సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తే చంద్రబాబు దానిని విస్మరించారని రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు మంచి రాజధాని అవసరం ఏర్పడిందని తెలిపారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చని విభజన చట్టంలో ఉన్నా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి రెండేళ్లకే ఖాళీ చేశారన్నారు. ఈమేరకు మన రాజధాని, మన విశాఖ సదస్సులో మంత్రి ధర్మాన ప్రసంగించారు.
'ఆంధ్రప్రదేశ్‌కి ఒకే రాజధాని పెట్టడం మంచిది కాదని కేంద్ర కమిటీ చెప్పింది. ఆంధ్ర రాజకీయ పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చింది. ఒరిస్సాలో.. కటక్‌లో హైకోర్ట్, భువనేశ్వర్‌లో పరిపాలన రాజధాని ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోంది. అభివృద్ధి అసమానత ఉంటే రాష్ట్రంలో అస్థిరత ఏర్పడుతుంది. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం. పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బాబు హయాంలో అమరావతి రాజధాని కోసం 3,500 రహస్య జీఓలు ఇచ్చారని' మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.
చదవండి: (సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో..)
Comments
Please login to add a commentAdd a comment