ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని గుంతకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంతకల్లు : ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని గుంతకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం టూటౌన్ పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ పి.ప్రసాద్‌రావు, టూటౌన్ ఎస్‌ఐ వలిబాషా వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ, గుంతకల్లు డీఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచామన్నారు.
శుక్రవారం స్థానిక టీవీ టవర్ వద్ద పాత నేరస్తులు కురుబ నాగరాజు, అన్వర్‌బాషా (గుంతకల్లు) అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతుండగా కానిస్టేబుల్ కే.శ్రీనివాసులు అందించిన సమాచారంతో వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించగా అంతర్రాష్ట్ర దొంగలుగా తేలిందన్నారు. వీరి నుంచి రూ.3.50 లక్షల విలువైన 3 కిలోల వెండి, 6 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్‌ఐలు యూ.శ్రీనివాసులు, తిరుపాల్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.