వెంకన్న సన్నిధిలో విషాదం.. టీటీడీ చరిత్రలో కనివినీ ఎరుగని నిర్లక్ష్యం | Tirupati Stampede Incident Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

వెంకన్న సన్నిధిలో విషాదం.. టీటీడీ చరిత్రలో కనివినీ ఎరుగని నిర్లక్ష్యం

తిరుపతిలో తప్పు జరిగింది : పవన్‌ కల్యాణ్‌

  • తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు
  • తిరుపతిలో తప్పు జరిగింది
  • టీటీడీలో ‍ప్రక్షాళన జరగాలి
  • టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారు.
  • శ్యామలరావు, వెంకయ్య చౌదరి మధ్య సమన్వయ లోపం ఉంది
  • పోలీసుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది
  • రద్దీని అదుపు చేయడంలో పోలీసులు విఫమయ్యారు
  • ఈ ఘటనకు పోలీసులు బాధ్యత వహించాలి
2025-01-09 19:08:36

కేవలం విచారణతో సరిపెట్టిన సీఎం చంద్రబాబు!

  • తొక్కిసలాటలో ఆరుగురు చనిపోతే తూతూ మంత్రం చర్యలతో సరిపెట్టిన చంద్రబాబు
  • ఎస్పీ సుబ్బారాయుడును బదిలీతో సరిపెట్టిన బాబు
  • డీఎస్పీ రమణకుమార్‌పై సస్పెన్షన్‌ వేటు
  • గోశాల డైరెక్టర్‌ హరినాథథరెడ్డిపై కూడా సస్పెన్షన్‌ వేటు
2025-01-09 18:18:36

ఇరుకైన ప్రాంత్లాలో టోకన్లు జారీ చేయడం వల్లే ఈ దారుణం: ఎంపీ మిథున్‌రెడ్డి

  • అన్నమయ్య జిల్లా:
    తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరం
  • చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోన్న ఇటువంటి సమస్య ఉత్పన్నం అయ్యేది కాద
  • గతంలో ఎక్కడికక్కడ టోకన్లు జారీ చేసే పరిస్థితి ఉండేది
  • ఇరుకైన ప్రాంతంలో టోకన్లు జారీ చేయడం వల్లే ఈ ఘోరమైన దారుణం
  • ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి
2025-01-09 17:26:20

తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

తిరుపతి:

  • తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో చంద్రబాబు సమీక్ష
  • జరిగిన విషాదం పై సీఎంకి అధికారులు రిపోర్ట్ 
  • టీటీడీ అధికారులు,  టీటీడీ చైర్మన్ మధ్య సమన్వయ లోపం.. 
  • సీఎం ముందు బయటపడిన విభేదాలు
  • టీటీడీ అధికారులపై మండిపడ్డ సీఎం
  • .పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తొక్కిసలాట
2025-01-09 16:51:26

పద్మావతి మహిళా వైద్య ఆసుపత్రికి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

తిరుపతి:

  • పద్మావతి మహిళా వైద్య ఆసుపత్రికి డిప్యూటీ  సీఎం పవన్‌ కళ్యాణ్‌
  • పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన పవన్‌
2025-01-09 16:30:17

ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి: కారుమూరి

ప గో జిల్లా: 

  • తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు
  • తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందడం కలిచివేసింది  
  • ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి
  • విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు నీ విజనరీ ఇదేనా?
  • తిరుపతి చరిత్రలో ఇలాంటి బాధాకరమైన విషయం ఎప్పుడూ జరగలేదు
  • ప్లానింగ్,పద్దతి లేదు అధికారులను పోలీస్‌లను కలుపుకొని నిర్వర్తించాల్సిన  కార్యక్రమంలో ఇంత నిర్లక్ష్యమా....?
  • తిరుపతి ఘటన గత పుష్కరాల ఘటన గుర్తు చేసింది
  • ఆనాడు చంద్రబాబు షూటింగ్ ఆర్భాటాలతో  29 మందిని బలికొన్నాడు  
  • మొన్న సినిమా ప్రై  రిలీజ్ వేడుకకు ఇద్దరు యువకులు బలైపోయారు  
  • మొన్న విజయవాడలో హైందవ శంఖారావం ఐదు లక్షల మందితో నిర్వహించారు ఎవరికీ ఇబ్బంది కలుగలేదు  
  • కానీ ఇక్కడ వేలమందిలో  భక్తులు వస్తే కంట్రోల్ చేయటం చేతగాక భక్తులు ప్రాణాలు బలికొన్నారు
  • ఎన్ని రాష్ట్రాల్లో పుష్కరాలు ,కుంభమేళాలు జరుగుతున్నాయి ఎక్కడైనా ఇలాంటి ఘటనలు  చూశామా?
  • మళ్ళి చంద్రబాబు హయాంలోనే పుష్కరాలు వస్తున్నాయి ఈ సారి ఎవరు బలి కాకుండా ప్లానింగ్‌గా పద్దతిగా నిర్వర్తించాలని  కోరుకొంటున్నాను
2025-01-09 16:26:01

పద్మావతి మహిళా వైద్య ఆసుపత్రికి సీఎం చంద్రబాబు

తిరుపతి:

  • పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితలకు సీఎం చంద్రబాబు పరామర్శ
  • పరామర్శ అనంతరం అధికారులతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగులో రివ్యూ మీటింగ్
  • రివ్యూ మీటింగ్ లో ఘటనకి సంబంధించిన విషయాలను వివరించనున్న మంత్రులు, అధికారులు
  • అనంతరం మీడియాతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు
2025-01-09 16:23:31

ఇందుకు టీటీడీ వైఫల్యమే కారణం: వంగా గీత

  • తిరుపతి తొక్కిసలాట ఘటనను ఖండించిన పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ వంగా గీత
  • తిరుపతి తొక్కిసలాట చాల దురదృష్టకరం
  • ఘటనకు టీటీడీ వైఫల్యమే కారణం.
  • తొక్కిసలాటకు టీటీడీతో పాటుగా కూటమి ప్రభుత్వం భాధ్యత వహించాలి.
  • ఘటనపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
  • బాధితులు,మృతుల కుటుంబాల పట్ల కంటితుడుపు చర్యలు వద్దు.
  • మృతుల కుటుంబాల ను ప్రభుత్వం ఆదుకోవాలి
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.
     
2025-01-09 16:21:57

తిరుపతి తొక్కిసలాట ఘటన..ఆ పాపం వాళ్లదే : అంబటి రాంబాబు

  • ఆరుగురు ప్రాణాలు పోవటానికి కారకులు ఎవరు?
  • టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవో ఈ ముగ్గురూ దైవ సేవలో లేరు
  • ఈ ముగ్గురూ టీడీపీకి సేవ చేసే పనిలో మాత్రమే ఉన్నారు
  • అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి
  • వారు వచ్చినప్పటి నుండి కొండ మీద అన్నీ వివాదాలే
  • వైఎస్ జగన్ కొండ మీదకు వస్తున్నారనగానే బోర్డులు పెట్టారు
  • జగన్ రావటంలేదు అనగానే ఆ బోర్డులు తీసేశారు
  • బీఆర్ నాయుడుకి దేవుడి మీద భక్తి లేదు
  • మా మీద పూర్తిగా విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారు
  • కొండ మీద రాజకీయాలు చేసి జగన్‌ని అడ్డుకునే ప్రయత్నాలే చేశారు
  • కొండ మీద పాపాలు, ద్వేషాలు కొనసాగితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి
  • ఏడుకొండల్ని పవిత్రంగా చూడండి
  • సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఏం చెప్తారు?
  • పీఠాధిపతులు, స్వామీజీలు బయటకు వచ్చి మాట్లాడాల్సిన సమయం వచ్చింది
  • చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి
  • మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
  • ఎస్పీ సుబ్బారాయుడు తెలుగు దేశం సేవలో ఉన్నారు
  • అఘాయిత్యానికి గురైన బాలికను పరామర్శించిన
  • చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీద ఫోక్సో కేసు పెట్టిన ఘనుడు ఎస్పీ
  • ఎంతసేపటికీ వైఎస్సార్‌సీపీ నేతలను వేధించటమే పనిగా పెట్టుకున్నారు
  • మృతుల కుటుంబాలను ఆదుకోకపోతే వారి ఆత్మలు శాంతించవు
  • కేసులు కూడా ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు
  • ప్రతిదానికీ అటెంప్టు మర్డర్‌ సెక్షన్ కింద నమోదు చేస్తున్నారు
  • వైఎస్సార్‌సీపీ వీటన్నింటిపై చూస్తూ ఊరుకోదు
2025-01-09 14:43:07

తిరుపతికి వైఎస్‌ జగన్‌

  • తొక్కిసలాట బాధితులను పరామర్శించనున్న జగన్‌
  • సాయంత్రం బాధితులను పరామర్శించనున్న జగన్‌
  • స్వీమ్స్‌లో చికిత్స పొందుతున్న తిరుపతి తొక్కిసలాట ఘటన క్షతగాత్రులు
     
2025-01-09 13:58:37

టీటీడీ ఛైర్మన్ వాఖ్యలు బాధ్యతారాహిత్యం: మాజీ మంత్రి కురసాల కన్నబాబు

  • టీటీడీ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు
  • టీటీడీ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
  • రాజకీయాలు, ప్రచార ఆర్భాటాలు తప్పా దేన్ని పట్టించుకోవడం లేదు
  • లడ్డూలో కల్తీ జరిగిందని సాక్షాత్తూ వెంటేశ్వరస్వామిని రాజకీయానికి వాడుకున్నారు
  • టీటీడీ నిర్లక్ష్యానికి ఏడుగురు భక్తుల నిండు ప్రాణాలు బలైపోయాయి
  • పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోతే.. కనీసం ఒక్క నిముషం మృతుల కోసం చంద్రబాబు బాధపడిన సందర్భం లేదు.
  • టీడీడీ ఛైర్మన్ వాఖ్యలు బాధ్యతారాహిత్యం
  • తొక్కిసలాటకు తప్పు వెంకటేశ్వర స్వామీదా?
  • తొక్కిసలాటకు బాధ్యత ఎవరూ తీసుకుంటారు.?
  • ఇప్పటికైన ప్రజల ముందుకు వచ్చి.. దేవుడు ముందు తప్పు తమదేనని లెంపలేసుకోండి
  • మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
  • ఎంతసేపూ జగన్‌పై విష ప్రచారం.. రెడ్ బుక్ రాజ్యంగం అంటూ పాలనను గాలికి వదిలేశారు
2025-01-09 13:19:55

టీటీడీ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట: ఆర్కే రోజా

  • టీటీడీ, విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట 
  • ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శనం
  • వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు
  • ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎటు వెళ్లారు?
  • తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి
  • సనాతన యోధుడు అని చెప్పుకున్న పవన్‌ స్పందన ఏది?
  • నిజమైన సనాతన యోధుడైతే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి
  • చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే
  • చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే గతంలో పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది
  • మృతుల కుటుంబాలకు రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
  • టీటీడీ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు
  • చంద్రబాబు అసమర్థత, వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగింది

 

 

 

 

2025-01-09 13:11:53

తిరుపతి ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలి: బీవీ రాఘవులు

  • స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి
  • బకరా కోసం సీసీ కెమెరాలు వెతికే పనిలో ఉన్నారు
  • ప్రధాని మోదీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారు
  • భక్తుల రక్షణలో టీటీడీ విఫలమైంది
  • ప్రపంచంలో అన్ని టెక్నాలజీ గురించే చెప్ప చంద్రబాబు వైఫల్యం చెందారు..
  • ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.
  • విశాఖ మోదీ పర్యటనలో 5వేల మంది పోలీసులను పెట్టారు.. 10లక్షల మంది వచ్చే దగ్గర ఎంత మందిని పెట్టారు?
  • టీటీడీ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
  • చనిపోయిన వారికి కోటి రూపాయిలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం..
  • ముఖ్యమంత్రి విచారణ వ్యక్తం చేస్తే సరిపోదు.. వేగంగా స్పందించాలి
     
2025-01-09 12:40:14

తిరుపతి తొక్కిసలాట మృతులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

  • రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
  • తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదు
  • విష్ణు నివాసం, బైరాగి పట్టెడ ఘటనపై ఫిర్యాదులు
  • తిరుపతి ఈస్ట్‌ పీఎస్‌లో కేసులు నమోదు చేసిన పోలీసులు
     
2025-01-09 12:21:13

మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి: గుడివాడ అమర్‌నాథ్‌

  • టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే
  • తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం
  • తిరుపతిలో జరిగిన ఘటనలో ఏడుగురు భక్తులు చనిపోవడం బాధాకరం
  • వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ప్రభుత్వం, టీటీడీ విఫలమైంది
  • తిరుమలలో 7 మంది మరణాలు ప్రభుత్వ హత్యలే
  • టీటీడీ చరిత్రలో ఎన్నడు ఇటువంటి సంఘటనలు జరగలేదు
  • ఈ మరణాలకు బాధ్యత సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌ది
  • చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
  • గాయపడిన వారికి 20 లక్షలు ఇవ్వాలి
  • అధికార యంత్రాంగం టీటీడీ విజిలెన్స్ ఏమయ్యాయి?
  • ఈ మరణాలు కూడా వైఎస్ జగన్ మీద వేసేస్తారా..?
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించింది
  • వైఎస్ జగన్ పాలనలో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు
  • టీటీడీని తమ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం వాడుకుంది
  • లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి అభాసుపాలయ్యారు
  • టీటీడీ మీద శ్రద్ధ పెడితే ఈ మరణాలు జరిగేవి కాదు
  • ఈ మరణాలు తరువాత పవన్ కళ్యాణ్ ఏమి దీక్ష చేస్తారో చెప్పాలి
  • సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ ఈ మరణాలు గురించి ఏమీ చెపుతారో చూడాలి
2025-01-09 12:15:34

అమాయక భక్తుల ప్రాణాలు తీసిన రాజకీయ పందేరాలు

  • ఆధ్యాత్మిక సంస్థకు రాజకీయ నియామకం
  • అనుభవలేమి.. అవగాహన రాహిత్యం.. అహంకార స్వభావం
  • అమాయక భక్తుల ప్రాణాలు తీసిన రాజకీయ పందేరాలు
  • చంద్రబాబు, పవన్‌, బీఆర్‌ నాయుడే బాధ్యులు
  • చంద్రబాబుకు ఊడిగం చేసినందుకు ఛానెల్‌ అధినేతకు టీటీడీ ఛైర్మన్‌ పదవి

 

 

2025-01-09 11:47:16

డీఎస్పీదే తప్పు: సీఎంకు కలెక్టర్‌ నివేదిక

  • తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఊహించినట్లే నివేదిక
  • డీఎస్పీ అత్యుత్సాహం వల్లే తొక్కిసలాట జరిగిందన్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌
  • తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు
  • ఎస్పీ సుబ్బారాయుడు వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారు
  • అంబులెన్స్‌ వాహనాన్ని టికెట్‌ కౌంటర్‌ బయట పార్క్‌ చేసి డ్రైవర్‌ వెళ్లిపోయాడు
  • 20 నిమిషాల పాటు డ్రైవర్‌ అందుబాటులోకి రాలేదు
  • డీఎస్పీ, అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు
2025-01-09 11:32:18

టీటీడీ చైర్మన్‌పై జనజాగరణ సమితి మండిపాటు

  • బీఆర్‌ నాయుడు ఒక్క నిమిషం కూడా టీటీడీ చైర్మన్‌గా కొనసాగడానికి వీల్లేదు
  • తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో టీటీడీ విఫలమైంది
  • ఉదయం నుండి రాత్రి వరకు వేలాది మంది భక్తులను పశువుల దొడ్డిలో కుక్కినట్లు కుక్కరు
  • రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో తిరుమల వెంకన్న స్వామి భక్తుల ప్రాణాలకు విలువ లేదా?
  • భక్తుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీటీడీ చైర్మన్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి
  • వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లలో టీటీడీ అట్టర్ ప్లాప్ అయ్యింది.
2025-01-09 11:28:18

చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే విరూపాక్షి

  • టీటీడీ నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట 
  • అడుగడుగునా టీటీడీ నిర్లక్ష్యం కనిపిస్తోంది
  • పవ్రితమైన దేవాలయం వద్ద మృత్యు ఘోష జరగడం దారుణం
  • టీటీడీ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
  • గతంలో చంద్రబాబు హయాంలో పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది.
  • ఇప్పుడు మళ్లీ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది
  • క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా
  • టీటీడీ, పోలీసు శాఖ మధ్య సరైన సమన్వయం లేదు
  • అసలు టీటీడీ ఛైర్మన్‌కి భక్తి లేదు
  • ఆయన వచ్చిప్పటి నుంచీ ఏదో ఒక వివాదంలో ఉన్నారు
  • అలాంటి వ్యక్తితో టీటీడీని ఎలా ముందుకు తీసుకువెళ్తారు?
  • బీఆర్ నాయుడుకి భక్తి కంటే రాజకీయాలంటేనే పిచ్చి
  • ఆయనకు ప్రచార పిచ్చి తప్ప.. భక్తిభావం ఏమాత్రం లేదు
  • చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటనలు జరుగుతున్నాయి
  • ఈ ఘటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు ఎవరు బాధ్యత వహిస్తారు?
  • సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్‌కు ప్రచారపిచ్చి ఎక్కువ
  • తొక్కిసలాట ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వం పరువు తీసింది
  • చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి
  • పవన్ కళ్యాణ్ సినిమాలకే తప్ప రాజకీయాలకు సరిపోడు
  • రెచ్చగొట్టే మాటలు చెప్పి ఇద్దరు యువకుల మరణాలకు కారకుడయ్యాడు
  • అలాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు
  • ఇంతటి ఘటన జరిగితే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?
  • వారి హిందూ ధర్మం ఇప్పుడు ఏమైంది?
  • స్వలాభం కోసమే పనిచేసే బీఆర్ నాయుడుని టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వటం తప్పు
  • ఆయన పదవికి రాజీనామా చేయాలి
2025-01-09 11:06:29

తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలి: వైవీ సుబ్బారెడ్డి

  • టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు మాటలు ఆందోళన కల్గించాయి
  • టీటీడీనే బాధ్యత వహించాలి
  • లక్షలమంది భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు
  • కనీసం సమీక్షలైనా నిర్వహించారా?
  •  వైఎస్సార్‌సీపీ హయాంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.. కాబట్టే ఏ‌ప్రమాదం జరగలేదు
  • నేనే స్వయంగా వెళ్లి క్యూ లైన్లనను పరిశీలించేవాడిని
  • సమస్యలు ఎక్కడ ఉన్నాయో స్వయంగా తెలుసుకునేవాడిని
  • ఇప్పుడు ఆ పరిస్థితి కనపడలేదు
  • అధికారులతో‌ టీటీడీ సరిగా పనిచేయించలేదు
  • మృతుల కుటుంబాలను టీటీడీ ఆదుకోవాలి
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి
2025-01-09 10:10:20

తొక్కిసలాట దైవ నిర్ణయమా?.. టీటీడీ ఛైర్మన్‌ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు

  • భక్తుల మరణాలపై టీటీడీ ఛైర్మన్‌ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు
  • టీటీడీ చర్రితలో కనివినీ ఎరుగని విషాదం
  • సర్కార్‌ వైఫల్యానికి ఏడుగురు భక్తులు బలి
  • వైకుంఠ ఏకాదశికి లక్షల మంది వస్తారని తెలిసినా నిర్లక్ష్యం
2025-01-09 09:05:02

టీటీడీ నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం

  • క్యూ లైన్లలో సౌకర్యాలు లేవు: భక్తులు
  • మమ్మల్ని చావిడిలో గొడ్డుల్లా లోపల వేశారు
  • క్యూ లైన్లలో రద్దీని నియంత్రించకలేకపోయారు
  • ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట
  • తిరుపతిలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు
  • టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట
2025-01-09 08:09:54

సినిమా టికెట్ల కోసం విడిచిపెట్టినట్లు..

  • అందుకే తొక్కిసలాట జరిగిందంటున్న పోలీసులు.. పోలీసుల వైఫల్యమేనన్న టీటీడీ చైర్మన్‌
  • వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టని టీటీడీ
  • టీటీడీ చరిత్రలో ఇటువంటి దుర్ఘటన జరగలేదు
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పకడ్బందీ చర్యలు
  • పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రస్తుత పాలక మండలి  
2025-01-09 07:57:56

మీదే పూర్తి బాధ్యత: అధికారులతో సీఎం చంద్రబాబు

  • భక్తులు భారీగా వస్తారని తెలిసీ.. ఎందుకు ఏర్పాట్లు చేయలేదు?
  • తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై డీజీపీ, తితిదే ఈవో, తిరుపతి కలెక్టర్, ఎస్పీలతో  టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష
  • అధికారులదే పూర్తి బాధ్యత అంటూ ఆగ్రహం
  • ప్రభుత్వ పొరపాటు ఏం లేదని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం
2025-01-09 07:53:23

ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలి: పురందేశ్వరి

  • తిరుపతిలో తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి
  • ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్
  • బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్న పురందేశ్వరి
2025-01-09 07:51:41

టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజు: టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన

  • ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసింది
  • చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారు
  • భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు
  • అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు
  • ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను వాడుకున్నారు
  • గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు
  • టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజని, చంద్రబాబు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుంది

2025-01-09 07:45:46

ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే: వెలంపల్లి శ్రీనివాస్‌

  • ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది శ్రీవారి దర్శనానికి వస్తారని తెలిసినా ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణం
  • ఇది ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదం
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • తిరుమలను రాజకీయ కేంద్రంగా టీటీడీ చైర్మన్‌ మార్చేశారు
     
2025-01-09 07:32:45

అడుగడుగునా నిర్లక్ష్యం.. ఫలితంగా తొక్కిసలాట

  • 8వ తేదీ బుధవారం ఉ.5 గంటలకు..
  • తిరుపతిలోని తొమ్మిది కౌంటర్లలో భక్తుల రాక ప్రారంభం
  • ఉ.7.30కు 60 శాతం భక్తులతో నిండిన క్యూలైన్లు
  • ఉ.8.30కు క్యూలైన్ల వద్దకు చేరుకున్న పోలీసులు
  • ఉ.9.30కు పూర్తిస్థాయిలో క్యూలైన్లు నిండి ప్రవేశద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మికూడిన భక్తులు
  • ఉ.10.30కు టీటీడీ అధికారులు మొక్కుబడిగా పర్యవేక్షించి వెళ్లిపోయారు.
  • ఉ.11.30కు భక్తులు టాయిలెట్స్‌ కోసం, తాగునీరు, భోజనం కోసం ఇబ్బందులు పడుతూ అధికారులను నిలదీశారు.
  • మ.12.30కు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో చేరుకున్న భక్తులు
  • మ.1.30కు భక్తుల తాకిడి తారాస్థాయికి చేరుకుంది.
  • మ.2.30 అవుతున్నా కౌంటర్‌ కేంద్రాల వద్ద భక్తులను అప్రమత్తం చేయని అధికారులు
  • మ.3.30కు క్యూలైన్‌లో వేచి ఉండలేక.. టికెట్లు ఎప్పుడిస్తారంటూ భక్తుల నిలదీత.. ప్రశ్నించినా పట్టించుకోని అధికారులు
  • సా.4.30కు శ్రీనివాసం, బైరాగిపట్టిడి రామానాయుడు స్కూల్స్‌ వద్ద రాత్రి 9 గంటలకు టోకెన్లు ఇస్తారని ప్రకటన
  • సా.5.30కు రైల్వేస్టేషన్, బస్టాండ్‌ ప్రాంతాల నుంచి శ్రీనివాసం, రామానాయుడు స్కూల్‌ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో కౌంటర్‌ వద్దకు చేరిక.
  • సా.6.30కు కౌంటర్‌ కేంద్రాల వద్ద టీటీడీ సిబ్బంది కంప్యూటర్ల పనితీరును పరిశీలిస్తుండడంతో టోకెట్లు ఇస్తారని భక్తుల్లో ఉత్సాహం
  • రాత్రి 7.30 గంటలకు ఒక్కసారిగా కేకలు వేస్తూ భక్తులు ముందుకు సాగడంతో శ్రీనివాసం కౌంటర్‌ వద్ద తమిళనాడుకు చెందిన మల్లిక అనే మహిళా
  • క్యూలైన్‌లో కిందపడిపోయింది
  • రాత్రి 7.45కు కిందపడిన మహిళపై నుంచి భక్తులు తొక్కుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది
  • రాత్రి 8 గంటలకు మరో పదిమందిæ భక్తులు కింది పడిపోయారు. వారంతా గాయపడ్డారు. అప్పుడు అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ భక్తులను రుయా, స్విమ్స్‌ అస్పత్రులకు తరలించే ప్రయత్నాలు చేశారు.
  • రాత్రి 8.30కు స్పృహ కోల్పోయిన మహిళ ఆస్పత్రికి వెళ్లే మార్గంమధ్యలోనే మృతిచెందింది. అదే సమయంలో బైరాగిపట్టిడి రామానాయుడు స్కూల్‌ వద్దతోపులాటలో 40 మంది కిందపడి స్పృహ కోల్పోయారు. వెనుక ఉన్న భక్తులు వీరిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు.
  • రాత్రి 9.10కు కిందిపడిపోయిన భక్తులను రుయా అస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గుర్తించారు.
    9.20కు అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా టోకెన్ల జారీని కొనసాగించే పనిలో పడ్డారు.  
2025-01-09 07:18:51

  • తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి పెరిగింది

  • నిన్న(బుధవారం) రాత్రి 8:35 గంటలకు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో దూసుకెళ్లిన భక్తజనం.

  • క్యూలెన్ల నిర్వహణలో అధికారులు చేతులెత్తేశారు

  • చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది

  • పవిత్ర తిరుమల-తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఏడుగురు భక్తుల ప్రాణాలను హరించింది.

  • 30 మందికిపైగా భక్తులకు గాయాలు

  • వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

  • టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చెలగాటమాడింది 

2025-01-09 07:12:22
Advertisement
 
Advertisement
 
Advertisement