తిరుపతిలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్ | inter state thieves Arrest By Tirupati Police | Sakshi
Sakshi News home page

తిరుపతిలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

Published Sun, Nov 1 2015 10:25 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

inter state thieves Arrest By Tirupati Police

తిరుపతి: తిరుపతి నగరంలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.46 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు 2 ఎల్సీడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

ఆ క్రమంలో తిరుచానూరులో నివాసం ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement