సమావేశంలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అనుభవజ్ఞుడైన తనతో నే అద్భుతమైన రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటనలు, హామీలు గుప్పించారని, అవన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయని వైఎస్సార్‌సీపీ రీజ నల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర 3వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావ పాదయాత్ర ను బుధవారం శ్రీకాకుళం నగరంలో ఆదివారంపే ట అయ్యప్పస్వామి గుడి నుంచి ఇలిసిపురం మీదుగా బలగ చేరుకుని సాధు వైకుంఠరావు అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా చేస్తానని గొప్పలు పలికి న చంద్రబాబు అవినీతిలో ప్రథమ స్థానంలో నిలబెట్టారని ఓ సర్వేలో తేటతెల్లమైనట్లు గుర్తు చేశా రు. రాష్ట్ర ప్రజలకు ప్రతి రోజూ ఫోన్ చేస్తున్నానని చెబుతూ పాలనపై అభిప్రాయం తెలుసుకుని ప్రజలంతా 80శాతం తృప్తిగా ఉన్నారని డబ్బాలు చెప్పుకుంటున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుం దన్నారు.
ప్రజలు తృప్తిగా ఉన్నప్పుడు చంద్రబా బు కాంగ్రెస్‌తో స్నేహం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో కలిసి పోటీచేసి ఇప్పుడు వారినే తిట్టడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. పంట లకు గిట్టుబాటు ధరలేక రైతులు పాట్లు పడుతుం టే అమెరికాలో బాబు మాత్రం రాష్ట్రంలో ఎరువులు లేని పంటలు పండిస్తున్నాం...సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాం.. మరో రెండేళ్లలో ఎరువులు వెయ్యకుండానే పూర్తిగా పంటలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని గొప్పలు పలకడం శోచనీయమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత వెనుకబడి జిల్లా సిక్కోలుకు ఒక్క కేంద్ర సంస్థనైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించా రు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేతకానితనానికి ఇదే నిదర్శనమన్నారు. అమరావతి వెళ్తే ఎడారి ప్రాం తంలా తప్ప ఒక్క భవనం కూడా నిర్మా ణం పూర్తయిన పరిస్థితి లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. అనంతరం టీడీపీకి కం చుకోటగా ఉన్న బలగ నుంచి 500 కుటుం బాలు వైఎస్సార్‌సీపీలోకి చేరినట్లు ధర్మాన ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రీకా కుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, ఎం.వి.పద్మావతి, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, అంబటి శ్రీను, మూకళ్ల తాతబాబు, పీస శ్రీహరి, పొన్నాడ రుషి, కోణార్క్ శ్రీను, కె.ఎల్.ప్రసాద్, మండవల్లి రవి, గొండు కృష్ణమూర్తి, పైడి మహేశ్వరరావు, డాక్టర్ శ్రీనివా స పట్నాయక్, గుమ్మా నగేష్, కోరా డ రమేష్, మెంటాడ స్వరూప్, అల్లు లక్ష్మినారాయణ, టి. కామేశ్వరి, చల్లా అలివేలు మంగ, చల్లా మంజుల, తంగుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment