తిరుపతి, సాక్షి: వైకుంఠ ద్వారా దర్శన కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనల వెనుక.. విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు తప్పు జరిగిపోయిందంటూ టీటీడీ చైర్మన్ బాధ్యతారాహిత్యంగా ఒక ప్రకటన ఇవ్వగా.. మరోవైపు భక్తులను నియంత్రించాల్సిన పోలీసు యంత్రాగం తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో..
ఎవరి వల్ల తప్పు జరిగింది? అనేదానిపై దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసులకు సమన్వయం లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. భక్తులను మేనేజ్ చేయడంలో ఘోరంగా విఫలమైన పోలీసులు.. భక్తులు క్యూలలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. పశువులతో వ్యవహరించినట్లు భక్తులతో వ్యవహరించారు వాళ్లు. అయితే పోలీసులు ఎందుకు అలర్ట్‌గా ఉండలేకపోయారనేదానికి సమాధానం దొరికింది.
జనవరి 6, 7, 8 తేదీల్లో తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. నిన్న మధ్యాహ్నాం దాకా కుప్పంలోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. దీంతో పోలీస్ యంత్రాంగం అంతా ఆయన సేవలోనే తరించింది. పైగా.. పర్యటనకు రెండు రోజుల ముందు నుంచే జిల్లా పోలీసులకు డ్యూటీలు వేశారు. దీంతో వరుసగా నాలుగు రోజులపాటు చంద్రబాబు బందోబస్తులోనే పోలీసులు అలసిపోయినట్లు కనిపిస్తోంది. అదే టైంలో..
వైకుంఠ ఏకాదశి క్యూ లైన్ల మేనేజ్‌మెంట్‌పై ఒక్క రివ్యూ కూడా జిల్లా పోలీసులు నిర్వహించలేదు. బాబు పర్యటన మీద ఫోకస్‌తో ఎస్పీ కూడా ఈ విషయంపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఆపై ఆ బాధ్యతలను.. తిరుపతి వెస్ట్ సీఐ రామకృష్ణకే అప్పగించారు. దీంతో ఆయన అత్తెసరు పోలీసులతో క్యూలైన్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు నిర్వహించడంతో.. ఘోరం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment