మనల్ని విడిచి వెళ్లిపోయిన మహనీయుల సేవలు ప్రతి నిత్యం మనకు గుర్తుండాలని వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం. పేరుకు అది విగ్రహమే అయినా ఆ మహానుభావుల ప్రతిరూపాన్ని అందులో చూసుకుంటాం. వారి విగ్రహాల వద్దకు వెళ్లినప్పుడు నమస్కరించి పూలమాలలు వేసి, గౌరవాభిమానాలను చాటుకుంటాం. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భిన్నంగా వ్యవహరించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై తన మోచేతిని ఆనించి ఫొటోలకు పోజులిచ్చారు.