inter state thieves
-
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
గుంతకల్లు : ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని గుంతకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం టూటౌన్ పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ పి.ప్రసాద్‌రావు, టూటౌన్ ఎస్ఐ వలిబాషా వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ, గుంతకల్లు డీఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచామన్నారు. శుక్రవారం స్థానిక టీవీ టవర్ వద్ద పాత నేరస్తులు కురుబ నాగరాజు, అన్వర్‌బాషా (గుంతకల్లు) అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతుండగా కానిస్టేబుల్ కే.శ్రీనివాసులు అందించిన సమాచారంతో వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించగా అంతర్రాష్ట్ర దొంగలుగా తేలిందన్నారు. వీరి నుంచి రూ.3.50 లక్షల విలువైన 3 కిలోల వెండి, 6 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్ఐలు యూ.శ్రీనివాసులు, తిరుపాల్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
రూ.2.23 లక్షల బంగారం స్వాధీనం వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ఇద్ద రు నిందితులను సిటీ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.2.23 లక్షల విలువ చేసే 82.250 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నింది తుల వివరాలను సీసీఎస్ సీఐ శ్రీధర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ ఇమ్రాన్, మహారాష్ట్ర హింగన్‌ఘాట్ గోమాజీగూడకు చెందిన సయ్యద్ అక్బర్ దగ్గరి బంధువులు కావడంతో వంట పను లు చేసుకుంటూ విజయవాడలో జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన ఇద్దరు 2013లో మొదటిసారి దొంగతనానికి పాల్పడ్డారు. మళ్లీ 2015లో ఖమ్మం టూటౌన్ పరిధిలో దొంగతనానికి పాల్పడడంతో పోలీసులకు చిక్కడంతో షేక్‌ఇమ్రాన్ జైలు పాలయ్యాడు. ఈ ఏడాది జైలు నుంచి విడుదలైన ఇమ్రాన్ మళ్లీ అక్బర్‌తో కలసి వరంగల్ కమిషనరేట్ పరిధిలో రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. జనవరిలో హైదరాబాద్‌కు వెళుతు న్న మహిళ నుంచి 55 గ్రాముల బంగారు నగలు, జులైలో వర్ధన్నపేట మండలం కక్కిరాలపల్లిలో తాళం వేసిన ఇంటి నుం చి 27.250 గ్రాముల బంగారం దొం గిలించారు. చోరీ చేసిన ఆభరణాలను ఆమ్మేందుకు విజయవాడ నుంచి ఇద్దరు వరంగల్ రైల్వే స్టేషన్‌కు వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పక్కా సమాచారంతో క్రైం ఏసీపీ ఈశ్వర్రావు ఇచ్చిన ఆదేశాల మేరకు అరెస్టు చేసినట్లు సీఐ శ్రీధర్ వెల్లడించారు. వారిని అరెస్ట్ చేసిన సీఐతోపాటు ఎస్సై సుమన్, ఏఎస్సై సంజీవరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మున్నా, రవికుమార్, జంపయ్యను సీపీ సుధీర్‌బాబు అభినందించారు. -
అంతుచిక్కని దొంగల ముఠా ఆటకట్టు!
హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ అంతుచిక్కకుండా చోరీలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర దొంగల ముఠాను నార్త్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముఠా వద్ద నుంచి 32 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు, యాభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా నగరంలో పలుచోట్ల 15 చోరీలు చేసినట్లు డీసీపీ లింబారెడ్డి తెలిపారు. -
తిరుపతిలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్
తిరుపతి: తిరుపతి నగరంలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.46 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు 2 ఎల్సీడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఆ క్రమంలో తిరుచానూరులో నివాసం ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్రాష్ర్ట దొంగల అరెస్ట్
రూ. 50 లక్షల విలువైన కార్లు స్వాధీనం శివమొగ్గ, న్యూస్‌లైన్ : అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి, రూ. 50 లక్షల విలువైన తొమ్మిది కార్లను శివమొగ్గ గ్రామాంతర పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాళ తాలూకాకు చెందిన సూరిబైలువిన గ్రామానికి చెందిన యూసఫ్ హైదర్, మంగళూరులోని బోరుగుడ్డె గ్రామానికి చెందిన మహమ్మద్ ఇజాజ్ ఉన్నారు. మరో ఇద్దరు ఫరూక్, మహమ్మద్ హనీఫ్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం హతినగర సమీపంలోమ అనుమానాస్పదంగా తిరుగుతున్న యూసఫ్ హైదర్‌ను ఇన్స్పెక్టర్ కుమారస్వామి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో అతను తెలిపిన మేరకు ఇజాజ్‌ను పట్టుకున్నారు. -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
జహీరాబాద్ టౌన్, న్యూస్‌లైన్: వరుసగా పలు బ్యాంకుల్లో దొంగతనాలకు పాల్పడుతూ, వాహనాలను అపహరిస్తూ ప్రజలను భయందోళనకు గురి చేస్తున్న ఓ అంతర్ రాష్ర్ట దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. దొంగల నుంచి నగదు, ఇన్నోవా వాహ నం, తూటాలు, కత్తులు, గ్యాస్, ఆక్సిజన్ సిలిండర్, డ్రిల్లింగ్ మిషన్ తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సంబంధించిన వివరాలను ఆదివారం జహీరాబాద్ పోలీసు స్టేషన్లో జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ రావు వెల్లడించారు. కర్నాటక రాష్ర్టం గుల్బర్గాకు చెందిన ఘోరే మహబూబ్, అబ్దుల్ రజాక్, చాంద్‌పాషా, మహమూద్, షఫీ, ఖలీద్, బాబా, ఖాల మహబూబ్లు ఓ ముఠాగా ఏర్పడి బ్యాంక్ దోపిడీలతో పాటు వాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. గుల్బ ర్గా పట్టణంలోని టిప్పుసుల్తాన్ చౌక్, అలంద్ చౌక్‌లో నివాసముంటున్న వీరు మూడేళ్ల నుంచి ఏ టూ జెడ్ పేరుతో స్క్రాప్ షాపు నడుపుతున్నారు. దుకాణం కేంద్రంగా చేసుకొని బ్యాంక్ దోపిడీలు, ట్రాక్టర్లు, కార్లు, డీసీఎం వ్యాన్లు, టాటా సుమోల చోరీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత సంవత్సరం జహీరాబాద్ మం డలంలోని కొత్తూర్(బి) సిండికేట్ బ్యాం క్లో దొంగతనం చేశారు. బ్యాంక్ వెనుక భాగంలోని కిటికీ గుండా బ్యాంక్‌లోకి ప్రవేశించి ఆక్సింజన్ సిలిండర్, గ్యాస్‌కట్టర్ సాయంతో లాకర్‌ను ధ్వంసం చేశా రు. అందులో ఉన్న రూ.3,70 లక్షలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఆక్సిజన్ సిలిండర్ అక్కడే వదిలివెళ్లారు. అదేనెలలో కోహీ ర్ మండలంలోని కవేలి గ్రామంలోని సిండికేట్ బ్యాంక్‌లో దొంగతనానికి యత్నించగా సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశం అక్కడికి చేరుకుని వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దుండగులు జరిపిన కాల్పుల్లో ఎస్ఐ గాయపడిన విషయం విదితమే. జులై నెలలో మండలంలోని మల్చెల్మా సిండికేట్ బ్యాంక్‌లో కూడా చోరీకి యత్నించి విఫలమైయ్యారు. అలాగే సంగారెడ్డి, సదాశివపేట,తూఫ్రాన్లతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మహ్మదాబాద్ పో లీస్ స్టేషన్ పరిధిలో టాటా సుమో, ట్రా క్టర్,డీసీఎం వ్యాన్ తదితర వాహనాలను అపహరించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందున్న ఏటీఎంలో కూడా చోరీకి విఫలయత్నం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. కాగా ఆది వారం జహీరాబాద్ పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాలను తనఖీ చేస్తుండగా దానిలో భాగంగా కేఏ 01 ఎంసీ2053 నంబర్‌గల ఇనోవా కారు ను ఆపి తనిఖీచేశారు. అందులోని వ్యక్తుల ప్రవర్తన తీరు అనుమానం కలిగించడంతో వారిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు వారి వద్ద ఉన్న 1,83,600 రూపాయల నగదు, రెండు ఆక్సిజన్, ఒకటి ఎల్పీజీ సిలిండర్, గ్యాస్ కట్టర్, ఆక్సాబ్లేడ్లు, రెండు కత్తులు, డ్రిల్లింగ్ మిషన్, గడ్డపార, చేతి గ్లౌస్లు, తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ రావు తెలిపారు. నిందితులు ఘోరె మహబూ బ్, అబ్దుల్ రజాక్, చాంద్‌పాషా, మహమూద్, షఫీలను అరెస్టు చేశామన్నారు. ఎస్ఐ వెంకటేశంపై కాల్పులు జరిపిన బాబాతో పాటు ఖలీద్, కాల మహబూబ్లు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ దొంగల ముఠాను పట్టుకొన్న జహీరాబాద్ టౌన్ సీఐ నరేందర్, పట్టణ ఎస్ఐ శివలింగం,పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు. సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ వెంకటేశం, పలువురు ఎస్ఐలు ఉన్నారు.