దీక్షలో పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు
తాడికొండ: చంద్రబాబు తన బినామీలైన సుజనాచౌదరి, మాజీ మంత్రులతో పాటు తన సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే తాపత్రయ పడుతున్నాడని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పర్యవేక్షణ కమిటీ కన్వీనర్ కొదమలకుమార్ విమర్శించారు. పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో కొనసాగుతున్న దీక్షలు సోమవారానికి 27వ రోజుకు చేరాయి. ఆదివారం 26వ రోజు జరిగిన దీక్షల్లో కొదమల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు న్యాయ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని కోర్టుల్లో తన వర్గ న్యాయవాదులను జొప్పించి పేదలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రఘురామకృష్ణరాజు డబ్బు మదంతో మహిళలను వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని, ఇంకోసారి ఇలా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
బాబుకు బుద్ధి చెప్పాల్సిందే..
27వ రోజైన సోమవారం నిర్వహించిన దీక్షల్లో పాల్గొన్న మోడల్ అసోసియేషన్ ఆఫ్ దళిత ఎంప్లాయీస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మురికిపూడి దేవపాల్ మాట్లాడుతూ చంద్రబాబు తన బినామీలతో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నాడన్నారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే సీఎం వైఎస్ జగన్ సంకల్పం గొప్పదని, చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో దళిత నేతలు బూదాల సలోమీ, పరిశపోగు శ్రీనివాసరావు, పిడతల అభిõÙక్, పులి దాసు, కొలకలూరి లోకేష్, బందెల భాను కుమార్, గుండాల ప్రసాద్, బుర్రి సుధాకర్, సలివేంద్రపు బాల సుందరం, పెద్దిపాగ బాబు, దాసరి సుదీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment