సాక్షి, శ్రీకాకుళం : అమరావతిలో చంద్రబాబు ఆస్తుల విలువ పెంచుకోవడానికే చంద్రబాబు రాజధాని ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబువి స్వార్థపూరిత రాజకీయాలని, కేవలం తన ప్రయోజనాల కోసమే ఇటువంటి దిక్కుమాలిన పోరాటం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ విడిపోయినప్పుడు ఎలా నష్టపోయామో.. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అంతకన్నా ఎక్కువ నష్టపోయామని తెలిపారు. అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకున్న బాబు రాష్ట్రంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని వెల్లడించారు. ఆయన దోచుకున్న వాటిలో రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టుంటే ప్రాజెక్టులన్నిపూర్తయ్యేవని ఎద్దేవా చేశారు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు వారి పార్టీని తిరస్కరించినా బాబుకు బుద్ధి రాలేదని పేర్కొన్నారు. ఇంకా ఎంతకాలం తన దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేస్తారని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. (అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన)
Comments
Please login to add a commentAdd a comment