
తిరుపతి: తిరుమల ఘాట్‌రోడ్‌లో బస్సు ప్రమాదం(Bus Accident) జరిగింది. భక్తులను తీసుకుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఘాట్‌రోడ్‌లో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి, పిట్టగోడను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు . ఈ ఘటనలో పలువురు భక్తులకు(Several Devotees) గాయాలయ్యాయి. ఇందులో 10 మంది భక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య అడ్డంకిగా మారి జాప్యం చోటు చేసుకుంది.
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఫలితంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి వరకూ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
ఈరోజు తిరుమల(Tirumala) లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.
లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్‌లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.
అయితే ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.

Comments
Please login to add a commentAdd a comment