తిరుపతి: తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారనే సమాచారం అందుకున్న అధికారులు... బాధితుల్ని ఆగమేఘాల మీద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని ఉన్న పళంగా డిశ్చార్జ్ చేసి వారి ఇళ్లకు తరలిస్తున్నారు. కాకపోతే దర్శనం పేరుతో బాధితుల్ని తరలిస్తున్నామనే సాకులు చెబుతున్నారు. తొక్కిసలాటలో తీ వ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని మళ్లీ ద ర్శనానికి ఎవరైనా తీసుకెళ్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదొక డ్రామా అంటూ మండిపడుతున్నారు.
అధికారుల ఓవరాక్షన్
తొక్కిసలాట ఘటన తర్వాత అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వకపోగా.. ఆపై సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో చేసిన హడావిడి చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శిస్తారనే సమాచారం అధికారులకు అందింది.
దీంతో.. ప్రభుత్వం అధికారులకు ఆగమేఘాల ఆదేశాలు జారీ చేసింది. తొలుత సీఎం చంద్రబాబు వచ్చి వాళ్లను పరామర్శిస్తారని.. అయితే జగన్ వచ్చేలోపు ఆ క్షతగాత్రులను డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించేయాలని అధికారులకు అదేశాలు వెళ్లాయి. నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వాన్ని జగన్ నిలదీస్తారనే భయంతోనే పాలక వర్గం ఈ చ ర్యలకు ఉపక్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment