
ఈ నెల 30న సచివాలయాన్ని ముట్టడిస్తాం
మాల మహానాడు జేఏసీ నేతల అల్టిమేటం
సాక్షి, అమరావతి: అంబేడ్కర్ ఫ్లెక్సీని చించి దళితులను అవమానించడంతోపాటు ఎస్సీలను దూషించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై కేసు నమోదు చేసి ఈ నెల 29లోగా అరెస్ట్ చేయాలని మాల సంఘాల జేఏసీ, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయకపోతే ఈ నెల 30న రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం వద్ద మాల సంఘాల జేఏసీ, దళిత సంఘాల నేతలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లి రాజే‹Ù తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్‌బుక్’ పడగ
Comments
Please login to add a commentAdd a comment