Tirupati Stampede Incident
-
తిరుపతి చరిత్రలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదు: వైఎస్ జగన్
తిరుపతి: తిరుపతిలో తొక్కిసలాట( Tirupati Stampede Incident) జరిగి ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదు. మనం చూడలేదు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేది ఆలోచన చేయాలి. ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వైఫల్యమే. ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే. బాధిత కుటుంబాలకు కనీపం రూ. 50 లక్షల ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారు ఇంటికి వెళ్లేటప్పుడు రూ. 5 లక్షలు ఇవ్వాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.అత్యంత దారుణ ఘటనరాష్ట్ర చరిత్రలో తిరుపతిలో ఎప్పుడూ తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయిన ఘటన గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలు ఏంటన్నది అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన ఎందుకు జరిగింది. ఘటన జరగడానికి కారణాలు ఏంటన్నది ఆలోచన చేయాలి. వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. వైకుంఠ ఏకాదశి నాడు కొన్ని లక్షల మంది వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారని.. ఆరోజు వైకుంఠద్వార తెరుస్తారని అందరికీ తెలుసు. వైకుంఠ ద్వారం దర్శనం మహాపుణ్యాన్నిస్తుందని అందరికీ తెలుసు. ఆ పుణ్యం కోసం లక్షల మంది దర్శనానికి వస్తారు. 10వ తేదీ వైకుంఠ ఏకాదశి అని, ఆరోజు లక్షల మంది దర్శనానికి వస్తారని తెలిసినప్పటికీ టీటీడీలో ఎందుకు ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతున్నాను.తెలిసినా ప్రొటోకాల్స్ పాటించలేదుఈ ఘటలనకు సీఎం మొదలు, టీటీడీ ఛైర్మన్, అధికారులు జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ బాధ్యులే. చంద్రబాబునాయుడుగారికి కూడా 10వ తేదీన వైకుంఠ ఏకాదశి అని తెలుసు. అంతకు ముందే ఆయన కుప్పంలో మూడు రోజుల కార్యక్రమం పెట్టుకున్నారు. ఈనెల 6 నుంచి 8వ తేదీ మధ్యహ్నం వరకు ఆయన అక్కడే ఉన్నారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులతో పాటు, పోలీసు అధికారులు కూడా చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడం కోసం వెళ్లారు. సీఎం సెక్యూరిటీ కోసం దాదాపు 2 వేల మంది పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లను 8వ తేదీ రాత్రి 8.30 గం.కు ఇస్తున్నప్పుడు తొక్కిసలాటలు జరిగాయి. వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి ఇన్ని లక్షల మంది వస్తారని తెలిసినప్పుడు, మరోవైపు చంద్రబాబు పర్యటన కుప్పంలో ఉందని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయలేదు. ఈ ఘటన జరగడానికి కారణం ఎక్కడా ప్రోటోకాల్ పాటించలేదు.ఏ మాత్రం జాగ్రత్త లేకుండా వ్యవహారంతిరుపతి, బైరాగిపట్టెడ కౌంటర్ ఎదురుగా పార్కులో ఉదయం 9 గం. నుంచి భక్తులను ఉంచారు. రాత్రి 8.30 గం.కు పార్కు గేట్లు తెరిచి కౌంటర్లు దగ్గర వెళ్లడానికి గేట్లు తెరిచారు. చీకట్లో అందరూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. పార్కులో ఉంచినప్పుడు వారికి ఏ సౌకర్యాలు కల్పించలేదు. భక్తులు వచ్చిన వెంటనే వాళ్లను క్యూ లైన్లో నిల్చోబెట్టి, తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. కానీ అలా చేయలేదు. ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టడానికి పోలీసులు అందుబాటులో లేకపోవడంతో పాటు భక్తులందరినీ గుంపుగా ఉంచి.. ఒకేసారి విడిచిపెట్టడంతో ఈ ఘటనలు జరిగాయి. చంద్రబాబునాయుడు గారు ఎంత దిక్కుమాలిన అబద్దాలు ఆడుతున్నారంటే.. ఒకే ఒక్క చోట తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు చూస్తే.. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారని, బైరాగిపట్టెడిలో ఐదుగురు చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆస్పత్రిలో చూస్తే.. అన్ని కౌంటర్లలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కనిపిస్తున్నారు.ఇలాంటి ఘటన తొలిసారిఇంత ప్రాముఖ్యమున్న వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా ఇంత దారుణమైన ఏర్పాట్లు చేశారు. దీనికి టీటీడి ఒక్కటే బాధ్యులు కాదు. ఎస్పీ పోలీసు విభాగం, కలెక్టర్, రెవెన్యూ విభాగంతో పాటు చంద్రబాబు నాయుడు గారు తో సహా అందరూ బాధ్యత వహించాలిచంద్రబాబు సొంత జిల్లా ఇది.. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు లక్షలాది మంది భక్తులు వస్తారని తనకు తెలిసి ఉన్నా.. 6, 7, 8 తేదీల్లో తన కార్యక్రమం కోసం పోలీసులను నియమించుకుని.. ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా గాలికొదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 6గురు చనిపోయారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. దేవుడి దయవల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు అందరూ కొద్దిపాటి గాయాలతో భయటపడడం సంతోషం. పద్మావతి, రుయా ఆసుపత్రి కలుపుకుంటే దాదాపుగా 50 నుంచి 60 మంది తొక్కిసలాటలో గాయాలపాలయ్యారు. తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి.అడుగడుగునా నిర్లక్ష్యంఇంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్లు వ్యవస్ధను నడుపుతున్నారు. ఇక్కడున్న పోలీసులు, టీటీడీ పెద్దలు ఎవరికీ టీటీడీ విశిష్టత తెలియదు. ఇక్కడున్న ఎస్పీ, కలెక్టరు వీళ్లు ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై దశాబ్దాలుగా చాలా కాలం నుంచి ప్రోటోకాల్ ఉన్న వీళ్లెవరూ పట్టించుకోలేదు.టీటీడీ ఛైర్మన్ నుంచి పోలీసు వ్యవస్ధ వరకూ తిరుమలలో ఇన్న లక్షల మంది వస్తున్న నేపధ్యంలో వారికి ఎలాంటి రక్షణ, వసతులు కల్పించాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. కనీసం పార్కుల్లో ఉన్న వారిని అడిగితే ఉదయం 9 గంటలకు వచ్చాం. కనీసం నీళ్లు, ఆహారం, మజ్జిగ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. క్యూలైన్లో నిలబెట్టడం, రోప్ పార్టీలు ఏర్పాటు చేయడం కూడా చేయలేదు. కనీసం వీళ్లు మనుషులుగా ఉన్నారని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా గాలికొదిలేశారు.మా ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలను గొప్పగా చెప్పుకునేలా నిర్వహించాం. ఈ ప్రభుత్వంలో భక్తుల కనీస అవసరాలను కూడా పట్టించుకోలేదు.ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతతిరుపతిలో తొక్కిసలాట ప్రభుత్వ తప్పిదం. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. చనిపోయిన వాళ్లకు ప్రతి ఒక్కిరికీ రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు గాయాల పాలైన వారందరికీ ఉచిత వైద్యం అందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షలు డబ్బులిచ్చి ఇంటికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనకు చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవో, టీటీడీ అడిషనల్ ఈవో, ఎస్పీ, కలెక్టరు బాధ్యత వహించాలి. తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించకుండా ఈ మరణాలకు కారణమైన వీళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి, హోంమంత్రి, దేవాదాయశాఖమంత్రితో పాటు టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈఓ, కలెక్టర్, ఎస్పీ అందరూ బాధ్యత తీసుకోవాలి.ఎఫ్ఐఆర్ కచ్చితంగా మార్చాలితొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్లో వీళ్లు దారుణమైన సెక్షన్లు నమోదు చేస్తున్నారు. ఈ ఘటనపై బీఎన్ఎస్ 194–సెక్షన్ నమోదు చేస్తున్నారు. అంటే ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగే దొమ్మీ కింది కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన జరిగిన ఈ సంఘటనపై సెక్షన్–105 నమోదు చేయాల్సింది పోయి.. కావాలనే సంఘటనను చిన్నదిగా చూపేందుకు, కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వం దారుణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందుకే వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి.తప్పుల మీద తప్పులువీళ్లకు కనీస మానవత్వం, చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. తిరుమల తిరుపతి దేవస్ధానానికి సంబంధించిన పరువు, ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి దిగజార్చే పరిస్థితి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చింది. ఆయన తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో అబద్దాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టించి.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన చంద్రబాబు మళ్లీ తాను చేసిన చర్యల వల్ల టీటీడీ చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ మార్క్‌గా నిల్చిపోయే ఘటన చోటుచేసుకుంది. ఇన్ని సంవత్సరాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది.ఇక్కడికి వచ్చిన క్రౌడ్‌ను మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్ధానంకు ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికీ లేదన్న ఖ్యాతి. ఎంతో పేరు ఉన్న స్ధితి నుంచి ఏకంగా చంద్రబాబునాయుడు లాంటి పాలకుడు ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్ధానంలో అడుగు పెట్టాలంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయో చంద్రబాబు చేసి చూపించారు.మీడియా ప్రశ్నలకు సమాధానంగా..వారందరిదీ తప్పిదమే. ఎందుకంటే..?:చంద్రబాబునాయుడు ఈ ఘటనలో చిన్న చిన్న అధికారులను బదిలీ వంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. నిజానికి ఇందులో చంద్రబాబునాయుడు చేసిన తప్పు కనిపిస్తోంది. భక్తుల కోసం పోలీసులను కేటాయించాల్సింది పోయి.. తన పర్యటన కోసం పోలీసులను మోహరించుకున్నారు. అదే విధంగా జిల్లా ఎస్పీ కూడా చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడ్డారే తప్ప.. లక్షలాది మంది భక్తులకు సెక్యూరిటీ కల్పించాలని ఆలోచన చేయలేదు. అదే విధంగా భక్తులకు క్యూలైన్లలో నిలబెట్టే కార్యక్రమంతోపాటు దానికి సంబంధించిన సమీక్షలు చేయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రికమెండ్ చేయాలన్న ఆలోచన చేయని కలెక్టర్‌ది కూడా తప్పే. భక్తులకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఏర్పాటు చేయకపోవడం కూడా కలెక్టర్ తప్పు. ఇంత మందిని దర్శనానికి ప్రవేశం కల్పించాలన్న ఆలోచన చేయని ఈఓ, అదనపు ఈఓది కూడా తప్పు. వీరందరికీ ఆజమాయిషీ చేసే టీటీడీ ఛైర్మన్‌ది కూడా తప్పే.ఏర్పాట్లపై ఏ మాత్రం శ్రద్ద లేదు:వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లుపై సమీక్ష చేయకుండా తాత్సారం చేసి ఇంత మంది చావులకు వీరంతా కారణమయ్యారు. ఏర్పాట్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. మూడు వేర్వేరు కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. అన్ని చోట్ల తగినంత మంది పోలీసుల సిబ్బంది లేకపోవడం, సరైన ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన తప్పిదం.ముందుజాగ్రత్తగా ఆయా కౌంటర్ల వద్ద కచ్చితంగా ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కనీసం ఘటన జరిగిన తర్వాత కూడా ఆంబులెన్స్ రావడానికి ముప్పావు గంట, గంట పట్టిందని ఆసుపత్రులో చికిత్స పొందుతున్న వారు చెబుతున్నారు. అది కూడా ఒక్కోటి వచ్చిందని చెప్పారు. ఇంకా కొందరు వాళ్లంతట వాళ్లే ఆసుపత్రికి వచ్చామని చెబుతుండగా... ఇతరుల సాయంతో మరికొంతమంది ఆసుపత్రి వచ్చామన్నారు.చంద్రబాబే మొదటి ముద్దాయి. ఎందుకంటే?చంద్రబాబునాయుడికి శాస్త్రం తెలియదు, మిగిలిన గుడుల్లో ఎలా చేస్తున్నారన్న ఆచరణ కూడా తెలియదు. దేవుడి మీద భయభక్తులు కూడా లేవు. దేవుడి మీద భక్తి, భయం ఉంటే.. తిరుమల తిరుపతి ప్రసాదం గురించి అబద్దాలు చెప్పగలుగుతాడా?. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి టీటీడీ ప్రతిష్టను దిగజార్చే పని చేస్తాడా?. దేవుడంటే భయం, భక్తి లేదు కాబట్టే ఇలా చేశాడు. చంద్రబాబు నాయుడే ఈ ఘటనలో మొదటి ముద్దాయి. చంద్రబాబునాయుడుకి ఈ పాపం కచ్చితంగా తగులుతుంది.తప్పు చేసిన తర్వాత దేవుడికి, భక్తులకి కనీసం క్షమాపణ చెప్పే చిత్తశుద్ధి, ఇంగిత జ్ఞానం లేదు. తాను చేసిన తప్పులకు వేరొకరి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో పుష్కరాల్లో కూడా ఇదే పని చేశాడు. షూటింగ్ కోసం అందరినీ ఒకేచోట పెట్టి.. గేట్లు ఒకేసారి ఎత్తారు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గర, ఆయన సమక్షంలోనే ఆ ఘటన జరిగింది.నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారునేను తిరుపతి వచ్చి.. జరిగిన విషయాలు ప్రజలకు చెప్తానని.. చంద్రబాబునాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి తరలించారు. మా పరిస్ధితి బాగాలేదని పేషెంట్లు ఇంకా కొంతమంది ఆసుపత్రిలో భీష్మించుకుని ఉన్నారు. నన్ను రాకుండా చేసేందుకు కుట్ర పన్నారు. మధ్యలో ఆపాలని చూశారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబుతో కుమ్మక్కైన అధికారులందరీకి దేవుడి మెట్టికాయలు కచ్చితంగా పడతాయి. -
వైఎస్ జగన్ వస్తున్నారని.. బాధితుల డిశ్చార్జ్!
తిరుపతి: తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారనే సమాచారం అందుకున్న అధికారులు... బాధితుల్ని ఆగమేఘాల మీద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని ఉన్న పళంగా డిశ్చార్జ్ చేసి వారి ఇళ్లకు తరలిస్తున్నారు. కాకపోతే దర్శనం పేరుతో బాధితుల్ని తరలిస్తున్నామనే సాకులు చెబుతున్నారు. తొక్కిసలాటలో తీ వ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని మళ్లీ ద ర్శనానికి ఎవరైనా తీసుకెళ్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదొక డ్రామా అంటూ మండిపడుతున్నారు.అధికారుల ఓవరాక్షన్తొక్కిసలాట ఘటన తర్వాత అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వకపోగా.. ఆపై సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో చేసిన హడావిడి చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శిస్తారనే సమాచారం అధికారులకు అందింది. దీంతో.. ప్రభుత్వం అధికారులకు ఆగమేఘాల ఆదేశాలు జారీ చేసింది. తొలుత సీఎం చంద్రబాబు వచ్చి వాళ్లను పరామర్శిస్తారని.. అయితే జగన్ వచ్చేలోపు ఆ క్షతగాత్రులను డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించేయాలని అధికారులకు అదేశాలు వెళ్లాయి. నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వాన్ని జగన్ నిలదీస్తారనే భయంతోనే పాలక వర్గం ఈ చ ర్యలకు ఉపక్రమించింది. -
తొక్కిసలాట ఘటన.. పవన్ మరో ప్రాయశ్చిత్త దీక్ష?
డిప్యూటీ సీఎం, సనాతనవాదిగా లేబుల్ వేసుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మళ్ళీ తన చిత్తశుద్ధిని చాటుకుని తన ఆపాదించుకున్న సనాతనవాది టైటిల్‌ను నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చింది. సందర్భాన్ని బట్టి కమ్యునిష్టుగా.. కులం లేనివానిగా.. ఒక్కోసారి.. దళితుడిగా.. ఇంకోసారి ఇంకోలా మారిపోయే నయా సనాతన వాది పవన్ కళ్యాణ్ ఇప్పుడు తక్షణమే గెటప్ మార్చాల్సిన తరుణం వచ్చింది. తిరుపతిలో లడ్డుల్లో కల్తీ, జంతువుల కొవ్వు ఉందని ఎవరో ఎక్కడో చెప్పారని .. రూఢీ కానీ ఆరోపణలను పట్టుకుని ఉన్న ఫలంగా కాషాయం బట్టలు ధరించి ప్రాయశ్చిత్తం అనే కిరీటం పెట్టేసుకుని దుర్గమ్మ ఆలయం మెట్లు కడిగేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు సనాతనవాది గెటప్ వేయాలి. దేశంలో దుష్టశిక్షణ జరగాల్సిన ప్రతి సందర్భంలోనూ నేను అవతరిస్తాను అని విష్ణుమూర్తి చెప్పి... అలాగే ఉద్భవించి రావణుడు.. హిరణ్యకశిపుడు వంటి రాక్షసులను సంహరించారు,. అలాగే పవన్ కూడా ఇదే మాట చెప్పుకున్నారు. సనాతన ధర్మానికి విఘాతం కలిగితే చాలు తాను మగ కాళికగా మారతానని హూంకరించారు. నిలువు బొట్లు.. కాషాయం బట్టలతో నానా హడావుడి చేశారు.. ఆలయ ఆంప్రోక్షణ పేరిట వీడియో షూట్లు చేశారు. చిత్తశుద్ధి పేరిట పవన్ చేసిన ఈ స్కిట్‌ను కొందరు అభినందించగా చాలామంది ట్రోల్ చేసారు. ఇక ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు ఇచ్చేవిషయంలో క్యూ లైన్లు నిర్వహణ సరిగా లేక అధికారుల్లో బాధ్యత లేక.. సినిమా టిక్కెట్ల కోసం ఒకేసారి గేట్లు తీసి జనాన్ని వదిలినట్లు వదలడం. పోలీసులు కూడా ఎక్కడ లైన్లు నియంత్రించకపోవడంతో తొక్కిసలాట(Stampede) జరిగింది. ఆరుగురు ప్రాణాలు హరించుకుపోయాయి. పదుల సంఖ్యలో భక్తులు తొక్కిసలాటలో నలిగిపోయి ఆస్పత్రుల పాలయ్యారు. మరి ఇప్పుడు ఆలయ పవిత్రతకు భంగం కలగలేదా..? ఇన్స్టంట్ సనాతన వాది పవన్ రక్తం మరిగిపోలేదా.. ఇప్పుడు సంప్రోక్షణ అవసరం లేదా.. ప్రాయశ్చిత్త దీక్ష చేయోద్దా...? మెట్లు కడిగే పని లేదా ? మరోవైపు బిజెపి నాయకులు కూడా కిక్కురుమనడం లేదు.. అసలు రాష్ట్రంలో అలంటి ఘటన జరగనట్లే ఉంటున్నారు. అంటే వీళ్లంతా చంద్రబాబుకు ఇబ్బంది ఎదురైతేనే కలుగుల్లోంచి బయటకు వస్తారా లేకుంటే బొరియలలో దాక్కుంటారా అనే సందేహాలు ప్రజల్లో ముప్పిరిగొంటున్నాయి. ఇప్పుడు పవన్ అర్జన్ట్ గా తిరుపతి వెళ్లాలి.. వీలయితే చీపురు ఫినాయిల్ బకెట్ పట్టుకుని మెట్లు కడగాలి.. మల్లోమారు ఆయనలోని సనాతన వాది బయటకు రావాలని ఒరిజినల్ హిందుత్వవాదులు ఆశపడుతున్నారు. కానీ, ఇప్పటికే ఆయన అక్కడికి చేరుకోవడంతో.. అది జరగదనే అనుకోవాలి. :::సిమ్మాదిరప్పన్నఇదీ చదవండి: పవన్ ఇమేజ్‌కు డ్యామేజ్ షురూ! -
ఈ ఘటనకు టీటీడీనే బాధ్యత వహించాలి: వైవీ సుబ్బారెడ్డి
అమరావతి: తిరుపతిలో తొక్కిసలాట(Tirupati Stampede Incident) జరిగి ఆరుగురి మృతి చెందడంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy). ఈ ఘటన అత్యంత దారుణమన్న వైవీ సుబ్బారెడ్డి.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాటలు ఆందోళన కల్గించాయన్నారు. ఈ ఘటనకు టీటీడీనే బాధ్యత వహించాలన్నారు.తిరుపతి తొక్కిసలాట ఘటనపై ‘సాక్షి’తో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. ‘లక్షలమంది భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. కనీసం సమీక్షలైనా నిర్వహించారా?, వైఎస్సార్సీపీ హయాంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.. కాబట్టే ఏ ప్రమాదం జరగలేదు. నేనే స్వయంగా వెళ్లి క్యూ లైన్లనను పరిశీలించేవాడిని. సమస్యలు ఎక్కడ ఉన్నాయో స్వయంగా తెలుసుకునేవాడిని. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడలేదు. అధికారులతో టీటీడీ సరిగా పనిచేయించలేదు. మృతుల కుటుంబాలను టీటీడీ ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి’ అని ఆయన కోరారు.కాగా, వైకుంఠ ద్వార దర్శన(Vaikunta Dwara Darshan) టికెట్ల జారీచేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. లక్షా యాభైవేల టోకెన్లు జారీచేస్తామని చెప్పి.. కనీస రక్షణ చర్యలు, మౌలిక ఏర్పాట్లుచేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.అలా కాకుండా ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. దీంతో వీరిని అదుపుచేయడం అటు పోలీసులకు, ఇటు టీటీడీ సిబ్బందికి సవాలుగా మారింది.మరోవైపు.. ఈ తొక్కిసలాటలో చిక్కుకున్న క్షతగాత్రులను తరలించడంలో భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. మరోవైపు.. శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదుకోని అంబులెన్స్‌లు.. ఇక గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సకాలంలో అంబులెన్స్‌లు రాలేదు. కొన్నిచోట్ల వచ్చినా.. సరైన సమయంలో స్పందించలేదని బాధితులు వాపోయారు. అలాగే, అవసరమైన మేర అంబులెన్స్‌లను రప్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.ఇక గాయపడిన వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోవడం.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు. సర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదంసర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు పెద్దఎత్తున భక్తులు వస్తారని తెలిసినా.. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌లు, పోలీసులతో హంగామా చేస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగిపోయి అనేక మంది వికలాంగులయ్యారు. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయం కోసం పోరాటం చేస్తాం. – సీబీ రమణ, నరసాపురం, అన్నమయ్య జిల్లాప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదంటీటీడీకి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. వచ్చిన వాళ్లను వచ్చినట్టు క్యూలైన్లో వదలకుండా పెద్దఎత్తున జనం గుమికూడిన తర్వాత వదిలిపెట్టడం దారుణం. దీంతో ప్రమాదం జరిగింది. టీటీడీ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇలా జరగడం ఇదే ప్రథమం. టీడీపీ నైతిక బాధ్యత వహించి అందరినీ ఆదుకోవాల్సి ఉంది. – సీపీ మునివెంకయ్య, నరసాపురం, అన్నమయ్య జిల్లా -
నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా?
తిరుమల... ఎంత ప్రతిష్టాత్మక, పవిత్రమైన దేవాలయం..? ఎంత గొప్ప పేరు ఉన్న పుణ్య క్షేత్రం..? కానీ ఈ రోజు జరుగుతున్నదేమిటి? ఆంధ్ర ప్రదేశ్‌కే కాదు.. దేశానికే గర్వకారణమైన దేవస్థానంలో వైకుంఠ ద్వార ప్రవేశ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఉదంతం ప్రపంచ వ్యాప్త హిందువులను కలచి వేస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక , చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో ఘోరాలు జరగుతున్నాయి. అకృత్యాలు, విధ్వంసాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. చివరికి తిరుమలేశుని కూడా వదలిపెట్టలేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడానికి కూడా వెనుకాడని నాయకత్వం ఇప్పుడు ఏపీలో పాలన చేస్తోంది. హిందూ మత ఉద్దారకులుగా పైకి ఫోజు పెట్టడం, లోపల మాత్రం ఎన్ని దందాలు చేయాలో అన్నీ చేయడం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినా వారిని అసౌకర్యం లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించే వారు. అయోధ్య ఆలయ నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదెలాగో నేర్చుకోవడానికీ టీటీడీ అధికారులను ఆయోధ్యకు ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. అది జగన్ జమానా.. మరి ఇప్పుడు...??? అంతటి ఖ్యాతి వహించిన టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్లో విఫలమైంది. వేలల్లో వచ్చిన జనాన్నే నియంత్రించలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. యాభై మంది వరకూ గాయపడ్డారు. ఇంతటి విషాదం... దశాబ్దాలలో ఎన్నడూ జరగలేదు. ఈ ఘటన తిరుపతి గొప్పదనాన్ని దెబ్బ తీసిందని చెప్పక తప్పదు. తిరుమలను పరిరక్షించేందుకు, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి, జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ పలు సంస్కరణలు తెచ్చింది. ఇప్పుడు ఆ పని మాని గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల కాలంలో ఏమైనా తప్పులు జరిగాయా? అని భూతద్దం పెట్టి అన్వేషించి వైఎస్సార్సీపీ రాజకీయ కక్ష సాధించడానికి, జగన్ ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో టీటీడీ పరువును పణంగా పెడుతోంది. కొత్తగా టీటీడీ ఛైర్మన్ అయిన ఒక టీవీ సంస్థ యజమాని బీఆర్ నాయుడు పూర్తి అసమర్థంగా వ్యవహరించారనిపిస్తుంది. గొడవ జరుగుతుందని ముందుగానే తనకు తెలుసునని ఆయన చెప్పడం గమనార్హం. గొడవ జరుగుతుందని తెలిస్తే ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేకపోయారన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేక మళ్లీ మాట మార్చారు. ఈ మొత్తం ఘటనను బాధ్యతను అధికారులపైకి నెట్టి తప్పించుకునేందుకు చంద్రబాబు, బీఆర్ నాయుడులు చూస్తున్నారు. మరో ఘట్టం గురించి కూడా మాట్లాడుకోవాలి. తిరుమల ప్రసాదం లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ లడ్డూను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. అలాంటి లడ్డూపై తీవ్రమైన అనుచిత ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘోర అపచారానికి పాల్పడ్డారని భక్తులు భావిస్తారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ని వాడారంటూ చంద్రబాబు నీచమైన ఆరోపణ చేసి గత ముఖ్యమంత్రి జగన్ కు రుద్దాలని ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ సడన్ గా సనాతని వేషం కట్టి బాండ్ బాజా వాయించారు. దానికి జగన్ మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకోండి... కాని స్వామి వారికి అపచారం చేస్తున్నారు సుమా! అని హెచ్చరించారు. అయినా టీడీపీ, జనసేన, బీజేపీలు ఇష్టారీతిన దుర్మార్గపు ప్రచారం చేసి తిరుమల ఔన్నత్యాన్ని దెబ్బతీశాయి. ఒకవేళ లడ్డూకు సంబంధించి నిజంగానే ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే వాటిని సరిచేసి బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రే తన రాజకీయ స్వార్థం కోసం ఒక వదంతిని ప్రచారం చేశారు. చివరికి దానిపై సీబీఐ విచారణ వేస్తే ఏమైందో అతీగతీ లేదు. అనంతరం చంద్రబాబే మాట మార్చారు. దీనివల్ల స్వామి వారి ఆలయానికి అపవిత్రత తెచ్చిన అపఖ్యాతిని చంద్రబాబు, పవన్ లు పొందారు. కేవలం జగన్‌పై ద్వేషంతో ఆయన పాలనలో వీరు తిరుమలపై అనేక విమర్శలు చేసేవారు. దానివల్ల తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఎన్నడూ ఫీల్ అయ్యేవారు కారు. జగన్ పై మతపరమైన ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలన్న యావ తప్ప మరొకటి ఉండేది కాదు. చంద్రబాబు ,పవన్ లు నిజాలు చెప్పరులే అని ప్రజలు భావించారు కాబట్టి సరిపోయింది కాని, లేకుంటే కూటమి పెద్దలు తిరుమలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించడానికి యత్నించారు. తిరుమలలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంక్రాంతి పర్వదినాల నుంచి వారం రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం జరిగింది. దీనిని చాలా పవిత్రంగా భక్తులు పరిగణిస్తారు. దానికి అధికారులు కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కానీ ఈసారి తిరుపతిలో తొమ్మిది చోట్ల 90 కౌంటర్లు ఏర్పాటు చేసినా, ఈ తొక్కిసలాట జరిగిందంటే పర్యవేక్షణ లోపం తప్ప ఇంకొకటి కాదు. కారణం ఏమైనా బైరాగి పట్టెడ అనే చోట అకస్మాత్తుగా గేటు తెరవడంతో టిక్కెట్లు ఇస్తున్నారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా తోసుకు వచ్చారు. అంటే అక్కడ అలా తోపులాట లేకుండా ముందుగానే అధికారులు చర్య తీసుకోలేదన్నమాట. గురువారం ఉదయం నుంచి ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక మొదలైన రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బుధవారం మధ్యాహ్నమే తరలివచ్చారు. అధికారులు ఈ విషయాన్ని గమనించినా వారి నియంత్రణకు తగిన ప్రణాళిక రూపొందించలేదు. అందరిని ఒక పార్కులో పెట్టేశారు. మంచినీటి వసతి కూడా కల్పించలేకపోయారు. మరో రెండు చోట్ల కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఇలాంటి వాటిపై కదా.. టీటీడీ ఛైర్మన్ ,పాలక మండలి, ఉన్నతాధికారులు దృష్టి పెట్టవలసింది?. గతంలో సమర్థంగా పనిచేసిన అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి, వారిని తొలగించి తమ అంతేవాసులను నియమించుకున్నారు. తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ఒక పోలీసు అధికారిని ప్రత్యేకంగా పోస్టు చేశారట. వారు ఆ పనిలో ఉంటారు కాని, ప్రజల అవసరాలను ఎందుకు పట్టించుకుంటారు? పైరవీ చేసుకుని టీటీడీ ఛైర్మన్ అయిన బిఆర్ నాయుడుకు అసలు ఇలాంటి విషయాలలో ఏమి అనుభవం ఉంది? లేకపోయినా ఫర్వాలేదు. ఆయన నిబద్ధత ఏమిటి? కేవలం ఒక టీవీ సంస్థ ద్వారా తనకు బాజా వాయిస్తే పదవి ఇచ్చేశారు. పదవి తీసుకున్న తర్వాత అయినా టీటీడీ ఉద్దరణకు కృషి చేశారా? పోసుకోలు ఇంటర్వ్యూలు, ప్రకటనలు చేస్తూ కాలం గడిపి అసలు భక్తులను ఇక్కట్ల పాలు చేశారు. టెక్నాలజీని తానే కనిపెట్టినట్లు చంద్రబాబు మాట్లాడుతుంటారు. అయినా ఆన్ లైన్ లో కాకుండా ఇన్ని వేల మందిని, అది కూడా గంటల తరబడి వేచి ఉండేలా చేయడం అంటే ఈ ప్రభుత్వ చేతకాని తనమే కాదా? చంద్రబాబు నాయుడు గతంలో పుష్కరాల సమయంలో పబ్లిసిటీ కోసం, సినిమా షూటింగ్ కోసం సామాన్య భక్తుల స్నాన ఘట్టంలో స్నానం చేసి నప్పుడు కూడా ఇలాగే గేట్లు సడన్ గా తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. ఆ విషయంలో ఒక్క కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోలేదు. సీసీటీవీ ఫుటేజీ సైతం మాయమైంది. ఆయన టైమ్ లో కేసును నీరుకార్చేసినా, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కూడా దానిపై దృష్టి పెట్టలేదు. తదుపరి కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభలలో పదకుండు మంది మరణించినా, చంద్రబాబుపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. అయినా చంద్రబాబు పోలీసులదే వైఫల్యం అని దబాయించి, రోడ్లపై సభలు వద్దన్నందుకు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఇటీవల హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే, దానికి నటుడు అల్లు అర్జున్ కారణమని ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అలా చేసినందుకు, టీడీపీ, జనసేన శ్రేణులు సమర్థించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టాయి. అదే కొలమానంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరిపై చర్య తీసుకోవాలి. ఎవరిని అరెస్టు చేయాలి? టీటీడీ ఈవో, జాయింట్ ఈవో, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ మొదలైనవారిని బాధ్యులు చేస్తారా? లేదా? ఎలాంటి చర్య తీసుకుంటారు? అసలు ఈ ఘటనకు నైతిక బాధ్యతగా బిఆర్ నాయుడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? ఒకవేళ ఆయన చేయకపోతే చంద్రబాబు ఆ మేరకు ఆదేశిస్తారా? అంటే అది జరిగే పని కాకపోవచ్చు. ఎందుకంటే బిఆర్ నాయుడుని నియమించిన చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.అలాగే పనికట్టుకుని తనకు కావల్సిన అధికారులను నియమించి ,వారిని తన అడుగులకు మడుగులు ఒత్తేవారిగా మార్చుకున్న ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికి చంద్రబాబు, పవన్ లు రెచ్చిపోయి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవారు. ఎల్లో మీడియా గోల,గోల చేసేది. ఇప్పుడు మాత్రం అంత గప్ చిప్ అయ్యారు. అదేదో అధికారులదే తప్పన్నట్లుగా కథ నడపాలని చూస్తున్నారు. మొత్తం తిరుమలకు అపవిత్రత వచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మోక్షం పొందవచ్చన్న కొండంత ఆశతో వెళ్లిన భక్తులకు చంద్రబాబు ప్రభుత్వం నరకం సృష్టించడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆస్పత్రుల వద్ద మృతుల కుటుంబసభ్యుల రోదనలు
-
తిరుపతి తొక్కిసలాట: హృదయాన్ని కలిచివేసిందన్న మోహన్‌బాబు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohanbabu) దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. 'తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది.ఇలా జరగడం దురదృష్టంప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయినా ఇలా జరగడం దురదృష్టకరం. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని.. మరణించిన వారి కుటుంబాలకు ఆ వైకుంఠవాసుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు.ఏం జరిగింది?వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. పదిరోజులపాటు కొనసాగే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకోసం తిరుమలలో ఒకటి, తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేశారు. టోకెన్లు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో, పక్క రాష్ట్రాల భక్తులు సైతం భారీగా తరలి వచ్చారు.(చదవండి: మోహన్ బాబును జైలుకు పంపాలా..? నష్టపరిహారం కావాలా..?: సుప్రీంకోర్టు)ఒక్కసారిగా విడిచిపెట్టడంతో..తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్న భక్తులను క్యూలైన్లోకి అనుమతించలేదు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. కిందపడిపోయినవారికి ఊపిరాడక ఆరుగురు మృతి చెందారు.భీతిల్లిన తిరుపతిఅదేవిధంగా శ్రీనివాసం ప్రాంతంలోని కౌంటర్ కేంద్రంలో భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరగ్గా ఒకరు మరణించగా పలువురూ గాయపడ్డారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాల్సిన తిరుమల అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో భీతిల్లింది.కన్నప్ప సినిమా విశేషాలుసినిమా విషయానికి వస్తే.. మోహన్‌బాబు చివరగా శాకుంతలం సినిమాలో నటించాడు. ప్రస్తుతం అతడు కన్నప్ప మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శివ భక్తుడు కన్నప్పగా కనిపించనున్నాడు. విష్ణు తనయుడు అవ్రామ్ బాలకన్నప్పగా మెప్పించనున్నాడు. ఈ చిత్రాన్ని 2023లో ప్రకటించారు. ప్రభాస్, కాజల్, మధుబాల, ఆర్ శరత్‌కుమార్, బ్రహ్మానందం, రఘుబాబు, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు వెళ్ళి అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా…— Mohan Babu M (@themohanbabu) January 9, 2025 చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు -
వైఎస్ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
తిరుపతి/గుంటూరు, సాక్షి: తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) తిరుపతికి బయల్దేరిన సంగతి తెలిసిందే. కాసేపట్లో పద్మావతి మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించే అవకాశం ఉన్న తరుణంలో వైఎస్ జగన్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తిరుచానూ క్రాస్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అరగంట తర్వాత వెళ్లాలని పోలీసులు చెప్పడంతో.. తిరుచానూరు క్రాస్ వద్ద నుంచి నడుచుకుంటూనే కాలినడకన బయల్దేరారు జగన్.. అయితే కొద్ది దూరం నడిచిన వెళ్లిన వైఎస్ జగన్.. ఆపై స్థానిక నేత కారులో తిరుపతికి బయల్దేరారు.వైఎస్ జగన్ వెళ్లే లోపు బాధితుల్ని తరలించే యోచనలో ఉన్న అధికారులు.. దానిలో భాగంగా ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే అరగంట, గంట అంటూ ఏవో సంబంధం లేని కారణాలను తెలియజేసే యత్నం చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోని వైఎస్ జగన్.. బాధితుల్ని పరామర్శించడానికి బయల్దేరారు.కనీసం ట్రాఫిక్ క్లియన్ చేయని అధికారులువైఎస్ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న అధికారుల్లో ఎలాగైనా బాధితుల పరామర్శను నిర్వీర్యం చేయాలనే యోచన ఉన్నట్లు కనిపిస్తోంది. కనీసం ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం లేదు అధికారులు. వైఎస్సార్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్కే రోజాలు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.పోలీసులు కాన్వాయ్‌ను అడ్డుకున్న క్రమంలో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన వైఎస్ జగన్.. ఆపై స్థానిక నేత వాహనంలో తిరుపతికి బయల్దేరారు. అధికారుల ఓవరాక్షన్తొక్కిసలాట ఘటన తర్వాత అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వకపోగా.. ఆపై సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో చేసిన హడావిడి చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శిస్తారనే సమాచారం అధికారులకు అందింది. దీంతో.. ప్రభుత్వం అధికారులకు ఆగమేఘాల ఆదేశాలు జారీ చేసింది. తొలుత సీఎం చంద్రబాబు వచ్చి వాళ్లను పరామర్శిస్తారని.. అయితే జగన్ వచ్చేలోపు ఆ క్షతగాత్రులను డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించేయాలని అధికారులకు అదేశాలు వెళ్లాయి. నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వాన్ని జగన్ నిలదీస్తారనే భయం ఈ ఆదేశాలతో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. -
తిరుపతి తొక్కిసలాట ఘటన..ఈ పాపం మీదే (ఫొటోలు)
-
Tirupati Stampede: తప్పు ఎవరి వల్ల జరిగింది?
తిరుపతి, సాక్షి: వైకుంఠ ద్వారా దర్శన కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనల వెనుక.. విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు తప్పు జరిగిపోయిందంటూ టీటీడీ చైర్మన్ బాధ్యతారాహిత్యంగా ఒక ప్రకటన ఇవ్వగా.. మరోవైపు భక్తులను నియంత్రించాల్సిన పోలీసు యంత్రాగం తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. ఎవరి వల్ల తప్పు జరిగింది? అనేదానిపై దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసులకు సమన్వయం లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. భక్తులను మేనేజ్ చేయడంలో ఘోరంగా విఫలమైన పోలీసులు.. భక్తులు క్యూలలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. పశువులతో వ్యవహరించినట్లు భక్తులతో వ్యవహరించారు వాళ్లు. అయితే పోలీసులు ఎందుకు అలర్ట్‌గా ఉండలేకపోయారనేదానికి సమాధానం దొరికింది.జనవరి 6, 7, 8 తేదీల్లో తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. నిన్న మధ్యాహ్నాం దాకా కుప్పంలోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. దీంతో పోలీస్ యంత్రాంగం అంతా ఆయన సేవలోనే తరించింది. పైగా.. పర్యటనకు రెండు రోజుల ముందు నుంచే జిల్లా పోలీసులకు డ్యూటీలు వేశారు. దీంతో వరుసగా నాలుగు రోజులపాటు చంద్రబాబు బందోబస్తులోనే పోలీసులు అలసిపోయినట్లు కనిపిస్తోంది. అదే టైంలో..వైకుంఠ ఏకాదశి క్యూ లైన్ల మేనేజ్మెంట్పై ఒక్క రివ్యూ కూడా జిల్లా పోలీసులు నిర్వహించలేదు. బాబు పర్యటన మీద ఫోకస్‌తో ఎస్పీ కూడా ఈ విషయంపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఆపై ఆ బాధ్యతలను.. తిరుపతి వెస్ట్ సీఐ రామకృష్ణకే అప్పగించారు. దీంతో ఆయన అత్తెసరు పోలీసులతో క్యూలైన్ మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహించడంతో.. ఘోరం జరిగింది. -
డీఎస్పీదే తప్పు: సీఎంకు కలెక్టర్ నివేదిక
తిరుపతి: తిరుపతి తొక్కిసలాటలో పెనువిషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు. డీఎస్పీ తొక్కిసలాట జరిగే సమయంలొ సరిగా స్పందించకపోవటంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. అయితే ఈ ప్రమాద సమయంలో ఎస్పీ సుబ్బారాయుడు వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసినట్లు చెప్పారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేనట్లు వివరించారు. ఈ విషాద ఘటన డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని కలెక్టర్ సీఎంకు నివేదిక ఇచ్చారు. -
తొక్కిసలాటకు చంద్రబాబుదే బాధ్యత: భూమన
తిరుపతి, సాక్షి: పోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) అన్నారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.నెలరోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు, పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ.ఇవాళ ఆయన పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ, నిన్న తొక్కిసలాట సమయంలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరు. తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలి... తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అనే వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడంతోనే తొక్కిసలాట జరిగింది. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం. తమిళనాడు శ్రీరంగం తరహాలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని.. రెండు రోజులు నుంచి పది రోజులకు పెంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. భక్తులకు మేలైన నిర్ణయాలే తీసుకున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అద్భుతంగా నిర్వహించాం. తిరుమల పవిత్రతను మేము కాపాడినట్లు ఇంతదాకా ఎవరు కాపాడలేరు. కానీ, టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయక్రీడా మైదానంగా మార్చేశారు. భక్తులకు నీళ్లు, ఆహారం లేవు.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మీరు చేస్తున్న తప్పులకు, భక్తులకు కష్టాలు పడుతున్నారు. పశువులను మందలో తోసినట్లు భక్తులను క్యూ లైన్లలో తోసిపారేశారు. ఇది ప్రభుత్వ తప్పిదం కారణంగా జరిగిన ఘటన. ప్రభుత్వం చేసిన హత్యలే. అందుకే మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. క్షతగాత్రులకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్(Pawan kalyan) ఇప్పుడేం మాట్లాడతారు?. లడ్డూ విషయంలో వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేశారు. గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో ఇద్దరు అభిమానులు చనిపోతే , రోడ్డు బాలేదని మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలకు, చేసే చేతలకు పొంతన లేదు. తిరుమలను, దేవుడిని చంద్రబాబు తన రాజకీయాల కోసం పావుగా వాడుకుంటున్నారు.దేవుడితో పెట్టుకుంటే ఆయనే చూస్తాడు అంటూ చంద్రబాబు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది, లడ్డు ప్రసాదంతో రాజకీయ ఆటలు ఆడితే స్వామి చూశారు. టీటీడీ చైర్మన్ ను కనీసం ఈవో, అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి కు చంద్రబాబు సేవ తప్పా, భక్తులు సేవ లేదు. బ్రేక్ దర్శనాలు 7 వేలకు పైగా ఇస్తున్నారు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి కూడా ఘటనకు బాధ్యత వహించాలి. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయిలో పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరిలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ను ఏవిధంగా అరెస్టు చేయించాలి అనే కుట్రలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి పై ఏడుపే తప్ప, పాలన లేదు. తిరుపతి తొక్కిసలాట ఘటన.. ప్రభుత్వం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం’’ అని భూమన అన్నారు.ఇదీ చదవండి: ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం! -
ప్రాణాలతో చెలగాటం.. తిరుమల ఘటనపై భక్తుల రియాక్షన్
నిలబడలేం.. కూర్చోలేం.. ఒకే చోట పడిగాపులు.. కనీస వసతులు లేవు.. అన్నపానీయాలు అందలేదు.. పట్టించుకునేవారు లేరు.. వైకుంఠ ద్వార దర్శనార్థం వచ్చిన భక్తులతో టీటీడీ అధికారులు దారుణంగా వ్యవహరించారు. వీధులనే క్యూలుగా మార్చి అందులో తోసేశారు.. పిల్లలు.. పెద్దలు.. మహిళలనే జ్ఞానం లేకుండా ఇష్టారాజ్యంగా నెట్టేశారు. ఏమాత్రం నియంత్రణ పాటించకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కౌంటర్ల వద్ద తూతూమంత్రంగా భద్రత కల్పించారు. టోకెన్ తీసుకునేందుకు పోటీపడే దుస్థితిని తీసుకువచ్చారు. వారి నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.పెద్దసంఖ్యలో గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. చివరకు సహాయక చర్యల్లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించారు. సకాలంలో వైద్యసేవలందించడంలోనూవైఫల్యం చెందారు. టీటీడీదే బాధ్యత పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయని టీటీడీ అధికారులే ఈ ఘోరానికి బాధ్యత వహించాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఇంత మంది తీవ్రంగా గాయపడేందుకు కారణమయ్యారు. పోలీసులు సైతం అత్యంత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించారు. ఈక్రమంలో ప్రభుత్వం స్పందించాలి. బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి. – మురళి, జిల్లా కార్యదర్శి, సీపీఐ ప్రాణాలతో చెలగాటం టీటీడీ అధికారులు శ్రీవారి భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు పంపిణీ చేసేందుకు పది రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించారు. చివరకు చేసింది ఇదా. ఇంతమంది ప్రాణాలకు ఎసరు పెడతారా. ఈ ఘెరానికి కారకులను వదిలిపెట్టకూడదు. కఠినంగా శిక్షించాలి. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి. – వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శి, సీపీఎం పరిహారం చెల్లించాలి టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇన్ని ప్రాణాలు పోయాయి. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలి. ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు చేపట్టాలి. శ్రీవారి భక్తులను ఇంతగా ఇబ్బంది పెట్టినందుకు టీటీడీ బోర్డు వెంటనే దిగిపోవాలి. ఈఓ, అదనపు ఈఓ బాధ్యత తీసుకోవాలి. భక్తులకు సేవ చేయాల్సిన అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. – కందారపు మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ విచారకరం భక్తుల రద్దీకి తగ్గట్టు టీటీడీ అధికారులు ఏర్పాటు చేయలేదు. ఇంత పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తే కనీస వసతులు కూడా కల్పించలేదు. పైగా క్యూల నిర్వహణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భక్తులను క్యూలోకి వదిలేశారే కానీ, అన్నప్రసాదాలు సైతం అందించలేదు. అసలు తొక్కిసలాటకు పోలీసుల వైఖరే కారణం. భక్తులను నిర్దాక్షిణ్యంగా ఒకరిపై ఒకరిని నెట్టేశారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన దుస్థితి దాపురించింది. – రాజగోపాల్ రెడ్డి, భక్తుడు, వేంపల్లె ప్రాణాల మీదకు తెచ్చారు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకుందామని కుటుంబంతో కలిసి వస్తే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. టీటీడీ అధికారులు ఏమాత్రం ఏర్పాట్లు చేయలేదు. క్యూలోకి తోసేసి పట్టించుకోలేదు. ఇక పోలీసులైతే చాలా దురుసుగా ప్రవర్తించారు. వారి వ్యవహార శైలే ఇంతమంది ప్రాణాల మీదకు తెచ్చింది. మా కళ్ల ముందే చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడంలో కూడా ఆలస్యం చేశారు. – కేశవన్, భక్తుడు, మధురై, తమిళనాడు -
వెంకన్న సన్నిధిలో విషాదం.. టీటీడీ చరిత్రలో కనివినీ ఎరుగని నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల-తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఏడుగురు భక్తుల ప్రాణాలను హరించింది. ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసింది. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. -
ఆస్పత్రుల్లో హాహాకారాలు
తిరుపతి కల్చరల్/తిరుపతి అర్బన్: తిరుపతి రుయా ఆస్పత్రి, స్విమ్స్ ఆస్పత్రి మృతుల బంధువుల రోదనలు, క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద తోపులాటల కారణంగా ఆరుగురు భక్తులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. వారిలో నలుగురు రుయా ఆస్పత్రిలోను, మరో ఇద్దరు స్విమ్స్ ఆస్పత్రిలోను మరణించారని చెప్పారు. తమిళనాడులోని సేలం జిల్లా మేచారి గ్రామానికి చెందిన 10 మంది భక్తులు విష్ణునివాసం వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తోపులాట చోటుచేసుకుంది. జనాల మధ్య ఇరుక్కుపోయిన కృష్ణన్ భార్య ఆర్.మల్లిగ (50) ఊపిరాడక మృతి చెందింది. మల్లిగ కాలు విరిగి, తీవ్ర అస్వస్థతకు గురవడంతో కాపాడాలని ఆమె భర్త పోలీసులను వేడుకున్నారు. వారు స్పందించకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో వెంటనే అదే ఆటోలో రుయాకు బయలుదేరగా ఆమె మార్గంమధ్యలో మృతి చెందారు. తన భార్య దుస్థితిని పోలీసులకు చెప్పినా కనీసం స్పందించకపోవడంపై ఆమె భర్త కృష్ణన్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. వైకుంఠ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోవడం బాధాకరమని కలెక్టర్ వెంకటేశ్వర్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఆరుగురు మరణించారని, 40 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని, దుర్ఘటనలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రకటించారు.కాలి నడకన వచ్చి..అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన 360 మంది భక్తులు గోవిందమాల వేసుకుని వైకుంఠ ఏకాదశి నాడు వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి విచ్చేశారు. నాలుగు రోజుల కిందట గ్రామం నుంచి కాలినడకన బయలుదేరిన వారంతా 135 కిలోమీటర్లు నడుచుకుంటూ బుధవారం సాయంత్రం 6 గంటలకు తిరుపతి చేరుకున్నారు. బైరాగిపట్టెడిలోని రామానాయుడు స్కూల్లో టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్లో టోకెన్లు తీసుకోవడానికి వెళ్లారు. అయితే ఒక్కసారిగా పోలీసులు వదిలిపెట్టడంతో 38 మంది కుప్పకూలి పడిపోయారు. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారంతా రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీంతో వారి బంధువులు రామానాయుడు స్కూళ్ల వద్ద పద్మావతి పార్క్‌లో రాత్రంతా కూర్చుని రోదిస్తున్నారు. మరికొందరు రుయా, స్విమ్స్ ఆస్పత్రి వద్ద రోదిస్తున్నారు.అన్నమయ్య జిల్లా నరసాపురం గ్రామానికి చెందిన క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడినవారు : నరసమ్మ, గణేష్, లక్ష్మిదేవి, గంగిరెడ్డి, మణిరెడ్డి, తిమ్మక్క, వసంతమ్మసర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదంసర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు పెద్దఎత్తున భక్తులు వస్తారని తెలిసినా.. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌లు, పోలీసులతో హంగామా చేస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగిపోయి అనేక మంది వికలాంగులయ్యారు. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయం కోసం పోరాటం చేస్తాం. – సీబీ రమణ, నరసాపురం, అన్నమయ్య జిల్లాప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదంటీటీడీకి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. వచ్చిన వాళ్లను వచ్చినట్టు క్యూలైన్లో వదలకుండా పెద్దఎత్తున జనం గుమికూడిన తర్వాత వదిలిపెట్టడం దారుణం. దీంతో ప్రమాదం జరిగింది. టీటీడీ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇలా జరగడం ఇదే ప్రథమం. టీడీపీ నైతిక బాధ్యత వహించి అందరినీ ఆదుకోవాల్సి ఉంది. – సీపీ మునివెంకయ్య, నరసాపురం, అన్నమయ్య జిల్లాపోలీసుల బాధ్యతారాహిత్యం వల్లే..పోలీసుల బాధ్యతారాహిత్యం కారణంగానే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భక్తులను వదిలిపెట్టడంతో పెద్దప్రమాదం చోటుచేసుకుంది. మా గ్రామం నుంచే 360 మంది వచ్చాం. ఎవరు ఎక్కడ పడిపోయారో తెలియడం లేదు. భక్తుల సంఖ్యకు సరిపడా విధంగా పోలీసులు భద్రత కల్పించలేదు. అందువల్లే ప్రమాదం జరిగింది. తొక్కిసలాట జరుగుతున్నా.. పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోయారు. – జే.వెంకట రమణ, నరసాపురం గ్రామం, అన్నమయ్య జిల్లాఎప్పుడూ జరగలేదుఇలాంటి దారుణం ఎప్పుడు జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా పెద్దఎత్తున టోకెన్లు ఇచ్చారు. అయితే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. తోపులాటలకు తావులేకుండా చర్యలు చేపట్టారు. కానీ.. ఈసారి రామానాయుడు స్కూల్ వద్దకు అత్యధికంగా భక్తులు వచ్చారు. వారిని సర్దుబాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం దారుణం. ఎంతో భక్తిభావంతో 140 కిలోమీటర్లు నడుచుకుంటా తిరుపతి వచ్చాం. కనీస ఏర్పాట్లు చేపట్టకపోవడంతోనే ఈ ఘోరం జరిగింది. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోండి. – పి.అంజప్ప, నరసాపురం, అన్నమయ్య జిల్లాచాలా దారుణంభక్తుల ప్రాణాలతో టీటీడీ అధికారులు ఆటలాడుకున్నారు. దూరప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చాం. ఇక్కడ కనీస ఏర్పాట్లు చేయలేదు. క్యూ నిర్వహణ అస్సలు బాగాలేదు. ఎలా పడితే అలా తోసేశారు. భోజనం లేదు. తాగునీరు లేదు. చిన్నపిల్లలతో వచ్చిన వారి పరిస్థితి వర్ణనాతీతం. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా అందరినీ ఒకే క్యూలోకి నెట్టేశారు. పోలీసులు అత్యుత్సాహంతోనే ఇబ్బందులు వచ్చాయి. భక్తులతో వారు వ్యవహరించిన తీరు చాలా దారుణం. – లక్ష్మి, భక్తురాలు, విశాఖపట్నంబాధ్యత ఎవరు వహిస్తారుఅధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తొక్కిసలాటకు ఎవరిది బాధ్యత. ఇన్ని కుటుంబాల్లో విషాదం నిండేందుకు ఎవరు కారణం. ఎంతో ఆశగా శ్రీవారి దర్శనానికి వస్తే ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసీ ఇంత అన్యాయంగా ఏర్పాట్లు చేస్తారా. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – కందన్, భక్తుడు, తిరువణ్ణామలై, తమిళనాడు ఘోరానికి కారకుల్ని వదిలిపెట్టకూడదుఇంత దారుణమైన ఘటనను ఇప్పటివరకు చూడలేదు. శ్రీవారిని దర్శించుకుందామని వస్తే భక్తుల ప్రాణాలతోనే టీటీడీ అధికారులు ఆడుకున్నారు. కళ్ల ముందే మనుషులు కూలిపోతుంటే చూడలేకపోయాం. పోలీసులు మాత్రం అందరినీ తోసేసి వేడుక చూశారు. ఆస్పత్రికి కూడా సకాలంలో తీసుకెళ్లలేదు. ఇంకా ఎంతమంది చనిపోతారో ఆలోచిస్తేనే తట్టుకోలేకపోతున్నాం. ఇంతటి ఘోరానికి కారణమైన వారిని వదలిపెట్టకూడదు. – వైతీశ్వరి, భక్తురాలు, తిరుచ్చి, తమిళనాడుఅడుగడుగునా నిర్లక్ష్యం» వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి అనుమతించాల్సిందన్న భక్తులు »ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతోనే ఉపద్రవం తిరుపతి తుడా : వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీచేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. లక్షా యాభైవేల టోకెన్లు జారీచేస్తామని చెప్పి.. కనీస రక్షణ చర్యలు, మౌలిక ఏర్పాట్లుచేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. దీంతో వీరిని అదుపుచేయడం అటు పోలీసులకు, ఇటు టీటీడీ సిబ్బందికి సవాలుగా మారింది. మరోవైపు.. ఈ తొక్కిసలాటలో చిక్కుకున్న క్షతగాత్రులను తరలించడంలో భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. మరోవైపు.. శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదుకోని అంబులెన్స్‌లు.. ఇక గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సకాలంలో అంబులెన్స్‌లు రాలేదు. కొన్నిచోట్ల వచ్చినా.. సరైన సమయంలో స్పందించలేదని బాధితులు వాపోయారు. అలాగే, అవసరమైన మేర అంబులెన్స్‌లను రప్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.ఇక గాయపడిన వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోవడం.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం.. టోకెన్ల జారీ కేంద్రం వద్ద పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తొక్కిసలాటలో ఒక అమ్మాయి కళ్లు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత నేనూ పడిపోయాను. నన్ను ఒక అమ్మాయి తీసుకెళ్లింది. ఆ సమయంలో పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు. తొక్కిసలాటలో గాయపడ్డ వారిని అందరినీ త్వరగా ఆస్పత్రికి చేర్చలేదు. అంబులెన్సులు కూడా వెంటనే రాలేదు. ఆ తర్వాత చాలామందిని ఒకేసారి తీసుకొచ్చి స్విమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. – ఆస్పత్రి వద్ద ఓ బాధితురాలు -
సినిమా టికెట్ల కోసం విడిచిపెట్టినట్లు..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల పట్ల టీటీడీ పాలక మండలి నిర్లక్ష్య వైఖరిని తిరుపతి దుర్ఘటన తేటతెల్లం చేసింది. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నప్పటికీ, క్యూ లైన్ల నిర్వహణ, భక్తులను క్రమపద్ధతిలో పంపడంలో పాలక మండలి పూర్తిగా విఫలమైంది. టీటీడీ చరిత్రలో ఇటువంటి దుర్ఘటన జరిగిన దాఖలాలు లేవు. భక్తులను సినిమా టిక్కెట్ల కోసం విడిచిపెట్టినట్లుగా ఒక్కసారిగా వదిలేశారని ప్రత్యక్షంగా చూసిన పోలీసులే చెబుతున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం ఇది పోలీసుల వైఫల్యమేనని ప్రకటించటం గమనార్హం.తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలివస్తుంటారు. ఈ విషయాన్ని గ్రహించే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలక మండలి వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులపాటు కొనసాగించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లూ చేసింది. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఈ ఏడు కూటమి ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి వైకుంఠ ద్వార దర్శనంపై ప్రత్యేక చర్యలు తీసుకోలేదని, భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికలు రూపొందించలేదని ఈ దుర్ఘటన తేటతెల్లం చేసింది. టీటీడీకి చైర్మన్, పెద్ద సంఖ్యలో సభ్యులు, ఓ ఈవో, ఓ జేఈవో, అనేక మంది ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. మీడియాలో ప్రచారం కోసం ఒకటి రెండు చోట్ల వచ్చి చూసి, మాట్లాడి వెళ్లిపోయారే తప్ప, భక్తుల రద్దీ, తదనుగుణ చర్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసి ఉంటే.. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారనే విషయం టీటీడీకి తెలియనిది కాదు. అందుకు తగ్గట్టు ఈ టోకెన్లు అన్ని జిల్లాల్లో పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని భక్తులు చెబుతున్నారు. ఒక్కో జిల్లాకు కొన్ని టోకెన్లు కేటాయించి, స్థానికంగానే ఇచ్చి ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు మృతి 40 మందికి గాయాలయ్యాయి: తిరుపతి కలెక్టర్తిరుపతి అర్బన్: వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు తీసుకునే క్రమంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారని, 40 మందికి గాయాలయ్యాయని తిరుపతి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ బుధవారం రాత్రి వెల్లడించారు. స్విమ్స్ అస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిలో ఇద్దరు, రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 28 మందిలో నలుగురు మృతి చెందారని తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు ఇద్దరు మృతుల వివరాలను మాత్రమే తెలుసుకున్నామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.టోకెన్ల జారీ ఇలా జరగాలి..!సాక్షి, అమరావతి: తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. టోకెన్ల జారీకేంద్రాల వద్ద భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులతో కూడిన ఓ ప్రత్యేక బృందాన్ని కూడా నియమిస్తుంది. తిరుమలలో దర్శనాలు, టోకెన్ల జారీ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. ఏటా వైకుంఠ ద్వార దర్శనానికి దాదాపు 7 లక్షల టిక్కెట్లు జారీ చేస్తారు. వీటిలో రోజుకి 20 వేల చొప్పున 10 రోజుల పాటు 2 లక్షల టిక్కెట్లు ఆన్లైన్లో ఇస్తారు. మరో 5 లక్షల టిక్కెట్లు పది రోజుల పాటు రోజుకు 50 వేలు చొప్పున తిరుపతిలో భక్తులకు జారీ చేస్తారు. ఇందుకోసం తిరుపతిలో 9 ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక్కో కేంద్రంలో 10 కౌంటర్లు ఉంటాయి. వైకుంఠ ద్వార దర్శనంలో తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల వరకు వీఐపీలకు కేటాయిస్తారు. ఉదయం 5 నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. దీనికి 24 గంటల ముందే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలి. సాధారణంగా ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ మొదలవుతుంది. అంతకు 15 – 20 గంటల ముందే భక్తులు క్యూలోకి ప్రవేశిస్తారు. వచ్చిన వారిని వచి్చనట్లు క్యూ లైన్లలోకి అనుమతించాలి. క్యూలైన్ నిండిన తర్వాత వెలుపల కొంత దూరం రోప్ లైన్ ఉంటుంది. అది కూడా నిండి జనం రద్దీ పెరిగి, నియంత్రణ కష్టమని భావిస్తే ఉదయం 5 గంటలకంటే ముందే కౌంటర్లు తెరిచి టోకెన్లు జారీ చేస్తూ క్యూలైన్ల మీద ఒత్తిడి తగ్గించాలి. భక్తుల రద్దీ, ఒత్తిడిని టీటీడీ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల బృందం నిరంతరం పర్యవేక్షించాలి. ఈ బృందంలో ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు, ఆర్డీవో స్థాయి అధికారి ఒకరు, తహశీల్దారు స్థాయి అధికారులు ఇద్దరు తప్పనిసరిగా ఉండాలి. నిరంతరం రద్దీని అంచనా వేస్తూ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని, టోకెన్ల పంపిణీ చేపట్టాలి. తొక్కిసలాట దురదృష్టకరంకాగా తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ కౌంటర్ల వద్ద తొక్కిసలాట చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసినా భక్తులు ఒక్కసారిగా 2 వేల మందికి పైగా కౌంటర్ల వద్దకు దూసుకురావడంతోనే జరిగిందన్నారు.