. ఫరూక్ విధులకు రఘురామకృష్ణరాజు ఇంటితోగానీ ఆ ప్రాంతంతోగానీ సంబంధమే లేదు. అయినప్పటికీ రఘురామ కుటుంబ సభ్యులు కొందరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లతో కలసి కారు (7777 నంబరుతో తెలుపు రంగు ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్)లో వచ్చి ఫరూక్‌పై దాడి చేశారు. ఎవరు నువ్వు అంటూ నడిరోడ్డుపైనే పిడిగుద్దులు కురిపించారు. తాను ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను అని గుర్తింపు కార్డు చూపిస్తున్నా వినిపించుకోలేదు. గుర్తింపు కార్డును లాక్కున్నారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా చేతులు వెనక్కి కట్టి, దాడి చేస్తూ ఈడ్చుకుని ఎంపీ ఇంటికి తీసుకెళ్లారు. ఆ దృశ్యాలను కొందరు పాదచారులు సెల్ఫోన్లలో వీడియో కూడా తీశారు. చదవండి: (టీడీపీని పైకెత్తలేక.. జాకీలు విరిగిపోతున్నాయి) అనంతరం ఇంట్లో ఎంపీ కుటుంబ సభ్యులు, సిబ్బందితోపాటు కొందరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు చిత్రహింసలకు గురిచేశారు. ఫైబర్ లాఠీలతో కాళ్లూ, చేతులు, కడుపుపై కొట్టారు. గొంతు పట్టుకుని గాయపరిచారు. పిడిగుద్దులు గుద్దారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అనుమానిత వ్యక్తి అని భావించి పట్టుకున్నామని వారు పోలీసులకు చెప్పారు. కాగా విధి నిర్వహణలో ఉన్న తనను ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులు, సిబ్బంది, సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు దాడి చేసి గాయపరిచారని కానిస్టేబుల్ ఫరూక్ బాషా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నిరసనల సెగ.. వెనక్కి మళ్లిన ఎంపీ రఘురామ
సాక్షి, హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రజా సంఘాల ఆందోళనల సెగ తగిలింది. ఆయన భీమవరానికి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలంటూ ఆదివారం రాత్రి ఏపీలోని పలు ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్ల వద్ద ప్రజా సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చదవండి: మంత్రి బుగ్గన వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా? ‘రఘురామకృష్ణరాజు గో బ్యాక్.. గో బ్యాక్’ అంటూ విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్ల వద్ద పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. దీంతో హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి ఆదివారం రాత్రి రైల్లో భీమవరం బయలుదేరిన రఘురామ.. ప్రజా సంఘాల నిరసనల నేపథ్యంలో మధ్యలో బేగంపేటలో రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారు. -
‘ఎంపీ రఘురామను అడుగు పెట్టనివ్వం’
సాక్షి, భీమవరం: దళితుల ఓట్లతో గెలిచి నియోజకవర్గ ప్రజల బాగోగులు గాలికి వదిలేసి పత్రికలు, టీవీల్లో అవాకులు చవాకులు పేలుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజును నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వబోమని ఏపీ బహుజన జేఏసీ నాయకులు హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిరుదుగడ్డ రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అవహేళన చేశారని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రఘురామకృష్ణరాజు గోబ్యాక్ అని నినదించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ గెలిపించిన పార్టీకే కళంకం తెస్తున్న ఎంపీ.. గతంలో దళితుల పైన, దళిత అధికారుల పైన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, క్షమాపణ చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, శాంతియుతంగా నిరనన తెలియజేస్తామన్నారు. దుండి అశోక్, ప్రశాంత్, బేతాళ కమలాకర్, ఏలేటి న్యూటన్ పాల్గొన్నారు. -
హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతినివ్వలేం
సాక్షి, అమరావతి : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భీమవరం పర్యటన సందర్భంగా తన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతివ్వాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఇంతకుముందు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకోవడం, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అనుమతినిచ్చినట్లు ఎలాంటి లేఖను కోర్టు ముందుంచని నేపథ్యంలో ల్యాండింగ్‌కు అనుమతిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. రోడ్డు మార్గం ద్వారా మాత్రమే భీమవరం వెళ్లాల్సి ఉన్నందున తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. జెడ్ ప్లస్ భద్రత ఉన్నందున పోలీసుల భద్రతకు ఆదేశాలు ఇవ్వలేమని పునరుద్ఘాటించింది. అయితే రఘురామకృష్ణరాజు భీమవరం వెళ్లే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. శాంతిభ్రదతలకు విఘాతం కలగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తాను వచ్చే హెలికాప్టర్‌కు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ల్యాండింగ్‌కు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు శనివారం అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్ వాదనలు వినిపిస్తూ, హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్‌కు గత నెల 17న వినతిపత్రం ఇచ్చామన్నారు. దీని సాధ్యాసాధ్యాలపై జిల్లా ఎస్పీని కలెక్టర్ నివేదిక కోరారని, ఆ తరువాత పరిణామాలు ఏంటో తెలియదన్నారు. మా చేతుల్లో ఏమీ లేదు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ.. ప్రధాని పర్యటన మొత్తం కేంద్ర హోం శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్‌జీపీ) కనుసన్నల్లో జరుగుతుందన్నారు. హెలికాప్టర్‌కు అనుమతులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలకు లోబడి ఉంటాయన్నారు. రఘురామకృష్ణరాజు వ్యాజ్యంలో కేంద్రాన్ని, ఎస్పీజీని, డీజీసీఏని ప్రతివాదులుగా చేర్చలేదన్నారు. వారే సమాధానం చెప్పాల్సి ఉందని, తమ చేతుల్లో ఏమీ ఉండదని అన్నారు. విజయవాడ విమానాశ్రయ అనుమతి, ఫ్లైట్ ప్లాన్‌ను సమర్పించనప్పుడు కలెక్టర్ చేసేదేమీ ఉండదన్నారు. ఎస్ఆర్కేఆర్ కాలేజీ ప్రాంగణం హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనువు కాదని ఆర్ అండ్ బీ అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నాయని ఆ స్కూలు యాజమాన్యం కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా తెలిపిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వివేకానంద స్పందిస్తూ, పిటిషనర్ నిన్న రోడ్డు మార్గం ద్వారా వస్తాను, భద్రత కల్పించాలని కోర్టుకొచ్చారని, సానుకూల ఉత్తర్వులు రాకపోయేసరికి హెలికాప్టర్‌ను ఎంచుకున్నారని, రేపు షిప్లో వస్తానని చెబుతారని తెలిపారు. అందుకే వెనక్కి తీసుకుంది హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతినిచ్చిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరువాత వెనక్కి తీసుకోవడంపై అనుమానాలున్నాయని ఉమేశ్ తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఎస్ఆర్కేఆర్ కాలేజీ అనుమతిని వెనక్కి తీసుకున్న లేఖలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదులను న్యాయమూర్తి ఆదేశించారు. సుమన్ ఆ లేఖను వాట్సాప్ ద్వారా న్యాయమూర్తి ముందుంచారు. అనుమతులు వెనక్కి తీసుకోవడాన్ని తాము ప్రశ్నించడంలేదని ఉమేశ్ చెప్పారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై విద్యాశాఖ రైడ్ చేసిందని, అందుకే ఆ పాఠశాల ల్యాండింగ్కిచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ వినతిపై కలెక్టర్ ఏదో రకంగా స్పందించి ఉండాల్సిందని తెలిపారు. హెలికాఫ్టర్ దిగే స్థలం యజమాని అనుమతి తప్పనిసరని, అందువల్ల ఆ ప్రాంగణాల్లో ల్యాండింగ్‌పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. -
ఇంకెంత భద్రత?.. ఎంపీ రఘురామపై హైకోర్టు అసహనం
సాక్షి, అమరావతి: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో ఈ నెల 4వ తేదీన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరవుతున్న తనకు భద్రత కల్పించడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇదేం పిటిషన్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 3, 4వ తేదీల్లో కేంద్రం తనకు ఇప్పటికే జడ్ ప్లస్ భద్రత కల్పించిందని ఒకవైపు చెబుతూ మరోవైపు పోలీసు భద్రత కోరడం ఏమిటంటూ విస్మయం వ్యక్తం చేసింది. స్థానిక పోలీసుల కంటే ఎస్పీజీ అందించే జడ్ ప్లస్ కేటగిరీ పటిష్టమైనదని గుర్తు చేసింది. జడ్ ప్లస్ ఉన్నప్పుడు స్థానిక పోలీసుల భద్రత అవసరం లేదని, ఆ దిశగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనపై కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారని, తద్వారా అరెస్ట్ నుంచి రక్షణ ఉందని, అలాంటప్పుడు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడం ఎలా సాధ్యమంటూ ప్రశ్నించింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా కేసు నమోదు చేస్తే చట్ట ప్రకారం నడుచుకునేలా పోలీసులను ఆదేశించాలని, కనీసం ఆ ఉత్తర్వులైనా ఇవ్వాలని రఘురామకృష్ణరాజు అభ్యర్థించారు. దీంతో ఈ నెల 3, 4వ తేదీల్లో ఒకవేళ రఘురామకృష్ణరాజుపై ఏదైనా కేసు నమోదు చేస్తే చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. ఇంతకు మించి ఈ పిటిషన్లో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: (CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్) ఏ కారణం కనిపించడం లేదు... అంతకు ముందు రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపిస్తూ భద్రత కల్పించాలని డీజీపీని కోరితే ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. ఆ రెండు తేదీల్లో కేంద్రం తమకు జెడ్ ప్లస్ భద్రత కల్పించిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. జడ్ ప్లస్ భద్రత ఉంటే మళ్లీ రాష్ట్ర పోలీసుల భద్రతతో పనేముందని ప్రశ్నించారు. ఎన్ని రకాల భద్రత కల్పించాలి మీకు? అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అవాంఛిత ఘటనలను సృష్టించి పిటిషనర్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఉమేశ్ చంద్ర పేర్కొనగా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఉమేశ్ చంద్ర కోరారు. అయితే భద్రత కల్పించాలంటూ ఆదేశాలు ఇచ్చేందుకు ఎలాంటి కారణాలు కన్పించడం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. గతంలో పిటిషనర్‌పై 8 కేసులు నమోదు చేశారని, అందులో ఈ కోర్టు స్టే ఇచ్చిందని ఉమేశ్ నివేదించారు. ఆ రకంగా కూడా మీకు రక్షణ ఉందని, అలాంటప్పుడు ఇక ఏ రకమైన భద్రత కోసం ఆదేశాలు ఇవ్వాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. స్టే ఉన్న కేసుల్లో పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో ఉమేశ్ అధికరణ 226 కింద కోర్టు పరిధిని వివరించే ప్రయత్నం చేయగా.. తమ అధికారం ఏమిటో, పరిధి ఏమిటో బాగా తెలుసునని, ఆ విషయం తమకు చెప్పాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చదవండి: (Intercity Express Train: పట్టాలెక్కని పేదోడి రైలు) పబ్లిసిటీ స్టంట్‌లో భాగమే.. తన నియోజకవర్గంలో ప్రధాని కార్యక్రమానికి హాజరవుతున్న తనకు భద్రత కల్పించడంతో పాటు అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ రఘురామకృష్ణరాజు శుక్రవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని నివేదించారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను డీజీపీకి ఆపాదిస్తున్నారన్నారు. ప్రధాని పర్యటనకు ముందే పెద్ద సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. ప్రధాని కాన్వాయ్‌లో ఉండాలని ఆయన భావిస్తున్నారని చెప్పారు. అయితే కాన్వాయ్‌లో ఎవరుండాలన్నది కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌జీపీ) నిర్ణయిస్తుందని, రాష్ట్ర పోలీసులు కాదన్నారు. ఏదో రకంగా వార్తల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. ఎంపీగా ఉంటూ ఆయన ఎప్పుడూ రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తుంటారన్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం పిటిషనర్‌కు అలవాటన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారన్నారు. ముఖ్యమంత్రిపై అడ్డగోలు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ సమయంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర స్పందిస్తూ.. నరసాపురం వెళ్తే పిటిషనర్‌పై పోలీసులు మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉందన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఊహాతీతమైన కారణాల ఆధారంగా భద్రతకోసం ఆదేశాలు ఇవ్వమంటారా? అని ప్రశ్నించారు. ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం పోలీసులకు లేదని ఏజీ శ్రీరామ్ స్పష్టం చేశారు. పిటిషనర్ ఆందోళనలన్నీ నిరాధారమన్నారు. ఎంపీ అయినా సామాన్యుడైనా చట్టం ముందు అంతా ఒక్కటేనన్నారు. -
ఆయన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారని హైకోర్టు తేల్చింది. పేదలు, అణగారిన వర్గాల కోసం ఈ వ్యాజ్యం దాఖలు చేయలేదని తెలిపింది. ఆయన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ పిల్ దాఖలు చేశారు. దీనిని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం జూన్ 24న తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రతిని తాజాగా అందుబాటులో ఉంచింది. ఈ వ్యాజ్యం విచారణార్హతపై ధర్మాసనం తన తీర్పులో లోతుగా చర్చించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరించింది. కేవలం అకడమిక్ ప్రయోజనం కోసం దాఖలు చేసే వ్యాజ్యాలను న్యాయస్థానాలు విచారించబోవని తెలిపింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పిల్ల ద్వారా లేవనెత్తినప్పుడు వాటిని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోరాదంది. ఏ రకంగానూ ఈ వ్యాజ్యాన్ని విచారించబోమని స్పష్టంచేసింది. రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వం లేదా దాని కార్పొరేషన్లను అడ్డుకుంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగించే వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరిస్తాయంది. అలాంటి వ్యవహారాల నిర్వహణను ప్రభుత్వానికి వదిలేయాలని స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేందుకు న్యాయస్థానాలేమీ ఆర్థికవేత్తలో, ఆర్థిక నిపుణులో కాదని తేల్చి చెప్పింది. రుణం పొందేందుకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు అనుమతినిస్తే రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ఆర్థిక ముప్పును కలిగిస్తుందని చెప్పారని, అది ఏ విధంగానో చెప్పేందుకు ఎలాంటి వివరాలను కోర్టు ముందుంచలేదని హైకోర్టు ఆక్షేపించింది. కేవలం రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనను మాత్రమే ప్రశ్నించారని, దీనికీ, పేద ప్రజల సంక్షేమానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. -
రఘురామను విచారించొచ్చు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రిని, కులాలను అవమానించి, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించినందుకు నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుపై సుమోటోగా నమోదు చేసిన కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున దర్యాప్తును అడ్డుకోవడంలేదని చెప్పింది. రఘురామకృష్ణరాజు తదితరులపై సీఐడీ నమోదు చేసిన కేసులో దేశద్రోహం సెక్షన్‌ను మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, మిగిలిన సెక్షన్ల కింద సీఐడీ చేసే దర్యాప్తునకు సహకరించాలని నిందితులను ఆదేశించిందని హైకోర్టు గుర్తు చేసింది. ఇదే కేసులో ఏబీఎన్, టీవీ 5 యజమానులపైనా దర్యాప్తు కొనసాగించవచ్చని సీఐడీకి స్పష్టంచేసింది. సీఐడీ చేతిలో ప్రాణహాని ఉందని రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఆయన్ని హైదరాబాద్‌లోని దిల్కుషా అతిథి గృహంలో విచారించాలని ఆదేశించింది. ఆయన్ని ఇతర నిందితులతో కలిపి విచారించాలనుకుంటే 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని తెలిపింది. రఘురామకృష్ణరాజు ఎంపిక చేసుకున్న న్యాయవాది సమక్షంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, వీడియో తీయాలని చెప్పింది. కేసుకు సంబంధించిన విషయాలకే విచారణను పరిమితం చేయాలని స్పష్టంచేసింది. ఆయన హృద్రోగి అని చెబుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు చెప్పింది. ఆయన భద్రతా సిబ్బందిని విచారణ ప్రాంగణం వెలుపలి వరకు అనుమతించాలంది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని తేల్చాల్సి ఉన్నందున, దర్యాప్తు పూర్తి చేసిప్పటికీ, చార్జిషీట్ దాఖలు చేయవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలులో ఏదైనా ఉల్లంఘన జరిగితే, అందుకు బాధ్యులైన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వేదికపై తీవ్ర చర్చ సీఐడీ కేసును కొట్టేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ రాయ్ బుధవారం మరోసారి విచారించారు. విచారణ కోసం ఓ తటస్థ ప్రాంతాన్ని ఎంపిక చేసి, తమకు చెప్పాలని సీఐడీని, రఘురామకృష్ణరాజును న్యాయమూర్తి ఇంతకు ముందు ఆదేశించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ విషయంపై ఇరుపక్షాల మధ్య చర్చ జరిగింది. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌ను ప్రతిపాదించారు. అందుకయ్యే వ్యయాన్ని భరిస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనను సీఐడీ తరఫు న్యాయవాది వైఎన్ వివేకానంద వ్యతిరేకించారు. న్యాయమూర్తి సైతం ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేయలేదు. పోలీసు అధికారుల మెస్ లేదా దిల్కుషా అతిథి గృహాన్ని వివేకా ప్రతిపాదించారు. పోలీసు అధికారుల మెస్కన్నా అతిథి గృహమే మేలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చివరకు దిల్కుషా అతిథి గృహాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
సంసద్ టీవీకి లేఖ రాసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: సంసద్ టీవీలో చర్చలకు వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ రఘురామకృష్ణరాజును పిలవద్దని ఆ టీవీ సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ టీవీ సీఈవోకి లేఖ రాశారు. సంసద్ టీవీ చర్చల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ రఘురామ పాల్గొనడం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని తాము ఇచ్చిన పిటిషన్‌పై స్పీకర్ విచారిస్తున్నారని లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉండదని, ఆయన మాటలు వైఎస్సార్సీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు పూర్తయ్యేవరకు ఆయన్ని సంసద్ టీవీ షోలు, చర్చలకు పిలవద్దని విజయసాయిరెడ్డి కోరారు. చదవండి: (ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ) -
రఘురామకృష్ణరాజుకు హైకోర్టు ఝలక్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వకుండా చేసేందుకు టీడీపీ పెద్దల ప్రోద్బలంతో వరుసపెట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, వీటిని అడ్డుకోవాలంటూ ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. అయితే తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో ఏ కారణాలతో ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని కొట్టేసిందో తెలియరాలేదు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం.. రఘురామకృష్ణరాజుపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. రుణం పొందకుండా ప్రభుత్వ యత్నాలను అడ్డుకోవాలన్న అతని అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ నిలదీసిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం దాఖలు చేయడం వెనకున్న అసలు ఉద్దేశాలను సైతం విచారణ సందర్భంగా ధర్మాసనం బహిర్గతం చేసింది. ప్రభుత్వ విధానాన్ని మీరు నిర్దేశిస్తారా? ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకే ఈ వ్యాజ్యం వేసినట్లుందన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలని మీరు అనుకుంటున్నారని రఘురామకృష్ణరాజు తీరును నేరుగా ఎండగట్టింది. ప్రభుత్వం రుణాలు ఎలా తీసుకోవాలో మీరెలా నిర్ధేశిస్తారని, అప్పు ఇచ్చే వాళ్లకు లేని ఇబ్బంది మీకెందుకని, అభ్యంతరం చెప్పేందుకు అసలు మీరెవరంటూ ఆయన్ను కడిగిపారేసింది. ఈ వ్యాజ్యాన్ని నిరర్థక వ్యాజ్యంగా అభివర్ణిస్తూ.. ఇలాగే వదిలేస్తే రేపు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లను కూడా సవాలు చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తామని, కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని రఘురామకృష్ణరాజుకు తేల్చి చెప్పింది. ఆ విధంగానే ధర్మాసనం రఘురామకృష్ణరాజు వ్యాజ్యాన్ని శుక్రవారం కొట్టేసింది. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసేందుకు రఘురామకృష్ణరాజు ఏకంగా ఓ న్యాయ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సీనియర్ న్యాయవాదులు మొదలు.. నిన్న మొన్న న్యాయవాదిగా ఎన్రోల్ అయిన జూనియర్ న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆ బృందంలోని న్యాయవాదుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కేసు అప్పచెబుతూ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలుజేసేందుకు రఘురామకృష్ణరాజు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆ న్యాయవాదులకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. -
చింతామణి నాటకం నిషేధంపై స్టేకు నిరాకరించిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి : భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తామంటే ఊరుకోబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించేందుకు నిరాకరించింది. నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ద్వారా అసభ్య డైలాగులు చెప్పిస్తూ ఆర్యవైశ్యులను కించపరిచేలా చూపుతున్నందున, దానిని నిషేధించాలన్న ఆర్యవైశ్య సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నాటకం ప్రదర్శనపై నిషేధం విధించింది. దీనిని సవాలు చేస్తూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, కళాకారుడు త్రినాథ్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్లు) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం ముందు శుక్రవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పీవీజీ ఉమేశ్ చంద్ర, ఆర్.వెంకటేశ్‌లు వాదనలు వినిపిస్తూ.. కళాకారుల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులున్నాయని అన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏ ఒక్క వర్గం మనోభావాలను కూడా కించపరచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చింతామణి నాటకంలో ఏముందో తెలుసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంది. నాటకంలో ఏముందో పరిశీలిస్తామని చెప్పింది. నాటకానికి సంబంధించిన ఒరిజినల్ పుస్తకం, దాన్ని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసిన కాపీని తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. చదవండి: (ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం) -
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మండిపడ్డ హైకోర్టు ధర్మాసనం
-
AP: ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇప్పటికే ఒకసారి తలంటిన హైకోర్టు తాజాగా మరోసారి తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. రుణం పొందకుండా ప్రభుత్వ యత్నాలను అడ్డుకోవాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ నిలదీసింది. అసలు ఈ వ్యాజ్యం నిరర్థకమైందని, ఈ వ్యాజ్యాన్ని తామెందుకు విచారించాలని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని రఘురామకృష్ణరాజును ఉద్దేశించి.. ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు అనిపిస్తోందని మండిపడింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పునరుద్ఘాటించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ఎలా సాగాలో చూసేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలం కాదని, హైకోర్టు జడ్జీలమని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులుగా తామేం చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని, దాని ప్రకారమే నడుచుకుంటామని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను తాము నడపడం లేదని, ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదని పేర్కొంది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం నుంచి కనీస వివరణ కూడా కోరబోమని స్పష్టం చేసిన ధర్మాసనం దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము జారీ చేయబోయే ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని ధర్మాసనం ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజుకు తేల్చి చెప్పింది. చట్ట సవరణలపై పిల్... ఏపీ (విదేశీ మద్యం, దేశీయ తయారీ విదేశీ మద్యం వ్యాపార నియంత్రణ) చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన రెండు చట్టాలను సవాలు చేస్తూ రఘురామకష్ణరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. కొత్త సవరణ చట్టాల ద్వారా సంచిత నిధికి చెందిన మొత్తాలను ప్రభుత్వం ఆదాయంగా చూపి రుణాలను పొందేందుకు ప్రయత్నిస్తోందని, స్పెషల్ మార్జిన్ మనీని తాకట్టు పెట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది. రుణాలపై మీరెలా నిర్దేశిస్తారు..? పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సంచిత నిధికి వెళ్లాల్సిన మొత్తాలను ఆదాయంగా చూపుతూ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందుతోందన్నారు. స్పెషల్ మార్జిన్ మనీని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను మీరెలా శాసిస్తారంటూ రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. ప్రభుత్వం రుణాలు ఎలా తీసుకోవాలో మీరు నిర్దేశిస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు అసలు మీరెవరంటూ నిలదీసింది. తన ఆర్థిక వ్యవహారాలను ఎలా చక్కబెట్టుకోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో సుధాకరరావు స్పందిస్తూ రాష్ట్ర సంచిత నిధికి చెందిన మొత్తాలను ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడేస్తోందని, ఈ నిధిపై ఆర్బీఐకి మాత్రమే నియంత్రణ ఉంటుందని చెప్పారు. సంచిత నిధికి వెళ్లాల్సిన మొత్తాలను ఏపీ బెవరేజ్ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు వద్దంటారా? దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవద్దంటారా? అంటూ ప్రశ్నించింది. పేదలు, సామాన్యులకు రాజ్యాంగం అర్థం కాదని, వారికి కావాల్సింది సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం మాత్రమేనని ధర్మాసనం తెలిపింది. అసలు పిటిషనర్ ఎవరంటూ ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్ ఎంపీ అంటూ సుధాకరరావు వాదనలు కొనసాగించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసి ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణం పొందిందని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలతో పిటిషనర్‌కు ఏం పని? అని ప్రశ్నించింది. దీనిపై సుధాకరరావు స్పందిస్తూ సంచిత నిధికి వెళ్లాల్సిన మొత్తాలో కాదో కావాలంటే ప్రభుత్వాన్నే అడగాలన్నారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. మేమెందుకు ప్రభుత్వాన్ని వివరణ కోరాలి..? ప్రభుత్వాన్ని ఏం ఎందుకు వివరణ అడగాలి? మేం ఎలాంటి వివరణ అడిగేది లేదు. ప్రభుత్వం నుంచి అఫిడవిట్ కూడా కోరం. ఇదో నిరర్థక వ్యాజ్యం. ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవు. ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదు. ఈ వ్యాజ్యంలో మేం ఉత్తర్వులు జారీ చేస్తాం. కావాలంటే మేం ఇచ్చే ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకెళ్లొచ్చు. ఆర్థిక సంస్థలు సంతృప్తి చెందితేనే రుణం ఇస్తాయి. లేకుంటే లేదు. ఆర్థిక సంస్థలకు లేని ఇబ్బంది మీకెందుకు? మీరు, నేను ఓ ఆర్థిక సంస్థ వద్దకు అప్పు కోసం వెళితే ముందుగా మనకు అప్పు చెల్లించే స్థోమత ఉందా? లేదా? అనేది చూస్తారు. దాన్ని బట్టి రుణం ఇస్తారు. ఇది పూర్తిగా అప్పు ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తికి సంబంధించిన వ్యవహారం. ఇందులో మూడో వ్యక్తి జోక్యానికి ఆస్కారం ఎక్కడుంది? రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు (ఈ సందర్భంగా ధర్మాసనం రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌లోని ఓ పేరాను చదివి వినిపించింది). ప్రభుత్వాన్ని తన వ్యవహారాలను తాను చక్కబెట్టుకోనివ్వండి. ప్రభుత్వాలను మేం నడపడం లేదు. మేమేం చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. మీ తీరు చూస్తుంటే కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లను కూడా సవాలు చేసేలా ఉన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకుంటే ప్రజలు ఎలా ప్రభావితం అవుతారు? ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎవరు దాఖలు చేస్తారో మీకు తెలుసు కదా. అణగారిన వర్గాలు, కోర్టుకు రాలేని స్థితిలో ఉన్న వ్యక్తులు పిల్ వేయాలి. మరి మీరెందుకు ఈ వ్యాజ్యం వేశారు? సంక్షేమ పథకాలను ఆపేందుకు ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లుగా ఉంది. ఈ ప్రభుత్వమే కాదు, చాలా ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. ప్రతీ దాంట్లోనూ జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదు. ఈ వ్యాజ్యాన్ని అసలు మేమెందుకు విచారించాలి? ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం’ అంటూ ధర్మాసనం రఘురామకృష్ణరాజును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో సుధాకరరావు జోక్యం చేసుకుంటూ ఏదో చెప్పబోగా.. ‘మేమేం కంపెనీ సెక్రటరీలం కాదు. హైకోర్టు జడ్జీలం. మీకు మరోసారి చెబుతున్నాం మేం ప్రభుత్వాలను నడపడం లేదు’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. శాసించేందుకు మీరెవరు? ‘‘తన ఆర్థిక వ్యవహారాలు ఎలా నిర్వహించుకోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం రుణాలు తెస్తే ప్రజలు ఎలా ప్రభావితం అవుతారు? ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరు? ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ఎలా సాగాలో మీరెలా చెబుతారు? ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేందుకే మీరు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లుంది. ప్రభుత్వానికి రుణం ఇచ్చే వారికి లేని ఇబ్బంది మీకెందుకు? ఈ వ్యవహారంలో మేం ప్రభుత్వం నుంచి వివరణ కూడా కోరబోం. ఈ వ్యాజ్యంలో మేం తగిన ఉత్తర్వులు వెలువరిస్తాం. ఆ ఉత్తర్వులపై మీరు కావాలనుకుంటే సుప్రీంకోర్టు కూడా వెళ్లొచ్చు’’ – ఎంపీ రఘురామకృష్ణరాజునుద్దేశించి హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు -
‘రుషికొండ’పై ఎన్జీటీ విచారణ నిలిపివేత
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), హైకోర్టు పరస్పర విరుద్ధమైన ఆదేశాలతో అసాధారణ పరిస్థితికి దారి తీస్తుంది. అధికారులకు ఏ ఉత్తర్వును అనుసరించాలో అర్థం కాదు. అలాంటి సందర్భంలో ట్రిబ్యునల్ ఆదేశాలపై రాజ్యాంగ న్యాయస్థానమైన హైకోర్టు ఆదేశాలు ప్రబలం. – సుప్రీం కోర్టు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ రఘురామకృష్ణరాజు భుజంపై తుపాకి పెట్టి న్యాయస్థానాల ద్వారా అభివృద్ధి పనులను అడ్డుకొనే ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రాష్ట్రంలోని అతి పెద్ద నగరం విశాఖలో రుషికొండపై చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని చూసిన చంద్రబాబు, రఘురామ ద్వయానికి గట్టి చెంపదెబ్బలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేపట్టిన విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రుషికొండపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు కొనసాగించడానికి అనుమతించింది. ఈ నిర్మాణాలపై ఎన్జీటీ ఉత్తర్వులకు హైకోర్టు ఆదేశాలు విరుద్ధంగా ఉన్న పక్షంలో హైకోర్టు ఉత్తర్వులే వర్తిస్తాయని స్పష్టం చేసింది. రుషికొండపై నిర్మాణాలు నిలిపివేస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది. ఈ అంశాన్ని హైకోర్టు సీజ్ చేసి ఉత్తర్వులు జారీ చేసినందున ఎన్జీటీ ముందు విచారణ కొనసాగించడం సరికాదని స్పష్టం చేసింది. ఎన్జీటీ ముందు విచారణ కొనసాగించడం న్యాయానికి ప్రయోజనం కలిగించదని పేర్కొంది. తగిన ఉత్తర్వుల నిమిత్తం తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణ హైకోర్టు కొనసాగిస్తుందని తెలిపింది. హైకోర్టులో ఈ కేసులో ఇంప్లీడ్ అవడానికి ప్రతివాదిని అనుమతించింది. రుషికొండలో నిర్మాణాలకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఆరోపణల నేపథ్యంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అవసరమైతే హైకోర్టు నిపుణుల కమిటీని నియమించొచ్చని పేర్కొంది. దేశ ఆర్థికాభివృద్ధికి అభివృద్ధి అవసరమే అయినప్పటికీ కాలుష్య రహిత వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఈ అంశాన్ని విచారించే లోపు చదును చేసిన ప్రాంతాల్లో నిర్మాణాలు జరపవచ్చని, కొండ ప్రాంతంలో పనులు చేపట్టవద్దని తెలిపింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్లు రెడ్డిలు స్పందిస్తూ.. ఆ ప్రాంతమంతా రుషికొండగానే పరిగణిస్తారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో కట్టడాలకు సంబంధించి పనులు చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. కేసు మెరిట్స్‌లోకి వెళ్లడంలేదన్న ధర్మాసనం పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. -
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ.. రిషికొండలో నిర్మాణాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఎదురు దెబ్బ
సాక్షి, ఢిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రుషి కొండలో నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకే అంశంపై రెండు చోట్ల పిటిషన్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బుధవారం అనుమతులు మంజూరు చేసింది. రుషి కొండపై టూరిజం భవనాల నిర్మాణాలు చేపట్టకుండా ఎన్జీటి స్టే విధించగా.. దానిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. మంగళవారం వాదనల సందర్భంగా.. ఎన్జీటీ తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం, ఇవాళ(బుధవారం) రుషి కొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం రఘురామ లేఖ ఆధారంగానే ప్రాజెక్టుపై స్టే ఇవ్వడం సరికాదన్న సుప్రీం కోర్టు.. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ స్పష్టం చేసింది. ఇక ఇవాళ ఆదేశాల సందర్భంగా.. ముందుగా చదును చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు ఏపీ సర్కార్‌కు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు..ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే తవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయవద్దన్న సుప్రీం.. కేసులోని మెరిట్స్‌పై తామెలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాదు రుషికొండ ప్రాజెక్టు కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తేల్చిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగంలో గందరగోళం నెలకొందని, రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతవరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపింది. -
రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్టీజీ తీరును తప్పుబట్టిన సుప్రీం
-
రుషికొండ టూరిజం ప్రాజెక్టు.. ఎన్జీటీ తీరు సరికాదు: సుప్రీం
సాక్షి, ఢిల్లీ: రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును తప్పుబట్టింది సుప్రీంకోర్టు. ఈ మేరకు దాఖలైన ఓ పిటిష్‌పై మంగళవారం వాదనల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపీ రఘురామకృష్ణ లేఖ ఆధారంగా ప్రాజెక్టుపై స్టే ఉత్తర్వులిచ్చింది ఎన్జీటీ. అయితే ఏకపక్షంగా ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో.. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది సుప్రీం కోర్టు. ఇక ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వొకేట్ సింఘ్వి. ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి దొరుకుతోందని, రూ. 180 కోట్లు పెట్టబడులు ఏపీ ప్రభుత్వం పెట్టిందని కోర్టుకు తెలిపారాయన. ఓ ఎంపీ లేఖపై ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీంతో ఎన్జీటీ తీరును తప్పుబట్టిన సుప్రీం.. విచారణ రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. -
రఘురామ లాంటి వారిని ఉపేక్షించొద్దు: ఎంపీ భరత్
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన రఘురామకృష్ణరాజు లాంటి వారిని ఉపేక్షించరాదని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని రెండేళ్లుగా కోరుతున్నామన్నారు. పార్టీ అధినేతను దూషిస్తూ తాను ప్రభుత్వాన్ని అంటున్నానని అతితెలివి చూపుతున్నాడన్నారు. సోమవారం భరత్ మీడియాతో మాట్లాడుతూ రఘురామపై అనర్హత వేటు వేయాలని పలుమార్లు స్పీకర్‌కు నివేదించామని, ఆలస్యం చేయొద్దని కోరగా ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారన్నారు. ప్రధాని మోదీపై బీజేపీ చట్టసభ సభ్యులెవరైనా విమర్శలు చేస్తే ఇలాగే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, రఘురామ అనర్హత పిటిషన్‌పై మౌఖిక సాక్ష్యం ఇవ్వడానికి సోమవారం ఎంపీ భరత్‌రామ్ లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. చైర్మన్ సునీల్‌కుమార్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పిటిషన్‌పై త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు సమాచారం. -
రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది అంత ముఖ్యమైన విషయమా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అరెస్ట్‌పై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఇలా స్పందించింది. ఇదంతా ముఖ్యమైన విషయమా ? అని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. ముఖ్యమైన విషయం ఉంటే రాత్రి 8 గంటలకు కూడా విచారణ చేపడతాం కదా అని నొక్కి చెప్పింది. ఇప్పటికే 11 నెలలు గడిచింది కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదికి గుర్తు చేసింది ధర్మాసనం. ఇదిలా ఉండగా.. రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆయన తనయుడు భరత్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు పంపింది. దానికి మరో రెండు వారాల్లో దానికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. -
రఘురామ కృష్ణరాజు కు ఏపీ ప్రభుత్వం కౌంటర్..
-
రఘురామరాజుది తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే మద్యంలో హానికర రసాయనాలు ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం అమ్ముతున్నట్టు గత కొన్నిరోజులుగా ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మద్యం శాంపిల్స్‌కు లేబొరేటరీలో పరీక్షలు చేయించామని వారు చూపుతున్న పత్రాలు కూడా తప్పుడువేనన్నారు. ఈ మేరకు రజత్ భార్గవ మంగళవారం సచివాలయంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో కలసి మీడియాతో మాట్లాడారు. రఘురామ అండ్ కో మద్యం శాంపిల్స్ పరీక్ష చేయించామని చెబుతున్న చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబ్ నుంచి ఈ మేరకు నివేదిక తెప్పించామన్నారు. మద్యం శాంపిళ్లలో హానికర రసాయనాలు లేవని, పైగా ఆ మద్యాన్ని ఏపీ నుంచి తెచ్చినట్టు ఆధారాలు కూడా లేవని స్పష్టమైందన్నారు. సమర్పించిన వ్యక్తులు కోరనందున ఆ నమూనాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఎస్ఐ) 4449 (విస్కీ), 4450 (బ్రాందీ) ప్రకారం పరీక్షించలేదని ఎస్జీఎస్ ల్యాబ్ పేర్కొందన్నారు. ఈ పరీక్షలు ఎక్సైజ్ చట్టం ప్రకారం అనుసరించాల్సిన విధానాల మేరకు జరగలేదన్నారు. ఈ మేరకు ల్యాబ్ ఇచ్చిన లేఖను రజత్ భార్గవ మీడియాకు చూపించారు. తప్పుడు ప్రచారానికి కారణమైన రఘురామపై పరువునష్టం దావా వేస్తామన్నారు. క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ప్రమాణాలు పాటించకుండా పరీక్షలు.. చైతన్య, పవన్ అనే వ్యక్తులు గతేడాది డిసెంబర్ 11న నాలుగు విస్కీ, ఒక బ్రాందీ నమూనాలను అనధికారికంగా చెన్నైలోని ల్యాబ్‌కు పంపారని తెలిపారు. డిసెంబర్ 24న వారికి నివేదిక ఇచ్చినట్టు ఎస్జీఎస్ ల్యాబ్ తెలిపిందన్నారు. వీటిని ఏపీ నుంచి కొనుగోలు చేశారా, లేదా అనే విషయం తేలాలన్నారు. పరీక్షల కోసం నమూనాలను కల్తీ చేసి పంపారా, లేదా అనేదాన్ని గుంటూరులోని ప్రభుత్వ కెమికల్ ల్యాబ్ ఎగ్జామినర్ తేల్చాల్సి ఉందన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకే చైతన్య, పవన్ ఈ పనిచేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. నిర్ణీత ప్రమాణాల ప్రకారం.. మద్యం శాంపిల్స్‌ను కమిషనర్ లేదా శాంపిల్స్ సేకరించేందుకు అనుమతించిన ఇతర డిస్టిలరీ ఎక్సైజ్ అధికారి మాత్రమే ల్యాబ్‌కు పంపాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ లేబొరేటరీల్లో ఎప్పటికప్పుడు మద్యం నమూనాలను ఎన్నో విధాలుగా పరీక్షిస్తున్నామని తెలిపారు. 2021–22 (ఫిబ్రవరి వరకు)లో 1,47,636 శాంపిళ్లను పరీక్షించామని, ఎందులోనూ కల్తీ జరిగినట్టు, హానికర పదార్థాలు ఉన్నట్టు తేలలేదన్నారు. ప్రియాంక రాష్ట్రానికి గర్వకారణం మహిళా గ్రాండ్ మాస్టర్ నూతక్కి ప్రియాంక రాష్ట్రానికి గర్వకారణమని ç రజత్‌భార్గవ చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో ప్రియాంకను సత్కరించారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ చెస్ చాంపియన్ షిప్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడంతోపాటు డబ్ల్యూజీఎం మూడో నార్మ్‌ను సొంతం చేసుకున్న ప్రియాంకను అభినందించారు. -
మా నివేదికను తప్పుగా అన్వయించారు
సాక్షి, అమరావతి: ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి బట్టబయలైంది. మద్యంలో ప్రమాదకర పదార్థాల అవశేషాలు హానికర స్థాయిలో ఉన్నట్లు తప్పుడు రిపోర్టులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలన్న పన్నాగం బెడిసికొట్టింది. తప్పుడు నివేదికలను ప్రస్తావిస్తూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం ద్వారా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ కుట్రను తారాస్థాయికి చేర్చారు. అయితే ఆ లేఖలో ఆయన పేర్కొన్న చెన్నైలోని ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్.. ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అవశేషాలు హానికర స్థాయిలో ఉన్నట్లు నివేదికలో తాము చెప్పలేదని స్పష్టం చేసింది. ఏమాత్రం హానికరం కాని సేంద్రియ, మొక్కల నుంచి వచ్చిన పదార్థాలు అందులో ఉన్నట్లు తాము పేర్కొన్నామని వెల్లడించింది. అవాస్తవాలతో రాద్ధాంతం రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర పదార్థాల అవశేషాలున్నట్లు ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు ఫిబ్రవరి 3న ప్రధాని మోదీకి లేఖ రాశారు. స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అనే ప్రమాదకర అవశేషాలు ఉన్నట్లు ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన పవన్ పీఎంకే, చైతన్యరెడ్డి ఆ మద్యం నమూనాలను గత డిసెంబర్లో చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబ్‌కు పంపి పరీక్షించగా ఈ విషయం నిర్ధారణ అయినట్లు లేఖలో పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని టీడీపీ, ఓ వర్గం మీడియా రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగాయి. అసలు నిజం ఏమిటంటే... దీనిపై తక్షణమే స్పందించిన రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాల పరీక్షకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని లేఖ రాయడంతో ఎస్జీఎస్ ల్యాబొరేటరీ అన్ని అంశాలను వెల్లడిస్తూ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. పవన్ పీఎంకే, చైతన్యరెడ్డి గత డిసెంబర్ 11న పంపిన మద్యం నమూనాలను పరీక్షించి ఫలితాల నివేదికను అదే నెల 24వ తేదీన అందచేసినట్లు తెలిపింది. ఆ మద్యం నమూనాల్లో స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాము నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేసింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది. మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఐఎస్ 4449 (విస్కీ), ఐఎస్ 4450 (బ్రాందీ) ప్రమాణాల మేరకు తాము మద్యం నమూనాలను పరీక్షించలేదని వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అనే అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తాము నివేదిక ఇవ్వలేదని లిఖిత పూర్వకంగా స్పష్టం చేసిన ఎస్జీఎస్ ల్యాబొరేటరీ అదే మాట చెప్పిన గుంటూరు ల్యాబ్ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం నమూనాలను గుంటూరులోని కెమికల్ ల్యాబొరేటరీకి కూడా పంపి పరీక్షించింది. మద్యం నమూనాల్లో ప్రమాదకర అవశేషాలులేవని ఆ ల్యాబొరేటరీ కూడా నిర్ధారించింది. న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం ‘రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర అవశేషాలున్నట్లు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాము అలాంటి నివేదిక ఇవ్వలేదని ఎస్జీఎస్ ల్యాబరేటరీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మద్యం నమూనాలను ఎప్పటికప్పుడు ల్యాబరేటరీలలో పరీక్షించి అనంతరమే మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చడంతోపాటు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం’ – వాసుదేవరెడ్డి, ఎండీ, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ -
చింతామణి నిషేధం సవాలు వెనుక మీ ప్రయోజనాలేంటి?
సాక్షి, అమరావతి: చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేయడం వెనుక మీ ప్రయోజనాలు ఏమున్నాయని పిటిషనర్ రఘురామకృష్ణరాజును హైకోర్టు ప్రశ్నించింది. ఓవర్గం జీవనోపాధి మరోవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదని పేర్కొంది. అలా ఉంటే దానిపై తప్పక న్యాయసమీక్ష చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకరి చర్యలపై మరొకరు స్పందించేందుకు, వారి మనోభావాలను వ్యక్తం చేసేందుకు హక్కు ఉంటుందంది. చింతామణి నాటకంపై నిషేధం విషయంలో ఆర్యవైశ్యుల వాదనలు కూడా వింటామని పేర్కొంది. శ్రీకాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య వృద్ధాశ్రమం, నిత్యాన్నసత్రం కో ఆర్డినేటర్ గుబ్బా చంద్రశేఖర్ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించింది. ఇదే అంశంపై మరో 2 సంఘాలు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లను తోసిపుచ్చింది. ఒకే అంశంపై ఇన్ని పిటిషన్లు అవసరం లేదని, వీటిని అనుమతిస్తే మరికొన్ని దాఖలయ్యే అవకాశం ఉందని, ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని పేర్కొంది. దీంతో 2 సంఘాల తరఫు న్యాయవాదులు తమ ఇంప్లీడ్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. చింతామణి నిషేధం విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రశేఖర్‌ను కోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. నాటక కళాకారుడు త్రినాథ్ న్యాయవాది శ్రవణ్‌కుమార్.. తాము కూడా ఇదే అంశంపై రిట్ పిటిషన్ వేశామని కోర్టుకి చెప్పగా ఈ వ్యాజ్యంతో పాటు మిగిలిన వ్యాజ్యాలను కూడా కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. -
రఘురామ పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రిని, కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. సీఐడీ విచారణకు ప్రత్యక్షంగా కాకుండా ఆన్లైన్ ద్వారా హాజరయ్యేలా వెసులుబాటు ఇవ్వాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అలాంటి వెసులుబాటు ఇవ్వడం సాధ్యం కాదంది. రాఘురామకృష్ణరాజు తన పిటిషన్లో సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిపై స్పందించాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసు జారీచేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై సీఐడీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని, ఈ కేసుకు ఆ సెక్షన్లు వర్తించవని చెప్పారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై చేసినట్లు కాదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగమే కదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినా అవి ఆరోపణలు, అపవాదులు అవుతాయే తప్ప దేశద్రోహం కిందకు రావని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ తరఫున స్పెషల్ పీపీ చైతన్య వాదనలు వినిపిస్తూ రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు 110 మందికిపైగా సాక్షులను విచారించామని తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, దీనిపై రాష్ట్రంలో పలుచోట్ల ధర్నాలు, నిరసనలు కూడా జరిగాయని చెప్పారు. రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యంలో సీఐడీ అదనపు డీజీపై దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని, వాటన్నింటిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌తో సహా మిగిలిన ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ విచారణను వాయిదా వేశారు. ఈ సమయంలో ఆదినారాయణరావు స్పందిస్తూ సీఐడీ విచారణకు ఆన్లైన్ ద్వారా స్పందించేందుకు వెసులుబాటునివ్వాలని కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. -
ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై విచారణకు స్పీకర్ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఇచ్చిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆయన ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. ఫిబ్రవరి 3వ తేదీన ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. చదవండి: సోము వీరా.. అది నోరా?: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి -
17న విచారణకు రండి
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, ముఖ్యమంత్రిని అవమానించేలా, కులాలను కించపరిచేలా, సమాజంలో అశాంతిని రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఈ నెల 17న విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ నోటీసు జారీ చేసింది. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌లో విల్లా నంబర్ 74లో ఉన్న రఘురామ ఇంటికి సీఐడీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బృందం ఉదయం 9 గంటలకు వెళ్లింది. తొలుత సీఐడీ బృందాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. రఘురామకృష్ణరాజు న్యాయవాది వచ్చిన అనంతరం ముగ్గురిని అనుమతించారు. క్రైమ్ నంబర్ 12/2021, సెక్షన్ 153, 505, 124–ఎ రెడ్ విత్ 120బి కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ ఆయనను విచారణకు పిలిచింది. 17న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో గతంలో అరెస్టైన రఘురామకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్యాప్తునకు సహకరించాలని, మీడియా సమావేశాలు నిర్వహించకూడదని, ప్రభుత్వాన్ని, వ్యక్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయకూడదనే షరతులు ఉన్నాయి. కేసు దర్యాప్తు అధికారి, సీఐడీ ఏఎస్పీ విజయపాల్ ఇటీవల రిటైరయ్యారు. దీంతో దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ జయసూర్యకు సీఐడీ అప్పగించింది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం రఘురామను విచారించేందుకు సీఐడీ సిద్ధమైంది. కోర్టు ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, నోటీసు అందులో భాగమేనని సీఐడీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉంటే సీఐడీ నోటీసు ఇచ్చిన కొద్దిసేపటికే రఘురామ ఇంటికి అమరావతి జేఏసీ కీలక నేత వెళ్లి మాట్లాడటం గమనార్హం. మరిన్ని వివరాల కోసం నోటీసు ఇచ్చారు: రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించానంటూ గతంలో నమోదు చేసిన కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు నోటీసు ఇచ్చారని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. సీఐడీ నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలను, న్యాయస్థానాలను గౌరవిస్తానని అన్నారు. ముఖ్యమైన సంక్రాంతి పండగకు వస్తున్నానని తెలిసే ఇప్పుడు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. రేపు నరసాపురానికి వస్తున్నానని అక్కడి కలెక్టర్, ఎస్పీకి ముందుగానే తెలిపానన్నారు. కరోనా ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా విచారణకు హాజరవుతానని అన్నారు. గతంలో తనను హింసించిన సమయంలో కెమెరాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. తనను హింసించిన వీడియోలు చూసి ఎవరు ఆనందపడ్డారో తనకు తెలుసన్నారు. ఎస్సీలపైనా ఎస్సీ కేసులు పెట్టడం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. -
ఏపీ సీఐడీ అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు తొక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్ అధికారులపై నోరు పారేసుకున్నారు. సీఐడీ చీప్ సునీల్‌కుమార్ ఉన్మాది అంటూ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అధికారులపై దూషణలకు దిగారు. చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు -
రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు మరోమారు వచ్చారు. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకు నోటీసులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేయడంతో గతంలో సీఐడీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో గతంలో అరెస్టయిన రఘురామకృష్ణరాజు షరతులతో కూడిన బెయిల్‌తో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Nadu Nedu: ఏపీలో విద్య భేష్ -
దివాలా ముంగిట్లో రఘురామ కంపెనీ
సాక్షి, అమరావతి: బ్యాంకులకు రూ.వెయ్యి కోట్లకుపైగా రుణం ఎగవేత కేసులో ఎంపీ రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ కంపెనీ దివాలా ముంగిట నిలిచింది. ఆస్తులను విక్రయించో, కంపెనీని ఏకమొత్తంగా విక్రయించో రుణదాతల అప్పులు తీర్చడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దివాలా పరిష్కార నిపుణుడిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇండ్ భారత్ థర్మల్ పవర్ దివాలా ప్రక్రియకు అనుమతిస్తూ హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార నిపుణుడిగా శ్రీకాకుళం వంశీకృష్ణను ని యమించడమే కాకుండా ప్రక్రియకు సంబంధించి న వివరాలను తెలియచేసే ఫారం–2ను మూడు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. థర్మల్ కేంద్రం పేరుతో... బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ కేంద్రం ఏర్పాటు పేరుతో ఇండ్ భారత్ థర్మల్ పవర్ వివిధ బ్యాంకుల నుంచి రూ.1,383.07 కోట్ల రుణాలను తీసుకొని చెల్లించకుండా ఎగవేసింది. ఈ రుణాలకు తనఖా రూపంలో చూపించిన ఆస్తులు కేవలం రూ.872 కోట్లు మాత్రమే కావడంతో ఈ మొత్తాన్ని నిరర్థక ఆస్తులుగా ప్రకటించిన బ్యాంకులు తనఖా ఆస్తుల స్వాధీన ప్రక్రియను ప్రారంభించాయి. రూ.327 కోట్ల రుణాలను ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఇండ్ భారత్‌ను దివాలా సంస్థగా ప్రకటించాలంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ వివాదం న్యూఢిల్లీలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్‌లో ఉన్నందున ఈ పిటిషన్‌ను కొట్టివేయాలన్న ఇండ్ భారత్ వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్–2016 సెక్షన్ 13 కింద పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దివాలా ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో తెలియచేసే ఫారం–2ను మూడు రోజుల్లోగా దాఖలు చేయాల్సిందిగా స్పష్టం చేశారు. రుణం ఎగ్గొట్టిన సంస్థపై సీఐఆర్‌పీ కింద తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ ఉత్తర్వుల కాపీలను హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అందించాలని రిజిస్ట్రీని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో ఇండ్ భారత్ తనఖా పెట్టిన ఆస్తులు బ్యాంకుల పరం కానున్నాయి. -
రఘురామకృష్ణరాజుపై సీబీఐ చార్జ్‌షీట్
సాక్షి, అమరావతి: ఆర్థిక సంస్థలు, బ్యాంకులను మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులోని ట్యూటీకొరిన్‌లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇండ్ భారత్ థర్మల్ పవర్ మద్రాస్ లిమిటెడ్ అనే కంపెనీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినందున 2019 ఏప్రిల్ 29న సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.947.71 కోట్ల మేరకు మోసం చేసిన ఇండ్ భారత్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణరాజుతో సహా ఆ కంపెనీ డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు కలిపి మొత్తం 16 మందిపై న్యూ ఢిల్లీలోని సీబీఐ న్యాయస్థానంలో శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆర్థిక సంస్థలను రఘురామకృష్ణరాజు ఎలా మోసం చేశారనేది సీబీఐ ఓ ప్రకటనలో సవివరంగా వెల్లడించింది. ఇండ్ భారత్ పవర్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణం రాజు పక్కా పన్నాగంతోనే బ్యాంకులను మోసం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. తమిళనాడులోని ట్యూటికోరిన్లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్థిక సంస్థల కన్సార్షియం నుంచి రూ.947.71 కోట్లు రుణం తీసుకున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ), ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్)లతో కూడిన కన్సార్షియం రుణం మంజూరు చేసింది. కానీ రఘురామకృష్ణరాజు తమిళనాడులో థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేదు. రుణ ఒప్పంద నిబంధనలను పాటించలేదు. రుణం ద్వారా తీసుకున్న నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారు. ఆ నిధులను కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు చెల్లించేందుకుగాను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అనంతరం ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు హామీగా చూపించి ఆ రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటితో కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించినట్టుగా చూపించారు. ఆ తర్వాత ఆ రెండు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించనే లేదు. దాంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లను ఆ రుణం కింద జమ చేసుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం రుణం ఇచ్చిన ఆర్థిక సంస్థల కన్సార్షియం పూర్తిగా మోసపోయింది. ఆ విధంగా ఆర్థిక సంస్థల కన్సార్షియంను రఘురామకృష్ణరాజు రూ.947.71 కోట్ల మేర మోసం చేశారని సీబీఐ దర్యాప్తులో నిగ్గు తేలింది. పూర్తి ఆధారాలు సేకరించిన సీబీఐ ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో సంచలన చర్యలకు ఉపక్రమించనుందని సమాచారం. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న నిందితులు ► ఇండ్ భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ కంపెనీ,కె.రఘురామకృష్ణరాజు, చైర్మన్, ఎండీ, ఇండ్ ► భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ కంపెనీ మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్, ఇండ్ భారత్ పవర్ ► మద్రాస్ లిమిటెడ్ కంపెనీ ► ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ ► ఆర్కే ఎనర్జీ లిమిటెడ్ ► శ్రీబా సీబేస్ ప్రైవేట్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కళ్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ పవర్ కమాడిటీస్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ ఎనర్జీస్ మహారాష్ట్ర లిమిటెడ్ ► ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ ► సోకేయి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ► వై.నాగార్జున రావు, ఎండీ, సోకేయి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ► ఎం.శ్రీనివాసుల రెడ్డి, చార్టెడ్ అకౌంటెంట్ ► ప్రవీణ్ కుమార్ జబద్, చార్టెడ్ అకౌంటెంట్ ► సి.వేణు, ఇండ్ భారత్ గ్రూప్స్ చార్టెడ్ అకౌంటెంట్ -
రఘురామ కృష్ణరాజుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: ఏపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎలా కోరతారంటూ మండిపడింది ఉన్నత న్యాయస్థానం. కేసు దర్యాప్తుతో సంబంధం లేని వ్యక్తులు ఇప్పుడెలా పిటిషన్ వేస్తారు? ముఖ్యమంత్రి జగన్ సాక్షులను ఏమైనా ప్రభావితం చేశారా? అసలు పిటిషన్‌కు ఏ రకంగా విచారణకు అర్హత ఉందంటూ సోమవారం విచారణ సందర్భంగా పిటిషనర్ రఘురామ కృష్ణరాజును హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు సీఎం జగన్‌కు నోటీసులివ్వాలన్న అభ్యర్థనను సైతం కోర్టు తిరస్కరించింది. తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టింది తెలంగాణ హైకోర్టు. -
రఘురామ కేసులపై విచారణ వేగవంతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన కేసులపై కేంద్రం విచారణను వేగవంతం చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై నమోదైన సీబీఐ కేసుల దర్యాపును ముమ్మరం చేయాలని కోరారు. సోమవారం లోక్‌సభ జీరోఅవర్‌లో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ రాజధాని సాధనకు పాదయాత్ర చేస్తున్న రైతుల పట్ల ఏపీ ప్రభుత్వ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. రఘురామ వ్యాఖ్యలను మిథున్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘రఘురామ రెండు సీబీఐ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రంలోని అధికార బీజేపీలో చేరాలనుకుంటున్నారు. బ్యాంకులను రూ.వేలకోట్లు మోసం చేసిన కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఆయనపై ఉన్న కేసుల విచారణను కేంద్రం ప్రభుత్వం వేగవంతం చేయాలి. దర్యాప్తు వేగిరంగా పూర్తిచేయాలి’ అని కోరారు. వరదసాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి: మార్గాని భరత్ ఇటీవల వరద కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ గ్రాంటు కింద తక్షణమే రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కోరారు. జీరోఅవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇటీవలి వరదలతో రాష్ట్రంలో రూ.6 వేలకోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉందన్నారు. కిసాన్‌రైల్ రాయితీని రూ.150 కోట్లకు పెంచండి: చంద్రశేఖర్ కరోనా మహమ్మారి సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్‌రైల్ సేవలకు ప్రభుత్వం ఏటా ఇస్తున్న రాయితీని రూ.50 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కేంద్రాన్ని కోరారు. ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ రవాణా ఖర్చును టన్నుకు రూ.వెయ్యి, ప్రయాణ సమయాన్ని దాదాపు 15 గంటలు తగ్గించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ సేవలు ప్రయోజనం కలిగిస్తున్నాయని చెప్పారు. దిశ బిల్లు త్వరగా ఆమోదించండి: వంగా గీత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ బిల్లును త్వరితగతిన ఆమోదించి మహిళలు, బాలికలకు భరోసా కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఏపీ దిశ బిల్లు ఒక మైలురాయిగా పేర్కొంటూ 2019లో శాసనసభ ఆమోదించిందని చెప్పారు. మహిళలు,బాలికలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించి ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తిచేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్రం ఆమోదించాలన్నారు. ఇటువంటి కేసుల్లో సత్వర న్యాయం, కఠిన శిక్షల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయని చెప్పారు. వీటన్నింటని పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
రఘురామకృష్ణరాజు అనర్హతపై పరిశీలిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదును పరిశీలిస్తున్నామని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా తెలిపారు. సోమవారం మీడియా సమావేశం అనంతరం అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. రఘురామకృష్ణరాజును రెండోసారి వివరణ కోరినట్లు ఓం బిర్లా ఈ సందర్భంగా తెలిపారు. (చదవండి: కుప్పంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది: ఎస్ఈసీ నీలం సాహ్ని) -
‘అమూల్’ ఒప్పందంతో మీకేంటి నష్టం?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీడీ డీసీఎఫ్) ఆస్తులను గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు లీజుకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని హైకోర్టు గురువారం ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. అమూల్ విషయంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల మీరే విధంగా నష్టపోతారని నిలదీసింది. ఫలానా విధంగానే ప్రభుత్వం వ్యవహరించాలని ఎలా శాసిస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని తెలి పింది. తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులను అప్పటివరకు పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. -
బెయిల్ రద్దు చేయలేం
సాక్షి, హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వి.విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయలేమని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులను వారు ఉల్లంఘించలేదని, బెయిల్ రద్దు చేసేందుకు సహేతుకమైన కారణాలేమీ లేవని తేల్చి చెప్పింది. ఈ మేరకు రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లను బుధవారం కొట్టివేసింది. గత మూడు నెలలుగా సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు ఈ మేరకు తీర్పునిచ్చారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే.. ‘జగన్, సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. పిటిషన్ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన బాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో కేసులను విచారిస్తోంది. నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటోంది. ఈ క్రమంలో విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడటమే అవుతుంది. అలాగే బెయిల్ మంజూరు సమయంలో ప్రత్యేక కోర్టు విధించిన షరతులను వారు ఎప్పుడూ ఉల్లంఘించలేదు. బెయిల్ షరతులు ఉల్లంఘించారని భావించినప్పుడు నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం ప్రాసిక్యూషన్ విభాగానికి మాత్రమే ఉంటుంది. థర్డ్‌పార్టీకి బెయిల్ రద్దు చేయాలని కోరే హక్కు లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను కొట్టివేయండి..’ అని జగన్, సాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఇ.ఉమామహేశ్వరరావు కోర్టును కోరారు. మరో కోర్టుకు బదిలీకి కారణాల్లేవు హైకోర్టులోనూ రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బదిలీ చేయడానికి సహేతుకమైన కారణాలు లేవని స్పష్టం చేసింది. ఊహాగానాలతో రఘురామ ఈ పిటిషన్ దాఖలు చేశారని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అలా చేయాలంటే నిర్దిష్టమైన కారణాలుండాలి ‘ఏదైనా పిటిషన్‌పై విచారణను ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు బదిలీ చేయాలంటే నేర విచారణ చట్టంలో పేర్కొన్న మేరకు నిర్దిష్టమైన కారణాలు ఉండాలి. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారన్న కారణాన్ని చూపుతూ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదు. నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు అనుమతిస్తూ ఉండటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. బెయిల్ రద్దు కోరుతూ ఏప్రిల్‌లో సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సీబీఐ కోర్టుపై నమ్మకం లేదంటూ ఆ పిటిషన్లపై ఆదేశాలు ఇవ్వడానికి ఒక రోజు ముందు హైకోర్టును ఆశ్రయించడం సరికాదు..’ అని జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే అనుమానిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిపై అనుమానం వ్యక్తం చేస్తారా అని ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది. ఆ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీలు చేయలేదని.. అలాంటప్పుడు ఆ ఆదేశాలను ప్రస్తావిస్తూ, అనుమానాలు ఎలా వ్యక్తం చేస్తారని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. తాను కూడా ఇలాంటి కేసుల్లో నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించానని చెప్పారు. ఇది సహేతుక కారణం కాదని.. సదరు కోర్టు ఎదుట ఉన్న పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. అత్యవసర విచారణలో.. పెట్టుబడుల కేసులో బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో తాను వేసిన పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం భోజన విరామం తర్వాత అత్యవసర విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత నెల 26న తాము దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిందంటూ సాక్షి వెబ్సైట్లో కథనాన్ని ఉంచిందని కోర్టుకు వివరించారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రెండు వారాలపాటు దుబాయ్, మాల్దీవులు, ఇండోనేషియా దేశాల్లో పర్యటించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యేక కోర్టుపై అనుమానాలు ఉన్నాయని, అందువల్ల తమ పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేసి విచారించేలా ఆదేశించాలని కోరారు. అయితే.. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎప్పుడు పిటిషన్ దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఏప్రిల్ నెలలో వేశామని న్యాయవాది బదులిచ్చారు. ఆగస్టు 25న తమ పిటిషన్‌పై ఆదేశాలు రావాల్సి ఉందని, అయితే విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలంటూ తాము పిటిషన్ వేయడంతో.. రెండు పిటిషన్లపై ఈ నెల 15న ఆదేశాలు ఇస్తామని ప్రత్యేక కోర్టు పేర్కొన్నదని వివరించారు. అప్పీలు చేయకుండానే.. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం ఉన్నట్లయితే.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అప్పీల్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బదులిచ్చారు. అలాంటప్పుడు ప్రత్యేక కోర్టు ఆదేశాలను ఎలా ప్రస్తావిస్తున్నారని న్యాయమూర్తి నిలదీశారు. గతంలోనూ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. అప్పుడు ప్రత్యేక కోర్టు విధించిన షరతులను విజయసాయిరెడ్డి ఏమైనా ఉల్లంఘించారా అని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్‌ను ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని స్పెషల్ పీపీ తెలిపారు. అంతేగాకుండా మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సహేతుక కారణాలేవీ చూపకుండానే, బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్న తరుణంలో ఇలా పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. నిందితులు విదేశాల్లో పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనేక సార్లు ఆదేశాలు ఇస్తూ ఉంటుందని.. అంత మాత్రాన పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. -
మరోసారి బట్టబయలైన రఘురామ, చంద్రబాబు బంధం
సాక్షి, అమరావతి: తమ స్వార్థ రాజకీయాల కోసం పేదల నోటికాడ కూడును సైతం లాగేసే స్థాయికి రాష్ట్రంలోని ప్రతిపక్షాల రాజకీయం దిగజారింది. నిబంధనల ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ప్రతిపక్ష నేతలు మోకాలడ్డుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏకంగా రాష్ట్రానికిచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్‌కు సంబంధించి సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారంలో చంద్రబాబు–రఘురామకృష్ణరాజు మధ్య గల సంబంధాలు ఆధారాలతో సహా ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. పేదలకు ‘ఉపాధి’ని దూరం చేసే కుట్ర ఉపాధి హామీ పథకం కింద మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలంటూ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది మార్చి 16న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు. దీంతో ఆ లేఖకు సంబంధించి సమగ్ర నివేదిక పంపాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ స్థాయి అధికారి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ఏడాది రూ.1,700 కోట్లు బకాయిల రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.3 వేల కోట్లు అందాల్సి ఉంది. ఈ నిధులను రాబట్టేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులను కలిసి నిధులను రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా.. రాష్ట్రానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులే ఆ నిధులను వెనక్కి తీసుకోవాలని లేఖలు రాస్తుండటం కేంద్ర ప్రభుత్వ అధికారులకు అలుసుగా మారిందని చెబుతున్నారు. ఇలాంటి లేఖల ద్వారా పేదల కడుపు కొట్టడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లరి పాల్జేయాలని ప్రయత్నించడంపై ప్రజలు ఛీ కొడుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రానికి ఇవ్వాల్సిన దాదాపు రూ.4,700 కోట్లను విడుదల చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. కరోనా రోజుల్లో 80 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా.. కరోనా మహమ్మారి వేళ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పనులు పేదలకు ఊరటనిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతోపాటు ఈ ఏడాది కూడా పట్టణాల్లో చిన్నచిన్న పనులు చేసుకుని జీవించే వారు కరోనా కారణంగా తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు ఉపాధి హామీ పథకం పనులే కొండంత ఆసరాగా నిలుస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 79.80 లక్షల మంది ఉపాధి హామీ పనులు చేసుకుని ఆదాయం పొందగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 72.64 లక్షల మంది పేదలు ఆ పనులు చేసుకుని లబ్ధి పొందారు. రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ శాఖల నిధులకు తోడు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరీ నిధుల అనుసంధానంతో గ్రామీణ ప్రాంతాల్లో 46,861 భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోనే రూ.311 కోట్ల విలువ చేసే 1,408 భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కేంద్రానికి రఘురామకృష్ణరాజు రాసిన లేఖ ప్రతులు ‘స్లీపర్ సెల్స్’ ద్వారా మాటువేసి విధ్వంసానికి తెగబడటం ఉగ్రవాద సంస్థలు అనుసరించే పన్నాగం. వ్యవస్థలు, సంస్థల్లో తనవారిని జొప్పించి రాజకీయ లబ్ధికి వాడుకోవడం చంద్రబాబు అనుసరించే వ్యూహం. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి బాబు ప్రస్తుతం ఇదే ఎత్తుగడలను అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఎంపీ రఘురామ కేంద్రానికి రాసిన లేఖ తేటతెల్లం చేస్తోంది. ఓట్లేసిన వారిని కాదని టీడీపీ అవినీతికి మద్దతు రఘురామకృష్ణరాజు ఓట్లు వేసి తనను గెలిపించిన ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి తన నియోజకవర్గంలో గ్రామాల్లో జరుగుతున్న 1,408 పనులకు సంబంధించి రూ.311 కోట్ల నిధులు రాకుండా కేంద్ర మంత్రికి లేఖ రాయడంపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. 2019 ఎన్నికలకు 8 నెలల ముందు అప్పటి టీడీపీ సర్కారు నిధులు అందుబాటులో లేకపోయినా ఆ పార్టీ కార్యకర్తలకు రూ.2 వేల కోట్ల విలువ చేసే పనులను మంజూరు చేసి, అవి పూర్తయినట్టు బిల్లులు కూడా సిద్ధం చేసింది. దానిపై తీవ్ర ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పట్లో జరిగిన 11,573 పనులను తనిఖీ చేయగా.. 7,326 పనుల్లో అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయింది. అందులో దాదాపు సగం పనులు నూటికి నూరు శాతం నాసిరకమైనవిగా తేలింది. టీడీపీ నేతల అవినీతికి మద్దతుగా నిలిచిన రఘురామకృష్ణరాజు వారికి ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ ఫిర్యాదు చేస్తూ.. రాష్ట్రానికిచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కోరడాన్ని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.