సాక్షి, తిరుమల: తిరుమల విషాదకర ఘటనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒంటెద్దు పోకడలే కారణమని అధికారులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ కనీసం పట్టించుకోలేదని తాజాగా అధికారులు ఆరోపించారు. సీఎం చంద్రబాబు ముందే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును అధికారులు ఏకిపారేశారు. దీంతో, బీఆర్ నాయుడు వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తిరుమలలో భక్తుల తొక్కిసలాట అంశంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒంటెద్దు పోకడలే ఈ దుస్థితికి కారణమన్నారు. ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలను టీటీడీ చైర్మన్ తీసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై బీఆర్ నాయుడు కనీసం పట్టించుకోలేదన్నారు. అలాగే, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో ఆయన ఇష్టానుసారం మాట్లాడారు. అధికారులతో చెప్పకుండానే టీటీడీ చైర్మన్ నియంతలా వ్యవహరించారని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు సాక్షిగా టీటీడీ చైర్మన్ బండారం బట్టబయలైంది. ఈ ఘటన అనంతరం.. బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై సీఎంకు ఫిర్యాదు చేసిన ఈవో, ఇతర అధికారులు. ఈ సందర్బంగా సీఎం ముందే టీటీడీ చైర్మన్‌ను అధికారులు ఏకిపారేసినట్టు సమాచారం. ఇదే సమయంలో బీఆర్ నాయుడు.. టీటీడీ చైర్మన్‌గా ఉంటే టీటీడీ ప్రతిష్ట మరింత దిగజారిపోతుందని అధికారుల ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: వీళ్లా టీటీడీ పాలకులు?
అయితే, తనకు భజన చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీటీడీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. టీటీడీ సేవలో కాకుండా టీడీపీ సేవలో బీఆర్ నాయుడు తరలిస్తున్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలను పూర్తిగా గాలికొదిలేశారు. తిరుమలలో ఆరుగురు మరణించిన తర్వాత దైవాదీనం అంటూ బీఆర్ నాయుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సంగతి విధితమే. భక్తులకు కనీసం మంచి నీళ్లు, ఆహారం కూడా ఏర్పాటు చేయించలేదు. ఇదే సమయంలో చైర్మన్ బీఆర్ నాయుడు.. వీఐపీ సేవలో పూర్తిగా తరించారు.
ఇది కూడా చదవండి: వైఎస్ జగన్ వస్తున్నారని.. బాధితుల డిశ్చార్జ్!
ఇదిలా ఉండగా.. తొక్కిసలాట ఘటనలో చర్యలకు సీఎం చంద్రబాబు మీన మేషాలు లెక్కిస్తున్నారు. మొత్తం పెత్తనం చేసే టీటీడీ చైర్మన్, వెంకయ్య చౌదరిపై చర్యలు తీసుకోలేదు. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన ఎస్పీ సుబ్బరాయుడుని కూడా సస్పెండ్ చేయలేదు. మరోవైపు.. ఈ ఘటనకు బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి, శ్యామలరావులే బాధ్యులని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో భక్తుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై హిందూ భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కూటమి సర్కార్ పాలనలో ప్రజలు మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ తలోమాట
Comments
Please login to add a commentAdd a comment