
అమరావతి: బదిలీ చేసి 10 రోజులు కాకుండానే ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడికి పోస్టింగ్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం. కనీసం తిరుపతి తొక్కిసలాట ఘటనలో జరిగిన మరణాలపై విచారణ కూడా కాకుండానే తిరిగి పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర చర్చకు దారి తీసింది. తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తుల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలు విస్తు పోతున్నారు.
ఈ విధంగా సుబ్బారాయుడిపై చంద్రబాబు మరోసారి తన మమకారం చాటుకున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన సమయంలో అధికారులను తిట్టినట్టు బాబు పెద్ద హైడ్రామా చేసిన విషయం తెలిసిందే. కానీ ఇలా బదిలీ చేసిన ఎస్పీకి 10 రోజులు కాకుండానే పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర ధుమారం రేపుతుంది.