హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే హిట్ కొట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు . ఆ తర్వాత జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవల నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి.
అల్లుడు అదుర్స్ మూవీ తర్వాత తెలుగులో ఆయన మరే సినిమాలో నటించలేదు. అయితే, ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడు. ఆ ప్రాజెక్ట్ కోసం భారీగా ఖర్చు పెట్టాడు కూడా.. కానీ, ఫలితం దక్కలేదు. దీంతో ఆయన టాలీవుడ్ వైపే సీరియస్‌గా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అందులో 'హైందవ' (Haindava Movie) చిత్రం నుంచి తాజాగా టైటిల్ గ్లింప్స్ (Glimpse) విడుదల చేశారు.
(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు)
బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో హైందవ చిత్రాన్ని మహేశ్ చందు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి కాన్సెప్ట్‌తో ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. హిందూ పురాణాల ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు శ్రీ మహా విష్ణువు దశావతారాల నుంచి హైందవ చిత్రం రానుందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే చాలా ఆసక్తిగా ఉంది. 2.40 నిమిషాలు ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
పురాతన ఆలయాన్ని కొందరు దుండగలు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అడ్డుకోవడానికి ఓ బైకులో హీరో శ్రీనివాస్ పెద్ద సాహసమే చేస్తుంటాడు. ఇదే సమయంలో సింహం, వరాహం, గద్ద కూడా అతని బైకు వెంట వెళ్తూ ఉంటాయి. ఈ విజువల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కావచ్చింది. కమర్షియల్ అంశాలతో కూడిన శక్తివంతమైన, ఆసక్తికరమైన కథను లుధీర్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం లియోన్ జేమ్స్ అందిస్తున్నారు.
'భైరవం'లో శంకర్ కుమార్తె హీరోయిన్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ఒక సాంగ్ కూడా విడుదలైంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి బజ్‌ను క్రియేట్ చేశాయని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment