తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohanbabu) దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. 'తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది.
ఇలా జరగడం దురదృష్టం
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయినా ఇలా జరగడం దురదృష్టకరం. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని.. మరణించిన వారి కుటుంబాలకు ఆ వైకుంఠవాసుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు.
ఏం జరిగింది?
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. పదిరోజులపాటు కొనసాగే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకోసం తిరుమలలో ఒకటి, తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేశారు. టోకెన్లు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో, పక్క రాష్ట్రాల భక్తులు సైతం భారీగా తరలి వచ్చారు.
(చదవండి: మోహన్ బాబును జైలుకు పంపాలా..? నష్టపరిహారం కావాలా..?: సుప్రీంకోర్టు)
ఒక్కసారిగా విడిచిపెట్టడంతో..
తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్న భక్తులను క్యూలైన్‌లోకి అనుమతించలేదు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్‌లోకి ప్రవేశించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. కిందపడిపోయినవారికి ఊపిరాడక ఆరుగురు మృతి చెందారు.
భీతిల్లిన తిరుపతి
అదేవిధంగా శ్రీనివాసం ప్రాంతంలోని కౌంటర్ కేంద్రంలో భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరగ్గా ఒకరు మరణించగా పలువురూ గాయపడ్డారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్‌లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాల్సిన తిరుమల అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో భీతిల్లింది.
కన్నప్ప సినిమా విశేషాలు
సినిమా విషయానికి వస్తే.. మోహన్‌బాబు చివరగా శాకుంతలం సినిమాలో నటించాడు. ప్రస్తుతం అతడు కన్నప్ప మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శివ భక్తుడు కన్నప్పగా కనిపించనున్నాడు. విష్ణు తనయుడు అవ్రామ్ బాలకన్నప్పగా మెప్పించనున్నాడు. ఈ చిత్రాన్ని 2023లో ప్రకటించారు. ప్రభాస్, కాజల్, మధుబాల, ఆర్ శరత్‌కుమార్, బ్రహ్మానందం, రఘుబాబు, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు వెళ్ళి అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా…
— Mohan Babu M (@themohanbabu) January 9, 2025
చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు
Comments
Please login to add a commentAdd a comment