Dharmana Prasada Rao
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితమని, ప్రస్తుతానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కాలేదని, దీనిపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కాలేదని, దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఒక అభిప్రాయానికొస్తే దీనిపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందన్నారు. ఈ స్టాంపింగ్ విధానం టీడీపీ హయాంలో 2016లోనే పైలెట్ ప్రాజెక్టుగా మొదలైందన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. కరణాలు, మునసబులతో నడుస్తున్న వ్యవస్థను 1984లో రద్దు చేశారని, 1985ృ86లో విలేజ్ అసిస్టెంట్లను రిక్రూట్ చేసుకోవడంతో రెవెన్యూ వ్యవస్థలోకి వచ్చారని తెలిపారు. 1988 89లో కొంతమంది విలేజ్ అసిస్టెంట్లను నియమించారని, కరణాలు, మునసబుల్లో కొందరు 1992లో మళ్లీ విధుల్లోకి చేరారని, ఈ రకంగా అనేక మార్పులు చేయడం వల్ల రెవెన్యూ వ్యవస్థలో రికార్డుల అప్డేషన్ సక్రమంగా జరగలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 2002లో వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వీరందరినీ పంచాయతీరాజ్ వ్యవస్థలో కలిపేశారని తెలిపారు. ఆ సమయంలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ బాధ్యతలను అనుభవం లేని పంచాయతీ సెక్రటరీలకు కూడా అప్పజెప్పడంతో చాలా తప్పిదాలు జరిగాయన్నారు. ప్రస్తుతం ప్రెసెంపటివ్ ల్యాండ్ టైట్లింగ్ సిస్టమ్ వల్ల సబ్‌డివిజన్ పనులు, వంశపారంపర్యంగా వచ్చే మార్పులు, లావాదేవీలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయాలంటే దరఖాస్తుదారు పలు కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి ఉందన్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 (ఆర్ఓఆర్) అమలుపరిచిన ఈ చట్టం పూర్తిగా విజయవంతం కాలేదదన్నారు. భూముల నిర్వహణ, మార్పులు, కొనుగోలు అమ్మకాలు, అలాగే భూ రికార్డుల నిర్వహణ, వివాదాల పరిష్కారానికి ఒక సంపూర్ణ చట్టం అంటూ లేదన్నారు. వీటన్నింటి కోసం అనేక చట్టాల మీద ఆధారపడాల్సి వస్తోందన్నారు. చట్టాల్లో కొన్ని కేంద్రప్రభుత్వం, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసినవి ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు సవరణలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తోందని తెలిపారు. 2003లో బయటపడిన తెల్గీ స్టాంప్ పేపర్స్ స్కామ్ భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేసిందని పేర్కొన్నారు. ఈ స్కామ్‌తో స్టాంప్ పేపర్ల నిర్వహణలో ఉన్న లోపాలు బట్టబయలయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఈృస్టాంపింగ్ ప్రక్రియను అందుబాటులోకి తేవాలని కూడా ప్రభుత్వాలు ఆలోచించడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలోనే 2016లో ఈృస్టాపింగ్ పైలెట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టారన్నారు. 2007లో ప్రపంచ బ్యాంకు అధ్యయన ప్రకారం మన దేశంలో సివిల్ కోర్టులందు ఉన్న కేసుల్లో 66% సివిల్ కేసులు భూతగాదాలకు సంబంధించినవేన్నారు. దేశంలో భూములకు సంబంధించి రికార్డులు సరిగా నిర్వహించలేకపోవడం వల్ల, భూ యాజమాన్యానికి సంబంధించిన వివాదాలు అధికంగా ఉండడంతో భూమిపై ఆధారపడి జీవించేవారి జీవన విధానం సరిగ్గా జరగడం లేదని భారత ప్రభుత్వము/నీతి ఆయోగ్ గ్రహించి, దీనిపై అనేక సమావేశాలు నిర్వహించి నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ సంయుక్తంగా ఒక మోడల్ చట్టం, నిబంధనలతో తయారు చేసి డిసెంబర్ 2019 లో రాష్ట్రాలన్నింటికీ పంపించారన్నారు. దీని ఫలితంగా ఈ సమస్యలకు పరిష్కారంగా ఒక ప్రత్యేక చట్టం అవసరమైందన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ సంస్థలకు చెందిన భూములతో సహా, సమగ్ర సమాచార సేకరణ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు వివాదాలు లేని భూ యాజమాన్య హక్కులు నిర్ధారించుటకు ఈ చట్టం అవసరమైందన్నారు. భూయాజమాన్య హక్కులు ధ్రువీకరించే సమాచారం మొత్తం, ఆధునిక టెక్నాలజీ (బ్లాక్‌చైన్ టెక్నాలజీ) సాయంతో ఇతరులు రికార్డులను తారుమారు చేసేందుకు అవకాశం లేని విధంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ చట్టం ద్వారా రైతులకు, భూ యజమానులకు, భూభాగాలకు సంబంధించి పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లు తెలిపారు. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి జరిగే మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు నమోదు చేయడమే కాకుండా హక్కుదారు భూ హక్కులను రక్షిస్తూ వివాదాలు లేని భూ పరిపాలన అందించడమే ఈ చట్టం ఉద్దేశమన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో రెవెన్యూ రికార్డుల, భూహక్కుల పరిరక్షణ అంశంపై రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని భావించిందన్నారు. అన్ని స్తిరాస్థిలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ సంస్థలకు చెందిన భూముల సహా సమగ్ర సమాచార సేకరణ, నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు, వివాదాలు లేని భూయాజమాన్య హక్కులు నిర్ధారించుట జరుగుతోందన్నారు. భూయాజమాన్య హక్కులు ధ్రువీకరించు సమాచారం మొత్తం, ఆధునిక టెక్నాలజీ (బ్లాక్‌చైన్ టెక్నాలజీ) సాయంతో ఇతరులు రికార్డ్స్ తారుమారు చేసేందుకు అవకాశం లేని రీతిలో నిర్వహించబడుతుందన్నారు. ∗ భూయాజమాన్య హక్కుల్లో జరిగే మార్పులు, చేర్పులు ఎప్పటికప్పుడు రికార్డ్స్ నందు నమోదవుతూ ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగు సమస్యను తొలగించేందుకు ఉపయోగపడుతుందన్నారు. భూయాజమాన్య హక్కులకు సంబందించిన మార్పులు చేర్పులన్నీ నిర్ధారిత కాలవ్యవధిలో నమోదు చేస్తుందని పేర్కొన్నారు.∗ హక్కుదారుల భూహక్కులను పరిరక్షిస్తూ, వివాదాలు లేని భూపరిపాలన చేసేందుకే ఉపయోగపడుతుందన్నారు. ∗ ఈ చట్టం ద్వారా రైతులకు, భూయజమాన్యులకు, భూభాగానికి సంబందించి పూర్తి హక్కులు కల్పిస్తుందని పేర్కొన్నారు.∗ ఈ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ తయారు చేయలేదని, ఈ చట్టం పరిధి (ఏరియాస్ కవర్డ్) ని నిర్ధారించలేదన్నారు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేసిన అధికారులను ఇంకా అపాయింట్ చేయలేదని, ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలను,సూచనలను తీసుకొని అవసరమైన మార్పులను, చేర్పులను చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రూల్స్ తయారు చేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి పొందిన తర్వాత, ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. ∗ న్యాయవాదుల సంఘాలు, వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేయగా ఆ పిటిషన్లన్నింటినీ విచారించి, ఈ చట్టాన్ని ప్రస్తుతం అమలుపరచడం లేదని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసులను విచారిస్తూ, కొత్త కేసులను కూడా తీసుకోవాల్సిందిగా సివిల్ కోర్టులను ఆదేశించి ఉన్నారన్నారు. ఇంకా రీృసర్వే పూర్తి కాలేదని దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఏపి ప్రభుత్వం ఈ చట్టం అమలుపై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కేంద్ర నిర్ణయం
శ్రీకాకుళం క్రైమ్: నూతన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. కొత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని చెప్పారు. అయినా మన రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేయబోమని ఎప్పుడో చెప్పామని ధర్మాన స్పష్టంచేశారు. కానీ, కొత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలుచేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్న బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ నేతలు ఈ చట్టంపై వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘1989 నుంచి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను దేశంలో అమలుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాయి. రకరకాల అ«ధ్యయనాల ద్వారా ఫైనల్‌గా బీజేపీ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ వంటి ఉన్నతమైన సంస్థతో ఓ మోడల్ యాక్ట్ తయారుచేయించింది. అదే కొత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మాత్రమే మన రాష్ట్రంలో అమలుచేస్తామని గతంలోనే స్పష్టంగా చెప్పాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని, ఇక్కడ అమలు చేయబోమని మరోసారి చెబుతున్నాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఐదేళ్లలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు అమలుచేశారు. వందేళ్ల తర్వాత చేపట్టిన భూ సమగ్ర సర్వే ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతోంది. దీనివల్ల భూ రికార్డులు అప్డేట్గా ఉంటాయి. కానీ టీడీపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక సర్వే రాళ్లపై వైఎస్సార్ బొమ్మ ఉందని విమర్శలు చేస్తున్నారు. వైఎస్సార్ బొమ్మ ఉంటే తప్పేంటని నేను ప్రశ్నిస్తున్నాను. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకువచ్చిన కార్ట్–2.0 అనే ప్రాజెక్టుపై విపక్షాలకు వత్తాసు పలికే మీడియా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది. వాస్తవానికి దీనివల్ల ఆన్లైన్ స్లాట్ బుకింగ్, ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజి్రస్టేషన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. గ్రామ సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్ కార్యాలయాలు వచ్చి మొత్తం కంప్యూటరీకరణ జరుగుతోంది. ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగి ఈసీ జారీ చేయడం, స్టాక్ హోల్డింగ్ ఇంటిగ్రేషన్ వంటివి అందుబాటులోకి వస్తాయి. ఇంతకుముందు ఐదేళ్లు పరిపాలించిన టీడీపీ ప్రభుత్వం రాజధాని వెనకపడి రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది.’ అని ధర్మాన తెలిపారు.జగన్ ఎలాంటివారు అనేది ఐదేళ్ల పాలనే చెబుతుంది ‘సీఎం వైఎస్ జగన్ భూములు తీసుకునేవారా.. భూములు పంచేవారా.. అన్నది ఈ ఐదేళ్ల పాలనే చెబుతుంది. 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది వైఎస్ జగన్ కాదా.. అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవారిలా కనిపిస్తున్నారా..? రూ.12,800 కోట్లు ఖర్చు పెట్టి భూములు కొని 31లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవారిలా కనిపిస్తున్నారా..? రెండు లక్షల ఎకరాల శివాయ్ జమాదార్ (పేదల సాగులో ఉండి హక్కులు లేని) భూములకు పట్టాలిచ్చింది సీఎం జగన్ అని గుర్తుంచుకోండి. ప్రజల భూములు తీసుకుని వ్యాపారాలు చేసుకునే భావజాలం టీడీపీది. రైతులకు వ్యతిరేకంగా మేం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. దీనిపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను.’ అని ధర్మాన ప్రసాదరావు స్పష్టంచేశారు. -
టీడీపీ కుట్రల వల్లే పింఛన్ల పంపిణీలో జాప్యం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు చేసే టక్కు టమారాలు, దొంగవిధానాలు, అబద్ధపు హామీలు, బూటకపు కూటములు ఈ ఎన్నికల్లో పనిచేయబోవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ ఆదివారం పేట పరిసర ప్రాంతంలో సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. వలంటీర్లపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసి, కుట్రలు కుతంత్రాలు పన్నిన కారణంగా పంపిణీలో జాప్యం చోటుచేసుకుందని మండిపడ్డారు. లబ్ధిదారులంతా ఇప్పుడు సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. జాతీయ సంస్థల సర్వేల్లో ఏపీ బెస్ట్ 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిపై జాతీయ సంస్థలు అనేక సర్వేలు చేశాయని, జీఎస్డీపీ టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే ఈ ఐదేళ్లలో 5వ స్థానానికి వచి్చందన్నారు. తలసరి ఆదాయం 17 నుంచి 9వ స్థానానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఇవన్నీ అభివృద్ధి సూచికలు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరాడ తిలక్‌ను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు మంత్రి ధర్మాన ప్రసంగిస్తున్న సమయంలో 70 ఏళ్ల వృద్ధురాలు కూర్మాపు లకు‡్ష్మమమ్మ మధ్యలో లేచి మైక్ దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ‘మీ అందరికీ దండంబాబు.. ఏ దిక్కు మొక్కులేని నాకు జగన్‌బాబు దయవల్ల వలంటీర్ ఇంటికొచ్చి పెన్షన్, బియ్యం ఇస్తున్నారు. నాకు భర్తలేడు. కోడలు చనిపోయింది. నా కొడుక్కి, ఇద్దరు మనవళ్లకు నేనే గంజి పోస్తున్నాను. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్‌బాబును, పెసాదుబాబును గెలిపిస్తా’ అంటూ తన యాసలో చెప్పి అందరినీ ఆకట్టుకుంది. -
అసెంబ్లీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్
-
అసెంబ్లీ బరిలో అభ్యర్థులు వీళ్ళే..
-
చంద్రబాబు బీసీ వ్యతిరేకి: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: బీసీల వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి చంద్రబాబు అంటూ ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వకుండా.. జయహో బీసీ ఎలా అవుతుంది బాబూ? అంటూ ప్రశ్నించిన ధర్మాన.. బాబు మాటలతో సామాజిక న్యాయం జరగదు.. సీఎం జగన్‌లా చేతల్లో చూపిస్తేనే సాధ్యమవుతుందన్నారు. శ్రీకాకుళం టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఏమన్నారంటే.. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాయ మాటలు చెప్పే వారే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి హామీలు ఓటర్లకు ఇస్తారే తప్ప స్వతహాగా బ్యాక్ వర్డ్ క్లాస్ వాళ్లు సామాజికంగా ఎదగాలన్న ఆలోచన అన్నది ఆయనకు లేదు. వారికి అవసరం అయిన రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచన ఏనాడూ ఆయన చేయలేదు. చేయరు కూడా, అటువంటి దాఖలాలు కూడా లేవు. ఆయనేమీ ఇప్పుడొచ్చినటువంటి నాయకుడేమీ కాదు కదా ఆయన ఆల్మోస్ట్ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. నలభై సంవత్సరాలు రాజకీయాలలో అనుభవం ఉన్నవారు. ఆయన భావజాలం మీరు చూస్తే ఏనాడూ అతడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దానికి ఒక్కటే ఒక్క ఉదాహరణ చెబుతాను. ఈ దేశంలో రాజ్యసభకు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారిని చంద్రబాబు పంపించలేదంటేనే.. ఆయన రాజకీయ అధికారం బీసీలకు ఇస్తారంటే ఎవ్వరయినా నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలెవ్వరయినా, బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారెవ్వరయినా నమ్ముతారా?. ఆయన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన రాజ్యసభకు నలుగురు బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారిని పంపించారు. ఐదు సంవత్సరాలలోనే ఐదుగురు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారిని పెద్దల సభకు పంపించారు. మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు. ఏనాడయినా మీరు ఈ విధంగా రాజకీయ అధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదే ? అంటే ఏంటి ?. చంద్రబాబు భావజాలంలోనే బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్న కోణం లేదు మొదట్నుంచి. వీళ్లకు అధికారం ఇచ్చి వాళ్లను బలోపేతం చేసే పనులు మీరు ఏనాడూ చేయలేదు. నేను ఎనలైజ్ చేసిన విషయాలైతే ఇవి. అధికారాన్ని అలాంటి వారికి ఇవ్వకూడదన్న భావనలో ఉన్నారు మీరు. అందుకే ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఎవ్వరైనా అత్యున్నత న్యాయస్థానానికి బ్యాక్ వర్డ్ క్లాస్ వారు జడ్జీలుగా పనికి రారు అని ఉత్తరం రాస్తారా? అంటే కరడుగట్టినటువంటి బ్యాక్ వర్డ్ క్లాస్ వ్యతిరేక భావాలు మీలో నాటుకుని ఉన్నాయి కనుక, అలాంటి పొజిషన్లలోకి బ్యాక్ వర్డ్ క్లాసెస్ వారు రాకూడదు అనే భావజాలం కలిగి ఉన్నారు మీరు. మీ పార్టీ పక్కన బెట్టండి. అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు వ్యతిరేకి మీరు(చంద్రబాబు). అది మేం చెప్పింది కాదు. మీరు రాసిన ఉత్తరం కాని, గడిచిన ఐదేళ్లలో మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లియర్‌గా చెబుతోంది కదా. నిన్న జయహో బీసీ అని అన్నారు. రాజ్యాధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎలా అవుతుంది? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కల్పించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారం ఇవ్వాలి. ఇస్తే ఆటోమెటిక్ గా సామాజిక న్యాయం సాధ్యం అవుతుంది. బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, తెలుగు దేశం పార్టీకీ ఒక డిబెట్ కనుక మీరు పెడితే,డిబెట్‌కు మీరు వస్తామన్నా, మీ తాలుకా వ్యక్తులు ఎవ్వరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడేందుకు సిద్ధం. ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ బద్దంగా బీసీల ఎదుగుదలకు అటు రాజ్యాధికారం ఇచ్చి, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగించి, సామాజిక న్యాయం అందించినటువంటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని నేను రుజువు చేస్తాను. మీరు చేయలేదని కూడా రుజువు చేస్తాను. మీరెవ్వరయినా చర్చకు వస్తే, మాట్లాడేందుకు నేను సిద్ధం. మీరెవ్వరని అయినా చర్చకు పంపించినా,లేదా మీరొచ్చినా మాట్లాడేందుకు నేను సిద్ధం అని మనవి చేస్తున్నాను. ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు ఒక వేదిక మీదకు రావాలని చెబుతున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మాటలు చెప్పడం కాదు. చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బీసీ, ఎన్నికలు అయిపోయాక అసలు ఆ ఊసే ఉండదు మీ దగ్గర. ఇలాంటి జయహో బీసీ సభలు ఇంతకుముందు చాలా సార్లు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఎన్నిక అయిపోగానే సంబంధిత కాగితాలు చింపి అవతల పారేశారు. డిక్లరేషన్ల ఊసే లేదు. ఇవాళ మిమ్మల్ని నమ్మమంటే ఏ బీసీ నమ్ముతాడు. మా పార్టీలో లోక్‌సభలో ఆరుగురు పార్లమెంట్ సభ్యులు బీసీలు ఉన్నారు, నలుగురు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. బీసీలకు చెందిన వారే వారంతా. చూస్కోండి. ఎప్పుడయినా మీరు ఆ విధంగా పార్లమెంట్‌కు సంబంధించి ఎగువ సభకు కానీ దిగువ సభకు కానీ ఆ విధంగా పంపగలిగారా ? అని ప్రశ్నిస్తున్నాను. చేయగలిగారా ?.11 మంది మంత్రులు రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్నారు. సరే ఇతర కార్పొరేషన్లు అంటే యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, సంబంధిత వర్గాలకు లీడర్ షిప్ ఇచ్చారు. మీరు దానిని విమర్శిస్తారు. విమర్శించడం కాదు లీడర్ షిప్‌ను డెవలప్ చేయాలి. ప్రజా స్వామ్యంలో ప్రభుత్వాలు, బడ్జెటింగ్ వీటికి సంబంధించిన సమాచారం తదితర వివరాలు తెలుసుకునేటటువంటి లీడర్ షిప్‌ను డెవలప్ చేయాలి. మీరెప్పుడూ అది చేయలేదే ? ఎన్నికలు వస్తున్నాయి కనుక జయహో బీసీ అంటే అవుతుందా ? నిజంగా మీరెప్పుడయినా బీసీ సంక్షేమం కోసం పాటుపడ్డారా? పాల వ్యాపారం చేసుకునే వారుంటే వారికొక డొక్కు సైకిల్ ఇవ్వడం, ఇస్త్రీ పెట్టె ఇవ్వడం.. వాటిపై మీ బొమ్మలు వేసుకోవడం..ఇవా బీసీల సామాజిక స్థితిగతులు మారడానికి సహకరిస్తాయా ? ఇవి కాదు కదా ఇవి చేస్తూనే రాజ్యాధికారం ఇవ్వాలి. ఆర్థికంగా వారిందరికీ చేయూత ఇవ్వగలగాలి. కానీ ఆ రోజు ప్రొగ్రాంలు పెట్టడం వాటిలో కొన్నింటిని మాత్రం పంచి మిగిలినవి సొంత మనుషుల ఖాతాల్లోకి చేర్చేయడం వంటి పనులెన్నింటినో గత ప్రభుత్వ హయాంలో మీరు చేశారు.అలాంటివి మీరు ఈ ఐదేళ్లలో చూశారా ? డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు ఇచ్చిన డబ్బెంతో తెలుసా ? లక్షా 22 వేల కోట్ల రూపాయలు అందించాం. ఇంత మొత్తాన్ని బ్యాక్ వర్డ్ క్లాసెస్ అకౌంట్లలోకి చేరవేశాం. ఇందుకుగాను మీలా ఏ ఒక్కరు కూడా ఒక్క నయాపైసా లంచం అని,కమీషన్ అని,మధ్యవర్తి అని లేకుండా చేశాం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నాన్ డీబీటీ ఇంకా వేరుగా ఉంది. మీరు సబ్ ప్లాన్ అంటున్నారు. సబ్ ప్లాన్ అంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి చూపించిన ప్రభుత్వం ఇది. బ్యాక్ వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. ఆ అర్హత మీకు లేదు. వెనుకబడిన వర్గాలను మోసగించినటువంటి ప్రభుత్వం మీది. ఇప్పటికీ మీరు అదే చెబుతారు సైకిళ్లు ఇస్తాం..డొక్కులు ఇస్తాం.. కత్తులు ఇస్తాం అని చెబుతారు. ఇవి కాదండి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. రాజకీయ స్వాతంత్ర్యం కావాలి. సమాజంలో వారి స్థితి పెరిగేందుకు ఏమయినా అవకాశం ఉంటే అందుకు తగ్గ పనులు చేయగలగాలి. నాయీ బ్రాహ్మణులను తీసుకోండి. వారి ఆర్థిక స్థోమత పెరిగేందుకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా వారికి సహకారం అందించాం. వారికి ఒక క్షౌరశాల ఉంటే డైరెక్టుగా డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేశాం. ఏడాదికి పదివేలు రూపాయలు అందించాం. వారి విద్యుత్ బిల్లులను కొంత తగ్గించి,ఊరట ఇచ్చాం. చేస్తున్న వృత్తికి సంబంధించి ఛార్జీలు పెంపు చేసేందుకు అనుమతి ఇచ్చాం. వృత్తిని ఎవ్వరైనా అగౌరవ పరిస్తే అట్రాసిటీ కేసులు నమోదు చేసేందుకు వీలుగా చట్టాన్ని సవరించాం. ఇవాళ ప్రతి దేవాలయంలో చివరికి తిరుపతిలో కూడా ఓ నాయీ బ్రాహ్మణుడు ట్రస్ట్ బోర్డులో మెంబర్ గా ఉండే అవకాశం ఇచ్చాం. ఇది కదా సామాజిక న్యాయం అందించడం అంటే.. అని మీకు విన్నవిస్తూ ఉన్నాను. మీరు మామాలుగా మాటలు చెబితే సామాజిక న్యాయం దక్కదు. అలానే తీసుకోండి ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి. శెట్టి బలిజలలో రాజ్యసభ మెంబర్ ఉన్నారు. యాదవులకు పెద్ద ఎత్తున పార్లమెంట్ సీట్లు. అసెంబ్లీలో ఎన్నడూ లేనివిధంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు సీట్లు ఇచ్చింది. ఏనాడూ చంద్రబాబును ఈ పద్ధతుల్లో చూడలేదే ? ధనవంతులను ఎంపిక చేసే పనిలోనే చంద్రబాబు ఉన్నారే తప్ప నిజమయిన సంప్రదాయ రీతులలో ప్రజల తరఫున పోరాడుతున్న బ్యాక్ వర్డ్ క్లాసెస్ లీడర్లను ఎప్పుడూ ఆయన గుర్తించ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బీసీ అంటారు. ఎందుకు అంటారో తెలియదు. ? ఏ వర్గం ప్రయోజనం ఆశించి అంటారో కూడా తెలియదు ? ఏమిటి బీసీ ? ఏమిటి జయహో బీసీ ? మీరు చెప్పండి. రాజ్యాధికారం దక్కించడంలో విశాల భావం ఉండాలి. మీకు ఆ దృక్పథం లేదు. మీ మాటలను ఎవ్వరూ నమ్మే విధంగా ప్రజలు లేరు అని మనవి చేస్తున్నాను. ఎంత కాంట్రడక్షన్ ఉంది మీ మాటలలో.. జగన్ పాలకు సంబంధించి మొదటి ఏడాది మీరు ఏం చెప్పారు ? ఆ రోజు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు సాధ్యం కాదని చెప్పారు. అనుభవం ఉన్నవాడిగా చెబుతున్నాను ఇవన్నీ అసాధ్యం అని చెప్పారు. అమలు చేస్తున్న సందర్భంలో మళ్లీ మాట మార్చారు. ఇంకెన్నాళ్లు చేస్తారు మరో ఆరు మాసాలలో సంక్షేమ పథకాల అమలు ముగిసిపోతుంది మరి చేయలేడు అని చెప్పారు. అయినా మీరు చెప్పిన విధంగా ఆగిపోలేదు. జగన్ పాలనలో రెండున్నర, మూడు సంవత్సరాల తరువాత మళ్లీ మీరు చెప్పారు. ఇలా చేసుకుంటూ పోతున్నారు ఈ రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని.. వెనుజులా అవుతుందని... దివాలా తీసేస్తుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ భారత ప్రభుత్వం ప్రకటించిన సూచీలు (ఇండికేటర్స్) మీరు చూస్తే జీడీపీ బ్రహ్మాండంగా మీ టీడీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ వృద్ధి మా ప్రభుత్వంలో నమోదు చేసింది అని కేంద్ర ప్రభుత్వ సూచీలు చెబుతున్నవి. అన్ని రంగాలలో మీ కంటే అనేక స్థాయిలలో వృద్ధి పెరిగి అనేక రాష్ట్రాలను నెట్టుకుని ముందుకు వచ్చింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. మరి మీరేమో ఈ రాష్ట్రం వెనుజులా అయిపోందని అన్నారు. శ్రీలంక అయిపోతుందని అన్నారు. నాలుగేళ్లు అయిపోయింది. అప్పుడు మళ్లీ మీరు మాట మార్చారు. రాజమండ్రిలో సభ పెట్టి నేను కూడా ఇంత కన్నా ఎక్కువ ఇస్తానని మాట మార్చారు. ఆ నాలుగు సంవత్సరాలలో నాలుగు దఫాలుగా మాట మార్చారు. ఇప్పుడు ఐదో సంవత్సరం చెప్పినటువంటి మాట మార్చరని ఏంటి గ్యారంటీ ? ఇప్పుడు జయహో బీసీ అంటూ చెబుతున్న మాటలు మార్చరని ఏంటి గ్యారంటీ ? మీరు సిగ్గుపడడం లేదా దీనికి. అనుభవం లేని వారా మీరు ? ఇప్పుడే మీరు పార్టీ పెట్టారా ? మీదేమయినా కొత్త పార్టీనా ? ఈ రాష్ట్రానికి ఏమి వనరులు సమకూరుతాయి అన్నది మీకు బాగా తెలుసు కదా..ప్రభుత్వంలో బడ్జెటింగ్ ఎలా ఉండాలి ? దానికి లిమిటేషన్లు ఏంటన్నవి ? మీకు బాగా తెలుసు కదా..ఎందుకు మీరు చేయలేకపోయారు. చేయలేకపోయారు అంటే మీ భావజాలంలోనే ఆ విధం అయిన ఆలోచన లేదు అని అంటాను నేను. ఆ విధం అయిన దృక్పథం మీలో లేదు అని అంటాను నేను. ఎప్పుడూ మీరు చెప్పుకునే మాటలకూ చేతలకూ సంబంధమే ఉండదు. అభివృద్ధి అంటే ఓ కుటుంబం అన్ని రంగాలలో సాధించినటువంటి అభివృద్ధిని మీరు చూడడమే లేదు. ప్రపంచంలో ఉన్న సంస్థలన్నీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అభివృద్ధికి..? వారు ఆరోగ్యంగా జీవించే స్థితి ఉండాలి. చక్కగా చదువుకుని పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలను అందుకునేటటువంటి విద్యా విధానం ఉండాలి. మంచి పోషకాహారం లభించాలి. నివాస యోగ్యం అయిన ఇల్లు ఉండాలి. పరిసరాలు బాగుండాలి. మంచి నీరు ఉండాలి. ఇవన్నీ లేకుండా అభివృద్ధి అనేదానికి అర్థం ఏముందని ? ఇవేవీ కాకుండా ఎవరి కోసం అభివృద్ధి. అభివృద్ధి ఆ రాష్ట్ర ప్రజల కోసం కాకుండా ఏ కొద్దిమంది ధనవంతుల కోసమో..పెద్ద పెద్ద భవంతులు చూపించి,రోడ్లు చూపించి ఇదే అభివృద్ధి అనేటటువంటి మీ తత్వానికి మీ సిద్ధాంతానికి మా పార్టీ సిద్ధాంతానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధాంతానికి ఎక్కడా పొంతనా లేదు. జగన్ గారి పాలన రాజ్యాంగం చెప్పినటువంటి నిబద్ధత కలిగిన పాలన.ప్రపచంలో ఇతర దేశాలు అనుసరిస్తున్నటువంటి ప్రజల తాలుకా జీవన ప్రమాణాలు పెంచే పాలన. మీకూ మాకూ ఎక్కడా పొంతన లేదు. ఈ విషయమై మీరు వైఎస్సార్సీపీ తో పోల్చి చూసుకోకూడదు. మీకు సాధ్యం కాదు. ఎందుకంటే మీ భావజాలం వేరు. మీ భావజాలంలో ప్రజలకు మేలు చేద్దాం జీవన ప్రమాణాలు పెంచుదాం అన్నవి లేవు. ఇటువంటి ఉన్నత స్థాయి ఆలోచనలు లేనే లేవు. మీరు ఇవ్వలేరు. ఇదే మాట నేను పదే పదే చెబుతున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడూ చేయలేదు. మీ చుట్టూ ఉన్నది ధనవంతుల కూటమి. ధనవంతుల ప్రయోజనాలను మీరు కాపాడగలరు కానీ పేద ప్రజల జీవన ప్రమాణాలను మీరు పెంచలేరు. మీ చుట్టూ ఉన్న కోటరీని మీరు కాపాడగలరు కానీ పేద ప్రజల విషయమై ఆలోచన చేయలేరు. ఇదే విషయం అన్నింటా కనిపిస్తూనే ఉంది గత పాలనలో మీరు అందించిన పాలనలో. అందుకే అప్పుడూ ఇప్పుడూ అవే మాటలు చెబుతున్నారు. అత్యంత వెనుకబడిన నార్త్ కోస్టల్ ఏరియాలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతాం అంటే మీరు అంగీకరించడం లేదు. మీకు ఎక్కడుంది కాన్ఫిడెన్స్ ? విశాలం అయిన భావం ఎక్కడుంది మీకు. అందుచేత జయహో బీసీ లేదు.మీ కపట మాటలూ ఎవ్వరూ నమ్మరు. మీరు చెప్పే మాటలు అన్నీ ఎన్నికల్లో ఓటు పొంది తద్వారా అధికారం దక్కించుకునేందుకు కాక మరొకదానికి కాదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఎన్నికల ముందు గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన మోసపోయేందుకు ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు. మీరు కనుక చర్చకు వస్తే,ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో మీతో వాదించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చేసిన పొరపాట్లు అన్నీ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి సూచీలు నేను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ జయహో బీసీని ప్రజలెవ్వరూ నమ్మవద్దు అని సూచన చేస్తూ బ్యాక్ వర్డ్ క్లాస్ కు చెందిన నేతగా, చాలా కాలం ప్రభుత్వాలలో పనిచేసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాను. టీడీపీ జయహో బీసీలో కపటం ఉంది. అందులో మాయ ఉంది. అందులో మోసం ఉంది. అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయి తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం,రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్ర్యం కలిగించే ఆలోచనలు అందులో లేవు. బీసీలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయకత్వానికి లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. -
చంద్రబాబుకు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్
-
శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామంలో మంత్రి ధర్మాన పర్యటన
-
అభివృద్ధి మీ కళ్లకు కనిపించడం లేదా చంద్రబాబూ..: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో అభివృద్ధి చూసి ప్రతిపక్ష నేతలు మాట్లాడాలంటూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లని.. కళ్లు ఉన్నా చూడలేని వాళ్లని.. చెవులు ఉండి వినలేని వాళ్లని, నిద్ర నటించే వాళ్లను ఏం అనగలం అంటూ ఆయన దుయ్యబట్టారు. శ్రీ పురం(సానివాడ) పంచాయతీలో రూ. 80 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్‌ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ రాష్ట్రం కోసం మాట్లాడుతున్న విపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో (పక్క రాష్ట్రంలో) ఉంటున్నారు. ఆయన వ్యాపారాలన్నీ పక్క రాష్ట్రంలో ఉంటే అదనంగా ఇక్కడ సీఎం పదవి కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ‘‘ఇవాళ మన రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అంట! టీడీపీ యువ నాయకుడు లోకేష్ చెబుతున్నారు. పథకాల అమలులో భాగంగా గ్రామాల్లో ఏనాడైనా వర్గాలు చూశామా ? పార్టీ చూశామా ? ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులా? కాదా ? అన్నదే చూశాం. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఎందుకు ఈ మాట చెప్పలేకపోయారు. చెప్పు లోకేష్..?’’ అంటూ మంత్రి ధర్మాన నిలదీశారు. ‘‘గత టీడీపీ హయాంలో జన్మభూమి కార్యకర్తలు దోచుకున్నారు. పథకాల వర్తింపు కోసం ప్రజలు అర్జీలు పెట్టుకుంటే కలెక్టర్లు సైతం జన్మ భూమి కమిటీ సభ్యులను కలవమని చెప్పేవాళ్లు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఓటు వేసి అధికారంలోకి వచ్చి చంద్రబాబు చేసిన పని ఏముందని? ఇవాళ వివక్ష, కక్ష సాధింపు ఉన్నాయని అంటున్నారు లోకేష్. గ్రామాలకు వచ్చి చూస్తే తెలుస్తుంది వాస్తవాలేంటన్నది. ప్రజలకు లోకేష్,చంద్రబాబు ఎప్పుడో దూరం అయిపోయారు. కేవలం ఏబీఎన్, ఈనాడు, టీవీ5 మీడియాలతో మాత్రమే వారిద్దరూ బతుకుతున్నారు’’ అని మంత్రి మండిపడ్డారు. ‘‘విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని అంటున్నారు. ఇవాళ విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చి, ఇంటర్నేషనల్ సిలబస్ తీసుకు వచ్చి పాఠాలు చెప్పిస్తున్నాం. కానీ వాస్తవాలు గుర్తించకుండా ఆ ఇద్దరూ (చంద్రబాబు, లోకేష్) అబద్ధాలు, అన్యాయాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. కొంతమంది సినీ యాక్టర్లు వస్తుంటారు. వాళ్లంతా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటారు. వాళ్లే వలంటీర్లు వద్దని అంటున్నారు. వలంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవ ఏంటన్నది పక్క రాష్ట్రంలో ఉన్నవారికి ఏం అర్థం అవుతుంది? ఈ రోజు ఇంతమంది సంతోషంగా ఉంటున్నారంటే దానికి కారణం జగన్ ప్రభుత్వం కాదా.. అందరి క్షేమం కోరుకున్నది,అందుకు తగ్గ విధంగా పాలన చేస్తున్నది జగన్ ప్రభుత్వం కాదా.. టీవీలలో, పత్రికల్లో ఈ ప్రభుత్వంపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను అందరూ తిప్పి కొట్టాలి. మాట్లాడితే చాలు జగన్ డబ్బులు పంచేస్తున్నారు.. పంచేస్తున్నారు.. అంటున్నారే కానీ ఆయనను ఉద్దేశించి.. తినేస్తున్నారు..తినేస్తున్నారు అని అనడం లేదు ఎందుకు..? ఈ ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు శ్రీకాకుళం జిల్లాలో చేపట్టాం. చంద్రబాబు ఇంతకు ముందు ఐదేళ్లలో ఏం చేశారో చెప్పగలరా..? కిడ్నీ బాధితుల కోసం 200 కోట్ల రూపాయలతో డయాలసిస్ సెంటర్‌ను పలాసలో నిర్మించాం. ఉద్దాన ప్రాంతానికి రక్షిత మంచి నీటి పథకం 700 కోట్ల రూపాయలతో అందించాం. అలానే 4 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న మూలపేట పోర్టు నిర్మాణపు పనులను త్వరలో పూర్తి చేస్తాం. బుడగుట్ల పాలెంలో 350 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం దిద్దాం. ఇవన్నీ ఐదేళ్లలో మేం చేశాం. విపక్ష నేత చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ వారి హయాంలో ఏం చేశారో చెప్పగలరా.?’’ అంటూ మంత్రి ధర్మాన ప్రశ్నించారు. 2.5 లక్షల శాశ్వత ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చాం. 56 వేల ఉద్యోగాలను వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేశాం. వీటి విషయమై ఎవరైనా, ఎక్కడైనా లంచం ఇచ్చారా? పథకాల అమలు కోసం లేదా ఇతర అభివృద్ధి పనుల కోసం అప్పులు చేస్తున్నాం అంటున్నారు. గత ప్రభుత్వం కన్నా తక్కువ అప్పులు చేశాం. వారు దోచుకు తింటే.. ఈ ప్రభుత్వం హయాంలో ప్రజల ఖాతాల్లోకి నగదు వేసి ఆ కుటుంబం బాగుండాలి అని భావించాం. గత పాలకులు రాష్ట్ర ఖజానాను లూటీ చేశారు. వంశధార ప్రాజెక్ట్ కోసం.. ఒడిశాతో ఉన్న వివాదం నేపథ్యంలో పరిష్కారం కోసం సీఎం జగన్ చొరవ చూపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కలిశారు. నేరడి బ్యారేజీ విషయమై చర్చలు చేపట్టారు. అయిన కూడా ఆ వివాదం ఓ కొలిక్కి రాకపోవడంతో గొట్టా దగ్గర లిఫ్ట్ పెట్టి ప్రాజెక్ట్‌ను నింపబోతున్నాం. 185 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పూర్తి అవుతాయి. ఇదంతా సీఎం జగన్ చేసిన కృషి కాదా..? ఇది కాదా అభివృద్ధి..? అని నేను మిమ్మల్నిఅడుగుతున్నాను. కొంతమంది కళ్లు ఉన్నా చూడలేని, చెవులు ఉండి వినలేని వాళ్ళు, నిద్ర నటించే వాళ్లను ఏం అనగలం అని అన్నారు. గతంలో పండే పంట అమ్ముకోవాలి అంటే ఎవరో వ్యాపారి కోసం వేచి ఉండాలి. ఈ రోజు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం ఏర్పాటుతో అక్కడే పంట కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకున్నాం. ఇంకా రైతులకు చేరువగా ఉండే విధంగా ఆర్బీకేలు ఏర్పాటు చేసి,వ్యవసాయానికి అవసరం అయిన విత్తనాలు,ఎరువులు అందించాం. రైతు మేలు కోరి,ఇంకా అన్ని వర్గాల మేలు కోరి సంక్షేమం,అభివృద్ధి అన్నవి ధ్యేయంగా, ఎప్పటికప్పుడు ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ.. పనిచేస్తూ ఉన్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. -
ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లుకు ఆమోదం
-
చంద్రబాబు హామీలపై మంత్రి ధర్మాన సెటైర్లు
-
రాగోలు గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవం
-
‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పుస్తకాన్ని సీఎం జగన్‌కు అందజేసిన ధర్మాన
సాక్షి, అమరావతి: రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన ప్రజాజీవితంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా చట్టసభల్లో వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలతో ‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆయన కలిసి పుస్తకాన్ని అందించారు. ఇదీ చదవండి: అభిమానులపై ‘పంజా’! -
చోడవరంలో సాధికార స్వరం
సాక్షి, అనకాపల్లి: అనకాపలి జిల్లా చోడవరంలో మంగళవారం సాధికార నినాదం హోరెత్తింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు నియోజకవర్గంలో కదం తొక్కాయి. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశాయి. ఇది బడుగు, బలహీన వర్గాల విజయయాత్రలా సాగింది. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు. వందలాది బైక్‌లు, కార్లు, ఆటోలతో ప్రారంభమైన బస్సు యాత్రలో నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. కొత్తకోట జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బుచ్చెయ్యపేటలో జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం వేలాదిమందితో వడ్డాదిలో భారీ బహిరంగ సభ జరిగింది. జయహో జగన్ అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు నినదించారు. పేదల స్థితిగతులు మార్చిన సీఎం జగన్: మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదల స్థితిగతులను మార్చారని, ఆర్థికంగా బలోపేతం చేసి సంఘంలో గౌరవాన్ని పెంచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల రూపంలో రూ.2.60 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో సీఎం జమ చేశారని తెలిపారు. అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం దయనీయంగా ఉండేదని, వ్యవసాయ వృద్ధి రేట్లో 16వ స్థానంలో ఉండేదని తెలిపారు. సీఎం జగన్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రైతులకు అండదండలందించారని, దాంతో వ్యవసాయ రంగంలో ఏపీ 4వ స్థానానికి ఎదిగిందని వివరించారు. కోట్లాది రైతులు, పేదల కుటుంబాలలో వెలుగులు నింపిన వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేదికపై ప్రసంగిస్తున్న మంత్రి కారుమూరి జగన్ పథకాలతో పేదరికం తగ్గింది : ఎంపీ నందిగం సురేష్ వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు వస్తే అప్పటి సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లను దాచిపెట్టారని, ఇలా పేదరికాన్ని దాచకూడదని, తగ్గించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడం ద్వారా సీఎం జగన్ పేదరికాన్ని రూపుమాపుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అద్భుతమని చెప్పారు. దళిత రైతు బిడ్డనైన తనను సీఎం జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టారన్నారు. ఒకప్పుడు ఏ ప్రధానిని చూడాలనుకున్నానో.. అదే ప్రధాని పక్కన కూర్చున్నానంటే ఇది కాదా సామాజిక సాధికారత అని అన్నారు. ఒంటరిగా పోరాటం చేసిన దళిత బిడ్డ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్‌కు తెలంగాణలో రాలేదని, వారు వచ్చే ఎన్నికల్లో ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. అందరి సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం: మంత్రి కారుమూరి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. సీఎం జగన్ సంక్షేమాన్ని అందించడంలో కుల, మత, పార్టీ, ప్రాంతీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పైసా అవినీతికి తావు లేకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు కదిలి మరోసారి జగన్‌ను సీఎంగా ఎన్నుకోవాలన్నారు. చోడవరంలో రూ.1,900 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి : కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సీఎం జగన్ చోడవరం నియోజకవర్గంలో 90 శాతం రాజకీయ, నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే అందించారన్నారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి రూ.1,900 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రధానంగా రూ.80 కోట్లతో రోడ్లు, నాడు – నేడు ద్వారా రూ.87 కోట్లు విద్యా రంగంలో ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. -
సీఎం జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది
-
విశాఖలో ‘ఫైనాన్షియల్ హబ్’ ఏర్పాటుకు వినతి
సాక్షి, అమరావతి : ఉత్తర కోస్తా జిల్లాల్లో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు విశాఖపట్నంలో ‘ఫైనాన్షియల్ హబ్’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం లేఖ రాశారు. ఉత్తర కోస్తా జిల్లాల అభివృద్ధికి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ధర్మాన.. రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచీలో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన (2014) తర్వాత విశాఖపట్నం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగిందని, అత్యధిక సంఖ్యలో కార్పొరేషన్లు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు కేంద్రమైందని పేర్కొన్నారు. ఫైనాన్షియల్ హబ్ కోసం విశాఖపట్నంలో 100 ఎకరాలు కేటాయించాలని సీఎంను అభ్యర్థించారు. ఈ ప్రాంతంలో అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు, ఇతర లీడ్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల జోనల్ హెడ్ క్వార్టర్స్ వస్తాయన్నారు. వీటితోపాటు ఆర్థిక సేవల సంస్థలు, ప్రముఖ న్యాయ సంస్థలు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మద్దతుగా విశాఖపట్నంలో రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరాలని విజ్ఞప్తి చేశారు. ‘సోషల్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ’ నెలకొల్పండి విశాఖ ప్రాంతంలో అత్యధిక కంపెనీలు ఉన్నాయని, కంపెనీ సెక్రటరీలు, చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు సైతం సేవలు అందిస్తున్నాయని మంత్రి ధర్మాన తెలిపారు. వీటికి అనుబంధంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ’ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్లు ఏటా దాదాపు రూ.1,000 కోట్లను సీఎస్ఆర్ ఫండ్స్ ఇస్తున్నాయని, విశాఖలోని కార్పొరేషన్లు, కంపెనీలు అందించే సీఎస్ఆర్ నిధులు కూడా ఈ అథారిటీకి వస్తాయని సూచించారు. ఈ నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ తరహాలో వినియోగించవచ్చన్నారు. -
స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వడం చంద్రబాబు కి ఇష్టం ఉండదు
-
తునిలో జనహోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు శనివారం కాకినాడ జిల్లా తునిలో విజయయాత్ర చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. పరిసర ప్రాంత గ్రామాలన్నీ తుని బాటపట్టాయి. కొట్టాం సెంటర్ వద్ద ప్రారంభమైన యాత్రకు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళల బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీనివాససెంటర్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, సినిమా రోడ్డు, శాంతినగర్ మీదుగా రాజా కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం తుని ఎమ్మెల్యే, మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేలు, సాధికారతకు చేస్తున్న కృషిని నేతలు వివరించారు. సభ ఆద్యంతం ‘జగనే రావాలి – జగనే కావాలి’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. సీఎం జగన్‌తోనే అణగారిన వర్గాల బతుకుల్లో మార్పు : మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో అణగారిన వర్గాల బతుకుల్లో మార్పు వచ్చిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. దశాబ్దాలుగా నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచి, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎవరికీ తలవంచకుండా, ఎవరికీ పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. సంస్కరణలకు నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో 30 ఏళ్ళు సీఎంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అంతరాలను తగ్గించడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దమ్మున్న ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. చంద్రబాబును రాజకీయాలకు దూరం చేద్దాం: మంత్రి అప్పలరాజు గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ వర్గాలను అక్కున చేర్చుకొని, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను నీచంగా చూసి, హేళనగా మాట్లాడిన చంద్రబాబుకి మరోమారు గుణపాఠం చెప్పాలన్నారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక విప్లవకారుల ఆశయాలను నిజం చేసిన జగన్: మంత్రి నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే వంటి సామాజిక విప్లవకారుల ఆశయాలను నిజం చేసిన సీఎం దేశంలో జగన్ ఒక్కరేనని తెలిపారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవన ప్రమాణాలను సీఎం జగన్ మెరుగు పరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం అందని ఇల్లు లేదంటే అది సీఎం జగన్ సుపరిపాలనే అని తెలిపారు. వంచనకు గురైన వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారు: మంత్రి వేణుగోపాలకృష్ణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. గత పాలనలో వంచనకు గురైన సామాజిక వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారన్నారు. సామాజిక సాధికారత అంటే ఏమిటో దేశానికి చూపించారని తెలిపారు. బీసీల్లో మార్పు కోసం సీఎం జగన్ కుల గణన చేపడుతున్నారన్నారు. మోసం, అబద్దం, కుట్ర, కుతంత్రం అంటే చంద్రబాబేనన్నారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం జగన్: మంత్రి అనిల్‌కుమార్ అన్ని పదవుల్లో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి, ఈ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం జగన్ మాత్రమేనని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. సీఎం జగన్‌ను మనమంతా గుండెల్లో పెట్టుకోవాలన్నారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు అంతకు ఐదు రెట్లు పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారని, మరోసారి మోసం చేసేందుకే ఈ రకమైన హామీలిస్తున్న ఆ ఇద్దరినీ ఎప్పటికీ నమ్మొద్దని చెప్పారు. ఎంపీ వంగా గీత, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని సామాజిక సాధికార సభలో మాట్లాడుతున్న మంత్రి సీదిరి, సభకు పోటెత్తిన అశేష జన సందోహంలో ఓ భాగం -
వెనుకబడిన వర్గాలను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు జగన్
-
చంద్రబాబును ఒక ఆట ఆడుకున్న మంత్రి ధర్మాన
-
టీడీపీకి ఓటు వేస్తే మీకు బోడిగుండె: ధర్మాన ప్రసాదరావు
-
జగన్ పాలనలోనే గిరిజనులకు మేలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే గిరిజనులకు మేలు జరిగిందని, వారి జీవితాలు బాగుపడ్డాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. సామాజిక సాధికారయాత్రలో భాగంగా బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్ వచ్చిన తర్వాతే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, గిరిజన కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయని తెలిపారు. కేబినెట్, ఇతర పదవుల్లో 70 శాతం బడుగు, బలహీనవర్గాలకే అందించిన ఘనత దేశంలో ఒక్క జగన్‌కే దక్కుతుందన్నారు. సీఎం జగన్ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, అలా తొలుత పుష్పశ్రీవాణి, తర్వాత తనకు ఆ గౌరవం దక్కిందన్నారు. అడగకుండానే ఎస్టీ కమిషన్ వేశారని, గిరిజన సలహామండలిని నియమించారని, జీసీసీ, ట్రైకార్ సంస్థలకు చైర్మన్ పదవులను భర్తీచేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో గిరిజనులనే కాదు ఎస్సీలు, బీసీలనూ చిన్నచూపు చూశారని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు ఓ అనామకుడిని తీసుకొచ్చి ఈయనే గిరిజనశాఖ మంత్రి అన్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమల్లోనూ చంద్రబాబుకు, జగన్‌కు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. పింఛన్లు, ఇళ్లు, చేయూత, వైఎస్సార్ రైతుభరోసా.. వంటి ఎన్నో పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ సామాజిక న్యాయం, సుపరిపాలన కొనసాగాలంటే మళ్లీ జగన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాలూరులో జరిగిన బహిరంగసభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం అర్హులందరికీ సంక్షేమం: మంత్రి ధర్మాన జీవితాలను బాగు చేసుకోవడానికి పాలనలో భాగస్వామ్యం, రాజ్యాధికారం కోసం తరాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎవరూ ఉద్యమాలు చేయకుండానే పాలనలో పెద్దపీట వేశారని వివరించారు. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు అంటూ వివక్ష, ఆశ్రిత పక్షపాతం, లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఒక్క జగనే అని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుచేసి, సామాజిక న్యాయాన్ని సుసాధ్యం చేసి చూపిన నవతరం నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. మూడుసార్లు అవకాశం ఇచ్చినా బీదల సంక్షేమం గురించి ఆలోచించని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. హామీలన్నీ తూచా తప్పకుండా అమలుచేస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను కాదని, చంద్రబాబు మాయలో పడి ఓటేస్తే మన పీక మనమే కోసుకున్నట్లేనని ధర్మాన హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అల్పాదాయ వర్గాలకు ఎంతో అవసరమని చెప్పారు. చిన్నచూపున్న బాబుకు ఓటెందుకు వేయాలి? నాయీ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తానని, మత్స్యకారులను చితక్కొట్టిస్తానని, బీసీలు ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిలుగా పనికిరారంటూ చిన్నచూపు చూసిన చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్, గాంధీజీ, జ్యోతిరావు పూలే ఆశయాలను సాకారం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, అలజంగి జోగారావు, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్తురాజు, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతి రాణి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి రహిత సంక్షేమాన్ని సాధ్యం చేసిన జగన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘సంక్షేమ పథకాలను బీదలకు నేరుగా అందించలేకపోతున్నామని గతంలో ఓ ప్రధాన మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో ఉన్న వారు తినేస్తుంటే ఏమీ చేయలేక చేతులెత్తేశారు. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైసా అవినీతి జరగకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లక్షల కోట్లు బీదల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇలా అవినీతి రహిత సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూస్తున్నాం’ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అధ్యక్షతన జరిగిన సభలో ధర్మాన ప్రసంగించారు. గత టీడీపీ పాలనలో పచ్చ జెండా కట్టిన వాడికి, జన్మభూమి కమిటీలకు, డబ్బులిచ్చిన వారికే పథకాలు అందేవని మంత్రి ధర్మాన చెప్పారు. ఇప్పుడు అర్హుడైతే చాలు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వివరించారు. ఎక్కడా ఏ అధికారీ, వైఎస్సార్సీపీ కార్యకర్త నయా పైసా లంచం అడిగిన దాఖలాల్లేవన్నారు. వందేళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో జరిగిన భూసర్వేతో కలుగుతున్న అవస్థల నుంచి తప్పించడానికి తమ ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు. ఏ రైతునూ సర్వే రాళ్లు, పాసు పుస్తకం కోసం ఒక్క రూపాయి కూడా అడగలేదన్నారు. ఇటువంటి పరిపాలనే కదా ప్రజలు కోరుకుంటారని చెప్పారు. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, యువతను నమ్మించి వంచించిన చంద్రబాబు ముఠాకు ఎవరైనా ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, వైఎస్సార్సీపీ పాలనలో చూపించడానికి లోపాల్లేక.. దేశమంతా పెరిగిన కరెంట్ బిల్లులు, పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు చూపిస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన రాష్ట్ర ప్రజలను అడిగితే వాస్తవమేమిటో చెబుతారని అన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత దశాదిశా మార్చడానికి, ఇక్కడి పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికి విశాఖను పరిపాలన రాజధాని చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విశాఖలో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. తన పాలనలో ఏనాడూ ఏ ఒక్క మేలూ చేయకపోయినా ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీని ఆదరించారని, వారినే చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. బాబుకు, టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని, అన్ని వర్గాల సంక్షేమ సారథి వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, పాముల పుష్ప శ్రీవాణి, కంబాల జోగులు, బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి : బొత్స పజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స చెప్పారు. రాష్ట్రంలో సామాజిక సాధికారత వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. నిష్పక్షపాతంగా అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. చంద్రబాబు గిరిజనులకు, మైనార్టీలకు తీరని అన్యాయం చేశారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసిన మోసాన్ని మరిచిపోలేమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఈ వర్గాలకు మేలు చేకూరిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో బీసీలకు టికెట్టు ఇచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్యే అప్పలనర్సయ్య సవాలు విసిరారు. యాత్ర సందర్భంగా మీడియాతో బొత్స మాట్లాడుతూ.. చంద్రబాబు నిత్య నయవంచకుడు అని, సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. -
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు అగ్రస్థానమిచ్చి, ఆ వర్గా లకు రాజకీయ, సామాజిక సాధికారత సాధించిన సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా గురు వారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి రహిత, పారదర్శకమైన సుపరిపాలన అందిస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పాలన సాగించామని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదా రుల్లో వైఎస్సార్సీపీ వారితో పాటు అన్ని పార్టీల వారూ ఉన్నారని తెలిపారు. పేదలకు ఇస్తున్న స్థలం దేనికీ పనికిరాదని చంద్రబాబు విమర్శించారని, కానీ తామిచ్చిన స్థలమే పేదలకు పెద్ద ఆస్తి అయిందని వివరించారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. 2024కి వైజాగ్ రాజధానిగా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఉద్దానంలో ఎంతో మంది యాక్టర్లు తిరిగినా ఏమీ చేయలేదని, వైఎస్ జగన్ మాత్రమే కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా నిలి చారని చెప్పారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలను అవమానించారని తెలిపారు. పేదలకు మేలు చేస్తే టీడీపీ ఓర్చుకోలేదని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో 98 శాతం హామీలను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, కుంభా రవిబాబు, లేళ్ల అప్పిరెడ్డి, వరు దు కల్యాణి, ఎమ్మె ల్యేలు విశ్వాసరాయి కళావతి, గొర్లె కిరణ్‌కుమార్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. సామాజిక సాధికారతతోనే సంక్షేమం సాధ్యం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సామాజిక సాధికారతతోనే సంక్షేమం సాధ్యమవుతుందని సీఎం జగన్ నిరూపించారని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చెప్పారు. గురువారం నుంచి చేపట్టనున్న ‘సామాజిక సాధికారత’ బస్సు యాత్రను జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తదితరులు శ్రీకాకుళంలో జెండా ఊపి ప్రారంభించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా మరి కొన్ని హామీలు కూడా నెరవేర్చారని జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స చెప్పారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2019 నాటికి పేదరికం 12 శాతం ఉండేదని, ఇప్పుడు 6 శాతానికి తగ్గించామని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ బీసీల సాధికారతే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ఐదుగురు బీసీ ఉప ముఖ్యమంత్రులు, 56 కార్పొరేషన్ చైర్మన్లను నియమించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల దీవెనలు ఉండాలని పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు. -
Skill Scam: ‘ఆ ఇద్దరి వ్యక్తులకే మొత్తం డబ్బులు వెళ్లాయి’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: చంద్రబాబు కేసులను ఇన్‌కమ్‌టాక్స్, ఈడీ వంటి కేంద్ర సంస్థలే మొదట దర్యాప్తు చేసిన విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. జర్మనీలో ఉన్న సీమెన్స్ సంస్థతో పేమెంట్ జరిగినట్లు నాటి ప్రభుత్వం చెబుతుందని, మరి దానిపై దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తే అలాంటి ఏమీ లేదని సదరు కంపెనీ తెలిపిందన్నారు. దేశంలోని కొన్ని కంపెనీలు పెట్టి, డబ్బులు పంపడానికి మాత్రమే సెల్ కంపెనీలను ఉపయోగిస్తున్నారన్నారు. దర్యాప్తులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ డబ్బులు ఇద్దరు వ్యక్తుల వద్దకే వెళ్లినట్లు తేలిందని, అందులో ఒకరు చంద్రబాబు పీఏ, ఇంకొకరు లోకేష్ పీఏ అని అన్నారు. ఎలాంటి సిస్టమ్ కూడా పాటించలేదని, మాజీ ముఖ్యమంత్రి, గౌరమైన వ్యక్తి అంటూ వదిలేయమంటే ఎలా అని, అలా వదిలేసి హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ఇందిరాగాంధీ, లాలూ ప్రసాద్, జయలలిత, పీవీ నరసింహారావు లాంటి వారే కోర్టు కేసులు ఎదుర్కొన్నారని, చంద్రబాబు దోషి అవునా.. కాదా అన్నది కోర్టు తెలుస్తుందని, చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని కోర్టులోనే నిరూపించుకోవాలని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.