సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను వేలెత్తి చూపే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవంతో చంద్రబాబు నాయుడు గ్రామ వ్యవస్థతో పాటు ఆర్థిక వనరులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బ్రోకర్లతో జన్మభూమి కమిటీలు వేసి ప్రజల మధ్య రాజకీయ వైషమ్యాలను పెంచి పోషించారని ఆరోపించారు. రాష్ట్రంలో రూ. 24వేల కోట్లు బకాయిలు పెట్టి బొగ్గులేకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు విధానాల వల్లే ప్రస్తుతం ప్రజలు కరెంట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధర్మాన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment