Dalit communities
-
29లోగా రఘురామను అరెస్టు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: అంబేడ్కర్ ఫ్లెక్సీని చించి దళితులను అవమానించడంతోపాటు ఎస్సీలను దూషించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై కేసు నమోదు చేసి ఈ నెల 29లోగా అరెస్ట్ చేయాలని మాల సంఘాల జేఏసీ, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయకపోతే ఈ నెల 30న రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం వద్ద మాల సంఘాల జేఏసీ, దళిత సంఘాల నేతలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లి రాజే‹Ù తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్‌బుక్’ పడగ -
దళిత సంఘాల కన్నెర్ర
సాక్షి నెట్వర్క్: ఎమ్మెల్యేలు కె.రఘురామకృష్ణరాజు, పంతం నానాజీ దురాగతాలపై దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. వారిద్దరి తీరుపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి తెగబడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నేతలు నినదించారు. విశాఖ ఎల్ఐసీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత హక్కుల పోరాట సమితి, భీమ్‌సేన, కేవీపీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రఘురామకృష్ణరాజు దురాగతాన్ని హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావును దూషించి దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుడి ఘటనపై స్పందించని కాకినాడ ఎస్పీ, కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని కోరారు. కాగా.. ఉండి ఎమ్మెల్యే రఘురామ తీరుపై పల్నాడు జిల్లా అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. రఘురామను శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నాయకుడు తోకల సూరిబాబు, మండల సీఐటీయు కార్యదర్శి బి.సూరిబాబు, వైఎస్సార్సీపీ కారి్మక విభాగం నాయకుడు దారా ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు అంబేడ్కర్‌ను అవమానపరిచిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు బాపట్ల జిల్లా రేపల్లెలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైభీమ్ యాక్సెస్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. తక్షణ చర్యలకు కార్పొరేటర్ల డిమాండ్ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్టరాజు, దళిత డాక్టర్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను, దళిత డాక్టర్‌ను అవమానించిన ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలను అడ్డుకునేందుకు జనసేన, టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారు వెనక్కి తగ్గలేదు.డీజీపీకి మెమోరాండం అంబేడ్కర్ ఫొటోతో ఫ్లెక్సీ చించేసి దళితుల్ని అవమానపర్చిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, దళిత ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు పీవీ రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ విజయవాడలో తెలిపారు. మంగళవారం డీజీపీని కలిసి ఈ మేరకు మెమోరాండం అందజేసినట్టు తెలిపారు. ఇద్దర్నీ అరెస్ట్ చేయాల్సిందే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. -
భగ్గుమన్న దళితులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అవమానించడంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళితులను దుర్భాషలాడుతూ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేయడంపై తీవ్రంగా స్పందించాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. తక్షణమే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. పెద్ద ఎత్తున నిరసనలు » ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దళిత నాయకులు ఆదివారం ఏలూరుపాడుకు చేరుకుని రా్రïÙ్టయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిõÙకం చేశారు. రఘురామకృష్ణరాజుపై 24 గంటల్లో అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, దళిత నాయకులు చీకటిపల్లి మంగరాజు, పెండ్ర వీరన్న, సుధామ, నల్లి రాజే‹Ù, గుమ్మాపు వరప్రసాద్, తాళ్లూరి మధు తదితరులు ఏలూరుపాడు గ్రామాన్ని సందర్శించి దళిత నాయకులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం సాయత్రం భీమవరం అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. » ఏపీ బహుజన జేఏసీ, జై భీమ్ సేవాదళ్ ఆధ్వర్యాన భీమవరం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. జాతులు, కులాల మధ్య గొడవలు సృష్టించే విధంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రవర్తించారని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. » తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట సామాజిక న్యాయ పోరాట సమితి, జై భీమ్ యువజన సంఘం, సమత యువజన సంఘం, తణుకు అడ్వొకేట్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబేడ్కర్‌ను అవమానించి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, కాకినాడలో దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తణుకు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, నరేంద్ర సెంటర్లలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. » చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోటలో దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంభం విజయరాజు మద్దతు తెలిపారు. » నూజివీడులో మాల యోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. రఘురామకృష్ణరాజుపై నూజివీడు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సరికాదు. ఏలూరుపాడులో ఆయన స్వయంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించడం దారుణం. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలకు, అంబేడ్కర్ వాదులు అందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి. –పెండ్ర వీరన్న, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్బాబు పాలనలో దళితులపై దాడులు చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు సర్వసాధారణం. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన రఘురామకృష్ణరాజు ఏకంగా రాజ్యాంగ నిర్మాతనే అవమానించడంపై గవర్నర్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి. కాకినాడలో డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ దాడి చేయడం సిగ్గుచేటు. ఇద్దరు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి. – నల్లి రాజే‹Ù, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడుఅట్రాసిటీ కేసు నమోదు చేయాలి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించిన రఘురామకృష్ణరాజు ఇప్పటికైనా తన తీరు మార్చుకుని అంబేడ్కర్‌కు క్షమాపణ చెప్పాలి. లేకపోతే దళితులంతా ఆయనకు తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారు. – కాకిలేటి ఆనందకుమార్ (మధు), వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శికులాల మధ్య చిచ్చుకే..ఏలూరుపాడులో ప్రపంచ మేధావి అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే ఓ చదువుకోలేని అనామకుడిలా ప్రవర్తించి ఫ్లెక్సీలు చించివేయడం దారుణం. దళితుల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి గౌరవం లేదు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చుపెట్టి హీరో అవ్వాలని దురుద్దేశంతో ఫ్లెక్సీని చించి అంబేడ్కర్‌ని అవమానించారు. – గుమ్మాపు సూర్య వరప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, పీవీ రావు మాల మహానాడుకుల, ధన అహంకారంతోనే.. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన కుల, ధన అహంకారంతో రెచి్చపోయి అంబేడ్కర్ ఫొటో ఉన్న ఫ్లెక్సీని చించివేశారు. ఆ ఫ్లెక్సీ తొలగించే క్రమంలో ఆయన వాడిన భాష, బూతులు దారుణం. రఘురామకృష్ణరాజు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – పేరూరి మురళీకుమార్, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపకుడు, తణుకుజాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాలినెహ్రూనగర్/గోపాలపట్నం: టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు నిరసన వ్యక్తంచేశారు. భీమ్ సేన సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపు నీలాంబరం మాట్లాడుతూ అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చించివేయడం, దళితులను దుర్భాషలాడటం సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుని రఘురామకృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకుని దళితుల మనోభావాలు కాపాడాలని కోరారు. అదేవిధంగా కాకినాడలో దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావును దుర్భాషలాడటంతోపాటు, దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, పంతం నానాజీలపై అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత సంఘాల నాయకులు విద్యాసాగర్, చిన్నం డేవిడ్ విలియమ్స్, బత్తుల అనిల్, మనోజ్‌కుమార్, మస్తాన్‌రావు, మనోహర్, విజయరాజు, జోసెఫ్, శంకర్, కాంతారావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలికాకినాడలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్‌పై ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం, అంబేడ్కర్ ఫ్లెక్సీని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చించివేయాన్ని ఖండిస్తూ విశాఖపట్నంలోని ఎన్ఏడీ కొత్త రోడ్డులో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వెల్ఫేర్ సంఘం సభ్యులు నిరసన తెలిపారు. పంతం నానాజీ, రఘురామకృష్ణరాజులను ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వెల్ఫేర్ సంఘం సభ్యులు వెంకటేశ్వరరావు, ప్రసాద్, సోడదిశి సుధాకర్, అప్పారావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.వీధిరౌడీలా వ్యవహరించారు రఘురామకృష్ణరాజు ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక వీధిరౌడీలా వ్యవహరించారు. నిజంగా అక్కడ వారికి ఫ్లెక్సీ అడ్డుగా ఉంటే పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా తీయించాలి. ఇందుకు విరుద్ధంగా ఎమ్మెల్యే బూతులు తిడుతూ ఆయనే తొలగించడం దారుణం. – గొల్లపల్లి అంబేడ్కర్ సీనియర్ న్యాయవాది, తణుకు -
అంబేద్కర్‌పై ‘పచ్చ’మూకల ఉన్మాదం.. దళిత సంఘాల ఆందోళన
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడిని దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంబేద్కర్ స్మృతివనం దగ్గర దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ వాదులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. గత రాత్రి జరిగిన దుశ్చర్య అంబేద్కర్ మహనీయుడి పై జరిగిన దాడిగానే చూస్తాం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేయించిన దాడేనని.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.పరాకాష్టకు టీడీపీ దాడులు: మల్లాది విష్ణుఅంబేద్కర్ విగ్రహంపై దాడిని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ మాన్యుమెంట్‌పై వైఎస్ జగన్ పేరును తొలగించిన ప్రాంతాన్ని నేతలు పరిశీలించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అంబేద్కర్‌పై దాడి హేయమైన చర్య అన్నారు.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం: పుష్పశ్రీవాణిపార్వతీపురం మన్యం జిల్లా: డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన కూటమి నేతలను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడులు పరాకాష్టకు చేరాయి. అంబేద్కర్ విగ్రహం పై దాడి చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగ మాత్రం అమల్లో ఉంటుందని అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉండదని చెప్పినట్టుగా వీళ్లు తీరు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ రూ. 440 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో అధికారులు, పోలీసులు సమక్షంలో అంబేద్కర్ విగ్రహం పై దాడి జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది’’ అని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు.విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహంపై తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం.గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేడ్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి.. తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి.రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారు. వీరి మాటలను బట్టిచూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోంది. -
బాబు బహుజనుల ద్రోహి
తాడికొండ: పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారకుడైన చంద్రబాబు ఇక బహుజనులకేం న్యాయం చేస్తాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 111వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు దళిత నాయకులు ప్రసంగించారు. కుల పిచ్చితో చంద్రబాబు అమరావతి పేరిట చేస్తున్న దోపిడీకి ఎన్నికల్లో దళిత బహుజనులు ఓటు ద్వారా అడ్డుకట్ట వేయడంతో అధికారం కోల్పోయిన బాబు బహుజనులపై ద్వేషంతో హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తుండడం సిగ్గుమాలిన చర్య అన్నారు. నందమూరి వంశాన్ని పతనం చేసి నారా వారి చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి చనిపోవడానికి కారకుడయ్యాడని ఆరోపించారు. రాజధానిలో అంబేడ్కర్ విగ్రహం కడతానని బహుజనులను మోసం చేయడం ఒక ఎత్తయితే.. మామ ఎన్టీఆర్‌కు విగ్రహం అయినా పెడతాడని చూసిన 29 గ్రామాల రైతులు నేడు ఆయన చిత్రపటాలతో రోడ్లపై నివాళులర్పించాల్సిన దుస్థితి రావడం బాధాకరమన్నారు. బాబు అండ్ కో కోర్టుల్లో వేసిన కేసుల్లో స్టేలను తొలగించేలా సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసి బహుజనులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. -
దళిత దళారులతో చంద్రబాబు బేరాలు
తాడికొండ: మూడు రాజధానులకు మద్దతుగా ఉధృతంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు.. కొంతమంది దళిత దళారులతో రౌండ్ టేబుల్ సమావేశం పేరిట బేరసారాలు కుదుర్చుకుంటున్నాడని బహుజన పరిరక్షణ సమితి నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 74వ రోజు రిలే నిరాహార దీక్షల్లో పలువురు నేతలు ప్రసంగించారు. గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ఓటు హక్కుతో తరిమేసినా..బుద్ధి రాకుండాపోయిందని ఎద్దేవా చేశారు. దళిత దళారులతో బేరసారాలు ఆడుతూ ప్యాకేజీ ఇవ్వడం సిగ్గు చేటన్నారు. ప్యాకేజీ పార్టీలను వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను మసకబార్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని, దళిత దళారులకు, చంద్రబాబు తోక పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగబద్ధంగా తమకు అందించిన హక్కులను పొందే అవకాశం లేకుండా కుయుక్తులు పన్నుతున్న వారిపై త్వరలో కోర్టును ఆశ్రయించి తగిన శిక్ష పడేలా ముందుకు నడుస్తామన్నారు. పలు దళిత సంఘాల నాయకులు మాదిగాని గురునాధం, పెరికే వరప్రసాద్, బేతపూడి సాంబయ్య, నూతక్కి జోషి, ఈపూరి ఆదాం, మల్లవరపు సుధారాణి, ఇందుపల్లి సుభాషిణి, జుజ్జూరపు జస్వంత రాణి, బైదాల సలోమీ తదితరులు పాల్గొన్నారు. -
మూడు రాజధానుల కోసం బహుజన పోరాటం
తాడికొండ: మూడు రాజధానుల సాధన కోసం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 54వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. చంద్రబాబు తన వక్రబుద్ధి మార్చుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వకపోతే దళిత, బహుజన సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు రాకుండా అడుగడుగునా అడ్డు తగలడం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు తగదన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు వడిత్యా శంకర్‌నాయక్, చెట్టే రాజు, నూతక్కి జోషి, బూదాల సలోమీ తదితరులు పాల్గొన్నారు. -
పేదల జీవితాలతో చంద్రబాబు రాక్షస క్రీడ
తాడికొండ: చంద్రబాబు ఆడుతున్న రాక్షస క్రీడలో దళితులు, బలహీన వర్గాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని చీరాల మార్కెట్ యార్డు చైర్మన్ మార్పు గ్రెగోరీ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు కోర్టుకు వెళ్లలేరనే ధీమాతోనే చంద్రబాబు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం విద్యపై అమెరికాలో ఉన్న ఎన్నారైలతో కోర్టుల్లో తప్పుడు కేసులు వేయించి అడ్డుకుంటున్నారని విమర్శించారు. మాతృభాషపై బాబుకు నిజంగా మమకారం ఉంటే కార్పొరేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు చేయించి.. తన మనవడు దేవాన్ష్‌ను సైతం తెలుగు మీడియం పాఠశాలలో చదివించాలని సవాల్ చేశారు. పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు అమరావతి దీక్షల్లో ‘ఆడీ కార్ల రైతుల’తో హంగామా చేయిస్తున్న బాబు.. పేదలు, దళిత వర్గాలు రాజధానిలో నిరసనలు తెలియజేస్తుంటే దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. దళిత నేతలు నత్తా యోనారాజు, పెరికే వరప్రసాద్, పిడతల అభిషేక్, శీలం శ్యామ్, బేతపూడి సాంబయ్య, కోపూరి నాని బాబు, నూతక్కి జోషి, పైడి రాజేష్, డేవిడ్ కుమార్, సుభాషిణి, బూదాల సలోమి, సౌమ్య, పులి దాసు, గంజి రాజేంద్ర, కొలకలూరి లోకేష్, ఈపూరి ఆదాం పాల్గొన్నారు. కాగా, బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దళిత సంఘాలు, నాయకులు వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చి తమ మద్దతు తెలుపుతున్నారు. -
తన వర్గం కోసమే చంద్రబాబు తాపత్రయం
తాడికొండ: చంద్రబాబు తన బినామీలైన సుజనాచౌదరి, మాజీ మంత్రులతో పాటు తన సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే తాపత్రయ పడుతున్నాడని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పర్యవేక్షణ కమిటీ కన్వీనర్ కొదమలకుమార్ విమర్శించారు. పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో కొనసాగుతున్న దీక్షలు సోమవారానికి 27వ రోజుకు చేరాయి. ఆదివారం 26వ రోజు జరిగిన దీక్షల్లో కొదమల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు న్యాయ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని కోర్టుల్లో తన వర్గ న్యాయవాదులను జొప్పించి పేదలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రఘురామకృష్ణరాజు డబ్బు మదంతో మహిళలను వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని, ఇంకోసారి ఇలా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బాబుకు బుద్ధి చెప్పాల్సిందే.. 27వ రోజైన సోమవారం నిర్వహించిన దీక్షల్లో పాల్గొన్న మోడల్ అసోసియేషన్ ఆఫ్ దళిత ఎంప్లాయీస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మురికిపూడి దేవపాల్ మాట్లాడుతూ చంద్రబాబు తన బినామీలతో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నాడన్నారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే సీఎం వైఎస్ జగన్ సంకల్పం గొప్పదని, చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో దళిత నేతలు బూదాల సలోమీ, పరిశపోగు శ్రీనివాసరావు, పిడతల అభిõÙక్, పులి దాసు, కొలకలూరి లోకేష్, బందెల భాను కుమార్, గుండాల ప్రసాద్, బుర్రి సుధాకర్, సలివేంద్రపు బాల సుందరం, పెద్దిపాగ బాబు, దాసరి సుదీర్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారు. దీంతో పలు దళిత సంఘాలు చంద్రబాబు వైఖరిపై మండిపడ్డాయి. విజయకుమార్‌ను అవమానించే విధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఇవి అహంకార పూరిత వ్యాఖ్యలని పలువురు నాయకులు ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వివిధ దళిత నాయకులు ఏమన్నారంటే.. సుమోటోగా అట్రాసిటీ కేసు చంద్రబాబూ.. ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను నీచంగా చూస్తావా? ‘వాడు’ అని సంబోధిస్తావా? ఎంత అహంకారం.. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సుమోటోగా నమోదు చేస్తాం. దళితులు తగిన బుద్ధి చెబుతారు. – కారెం శివాజీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, విజయవాడ. బాబును దళితులు క్షమించరు పదవి పోయిన చంద్రబాబుకు పూర్తిగా మతిభ్రమించింది. ఒక దళిత ఐఏఎస్ అధికారిని ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయనకు తగదు. దళితులు చంద్రబాబును క్షమించరు. ఆయన దళిత సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. – పెదపాటి అమ్మాజీ, ఏపీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ దళితులంటే బాబుకు చులకన గతంలో కూడా చంద్రబాబు, అప్పటి టీడీపీ మంత్రులు దళితులను చులకన చేసి మాట్లాడారు. దళిత ఐఏఎస్‌ను అవమానించిన చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దళిత ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులు సమిష్టిగా ఈ విషయంపై స్పందించి బాబుకు తగిన బుద్ధి చెప్పాలి. – కొమ్మూరి కనకారావు, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ చంద్రబాబును అరెస్టు చేయాలి విజయకుమార్‌ను అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబునాయుడును అరెస్టుచేయాలి. ఒక ఐఏఎస్ అధికారినే ఇలా అన్నారంటే సామాన్యులను ఏ స్థాయిలో చూస్తారో అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదుచేయాలి. – కల్లూరి చెంగయ్య, జాతీయ అధ్యక్షులు, ఐక్య దళిత మహానాడు ఐఏఎస్‌లంతా ఖండించాలి ఐఏఎస్ అధికారికి ఎవరైనా కనీస గౌరవం ఇవ్వాలి. ప్రభుత్వ సూచన మేరకు బోస్టన్ కమిటీ నివేదికను వివరిస్తే ‘వాడు మాకు చెబుతాడా’.. అని అంటారా? ఈ వ్యాఖ్యలు చంద్రబాబును ఎంతో దిగజార్చాయి. దీనిని ఐఏఎస్‌లు అంతా ఖండించాలి. – నల్లి రాజేష్, రాష్ట్ర అధ్యక్షుడు, మాల మహానాడు ఉద్దేశపూర్వకంగా అవమానించారు చంద్రబాబునాయుడుకు ఐఏఎస్ అధికారి విజయకుమార్ దళితుడని తెలుసు. కావాలనే అహంకారంతో అవమానకరంగా మాట్లాడారు. పాలకునిగా పనికిరాడని ప్రజలు తిరస్కరించినా బుద్ధిరాలేదు. – నీలం నాగేంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు, దళిత హక్కుల పోరాట సమితి రాజకీయాల నుంచి తప్పుకోవాలి ఐఏఎస్ విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబు తక్షణం రాజకీయాల నుంచి తప్పుకోవాలి. లేకుంటే దళితులు తగిన బుద్ధి చెబుతారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలి. ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. – కొమ్ము సుజన్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు, మాదిగ సంక్షేమ పోరాట సమితి. బహిరంగ క్షమాపణ చెప్పాలి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే దళితులను హేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోవడంలేదు. దళిత అధికారిని అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. – బత్తుల వీరాస్వామి, అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫ్యూడల్ స్వభావం బయటపడింది చంద్రబాబు ఫ్యూడల్ స్వభావం బయటపడింది. దళితులను అవమానించడం ఆయనకు అలవాటు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద ప్రభుత్వం కేసు నమోదు చేయాలి. – దారా అంజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, పీవీ రావు మాలమహానాడు. -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై దళిత నాయకుల ఆగ్రహం
-
బుచ్చయ్యా.. ఇదేం పద్ధతయ్యా!
రాజమహేంద్రవరం రూరల్: మనల్ని విడిచి వెళ్లిపోయిన మహనీయుల సేవలు ప్రతి నిత్యం మనకు గుర్తుండాలని వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం. పేరుకు అది విగ్రహమే అయినా ఆ మహానుభావుల ప్రతిరూపాన్ని అందులో చూసుకుంటాం. వారి విగ్రహాల వద్దకు వెళ్లినప్పుడు నమస్కరించి పూలమాలలు వేసి, గౌరవాభిమానాలను చాటుకుంటాం. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భిన్నంగా వ్యవహరించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై తన మోచేతిని ఆనించి ఫొటోలకు పోజులిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామంలో సోమవారం జరిగిన టీడీపీ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఫొటో మంగళవారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. విషయం తెలుసుకున్న పలువురు దళిత సంఘాల నాయకులు గోరంట్ల తీరును తప్పుపడుతున్నారు. వెనుకబడిన వర్గాలకు బీఆర్ అంబేడ్కర్ దైవంతో సమానమని పేర్కొంటూ.. అటువంటి మహనీయునిపట్ల టీడీపీ సీనియర్ నేత గోరంట్ల వ్యవహరించిన తీరుపై వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తదితర నేతలు దళితులపై తమ మాటల్లో చులకన భావం చూపిస్తే.. గోరంట్ల అంబేడ్కర్ విగ్రహంపట్ల అవమానకరంగా వ్యవహరించి, తన నైజాన్ని బయట పెట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు అన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్దకు ఏ స్థాయి నాయకుడు వచ్చినా వినయంతోనే వస్తారన్నారు. కానీ, గోరంట్ల మాత్రం తన దర్పాన్ని ప్రదర్శించే విధంగా వ్యవహరించారన్నారు. ఇందుకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాజబాబు డిమాండ్ చేశారు. -
భారత్ బంద్‌కి తొలి పిలుపెవరిది?
‘కంట్రీ విల్ గవర్న్‌డ్ బై కానిస్టిట్యూషన్, నాట్ ఫాసిజం’ నినాదానికి పునాది ఎవరు? ఒక్క వాట్సాప్ మెసేజ్ నిర్భయ ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీ పురవీధుల్లో యువతరం కదం తొక్కేలా చేసింది. ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్ ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ మరణాన్ని ధిక్కరించేలా చేసింది. ఇప్పుడు ‘కంట్రీ విల్ గవర్న్డ్బై కానిస్టిట్యూషన్, నాట్ ఫాసిజం’ అనే నినాదం స్ఫూర్తితో భారత్ బంద్ పిలుపు దేశాన్ని అట్టుడికేలా చేసింది. ఈ అనూహ్యమైన ఉద్యమం ఆరంభానికి దారితీసిన సామాజిక, రాజకీయ పరిస్థితులు ఒక ఎల్తైతే, భారత్ బంద్ పిలుపుతో ఉద్యమాన్ని రాజుకునేలా చేసిన చిన్న నిప్పు కణికలాంటి వాట్సాప్ మెసేజ్ ఒక ఎత్తు. నిజానికి ఈ ఉద్యమానికి స్ఫూర్తి ఎవరు? సౌరాన్పూర్ పునాదిగా ఏర్పడిన భీమ్ ఆర్మీనా, జాతీయ దళిత సంఘాల సమాఖ్య (నాక్‌డర్) కారణమా లేదంటే ఇంకెవరైనా యువకులు ఈ ఉద్యమాన్ని వెనకుండి నడిపించారా? అసలు మొదట భారత్ బంద్ పిలుపుని వాట్సాప్‌లో పంపిందెవరు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ, ఎస్టీల వేధింపు నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుని నిరసిస్తూ దేశవ్యాప్తంగా, ప్రధానంగా ఉత్తరాదిన ఎగిసిన దళిత ఉద్యమం సోమవారం హింసాత్మకంగా మారి, పరిస్థితి తీవ్రతను కొనసాగిస్తోంది. అనేక పోరాటాల అనంతరం సాధించుకున్న ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ని నీరుగార్చడం తగదంటూ వెల్లువెత్తిన ప్రజాపోరాటానికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కలిపి 9 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపివేస్తోంది. అయితే ఉత్తరభారతమంతటినీ అట్టుడికేలా చేసిన ఈ ఉద్యమం అసలు రాజుకున్నదెక్కడ అనేదే ఇప్పుడు హాట్ టిపిక్‌గా మారింది. ఒకే సారి అన్ని చోట్లా ఈ ఉద్యమం ఎగిసిపడడానికి పునాది ఎవరు? సోమవారం జరిగిన భారత్‌బంద్‌ను ఇంత మిలిటెంట్‌గా నడిపిందెవరు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఉద్యమం ఆరంభాన్ని అంచనా వేసేందుకు చేసిన ప్రయత్నంలో అనేక విషయాలు వెలుగుచూసాయి. అశోక్ భారతి నేతృత్వంలోని జాతీయ దళిత సంఘాల సమాఖ్య ( నాక్‌డర్) మొదట భారత్ బంద్ పిలుపునిచ్చిందా? లేక సోషల్ మీడియానే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిందా? అనే విషయం అక్కడి భద్రతా దళాలను సైతం గందరగోళంలో ముంచేసింది. సోమవారం సాయంత్రం వరకు ఎవరిదో తెలియని ఫోన్ నంబర్ నుంచి వచ్చిన ఈ వాట్సాప్ మెసేజే ఈ ఉద్యమానికి ఊపరిలూదిందని భావించారు. అయితే నిజానికి ఈ విషయాన్ని అంచనా వేయడంలో స్థానిక ఇంటెలిజన్స్ సహా ప్రభుత్వ యంత్రాంగమంతా పూర్తిగా విఫలమైనట్టు నేషనల్ మీడియా అభిప్రాయపడింది. మొట్ట మొదట అశోక్ భారతి నాయకత్వంలోని జాతీయ దళిత సంఘాల సమాఖ్య (నాక్‌డర్) భారత్ బంద్‌కి పిలుపునిచ్చినట్టు భావించారు. క్రమేణా అన్ని దళిత సంఘాలు, ఉద్యమకారులు వ్యక్తులు, సంస్థలు ఒక్కొక్కటీ ఇందులో చేరాయని అంచనా వేస్తున్నారు. అయితే భీం ఆర్మీతో సహా అనేక సంఘాలు, సంస్థలు ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ భీం ఆర్మీ ప్రధాన సలహాదారు జై భగవాన్ జాటవ్ ఈ ఉద్యమాన్ని ‘లీడర్‌లెస్ ఉద్యమంగా’ పేర్కొనడం గమనార్హం. తీర్పు వెలువడిన తరువాత మంగళవారం భీం ఆర్మీ ఏర్పాటు చేసిన సమావేశానికి మొత్తం 25 దళిత సంఘాలు హాజరై భవిష్యత్ ఉద్యమంపై చర్చించినట్టు ఆయన తెలిపారు. అయితే సోమవారం ఉవ్వెత్తున ఎగిసిపడిన ఈ ఉద్యమం మాత్రం దానంతటదే స్వచ్ఛందంగా రాజుకున్నదేననీ, దానికి ప్రత్యేకించి నాయకులెవ్వరూ లేరనీ మీడియాతో ప్రస్తావించారు. ఇది కేవలం వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంగా అంటుకుని దావానలంలా వ్యాపించిందని జాటవ్ స్పష్టం చేశారు. కేవలం ఏ ఒక్క దళిత సంఘమో దీని వెనుక లేదని జాటవ్ తేల్చి చెప్పారు. ఉద్యమం ముందుభాగాన ఉన్న జాతీయ దళిత సంఘాల సమాఖ్య నాయకురాలు సుమేధ మీడియాతో మాట్లాడుతూ మార్చి 20న తీర్పు వెలువడిన అనంతరం తమ నాయకుడు అశోక్ భారతి మార్చి 21–22 తేదీల్లో ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పటికీ, చివరకు ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని దేశంలోని అన్ని దళిత సంఘాలకు సమాచారమిచ్చినట్టు తెలిపారు. అయితే భీం ఆర్మీ ప్రధాన సలహాదారు జాటవ్ మాత్రం కొందరు ఈ ఉద్యమాన్ని తమదిగా చెప్పుకుంటున్నారనీ, నిజానికి ఏదో తెలియని నంబర్ నుంచి వచ్చిన ఈ వాట్సాప్ మెసేజ్ ను సంఘం యువకులు సోషల్ మీడియా ద్వారా విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టు తెలిపారు. అలాగే ఎవరో పంపిన ఈ వాట్సాప్ మెసేజ్‌లో ‘ భారత్ బంద్‌ని జయప్రదం చేయాలనీ, ఈ మెసేజ్ అందిన ప్రతి ఒక్కరూ పది మందికి చొప్పున ఫార్వర్డ్ చేయాలనీ, లేదంటే మీరూ, మీ భవిష్యత్ తరాలూ వేధింపులకు గురికాక తప్పదని’ ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సమాచారాన్ని ఉత్తరప్రదేశ్ భీం ఆర్మీ యువత విస్త్రుతంగా ప్రచారంలోనికి తెచ్చినట్టు పేర్కొన్నారు. తమ డిమాండ్‌ని ప్రభుత్వం అంగీకరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని జాటవ్ స్పష్టం చేశారు. అయితే ఈ ఉద్యమం ఊపందుకున్న రాష్ట్రాలు దళితులపై వేధింపుల్లో అగ్రభాగాన ఉన్నాయనీ, ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే కొనసాగుతున్న దళితుల వేధింపులు, దళిత స్త్రీలపై అత్యాచారాలు, గో రక్షక్‌ల దాడులు, అగ్రవర్ణాల దురాగతాలతో విసిగి వేసారి ఉన్న దళితులకు సుప్రీం తీర్పు అగ్నికి ఆజ్యం పోసిందని జాతీయ దళిత సంఘాల సమాఖ్య నాయకుడు అశోక్ భారతి వ్యాఖ్యానించారు. అయితే నిజానికి కొంత మేరకు దళిత సంఘాలు ఈ ఉద్యమానికి సన్నాహాలు చేసిన మాటనిజమే అయినప్పటికీ సోషల్ మీడియాది సైతం ఇందులో కీలక పాత్రగా అందరూ అంగీకరిస్తున్న విషయం. -
ఆగ్రహజ్వాల
-
ఆగ్రహజ్వాల
► మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు ► నిరాశలో ధూళిపాళ్ల, మోదుగుల, యరపతినేని ► రావెలను తొలగించడంపై దళిత సంఘాల ఆందోళన ► మోదుగుల కార్యాలయంలో కార్యకర్తల సమావేశం మంత్రి పదవులు ఆశించినపలువురు అధికార పార్టీ నేతలు భంగపడ్డారు. పార్టీకి విధేయులుగా ఉన్నా సీఎం చంద్రబాబు తమకు మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను నిర్లక్ష్యం చేశారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన చెందుతుండగా.. పల్నాడులోనే సీనియర్‌నైన తనకు హామీ ఇచ్చి విస్మరించారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. టీడీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగుతోంది.. సాక్షి, గుంటూరు: మంత్రి పదవిపై ఆశలు పెంచుకుని బలమైన లాబీయింగ్ సాగించిన సొంత సామాజికవర్గ నేతలకు సీఎం చంద్రబాబునాయుడు గట్టిగా షాక్ ఇచ్చారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు అమాత్య యోగం దక్కి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన ముఖ్యనేతలు కొందరు పదవి ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రంగంలో దిగి బుజ్జగింపుల పర్వం కొనసాగించినట్లు సమాచారం. ‘ఆనంద’మానందమాయే.. వేమూరు నుంచి రెండు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన నక్కా ఆనంద్‌బాబుకు మంత్రి పదవి దక్కింది. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా లాబీయింగ్, ఎస్సీల్లో సీనియర్ ఎమ్మెల్యే కావడం.. రెండు అంశాలూ నక్కా ఆనంద్‌బాబుకు కలిసి వచ్చాయి. దీంతో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సొంత సామాజికవర్గంలోనే.. అధికార పార్టీ సొంత సామాజికవర్గంలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులు మంత్రి పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అన్యాయం జరిగిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పల్నాడులోనే సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకు హామీ ఇచ్చి విస్మరించారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చింతలపూడిలో ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. రెండు రోజుల్లో సీఎంను కలిసి సమస్యను అక్కడే పరిష్కరించుకుంటామని శ్రేణులకు ఆలపాటి చెప్పినట్లు సమాచారం. ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు మంత్రి పదవి ఇప్పించే క్రమంలోరాయపాటి బలమైన లాబీయింగ్ చేశారు. చివరి నిమిషంలో పదవి చేజారడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావును తొలగిస్తారని బలంగా ప్రచారం సాగింది. చివర్లో పరిస్థితి మారిపోవడంతో ప్రత్తిపాటి తన స్థానాన్ని కాపాడుకున్నారు. దీంతో జిల్లాలో అదే సామాజిక వర్గానికి చెందిన వారెవరికీ చోటు దక్కలేదు. రావెల తీవ్ర అసంతృప్తి మంత్రి పదవి నుంచి తొలగించడంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకూ పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రాలేదు. ఉదయం రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు నేతలు రావెలను కలిసి మాట్లాడారు. మరోవైపు రావెలను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ప్రత్తిపాడులోని పాత మద్రాసు రోడ్డులో దళిత సంఘాలు ధర్నా నిర్వహించి చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తాయి. ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. మరో జాతీయ పార్టీలో చేరే దిశగా కసరత్తు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. మోదుగులకు మొండి చేయి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2009 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత రెండో పర్యాయం ఎంపీ రాయపాటి సాంబశివరావు కోసం సీఎం చంద్రబాబు సూచనతో నరసరావుపేట ఎంపీ స్థానాన్ని వదులుకుని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అంగీకరించి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు, లోకేష్‌లు హామీ ఇచ్చారు. అయితే రెండు పర్యాయాలు పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక బీసీ కోటాలో అనగాని సత్యప్రసాద్ బలంగా ప్రయత్నించి విఫలం అయ్యారు. -
‘ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోంది’
హన్మకొండ: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో దళిత యువకుని మర్మాంగాలు కోసి దారుణంగా హత్య చేశారు. ఆ దుండగులను, వారికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పుట్టమధును వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళితరత్న బొమ్మల కట్టయ్య, మంద కుమార్‌మాదిగ లు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని వారు ఆరోపించారు. దళిత యువకున్ని దారుణంగా హత్య చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని వారు ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హత్యలో పాల్గొన్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని వారు కోరారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్త్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నేత చుంచు రాజేందర్, దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
గుజరాత్లో దళితుల భారీ ర్యాలీ
అహ్మదాబాద్: పశు కళేబరాల తొలగింపును ఆపేయాలని గుజరాత్ దళిత సంఘాలు నిర్ణయించాయి. ఉనాలో ఆవు చర్మం ఒలుస్తున్న దళితులపై గోసంరక్షకుల దాడి నేపథ్యంలో ఆదివారం అహ్మదాబాద్‌లో ఈ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. తమపై దాడులు ఆగేంతవరకు కళేబరాలను తొలగించొద్దని, పారిశుద్ధ్య పనులూ ఆపేయాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమకు భూములు కేటాయిస్తే.. వ్యవసాయం చేసుకుని గౌరవప్రదంగా బతుకుతామన్నారు. దాడులకు నిరసనగా అహ్మదాబాద్ నుంచి ఉనా వరకు ఈ నెల 5న పాదయాత్ర ప్రారంభిస్తామన్నారు. ఉనాలో దాడులకు పాల్పడ్డ వారిని పాసా చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు ఆగకపోతే 2017 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వానికి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కాగా, ఉనా ఘటనకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసిన హీరాభాయ్ సోలంకి(25) అనే యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందతూ ఆదివారం మృతిచెందారు. ఉత్సవాలు వాయిదా.. దేవాలయ కార్యక్రమాల నిర్వహణ విషయంలో దళితులకు, అగ్రవర్ణాలకు మధ్య చర్చలు విఫలమవ్వటంతో తమిళనాడులోని నాగపట్టిణం అమ్మవారి ఉత్సవాలు రద్దయ్యాయి. గుళ్లో జరిగే పూజల్లో తమకు అవకాశ మివ్వకపోతే ఇస్లాం స్వీకరిస్తామని దళితులు హెచ్చరించారు. జిల్లా అధికారులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఉత్సవాలు మినహా ఎప్పుడు దళితులు పూజ చేసినా తమకు అభ్యంతరం లేదని అగ్రవర్ణాల నేతలు ఒప్పుకున్నారు. దళితులు మాత్రం ఉత్సవాల్లోనే తమకు అవకాశం ఇవ్వాలన్నారు. -
మాయావతిపై వ్యాఖ్యలపట్ల నిరసన
బీఎస్పీ నేత మాయావతిపై... మొరటు వాఖ్యలు చేసి మహిళా లోకాన్నే అవమానపర్చిన బీజేపీ ఎంపీ దయాశంకర్‌సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, దళిత బహూజన ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాషి సంజీవ్, అంబేద్కర్ సంఘం మండలశాఖ ప్రధాన కార్యదర్శి పద్మారావు, మండల ఉపాధ్యక్షులు బైరం సిద్దరాంలు, టంకరిరాజు గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈవిషయమై బీజేపీ సదరు ఎంపీని అనర్హుడిగా ప్రక టించడంతోపాటు అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్నిపార్టీలు ఈసంఘటను ఖండించడంతోపాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పుననావతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దళితులపట్ల బీజేపీ వైఖరి ఈసంఘటతో బయట పడిందని వారు పేర్కొన్నారు. ఈవిషయంలో దళితుల మనోబావాలు దెబ్బతినకముందే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. -
అందోలులో దళిత సంఘాల ఆందోళన
మెదక్ జిల్లా మనూర్ మండలం ఇరక్‌పల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా అందోలులో సోమవారం దళిత సంఘాల వారు రాస్తారోకో చేపట్టారు. విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులను శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సంగారెడ్డి, జోగిపేట వైపు వెళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోగిపేట ఎస్ఐ విజయ్‌రావు ఆందోళన కారులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. -
భగ్గుమన్న దళితులు
పలుచోట్ల సీఎం దిష్టిబొమ్మల దహనం ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చంద్రబాబుపై చర్యలు కోరుతూ కొవ్వూరు, ఆచంట పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలతో జిల్లాలోని దళిత వర్గాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు జాత్యాంహకారానికి ఆ వ్యాఖ్యలు నిదర్శనమని దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలను ఏలవచ్చనుకుంటారు’ అని సోమవారం విజయవాడలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర దుమారం లేపాయి. పార్టీలు, రాజకీయాలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. దళిత నేతలైతే చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. మంగళవారం పాలకొల్లులో గాంధీబొమ్మల సెంటర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనంద్‌ప్రకాష్ ఆధ్వర్యంలో, టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్), నరసాపురంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా దళిత నేతలు సీఎం వైఖరిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టారు. దళితలను కించపరిచేవిధంగా, వారి మనోభావాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడిన సీఎం తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ గోపుల పురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నల్లజర్ల మం డ లం పోతవరంలో ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద భారీస్థాయిలో దళిత యువకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటించారు. చంద్రబాబు వెంటనే బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పాలని తలారి డిమాం డ్ చేశారు. మాల మహానాడు రాష్ర్ట సమన్వయకర్త నల్లి రాజేష్ ఆధ్వర్యంలో పాలకొల్లులో ధర్నా చేపట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ దారా లక్ష్మీగణేష్ అనే యువకుడు శిరోముండనం చేయించుకున్నారు. నిడదవోలులో తహసిల్దార్ కార్యాలయం ఎదుట దళిత మహాసభ రాష్ట్ర కన్వీనర్ పిల్లి డేవిడ్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు వెంటనే సీఎం పదవి నుంచి వైదొలగాలని, దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్‌కు లేఖ అందజేశారు. ఆ లేఖ కాపీలను గవర్నర్ నరసింహన్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయ్‌రావు, ఎమ్మార్పీఎస్ నేత ఆరుగొల్లు చినబాబు కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దళితులను కించపరిచే విధంగా, దళితుల మనోభావాలు గాయపరిచే విధంగా అహంకారపూరితంగా మాట్లాడిన చంద్రబాబును వెంటనే అరెస్ట్ చే యాలని వారు డిమాండ్ చేశారు. బాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, అంబేద్కర్ యువసేన అధ్యక్షుడు సుంకర సీతారామ్ ఆచంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదటి నుంచీ దళిత వ్యతిరేకే : మోషేన్‌రాజు సీఎం చంద్రబాబు మొదటి నుంచీ దళిత వ్యతిరేకేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా వాడుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో కారంచేడు, చుండూరు ఘటనలు బాబు ప్రోద్బలంతో జరిగినవేనని గుర్తు చేశారు. అన్నదమ్ముల్లా కలిసుండే మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టిన బాబు ఇప్పుడు కాపులు, బీసీల మధ్య రగడ సృష్టించారని నిందించారు. తాజాగా ఎస్సీల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా మాట్లాడి అందరి మధ్య అంతరం సృష్టించాలని బాబు పెద్ద కుట్ర పన్నుతున్నారని నిందించారు. రాజ్యాంగపరమైన సీఎం పదవిలో ఉన్న ఆయన కులాల ప్రస్తావన తీసుకురావడం దారుణమని, అలా మాట్లాడటం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. వెంటనే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ 1989, 3 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీగా పుట్టినందుకు గర్విస్తున్నాం : ముప్పిడి ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ ముఖ్యమంత్రి జాత్యాంహకారంతో మాట్లాడుతున్నారని, కానీ.. తాను ఎస్సీగా పుట్టినందుకు గర్విస్తున్నానని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక వర్గంలో పుట్టడం కంటే అదృష్టం ఏముంటుందని అన్నారు. వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వెంటనే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాబుకు మతిభ్రమించింది : వనిత చంద్రబాబుకు మతిభ్రమించి అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత ధ్వజమెత్తారు. కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడం బాబుకు మొదటి నుంచీ అలవాటేనని ఆమె విమర్శించారు. బాబు వెంటనే తన వ్యాఖ్యలకు బేషరతుగా దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబూ.. క్షమాపణ చెప్పు
♦ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై దళిత సంఘాల మండిపాటు ♦ రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మ దహనాలు, ధర్నాలు ♦ సీఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులు సాక్షి, విజయవాడ బ్యూరో/ఏలూరు: ఎస్సీలుగా పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు మంగళవారం పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించారు. ముఖ్యమంత్రిదిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. సీఎం చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మార్పీఎస్, మాల మహానాడు నాయకులు, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేష్ వేర్వేరుగా చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేయగా, మైలవరంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. మచిలీపట్నంలో దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ధర్నా నిర్వహించింది. తహసీల్దార్‌కు వినతి పత్రం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం, టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. బాబు వ్యాఖ్యలను నిరసిస్తూ పాలకొల్లులో దారా లక్ష్మీగణేష్ అనే యువకుడు శిరోముండనం చేయించుకున్నాడు. వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నల్లజెర్ల మండలం పోతవరంలో ధర్నా చేయగా, నిడదవోలులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ దళిత మహాసభ రాష్ట్ర కన్వీనర్ పిల్లి డేవిడ్‌కుమార్ ఆధ్వర్యంలో దళితులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. వినతిపత్రం కాపీలను గవర్నర్ నరసింహన్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయ్‌రావు, ఎమ్మార్పీఎస్ నేత ఆరుగొల్లు చినబాబు కొవ్వూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచంట పోలీస్ స్టేషన్లోనూ వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి, అంబేడ్కర్ యువసేన అధ్యక్షుడు సుంకర సీతారామ్ ఫిర్యాదుచేశారు. నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తారోకోలు, నిరసనల హోరు తూర్పు గోదావరి జిల్లా అన్నవరం మెయిన్‌రోడ్డులో వైఎస్సార్సీపీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సీఎంపై అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముమ్మడివరంలో దళితులు రాస్తారోకో నిర్వహించి, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. అల్లవరం పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై రామచంద్రపురంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గుంటూరులో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబుపై దళిత నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతి ఎస్వీ వర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేసింది. యూనివర్సిటీ గేటు వద్ద మాదిగి విద్యార్థి సమాఖ్య ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించింది. కర్నూలు కలెక్టరేట్ ఎదుట కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌బాబు నేతృత్వంలో ధర్నా చేపట్టారు. ఓయూలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్: ఎస్సీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట మంగళవారం మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్ఎఫ్) నాయకులు, కార్యకర్తలు ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఎన్నికలకు ముందు పెద్ద మాదిగనవుతానని దళితుల ఓట్లు దండుకున్న చంద్రబాబు అధికారం చేట్టిన తర్వాత అహంకారంతో ఎస్సీలను కించపరిచేలా హేళనగా మాట్లాడడం సిగ్గుచేటని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ ఆరోపించారు. -
రోహిత్ కేసును నీరుగార్చే యత్నాలు!
♦ రోహిత్ ఎస్సీ కాదని చూపేందుకు యత్నిస్తున్న పోలీసులు ♦ గుంటూరు కార్పొరేషన్లో రోహిత్ అమ్మమ్మ సర్వీస్ రిజిస్టర్ మాయం ♦ పోలీసులకు పదవీ విరమణ ♦ ధ్రువీకరణ పత్రం మాత్రమే ఇచ్చిన అధికారులు సాక్షి, గుంటూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. కేంద్ర మంత్రిపై కూడా కేసు నమోదు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ అసలు దళితుడు కాదని, వడ్డెర కులానికి చెందినవాడని చిత్రీకరించే కుట్ర జరుగుతోందని దళిత సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ అమ్మమ్మ, తాతయ్యల కులంపై పోలీసు అధికారులు విచారణ జరుపుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుంటూరులోని ప్రకాశంనగర్కు చెందిన బోణాల ముసలయ్య, చల్లా అంజనీదేవి అలియాస్ పాపాయమ్మ దంపతుల కుమార్తె రాధిక. అయితే వారిలో ఎవరైనా ఎస్సీకి చెందినవారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వీరిరువురూ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు కావడంతో వీరు గతంలో పనిచేసిన కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. రాధిక తండ్రి బోణాల ముసలయ్య ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి చల్లా అంజనీదేవి గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలిగా చేస్తూ 2001 జనవరి 31న పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్)లో కులం పొందుపరిచి ఉంటుంది. వీటిని పరిశీలిస్తే అందులో వారి కులం వివరాలు తెలుసుకోవచ్చని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంజనీదేవి సర్వీస్ రిజిస్టర్ మాయం రాధిక తల్లి అంజనీదేవి కులం వివరాలు సేకరించేందుకు రెండ్రోజుల క్రితం పోలీసు అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చారు. రికార్డులు వెతికిన నగరపాలక సంస్థ అధికారులు అంజనీదేవి సర్వీస్ రిజిస్టర్ కనిపించడం లేదని చెప్పినట్లు తెలిసింది. అంజనీదేవి 2001 జనవరి 31న పదవీ విరమణ చేసినట్లు ధ్రువీకరణపత్రం మాత్రం పోలీసు అధికారులకు ఇచ్చి పంపారు. అందులో ఆమె కుల ప్రస్తావన లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే అంజనీదేవి సర్వీస్ రిజిస్టర్ నిజంగా కనిపించడం లేదా... ఉన్నతస్థాయి ఒత్తిళ్ల నేపథ్యంలో మాయం చేశారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాధిక తండ్రి బాణాల ముసలయ్య సర్వీస్ రిజిస్టర్‌ను సైతం అధికారులు బయటకు రానీయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రోహిత్ తల్లి రాధికది మాల కులమని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉద్ఘాటించారు. శుక్రవారం రాత్రి గుంటూరులో జరిగిన రోహిత్ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ రోహిత్ తండ్రి వడ్డెర కులానికి చెందిన వాడైనా, తల్లి రాధిక దళితురాలు కావడంతో రోహిత్‌కు తల్లి కులం వచ్చిందని చెప్పారు. -
కర్నూలులో దళిత సంఘాల రాస్తారోకో
కర్నూలు: బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) కింద విద్యార్థుల ఎంపికలో జడ్పీ చైర్మన్ జోక్యాన్ని నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో కర్నూలులో భారీ రాస్తారోకో నిర్వహించారు. బీఏఎస్ పథకం కింద విద్యార్థుల ఎంపిక కార్యక్రమం బుధవారం కర్నూలులో ప్రారంభమైంది. అయితే, అర్హులను ఎంపిక చేయకుండా అనర్హులకు జాబితాలో స్థానం కల్పించారంటూ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంబేద్కర్ భవన్ ఎదుట రాజ్‌విహార్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. జడ్పీ చైర్మన్ ఎం.రాజశేఖర్ జోక్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. -
అంబేద్కర్ గురువునే అవమానిస్తారా!
- పూలే విగ్రహాన్ని తొలగించి టాయిలెట్లో పడేస్తారా - మహాత్ముడికిచ్చే గౌరవం ఇదేనా? - అంబేద్కర్ జయంతిలో మండిపడిన దళిత సంఘాలు - బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇందూరు: ‘‘అంబేద్కర్ తనకు గురువుగా చెప్పుకున్నమహాత్మా జ్యోతిరావు పూలేవిగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించి టాయిలెట్లలో పడేస్తారా! ఎక్కడ పడితే అక్కడ అనుమతులు లేకుండా స్థాపిస్తున్నా, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోయే విగ్రహానికి మా త్రం నిబంధనలు అడ్డొస్తున్నాయా? ఇదేనా మహా త్ములకు మనం ఇచ్చే గౌరవం... ఇలాంటప్పుడు ఈ సమావేశాలెందుకు...వారి గురించి గొప్పలు చెప్ప డం ఎందుకు?’’ అంటూ దళిత సంఘాలు అంబేద్క ర్ జయంతి కార్యక్రమంలో మండిపడ్డాయి. పూలే వి గ్రహాన్ని తొలగించడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డి మాండ్ చేశాయి. పూలే విగ్రహాన్ని వెంటనే యథా స్థానంలో నిలపకపోతే ఉద్యమ బాట పడుతామని హెచ్చరించారుు. ఈ విషయంలో బీసీ సంఘం నేత లక్ష్మీనారాయణ చాల ఉద్వేగంగా ప్రసంగించారు. ఆ యన కంట తడిపెట్టి, అందరినీ కంటతడి పెట్టిం చారు. దళిత నాయకుతు బంగారు సాయిలు, చిన్న య్య పూలేకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖం డించారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఉం డి కూడా పూలే విగ్రహ స్థాపనకు పది అడుగుల స్థలాన్ని కేటాయించకపోవడం శోచనీయమన్నారు. కుల సంఘాలు విగ్రహాన్ని స్ధాపిస్తే, దానిని తీసుకెళ్లి టాయిటెట్లలో పడేయడం అతి దారుణమని పేర్కొన్నారు. జిల్లా పరువు పోయేలా వ్యవహరించారని, ఈ పాపం ఊరికే పోదదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు కొంతసేపు మౌనంగా ఉండిపోయూరు. అనంతరం జుక్కల్ ఎ మ్మెల్యే హన్మంత్ సింధే మాట్లాడుతూ పూలే విగ్రహానికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, తిరిగి విగ్రహ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు కూడా జరిగిన సంఘటను తీవ్రంగా ఖడించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పూలే విగ్రహం తొలగింపు సరికాదన్నారు. టాయిలెట్లలో విగ్రహాన్ని పడేయడంలాంటి సంఘటన జిల్లాలో జరగడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రక టిం చారు. అసలు విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు అడ్డొస్తున్నాయో కుల సంఘాల ఆధ్వర్వంలో కూర్చుండి సామరస్యంగా మాట్లాడుకుని సమస్యను పరి ష్కరించుకుందామని సూచించారు. విగ్రహ ఏర్పాటుకు తానే స్వయంగా పూనుకుంటానని హామి ఇచ్చారు. విగ్రహాన్ని తిరిగి నెలకొల్పండి -కాంగ్రెస్ నేత డీఎస్ నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్రంలో తొలగిం చిన జ్యోతిబా పూలే విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని మండలి విపక్ష మాజీ నేత డి. శ్రీని వాస్ కోరారు. పూలే విగ్రహం తొలగింపుపై ఆ యన మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ రొనాల్డ్ రోస్తో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహా నీయుడైన పూలే విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా అన్ని వర్గాలు కలిసి ఏర్పాటు చే సుకున్నాయని, అనుమతులు లేవన్న కారణం తో దానిని తొలగించి స్టేషన్లో ఉంచటం సరి కాదన్నారు. ఈ సంఘటన బీసీ వర్గాలకు బాధ కలిగించిందన్నారు. తొలగించిన విగ్రహాన్ని తి రిగి రెండు రోజులలో ఏర్పాటు చేయాలని కో రారు. రెండు రోజులలో సమస్యను పరిష్కరి స్తానని కలెక్టర్ డీఎస్‌కు తెలిపారు. -
కేసీఆర్ తీరుపై దళిత సంఘాల ఆందోళన
ప్రగతినగర్ : ధర్నాలు, ముట్టడి, ఆందోళనలు, నిరసనలతో సోమవారం కలెక్టరేట్ ప్రాం గణం అట్టుడికిపోయింది. ఉదయం నుం చే పోలీసులు కలెక్టరేట్ చుట్టూ ఉన్న గేట్ల ను మూసివేసి గట్టి భద్రత ఏర్పాటు చేశా రు. కలెక్టర్ రొనాల్డ్‌రాస్ మాత్రం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని శాఖలలో ఫిర్యాదులు పేరుకుపోతున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. దళితులకు మూడెకరాలు అందించాలి ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమిని అందించాలని వ్యవసాయ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు దుబాస్ రా ములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఇప్పుడు జిమ్మిక్కులు చేస్తూ దళితులకు ద్రో హం చేస్తున్నారని ఆరోపించారు. బొజ్జా భూమాగౌడ్, సీపీఐ నాయకులు సుధాకర్, ఓమయ్య, బిసాయిలు, విఠల్‌గౌడ్, రమేశ్, గంగారాం పాల్గొన్నారు. సర్వీసును క్రమబద్ధీకరించాలి జీఓ 22 ప్రకారం అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల స ర్వీసులను క్రమద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ అర్బన్ హెల్త్ సెంటర్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రమేష్, గోవర్ధన్ మాట్లాడుతూ 2014 జనవరి తరువాత ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ సాక్షరభారత్ కాంట్రాక్ట ఉద్యోగులు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించండి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రా న్ని ఇచ్చారు. ఏఐటీయూసీ నాయకులు సుధాకర్, ఓమయ్య మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, వారికి ఈఎస్ ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి బోధన్‌లోని నిజాం షుగర్స్ దక్కన్ లిమిటెడ్‌ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యలో ధర్నా చేశా రు. ఫార్వర్డ బ్లా క్ జిల్లా కన్వీనర్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఆసియా ఖండంలో అతి పెద్దదైన షుగర్ ఫ్యాక్టరీ ఎన్నో వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉఫాది కల్పించిందిన్నారు. అక్కడ అలా చెప్పి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు అవసరమైన ఐదు లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాం క్‌ను ఏర్పాటు చేస్తానని సింగపూర్ పర్యటనలో అక్కడి పారిశ్రామిక వేత్తలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ దళితులకు మాత్రం మూడెకరాల భూమి పంపిణీ విషయాన్ని మరిచిపోయాని న్యూడెమోక్రసీ నాయకులు విమర్శించారు. కలెక్టర్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ఆకుల పాపయ్య, నీలం సాయిబాబా, సీహెచ్ సాయాగౌడ్, ఎన్ నర్సయ్య, కృష్ణగౌడ్, పీడీఎస్‌యూ నాయకులురాలు సరిత, సౌందర్య, రవి, అరుణ్, రాజేశ్వర్, నరేష్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓడ్ కులాన్ని గుర్తించాలి ఓడ్ కులస్తులకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ఓడ్ కుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎ దుట ధర్నా చేశారు. తెలంగాణలో పదివేల కు టుంబాలకు పైగా జీవిస్తున్నారని సంఘం నాయకు లు పేర్కొన్నారు. జిల్లాలో సుమారు మూడు వందలకుపైగా కుటుంబాలు మొరం, మట్టి, ఇసుక ప నులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఓడ్ కులస్థులను ఎస్సీలలో చేర్చాలని డిమాండ్ చేశారు. సుధాబార్పై చర్యలు తీసుకోండి నిబంధనలను తుంగలో తొక్కి నగరం నడిబొడ్డున ప్రజలు నివసించే ప్రాంతంలో నిర్వహిస్తున్న సుధాబార్ను మూసివేయించాలని వినాయక్నగర్వాసులు కలెక్టర్‌ను కోరారు. బార్‌కు సుమారు వంద అడుగుల దూరంలో పాఠశాల ఉందని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి.. మిర్చి కాంపౌండ్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వ స్థలంలో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారన్నారు.