డీఎస్పీదే తప్పు: సీఎంకు కలెక్టర్‌ నివేదిక | Collector Report To CM Chandrababu Tirupati Stampede | Sakshi
Sakshi News home page

డీఎస్పీదే తప్పు: సీఎంకు కలెక్టర్‌ నివేదిక

Published Thu, Jan 9 2025 12:07 PM | Last Updated on Thu, Jan 9 2025 12:56 PM

Collector Report To CM Chandrababu Tirupati Stampede

తిరుపతి: తిరుపతి తొక్కిసలాటలో పెనువిషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుకు జిల్లా కలెక్టర్‌ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు. డీఎస్పీ తొక్కిసలాట జరిగే సమయంలొ  సరిగా స్పందించకపోవటంతోనే ఈ ఘటన  చోటుచేసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. 

అయితే ఈ ప్రమాద సమయంలో ఎస్పీ సుబ్బారాయుడు వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసినట్లు చెప్పారు. అంబులెన్స్‌ వాహనాన్ని టికెట్‌ కౌంటర్‌ బయట పార్క్‌ చేసి డ్రైవర్‌ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్‌ అందుబాటులోకి రాలేనట్లు వివరించారు. ఈ విషాద ఘటన డీఎస్పీ, అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే జరిగిందని కలెక్టర్‌ సీఎంకు నివేదిక ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement