tirupati police
-
Tirupati Stampede: తప్పు ఎవరి వల్ల జరిగింది?
తిరుపతి, సాక్షి: వైకుంఠ ద్వారా దర్శన కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనల వెనుక.. విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు తప్పు జరిగిపోయిందంటూ టీటీడీ చైర్మన్ బాధ్యతారాహిత్యంగా ఒక ప్రకటన ఇవ్వగా.. మరోవైపు భక్తులను నియంత్రించాల్సిన పోలీసు యంత్రాగం తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. ఎవరి వల్ల తప్పు జరిగింది? అనేదానిపై దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసులకు సమన్వయం లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. భక్తులను మేనేజ్ చేయడంలో ఘోరంగా విఫలమైన పోలీసులు.. భక్తులు క్యూలలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. పశువులతో వ్యవహరించినట్లు భక్తులతో వ్యవహరించారు వాళ్లు. అయితే పోలీసులు ఎందుకు అలర్ట్‌గా ఉండలేకపోయారనేదానికి సమాధానం దొరికింది.జనవరి 6, 7, 8 తేదీల్లో తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. నిన్న మధ్యాహ్నాం దాకా కుప్పంలోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. దీంతో పోలీస్ యంత్రాంగం అంతా ఆయన సేవలోనే తరించింది. పైగా.. పర్యటనకు రెండు రోజుల ముందు నుంచే జిల్లా పోలీసులకు డ్యూటీలు వేశారు. దీంతో వరుసగా నాలుగు రోజులపాటు చంద్రబాబు బందోబస్తులోనే పోలీసులు అలసిపోయినట్లు కనిపిస్తోంది. అదే టైంలో..వైకుంఠ ఏకాదశి క్యూ లైన్ల మేనేజ్మెంట్పై ఒక్క రివ్యూ కూడా జిల్లా పోలీసులు నిర్వహించలేదు. బాబు పర్యటన మీద ఫోకస్‌తో ఎస్పీ కూడా ఈ విషయంపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఆపై ఆ బాధ్యతలను.. తిరుపతి వెస్ట్ సీఐ రామకృష్ణకే అప్పగించారు. దీంతో ఆయన అత్తెసరు పోలీసులతో క్యూలైన్ మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహించడంతో.. ఘోరం జరిగింది. -
శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్
-
శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. దోపిడీపై పిర్యాదు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ స్రవంతినే అసలు దొంగగా పోలీసులు నిర్ధారించారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ముందు నుంచే ఇంటి దొంగల ప్రాతపై అనుమానం కలిగింది. స్రవంతి బ్యాంకులో గిల్టు నగలు తాకట్టు పెట్టి డబ్బు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆడిట్లో వ్యవహారం బయటపడుతందని దొంగతనం డ్రామా ఆడినట్లు తేల్చారు. ఇందుకు చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో కాంట్రాక్టు కుదుర్చుకొని బ్యాంకు దోపిడికి ప్లాన్ వేసినట్లు తెలిపారు. స్రవంతి ప్లాన్ ప్రకారం దుండగులు బ్యాంక్ లాకర్ నుంచి 67 ప్యాకెట్లలోని దాదాపు రెండు కేజీల బంగారం, 5 క్షల రుపాలయు నగదు ఎత్తుకెళ్లారు. తన చేతులు కట్టేసి అరవకుండా నోటిలో గుడ్డనొక్కి కత్తితో బెదిరించి చోరీ చేశారని స్రవంతి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. అయితే ముందు నుంచే స్రవంతిపై అనుమానపడ్డ పోలీసులు ఆమె నుంచే అసలు నిజాన్ని రాబట్టారు. బ్యాంకులో దొంగలు పడి దోచుకెళ్లారని ఖాతాదారులను, పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు స్రవంతి బ్యాంక్‌కు కన్నం వేసినట్లు పోలీసులు తెలిపారు. స్రవంతి నుంచి దోపిడి సొత్తు రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా స్రవంతి గత నాలుగేళ్లుగా ఫిన్‌కేర్ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా అప్రైజర్‌గా కొనసాగుతోంది. సోమవారం స్రవంతితో పాటు చోరీకి పాల్పడ్డ దుండగులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరచనున్నారు. చదవండి: ఏం జరిగిందో.. స్నేహితుడి గదికి వెళ్లి.. తెల్లారే సరికి.. -
విషాదం: పెళ్లయి ఏడేళ్లయినా పిల్లలు లేరని..
తిరుపతి క్రైం : పిల్లలు లేరని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో చోటు చేసుకుంది. అలిపిరి ఎస్ఐ పరమేశ్వర్ కథనం మేరకు.. నగరంలోని ఆటో నగరంలో నివాసముంటున్న లక్ష్మీపతి (35) వివాహమై ఆరేడు సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదు. అంతేకాకుండా చిన్న చిన్న అప్పులు ఉండడంతో కూడా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు.. సంసార బాధలతో శుక్రవారం రాత్రి ఇంట్లోకి వెళ్లారు. ఆదివారం రోజంతా కూడా బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా లక్ష్మీపతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బిడ్డను చూస్తూ ఉండమంటే.. కిడ్నాప్, కథ సుఖాంతం
సాక్షి, తిరుపతి: తిరుపతిలో 4 నెలల పసికందు అపహరణ కేసును అలిపిరి పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన యాచకురాలు ఆశని అరెస్టు చేశారు. ఈనెల 2వ తేదీన బాలాజీ బస్టాండ్ దగ్గర గంగులమ్మ తన నాలుగు నెలల మగబిడ్డను స్నానం చేసి వస్తా.. కొద్దిసేపు చూస్తూ ఉండు అని ఆశకు అప్పగించింది. స్నానం చేసి వచ్చిచూసేసరికి తన బిడ్డతో పాటు ఆశ కూడా కనిపించలేదు. అంతటా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు నిందితురాలు ఆశ మైసూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య.. నిందితుడి అరెస్ట్
సాక్షి, తిరుపతి: ఏడడుగులు.. మూడు ముళ్ల బంధం.. అగ్నిసాక్షిగా మనువాడి కడదాకా తోడుంటానన్న భర్తే.. ఆమె పాలిట కాల యముడవుతాడని ఆ ఇల్లాలు ఊహించలేకపోయింది. మరోవైపు ఏ పాపం తెలియని ఆ చిన్నారి ఇకముందు తల్లిదండ్రులు లేని అనాథగా మిగలింది. ఉద్యోగం లేకపోయిన భర్త అడగగానే డబ్బు ఇవ్వడమే ఆమెకు శాపమై తన ప్రాణం తీసింది. కట్టుకున్న వాడే కిరాతకంగా కడతేర్చాడు తిరుపతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసులోని మిస్టరీ వీడిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో ఆమె భర్త శ్రీకాంత్‌రెడ్డి నిందితుడిగా నిర్థారణ కావడంతో పోలీసులు ఆ కిరాతకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వరి ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి భర్తకు ఇచ్చింది. ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో గత నెల 22న భువనేశ్వరిని ఆమె భర్త శ్రీకాంత్ కిరాతకంగా చంపి సాక్ష్యాలను తారుమారు చేసే క్రమంలో సూట్‌కేసులో భార్య మృతదేహాన్ని తీసుకెళ్లి రుయా ఆస్పత్రి వెనుక తగలబెట్టాడు. అలానే వారి బంధువులకు అనుమానం రాకుండా కరోనాతో భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
వీడిన తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసు
తిరుపతి క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసి.. సూట్ కేసులో ప్యాక్ చేసి.. తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక దహనం చేసిన ఓ భర్త దుర్మార్గమిది. బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు తన భార్యకు కరోనా వచ్చిందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. ఆ తర్వాత డెల్టా వేరియంట్‌తో మృతి చెందిందంటూ కట్టుకథలు చెప్పాడు. కరోనాతో మరణించడం వల్ల మృతదేహం కూడా ఇవ్వలేదని వాపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కూడా నిజమని నమ్మారు. అయితే డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. తిరుపతి అర్బన్ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రామసముద్రానికి చెందిన భువనేశ్వరి (27)ని రెండున్నరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్ హోం చేస్తూ తిరుపతిలోని ఓ అపార్టుమెంట్లో భర్తతో కలిసి నివసిస్తోంది. శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి అతడికి ఇచ్చింది. ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో ఆమెను హత్య చేశాడని తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో.. ఈ నెల 23న తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక పోలీసులకు కాలిన మృతదేహం లభించింది. దీంతో సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలిని భువనేశ్వరిగా గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా రుయా ఆస్పత్రికి వచ్చిన ఓ డ్రైవర్‌ను అలిపిరి పోలీసులు గుర్తించి విచారించారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. వెబ్సైట్లో శ్రీకాంత్‌రెడ్డి కారును బుక్ చేసుకున్నాడని డ్రైవర్ తెలిపాడు. ఓ పెద్ద సూట్‌కేసును తెచ్చి తన భార్య రుయా ఆస్పత్రిలో పెద్ద డాక్టర్ అని, ప్రస్తుతం తనకు కరోనా సోకిందని తెలిపాడు. సూట్‌కేసులో వెంటిలేటర్ ఉందని డ్రైవర్‌ను నమ్మించాడు. అనంతరం ఆస్పత్రి వెనుక ముళ్ల పొదల వద్ద డ్రైవర్‌కు అనుమానం రాకుండా కారును ఆపమని చెప్పి సూట్ కేసును అక్కడ దించాడు. డ్రైవర్ ప్రశ్నించడంతో మేడమ్‌కు కరోనా వచ్చిందని.. ఇక్కడ పెట్టి వెళ్తే ఈ వెంటిలేటర్‌ను ఆమె తీసుకుంటుందని చెప్పాడు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి ఇంట్లో భార్యని హత్య చేసి.. సూట్ కేసులో ప్యాక్ చేసి.. కారులో మృతదేహాన్ని తెచ్చి రుయా ఆస్పత్రి వెనుక తగులబెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు సూట్ కేసుని కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. డెల్టా వేరియంట్‌తో మరణించిందని.. బంధువుల వద్ద శ్రీకాంత్‌రెడ్డి ఆడిన డ్రామా కూడా వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ వచ్చిందని.. రుయా ఆస్పత్రిలో చేర్చానని కుటుంబ సభ్యులను, బంధువులను శ్రీకాంత్ నమ్మించాడు. అనంతరం భువనేశ్వరి మరణించిందని.. కరోనాతో మృతి చెందడం వల్ల మృతదేహాన్ని ఇవ్వడం లేదని కట్టుకథ చెప్పాడు. అంతేకాకుండా బంధువులను రుయా ఆస్పత్రిలోని మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాలన్నింటినీ వెదికినట్టు నటించాడు. కాగా, నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు బృందాలు తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఆరా తీస్తున్నాయి. -
పెద్దయ్యాక సీఎం అవుతా..
సాక్షి, తిరుపతి: వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో ఓ బాలిక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో సీఎంను అవుతానని పోలీసులతో చెప్పింది. తిరుపతి అర్బన్ పోలీసులు బుధవారం ఏఆర్ పరేడ్ పోలీస్ గ్రౌండ్లో అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మూడో తరగతి చదువుతున్న అలకనంద(7) అనే బాలిక తల్లిదండ్రులు 8 నెలల కిందట హైదరాబాద్ నుంచి తిరుపతికి వలస వచ్చి బియ్యం వ్యాపారి వద్ద కూలి పనులు చేసుకుంటూ బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులకు తోడుగా ఈ పాప కూడా పనిచేస్తోందని పోలీసులు తెలుసుకున్నారు. దాంతో అర్బన్ ఎస్పీ ఆ పాపను విచారిస్తూ పెద్దయ్యాక ఏం చేస్తావ్? అని అడిగితే ఆ చిన్నారి పైవిధంగా సమాధానం చెప్పింది. ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు చిన్నారి బదిలిస్తూ.. హైదరాబాద్‌లో చదువుకుంటే తమకు అమ్మ ఒడి రాదంది. ఏపీలో తన లాంటి చిన్నారులను ప్రోత్సహించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చినట్టు తెలిపింది. -
బాలుడే.. చోరీల్లో మహా ముదురే!
తిరుపతి క్రైం : మోటారు సైకిళ్ల దొంగను అరెస్టు చేసి 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. సోమవారం తన కార్యాలయంలోనాయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేణిగుంట–చంద్రగిరి మార్గంలో రామానుజపల్లె వద్ద ఎస్ఐ ఈశ్వరయ్య వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బాలుడు వీరిని చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, అనుమానం కొద్దీ అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తిరుపతిరూరల్ మండలం సాయినగర్ పంచాయతీ లింగేశ్వర్‌నగర్‌కు చెందిన 18 ఏళ్ల బాలుడని తేలిందన్నారు. అతను నడుపుతున్న మోటార్ సైకిల్ దొంగలించినదిగా గుర్తించి కేసు నమోదు చేశారు. మాట్లాడుతున్న అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ అంతకుముందు ముందు తిరుచానూరు పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలై తిరుగుతున్నాడని, ప్రాథమిక విచారణలో ఆ బాలుడు తన స్నేహితులైన ఐక్య ఉపాధ్యానగర్‌కు చెందిన సంతోష్, సాయినగర్‌కు చెందిన వినయ్‌తో కలసి 2018 నుంచి ఇప్పటి వరకు 12 మోటారు సైకిళ్లను శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో దొంగలించినట్టు తేలిందని చెప్పారు. అయితే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్ల విలువ రూ.5.60 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసును ఛేదించడంలో ఎమ్మార్‌పల్లె సీఐ మన్సూరుద్దీన్, ఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బంది దీపిక, మోహన్, తిలక్‌కుమార్, అమరనాథరెడ్డి, కరీముల్లా, జగదీష్ కృషి చేశారని చెప్పారు. వారికి నగదు రివార్డులు అందజేశారు. -
చెన్నైలో సోదాలు : ఎర్రస్మగ్లర్లు అరెస్ట్
తిరుపతి : ఎర్రచందనాన్ని నిల్వ ఉంచారనే సమాచారంతో తిరుపతి పోలీసులు గురువారం చెన్నైలో సోదాలు నిర్వహించారు. ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 280 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చెన్నైలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పోలీసులు చెన్నైలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తిరుపతి పోలీసులు చెన్నైలో సిడ్కో పారిశ్రామికవాడలో తనిఖీలు నిర్వహించి ఎర్రచందనం స్మగ్లర్లు రమేష్, విశాల్‌ను అరెస్ట్ చేశారు. రెండు కంటైనర్లలో ఉన్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 237 ఎర్రచందనం దుంగలను, రెండు ఎలక్ట్రికల్ వేయింగ్ మిషన్లను, రెండు ఉడ్ కట్టర్ మిషన్లను స్వాధీనం చేసుకున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ విజయలక్ష్మి చెప్పారు. -
తిరుపతిలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్
తిరుపతి: తిరుపతి నగరంలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.46 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు 2 ఎల్సీడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఆ క్రమంలో తిరుచానూరులో నివాసం ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెవిరెడ్డిని వాహనంతో ఢీ కొట్టించిన పోలీసులు
-
చెవిరెడ్డిని వాహనంతో ఢీ కొట్టించిన పోలీసులు
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై తిరుపతి పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్లిపట్టులో బుధవారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు తమ వాహనంతో ఢీకొట్టించారు. ఈ ఘటనలో చెవిరెడ్డి గాయపడగా, ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై తిరుపతి పోలీసులుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్