guntakal
-
నాన్న కాదు.. నరహంతకుడు..
దారుణాతి దారుణం.. ఘోరాతి ఘోరం.. కన్నతండ్రే కూతురికి స్వయంగా మరణశాసనం రాశాడు. దగ్గరుండి మరీ కన్నబిడ్డను కాటికి పంపాడు. కళ్లెదుట కన్నకూతురు ప్రాణాలు పోతున్నా ఆ పాషణ హృదయం కరగలేదు. ప్రేమించిన వాడిని మరిచిపోలేనని చెప్పిన పాపానికి కూతురిని కర్కశంగా బలితీసుకున్నాడో నరహంతక తండ్రి. ఈ అవమానవీయ ఘటన గురించి తెలిసిన వారందరూ భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నారు.గుంతకల్లు రూరల్: కుమార్తె ప్రేమ వ్యవహారం (love affair) కారణంగా కుటుంబ పరువు, మర్యాద మంటగలసి పోతున్నాయనే ఉద్దేశంతో కన్న కూతురినే కడతేర్చాడో తండ్రి. అనంతపురం జిల్లా (Anantapur District) గుంతకల్లులో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్న తుపాకుల రామాంజనేయులు, సావిత్రి దంపతులకు నలుగురు కుమార్తెలు. హోటల్ నిర్వహణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు ఇదివరకే వివాహం చేశారు. చివరి కుమార్తె భారతి (20) కర్నూలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమె ఇంటికి సమీపంలోనే ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు. ఎంతకూ వారి మాట వినని భారతి ‘చావనైనా చస్తాను గానీ ప్రేమించిన యువకుడిని మరచిపోలేన’ని తెగేసి చెప్పింది. నిర్మానుష్య ప్రాంతంలో ఘాతుకం..తండ్రి రామాంజనేయులు ఈ నెల ఒకటో తేదీన కుమార్తెతో మరోమారు మాట్లాడి.. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అయినా వినకపోవడంతో తనతో పాటు ఒక తాడును తీసుకొని కుమార్తెను స్కూటర్‌పై తీసుకొని కసాపురం గ్రామ శివారులోని తిక్కస్వామి తోట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. తాడుతో అక్కడి చెట్టుకు ఉరితాడు సిద్ధం చేశాడు. ఇప్పటికైనా మాట వింటావా లేక చస్తావా అని అడిగాడు. తాను చావడానికైనా సిద్ధమని స్పష్టం చేయడంతో ‘సరే చావు’ అంటూ ఆమెను ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి చెట్టుకు వేలాడుతున్న ఉరితాడును తన మెడకు వేసుకుంది.కుమార్తెను మరోసారి బతిమాలిన రామాంజనేయులు ఆమె మాట వినకపోవడంతో ఉరికి వదిలేసి.. వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు కదిలాడు. కొంత దూరం వచ్చాక తిరిగి వెనక్కు వెళ్లి చూడగా అప్పటికే భారతి విగతజీవిగా ఉరికి వేలాడుతోంది. దీంతో మృతదేహాన్ని కిందకు దింపి తన స్కూటర్లోని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత ఈ నెల నాల్గో తేదీన గుంతకల్లు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. కుమార్తెను చంపేశానని చెప్పి లొంగిపోయాడు.చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైందికసాపురం శివారులో ఘటన జరిగినట్లుగా తెలపడంతో రామాంజనేయులుతో కలిసి రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ టీపీ వెంకటస్వామి, పోలీసులు మంగళవారం రాత్రి 9.30 గంటల వరకూ గాలింపు చేపట్టినా ఘటనా స్థలాన్ని గుర్తించలేకపోయారు. దీంతో బుధవారం ఉదయం మరోమారు గాలించి సంఘటన స్థలాన్ని గుర్తించారు. కాలిన మృతదేహాన్ని కొంతమేర కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
పేదోడి రైళ్లకు సెలవు!
రాజంపేట: తిరుపతి– గుంతకల్ మధ్య ఉన్న రెండు వేర్వేరు మార్గాల్లో పేదోడి రైళ్లకు బ్రేక్ వేశారు. ఏకంగా రెండునెలలపాటు పల్లె రైళ్లకు రాబోయే కుంభమేళా–2025 (Maha Kumbh Mela 2025) నేపథ్యంలో సెలవు ఇచ్చేశారు. పేదవాడి కోసం ఉన్నదే ఒకరైలు, దానిని కూడా రద్దు చేశారు. దీంతో పేద ప్రయాణిక వర్గాల్లో రైల్వేబోర్డు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. దేశంలో ఎక్కడా రైళ్లు లేన్నట్లుగా రాయలసీమలో (Rayalaseema) ప్రతి గ్రామీణ రైల్వేస్టేషన్లో ఆగుతూ, పరుగులుతీసే పల్లెరైళ్లను కుంభమేళా–2025కు దారిమళ్లించడం ఇప్పుడు సీమలో వివాదాస్పదంగా మారుతోంది. దీంతో తిరుపతి–గుంతకల్ మధ్య వేర్వేరు రెండు రైలుమార్గాల్లో నడిచే పల్లె రైలును రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ సీవోఎం కె.మనికుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. అడిగే నాథుడు లేన్నట్లుగా రైల్వే ఉన్నతాధికారులు గుంతకల్ డివిజన్ (Guntakal Division) పరిధిలో తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా కేంద్రప్రభుత్వంపై పేదవర్గాల్లో అసంతృప్తిని పెంపొందిస్తోంది. తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో.. తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే (07657/07658) ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. తక్కువ ధరతో గమ్య చేరడానికి పేదవర్గాలకు ఈరైలు అనుకూలంగా ఉంది. తిరుపతి (Tirupati) నుంచి బయలుదేరుతుంది. ప్రతి గ్రామీణస్టేషన్లో ఆగుతుంది. దీనిని రద్దు చేయడంతో ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు, వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గుంతకల్–తిరుపతి(ధర్మవరంలైన్)మార్గంలో.. గుంతకల్– తిరుపతి (ధర్మవరంలైన్) మార్గంలో 07589/07590 నంబరుగల తిరుపతి నుంచి కదిరి దేవరపల్లెకు నడిచే పల్లెరైలును కూడా రద్దు చేశారు. ఈ రైలు అనంతపురం, బెంగళూరుతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండేది. డివిజన్ కేంద్రం గుంతకల్‌కు పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి ప్యాసింజర్ రైలు నడిచేది. ఈ రైలు కూడా ఆ మార్గంలో ఉన్న పీలేరు, మదనపల్లె, కదిరి తదితర ప్రాంతాలకు చెందిన పల్లె వాసులకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు ఆ రైలు రద్దు కావడంతో ఎక్స్ప్రెస్రైళ్లే దిక్కయ్యాయి రెండునెలలపాటు ప్రయాణానికి గ్రహణం కుంభమేళా–2025 కోసం రెండునెలల పాటు తిరుపతి నుంచి కడప మీదుగా, అటు ధర్మవరం మార్గంలో నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు. అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం జిల్లాల మీదుగా ఉండే రైలుమార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లపై ఆధారపడి ప్రయాణించే వేలాదిమంది పేదలకు పల్లెరైళ్లను దూరం చేశారు. ప్రత్యామ్నాయం చూపని రైల్వేబోర్డు ఏకంగా రెండు రైలుమార్గాల్లో ఆరు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసే గ్రామీణులు ఇబ్బందులను రైల్వేబోర్డు పరిగణనలోకి తీసుకోలేదన్న అపవాదును మూటకట్టుకుంది. రైల్వేబోర్డు కుంభమేళాకు రేక్స్ కేటాయించాలని కోరితే, దక్షిణమధ్య రైల్వే అధికారులు రాయలసీమలో పేదలకు అందుబాటులో ఉండే రైళ్లను కేటాయించడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇతర రైల్వేజోన్‌తోపాటు మరికొన్ని డివిజన్లలో రేక్ పొజిషన్ పుష్కలంగా ఉన్నప్పటికి ‘సీమ’పల్లెరైళ్లను కేటాయించారు. ఈ ప్రాంతానికి చెందిన కూటమి ఎంపీలు నోరుమెదిపే పరిస్థితిలో లేరని పేదప్రయాణికులు ఎద్దేవా చేస్తున్నారు. మార్చి 1వరకు పల్లె రైళ్లకు సెలవురైల్వేబోర్డు ఆదేశాలతో దక్షిణమధ్య రైల్వే వారు తిరుపతి–కదిరిదేవరపల్లె ప్యాసింజర్ రైలు, గుంతకల్–తిరుపతి ప్యాసింజర్‌రైలు, తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే ఇంటర్సిటి ఎక్స్‌ప్రెస్ రైలును వచ్చేయేడాది మార్చి01 వరకు రద్దు చేశారు. ఆదివారం నుంచి ఈరైళ్లు రెండు మార్గాల్లో కూడా నడవవు. సామాన్యుడు అంటే చిన్నచూపు పేదోడి రైళ్లను రద్దు చేస్తే అడిగేవారు లేరన్న ధీమాలో కేంద్రప్రభుత్వం ఉంది. ఎక్స్‌ప్రెస్‌రైళ్లలో జనరల్బోగీలు వేయడంలో రైల్వే వివక్షను ప్రదర్శిస్తోంది. ప్యాసింజర్‌రైళ్లు రద్దు చేస్తే ప్రత్యామ్నాయంగా రైళ్లను నడపాలి. సామాన్యుడు అంటేనే కేంద్రానికి చిన్నచూపు. – టీఎల్ వెంకటేశ్, సీపీఐ నేత, పీలేరుపేదలను ఇబ్బందులు పెట్టారు... తక్కువ ధరతో పల్లెవాసులకు అనుకూలంగా ఉన్న ఇంటర్సిటీ రైలును రద్దు చేయడం అన్యాయం. తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ వరకు పేదవర్గాలు తక్కువ వ్యయంతో వెళ్లే వారు. ఉన్న ప్యాసింజర్ రైళ్ల రద్దు చేశారు. ప్రత్యామ్నాయంగా ప్యాసింజర్‌రైలును నడపాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. పేదలంటే మోదీ సర్కారుకు చిన్నచూపు. – పులివేల రమణయ్య, నాగిరెడ్డిపల్లె, నందలూరు -
డెవలప్మెంట్ చేస్తే సహకరిస్తాం.. కాదని విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం.. టీడీపీకి హెచ్చరిక
-
భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య
గుంతకల్లు: భార్య వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.... పాత గుంతకల్లుకు చెందిన వడ్డె రోహిత్‌కుమార్ (24) బజాజ్ షోరూంలో మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మీదేవితో ఆయనకు వివాహమైంది. పెళ్లి అయినప్పటి నుంచి భర్తను సూటిపోటి మాటలతో లక్ష్మీదేవి మానసిక క్షోభకు గురి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో లక్ష్మీదేవి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండిపోయింది. కాపురానికి రావాలని భర్త పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అయితే తాను పెట్టిన కండీషన్లు ఒప్పుకుంటే కాపురానికి వస్తానని ఆ సమయంలో ఆమె చెబుతూ వచ్చింది. విషయం తెలుసుకున్న రోహిత్‌కుమార్ తల్లిదండ్రులు కోడలి కండీషన్ల మేరకు ఆమె పేరుతో కొంత, బాబు పేరుతో మరికొంత స్థలం రాసిచ్చిన తర్వాత కాపురానికి వచ్చింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం బాబు చనిపోయాడు. ఆ తర్వాత భర్తను వదిలి లక్ష్మీదేవి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య వేధిస్తున్న విషయంపై ఆరు రోజుల క్రితం గుంతకల్లు రెండో పట్టణ పోలీసులకు రోహిత్ ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ గణేష్ ఇరువురి వాదనలు విన్నారు. తర్వాత పెద్దల సమక్షంలో తామే పంచాయితీ చేసుకుంటామని బాధితులు తెలపడంతో వారిని అక్కడి నుంచి పంపించేశారు. సమస్య మరింత జఠిలం కావడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రోహిత్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనలక్ష్మీదేవిపై చర్య తీసుకోవడంతో పాటు సీఐ గణేష్ అక్కడకు వచ్చి సమాధానం చెప్పాలంటూ శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ప్రధాన రహదారిపై రోహిత్ బంధువులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లక్ష్మీదేవి పెట్టిన కండీషన్ల మేరకు 20 సెంట్ల స్థలాన్ని బాబుతో పాటు ఆమె పేరుతో రాసిచ్చినట్లు తెలిపారు. బాబు చనిపోయినప్పుడు లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానం వచ్చిందన్నారు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగిందని, బాబు చనిపోయిన రాత్రే ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని వివరించారు. అప్పటి నుంచి భర్తకు తరచూ ఫోన్లు చేస్తూ వేధిస్తూ వచ్చిందన్నారు. న్యాయం చేయాలని సీఐ గణేష్‌ను ఆశ్రయిస్తే ఆయన సైతం తమకు వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు రోహిత్‌ను దుర్భాషలాడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. టూటౌన్ సీఐ గణేష్ అందుబాటులో లేకపోవడంతో వన్‌టౌన్ సీసీ రామసుబ్బయ్య అక్కడకు చేరుకుని బాధితులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతుడి తండ్రి క్రిష్టప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రాజశేఖర్ రెడ్డి బిడ్డగా అడుగులు వేస్తే మంచిది
-
గాలీవాన బీభత్సం
గుంతకల్లు నియోజకవర్గంలోగుంతకల్లు, పామిడి, ఉరవకొండ నియోజకవర్గంలో వజ్రకరూరు, బెళుగుప్ప, రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాళ్, కణేకల్లు ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలాయి. వరిపంట నేలకూలింది. రబీ వేరుశనగ నూర్పిడి చేస్తుండగా వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. ఈనెలలో ఎండలు మండుతుండగా ఈదురుగాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కొంత ఉపశమనం కలిగింది. –సాక్షి,నెట్వర్క్ బెళుగుప్ప మండలంలో గురువారం రాత్రి, శుక్రవారం వర్షం కురిసింది. ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. మండల కేంద్రంలో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. బెళుగుప్ప, ఆవులెన్న, రామసాగరం, నక్కలపల్లి తదితర గ్రామాల్లో రబీలో సాగు చేసిన వేరుశనగ పంట నూర్పిడి చేస్తుండగా పూర్తిగా తడిసిపోయింది. ఆవులెన్నలో రైతు నరసింహకు చెందిన ట్రాక్టర్‌పై పెద్ద తుమ్మ చెట్టు పడింది. దీంతో ఇంజిన్ ధ్వంసమైంది. బెళుగుప్ప వద్ద రైతు తిరుమలరెడ్డికి చెందిన మామిడి చెట్లు, ఆవులెన్నలో రైతు రామకృష్ణతో పాటు పలు చోట్ల మొక్కజొన్న పంట నేలవాలింది. బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్, బొమ్మనహాళ్, ఉంతకల్లు, శ్రీధరఘట్ట, దర్గాహొన్నూరు, గోవిందవాడ, బండూరు, కృష్ణాపురం, లింగదహాళ్, కొలగానహాళ్లి తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.గాలీవానకు వరిపంట పూర్తిగా నేలకొరిగింది. దర్గాహొన్నూరు గ్రామ సమీపంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉంతకల్లు క్రాస్ వద్ద ఇరువైపులా ఉన్న చెట్లు, కొమ్మలు నేలకొరిగాయి. నేలకొరిగిన వరిపంట కణేకల్లు మండలంలో గురువారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వరి పంట నేలకొరిగింది. వర్షపాతం 29.2 ఎంఎంగా నమోదైంది.కణేకల్లు, యర్రగుంట, మారెంపల్లి, 43 ఉడేగోళం, గంగలాపురం గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. కోతకొచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుంతకల్లు పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎస్జేపీ హైస్కూల్ రోడ్, ఆర్అండ్బీసర్కిల్ రోడ్, భాగ్యనగర్, తదితర ఏరియాల్లో చెట్లు నేలకూలి విద్యుత్‌తీగలపై పడ్డాయి. సుమారు మూడున్నర గంటల సేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షంతో పలు లోతట్టు కాలనీల్లోకి నీరు చేరింది. రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహించడంతో కొంతసేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కూలిన విద్యుత్ స్తంభాలు వజ్రకరూరులో శుక్రవారం సాయంత్రం అరగంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.దీంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు మెయిన్ రోడ్డుమీదుగా ప్రవహించింది. కుమ్మర వీధిలో నాలుగు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరపరా నిలిచిపోయింది. వర్షంరాకతో వ్యవసాయ పనులు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పామిడిలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలి వీచింది. దీంతో దాబా రేకులు ఎగిరిపడ్డాయి. చెట్లు నేల కూలాయి. పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈ వర్షానికి చల్లటి వాతావరణం నెలకొనడంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. గార్లదిన్నె : మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శుక్రవారం గాలీవాన బీభత్సంతో ఓ మోస్తారు వర్షం కురిసింది. కల్లూరులో నారాయణ స్వామి అనే వ్యక్తికి చెందిన దాబా పైకప్పు గాలికి ఎగిరిపడిపోయింది. దీంతో రూ.లక్షలు నష్టపోయినట్లు బాధితుడు తెలిపాడు. మండలంలోని పలు గ్రామాల్లో పెనుగాలుల తాకిడికి చెట్లు నేలకూలాయి. మరికొన్ని గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. -
ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం: ప్రియాంక
సాక్షి, గుంతకల్లు రూరల్: బుగ్గసంగమేశ్వరాలయంలో ఇటీవల వివాహం చేసుకున్న ఓ జంట తహసీల్దార్ రామును గురువారం ఆశ్రయించింది. వివరాలు.. మైదుకూరుకు చెందిన ప్రియాంక అనే సచివాలయ ఉద్యోగి, గుంతకల్లు పట్టణానికి చెందిన సుమంత్ అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరూ ఈనెల 18న గుంతకల్లు సమీపంలోని బుగ్గ సంగమేశ్వరాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కూతురు కిడ్నాప్ అయ్యిందని ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ జంట తహసీల్దార్‌ను కలిసి తామిద్దరూ ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని తెలిపింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని యువతి ప్రియాంక తహసీల్దార్‌కు తెలిపింది. తహసీల్దార్ సమక్షంలో మరోమారు దండలు మార్పించి ఒక్కటి చేశారు. చదవండి: (త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి) -
శివమొగ్గ – చెన్నై మధ్య బైవీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
గుంతకల్లు: ప్రయాణికుల సౌకర్యార్థం శివమొగ్గ–చెన్నై సెంట్రల్ మధ్య బై వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పెషల్ రైలు (నం:06223) శివమొగ్గ నుంచి ప్రతి ఆది, మంగళవారాల్లో బయలుదేరుతుంది. ఈ రైలు ఏప్రిల్ 17 నుంచి జూన్ 28వ తేదీ వరకు మాత్రమే రాకపోకలు సాగించనుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో (రైలు నం: 06224) చెన్నై సెంట్రల్ నుంచి సోమ, బుధవారాల్లో బయలుదేరుతుంది. ఈ నెల 18 నుంచి జూన్ 29వ తేదీ వరకు మాత్రమే ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ రైలు శివమొగ్గ, భద్రావతి, తరికెరె, బీరూర్, అజాంపురా, హసదుర్గ, చిక్జాజూర్, చిత్రదుర్గ, చెళ్లికెర, మొలకాల్మూరు, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, వైఎస్సార్ కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా అర్కోణం నుంచి చెన్నై సెంట్రల్‌కు చేరుతుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. -
యువకుడితో భార్య టిక్‌టాక్.. సహించలేకపోయిన భర్త.. చివరికి..
సాక్షి, అనంతపురం: వివాహిత దారుణహత్య గుంతకల్లులో కలకలం రేపింది. బెడ్ రూంలోనే ఈ ఘటన జరగ్గా.. భర్త పరారీలో ఉన్నాడు. అనుమానంతో భర్తే హత్య చేసి ఉంటాడని హతురాలి పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. వన్‌టౌన్ సీఐ నాగశేఖర్, ఎస్ఐ కొండయ్య తెలిపిన మేరకు... రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న రైల్వే గార్డ్ బాలాజీనాయక్ కుమారుడు సుబ్రహ్మణ్యం నాయక్‌కు కదిరి మండలం నాయనపల్లికి చెందిన అఖిలబాయికి గత ఏడాది నవంబర్‌లో వివాహమైంది. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతున్న అఖిలబాయి సెలవుల్లో భర్త ఇంటికి వచ్చి వెళ్లేది. కాలేజీ రోజుల్లో ఓ యువకుడితో కలిసి అఖిలబాయి చేసిన టిక్‌టాక్‌ను చూసి సుబ్రహ్మణ్యం సహించలేకపోయాడు. వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ గొడవపడుతుండేవారు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది. రెండు నెలలక్రితం వీరి పంచాయితీ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు సర్దిచెప్పి పంపించారు. ఉగాది పండుగ నేపథ్యంలో అఖిలబాయిని భర్త ఇడుపులపాయ నుంచి గురువారం రాత్రి గుంతకల్లులోని ఇంటికి తీసుకొచ్చాడు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసిపోయిందని.. తెల్లవారుజామునే సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత అత్త వెళ్లి చూడగా బెడ్రూంలో అఖిలబాయి రక్తపు మడుగులో పడి ఉంది. గొంతు, చేతి మణికట్లు కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చేపట్టారు. అనుమానం పెనుభూతమై అఖిలబాయిని భర్తే కడతేర్చి ఉంటాడని హతురాలి పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
విద్యకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్
-
వెండితెరపై ‘రచ్చ’.. ఒకే ఒక్క ఛాన్స్.. అదే అతన్ని హీరోగా మార్చేసింది..
గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): ఒక్క ఛాన్స్.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునే యువత జపించే మంత్రమిది. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే ఈ రంగంలో రాణించడం కష్టం. తెరమీద మెరవాలంటే కటౌట్ అదిరిపోవాలి. అయితే లక్ష్య సాధనతో శ్రమిస్తే అదృష్టం వెన్నంటే వస్తుందని నిరూపించాడు గుంతకల్లుకు చెందిన పాడి శ్రీధరన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో పడిన శ్రమ చివరకు అతన్ని హీరోగా మార్చేసింది. ఎస్‌డీవీ క్రియేషన్స్ బ్యానర్లో వెంకటేష్ దర్శకత్వం వహించిన ‘రచ్చ రచ్చ’ సినిమాలో శ్రీధరన్, మాధురి జంటగా నటించారు. ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: చిరంజీవి కుటుంబ నేపథ్యం... గుంతకల్లు లోని హెచ్పీసీ డిపో ప్రాంతానికి చెందిన పాడి వెంకటేశులు, పాడి లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పాడి శ్రీధరన్ 1990లో జన్మించారు. అనారోగ్యం కారణంగా 1996లో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి శ్రీధరన్ బరువు బాధ్యతలన్నీ అన్న కిరణ్బాబునే చూసుకునేవారు. శ్రీధరన్‌కు అన్నతో పాటు ముగ్గురు అక్కలూ ఉన్నారు. గుంతకల్లులోని సెయింట్ మేరీస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి వరకు, ఎస్కేపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, శ్రీశంకరానందలో డిగ్రీ, హైదరాబాద్‌లోని సీఎంఆర్ కాలేజీలో ఎంసీఏ పూర్తి చేశారు. అన్నావదినలే తల్లిదండ్రులు లేని లోటును తీర్చి బాగా చదివించారు. సినిమాలంటే మక్కువ.. శ్రీధరన్ తండ్రి వెంకటేశులు ప్రముఖ రంగస్థల నటుడు. తండ్రి స్ఫూర్తితో తానూ నటుడిగా రాణించాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఎంసీఏ పూర్తి చేశాక సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తానంటూ సినీ పరిశ్రమలోని దర్శకుల చుట్టూ తిరిగారు. 2014లో తొలిసారిగా ‘డెవిల్స్ బుక్’ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అనంతరం లయన్, డిక్టేటర్, జిల్, చుట్టాలబ్బాయి తదితర సినిమాల్లో సైడ్ రోల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 2021లో ఓటీటీ ద్వారా ప్రదర్శింపబడిన ‘మరణ శ్వాస’ సినిమాలో హీరోగా అరంగ్రేటం చేశారు. సెలబ్రెటీగా ఎదగాలన్నదే నా లక్ష్యం.. సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. రంగస్థల నటుడిగా మా నాన్న చాలా నాటికల్లో నటించారు. 2014లో మొట్టమొదటి సారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. వెండితెరపై వెలగాలన్న నా కలను నిజం చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డాను. నటనలో నా ప్రతిభను గుర్తించిన ఎస్‌డీవీ క్రియేషన్స్ వారు రచ్చ రచ్చ సినిమా ద్వారా హీరోగా అవకాశమిచ్చారు. నిర్మాతలు... దర్శకుల సహకారం, ప్రేక్షక దేవుళ్ల ఆదరాభిమానాలతో భవిష్యత్తులో మంచి సినిమాల్లో నటించి ఒక సెలబ్రెటీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నా. – పాడి శ్రీధరన్, సినీ హీరో -
వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. 20 రోజుల నరకయాతన.. చివరికి
సాక్షి, అనంతపురం: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామానికి చెందిన మేకల లింగన్న, చెన్నమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఓ కుమార్తె సంతానం. వీరిలో పెద్ద కుమారుడు రామాంజినేయులుకు ఆరేళ్ల క్రితం మహాలక్ష్మి అనే యువతితో వివాహమైంది. హమాలీ పనులతో కుటుంబాన్ని రామాంజినేయులు పోషిస్తున్నాడు. ఇంజెక్షన్ వేస్తే.. వాచిపోయింది కర్నూలు జిల్లా, మద్దికెర మండలం, హంప గ్రామానికి చెందిన రఫీ బతుకు తెరువు కోసం వైటీ చెరువులో ఆర్ఎంపీ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న మేకల రామాంజినేయులు (32) చికిత్స కోసం రఫీ వద్దకెళ్లాడు. ఆ సమయంలో కుడికాలు మక్కికి ఇంజక్షన్ వేసి పంపాడు. రెండు రోజుల తర్వాత ఇంజక్షన్ వేసిన ప్రాంతం పూర్తిగా వాపు తేలింది. మరోసారి రఫీ వద్దకెళ్లి చూపించుకున్నారు. వేడినీటి కాపడం పెడితే తగ్గిపోతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు అలాగే చేశారు. అయితే పరిస్థితి మరింత దిగజారి వాపు మోకాళ్ల వరకూ విస్తరించి ఎర్రగా కందిపోయింది. అయినా ఆర్ఎంపీ సొంత వైద్యాన్ని మానలేదు. డబ్బు కోసం మభ్య పెడుతూ పరిమితికి మించి వైద్యం చేయసాగాడు. ఏడు రోజుల్లో కాలు పూర్తిగా కందిపోయి నడవడానికి సైతం వీలు కాకపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చదవండి: బాలికపై లైంగిక దాడి ... ఆపై వ్యభిచార వృత్తిలోకి దింపి... కాలు తీసేయాలన్నారు.. రామాంజినేయులు పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. కాలు పూర్తిగా దెబ్బతినిందని, శస్త్రచికిత్స చేసి తీసేయాల్సి ఉంటుందన్నారు. దీంతో బాధితుడిని బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. శస్త్రచికిత్సలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే రామాంజినేయులు ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వాయిదా వేశారు. ఇన్ఫెక్షన్ విస్తరించి బత్తలపల్లి ఆస్పత్రిలోనే మంగళవారం ఉదయం రామాంజినేయులు మృతి చెందాడు. పోలీసులకు ఫిర్యాదు రామాంజినేయులు మృతదేహాన్ని గుంతకల్లుకు తీసుకువచ్చిన కుటుంబసభ్యులు.. మృతికి కారణమైన ఆర్ఎంపీ రఫీపై చర్యలు తీసుకోవాలంటూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సదరు ఆర్ఎంపీ నిర్వాకం వల్ల గతంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారని స్థానికులు తెలిపారు. -
యూట్యూబ్ చూసి దొంగనోట్లు తయారీ.. చికెన్ పకోడి పట్టిచ్చింది
సాక్షి,గుంతకల్లు( అనంతపురం): యూట్యూబ్‌లో చూసి గుంతకల్లు కేంద్రంగా దొంగ నోట్లు తయారు చేసి అక్రమంగా చలా మణి చేసిన ముగ్గురిని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా.. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన నూర్‌బాషా.. పాల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 25న కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరికి వెళ్లిన అతను.. చికెన్ పకోడి కొనుగోలు చేసి రూ.వంద నోటు ఇచ్చాడు. పరిశీలించిన వ్యాపారి అది నకిలీదని గుర్తు పట్టి తనకు వద్దని చెప్పాడు. అదే సమయంలో అక్కడే ఉన్న జొన్నగిరి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబులు అప్రమత్తమై నూర్‌బాషాను పట్టుకుని తనిఖీ చేశాడు. అతని వద్ద ఉన్న 30 రూ.వంద నోట్లు తీసుకుని పరిశీలిస్తే అన్నీ నకిలీవేనని తేలింది. దీంతో నూర్‌బాషాను అదుపులోకి తీసుకుని జొన్నగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో దొంగనోట్ల తయారీ గుట్టు రట్టయింది. యూట్యూబ్ ద్వారా నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకుని మరో ఇద్దరితో కలిసి దొంగనోట్లను తయారు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గుంతకల్లు, మద్దికెర, జొన్నగిరి తదితర ప్రాంతాల్లో నోట్లు మార్పిడి చేసినట్లు వివరించాడు. రూ.50 వేల అసలైన నోట్లు తీసుకుని రూ.లక్ష నకిలీ నోట్లను అందజేయడంతో పాటు స్వయంగా తాము కూడా మార్కెట్లో చలామణి చేసినట్లు తెలిపాడు. ప్రింటర్, జిరాక్స్ మిషన్లు స్వాధీనం శనివారం రాత్రి నిందితుడు నూర్‌బాషాను వెంటబెట్టుకుని కసాపురానికి జొన్నగిరి పోలీసులు చేరుకున్నారు. అతని ఇంటిలో దొంగ నోట్ల తయారీకి సంబంధించిన స్కానర్, జిరాక్స్ మిషన్లు, నోట్ల తయారీలో ఉపయోగించే పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో నూర్‌బాషాకు సహకరించిన ఖాజా, ఎన్.ఖాసీంను అరెస్ట్ చేసి సోమవారం కర్నూలు జిల్లా కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపారు. చదవండి: దారుణం: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని.. -
వామ్మో.. ఒకేచోట 100కుపైగా పాములు
సాక్షి, అనంతపురం: చీమలు గుంపుగా చేరి ఆహారం కోసం అన్వేషించడం మనం సాధారణంగా చూసే దృశ్యమే. కానీ చీమల గుంపులా పాములు కూడా ఒకేచోట కనిస్తే ఆ దృశ్యాన్ని ఊహించగలమా? అయితే ఇలాంటి దృశ్యమే గుంతకల్లు మండలం గుర్రబ్బాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు పొలంలో వరి నారుమడి వేశాడు. దాన్ని తొలగించే ముందు నారుమడిలో పురుగూ పుట్ర ఉంటాయని భావించి ఐదు రోజుల క్రితం థిమేట్ ద్రావకాన్ని చల్లాడు. చదవండి: వాషింగ్ మెషీన్లో బుసలు కొట్టిన నాగుపాము, వీడియో హల్చల్ తర్వాత రెండు రోజులకు కూలీలతో కలిసి నారుమడి తొలగించేందుకు వెళ్లారు. మడిలో చనిపోయిన పాములు తేలియాడుతూ కనిపించాయి. వాటిని బయటకు తీసి ఒకచోట చేర్చారు. వందకు పైగా పాములు ఉన్నట్లు తేలింది. నారుమడి వేయక ముందే భూమిలో పాము గుడ్లు పెట్టిందో లేక పాములు నారుమడిలో చేరాయో తెలియదని రైతు చెప్పాడు.! చదవండి: గుంటూరులో లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల దుర్మరణం -
గుంతకల్లులో విషాదం: డాక్టర్ ఆత్మహత్య
గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): ఆర్మీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనం భరించలేక ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుంతకల్లులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని భాగ్యనగర్ గంట చర్చి ఏరియాకు చెందిన వెంకటస్వామి, నాగమణి దంపతుల కుమారుడు కార్తీక్ వర్ధన్ (33)కర్నూలు మెడికల్ కాలేజీలో 2011లో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తదనంతరం ఆగ్రా మిలటరీ హాస్పిటల్లో వైద్యుడిగా ఉద్యోగం పొందాడు. తనతో పాటు ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆదోనికి చెందిన డాక్టర్ అప్పియాను ప్రేమించి నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. (చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో?) ఈమె ప్రస్తుతం పుణేలోని నేవీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా కార్తీక్‌వర్ధన్, అప్పియా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉన్నారు. వారం రోజుల క్రితం గుంతకల్లుకు వచ్చిన కార్తీక్ వర్ధన్ శనివారం రాత్రి వరకు తన కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా గడిపాడు. కాగా తానొకచోట, భార్య, తల్లిదండ్రులు మరోచోట ఉండటంతో మనస్తాపానికి గురైన కార్తీక్‌వర్దన్ ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ పద్మావతి తెలిపారు. చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు -
దారి తప్పిన సం‘బంధం’: అన్నలాంటి వ్యక్తితో మహిళ...
బంగారం లాంటి భర్త... ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చక్కని సంసారం... సుఖసంతోషాల జీవితం కానీ ఆమె దారి తప్పింది... అన్నలాంటి వాడికి దగ్గరయింది. ప్రేమను పంచే భార్య...అనురాగానికి ఇద్దరు పిల్లలు చిన్న కుటుంబం...చింతలేని సంసారం కానీ సోదరి జీవితంలోకి ‘అక్రమ’ంగా ప్రవేశించాడు. తప్పని తెలిసీ వారిద్దరూ తప్పటడుగు వేశారు సమాజానికి భయపడి...ముఖం చూపలేక వెళ్లిపోయారు రైలు పట్టాలపై జీవితాలను ముగించేశారు వారి పిల్లలకు జీవితానికి సరిపడు శోకాన్ని మిగిల్చారు ఒక్క తప్పుడు నిర్ణయం..ఎన్ని జీవితాలను నాశనం చేస్తుందో..ఎంతమందిని క్షోభ పెడుతుందో తెలియజెప్పే ఈ సంఘటన గురువారం గుంతకల్లులో చోటుచేసుకుంది. గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ఇమాంపురం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి (38), గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి (40) వరుసకు అన్నాచెల్లెళ్లు. గురువారం గుంతకల్లు శివారులోని హనుమాన్ సర్కిల్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శివారెడ్డి తనకు సోదరిలాంటి రాజ్యలక్ష్మీతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈక్రమంలో వారం కిందట వీరి విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో కుటుంబీకులకు ముఖం చూపించడం ఇష్టంలేక వారిద్దరూ మూడు రోజుల కిందట ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. భార్య కనిపించడం లేదని రాజ్యలక్ష్మి భర్త నారాయణస్వామి గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి తన భార్యకు ఫోన్ చేసిన శివారెడ్డి... తానిక ఇంటికి రాలేనని... ఇవే తన చివరి మాటలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఆ ఫోన్ కూడా పనిచేయలేదు. తీరా గురువారం రాజ్యలక్ష్మి, శివారెడ్డి మృతదేహాలు హనుమాన్ సర్కిల్ సమీపంలోని రైలు పట్టాలపై ఛిద్రమై కనిపించాయి. స్థానికుల సమాచారంతో జీఆర్పీ సీఐ నగేశ్‌బాబు, ఎస్ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు విషయం చేరవేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోలీసులు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా రాజ్యలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు సంతానం కాగా, శివారెడ్డికి కూతురు, కొడుకు ఉన్నారు. -
‘ఉద్యమ’ కేసులపై కోర్టుకు హాజరైన ఎమ్మెల్యేలు
గుంతకల్లు టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం 2018లో వైఎస్సార్సీపీ అధి ష్టానం ఇచ్చిన పిలుపు మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్సార్ సీపీ నేతలు 11. 04.2018న రైల్‌రోకో నిర్వహించారు. దీనిపై ఆర్పీఎఫ్ పోలీసులు అప్పటి వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, ప్రస్తుత ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డితో పాటు పలువురిపై అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గురువారం వీరంతా గుంతకల్లులోని జేఎఫ్‌సీఎం కోర్టుకు హాజరయ్యారు. అలాగే, సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 2010లో గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో రైల్‌రోకో జరిగింది. దీనికి హాజరైన మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిపె అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ నిమిత్తం స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టుకు హాజరయ్యారు. -
అనంతపురం: గుంతకల్లు ట్రాన్స్‌కో డీఈ రవిబాబు అవినీతి బాగోతం
-
ఎంపీ మాధవ్ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు
సాక్షి, అనంతపురం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కృషితో కదిరి–అనంతపురం–గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ –06340) నడపడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు వారంలో నాలుగు రోజుల పాటు నాగర్ కోయిల్–ఛత్రపతి టెర్మినల్ మధ్య రాకపోకలు సాగించనుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర వారాల్లో నాగర్ కోయిల్‌లో బయలుదేరనున్న ఈ రైలు మదనపల్లె మీదుగా జిల్లాలోకి ప్రవేశించి కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణించి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ చేరుకుంటుంది. తిరిగి మంగళ, బుధ, గురు, ఆదివారాల్లో ముంబై ఛత్రపతి టెర్మినల్‌లో బయలుదేరి జిల్లా మీదుగా వెళ్లనుంది. దీంతో తమిళనాడు, చిత్తూరు, పూణే తదితర ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రయాణికులకు రైలు అందుబాటులోకి వచ్చింది. -
ముంబైలో అనంత వాసులు.. సీఎం చొరవతో
సాక్షి, గుంతకల్లు(అనంతపురం): లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న వలస కూలీలను రప్పించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ చొరవతో ముంబైలో చిక్కుకున్న 1080 మందికి పైగా అనంత వాసులు ప్రత్యేక రైలులో బుధవారం గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వలస కూలీల బాధలపై సీఎం జగన్ తక్షణమే స్పందించిన విషయాన్ని గుర్తుచేశారు. వలస కూలీలకు ప్రభుత్వం అన్ని వసుతుల కల్పిస్తోందన్నారు. పేదలకు ఉచిత రేషన్, రూ. వెయ్యి నగదు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ప్రశంసించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రతీ పనిని విమర్శించడం మానుకోవాలని హితవుపలికారు. ఏపీలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాలని ఈ క్రమంలో సీఎం జగన్‌కు సహకరించాలని ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ప్రత్యేక రైలులో గుంతకల్లు చేరుకున్న వలస కార్మికులు
సాక్షి, అనంతపురం : కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న అనంత వాసులు బుధవారం గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో దాదాపు 1,100 వలస కార్మికులు స్వరాష్ట్రానికి చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపగా.. రైల్వే శాఖ ముంబై నుంచి గుంతకల్లుకు 24 బోగీల ప్రత్యేక రైలుకు నడిపింది. మంగళవారం రాత్రి ముంబై నుంచి బయలుదేరిన ఈ రైలు నేడు గుంతకల్లుకు చేరింది. వీరిలో అత్యధికంగా ఉరవకొండ ప్రాంత కార్మికులు ఉన్నారు. వలస కార్మికులకు రైలు టిక్కెట్ చార్జీలు, భోజనం, టిఫిన్, మంచినీరు ఇతర ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేసింది. గుంతకల్లు చేరుకున్న కార్మికులకు థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించిన అధికారులు.. ప్రత్యేక బస్సుల్లో వారిని సంబంధిత క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అలాగే వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ముంబైలో చిక్కుకుపోయిన తమను ప్రత్యేక చొరవతో స్వరాష్ట్రానికి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వలస కార్మికులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం జగన్ కృషి అభినందనీయం
సాక్షి, అనంతపురం: లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న వలస కూలీలను రప్పించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ముంబై నుంచి గుంతకల్లుకు రేపు(బుధవారం) ఉదయం వలస కూలీలు చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన 500 మంది వలస కార్మికులు రానున్నారని తెలిపారు. వలస కూలీలపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం సీఎం జగన్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. -
చలిదెబ్బకు రైల్వేకు వణుకు
సాక్షి, గుంతకల్లు: శీతాకాలం అంటే రైల్వే అధికారులకు హడల్. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో రైలు కమ్మీలకు తగినంత ఉష్ణోగ్రత లేని కారణంగా రైలు కమ్మీలు, రైల్ వెల్డింగ్‌లు విరిగిపోవడం సర్వసాధారణం. ముఖ్యంగా నల్లరేగడి, చెరువుల సమీపాన ఉన్న ట్రాక్‌ల వద్ద ఈ సమస్య అధికంగా ఉంటుంది. వేకువజామున 3.00 గంటల నుంచి ఉదయం 7.00 గంటల వరకు, సాయంత్రం 7.00 రాత్రి 10.00 గంటల మధ్య రైలు కమ్మీలు చలి తీవ్రతకు బ్రేక్ అవుతుంటాయి. గడిచిన నెలరోజుల్లో డివిజన్ వ్యాప్తంగా 09 ప్రాంతాల్లో రైలు పట్టాలు విరిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. ముఖ్యంగా రైల్వే లోకో సిబ్బంది (రైళ్ల డ్రైవర్లు, సహా డ్రైవర్లు) అప్రమత్తంగా లేకపోతే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కరితోనే 16 కి.మీల గస్తీ.. ట్రాక్ పరిరక్షణలో అత్యంత కీలకమైన ట్రాక్‌మెన్ రోజూ 16 కి.మీలు గస్తీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్యాంగ్‌మెన్ 4 కి.మీలు పరిధి పర్యవేక్షించాల్సి ఉంటుంది. రెండు పర్యాయాలు ఈ మార్గంలో గ్యాంగ్‌మెన్ తనిఖీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం 6.00 నుంచి అర్ధరాత్రి 12.00 గంటల దాకా ఒక షిప్టు, ఇదిలా ఉండగా మధ్యరాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు నిర్వహించే నైట్ పెట్రోలింగ్ (రాత్రి గస్తీ) విధులకు ఇద్దరు గ్యాంగ్‌మెన్ పని చేస్తుంటారు. ప్రస్తుతం నైట్ పెట్రోలింగ్ విధులకు ఒక్క గ్యాంగ్‌మెన్ నియమించడం భయాందోళన కల్గిస్తోందని గ్యాంగ్మెన్లు చెబుతున్నారు. ఇతర డివిజన్లలో నైట్ పెట్రోలింగ్ ఇద్దరు గ్యాంగ్మెన్తో చేయిస్తుంటే గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ఒక్కరేతోనే నిర్వహిస్తుండటం దారుణమంటున్నారు. అసలే చలి కాలం రాత్రిపూట రైలు పట్టాల వెల్డింగ్ చలికి కరిగిపోయి పట్టాలు పగిలే ప్రమాదం ఉంది. దురదష్టవశాత్తు రైలు ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తూ రైలు ప్రమాదాలు నివారించాలంటే రైల్వేబోర్డు నిబంధనల ప్రకారం తగినంత సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఈనెల 03న డివిజన్లోని వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో రైలు పట్టాల అసైన్మెంట్ విరిగి తిరుపతి–షిరిడీ వెళ్లే సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్‌తో వెళ్తుండటంతో పెను ప్రమాదం జరగలేదు. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలంటే మాత్రం సిబ్బందిని పెంచాల్సిందే. రైలు పట్టాల ఉష్ణోగ్రతపై ఆరా.. ప్రస్తుతం చలికాలం కావడంతో రైలు పట్టాలు విరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో రైలు పట్టాల ఉష్ణోగ్రత వివరాలపై ఆరా తీస్తున్నట్లు రైల్వే మార్గాల పర్యవేక్షణ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా రైలు పట్టాలను తరుచుగా అల్ట్రా సోనిక్ ఫ్ల డిటెక్టర్ ద్వారా పరీక్షలు చేయాలని సూచించి ఆ వివరాలను తమకు తెలియజేయాలని ఆదేశించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వేధిస్తున్న సిబ్బంది కొరత.. గుంతకల్లు డివిజన్ మొత్తం మీద 1354.27 కి.మీల రైలు మార్గం విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని పర్యవేక్షించడానికి డివిజన్ పరిధిలో 23 ఇంజనీరింగ్ డిపోలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సిబ్బంది కొరత ఉంది. డివిజన్ వ్యాప్తంగా దాదాపు 1700 ట్రాక్‌మెన్ పోస్టులు ఖాళీ ఉండగా గడిచిన ఆగస్టు నెలలో 986 పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 714 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. -
మత్తు మందిచ్చి దోపిడీ
సాక్షి, గుంతకల్లు: నేత్రావతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు మహిళా ప్రయాణికులకు అపరిచిత వ్యక్తి టీలో మత్తుమందు కలిపిచ్చి.. నిలువు దోపిడీకి చేశాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన మారియమ్మ, ఎలీసె అనే వృద్ధ మహిళలు స్వగ్రామం వెళ్లేందుకు గురువారం ఛత్రపతి శివాజీ టర్మినల్ – తిరువనంతపురం వెళ్లే నేత్రావతి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ – 16345) ఎక్కారు. బీ2 కోచ్‌లో 61, 65 నంబర్‌సీట్లలో కూర్చున్నారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో లోనవాలా రైల్వేస్టేషన్‌కు చేరిన సమయంలో ఓ అపరిచిత వ్యక్తి వీరితో మాటామంతీ కలిపి మత్తుమందు కలిపిన టీ ఇచ్చాడు. టీ తాగిన తర్వాత ఇద్దరూ స్పృహ కోల్పోయారు. మారియమ్మ, ఎలీసె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపరిచిత వ్యక్తి దోచుకునివెళ్లాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఇద్దరు మహిళలను శుక్రవారం ఉదయం కొప్పగల్లు రైల్వేస్టేషన్లో తోటి ప్రయాణికులు గుర్తించి గుంతకల్లు రైల్వే అధికారులకు సమాచారమందించారు. రైలు 11.15 గంటలకు గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న టీటీఈ కిషోర్ కోచ్‌లోకి వెళ్లి స్పృహ కోల్పోయిన మారియమ్మ, ఎలీసెలను 108 వాహనంలో స్థానిక రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ బాధితులు అపస్మారక స్థితిలోనే ఉండటంతో నగల విలువ తెలియరాలేదు. 3 గంటలు అంబులెన్స్‌లోనే.... మత్తు మందు ప్రభావంతో స్పృహ కోల్పోయిన మారియమ్మ, ఎలీసెలను 11.30 గంటలకు 108 సిబ్బంది రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే సం బంధిత రైలులో విధి నిర్వహణలో ఉన్న టీటీఈ నుంచి ఎలాంటి సమాచారం అందనందున తాము వైద్య సేవలందించలేమని సిబ్బంది మొండికేశారు. నేత్రావతి ఎక్స్‌ప్రెస్ రైలు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గుంతకల్లు మీదుగా మళ్లించారు. దీంతో ఆ రైలులో టీటీఈలు కూడా ఎవరూ లేరని తెలిసింది. ఈ కారణంగానే కంట్రోల్ రూం కార్యాలయానికి ఫిర్యాదు అందలేదు. దీంతో మూడు గంటలపాటు బాధిత మహిళలకు 108 వాహనంలోనే సిబ్బంది చికిత్సలు అందించారు. రైల్వే ఉన్నతాధికారులు కల్పించుకొని ఆదేశాలివ్వడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు వీరికి ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. -
కలకలం రేపిన బాలిక కిడ్నాప్
సాక్షి, గుంతకల్లు : గుంతకల్లు పట్టణంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. అరగంటలోనే తిరిగి బాలిక ప్రత్యక్షం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలిక తల్లి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఆచారమ్మ కొట్టాల ఏరియాకు చెందిన ఆరోగ్యమేరీ, శాంతరాజ్ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె ఎం.అఖిలమేరీ సెయింట్ మేరీస్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతోంది. తల్లి స్కూల్ ఆవరణలో ఉన్న మదర్‌థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్‌లో ఆయాగానూ, తండ్రి రైల్వే హాస్పిటల్ క్యాంటీన్‌లోను పనిచేస్తున్నారు. రోజుమాదిరిగానే వారిద్దరూ మంగళవారం ఉదయాన్నే పనులకు వెళ్లిపోయారు. అఖిల మేరీ ఉదయం 8 గంటలకు స్కూల్ వెళ్లింది. హెల్మెట్, మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అఖిలమేరీని మధ్యలో కూర్చోపెట్టుకుని, నోటికి గుడ్డ అడ్డంగా పెట్టి పోర్టర్స్‌లైన్, ధర్మవరం గేట్, బీరప్పగుడి సర్కిల్ మీదుగా చిప్పగిరి బ్రిడ్జి వరకు తీసుకెళ్లారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చిప్పగిరి బ్రిడ్జి వద్ద వదిలిపెట్టి పరారయ్యారు. ఉపాధ్యాయుడు గుర్తించి.. బాలికను చేరదీసి బెల్డోనాలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహహ్మద్ రఫీ ఉదయం 8:30 గంటల సమయంలో ఆటోలో స్కూల్‌కు వెళ్తున్నాడు. ఒంటరిగా రోదిస్తున్న బాలిక అఖిలమేరీని గమనించాడు. ఆటో దిగి ఆ పాప ఆచూకీ, ఇతర వివరాలను ఆరాతీశారు. వెంటనే ఆ పాపను ఆటోలో ఎక్కించుకుని తనతో పాటు స్కూల్‌కు తీసుకెళ్లాడు. బాలిక మెడలోని స్కూల్ ఐడీ కార్డు ఆధారంగా బాలిక తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేశాడు. దీంతో స్కూల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు బాలికను అప్పగించి విషయాన్ని గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులకు తెలియజేశారు. పొంతన సమాధానాలు వన్‌టౌన్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి ఆ బాలికను వెంటపెట్టుకుని కిడ్నాపర్లు బైక్ మీద తిప్పిన పరిసరాలను పరిశీలించారు. అయితే ఆ బాలిక మొదట ఆలూరు పక్కనున్న తన అమ్మమ్మ గ్రామానికి వెళ్తున్నానని ఓసారి, కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారని మరోసారి పొంతన లేకుండా చెప్పడంతో కిడ్నాప్ జరిగిందా లేక తల్లిదండ్రులేమైనా మందలించి ఉంటే తనే అమ్మమ్మ దగ్గరకు వెళ్లడానికి ఈ విధంగా చెబుతోందా అనే కోణంలో విచారించారు. అయితే ఇప్పటివరకు బాలిక తల్లిదండ్రుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని, ప్రాథమికంగా తమకు అందిన సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలించామని సీఐ వెల్లడించారు. -
బిర్యానీలో చచ్చిన బల్లులను కలుపుతూ....
సాక్షి, గుంతకల్లు: బల్లి పడిని బిర్యానీని ఇచ్చారంటూ రైల్వే క్యాంటీన్ నిర్వాహకులను బెంబేలెత్తించి, నగదు దండుకోవాలనుకున్న ఓ ప్రయాణికుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఛత్రపతి శివాజీ టర్మినల్–కోయంబత్తూరుకు వెళ్లే కుర్లా ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు చేరుకుంది. అందులో ప్రయాణిస్తున్న సుందర్‌పాల్ అనే ప్రయాణికుడు 4వ ప్లాట్ఫారంలో ఉన్న మారయ్య రైల్వే క్యాంటీన్లో వెజ్ బిర్యానీ కొనుగోలు చేశాడు. అనంతరం అందులో బల్లి పడిందంటూ నేరుగా వెళ్లి డిప్యూటీ రైల్వే స్టేషన్ మాస్టర్ జార్జ్, కమర్షియల్ మేనేజర్ అనూక్‌కు ఫిర్యాదు చేశాడు. కంగారు పడ్డ వారు వెంటనే రైల్వే ఆస్పత్రి వైద్యురాలు భార్గవిని పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు. అదే సమయంలో రైల్వే అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. బాధితుడిగా భావిస్తున్న సుందర్‌పాల్ పచ్చి మోసగాడుగా రైల్వే అధికారులు తేలింది. కావాలనే అన్నంలో చచ్చిన బల్లులను కలిపి రైల్వే క్యాంటీన్ యజమానుల బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజేవాడిగా తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని డీసీఎం కుమార్‌గౌరవ్, సీటీఐ వై.ప్రసాద్ స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం జబల్పూర్ రైల్వేస్టేషన్లో ఇలానే సమోసలో బల్లి వేసి నాటకమాడి ఆ కాంట్రాక్టర్ నుంచి రూ.30వేలు గుంజినట్లుగా తేలిందన్నారు. తిరిగి గుంతకల్లులోనూ అదే తరహాలో కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ. 5 వేలు డిమాండ్ చేశాడని, దీనిపై అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసిందని వివరించారు. రైల్వే అధికారులు విచారణలో తాను వేసింది బల్లి కాదని సముద్రపు చేప అంటూ సుందర్‌పాల్ ధ్రువీకరించాడు. డబ్బు కోసం నాలుగైదు ప్రదేశాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. -
గుంతకల్లులో టీడీపీ నేత మల్లికార్జున చౌదరి అరాచకం
-
గుంతకల్లులో ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా యాత్ర
-
ఫ్యాన్స్ వీరంగం.. జనసేన భేటీలో గందరగోళం
సాక్షి, అనంతపురం: గుంతకల్లులో శనివారం నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. జనసేన నేతలు సమావేశం నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు సమావేశంలోకి చొచ్చుకువచ్చారు. తమను ఎందుకు ఆహ్వానించలేదని సమావేశ నిర్వాహకులను నిలదీశారు. జనసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పవన్ అభిమానులు కుర్చీలు విరగొట్టారు. దీంతో సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. -
గుంతకల్లులో టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి, గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగుదేశం పార్టీ నేతలు విధ్వంసం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతలకు చెందిన ఏడు ఆయిల్ ట్యాంకర్ల లారీలను ధ్వంసంచేయడమే కాక, అడ్డు వచ్చినవారిపై దాడికి దిగారు. ఇంధన సరఫరాలో అధిపత్యం కోసం అధికార పార్టీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. టీడీపీ నేతల దాష్టీకానికి నిరసనగా బుధవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గుంతకల్ డిపో బంద్‌కు వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి పిలుపు ఇచ్చారు. -
చికుబుకు రైలు...సేవలెన్నో చూడు
ప్రయోజనం రైలు...అనగానే ఒక గమ్యస్థానం నుంచి మరో గమ్యస్థానానికి చేరుస్తుందని మాత్రమే చాలా మందికి అనుకుంటుంటారు. కానీ రైల్వే టికెట్ బుక్ చేసుకోవడం ఎలా...ప్లాట్ఫారం టికెట్ ఎందుకు కొనాలి..రద్దు చేసుకునే ఎంత మొత్తం వెనక్కు వస్తుంది..తదితర వివరాలేవీ చాలా మందికి తెలియవు. మరోవైపు రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో సేవలు అందిస్తోంది. ద్విచక్రవాహనాలను తరలింపు నుంచి కల్యాణ వేదికలను అద్దెకివ్వడం వరకూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది. ఇలా రైల్వే అందిస్తున్న సేవల సమాహారమే ఈ కథనం. గుంతకల్లు: సుదూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులు మూడు నెలల ముందుగానే టికెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. టిక్కెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రయాణ సమయానికి 24 గంటల్లోపు టికెట్ రద్దు చేసుకుంటే ఒక రేటు, వెయిటింగ్ లిస్టు టికెట్ రద్దు చేసుకుంటే ఒకవిధంగా డబ్బు వెనక్కు వస్తుంది. కన్ఫర్మేషన్ టికెట్ రద్దు చేసుకుంటే.. – స్లీపర్ టికెట్ రద్దు చేసుకుంటే రూ.120 పోను మిగతా సొమ్ము వెనక్కు వస్తుంది. – ఏసీ చైర్, త్రీటైర్ టికెట్లు రద్దు చేసుకుంటే రూ.190 కట్ అవుతుంది. రైలు బయలుదేరే ముందు 4 గంటల్లోపు రద్దు చేసుకోవాలి. లేకపోతే టిక్కెట్ ధర మొత్తం వాపసు ఇవ్వడం కుదరదని రైల్వే వర్గాలు తెలిపాయి. వెయిటింగ్ లిస్టు టికెట్ రద్దు చేసుకుంటే... – స్లీపర్ క్లాస్ టికెట్ రద్దు చేసుకుంటే రూ.60, ఏసీ చైర్, త్రీటైర్ టికెట్లకు రూ.65 కట్ అవుతుంది. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే రైల్వే వర్గాలు నిర్ణయించిన ప్రకారం డబ్బు వాపసు వస్తుంది. తత్కాల్ టికెట్ పొందడం ఇలా... –ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా తత్కాల్ టికెట్ పొందవచ్చు. ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు ఈ టికెట్ జారీ చేస్తారు. – ఉదయం 10.00 గంటలకు ఏసీ క్లాస్ టికెట్లు, 11.00 గంటలకు ద్వితీయ శ్రేణి టికెట్లను తత్కాల్ పద్ధతిన బుక్ చేసుకోవచ్చు. – రిజర్వేషన్ సౌలభ్యం ఉన్న ప్రతి రైలులో తత్కాల్ టికెట్ ద్వారా బెర్త్‌లు రిజర్వు చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు రాయితీలు వర్తించవు. – ఒక దరఖాస్తు ద్వారా గరిష్టంగా నలుగురు సభ్యులు మాత్రమే తత్కాల్ టికెట్లు రిజర్వు చేసుకోవచ్చు. – టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఏవిధమైన గుర్తింపు కార్డు అవసరం లేదు. కానీ ప్రయాణ సమయంలో మాత్రం తత్కాల్ టికెట్ (ఒరిజినల్) చూపించడంతోపాటు ఆధార్, ఓటరు కార్డు లేదా పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వీటిల్లో ఏదైనా ఒక పత్రం చూపించాల్సి ఉంటుంది. – తత్కాల్ టికెట్ పొందాలంటే ప్రయాణించే దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్‌కు కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.200, అదేవిధంగా ఏసీ చైర్‌కార్‌కు కనిష్టంగా రూ.125, గరిష్టంగా రూ.225, ఏసీ త్రీటైర్‌కు కనిష్టంగా రూ.300, గరిష్టంగా రూ.400, ఏసీ 2టైర్‌కు కనిష్టంగా రూ.400 గరిష్టంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. – కన్ఫర్మ్ అయిన తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే డబ్బు వాపసు ఇవ్వరు. వెయిటింగ్ లిస్టులో ఉండి రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం నగదు వెనక్కు ఇస్తారు. ద్విచక్ర వాహనం బుక్ చేసుకోవడం ఇలా... ద్విచక్ర వాహనాలను యజమానులు స్లీపర్ టికెట్, జనరల్ టికెట్‌తో తమ ద్విచక్రవాహనాన్ని రైలులో రవాణా చేసుకోవచ్చు. వాహనదారుడు ఒరిజినల్ ఆర్సీ జిరాక్స్ ప్రతులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వాహనంలో పెట్రోల్ లేకుండా చూసుకోవాలి. రైల్వే పార్శిల్ కార్యాలయంలోని కూలీలు గోనెసంచి, గడ్డి, ప్లాస్టిక్ కవర్లతో ప్యాకింగ్ చేసినందుకు రూ.200 కూలీ చెల్లించాల్సి ఉంటుంది. వాహనం బరువు ప్రకారం 100 కి.మీలకు లగేజీ టిక్కెట్ కింద రూ.345, ఆ తర్వాత రైలును బట్టి కి.మీ కొంత చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. అదేవిధంగా వాహనం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక కూడా తీసుకోకపోతే గంటకు రూ.10 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్లాట్ఫారం టిక్కెట్ ఎందుకు తీసుకోవాలి... 1989 రైల్వే చట్టం ప్రకారం రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫారాల్లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా ప్లాట్ఫారం టిక్కెట్ కొనాల్సి ఉంది. స్టేషన్, ప్లాట్‌ఫారాల పరిసరాల్లో ఉండే వ్యక్తి సంబంధిత అధికారులు అడిగినప్పుడు తప్పకుండా టిక్కెట్ లేదా ప్లాట్ఫారం టిక్కెట్ చూపాల్సి ఉంటుంది. ఈ రెండూ టికెట్లు లేకుండా రైల్వే టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్కు పట్టుబడితే రూ.250 జరిమానా, మినిమం చార్జీ కింద రూ.50 కలిపి మొత్తం రూ.300 ఫైన్‌గా కట్టాల్సి ఉంటుంది. ప్లాట్ఫారం టికెట్ గానీ, ప్రయాణ టిక్కెట్ గానీ ఉంటే స్టేషన్లో అనుకోని ప్రమాదం జరిగినప్పుఽడు సంబంధిత వ్యక్తికి రైల్వే సంస్థ ద్వారా నష్టపరిహారం అందే అవకాశం ఉంటుంది. రైలు ప్లాట్ఫారం టిక్కెట్ చెల్లుబాటు సమయం 3 గంటలు. పోర్టర్ చార్జీలు ఇలా.... వృద్ధులు, జబ్బుపడిన వారు, వికలాంగులను రైల్వేస్టేషన్ లోపలికి, బయటికి తీసుకురావడానికి మినిమం చార్జీ (కూలీ) కింద రూ.50 వసూలు చేస్తారు. అదే విధంగా సాధారణ ప్రయాణీకులు తమ లగేజీని రైల్వేస్టేషన్ లోపలికి, బయటికి తీసుకురావడానికి మినిమం (40 కిలోల తూకం కల్గిన బ్యాగులను మోసుకెళ్లడానికి) రూ.50, లగేజ్ ట్రాలీలో తరలించడానికి రూ.80 చొప్పున పోర్టర్లు వసూలు చేస్తారు. రైల్వే కల్యాణ మండపాల బుకింగ్ ఇలా.... డివిజన్ కేంద్రం గుంతకల్లులోని రైల్వే కమ్యూనిటీహాల్, రైల్వే ఇన్స్టిట్యూట్లు శుభకార్యాలకు అద్దెకు ఇస్తుంటారు. రైల్వే ఉద్యోగుల ఇంట జరిగే శుభకార్యాలకు కల్యాణవేదిక, ఫంక్షన్ హాళ్ల ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో 1978లో అప్పటి రైల్వే శాఖ మంత్రి మధుదండవళె వీటిని నిర్మించారు. రైల్వే ఉద్యోగులకు నామమాత్రపు రేట్లతో ఈ వేదికలను అద్దెకు ఇస్తారు. ఈ వేదిక ఖాళీగా ఉన్న సమయంలో ఇతరులకు కూడా అవకాశం ఇస్తారు. – తొలి ప్రాధాన్యత మహిళా ఉద్యోగులకు ఉంటుంది. ఆ తరువాత పురుష రైల్వే ఉద్యోగులకు ఈ వేదికలను కేటాయిస్తారు. – సర్వీసులో ఉన్న రైల్వే సిబ్బందికి తొలి ప్రాధాన్యం కాగా, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల తర్వాత ప్రాధాన్యతనిస్తారు. – రైల్వే ఉద్యోగులు ఏటా ఇచ్చే డిక్లరేషన్ పత్రాల ఆధారంగా ఈ కల్యాణ వేదికల కేటాయింపు జరుగుతుంది. – కల్యాణ వేదికల్లో ఒక్కటైన రైల్వే కమ్యూనిటీహాల్ రోజుకు (సాయంత్రం 4.00 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటల) రూ.5 వేలు చొప్పున రైల్వే ఉద్యోగులకు, ఇతరులకు రూ.30 వేలు చొప్పున అద్దె వసూలు చేస్తారు. – రైల్వే ఇన్స్టిట్యూట్ను సభ్యత్వం కల్గిన ఉద్యోగులకు రోజుకు (సాయంత్రం 4.00 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటల) రూ.3 వేలు చొప్పున, రైల్వే ఉద్యోగులకు రోజుకు రూ.5 వేలు, పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగుల కుటంబాలకు రూ.4 వేలు, ఇతరులకు రూ.13 వేలు చొప్పున అద్దె వసూలు చేస్తారు. రైల్వే గదులను ఎలా బుక్ చేసుకోవాలంటే... రిజర్వేషన్ టికెట్ కొన్న (టికెట్ కన్ఫార్మ్) ప్రయాణీకులకు మాత్రమే రైల్వే గదులను కేటాయిస్తారు. గదులను ‘‘ఐఆర్సీటీసీ’’ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణీకులు రైలు ఎక్కే స్టేషన్, రైలు దిగే స్టేషన్ల ఆధారంగా రైల్వే గదుల బుకింగ్ సదుపాయం ఉంటుంది. గదుల్లో ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. డివిజన్లోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యం ఉంది. గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని గదుల ధరలు ఇలా... జంక్షన్లో మొత్తం 10 గదులున్నాయి. వీటిలో ఒకటి ఏసీ. మిగిలినవి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్ గదులు. ఏసీ గది రోజుకు (ఉదయం 6.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు) రూ.600, డబుల్‌కాట్ బెడ్రూం రోజుకు రూ.300, సింగిల్‌కాట్ బెడ్రూం రూ.100 అద్దె వసూలు చేస్తారు. – డివిజన్ పరిధిలోని తిరుపతి, రేణిగుంట జంక్షన్లలో ఏసీ డీలక్స్, నాన్ ఏసీ డబుల్, సింగిల్, డార్మెటరీ హాళ్లు ఉన్నాయి. ఏసీ గదికి రూ.600, డబుల్‌కాట్ బెడ్రూంకు రూ.450, సింగిల్‌కాట్ బెడ్రూం రూ.90, డార్మెటరీ హాల్‌కు రూ.175 చొప్పున అద్దె వసూలు చేస్తారు. -
20 మంది జూదరుల అరెస్ట్..
గుంతకల్లు రూరల్: కదిరిపల్లి సమీపంలోని పేకాట స్థావరంపై గుంతకల్లు రూరల్ ఎస్ఐ బాబాజాన్ తన సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. 20 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారినుంచి 14 సెల్ఫోన్లు, 7 బైక్‌లు, రూ. 2 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అడపాదడపా జూదరులు పట్టుపడుతున్నప్పటికీ, ఇంత భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతూ పట్టుపడటం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో నిఘా మరింత పెంచుతామని ఎస్ఐ తెలిపారు. -
యువకుడు ఆత్మహత్య
గుంతకల్లు : పట్టణంలోని భాగ్యనగర్‌కు చెందిన శ్రావణ్‌రామ్ (24) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు.. దశరథరామ్, భాగ్యలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు శ్రావణ్‌రామ్ బీటెక్ వరకు చదివాడు. ప్రస్తుతం ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. శుక్రవారం రాత్రి సినిమాకు వెళ్లొస్తానని బయటకు వెళ్లిన ఇతడు అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఉదయాన్నే ఇంటికి వస్తానని చెప్పాడు. శనివారం ఉదయం హనుమాన్ సర్కిల్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. వెంటనే వారు సంఘటన స్థలానికి వెళ్లి బోరున విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆయన రూటే సెప‘రేటు’
వీఆర్వో వసూళ్లపర్వం పైసలివ్వనిదే ఫైలు ముందుకు కదలదు తహసీల్దార్ కార్యాలయమే అడ్డా ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం అక్కడ ప్రతి పనికీ ఓ రేటు. ఆ ప్రకారం ముట్టజెప్పకపోతే పని ముందుకుసాగదు. కాసులు పడితే కానీ పెన్ను, ఫైలు కదలదు. తనకు సంబంధం లేకపోయినా అన్నీ తానై ఓ చిరుద్యోగి వ్యవహరిస్తున్నాడు. ఆయన మరో ఇద్దరు అనధికారిక వ్యక్తులను నియమించుకుని ఆన్లైన్ వ్యవహారాలను కూడా చక్కబెట్టిస్తున్నాడు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ.. మొత్తం తహసీల్దార్ కార్యాలయాన్నే తన అడ్డాగా మార్చేసుకున్నాడు. వీఆర్వో కాస్తా.. వసూల్ రాజాగా మారిపోయాడు. గుంతకల్లు రూరల్: స్థానిక తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ, రెసిడెన్స్, జనన, మరణ, వంశవృక్ష ధ్రువీకరణ పత్రాలతోపాటు రైతులు ఆన్లైన్లో భూ రికార్డుల సవరణలు, కొత్త పాసుపుస్తకం తదితర ఏ పని కోసమైనా తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించాల్సిందే. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్ తదితర అధికారుల వద్ద పని కోసం వచ్చే వారి వద్దకు ఓ వీఆర్వో టక్కున వచ్చేస్తాడు. వారికి చేసి పెట్టాల్సిన పనిస్థాయిని బట్టి ‘లెక్క’ కడతాడు. తాను నిర్ణయించినంత ఇస్తే ఓకే.. లేకుంటే ఆ పని గురించి పట్టించుకోడు. అవినీతికి అలవాటుపడిన అధికారులు వీఆర్వో ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. ముడుపులు ఇచ్చిన వారికి నిమిషాల్లో పనులు చేసిపెట్టడం.. ఇచ్చుకోలేని వారికి నెలల తరబడి తిప్పుకుని వేధించడం వీఆర్వో నైజం. ఈ క్రమంలోనే అధికారులందరినీ ఆయన తన అధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీలకు వెళ్లే ఉన్నతాధికారుల వెంట ఈ అధికారి నీడలా ఉంటాడు. తనిఖీల అనంతరం సదరు వ్యక్తుల వద్దకు వెళ్లి బేరాలు కుదుర్చుకుంటాడు. తను అడిగినంత ఇస్తే.. దాడులు, తనిఖీల సమాచారం ముందస్తుగా చేరవేరుస్తానని అమ్ముడుపోతాడు. లెక్కలేనన్ని ప్రభుత్వ నివేసన స్థలాలను తన చేతుల్లో ఉంచుకుని, అవసరానికి అనుగుణంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవడం ఈ వీఆర్వో ప్రత్యేకత. లంచం ఎందుకు ఇవ్వాలని ఎవరైనా నిలదీస్తే ‘నీ దిక్కున్నచోట చెప్పుకో’ అంటూ వారినే గదమాయించిన సంఘటనలు ఉన్నాయి. ఎనిమిదేళ్లుగా ఒకేచోట పనిచేస్తూ పాతుకుపోయిన అతడిపై ఫిర్యాదులు వచ్చినా ఏ అధికారీ చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఆన్లైన్లో ఒకరి పేరున ఉన్న భూములను మరొకరి పేరున మార్చి సొమ్ము చేసుకుంటుంటే, మరొక వ్యక్తి ఇంటి పట్టాల్లో పేర్లు మార్చి జేబులు నింపుకుంటున్నాడు. ఈ ఇద్దరూ వీఆర్వో కనుసన్నల్లోనే నడుస్తుండటం గమనార్హం. కొసమెరుపు వీఆర్వో అడిగినంత లంచం ఇచ్చి పని చేయించుకున్న ఓ వ్యక్తి.. ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లో రికార్డ్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ మొదలుకుని, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీఓ ఇలా అందరికీ వీడియో సీడీలతో పాటు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి మూడు నెలలు గడిచినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. -
జులాయి..
అదనపు కట్నం కోసం వేధింపులు భార్యాపిల్లలపై అంతులేని నిర్లక్ష్యం తరచూ ఇంటి నుంచి అదృశ్యం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ఫినాయిల్ తాగి బెదిరింపులకు దిగిన శాడిస్టు అనైతిక వివాహేతర సంబంధం ఓ పచ్చని కాపురంలో చిచ్చురేపింది. వరుసకు అత్త అయిన వివాహితతో సంబంధం పెట్టుకుని భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేశాడు. పెద్దలు పంచాయితీ నిర్వహించి, భార్యను సక్రమంగా చూసుకోవాలని హితవు పలికారు. అయితే తన వివాహేతర సంబంధం గుట్టురట్టు చేసిన ఇల్లాలిపై కక్ష కట్టిన అతను పథకం ప్రకారం అదనపుకట్నం పేరిట వేధింపులకు దిగాడు. వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో తనకు విముక్తి కల్పించాలని బాధితురాలు వేడుకుంటోంది. గుంతకల్లు రూరల్: కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సైరాబాను, లతీఫ్ దంపతుల కుమార్తె ముంతాజ్‌కు గుంతకల్లులోని పక్కీరప్ప కాలనీ నివాసి షర్ఫుద్దీన్ కుమారుడు రహిమాన్‌తో ఏడేళ్ల కిందట వివాహమైంది. కట్నకానుకల కింద రూ.1.2 లక్షలు, 8 తులాల బంగారు నగలతోపాటు ఒక మోటార్‌సైకిల్‌ను ఇచ్చారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. వరుసకు అత్త అయిన వివాహితతో రహిమాన్ అనైతిక సంబంధం కొనసాగిస్తూ వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య... తన భర్తకు హితవు పలికింది. అప్పటి నుంచి భార్యాకుమార్తె బాగోగులను పట్టించుకోవడం మానేశాడు. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకోవడంతో అత్తతో పాటు ఉడాయించాడు. రోజులు గడుస్తున్నా... భర్త తిరిగి రాకపోవడంతో ముంతాజ్ తన పుట్టింటికి చేరుకుంది. ఏడాది తర్వాత.. ఏడాది తర్వాత రహిమాన్ తిరిగి గుంతకల్లుకు చేరుకున్నాడు. తన తండ్రి మరణానంతర 40 రోజుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. అప్పటికే ‘మిస్సింగ్’ కేసులో నిందితుడిగా ఉన్న రహిమాన్‌ను కసాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని బంధువులు అతడిని స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు. మత పెద్దలు, అంజుమన్ కమిటీ సభ్యుల సమక్షంలో రహిమాన్ తన భార్యతో కలిసి ఉండేలా అగ్రిమెంట్ రాయించారు. అదనపు కట్నం వేధింపులు అగ్రిమెంట్ అనంతరం భార్యతో కలిసి బెంగళూరుకు మకాం మార్చిన రహిమాన్ రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని అదనపు కట్నం కోసం భార్యను హింసించేవాడు. డబ్బు ఇవ్వగానే తీసుకుని పది రోజులపాటు కనిపించకుండా వెళ్లిపోయేవాడు. కూతురుని అల్లుడు పెట్టే చిత్రహింసలు చూడలేక అడిగిన ప్రతిసారీ అత్తమామలు డబ్బు ముట్టజెప్పేవారు. ఈ ఏడాది రంజాన్ పండుగ కోసమని భార్య, కూతురుతో రహిమాన్ గుంతకల్లుకు వచ్చాడు. రెండు రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులను ఆశ్రయించిన భార్య తన భర్త ప్రవర్తనతో ముంతాజ్ విసిగిపోయింది. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ మూడు రోజుల కిందట కసాపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కౌన్సెలింగ్‌తో భార్య, కూతురుతో కలిసి ఉండేందుకు అంగీకరించిన రహిమాన్ గురువారం రోజు రాత్రి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడు కావాలనే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడని బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు మొర పెట్టుకుంది. -
అ‘ట్రాక‌్షనేనా’?
ముందుకు సాగని ట్రాక్షన్ షెడ్ నిర్మాణ పనులు - పదేళ్లుగా కొన ‘సా..గు’తున్న పనులు - పూర్తి కావడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశం - వందలాదిగా మంజూరుకానున్న కొత్తపోస్టులు - ఉపాధి కోసం నిరుద్యోగ యువత ఎదురుచూపు గుంతకల్లు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సౌత్ సెంట్రల్ రైల్వే జంక్షన్‌గా గుంతకల్లుకు గుర్తింపు ఉంది. ఇటు ఆంధ్ర రాజధాని కేంద్రానికి, అటు తెలంగాణ రాజధాని కేంద్రానికి ప్రధాన కేంద్రంగా గుంతకల్లు జంక్షన్ నిలిచిపోయింది. ఈ రైల్వే డివిజన్‌కు తలమానికంగా రూపుదిద్దుకుంటున్న ట్రాక్షన్ షెడ్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో ట్రాక్షన్ షెడ్ నిర్మాణ పనులకు 2008లో రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా రెండేళ్ల ఆలస్యంగా 2010లో పనులు ప్రారంభమయ్యాయి. కేవలం రూ.2కోట్లు మాత్రమే విడుదల కావడంతో శంకుస్థాపన, భూమిపూజ పనులు చేశారు. నాటి నుంచి నిధుల గ్రహణం పట్టుకుంది. పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. డివిజన్ కేంద్రమైన గుంతకల్లు జంక్షన్ సమీపంలో సుమారు 150 విద్యుత్ రైలింజన్ల సామర్ధ్యం కలిగిన ట్రాక్షన్ షెడ్ ప్రాజెక్టు పనులకు రూ.100 కోట్ల వ్యయ అంచనాలతో 2008లో రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. ట్రాక్షన్ లోకోషెడ్ నిర్మాణ పనుల్లో విద్యుత్ లోకో ట్రిప్ షెడ్, విద్యుత్ లోకోల హెవీ లిప్టింగ్ షెడ్, లోకో వాషింగ్ షెడ్లను నిర్మించాల్సి ఉంది. రూ. వంద కోట్ల వ్యయ అంచనాలతో ప్రారంభమైన ఈ పనులు.. ప్రస్తుతం 180 కోట్ల వ్యయ అంచనాలకు పెరిగింది. తొలుత ట్రాక్షన్ షెడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రికల్ ట్రిప్ షెడ్ పనులు ప్రారంభించారు. గుంతకల్లు–రేణిగుంట మధ్య విద్యుత్ లైన్లు పూర్తి కావడంతో రైల్వే ఉన్నతాధికారులు ఒత్తిడి కారణంగా ట్రిప్ షెడ్‌ను వినియోగంలోకి తెచ్చారు. అయితే ట్రాక్షన్ షెడ్ నిర్మాణంలో రెండు భారీ షెడ్ల నిర్మాణం దాదాపు 80శాతం పూర్తయ్యింది. మిగిలిన 20 శాతం పనుల్లో భాగంగా ట్రాక్ లింకింగ్ పనులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా హెవీ, మీడియం లిప్టింగ్ షెడ్లు, లోకో వాషింగ్, లేత్ మిషన్ ఎలక్ట్రికల్ షెడ్లో మరిన్ని పనులు చేయాల్సి ఉంది. అందులో లిప్టింగ్ బే, హెవీ లిఫ్టింగ్ బే, ఇన్స్ఫెక్షన్ బే తదితర పనులు జరగాల్సి ఉంది. అంతేకాకుండా వీటికి అనుసంధానంగా భారీ స్థాయిలో 60 సర్వీస్ భవనాలు నిర్మించాల్సి ఉంది. అయితే ఇంతవరకు వీటికి సంబంధించిన ఫౌండేషన్, నిధులు కేటాయించ లేదు. ఈ పనుల పూర్తికి మరో మూడు లేదా నాలుగు ఏళ్ల సమయం పట్టవచ్చని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే గుంతకల్లు డివిజన్లోని రేణిగుంట–గుంతకల్లు–వాడి, గుత్తి–ధర్మవరం మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తయి విద్యుత్ రైలింజన్లు పరుగులు పెడుతున్నాయి. ఇక గుంతకల్లు–హోస్పెట్ గుంతకల్లు–గుంటూరు, గుంతకల్లు–కల్లూరుల మధ్య విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. వందల మందికి ఉపాధి : ఈ ట్రాక్షన్ లోకో షెడ్ నిర్మాణం పూర్తయితే వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుంది. షెడ్ మెయిన్టెనెన్స్లో భాగంగా ఉన్నతాధికారి స్థాయి నుంచి టెక్నీషియన్, నాన్ టెక్నీషియన్, 4వ తరగతి ఉద్యోగులైన కళాసి పోస్టులు భారీ స్థాయిలోనే మంజూరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యుత్ లోకో ఇంజన్లు రాకపోకలు పెరిగి రైల్వేకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం లేకపోలేదు. విద్యుత్ రైలింజన్ల వల్ల రైలు గమ్యస్థానాలను చేరే సమయం కొద్దిమేర ఆదా అవుతుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. నత్తనడకన సాగుతున్న ట్రాక్షన్ షెడ్ నిర్మాణ పనులపై రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంపీలు, స్థానిక అధికారులు దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
గుంతకల్లు : మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు డీఎస్పీ శ్రీధర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు అర్బన్ సీఐ రాజు, టూటౌన్ ఎస్ఐ వలిబాషు ఒక బృందం, వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు మరో టీంగా ఏర్పడి నాలుగు రోజులుగా పట్టణంలో విస్తృతంగా దాడులు నిర్వహించి మట్కా ఆర్గనైజర్స్ జేపీ రామచంద్ర (బళ్లారి), సుధాకర్‌రెడ్డి (ప్యాపిలి, కర్నూలుజిల్లా)తోపాటు పట్టణానికి చెందిన బీటర్లు ఎం.గోపి, రంగ, అంజాద్, మాబు, సంజీవరాయుడు, భీమన్న, కృష్ణమూర్తి, లోకలను అరెస్టు చేశారన్నారు. వీరి నుంచి రూ 2.25లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రహరీ గేటు కూలి విద్యార్థి దుర్మరణం రక్షించబోయిన మహిళకూ గాయాలు గుంతకల్లు : ప్రైవేట్ పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. ప్రహరీ గేటు కూలడంతో నర్సరీ విద్యార్థి దుర్మరణం చెందాడు. విద్యార్థిని కాపాడబోయిన మహిళ కాలుపై గేటుపడటంతో ఆమె కూడా గాయపడింది. గుంతకల్లులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం దేగులపాడుకు చెందిన ఎం.తిమ్మయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. తిమ్మయ్య సోదరుడు ఓబుళయ్య గుంతకల్లు పట్టణంలోని వాల్మీకి సర్కిల్లో రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహిస్తున్నాడు. తమ్ముడు నిర్వహిస్తున్న ఈ స్కూల్లోనే తిమ్మయ్య తన కుమారుడు రవి (4)ని ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే నర్సరీలో చేర్పించాడు. రోజూలాగానే తన పినతండ్రి ఓబుళయ్యతో కలిసి రవి స్కూల్‌కు వచ్చాడు. విరామ సమయంలో రవి పాఠశాల ప్రహరీ గేట్ పట్టుకొని ఊయల ఆట ఆడుకుంటున్నాడు. వారం కిందట ట్రాక్టర్ ఢీకొనడం వల్ల గేటు దిమ్మె నెర్రెలిచ్చింది. దీనిని మరమ్మతులు చేయకుండా అలానే వదిలేశారు. రవి గేటును పట్టుకుని ఆడుకుంటుండగా ఉన్నపళంగా దిమ్మె విరిగి మీదపడింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని రక్షించేందుకని సమీపంలో దుస్తులు ఉతుకుతున్న హేమావతి అనే మహిళ అక్కడకు వచ్చింది. దిమ్మను పైకి ఎత్తబోయింది. అయితే అది బరువుగా ఉండటంతో సాధ్యం కాలేదు. అలా కొద్దిగా పైకెత్తిన దిమ్మె కాస్తా ఆమెపైనే పడటంతో కుడికాలు నుజ్జునుజ్జయ్యింది. పాఠశాల కరస్పాండెంట్, పినతండ్రి ఓబుళయ్య, పినతల్లి కవితలు వచ్చి చూసేసరికి రవి చనిపోయాడు. రూరల్ ఎస్ఐ బాబ్జాన్ సిబ్బందితో ప్రమాదస్థలికి చేరుకుని, బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
చోరీ కేసుల్లో ముగ్గురు దొంగల అరెస్ట్
గుంతకల్లు రూరల్ : తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను కసాపురం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి, 10 తులాల బంగారు నగలను రికవరీ చేసుకున్నారు. స్థానిక కసాపురం పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ గురునాథ్ బాబు, ఎస్ఐ సద్గురుడు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గుంతకల్లు పట్టణ ంలోని షికారి కాలనీకి చెందిన షికారి రాజు, అతడి అల్లుళ్లు అయిన అనంతపురం బుడ్డప్ప కాలనీకి చెందిన షికారి కరిమల్లయ్య అలియాస్ రాజేష్, షికారి నాగు అలియాస్ నాగేష్ కలిసి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి 2016 సెప్టెంబర్ 10న రాత్రి గుంతకల్లు పట్టణంలోని శాంతి నగర్ రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న షేక్ ముక్తార్ ఇంట్లో మూడు తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర నెలల క్రితం స్థానిక వాల్మీకీ నగర్‌కు చెందిన బోయ శివశంకర్ ఇంట్లో 35 గ్రాముల బంగారు ఆభరణాలను, నాలుగు రోజుల క్రితం మండలంలోని దంచెర్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఇంట్లో 25 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. మండలంలోని కసాపురం సమీపంలో దోసలుడుకి క్రాస్ వద్ద ఆదివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో వారు సంచరిస్తుండగా.. స్థానికులు వెంటనే కసాపురం పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ గురునాథ్ బాబు ఆధ్వర్యంలో కసాపురం ఎస్ఐ సద్గురుడు, సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని మూడిళ్లలో చోరీ అయిన 10 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసుకున్నారు. -
ఇళ్లు కూల్చేస్తాం..!
మారణాయుధాలతో తిరుగుతున్న రౌడీలు ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న ఆచారమ్మ కొట్టాల వాసులు వైఎస్సార్సీపీ సమన్వయకర్త వెంకటరామిరెడ్డి ఎదుట ఆవేదన ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటామని సమన్వయకర్త భరోసా గుంతకల్లు టౌన్ : గుంతకల్లు పట్టణంలోని ఆచారమ్మ కొట్టాలలో నివాసముంటున్న పేదలను ఇళ్లు ఖాళీ చేయాలని, తమవద్దకు వచ్చి సెటిల్మెంట్ చేసుకోకుంటే ఇళ్లు కూల్చేస్తామంటూ కొందరు రౌడీలు బెదిరిస్తున్నారు. మారణాయుధాలు చేత పట్టుకుని తిరుగుతుండటంతో కాలనీవాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తమను మీరే కాపాడాలయ్యా అంటూ కాలనీవాసులు బుధవారం వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి వద్ద కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి సమన్వయకర్త ఆచారమ్మ కొట్టాలలో పర్యటించారు. పలువురు మహిళలు మాట్లాడుతూ ఓ వ్యక్తి 4.42 ఎకరాల స్థలం తమకు వారసత్వంగా దక్కిందని, తాను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నానని తమను భయపెడుతున్నారన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే, పోలీసు అధికారుల వద్దకు వెళ్లినా వారు న్యాయం చేయలేదని చెప్పారు. ఖాళీగా ఉన్న స్థలాలన్నింటికీ కొందరు గూండాలు పచ్చరంగులు వేసిపోయారని వాపోయారు. ఈ స్థలమంతా తమకు చెందిన వ్యక్తిదని, మీరందరూ వచ్చి ఎంతోకొంత చెల్లించి సెటిల్మెంట్ చేసుకోకపోతే బుల్డోజర్లు తెచ్చి మీ ఇళ్లన్నీ పడగొడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి..మారణాయుధాలతో తిరుగుతూ భయభ్రాంతులకి గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తాము నాలుగైదు రోజులుగా దిగులుతో తిండీ తిప్పలు మానేశామని, ఎలాగైనా తమ ఇళ్లను తమకు దక్కేలా చూడాలని వైవీఆర్‌ను వేడుకున్నారు. ఎవరికీ భయపడవద్దు ఈ స్థలాలన్నీ ఫలానా వ్యక్తికి చెందినవని కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నట్లయితే కోర్టు ఉత్తర్వులను గౌరవిద్దామని, ఉత్తర్వులను పరిశీలించిన తరువాత న్యాయపోరాటం చేద్దామని వై.వెంకటరామిరెడ్డి కాలనీవాసులకు సూచించారు. అప్పటివరకు ఏ వ్యక్తికీ చిల్లీగవ్వ ఇవ్వనక్కర్లేదన్నారు. ఎవరైనా రౌడీలు మిమ్మల్ని బెదిరిస్తే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎవరికీ భయపడవద్దని, పంచాయితీలకు పిలిచినా వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీఎస్పీ సి.హెచ్.రవికుమార్‌ను వెంకటరామిరెడ్డి కలిసి ఆచారమ్మకొట్టాలలో నివాసముంటున్న 700 కుటుంబాల వారికి రౌడీల నుంచి ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాము చర్యలు చేపడతామని డీఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలింగప్ప, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజనేయులు, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ ఫ్లయింగ్ మాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకప్ప, కౌన్సిలర్ రంగన్న, గోపి, అహ్మద్‌బాషా, ఆ వార్డు ఇన్చార్జ్ చాముండేశ్వరి, అధికార ప్రతినిధి దశరథరెడ్డి, మాజీ టౌన్ కన్వీనర్ ఎద్దుల శంకర్, వార్డు ఇన్‌చార్జ్‌లు వెంకటేష్, రవి, సుమో బాషా తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ ప్రభుత్వాన్ని తరిమికొడదాం
గుంతకల్లు/ గుంతకల్లు టౌన్ : టీడీపీ మూడేళ్ల పాలన సర్వం అవినీతిమయమేనని, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రజాధనం దోపిడీ చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. దోపిడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గుంతకల్లులో శనివారం వైఎస్సార్సీపీ నియోజకవర్గస్థాయి ప్లీనరీ జరిగింది. సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో అనంత మాట్లాడారు. కరువుకు కేరాఫ్‌గా మారిన అనంతపురం జిల్లాలో రైతు, చేనేతల ఆత్మహత్యలు, ఉపాధి పనుల్లేక లక్షలాది మంది కూలీలు వలసవెళ్లినా వారికి ఆపన్నహస్తం అందివ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుందని ప్రకటించారు. జిల్లాకు వచ్చిన ఒకట్రెండు పరిశ్రమలు కూడా అధికారపార్టీ నేతల భూముల సమీపాన నెలకొల్పడమేంటని ఆయన ప్రశ్నించారు. గుంతకల్లు, జిల్లా సరిహద్దులోని బళ్లారి వద్ద ఈ పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయకూడదా అని నిలదీశారు. రాయలసీమలో అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి జరగాలన్నా, అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నా వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు సూచించారు. బాబును భయం వెంటాడుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబును ఏదో భయం నీడలా వెంటాడుతోందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డిని చూస్తే బాబు వణికిపోతున్నారన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇస్తారా? లేదా అని ఆయన ప్రశ్నించారు. మూడేళ్ల కాలంలో పేదలకు పక్కాగృహాలు కట్టివ్వలేదు కానీ సీఎం మాత్రం మూడు ఇళ్లు కొనుకున్నారన్నారని ప్లీనరీ పరిశీలకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నారా కుటుంబం అభివృద్ది చెందుతోందే తప్ప ప్రజలెవ్వరూ బాగుపడటం లేదన్నారు. సర్కారు వల్ల నష్టపోయిన కుటుంబాల్ని కలిసి వారికి భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పేరిట అంచనా వ్యయాలన్నీ పెంచేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని వైఎస్సార్సీపీ కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వై.శివరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆ దోచుకున్న డబ్బుతోనే రానున్న ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు చొప్పున ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని, ప్రజలు ఆ నోట్ల కోసం ఆశపడి టీడీపీకి ఓట్లేస్తే మళ్లీ అధోగతి పాలవుతారని హెచ్చరించారు. నవ్యాంధ్ర రాజధాని, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ది పనుల్లో కమీషన్లను దండుకోవడానికే నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకొచ్చారన్నారు. వాల్మీకులు, కురబలు, వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేరుస్తానని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబును నిలదీశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా నేతలు రాగే పరుశురామ్, మీసాల రంగన్న, పామిడి వీరాంజనేయులు, కళ్యాణదుర్గం మాజీ సమన్వయకర్త బోయ తిప్పేస్వామి, పార్టీ ఎస్సీ, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల రామాంజినేయులు, ఎన్.రామలింగప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు, మంత్రాలయం మాజీ ఎంపీపీ వై.సీతారామిరెడ్డి, యువజన విభాగం జిల్లా నాయకులు వై.భీమిరెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ వన్నూర్‌సాబ్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌యాదవ్, నియోజకవర్గంలోని మూడు పట్టణాలు, మండలాల కన్వీనర్లు సుంకప్ప, మోహన్‌రావు, హుసేన్‌పీరా,గోవర్దన్‌రెడ్డి, బి.వెంకటరామిరెడ్డి, నారాయణరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వందలాది సంఖ్యలో మహిళలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న రాజ్యం..జగనన్నతోనే సాధ్యం టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నారే తప్ప ప్రజలకు చేసింది శూన్యమే. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తెలంగాణ సర్కారుకు భయపడి విజయవాడకు తన మకాం మార్చాడు. సీఎం చంద్రబాబు, తనయుడు నారాలోకేష్లు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, బ్యాంకుల్లో రుణాలు రీషెడ్యూల్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. జనరంజక పాలన సాగించిన రాజన్న (వైఎస్ రాజశేఖరరెడ్డి) రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్నతోనే సాధ్యమవుతుంది. జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా మనమంతా కలసి పనిచేద్దాం. - వై.వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, గుంతకల్లు నియోజకవర్గం -
నేడు కదిరి, గుంతకల్లులో వైఎస్సార్సీపీ ప్లీనరీలు
కదిరి / గుంతకల్లు టౌన్ : కదిరి, గుంతకల్లు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ ప్లీనరీలు శనివారం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కదిరి పట్టణంలోని దత్తా గార్డెన్స్ ప్రాంగణంలో సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ప్లీనరీకి పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ప్లీనరీ ఇన్చార్జ్ నదీం అహమ్మద్ హాజరుకానున్నారు. అలాగే గుంతకల్లు పట్టణంలోని శ్రీ వివేకానంద ఎంసీఏ కాలేజీలో సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్లీనరీ జరగనుంది. ఈ కార్యక్రమానికి కూడా పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలిరానున్నారు. -
అంతర్ జిల్లాల దొంగ అరెస్టు
గుంతకల్లు : జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు అంతర్ జిల్లాల దొంగగా మారాడు. చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో మంచీ, చెడ్డా చెప్పే వారు లేక 16 ఏళ్ల వయస్సులోనే హత్య కేసులో నిందితుడిగా పోలీసుల రికార్డుకెక్కాడు. అంతటితో ఆగక అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. గుంతకల్లు టూటౌన్ పోలీసుస్టేషన్ ఆవరణలో అర్బన్ సీఐ రాజు, ఎస్ఐలు నగేష్‌బాబు(వన్‌టౌన్), వలీబాషా(టూటౌన్)తో కలసి డీఎస్పీ రవికుమార్ మీడియా ముందు నిందితుడ్ని గురువారం హాజరుపరిచారు. ఆయన కథనం మేరకు... అనుమానాస్పదంగా తిరుగుతూ... గుంతకల్లులోని బీరప్పగుడి సర్కిల్లో ఇనుపరాడ్‌తో అనుమానాస్పదంగా తిరుగాడుతున్న యువకుడి గురించి స్థానికులు అర్బన్ సీఐ రాజుకు సమాచారం తెలిపారు. ఆయన ఎస్ఐలు, సిబ్బందితో కలసి అక్కడికి వెళ్లి పట్టుకుని విచారించారు. విడపనకల్లు మండలం గడేకల్లుకు చెందిన శ్రీకాంత్(22)గా గుర్తించారు. జల్సాల కోసమే దొంగతనాలు చేస్తుంటానని విచారణలో అంగీకరించాడు. ఎక్కడెక్కడ చోరీలు చేశాడంటే... - గుంతకల్లులోని పద్మావతి నర్సింగ్ హోం ఏరియాలో 2016 జులైలో సుల్తాన్ నూర్ అహ్మద్ ఇంట్లో పట్టపగలు దొంగతనం చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. - మహబూబ్‌నగర్ కాలనీలోని నేసే నారాయణ, లక్ష్మీ దంపతుల ఇంట్లో చొరబడి బంగారు ఆభరణాలు అపహరించాడు. - కర్నూలు జిల్లా ఆదోని వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో శ్రీరాములుగౌడ్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేశాడు. - దొంగలించిన బంగారు ఆభరణాలను కర్ణాటకలోని బళ్లారి రాష్ట్రంలో విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సా చేసేవాడు. నిందితుడి నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 16.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. బళ్లారి రాష్ట్రంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువ(తాకట్టు) పెట్టిన 2 తులాల బంగారు ఆభరణాలూ రికవరీ చేశామన్నారు. - పాతగుంతకల్లు అంకాలమ్మ లాలయ సమీపంలో గతంలో జరిగిన హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. - నిందితుడుపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందికి రివార్డుల కోసం ఎస్పీకి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు. ఏఎస్ఐ తిరుపాల్, హెడ్ కానిస్టేబుళ్లు రామకృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మధు, సిద్దయ్య పాల్గొన్నారు. -
‘విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్తు’
గుంతకల్లు రూరల్: అవినీతి రాజకీయాలను పారదోలే శక్తి కలిగిన విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఏఐఎస్ఎఫ్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులను సోమవారం మండలంలోని బుగ్గ సంగమేశ్వరాల దేవాలయం ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయిన కనీసం ఒక్కహామీని కూడా నెరవేర్చలేకపోయిందన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలను మూతవేస్తూ విద్యను పేదలకు దూరం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మధు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మనోహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్సన్, జిల్లా మాజీ నాయకులు నారాయణస్వామి, స్థానిక నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, పవన్‌కుమార్‌రెడ్డి, మురళిక్రిష్ణ, రాజశేఖర్, రాము రాయల్, ఎస్ఎండీ గౌస్, సంఘం నాయకులు పాల్గొన్నారు. -
మార్మోగిన హనుమాన్ నామస్మరణ
- వైభవంగా హనుమద్ జయంతి - కసాపురంలో పోటెత్తిన భక్తులు గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం హనుమద్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ ఈఓ ఆనంద్‌కుమార్, అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఇతర పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో సీతారామ లక్ష్మణసహిత ఆంజనేయ స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి సర్వాంగసుందరంగా ముస్తబు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. ఆలయ ఏఈఓ మధు, పాలకమండలి సభ్యులు జగదీష్ ప్రసాద్, సతీష్, చెల్లూరు నరసింహులు, తలారి రామలింగ, మహేష్, కందుల ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితులకు ఏడాది జైలు
గుంతకల్లు రూరల్ : మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలుశిక్షతో పాటు, రూ.వంద జరిమానా విధిస్తూ గుంతకల్లు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి వాసుదేవరావ్ శుక్రవారం తీర్పును వెలువరించారు. ఇందుకు సంబంధించి కసాపురం ఎస్ఐ సద్గురుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2015 సెప్టెంబర్ 4న గుంతకల్లు పట్టణానికి చెందిన భారతి స్థానిక కసాపురం రోడ్డు సమీపంలోని సిద్ధార్థ నగర్ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో బెలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన ఉప్పర ఎర్రిస్వామి, ఉప్పర. హనుమంతు అనే ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైకుపై వచ్చి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కెల్లారు. ఈ ఘటనలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అదే ఏడాది సెప్టెంబర్‌లో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. రెండు సంవత్సరాల విచారణ అనంతరం నిందితులకు ఏడాది జైలుశిక్షతోపాటు, వంద రూపాయల జరిమానను విధిస్తూ గుంతకల్లు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి తీర్పును వెలువరించారు. -
కార్మికుడ్ని కాటేసిన కరెంట్
గుంతకల్లు టౌన్ : గుంతకల్లు హనుమాన్ సర్కిల్లోని లక్ష్మీగణేశ్ సా మిల్లో పని చేసే రామిరెడ్డి కాలనీకి చెందిన దూదేకుల ఆకుల షబ్బీర్ బాషా (27) అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురై ఆదివారం మరణించినట్లు స్థానికులు తెలిపారు. సా మిల్‌ను షబ్బీర్ సోదరుడు సత్తార్ అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. అందులోనే షబ్బీర్ కూడా పని చేస్తున్నాడన్నారు. రంపపు మిషన్‌లో మొద్దును కోస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయినట్లు తెలిపారు. తోటి కార్మికులు వెంటనే అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కాగా మృతుడికి భార్య ఆరీఫా, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. -
గుంతకల్లులో అగ్ని ప్రమాదం
గుంతకల్లు : గుంతకల్లులోని మస్తానయ్య దర్గా సమీపంలో గల ఆలియా పరుపుల దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆలియా పరుపుల దుకాణం నిర్వహకులు రియాజ్, మస్తాన్‌బీ దిన చర్యల్లో భాగంగా ఉదయం దుకాణం తెరుచుకొని పరుపులు కుడుతుండగా ఒక్కసారిగా విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఇద్దరూ గాయపడ్డారు కూడా. దుకాణం నుంచి పొగలు, మంటలు వస్తుండడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలు అదుపు చేశారు. గాయపడిన ఇద్దరినీ స్ధానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో సమారు రూ.3 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. -
రైళ్ల దారి మళ్లింపు
గుంతకల్లు టౌన్ : మహారాష్ట్రలోని సోలాపూర్ రైల్వే డివిజన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ముంబై–చెన్నై మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. హుబ్లీ–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17319) రైలును బళ్లారి–గుంతకల్లు–వికారాబాద్–హోటగీ మీదుగాను, నాగర్‌కోయిల్–చెన్నై సెంట్రల్ (16352), చెన్నై సెంట్రల్–అహ్మద్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (19419)ను గుంతకల్లు–బళ్లారి–విజయపుర–హోటగి స్టేషన్ల మీదుగాను దారి మళ్లించినట్లు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్ 30న బయల్దేరిన మూడు రైళ్లను సోలాపూర్–గుల్బర్గా మధ్య రద్దు చేశారు. గుంతకల్లు మీదుగా నడిచే పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. -
కాంట్రాక్టర్ ఇంట్లో చోరీ
గుంతకల్లు టౌన్ : గుంతకల్లు మస్తాన్‌పేటకు చెందిన రైల్వే క్యాంటిన్ కాంట్రాక్టర్ ఆర్.సుధాకర్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని రూ.25 వేల నగదును చోరీ చేసుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఉక్కపోత భరించలేక కుటుంబ సభ్యులందరూ కలసి ఇంటికి తాళం వేసి, మిద్దెపై నిద్రించారు. తెల్లవారుజామున వచ్చి చూడగా.. ఇంటి తలుపులు, బీరువా ధ్వంసమై ఉన్నాయి. నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. -
పట్టాలపైకి ‘హంసఫర్’
- గుంతకల్లు–తిరుపతి మధ్య ట్రయల్ రన్ గుంతకల్లు : సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ ఆమితాబ్ ఓజా చెప్పారు. 2016–17 రైల్వే బడ్జెట్లో రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తిరుపతి నుంచి ఉత్తరాది రాష్ట్రంలోని జమ్మూతావి క్షేత్రంలోని వైష్ణవిదేవి ఆలయం సందర్శనార్థం హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశపెట్టారు. ఈ రైలు గుంతకల్లు నుంచి తిరుపతి మధ్య శుక్రవారం ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఎం అమితాబ్ ఓజా, ఏడీఆర్ఎం సుబ్బరాయుడు తదితర అధికారుల బృందం గుంతకల్లులో రైలును పరిశీలించారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ సాధారణ ప్రయాణికులకు మెరుగైన వసతి కల్పించాలనే ఉద్దేశంతోనే హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించారన్నారు. కోచ్‌లను జీపీఎస్ (గ్లోబుల్ పొజిషన్ సిస్టం) బేస్డ్ ప్యాసింజర్ పద్ధతిన నిర్మించినట్టు చెప్పారు. ప్రయాణ సమయంలో ముందస్తు రైల్వేస్టేషన్ వివరాలు, ప్రయాణ దూరం తెలియజేస్తూ ఆటోమెటిక్ డిస్ప్లే అవుతుందన్నారు. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కావడంతో వేగాన్ని పరిశీలించడానికి ట్రయల్ రన్ నిర్వహించినట్లు చెప్పారు. ట్రయల్ రన్లో డివిజనల్ అధికారులు, సీనియర్ డీఓఎం ఆంజినేయులు, సీనియర్ డీఈఈ (మెయింటెనెన్స్) అంజయ్య, సీనియర్ డీఈఈ (టీఆర్డీ) విజయేంద్రకుమార్, సీనియర్ డీఈఎన్ (కోఆర్డినేషన్) మనోజ్‌కుమార్, ఏసీఎంలు రాజేంద్రప్రసాద్, ఫణికుమార్, స్టేషన్ మాస్టర్ లక్ష్మానాయక్, సీటీఐ వై ప్రసాద్, సీఎంఎస్‌లు ఫజుల్ రహిమాన్, ఖాదర్‌భాషా పాల్గొన్నారు. ‘హంసఫర్’ ప్రత్యేకతలు - రైలులో 18 త్రీటైర్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ప్రతి కోచ్‌లోనూ 6 సీసీ కెమెరాలు, కోచ్ ప్రధాన ద్వారం రెండు వైపులా 2 చొప్పున సీసీ కెమెరాలు ఉంటాయి. - అగ్ని ప్రమాదాలు, సాంకేతిక లోపాల కారణంగా పొగలు తదితరాలు ఏర్పడితే ఆటోమెటిక్ అలారం మోగుతుంది. ప్రమాదం జరిగిన ప్రదేశం అలారం యంత్రంలో డిస్ప్లే అవుతుంది. - బోగీలో సీటు సీటుకు ప్రత్యేక కర్టెన్ - అత్యాధునిక పరికరాలతో ఆకర్షణీయ రంగులతో ప్రత్యేక మరుగుదొడ్లు - బాత్రూంలో కూడా అందుబాటులో సెల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు - బోగీ నుంచి బోగీకి మధ్య ఆటోమెటిక్ డోర్ కంట్రోల్ సిస్టం - హాట్కేస్ భోజన, అల్పాహార సదుపాయం - ఆటోమేటిక్ వెడ్డింగ్ మిషన్ ద్వారా టీ, కాఫీ, పాలు ఇతర తేనీటి విందు ఏర్పాటు - హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలు ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీల కంటే 20 శాతం అదనం -
వివాహిత అనుమానాస్పద మృతి
- భర్తే చంపాడంటూ మృతురాలి బంధువుల ఆరోపణ - నిందితుని ఇంటి ముందు ఆందోళన గుంతకల్లు : గుంతకల్లు సత్యనారాయణపేటలో నివాసముంటున్న ట్రక్కు డ్రైవర్ నారాయణ భార్య లింగమ్మ(36) అనుమానాస్పదస్థితిలో బుధవారం మరణించినట్లు కసాపురం పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం కుందనకుర్తికి చెందిన లింగమ్మ వివాహం గుంతకల్లుఓని బర్మశాలలో నివాసముంటున్న నారాయణతో కొన్నేళ్ల కిందట అయింది. తమ తాహతుకు తగ్గట్టు కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశామని లింగమ్మ సోదరుడు రాజేశకర్ తెలిపారు. కొన్నాళ్ల పాటు వారి సంసారం సాఫీ గానే సాగింది. వీరికి కొడుకు, కుమార్తె కూడా కలిగారు. ఆ తరువాత తాగుడు, జూదానికి అలవాటుపడిన నారాయణ, తన సోదరుడు శ్రీరాములు, ఆడపడుచులు శకుంతల, రత్నతో కలసి పుట్టింటికి వెళ్లి డబ్బు తేవాలంటూ లింగమ్మను వేధిస్తుండేవారని ఆరోపించారు. దీంతో రెండేళ్ల కిందట అప్పు చేసి అదనంగా మరో రూ.50 వేలు ఇచ్చామన్నారు. రెండు నెలల కిందట ఇంకో రూ.20 వేలు ముట్టజెప్పానని రాజశేఖర్ తెలిపారు. అయినా తమ చెల్లి లింగమ్మను నిత్యం కొడుతుండేవాడని ఆరోపించారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా.. నారాయణ వేధింపులు తాళలేక కసాపురం పోలీసులను మంగళవారం ఆశ్రయించినట్లు రాజశేఖర్ తెలిపారు. పోలీసులు అతన్ని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారన్నారు. అయితే బుధవారం లింగమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందంటూ తమకు ఫోన్ వచ్చిందని రాజశేఖర్ కన్నీటిపర్యంతమయ్యారు. తన చెల్లిని భర్త నారాయణ, అతని కుటుంబ సభ్యులే కొట్టి చంపారని ఆయన ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే కొట్టి చంపారని ఆయన వాపోయారు. ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించే క్రమంలో లింగమ్మ నోట్లో పురుగుల మదు పోసారని నాటకాలాడుతున్నట్లు ఆరోపించారు. బంధువుల ఆందోళన లింగమ్మను హతమార్చిన ఆమ భర్త నారాయణ, అతని కుటుంబ సభ్యులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ఎవరూ ముందుకు రాలేదు. ఆస్పత్రి ఎదుటే తమ ఆందోళనను కొనసాగించారు. నిందితులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. -
21న గుంతకల్లులో మెగా జాబ్‌మేళా
గుంతకల్లు టౌన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళాను ఉంటుందని ఏపీఎస్ఎస్డీసీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ టీహెచ్.విన్సెంట్, స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాకు టెక్ మహేంద్ర, ఎల్అండ్టీ, హెటెరో డ్రగ్స్, వినూత్న ఫర్టిలైజర్స్, పొలారిస్, ఫ్లిప్‌కార్ట్, ఇంటలెంట్ గ్లోబల్ సర్వీసెస్, డేటావిండ్, అపోలో, కార్వెల్లో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. పదోతరగతి పాస్ లేదా ఫెయిల్‌తో పాటు ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. వివరాలకు సెల్: 90599 38727, 81434 20834, 98859 43819లో సంప్రదించాలన్నారు. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుంతకల్లు రూరల్ : లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో భాగంగా మండలంలోని గుర్రబ్బాడు గ్రామంలో రెండు రోజుల పాటు హోరాహోరీగా సాగిన రాష్ట్ర స్థాయి రాతిదూలం లాగుడు పోటీలు శుక్రవారం ముగిశాయి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి దాదాపు 33 జతల వృషభాలు పాల్గొన్న ఈ పోటీల్లో గుత్తి మండలం బేతాపల్లికి చెందిన రైతు ఓబులపతి వృషభాలు నిర్ణీత సమయంలో 5,523 అడుగుల దూరం రాతి దూలాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.30 వేల ఫ్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా ఆత్మకూరు మండలం, రంగం పేట గ్రామానికి చెందిన రైతు అంకిరెడ్డి వెంకట్రామిరెడ్డి వృషభాలు రెండవ స్థానం, గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామానికి చెందిన ఆముదాల వెంకట్రాముడు వృషభాలు మూడో స్థానం, కర్నూలు జిల్లా , ప్యాపిలి మండలం, జక్కసానిగుంట్ల కుచెందిన రైతు నాగేశ్వరయ్య వృషభాలు నాలుగో స్థానం, గంజికుంటకు చెందిన బైరెడ్డి అనిమిరెడ్డి వృషభాలు, కర్నూలు జిల్లా మామిల్లపల్లికి చెందిన చెక్కా శ్రీనివాసులు వృషభాలు సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాయి. గుత్తి గేట్స్ కళాశాల కరస్పాండెంట్ సుధీర్ రెడ్డి సౌజన్యంతో విజేతలకు వరుసగా రూ.25,000, రూ.20,000, రూ.15,000, రూ.10,000, రూ.5000 అందజేశారు. -
మొగుడు, పెళ్లాం కొట్లాట లాంటిది
– గుంతకల్లు మునిసిపల్ చైర్పర్సన్, కమిషనర్ వివాదంపై ఎంపీ జేసీ వ్యాఖ్య గుంతకల్లు టౌన్ : ‘మొగుడు, పెళ్లాం కొట్లాటలో ఎవరైనా పంచాయితీ చేస్తారేమయ్యా?! ఇది కూడా అలాంటిదే. కొట్లాట వచ్చిన దానికి కారణం లేదు. పోయేదానికీ మన ప్రమేయం అవసరం లేద’ని గుంతకల్లు మునిసిపల్ చైర్పర్సన్, కమిషనర్ల మధ్య వివాదంపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన మునిసిపల్ చైర్పర్సన్ చాంబర్లో చైర్పర్సన్ అపర్ణ, కమిషనర్ సత్యనారాయణ మధ్య తలెత్తిన వివాదంపై పంచాయితీ చేశారు. సర్దుకుపోవాలని ఇద్దరికీ సూచించారు.స్థానిక ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కూడా హాజరయ్యారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. -
గుంతకల్లు కమిషనర్ పై దాడి కేసు
-
గుంతకల్లులో టీడీపీ గూండాగిరీ
-
దేవుడు కనిపిస్తాడు..!
- గుంతకల్లు- తిరుపతి ప్యాసింజర్‌లో ప్రయాణికుల పాట్లు - బోగీల్లో కిటకిట - నిలబడేందుకూ చోటు ఉండదు - చార్జీ తక్కువ.. అవస్థలు ఎక్కువ - బోగీల సంఖ్యను పెంచని అధికారులు గుంతకల్లు : గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్లే (నెం. 57478/77) ప్యాసింజర్ రైలు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనార్థం వెళ్తే భక్తులకు ఈ రైలు అనుకూలం. గుంతకల్లు నుంచి తిరుపతికి ఎక్స్‌ప్రెస్ బస్సులో వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.450 . రైలులో సాధారణ టిక్కెట్ రూ.70లు, రిజర్వేషన్ టిక్కెట్ రూ.150. దీంతో రైలుకు ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఇటీవల రాయదుర్గం–కళ్యాణదుర్గం రైలు మార్గం పూర్తి కావడంతో ఈ రైలును కళ్యాణదుర్గం రైల్వేస్టేషన్ వరకు పొడిగించారు. ఒక్కసారిగా వెయిటింగ్ లిస్టులు పెరిగాయి. ముందస్తు బుకింగ్‌లకు వందల్లో వెయిటింగ్ లిస్టు చూపుతుంది. ఈ రైలుకు కేవలం 2 స్లీపర్, మరో 10 జనరల్ బోగీలున్నాయి. బళ్లారి ప్రాంత వాసులు అధిక శాతం తిరుపతికి బుక్ చేసుకుంటున్నారు. తగినన్ని జనరల్ , రిజర్వేషన్ బోగీలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ బోగీలో 80 నుంచి 90 మంది మాత్రమే ప్రయాణించేందుఉ వీలుగా ఉంటుంది. అయితే ఒక్కో జనరల్ బోగీలో 130 నుంచి 150 మంది దాకా ప్రయాణించాల్సి వస్తోంది. శుక్ర, శనివారం, సెలవు రోజుల్లో బోగీలో ప్రయాణికుల సంఖ్య కాస్తా 200 చేరుకుంటోంది. నిలబడేందుకు కూడా చోటు ఉండదని ప్రయాణికులు వాపోతున్నారు. కొందరు మరుగుదొడ్లలో నిలబడి ప్రయాణించాల్సిన దుస్థితి. సాధారణంగా ఒక రైలింజన్ 17 నుంచి 19 బోగీల వరకు లాగుతుంది. ఈ రైలుకు కేవలం 12 బోగీలు మాత్రమే అటాచ్ చేశారు. గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం ప్రయాణికుల కోసం గుంతకల్లు నుంచి మరో 3 స్లీపర్ బోగీలు, 2 సాధారణ బోగీలు జతపరచాలని ప్రయాణికులు కోరుతున్నారు. రిజర్వేషన్ బోగీలు పెంచాలి : – వెంకటేష్, ప్రయాణికుడు గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలుకు అదనంగా రిజర్వేషన్ బోగీలు ఏర్పాటు చేయాలి. ఈ రైలును కళ్యాణదుర్గం వరకు పొడిగించడంతో గుంతకల్లు ప్రయాణికులకు రిజర్వేషన్ దొరకడం లేదు. గుంతకల్లు నుంచి అదనంగా రిజర్వేషన్ బోగీలు ఏర్పాటు చేయాలి. ------- నిలబడేందుకూ చోటు ఉండదు ప్రతి రోజూ రైలు రద్దీగా ఉంటుంది. శుక్ర, శనిఽవారం బోగీలో నిలబడేందుకు కూడా చోటు ఉండదు. సాధారణ బోగీలు తక్కువ ఉండడంతోనే ఈ పరిస్థితి. మరిన్ని బోగీలు పెంచితే ప్రయాణికులకు సౌకర్యం, సంస్థకు ఆదాయం ఉంటుంది. -మస్తానయ్య, ప్రయాణికుడు -
అనంతలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
-
వీడిన హత్యకేసు మిస్టరీ
బావమరిది ప్రాణం తీసిన బావ అప్పు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి చేసినందుకే.. నిందితుడిని అరెస్ట్ చేసిన గుత్తి పోలీసులు గుత్తి (గుంతకల్లు) : జనవరి 29న గుత్తి శివారులో హత్యకు గురైన యుగంధర్‌గౌడ్ (23) మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్నేహితుడు, వరుసకు బావ అయిన వ్యక్తి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. అప్పు తిరిగి చెల్లించాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడం వల్లే చంపేవానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను గుత్తి సీఐ మధుసూదన్‌గౌడ్ సోమవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన యుగంధర్‌గౌడ్ కర్నూలు జిల్లా పాణ్యంలోని ఒక మద్యం షాపులో పనిచేస్తుండేవాడు. ఇతనికి అదే జిల్లాలోని ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన ఈడిగ రాముడుతో పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహబంధం పెరిగింది. ఆ తర్వాత యుగంధర్‌గౌడ్ పెద్దనాన్న కుమార్తెను రాముడు వివాహం చేసుకున్నాడు. దీంతో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో యుగంధర్‌గౌడ్ నుంచి రాముడు రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు అప్పు తిరిగి చెల్లించాలంటూ యుగంధర్‌గౌడ్ ఒత్తిడి చేశాడు. తరచూ డబ్బు గురించి అడుగుతుండటంతో ఎలాగైనా అతడిని చంపేయాలని రాముడు నిర్ణయించుకున్నాడు. హత్య ఇలా జరిగింది.. జనవరి 29న రాత్రి ఏడు గంటల సమయంలో కోడుమూరులో రాముడును తన బైక్‌లో ఎక్కించుకుని యుగంధర్‌గౌడ్ స్వగ్రామం పెద్దొడ్డికి బయలుదేరాడు. గుత్తికి రాత్రి 9.30 గంటల సమయంలో చేరుకున్నారు. అక్కడ కొంత సేపు ఆగి పెద్దొడ్డికి పయనమయ్యాడు. అయితే పెద్దొడ్డి మార్గం (నాగసముద్రం) క్రాస్ వద్ద మూత్ర విసర్జన కోసం రాముడు బైక్‌ను ఆపించాడు. తిరిగి బైక్ ఎక్కే సమయంలో వెనుక నుంచి బలమైన రాయి తీసుకుని తలపై మోదాడు. కిందపడ్డ యుగంధర్‌గౌడ్‌ను కొంతదూరం చేనులోకి లాక్కెళ్లి గొంతు నులిమాడు. అయినా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుడటంతో వెంట తెచ్చుకున్న కత్తితో తలపై, పొట్టలో ఇష్టానుసారం పొడిచాడు. గిలగిలా కొట్టుకుంటూ యుగంధర్‌గౌడ్ ప్రాణం విడిచాడు. నిందితుడు అలా పారిపోయాడు.. హత్య చేసిన అనంతరం రాముడు గుంతకల్లుకు పారిపోయాడు. అక్కడి నుంచి బెంగుళూరుకు వెళ్లి అక్కడ అర గంట మాత్రమే ఉండి తిరిగి మరో రైలు ఎక్కి గుత్తికి వచ్చాడు. 30వ తేదీ హత్య సంఘటన వెలుగు చూసింది. ఎవరు చంపారనేది మిస్టరీగా మారింది. పోలీసులు విభిన్న కోణాలో విచారణ చేపట్టారు. మృతదేహాన్ని చూడటానికి గానీ, అంత్యక్రియలకు గానీ రాముడు రాలేదు. యుగంధర్ గౌడ్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే రాముడు ఎందుకు రాలేదనే అనుమానం పోలీసులు తట్టింది. రాముడే హత్య చేసి ఉంటాడని నిర్దారించుకున్నారు. ఎలా పట్టుబడ్డాడంటే.. రాముడు ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. చివరకు సోమవారం సేవాఘడ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించారు. డబ్బు కోసం తానే తన బావమరిదిని హత్య చేశానని రాముడు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని కోర్టులో హాజరు పరచగా.. మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, సుధాకర్, ఏఎస్ఐలు ప్రకాష్, ప్రభుదాస్, ఐడీ పార్టీ పీసీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా అనంత ప్రీమియర్ లీగ్
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అనంత క్రీడా మైదానం, గుంతకల్లులోని రైల్వే క్రికెట్ మైదానంలో ఆదివారం నిర్వహించిన అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగాయి. అనంత క్రీడా మైదానంలో నార్పల జట్టుతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అనంత స్పోర్ట్స్ అకాడమీ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జట్టులో జాన్ మైఖేల్ (89), రాఘవేంద్ర (69), మహేంద్రరెడ్డి (71) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్పల జట్టు 31.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. అనంత బౌలర్లలో భార్గవ్ 4, నవీన్ 2 వికెట్లు పడగొట్టారు. గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో గుంతకల్లు మండల క్రికెట్ అకాడమీ, గుంతకల్లు క్రికెట్ అకాడమీ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన గుంతకల్లు క్రికెట్ అకాడమీ జట్టు 40 ఓవర్లలో 213 పరుగులు చేసింది. జట్టులో ఆసిమ్ సెంచరీతో కదం తొక్కాడు. గుంతకల్లు మండల క్రికెట్ అకాడమీ జట్టు క్రీడాకారుడు మనోజ్ 6 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుంతకల్లు మండల క్రికెట్ అకాడమీ జట్టు 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జట్టులో అభిషేక్ 52, రియాజ్ 46 పరుగులు సాధించారు. -
టీడీపీ కౌన్సిలర్ల దౌర్జన్యం
– కౌన్సిల్‌మీట్‌లో ఇరువర్గాల మధ్య తోపులాట – పింఛన్ల మంజూరులో వివక్షపై ప్రతిపక్ష కౌన్సిలర్ల నిరసన గుంతకల్లు టౌన్ : గుంతకల్లులో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ కోడెల అపర్ణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రణరంగమైంది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కాకుండా జన్మభూమి కమిటీలు సూచించిన వారికే పింఛన్లు మంజూరు చేయడం పట్ల నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై పలువురు టీడీపీ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ప్రవర్తించారు. సమావేశంలో కౌన్సిలర్ల సమస్యలేవి వినకుండా అజెండాను చదవమని చైర్పర్సన్ ఆదేశించారు. ఫ్లోర్‌లీడర్ ఫ్లయింగ్‌మాబు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అహ్మద్‌బాషా, గోపి, పోలేపల్లి మధు, రంగన్న, నగేష్, కెవి.నాగరత్న, ఏపీ.శ్రీవిద్య, బీటీ.లక్ష్మిదేవి, మస్తానమ్మలు లేచి పింఛన్ల మంజూరులో జన్మభూమి కమిటీల పెత్తనమేంటని చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. అంతలోనే వైస్‌చైర్మన్ శ్రీనాథ్‌గౌడ్ అజెండాలోని అంశాలన్నింటినీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ చైర్పర్సన్ పోడియంను ప్రతిపక్ష కౌన్సిలర్లు చుట్టుముట్టారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు ప్రతిపక్ష కౌన్సిలర్లను పక్కకు నెట్టేసి బయటకెళ్లేందుకు యత్నించారు. తమకు సమాధానం చెప్పేంతవరకు బయటకెళ్లొదని కౌన్సిల్‌హాల్ ఎంట్రెన్స్‌లో నిల్చున్న ప్రతిపక్ష కౌన్సిలర్లపై దురుసుగా ప్రవర్తించి ఈడ్చేశారు. మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణతో పాటు ఇతర అధికారులంతా ప్రేక్షకపాత్రను పోషించారు. చివరకు అజెండాలోని అంశాలపై కూడా చర్చించకుండానే ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నట్లు ప్రకటించడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అందరికీ సమానంగా మంజూరు చేశాం : మొత్తం 1,250 మందికి గానూ 700 పింఛన్లు మంజూరయ్యాయని, అన్నివార్డులకు సమానంగా పింఛన్లు మంజూరు చేశామని చైర్పర్సన్ కోడెల అపర్ణ, వైస్‌చైర్మన్ శ్రీనాథ్గౌడ్లు తెలిపారు. సీపీ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ పార్టీ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ప్రవర్తించలేదని, అనవసరమైన ఆరోపణలు చేయడం మాని, పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. -
డ్రైవర్ ఇంట్లో చోరీ
గుంతకల్లు టౌన్ : పట్టణంలోని భాగ్యనగర్ ఎస్జేపీ హైస్కూల్ వద్ద నివాసముంటున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ షేక్ అబ్దుల్కరీమ్ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపు గడియను తొలగించి బెడ్రూమ్లోని బీరువాలో దాచిన 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలు గుచూసింది. అబ్దుల్ కరీమ్ కుటుంబసభ్యులు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి.. వెనుకవైపున ఉన్న మరో ఇంట్లో నిద్రించారు. ఆదివారం ఉదయం తలుపులు తెరిచి చూడగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి లబోదిబోమన్నాడు. వన్‌టౌన్ ఎస్ఐ–2 శ్రీరాములు, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే బాధితుడి నుంచి ఇంకా రాతపూర్వక ఫిర్యాదు అందలేని తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
గుంతకల్లు : ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని గుంతకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం టూటౌన్ పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ పి.ప్రసాద్‌రావు, టూటౌన్ ఎస్ఐ వలిబాషా వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ, గుంతకల్లు డీఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచామన్నారు. శుక్రవారం స్థానిక టీవీ టవర్ వద్ద పాత నేరస్తులు కురుబ నాగరాజు, అన్వర్‌బాషా (గుంతకల్లు) అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతుండగా కానిస్టేబుల్ కే.శ్రీనివాసులు అందించిన సమాచారంతో వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించగా అంతర్రాష్ట్ర దొంగలుగా తేలిందన్నారు. వీరి నుంచి రూ.3.50 లక్షల విలువైన 3 కిలోల వెండి, 6 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్ఐలు యూ.శ్రీనివాసులు, తిరుపాల్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక పోలీసుల దాష్టీకం
- ఒకరికి బదుల మరొకర్ని చితకబాదిన వైనం - ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన ---------------------------------------------------- గుంతకల్లు : విచారణ పేరుతో ఒకరికి బదుల మరొకర్ని చితకబాదిన కర్ణాటక పోలీసుల దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు అనంతపురం జిల్లా గుంతకల్లు శివార్లలోని ఆలూరు రోడ్డు కాల్వగడ్డ ఏరియాలో నివాసముంటున్న షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి తాపీ మేస్త్రీ కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక పాతబస్టాండ్ ఏరియాలోని మెకానిక్ షెడ్డులో బైక్‌ను రిపేరి చేయించుకుంటుండగా అదే సమయంలో టాటాసుమోలో వచ్చిన కర్ణాటక రాష్ట్రం బళ్లారి కౌల్‌బజార్ ఠాణా పోలీసులు ‘అబ్దుల్లా అంటే నువ్వేనా’ అని అడిగారు. ఔనని సమాధానం చెప్పేలోగానే లాఠీలతో చితకబాదేశారు. ‘నన్ను ఎందుకు కొడుతున్నారని’ అతను అడుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఏకంగా అతని చేతికి సంకెళ్లు వేసి తమ వెంట పట్టణ శివార్లలోని బళ్లారి చౌరస్తాలోకి పిల్చుకెళ్లారు. ఆ తరువాత అబ్ధుల్లాను సెల్‌ఫోన్ కెమెరాలో బంధిచి వాట్సప్ ద్వారా బళ్లారి కౌల్‌బజార్ పోలీసుస్టేషన్‌కు నిర్ధరణ కోసం పంపగా... అసలు వ్యక్తి అతను కాదని అక్కడి నుంచి సమాధానం రావడంతో వదిలేశారు. తన వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కొని సిమ్‌కార్డు(నెంబర్: 8341085352) తీసుకువెళ్లారని బాధితుడు ఆరోపించాడు. గుంతకల్లు మండలం నరసాపురం కొట్టాలలో నివాసముంటున్న అబ్ధుల్లా అనే వ్యక్తి(అంత్రాలు వేస్తూ జీవించేవాడు)పై బళ్లారి కౌల్‌బజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు కావడంతో అతని కోసం వచ్చి తనను తీసుకువెళ్లి చితకబాదారని తాపీ మేస్త్రీ అబ్ధుల్లా బోరుమన్నాడు. తల, వీపు, ముఖంపై బలంగా పిడిగుద్దలు కురిపించారని కన్నీటిపర్యంతమయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై గుంతకల్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు అబ్ధుల్లా విలేకరులకు గురువారం తెలిపారు. -
క్రీడలతో మానసికోల్లాసం
గుంతకల్లు : ఉద్యోగులు మానసిక ఒత్తిడులను తగ్గించడానికి క్రీడలు దోహదం చేస్తాయని వక్తలు అన్నారు. రైల్వే మజ్దూర్ యూనియన్, దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో బుధవారం ఇంటర్ డిపార్టుమెంటల్ క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ అమితాబ్‌ఓజా, ఏడీఆర్ఎం కేవీ.సుబ్బరాయుడు, సీనియర్ డీఎఫ్ఎం (స్పోర్ట్స్ ఆఫీసర్) చంద్రశేఖర్‌బాబు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి తోడ్పడతాయన్నారు. పురుషులు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్ విభాగాల్లో. మహిళా ఉద్యోగులకు త్రోబాల్, టెన్నికాయిట్, క్యారమ్స్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. డీఆర్ఎం బ్యాటింగ్ చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. మజ్దూర్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన జట్లకు ఓవరాల్ చాంపియన్‌షిప్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సీనియర్ డీసీఎం రాకేష్, సీనియర్ డీఓఎం ఆంజినేయులు, సీనియర్ డీఎంఈ డీజిల్ గోపాల్, మజ్దూర్ యూనియన్ నాయకులు ప్రకాష్‌బాబు, మస్తాన్‌వలి, బాలాజీసింగ్, పరదేశి విజయ్‌కుమార్, జాఫర్‌ఖాన్, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. మొదటిరోజు విజేతలు... స్థానిక రైల్వే క్రీడా మైదానంలో ఇంటర్ డిపార్టుమెంటల్ క్రికెట్ పోటీల్లో మెడికల్ జట్టు, పర్సనల్ విభాగం జట్టులు గెలిచాయి. ఉదయం జరిగిన పూల్–ఏ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పర్సనల్ జట్టు నిర్ణీత ఓవర్లలో 99 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెడికల్ జట్టు 100 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. మధ్యాహ్నం జరిగిన పూల్–బీ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రన్నింగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించగా ఈ విజయ లక్ష్యాన్ని ఆపరేటింగ్ జట్టు 17.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి (160 పరుగులు సాధించి) జయకేతనం ఎగురవేసింది. -
సా మిల్లులో అగ్నిప్రమాదం
గుంతకల్లు టౌన్ : స్థానిక హనుమాన్ సర్కిల్లోని శ్రీలక్ష్మీ గణేశ్వర సా మిల్లు(రంపపు మిల్లు)లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో వేప, తుమ్మ తదితర రకాల కలప, పలు యంత్రాలు కాలిబూడిదయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే గమనించిన కొందరు వాటిని ఆర్పివేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే రూ.1.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫైర్ ఆఫీసర్ యోగేశ్వరరెడ్డి తెలిపారు. -
కృత్రిమ కాళ్లు, చేతుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
గుంతకల్లు టౌన్: భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయనున్న కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్ కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని అమృత వర్షిణి బాల కళ్యాణ ఆశ్రమం (అనాథ శరణాలయం) కార్యదర్శి కె.లింగప్ప, క్యాంప్ ఆర్గనైజర్లు ఇల్లూరు లక్ష్మినారాయణ, డాక్టర్ రామ్మూర్తి కోరారు. శరణాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. జైపూర్ కంపెనీ కంటే నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్‌ను ఉచితంగా అందజేస్తామన్నారు. అవసరమైన వారు ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటలకు శరణాలయంలో హాజరైతే కొలతలు తీసుకుంటారని చెప్పారు. జనవరి 12న కృత్రిమ అవయవాలను అందజేస్తామన్నారు. ఇతర వివరాల కోసం తిలక్‌నగర్‌లోని అనాథ శరణాలయం లేదా ఇల్లూరు లక్ష్మినారాయణ భవన్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. శరణాలయం కమిటీ సహాయ కార్యదర్శి గిరిధర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
అయ్యో పాపం!
గుంతకల్లు టౌన్ / అనంతపురం సిటీ: వారిప్పుడే ఈ లోకంలోకి వచ్చారు. భావవ్యక్తీకరణకు భాష తెలియని అమాయకులు. కుటుంబ సభ్యులకు ఏ కష్టమొచ్చిందో గానీ అభం శుభం తెలియని ఆ శిశువులను బయట పడేశారు. ఒక శిశువు సజీవంగా లభ్యమైతే, మరొక శిశువు చనిపోయి ఉంది. అయ్యో పాపం అన్పించే ఈ ఘటనలు సోమవారం అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల వెలుగు చూశాయి. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణ శివారులోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ పంప్‌హౌస్ ఎదురుగా ఉన్న ముళ్లపొదల్లో నుంచి పసికందు ఏడ్పును అక్కడికెళ్లిన ముగ్గురు బాలురు భరత్, రాజశేఖర్, రాజు విన్నారు. వెళ్లి చూడగా పసికందును ఓ టవల్లో చుట్టి పడేసి ఉండడం కన్పించింది. తలపైభాగంలో చీమలు కరిచి చిన్న గాయాలయ్యాయి. వెంటనే వారు 100కి డయల్ చేశారు. గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఆడశిశువును 1098 చైల్డ్‌లైన్ సంస్థ మండల కోఆర్డినేటర్ బాలాజీకి అప్పగించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పసికందును పరీక్షించిన చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ హరిప్రసాద్ ఆ పసికందుకు పుట్టుకతోనే మలవిసర్జన ప్రాంతంలో రంధ్రం లేదని, వెంటనే చిన్నపిల్లల సర్జన్‌తో ఆపరేషన్ చేయించాల్సి ఉంటుందని తెలిపారు. తర్వాత అక్కడి నుంచి అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. శిశువు బొడ్డుకున్న క్లిప్‌ను చూస్తే ఎక్కడో హాస్పిటల్లోనే జన్మించినట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం సర్వజనాస్పత్రి గైనిక్ వార్డు సమీపంలోని నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న క్యారీ బ్యాగులో మృత మగశిశువు లభ్యమైంది. ఈ విషయాన్ని రోగుల బంధువులు గమనించి ఔట్‌పోస్ట్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత శిశువును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మృత శిశువు లభించిన ప్రాంతంలో గుర్తుతెలియని మహిళకు కాన్పు చేసినట్లు తెలుస్తోంది. -
జిల్లా స్థాయి క్రికెట్ విజేత గుంతకల్లు
ఉరవకొండ : స్థానిక మహాత్మ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంటర్ క్రికెట్ పోటీల్లో భాగంగా బుధవారం గుంతకల్లు, ఉరవకొండ మహత్మ కళాశాల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. జిల్లావ్యాప్తంగా 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నిలో విజేతగా గుంతకల్లు నిలిచింది. ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఉరవకొండ మహాత్మ జట్టు నిర్ణీత 15 ఓవర్లకు 94 పరుగులు చేసింది. ఈ మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుంతకల్లు జట్టు 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిచింది. ఈ సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవ వేడుకల్లో గవిమఠం ఉత్తరాధికారి శ్రీకరిబసవరాజేంద్ర స్వామి హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించినపుడే, భవిష్యత్‌లో క్రీడలతో పాటు జీవితంలో కూడా రాణిస్తారని చెప్పారు. కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు కెకె ప్రసాద్, మహాత్మ విద్యాసంస్థల గౌరవ సలహదారులు షాషావలి, డైరెక్టర్ గౌస్‌మోదీన్, ప్రిన్సిపాళ్లు బసవరాజు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
గుంతకల్లు: స్థానిక హనుమాన్ సర్కిల్ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాంగ్‌మెన్ సమాచారంతో జీఆర్పీ పోసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉండవచ్చని, చామన ఛాయ రంగు కల్గి ఉన్నాడని, గ్రీన్ కలర్ లైన్ చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. చేతిపై పచ్చబొట్టుతో చరణ్ అను పేరు ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. -
గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి
– రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన అనంతపురం ఎడ్యుకేషన్ : గుంతకల్లును రైల్వే జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సమాఖ్య, రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా బయలుదేరి టవర్‌క్లాక్ మీదుగా రైల్వేస్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ జోన్‌కు గుంతకల్లు అన్ని విధాలా అనుకూలం అన్నారు. అలాగే అనంతపురం రైల్వే స్టేషనల్లో అన్ని రైళ్లూ ఆపాలన్నారు. సామాన్యులకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం స్టేషన్ మాస్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి కన్వీనర్ వై.రాజశేఖర్‌రెడ్డి, విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు ఎస్.సీమకృష్ణ, నాయకులు భార్గవ, కుమార్‌నాయక్, భగ్గీ, రవినాయక్, మల్లికార్జున, శ్రీనివాస్, హరికృష్ణ పాల్గొన్నారు. -
పెళ్లింట విషాదం
వరుడు ఆత్మహత్య ఐదు రోజుల్లో పెళ్లికి ఏర్పాట్లు లక్ష్మీపూజకు బంధువుల గైర్హాజరు మనస్తాపంతో ఉరి వేసుకుని అఘాయిత్యం గుంతకల్లు టౌన్ : మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీపూజకు బంధువులు రాలేదని మనస్తాపానికి గురై వరుడు వీరేష్‌కుమార్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంతకల్లు పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడి తల్లి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజీవ్ కాలనీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు, విజయగౌరీ దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడైన వీరేష్‌కుమార్ క్రికెటర్. ఇతను కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా గిన్నిగెర అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే తన తండ్రి శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందడంతో వీరేష్ ఆ కుటుంబానికి పెద్దదిక్కయ్యాడు. 23, 24 తేదీల్లో పెళ్లి.. వీరేష్‌కు కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన జ్యోతితో వివాహం కుదిరింది. ఈ నెల 23, 24 తేదీల్లో గుంతకల్లు ఆర్అండ్బీ సర్కిల్లో గల తమిళ సంఘం ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు. పెళ్లివేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం గురువారం రాత్రి తన ఇంట్లో లక్ష్మీపూజ నిర్వహించారు. ఈ పూజకు తన బంధువులెవ్వరూ హాజరుకాలేదు. ఈ విషయమై శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగుతూ సొంత బంధువులెవ్వరూ పూజకు రాకపోతే ఎలా అని తల్లి, చెల్లెతో చెబుతూ తీవ్ర మనస్తాపం చెందాడు. కొద్దిక్షణాలకే బెడ్రూమ్లోకి వెళ్లిన వీరేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మాధ్యంలో చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు కేసు నమోదు చేసుకున్నారు. -
ట్రాక్టర్ కింద పడి యువకుడి మృతి
గుంతకల్లు రూరల్: కుటుంబ పోషణలో తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచిన కుమారుడు తండ్రి కళ్లముందే ట్రాక్టర్ కింద పడి మృతిచెందిన ఘటన సోమవారం మండలంలోని మొలకలపెంట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఘటనలో రాయలచెరువు కు చెందిన రామాంజనేయులు(18) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. రాయల చెరువుకు చెందిన కిష్టప్ప ఫైనాన్స్‌లో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి బాడుగలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కిష్టప్ప పెద్దకుమారుడు రామాంజనేయులు ఎనిమిదో తరగతితో చదువు మానేసి తండ్రితో పాటు ట్రాక్టర్ పనులకు వెళ్లేవాడు. గుంతకల్లులో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి ఇసుకను తోలే క్రమంలో కిష్టప్ప, అతడి కుమారుడు రామాంజనేయులు ఇద్దరూ సోమవారం గుంతకల్లుకు వచ్చారు. సోమవారం సాయంత్రం ఇసుకను అన్లోడ్ చేసిన తండ్రీ కొడుకులు మొలకలపెంట, అమీన్‌పల్లి మీదుగా రాయలచెరువుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో మొలకలపెంట, అమీన్‌పల్లి గ్రామాల మధ్యలో ఉన్న గతుకుల రోడ్డు కారణంగా కుదుపులు ఏర్పడి డ్రైవింగ్ చేస్తున్న కిష్టప్ప పక్కనే కూర్చున్న రామాంజనేయులు అదుపు తప్పి కిందపడిపోయాడు. కొడుకు ట్రాక్టర్నుండి కిందకు పడిపోవడంతో కిష్టప్ప ట్రాక్టర్‌ను వదిలి కొడుకును కాపాడే ప్రయత్నంలో కిందకు దూకేశాడు. అదే సమయంలో ట్రాక్టర్ రామాంజనేయులు మీదుగా వెళ్లిపోవడంతో అతడు తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గాయపడిన యువకుడు రామాంజనేయులును 108 వాహనంలో గుంతకల్లు ప్రభుత్వ ఆసుçపత్రికి తరలించాగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కసాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లు
– సాఫ్ట్‌బాల్‌లో గుంతకల్లు.. క్రికెట్లో శ్రీసత్యసాయి జట్ల విజయం గుంతకల్లు టౌన్ : ఏడీజేసీఏఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడామైదానంలో మంగళవారం జరిగిన పలు క్రీడల ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. సాఫ్ట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీ సత్యసాయి(అనంతపురం) పై ప్రభుత్వ జూనియర్ కాలేజీ(గుంతకల్లు) జట్టు 4–2 రన్స్ తేడాతో విజయం సాధించింది. – క్రికెట్ ఫైనల్స్‌లో శ్రీసత్యసాయి(అనంతపురం), ప్రభుత్వ జూనియర్ కాలేజీ(గుంతకల్లు) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుంతకల్లు జట్టు నిర్ణీత 8 ఓవర్లలో కేవలం 36 పరుగులే చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీ సత్యసాయి జట్టులోని ఓపెనర్లు కేవలం 4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చారు. – షటిల్ ఫైనల్ మ్యాచ్‌లో ఎల్‌ఆర్‌జీ(హిందూపురం), శ్రీసత్యసాయి(అనంతపురం) జట్లు తలపడ్డాయి. ఇందులో ఎల్‌ఆర్‌జీ జట్టు విజయం సాధించి విన్నర్స్‌గా నిలిచింది. – బాల్‌బ్యాడ్మింటన్ ఫైనల్మ్యాచ్లో శ్రీసత్యసాయి(అనంతపురం) జట్టుపై కేఎస్ఆర్(అనంతపురం) జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. – హ్యాండ్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు అథ్లెటిక్స్ పోటీలు బుధవారం జరుగుతాయని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ఏడీజేసీసీ జిల్లా కార్యదర్శి నాగార్జున ప్రసాద్ తెలిపారు. -
చోరీ కేసులో దొంగ అరెస్ట్
కళ్యాణదుర్గం రూరల్ : గత ఆగస్ట్ 24న కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్‌లో నివాసముంటున్న టైలర్‌వరదరాజులు ఇంటిలో పట్టపగలు చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసిన్లు డీఎస్పీ అనిల్ పులపాటి చెప్పారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆదివారం సీఐ శివప్రసాద్, పట్టణ ఎస్ఐ శంకర్‌రెడ్డితో కలిసి డీఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంతకల్లు పట్టణంలోని గుత్తి రోడ్డులో కాలవ గడ్డ రోడ్డులో నివాసముంటున్న ఎరికల పెద్దనాగయ్య ఇంటికివేసిన తాళాన్ని పగులగొట్టి బీరువాలోని ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదును ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి ఆదివారం కళ్యాణదుర్గం పట్టణంలోని శెట్టూరు రోడ్డులోని బ్రహ్మయ్యగారి ఆలయం వద్ద దొంగను అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న రూ.1.40 లక్షల విలవ చేసే బంగారు నగలను స్వాధీనం చేసినట్లు చెప్పారు. సోమవారం నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. దొంగను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యహరించిన ఎస్‌ఐశంకర్‌రెడ్డి, ఏఎస్ఐ తులన్న, కానిస్టేబుల్స్ రామాంజినేయులు, శివలింగ, శివన్నలను అభినందించారు. -
దొంగల భీభత్సం
– గుంతకల్లులో ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దుండగులు – 14.5 తులాల బంగారు, 80 వేల నగదు అపహరణ – సీసీ ఫుటేజీ ఆధారంగా 7 మందిపై అనుమానం గుంతకల్లు టౌన్ : గుంతకల్లు పట్టణంలో శనివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హనుమేష్‌నగర్, గంగానగర్, అల్లీపీరా, ఇందిరా కాలనీల్లో తాళం వేసిన ఐదు ఇళ్లల్లో దుండగులు చోరీలకు తెగబడ్డారు. ఆయా ఇళ్లల్లో బీరువాల్లో ఉంచిన మొత్తం 14.5 తులాల బంగారు రూ.80 వేల నగదును దోచుకెళ్లారు. ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడు మందితో కూడిన దొంగల ముఠానే ఈ చోరీలకు పాల్పడి హల్చల్ చేసినట్లు సీసీ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా తెలిసింది. ఒకే రోజు ఐదు ఇళ్లల్లో దొంగతనాలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. . కానిస్టేబుల్ ఇంట్లో.. పట్టణంలోని అల్లీపీరా కాలనీకి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ జె.రమేష్‌కుమార్ ఇంట్లో 12 తులాల బంగారు, రూ.40 వేల నగదును దొంగలు దోచుకెళ్లినట్లు అతడి భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఇందిరా కాలనీలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు సురేష్ ఇంట్లో 15 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.30 వేలు నగదును ఎత్తుకెళ్లారు. అలాగే గంగానగర్‌లోని హైదర్ ఇంట్లో తులం బంగారు ఆభరణాలు, ఒక జత వెండి పట్టీలు, రూ.8 వేలు, మెకానిక్ వన్నూరప్ప ఇంట్లో రూ.2 వేలు, ఇరానీ ఫర్హా ఇంట్లో రూ.3 వేలను ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. చోరీలు జరిగిన ఇళ్లను ఎస్సై నగేష్‌బాబు సిబ్బందితో పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. సీసీ కెమెరాల్లో గుర్తింపు హనుమేష్నగర్లోని వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విజువల్స్ మేరకు మొత్తం ఏడుగురు దొంగల్లో ఒకరిద్దరు ముఖాలకు మాస్క్‌లు ధరించారు. చేతుల్లో రాడ్లు, కట్టర్లు పట్టుకుని ఉమర్ ఇంట్లో చొరబడ్డారు. కాగా వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అనుమానితుల్ని పోలీసులు విచారించారు. -
గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటించాలి
అనంతపురం రూరల్ : గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విమోచన సమితి, విద్యార్థి సమాఖ్య నాయకులు రాజశేఖర్‌రెడ్డి, కృష్ణానాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతవాసులే రాష్ట్రాన్ని పాలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. భౌగోళికంగా గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటిస్తే ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకూ అతితక్కువ సమయంలో వెళ్లగలిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని అప్పటి బ్రిటీష్ ఇంజనీర్లు సైతం ధృవీకరించారని గుర్తు చేశారు. అయినప్పటికీ పాలకులు తమ స్వార్థం కోసం విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం ప్రయత్నించడం అన్యాయమన్నారు. మన పాలకుల పుణ్యమా అని రాయలసీమ వాసులు అన్ని విధాలా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, కడప ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణారావు, నాగార్జున రెడ్డి, బండి నారాయణస్వామి, ఎస్కేయూ ప్రొఫెసర్ సదాశివారెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
హోరెత్తిన మస్తానయ్య నామస్మరణ
గుంతకల్లు : పట్టణంలోని పాతగుంతకల్లు ఏరియా మస్తానయ్య నామస్మరణతో హోరెత్తింది. పాతగుంతకల్లులో వెలసిన హజరత్ మస్తాన్‌వలి 381వ ఉరుసు ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం షంషీర్ ఊరేగింపు శుక్రవారం వైభవంగా సాగింది. ఆనవాయితీలో భాగంగా స్వామి వారి పూలరథాన్ని (షంషీర్)లాగే గుర్రాన్ని నాగసముద్రం నుంచి ఈడిగ వంశస్తులు గురువారం సాయంత్రం తీసుకొచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున షంషీర్‌ను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఊరేగింపుగా దర్గా నుంచి గణచారి రెడ్డి కులస్తుల ఇంటికి చేరుకుంది. సాజెదినాసేన్ (పూజారులు) ప్రత్యేక ప్రార్థనలు చేసి, అక్కడి నుంచి పట్టణంలోని పక్కీర్లవీధి, కుమ్మరకట్టవీధి, కచేరికట్ట, ఊరి వాకిలి మీదుగా దర్గాకు తిరిగి చేరుకుంది. అశేష భక్త జనంతో దర్గా పరిసరాలన్నీ పోటెత్తాయి. స్వామి వారి ఊరేగింపులో ఎండు కొబ్బరి కాల్పించడానికి భక్తులు ఎగబడ్డారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా పాతగుంతకల్లులోని ప్రతి ఇల్లూ బంధు మిత్రులతో కిటకిటలాడింది. -
వైభవంగా మస్తానయ్య గంధం
గుంతకల్లు : పట్టణంలోని పాతగుంతకల్లులో వెలసిన హజరత్ మస్తాన్‌వలి ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడురోజుల పాటు జరిగే మస్తాన్‌వలి (మస్తానయ్య) 381వ ఉరుసు మహోత్సవాల్లో భాగంగా గురువారం వేకువజామున స్వామివారి గంధ ఉత్సవం నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన గంధం పల్లెంను మేళతాళాల మధ్య ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. పాత గుంతకల్లులోని పక్కీర్లవీధి, కుమ్మరకట్టవీధి, కచేరికట్ట, ఊరివాకిలి మీదుగా దర్గా వరకు గంధం ఊరేగింపు సాగింది. దర్గా ముజావర్లు (మస్తానయ్య సమాధి) ప్రతి రూపాన్ని గంధంతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్ర నలుమూలల ఉంచి అశేష భక్తజనం విచ్చేయడంతో సందడి ఏర్పడింది. ఉత్సవం సందర్భంగా దర్గా ప్రాంగణం, పరిసరాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. -
డిసెంబర్ 11, 12 తేదీల్లో హనుమద్వ్రతం
నెల 31 నుంచి మండల దీక్షలు ప్రారంభం గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో డిసెంబర్ 11,12 తేదీల్లో హనుమద్వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. సోమవారం ఆలయంలో హనుమద్వ్రతం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈవో, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి హనుమద్ వ్రత మండల దీక్షలు , నవంబర్ 21 నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 11న స్వామివారి తిరుఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 12 న స్థానిక గంగా నిలయంలో హనుమద్ వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు వసుదరాజాచార్యులు, ఏఈవో మధు, సూపరింటెండెంట్ మల్లయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మతసామరస్యానికి ప్రతీక మస్తానయ్య ఉరుసు
రేపటి నుంచి ఉత్సవాలు గుంతకల్లు: పట్టణంలోని పాతగుంతకల్లులో వెలసిన హజరత్ సయ్యద్షాఅలీ అక్బర్ ఉరుఫ్ హజరత్ మస్తాన్‌వలి ఉరుసు హిందూముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మస్తాన్‌వలి దర్గా 381వ ఉరుసు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఏటా మొహర్రం పండుగ తర్వాత 15 రోజులకు ఉరుసు ప్రారంభిస్తారు. ఉత్సవాలకు దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. దర్గాకు రంగులు అద్దుతున్నారు. దర్గా ఆవరణంలో పలు రకాల బొమ్మల, మిఠాయి అంగళ్లు వెలిశాయి. మహోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు మస్తాన్‌వలి దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు. అందులో భాగంగానే దర్గాకు రంగులు దిద్దుతున్నారు. దర్గా ఆవరణంలో పలు రకాల బొమ్మల, మిఠాయి అంగళ్లు వెలిశాయి. ఈ నెల 26న స్వామివారి గంధం ఊరేగింపు, 27న రాత్రి షంషీర్ (ఉరుసు) జరుగుతుందన్నారు. 28న జియారత్ కార్యక్రమంతో ఉరుసు ముగుస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా తదితర ప్రాంతాలతోపాటు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు ఉత్సవాలకు హాజరవుతారు. ఉరుసు రోజున స్వామి వారి దివిటీల్లో ఎండు కొబ్బరిని కాల్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. -
శుభ కార్యానికి వెళ్లి..
= భార్యా పిల్లలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు = జూరాల కుడి కాలువలో కొట్టుకుపోయిన లోకో పైలట్ = నాలుగు కిలోమీటర్ల దూరంలో మృతదేహం గుర్తింపు = గుంతకల్లులో విషాదం గుంతకల్లు : శుభ కార్యానికి వెళ్లిన ఓ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాలువలో కొట్టుకుపోతున్న భార్యా పిల్లలను కాపాడే ప్రయత్నంలో ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుంతకల్లులోని రైల్వే శాఖలో కోలో పైలట్‌గా పని చేసే విజయ్(36) స్థానిక డీఆర్ఎం కార్యాలయ సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయ వద్ద రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. తెలంగాణలోని గద్వాల్లో ఉంటున్న తన సోదరి హెప్సిబారాణి ఇంట్లో జరిగే శుభకార్యానికి భార్యా పిల్లలతో కలసి మంగళవారం వెళ్లారు. అక్కడికి సమీపంలోని జూరాల కుడికాలువ వద్ద విజయ్ భార్యాపిల్లలతో కలసి ఈతకు వెళ్లారు. కాలువలో నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న భార్యాపిల్లలను రక్షించారు. దురదృష్టవశాత్తు అతను మాత్రం నీటిలో కొట్టుకుపోయారు. కాలువలో రాత్రంతా విజయ్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, గద్వాల్ పోలీసులు గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం 11 గంటలకు అక్కడికి సమీపంలోని 4 కి.మీ. దూరంలో విజయ్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరుమన్నారు. విజయ్ మృతదేహానికి గద్వాల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గుంతకల్లుకు తీసుకువచ్చారు. లోకో పైలెట్ విజయ్ మృతి విషయం తెలిసి గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనాథ్‌గౌడ్, స్నేహితులు, సహచర ఉద్యోగులు సంతాపం తెలిపారు. -
ఏడున్నర కిలోల కణితి తొలగింపు
గుంతకల్లు టౌన్ : ఓ మహిళ అండాశయంలోని ఏడున్నర కిలోల కణితి (ఒవేరియన్ సిస్ట్)ని గుంతకల్లు పట్టణంలోని ప్రీతి నర్సింగ్ హోమ్‌కు చెందిన వైద్యులు తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం నర్సింగ్ హోం సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ బి.సరోజమ్మ విలేకరులకు వెల్లడించారు. గుంతకల్లు పట్టణంలోని మోదినాబాద్‌కు చెందిన నాగమ్మ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండేది. బళ్లారిలో వైద్యుల్ని సంప్రదించగా అండాశయంలో కణితి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆమె శనివారం ప్రీతి నర్సింగ్‌హోమ్‌లో చేరింది. డాక్టర్ బి.సరోజమ్మ ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రాణాపాయమూ లేదని డాక్టర్ తెలిపారు. -
నెట్టికంటుడి సాక్షిగా దోపిడీ
అసౌకర్యాలతో భక్తులు సతమతం మౌలిక వసతుల కల్పనలో పాలకవర్గం వైఫల్యం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కసాపురంలో భక్తులు నిలువుదోపిడీకి గురువుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ఇక్కడి నెట్టికంటి ఆంజనేయ స్వామిని భక్తులు కొలుస్తున్నారు. జిల్లాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడకు భక్తులు వస్తుంటారు. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులతో ఏడాదికి రూ. 8 కోట్లకు పైగా ఆదాయాన్ని ఈ ఆలయం గడిస్తోంది. అంతేకాక రూ. 16 కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆలయం వద్ద మౌలిక వసతులు కరువవ్వడంతో భక్తులకు అసౌకర్యాలు తప్పడం లేదు. ఈ లోపాన్ని ప్రైవేట్ వ్యక్తులు సొమ్ము చేసుకుంటూ దోపిడీకి తెరలేపారు. కసాపురంలో నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధానం వద్ద భక్తులు విడిది చేసేందుకు రామసదనం పేరుతో 30 వసతి గదులు, లక్ష్మణ సదనం పేరుతో 39, కేసరి సదనం పేరుతో 30 గదులే కాక తొమ్మిది నాన్ ఏసీ కాటేజీలు, ఏడు ఏసీ కాటేజీలు ఉన్నాయి. ఈ 115 గదులను కొన్నేళ్ల క్రితం దాతల సౌజన్యంతో నిర్మించారు. రామ, లక్ష్మణ సదనాల్లోని కొన్ని గదులు శిథిలమయ్యాయి. వసతి కోసం తిప్పలు కసాపురం ఆలయానికి సంబంధించిన వసతి గదులను అతి తక్కువ అద్దెకు భక్తులకు ఇస్తుంటారు. రూ. 10 నుంచి రూ. 70 లోపు అద్దెను వసూలు చేస్తుండడంతో చాలా మంది భక్తులు ఆలయ వసతి గదుల్లోనే బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాక అద్దె రూపంలో తాము చెల్లిస్తున్న రుసుం ఆలయాభివద్ధికి దోహదపడుతుందన్న భక్తిభావం చాలా మందిలో వ్యక్తమవుతోంది. అయితే ఈ గదుల నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులు శీతకన్నేశారు. గదులు శిథిలావస్థకు చేరుకున్నాయంటూ వాటిని భక్తులకు అద్దెకివ్వడమే మానేశారు. కేసరి సదనంలోని 30 గదులను సిఫారసు ఉన్న భక్తులకు మాత్రమే రూ. 300 అద్దెతో ఇస్తున్నారు. వసతి గదులు దొరక్క పోవడంతో ఇక్కడకు వచ్చే భక్తులు గత్యంతరం లేక ప్రైవేట్ లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. ఈ బలహీనతను ప్రైవేట్ లాడ్జీ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క గదిని ఒక రాత్రికి రూ. 750 నుంచి రూ. వెయ్యి వరకు అద్దె వసూలు చేస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఆలయ పరిసరాల్లో తెల్లవార్లు జాగరణ కునుకుపాట్లు పడుతున్నారు. నిర్మాణానికే పరిమితమైన పీఏసీ నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తుడికీ వసతి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో రూ.4.35 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ) నిర్మాణాన్ని చేపట్టారు. నాలుగేళ్ల క్రితం చేపట్టిన ఈ పనులు నేటికీ పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ భవనం నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. స్నానపు గదులు, మరుగుదొడ్ల కొరత ఆలయం పరిసరాల్లో 2011లో దాదాపు రూ. 32 లక్షల వ్యయంతో మరుగుదొడ్లు, సాన్నపు గదుల నిర్మాణాలను చేపట్టారు. ఈ నిర్మాణాలను రెండు బ్లాక్‌లుగా విభజించి ఒక్కొ బ్లాక్‌లో 20 మరుగుదొడ్లు, ఎనిమిది స్నానపు గదులు ఉండేలా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. బ్లాక్–1 కింద ఆలయం ఎదుట చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం వల్ల అక్కడే ఏర్పాటు చేసిన తాగునీటి సంప్‌లో నీరు కలుషితమయ్యే ప్రమాదముందంటూ కొందరు అభ్యంతరాలు లేవనెత్తడంతో ఈ పనులు నిలిపివేశారు. ఇక ఆలయానికి తూర్పున చేపట్టిన బ్లాక్–2 నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా 2013లో అర్ధాంతరంగా నిలిచి పోయాయి. మరుగుదొడ్లు, స్నానపు గదుల సౌకర్యం లేక భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలయ పరిసరాలను బహిర్భూమిగా మార్చేస్తుండడంతో పారిశుద్ధ్యం లోపిస్తోంది. ప్రతిపాదనలకే పరిమితం ఆలయ పరిసరాలను మరింత విస్తరించడంతో పాటు అక్కడి పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వ్యాపార కేంద్రాలను తొలగించి, కాశీవిశ్వేశ్వర ఆలయం సమీపంలో దాదాపు 95 గదులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేపట్టారు. రూ. 1.40 కోట్లతో 2014లో చేపట్టిన ఈ పనుల్లో గదుల నిర్మాణానికి కొండను తవ్వాల్సి రావడంతో అంచనా వ్యయాన్ని పెంచాలంటూ మరోసారి ప్రతిపాదనలు పంపారు. అంతేకాక షాపింగ్ కాంప్లెక్స్‌ను ఆలయానికి దూరంగా ఏర్పాటు చేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటాయన్న ఆందోళనతో స్థానిక వ్యాపారులు... ప్రజాప్రతినిధులను ఆశ్రయించి, రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చారు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. నూతన పాలక వర్గంపై ఆశ ఆలయ అభివద్ధికి సంబంధించి నాలుగేళ్లుగా కమిటీ ఏర్పాటు కాకపోపవడంతో ఎటు చూసినా అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. చేపట్టిన ఏ పనులూ పూర్తి కాక భక్తులకు అసౌకర్యాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఆలయ ట్రస్ట్‌కు సభ్యుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సౌకర్యాలు మెరుగు పడడమే కాక, దోపిడీకి తెరదించుతారన్న ఆశలు భక్తుల్లో వ్యక్తమవుతోంది. -
పేదరికంపై విజయం
♦ ఆర్డీటీ సహకారంతో ఉన్నత విద్యసాకారం ♦ నిరుపేద కుటుంబాల్లో ఉపాధి వెలుగులు రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులను సైతం ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. విద్య, వైద్య రంగాల నుంచి ఏనాడో తప్పుకున్న ప్రభుత్వాలు తాజాగా ఉపాధి కల్పనలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని అందబాటులోకి తీసుకువచ్చి నిరుపేదల పిల్లలు సైతం ఉన్నత విద్యను అభ్యసించేలా చేసిన మహానేత డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం చేయలేని పనిని ఓ సంస్థ తన భుజస్కంధాలపై వేసుకుంది. ఉపాధి కల్పనతో పాటు నిరుపేద పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి ఇతోధికంగా సహకరిస్తోంది. అదే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ). ఓ మహోన్నత ఆశయంతో నిరుపేద కుటుంబాల్లో ఉపాధి వెలుగులు నింపుతోంది. సంస్థ ద్వారా పలువురు ఆర్థిక సాయం పొంది ఆర్థికాభివద్ధి సాధించడమే కాదు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఆ సక్సెస్ స్టోరీస్ ఏమిటో తెలుసుకుందాం రండి... గంపలు అల్లుతూ... ఈ ఫొటోలో కనిపిస్తున్నది గుంతకల్లు మండలంలోని ఇమాంపురం గ్రామానికి చెందిన ఎరికల దుర్గయ్య, శివమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. వరుస పంట నష్టాలతో తమకున్న మూడు ఎకరాల పొలంలో పంట సాగు చేపట్టలేని స్థితిలో ఉన్న దుర్గయ్య దంపతులకు గంపలు అల్లకం, బిందెల వ్యాపారానికి ఆర్డీటీ సంస్థ ఆర్థిక సాయాన్ని అందజేసింది. వీరి పెద్దకుమారుడు శ్రీనివాసులు, పదో తరగతి (2013లో) 8.0 పాయింట్లతో ఉత్తీర్ణుడయ్యాడు. వచ్చే అరకొర ఆదాయంతో కుమారుడిని ఇంటర్మీడియట్లో చేర్పించడం దుర్గయ్యకు భారమైంది. ప్రవేశ పరీక్షల ద్వారా ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారి ఉన్నత చదువులకయ్యే మొత్తం ఖర్చును ఆర్డీటీ సంస్థ భరిస్తున్న విషయం తెలుసుకుని శ్రీనివాసులు ఆ దిశగా అడుగు ముందుకేశాడు. ప్రవేశ పరీక్ష రాసి, ఉత్తమ ఫలితాలు సాధించాడు ఫలితంగా శ్రీకాళహస్తిలోని ట్రైబల్ వెల్ఫేర్ ఇంటర్ కాలేజీలో అతనికి సీటు దక్కింది. బైపీసీలో 944 మార్కులతో ఉత్తీర్ణుడైన అతను ఎంసెట్‌లో ర్యాంక్ తక్కువగా రావడంతో ఎంబీబీఎస్‌లో సీటు దక్కలేదు. అనంతరం ఆర్డీటీ ప్రోత్సాహంతో ఏడాదిపాటు కోచింగ్ తీసుకుని రెండవ సారి ఎంసెట్ రాశాడు. ఈ సారి 9,495 ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా కడపలోని రిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. చదువు మధ్యలోనే ఆగిపోయేది మాకు సొంతంగా ఇల్లు కూడా లేదు. వరుస పంటనష్టాలు మా కుటుంబాన్ని అప్పుల్లోకి నెట్టేశాయి. కుటుంబం కూడా గడవని స్థితిలో ఉన్నప్పుడు ఆర్డీటీ ఆర్థిక సహాయం అందించి వ్యాపారం చేసుకునేలా పోత్సహించింది. పదో తరగతితోనే ఆగిపోవాల్సిన నా చదువు ఈ రోజు ఎంబీబీఎస్ దాకా వచ్చిందంటే అది ఆర్డీటీ చలవే. కార్డియాలజీ పూర్తి చేసి పేదలకు సేవ చేయాలని ఉంది. – శ్రీనివాసులు, మెడికో కష్టాలను ఎదిరించి.. ఈ చిత్రంలో కనిపిస్తున్నది గుంతకల్లు మండలంలోని కదిరిపల్లికి చెందిన రమావత్ నరసింహులు నాయక్, చంద్రమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. ఐదు ఎకరాల పొలంలో పంట సాగు చేపట్టి వరస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన నరసింహులు నాయక్‌కు కుటంబపోషణ భారమైంది. ఇలాంటి తరుణంలో ఆర్డీటీ సంస్థ అందించిన ఆర్థిక సాయంతో ఎనుముల పెంపకం చేపట్టి పాడితో కుటుంబాన్ని పోషించుకోసాగాడు. వీరి రెండవ కుమార్తె ఉమాదేవికి చదువుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉంది. ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిబిరంలో శిక్షణ పొందిన రమాదేవి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి కర్నూలులోని ఏపీ రెసిడెన్సియల్ స్కూల్లో సీటు దక్కించుకుంది. అక్కడే 2014లో పదో తరగతిలో 9.5 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అదే సమయంలో మరోసారీ ఆర్డీటీ సంస్థ నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి విజయవాడలోని ఓ కార్పొరేట్ స్కూల్లో బైపీసీ పూర్తి చేసింది. ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్‌లో 10.098 ర్యాంక్ సాధించి ప్రస్తుతం కడపలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసిస్తోంది. ఆర్డీటీ స్ఫూరితో... ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మా కుటుంబానికి చేయూతనందించిన ఆర్డీటీ సంస్థ అడుగడుగునా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. సంస్థ ఆశయం నాలో స్ఫూర్తిని నింపింది. అందుకే పేదలకు సాయం చేయాలనే లక్ష్యంతో వైద్య వత్తిని ఎంచుకున్నారు. భవిష్యత్తులో సంస్థ సేవా మార్గాన్ని అనుసరిస్తాను. – ఉమాదేవి, మెడికో -
గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య
గుంతకల్లు : స్థానిక రైల్వే జంక్షన్లో ఓ గుర్తుతెలియని యువకుడ గురువారం అర్ధరాత్రి 6వ నంబర్ ప్లాట్ఫారంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్పీ ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతుడి వయస్సు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. మృతుని జేబులో ఆధార్‌కార్డు లభించింది. ఇందులో రమణ అనూర్స్వామి అని, ముంబై ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వృద్ధుడి మృతదేహం లభ్యం ఇదిలా ఉండగా ప్లాట్‌పారం 1,2ల మధ్య మరుగుదొడ్ల వద్ద గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఇతని వయస్సు 65 నుంచి 70 ఏళ్లు ఉంటుందని, రైల్వే జంక్షన్లో యాచనచేసే వ్యక్తిగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆర్పీఎఫ్ పాత్ర కీలకం
గుంతకల్లు : రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల రక్షణలో ఆర్పీఎఫ్ పాత్ర ప్రముఖమైందని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అమితాబ్ ఓజా అన్నారు. స్థానిక రైల్వే క్రీడామైదానంలో ఆర్పీఎఫ్ (రైల్వే రక్షక దళం) 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. డీఆర్ఎంతోపాటు, ఆర్పీఎఫ్ కమాండెంట్ ఏలిషా, జిల్లా జీఆర్పీ ఎస్పీ సుబ్బారావు హాజరయ్యారు. తొలుత రైల్వే రక్షక దళం జెండాను డీఆర్ఎం ఆవిష్కరించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. అసిస్టెంట్ కమాండెంట్లు వసంతకుమార్ (గుంతకల్లు), చంద్రశేఖర్ (రేణిగుంట), డివిజన్లోని వివిధ రైల్వేస్టేçÙన్ల అర్పీఎఫ్ సీఐలు కోటా జోజే, ప్రసాద్, నాగార్జునరావు (తిరుపతి), సంతోష్‌కుమార్ (రాయచూర్), వినోద్‌కుమార్ మీనా (అనంతపురం), సుబ్బయ్య (గుత్తి), రవిప్రకాష్ (డోన్), మధుసూదన్ (రేణిగుంట), ఎన్వీ నారాయణస్వామి (చిత్తూరు), బి.వెంకటరమణ (కడప)తోపాటు డివిజన్ పరిధిలోని ఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చోరీల నియంత్రణకు చర్యలు ప్రయాణికుల రక్షణ, రైల్వే ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గుంతకల్లు ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ కమాండెంట్ ఏలిషా తెలిపారు. స్థానిక డీఆర్ఎం కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాన రైల్వేస్టేçÙన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐబీ బేస్డ్ సిస్టం ద్వారా డివిజన్లోని సీసీ కెమెరాలను లింకప్ చేసుకొని గుంతకల్లులోని తన కార్యాలయం నుంచే మానిటరింగ్ చేస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 మంది దొంగలను అరెస్టు చేసి రూ. 8 లక్షల 23 వేలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మహిళా ప్రయాణికుల కోసం మహిళా ఆర్పీఎఫ్లను నియమించినట్లు చెప్పారు. -
విశాఖ అమ్మాయి గుంతకల్లులో ప్రత్యక్షం
గుంతకల్లు : తల్లిదండ్రులు మందలించారని ఇల్లు వదిలి వచ్చిన విశాఖపట్నం సమీప వాలే్తరు గ్రామానికి చెందిన రూప (22) అనే యువతి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల చొరవతో క్షేమంగా తల్లితండ్రుల వద్దకు చేరింది. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 14 గాయపడి అపస్మారకస్థితిలో గుంతకల్లు రైల్వే స్టేషన్లో పడి ఉన్న రూపను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. 108 వాహనంలో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె స్పృహలోకి వచ్చింది. వైద్యులు ఆమె వివరాలను ఆరా తీశారు. తన పేరు, స్వగ్రామం తెలిపింది. రైలులో ప్రయాణిస్తూ మూర్ఛవచ్చి పడిపోయానని చెప్పింది. వైద్యులు కళ్యాణ్, ప్రవీణ్ ఆమె ఫొటోను వాట్సాప్ ద్వారా విశాఖపట్నంలోని తమ స్నేహితులకు పంపారు. ఈ సమాచారం యువతి తల్లిదండ్రులు అప్పారావు, సుగుణకు చేరడంతో ఆదివారం వారు గుంతకల్లు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె తండ్రి విశాఖపట్నంలోని రైల్వే కార్యాలయంలో కమర్షియల్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ తన కుమార్తెకు మేనమామతో పెళ్లి నిశ్చయం చేశామన్నారు. ఆ అబ్బాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో రూప మానసికంగా కుంగిపోయింది. ఈ పరిస్థితిలో ఈ నెల 11న ఇంటి నుంచి వెళ్లిపోయిందని వివరించారు. వైద్యులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఇజంతకర్ చంద్రశేఖర్, జీఆర్పీ పోలీసులు సమక్షంలో రూపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. యువతి తల్లిదండ్రులు వైద్యులకు, ఆస్పత్రి సిబ్బందికి, సెక్యూరిటీ గార్డు శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు. -
భాగ్యనగర్ వినాయకుడి లడ్డూ రూ.1.51 లక్షలు
వినాయకచవితి వేడుకల్లో భాగంగా భాగ్యనగర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో 28వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ మాల రంగన్న రూ.1.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మహా కలశాన్ని రూ.43 వేలకు ట్యాంకర్ ఓనర్ శివశంకర్ దక్కించుకున్నారు. స్వామివారి పూజకు ఉంచిన రూ. 10 నాణేన్ని పెయింటర్ సత్య అనే వ్యక్తి రూ.23 వేలకు పాడి సొంతం చేసుకున్నారు. కౌన్సిలర్ రంగన్న, నిర్వాహకులు లస్కర్ శీనా, రామాంజనేయులు, సూరి, రంగా తదితరులు పాల్గొన్నారు. -
గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి
అనంతపురం సప్తగిరిసర్కిల్ : గుంతకల్లును తక్షణమే రైల్వేజోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విమోచన సమితి సమన్వయకర్త అశోక్‌వర్ధన్ రెడ్డి, గుంతకల్లు రైల్వే జోన్ సాధన సమితి సమన్వయకర్త రాజశేఖర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్ ఆవరణ లో గుంతకల్లు రైల్వే జోన్ సాధన పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. నేటి నుంచి జిల్లాలో లక్ష కరపత్రాలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలోనే గుంతకల్లు అత్యధిక ఆదాయం కలిగిన డివిజన్ అని తెలిపారు. దక్షిణ భారతదేశాన్ని కలిపే రైల్వే వ్యవస్థ గుంతకల్లుకు ఉందని దీంతో రైల్వేజోన్‌గా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ నిర్మాణ విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు సీమక్రిష్ణా నాయక్, ఆర్‌వీపీయస్ అధ్యక్షులు రవికుమార్, బాషా, బండి నారాయణ స్వామి, కుమార్ నాయక్ తదితరులు పాల్గోన్నారు. -
ఊరేగిన వెండి వినాయకుడు
గుంతకల్లు : దేశంలోనే అతి పెద్దదైన, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన వెండి వినాయకుణ్ని మంగళ వాయిద్యాల మధ్య, భక్తి శ్రద్ధలతో గుంతకల్లు పట్టణంలో ఆదివారం ఘనంగా ఊరేగించారు. 21 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం 115 కిలోల వెండి వినాయకుడికి విగ్రహ దాత పువ్వాడి ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రోచ్చారణల మధ్య పల్లకీపై కూర్చోబెట్టారు. వందలాది మంది మహిళలు హారతులు ఇస్తూ ముందుకు సాగుతుండగా సుందరంగా అలంకరించిన పల్లకీపై వెండి వినాయకుడిని కూర్చోబెట్టి కోదండరామస్వామి దేవాలయం వీధి మీదుగా ఊరేగింపు ప్రారంభించారు. గాంధీచౌక్, ఎన్టీఆర్ సర్కిల్, మెయిన్‌బజార్ మీదుగా వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం చేరుకుంది. దేవాలయం ప్రాంగణంలో ఆలయ అర్చకులు, వేదపండితులు కలిసి వెండి గణపతి విగ్రహానికి వేద మంత్రోచ్చారణలతో స్వాగతం పలికారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట జరిపి పంచగంగతో అభిషేకం చేశారు. వినాయక ఉత్సవ సేవా సమితి గౌరవాధ్యక్షుడు వంకదారు రామకష్ణయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాజగదీష్, అవోపా పట్టణ అధ్యక్షుడు చెల్లూరి నరసింహులు, అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఆదినారాయణ, పువ్వాడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కసాపురం ఆలయ సమాచారం
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారికి గురువారం నిర్వహించే పూజల వివరాలు. = వేకువజామున 4.15 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం. = 5.30 గంటలకు అలంకరణ నిజరూప దర్శనం. =ఉదయం 6.30 గంటలకుప్రత్యేక పుష్పాలంకరణ, నిత్య పూజలతో భక్తులకు దర్శనం. = ఉదయం 11.30 గంటలకు మహా నివేదన. = మధ్యాహ్నం 12.30 గంటలకు మహామంగళహారతి. అనంతరం ఆలయం మూసివేత. = మధ్యాహ్నం 2 గంటల నుంచి పూజలు = రాత్రి 8.30 గంటలకు మహామంగళ హారతితో ఆలయం మూసివేత. -
తెప్పోత్సవంతో ముగిసిన పుష్కరాలు
కసాపురం(గుంతకల్లు రూరల్) : మండల పరిధిలోని కసాపురం వద్ద ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ వద్ద గత 12 రోజులుగా వైభవంగా సాగిన కృష్ణా పుష్కరాలు మంగళవారం నాటి తెప్పోత్సవంతో ముగిశాయి. జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ హాజరయ్యారు. ఆంజనేయస్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి, తెప్పోత్సవంపై కొలువుదీర్చి, ప్రత్యేకSపూజలు చేశారు. వేలాది మంది మహిళలు కృష్ణమ్మకు హారతులు పట్టారు. ఒంటెవాహనంపై విహరించిన నెట్టికంటుడు గుంతకల్లు రూరల్: శ్రావణమాసం మూడో మంగళవారం రాత్రి నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. వేద పండితులు అనంతపద్మనాభశర్మ , రామకృష్ణావధాని , ఆలయ ప్రధాన అర్చకుడు వసుధరాజాచార్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో ముత్యాలరావు ఆధ్వర్యంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. -
రైల్వేగేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం న్యూసిటీ: రైల్వే గేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని గుంతకల్లు రైల్వే డివిజినల్ ఆపరేటింగ్ మేనేజర్ వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు. మంగళవారం అనంతపురం రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లో భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. వాహనదారులు రైలు గేట్ క్రాస్ చేసే సయమంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ తిప్పానాయక్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
మహిళా ఉద్యోగిపై దాడి
lపరిస్థితి ఆందోళనకరం పోలీసు స్టేషన్లో లొంగిపోయిన భర్త విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన డీజిల్‌షెడ్ కార్యాలయ సూపరింటెండెంట్ సుకన్య (37)పై గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.... పట్టణంలోని డీఆర్ఎం కార్యాలయం పర్సనల్ బ్రాంచ్ విభాగంలో పని చేస్తున్న సుకన్య నాలుగు రోజుల కిందట డీజిల్‌షెడ్‌కు బదిలీ అయ్యారు. సోమవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరారు. ఆర్పీఎఫ్ చెక్‌పోస్టు వద్దకు రాగానే కాపు కాచిన నలుగురైదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై మారణాయుధాలతో దాడి చేశారు. ముఖం, చేయి, కుడికాలు, కడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న ఆమెను సహోద్యుగులు సమీపంలోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. రూరల్ సీఐ గురుప్రసాద్, వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే ఉద్యోగులతో ఆస్పత్రి కిటకిట విషయం తెలుసుకున్న ఏడీఆర్ఎం సుబ్బరాయుడు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు రైల్వే ఆస్పత్రికి తరలివచ్చారు. సీనియర్ డీఎంఈ (డీజిల్) గోపాల్, డీపీఓ మాలతి, మజ్దూర్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్, ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ తదితరులు సుకన్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆర్పీఎఫ్ కమాండెంట్ ఎలీషా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రాణహానిపై వారం కిందటే ఫిర్యాదు రైల్వే ఉద్యోగి సుకన్య 13 ఏళ్ల కిందట రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వీరి మధ్య సఖ్యత లేకపోవడంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం రఘు ఇద్దరు పిల్లలతో వేరు కాపురముంటున్నాడు. రఘు తరచూ ఆమె పని చేసే కార్యాలయం వద్దకు వెళ్లి గొడవ పడుతుండేవాడని తెలిసింది. భర్త వల్ల తనకు ప్రాణహాని ఉందని సుకన్య వారం రోజుల కిందట వన్‌టౌన్ పోలీసుస్టేçÙన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కసారిగా మారణాయుధాలతో కొందరు సుకన్యపై దాడిచేశారు. కొన ఊపిరితో పోరాడుతున్న సుకన్య భర్త రఘు పేరు చెబుతుండటంతో సహా ఉద్యోగులు, స్థానికులు పోలీసులకు తెలిపారు. లొంగిపోయిన భర్త: సుకన్య భర్త రఘు రాత్రి పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తన భార్యపై తానే హత్యాయత్నం చేయించినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. -
చిన్నారి ప్రాణం పోయింది
గుంతకల్లు టౌన్ : చికిత్స కోసం వెళితే చిన్నారి ప్రాణమే పోయింది. ఇంజెక్షన్ వేసిన కొన్ని నిమిషాలకే కన్ను మూసింది. తమ చేతుల మీదే గిలగిలాకొట్టుకుంటూ పాప చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన సురేష్, సులోచన దంపతుల రెండో కుమార్తె జ్యోతి(11నెలలు)కి సోమవారం రాత్రి నుంచి తీవ్రమైన జ్వరం వచ్చింది. మంగళవారం ఉదయం చిన్నారిని వైద్యం నిమిత్తం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని టి.బి.రోడ్‌లోని అరుణ్ క్లినిక్‌లో చిన్న పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ వీరేష్కుమార్ను సంప్రదించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యుడు పాపకు ఇంజెక్షన్ వేశాక రక్తపరీక్షలకు సిఫార్సు చేశారు. ల్యాబ్‌కు తీసుకెళ్లగానే పాప పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించుకుంటూ వైద్యుడి వద్దకు వచ్చారు. ఇంజెక్షన్ వికటించే తమ పాప మరణించిందని, మెరుగైన వైద్యం చేసి ఉంటే బతికి ఉండేదని వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై ధర్నా కేవీపీఎస్ డివిజన్ అధ్యక్షుడు జగ్గిలి రమేష్, కార్యదర్శి వై.శ్రీనివాసులు, రాయలసీమ దళిత సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, ఎమ్మార్పీఎస్ రాయలసీమ కార్యదర్శి స్వామిదాస్ తదితరులు చిన్నారి జ్యోతి మరణానికి కారణమైన డాక్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని క్లినిక్ ఎదుట రోడ్డుపై మృతదేహంతో ధర్నాకు దిగారు. సీఐ గురునాథబాబు, ఎస్ఐ నగేష్‌బాబులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులు, వైద్యుడిని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్కు తీసుకెళ్లారు. పట్టణంలోని వైద్యులు కూడా స్టేషన్‌కు వచ్చారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్‌పై కేసు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పాప తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఏ విచారణకైనా సిద్ధమే జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని పరీక్షించి జ్వరం నయం కావడానికి తగిన మోతాదు మేరకు ఇంజెక్షన్ వేశాను. పాప యాక్టివ్‌గా లేని కారణంగా రక్త పరీక్షలు చేయించుకువస్తే ఆ రిపోర్ట్ చూసి తదుపరి మెరుగైన వైద్యం చేస్తానని చెప్పాను. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు ఉన్నాం కానీ ప్రాణాలు తీసేందుకు కాదు. నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే. – డాక్టర్ వీరేష్‌కుమార్, చిన్నపిల్లల వైద్యనిపుణుడు -
రేపటి నుంచి శ్రావణ మాసోత్సవాలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు వారాల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. ఉచిత దర్శనం మొదలుకుని, అతి శీఘ్ర దర్శనం (టికెట్ ధర రూ.100) వరకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలో ప్రత్యేక ప్రసాద వితరణ కేంద్రాలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ సిబ్బందితో పాటు దాదాపు 50 మందికి పైగా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. భక్తులకు నిరంతర అన్నదానం, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆలయ ఈఓ ముత్యాలరావు ఆలయ ఏఈఓ మధు, సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు. పెళ్లిళ్ల శోభ: దాదాపు రెండు నెలల విరామం అనంతరం శ్రావణమాసం వివాహ ముహూర్తాలు ప్రారంభం కావడంతో గురువారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలు పెళ్లిళ్ల శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 25కి పైగా జంటలు స్వామివారి సమక్షంలో ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు మాట్లాడుతూ శ్రావణమాసం నెల రోజుల పాటు వివాహాలకు శుభదినాలన్నారు. అనంతరం విజయదశమి వరకు మంచి ముహూర్తాలు లేవని వారు తెలిపారు. ఉత్సవాల వివరాలు ఆగస్టు 6 మొదటి శనివారం: సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామిని శేషవాహనంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆగస్టు 13 రెండవ శనివారం: ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఒంటెవాహనంపై ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆగస్టు 20 మూడవ శనివారం: సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామిని గజవాహనంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆగస్టు 27 నాల్గవ శనివారం: సాయంత్రం ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ఊరేగిస్తారు. అలాగే శ్రావణమాసం నాలుగు మంగళవారాలు ఆంజనేయస్వామిని ఒంటñ æవాహనంపై ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
గెలుపోటములు సమానంగా తీసుకోవాలి
గుంతకల్లు : జయాపజయాలను సమానంగా స్వీకరించి, స్ఫూర్తిని చాటాలని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ (ఎస్సీఆర్ ఏజీఎం) ఏకే.గుప్తా సూచించారు. స్థానిక రైల్వే మైదానంలో బుధవారం సాయంత్రం సౌత్ సెంట్రల్ రైల్వే స్టేట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 22వ స్టేట్ (జోనల్ స్ధాయి) ర్యాలీ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ రైల్వే డివిజన్ల నుంచి వందలాది మంది స్కౌట్స్ విద్యార్థులు హాజరయ్యారు. వ్యాసరచన, నృత్యాలు, డ్రాయింగ్ కాంపిటీషన్, క్విజ్, ఫిజికల్ డిస్ప్లే కాంపిటీషన్, స్కౌట్స్ విద్యార్థులు తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, క్యాంపుఫైర్ తదితర విభాగాల్లో నాలుగు రోజులు స్కౌట్స్ విద్యార్థులకు పోటీలు ఉంటాయి. డీఆర్ఎం బీజీ మాల్య మాట్లాడుతూ భారత్ స్కౌట్స్ గైడ్స్‌లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గనితే 94 ఏళ్ల వయసులోనూ దేశంలో ఈవెంట్లు ఎక్కడ జరిగినా హాజరవుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే స్టేట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 22వ సేట్ట్ ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. జోనల్ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన రైల్వే పాఠశాలల విద్యార్థులు పెరేడ్ ద్వారా ఏజీఎం ఏకే.గుప్తా గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ కమిషనర్ పద్మజ, స్టేట్ కార్యదర్శి ఎస్కే. గుప్తా, ఏడీఆర్ఎం సుబ్బరాయుడు, సీనియర్ డీపీఓ బలరామయ్య, ఆర్పీఎఫ్ గుంతకల్లు రైల్వే డివిజన్ సెక్యూరిటీ కమాండెంట్ ఏలీషా, సీనియర్ డీఈఎన్ కోఆర్డినేషన్ మనోజ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఈ సైకిల్ భలే క్రేజ్
హాయ్ ఫ్రెండ్స్! ఈ సైకిల్ చూస్తే చాలా ఆసక్తిగా ఉంది కదూ!! అమెరికాకు చెందిన ప్రఖ్యాత సైకిల్ తయారీ కంపెనీ మోంగూస్... బ్రూటస్ పేరుతో దీనిని రూపొందించింది. దిగుమతితో కలుపుకుని దీని విలువ అక్షరాల రూ.40 వేలు. ఏంటీ నోటి మీద వేలు వేసుకున్నారు. ఇంత డబ్బు పోసి దీనిని ఎవరు కొంటారు అనా? అలాంటి వారూ ఉన్నారండి బాబూ. ఎక్కడో కాదు గుంతకల్లులోని శాంతి నగర్ రైల్వే క్వార్టర్స్‌లో ఉంటున్న సంజీవ్ అనే లోకో పైలెట్ దీనిని ఎంతో ఇష్టంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. అంత డబ్బు పెట్టి కొన్నారు.... దీని ప్రత్యేకత ఏమిటంటారా? చూడండి ఈ సైకిల్ చక్రాలు 26 ఇంచుల వృత్తాకారంలో, నాలుగు ఇంచుల మందంతో ఉన్నాయి. ఈ సైకిల్‌కు బ్రేక్ లివర్ అంటూ ఏదీ లేదు! అయితే ఫెడల్ను వెనక్కు తొక్కితే ఆటోమేటిక్‌గా సైకిల్ ఆగుతుంది. ఇక సైకిల్ తొక్కుతూ ఎంతటి ఎత్తు ప్రదేశాలైనా సునాయసంగా ఎక్కేయవచ్చు. సైక్లింగ్ వల్ల వాయు కాలుష్యం నివారణలో తాను కూడా భాగస్వామినైనందుకు ఎంతో ఆనందంగా ఉందంటున్నారు సంజీవ్... ఆయన ఆలోచనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు గుంతకల్లు వాసులు. -
సివిల్ ఇంజినీర్ ఇంట్లో చోరీ
కుటుంబ సభ్యులు ఊరెళ్లిన సమయంలో ఘటన 10.5 తులాల బంగారు నగల అపహరణ రంగంలోకి దిగిన పోలీసుల గుంతకల్లు టౌన్: గుంతకల్లు పట్టణంలోని హనుమేష్‌నగర్ ఎస్సీ బాలికల హాస్టల్ వెనుకభాగంలో సివిల్ ఇంజినీర్ నూర్ అహ్మద్ ఇంట్లో చోరీ జరిగింది. పదిన్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి ఈ సంఘటన వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నూర్ అహమ్మద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న వైజాగ్‌లోని డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న తన కుమారుడి వద్దకు వెళ్లారు. ఇంటి తాళాన్ని పక్కనే ఉన్న సమీప బంధువుకి ఇచ్చివెళ్లారు. సోమవారం సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అల్మారా (గూటి)లో ఉంచిన తాళం చెవితో బీరువాను తెరిచి.. అందులోని సీక్రెట్ లాకర్లో భద్రపరిచిన బంగారు నగలను అపహరించారు. రాత్రి 7 గంటల సమయంలో ఈ ఇంటిలో బల్బు వెలుగుతుండటాన్ని గమనించిన నూర్ అహ్మద్ సమీప బంధువులు అక్కడికి వచ్చారు. అప్పటికే తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోనికెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు, దుస్తులు చెల్లాచెదురుగా కనిపించాయి. వెంటనే సమాచారాన్ని నూర్అహ్మద్కు చేరవేశారు. ఆయన వైజాగ్ నుంచి హుటాహుటిన బయల్దేరి మంగళవారం ఉదయం గుంతకల్లుకి చేరుకున్నారు. ఇంట్లో పరిశీలించిన తర్వాత 10.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ప్రసాదరావు, ఒన్‌టౌన్ ఎస్ఐ బీవీ.నగేష్‌బాబు, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం నుంచి క్లూస్‌టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. -
గుంతకల్లులో భారీ అగ్నిప్రమాదం
అనంతపురం : గుంతకల్లులో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఎల్వీ థియేటర్ సమీపంలోని మూడు టింబర్ డిపోల్లో అగ్నిప్రమాదం కారణంగా భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదంలో రూ. 30 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... అగ్నిప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. -
గుంతకల్లులో భారీ అగ్నిప్రమాదం
-
అప్పు తిరిగివ్వలేదని.. బాలిక నిర్బంధం
గుంతకల్లు (అనంతపురం) : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని.. ఓ వడ్డీ వ్యాపారి బాలికను నిర్బంధించిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న అరుణ వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఓ మహిళ తన కుటుంబ అవసరాల కోసం అరుణ నుంచి రూ.17 వేలు అప్పుగా తీసుకుంది. తిరిగి చెల్లించడంలో ఆలస్యం అవడంతో.. కోపోద్రిక్తురాలైన వడ్డీ వ్యాపారి బాధితురాలి ఎనిమిదేళ్ల కూతురిని తన ఇంట్లో నిర్బంధించుకొని డబ్బులు ఇస్తేనే వదిలేస్తానని చెప్పింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. -
భర్త ఉద్యోగం కుమారునికి వస్తుందని..
గుంతకల్లు (అనంతపురం) : మద్యానికి బానిసైన భర్తను చంపేస్తే...ఆ ఉద్యోగం కుమారుడికి వస్తుందని భావించిన ఓ మహిళ ఘోరానికి ఒడిగట్టింది. కొడుకు సాయంతో కట్టుకున్నవాడిని కడతేర్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది. గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు, బంధువుల కథనం మేరకు.. యాడికి మండల కేంద్రంలో విద్యుత్ శాఖలో లైన్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సాల్మన్‌రాజు (48) కుటుంబం పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు రోడ్డులో నివాసముంటోంది. సాల్మన్‌రాజుకు భార్య ప్రేమలత, కుమారుడు శశాంక్ (24), కుమార్తె స్వరూప(20) ఉన్నారు. సాల్మన్‌రాజు ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో భర్తను చంపితే కుమారుడికి ఉద్యోగం వస్తుందని ప్రేమలత భావించింది. ఆమె కుమారుడితో కలిసి గురువారం మద్యం మత్తులో ఉన్న సాల్మన్‌రాజును చితకబాదటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. మెట్లపై నుంచి కిందపడ్డాడని నాటకమాడారు. స్థానికంగా ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి సాల్మన్‌రాజు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. శనివారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బంధువులు మాత్రం.. అతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాల్మన్‌రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం సాల్మన్‌రాజు భార్య, కుమారుణ్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. -
మద్యం షాపులపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు
గుంతకల్లు (అనంతపురం జిల్లా) : గుంతకల్లు పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మద్యం షాపులపై దాడులు నిర్వహించారు. పాత గుంతకల్లు, కొత్త గుంతకల్లులోని పలు దుకాణాలను సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మద్యం నిల్వలను పరిశీలించారు. పాత గుంతకల్లులోని శ్రీసాయి వైన్స్‌లో చీప్ లిక్కర్లో నీళ్లు కలిపి విక్రయిస్తున్నట్లు గమనించారు. దీనిపై దుకాణం యాజమాన్యాన్ని వివరణ కోరారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
గుంతకల్లు (అనంతపురం జిల్లా) : గుత్తి మండలం చట్నేపల్లికి చెందిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. బెంగళూరుకు చెందిన నేత్రావతికి ఎనిమిదేళ్ల క్రితం చట్నేపల్లికి చెందిన రఘుబాబుతో వివాహమైంది. వీరికి మురహరి(6), మహేష్(5)లు సంతానం. రఘుబాబు వ్యాపారం చేసేవాడు. అమితే రఘుబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. వివాహేతర సంబంధం వదులుకోమని మంగళవారం ఉదయం కూడా నేత్రావతి భర్తను బతిమాలిందని, భర్త వినకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన నేత్రావతి ఇద్దరు పిల్లలకు ఉరివేసి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. ప్రస్తుతం రఘుబాబు పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న గుత్తి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
‘ప్రభు’ ఈసారైనా..
రైళ్ల కేటాయింపులో గుంతకల్లు డివిజన్‌కు ప్రతియేటా అన్యాయం ఈ సారైనా సీమ ఎంపీల ప్రయత్నాలు ఫలించేనా? నేడు రైల్వేబడ్జెట్ గుంతకల్లు :ప్రతియేటా రైల్వే బడ్జెట్లో గుంతకల్లు డివిజన్‌కు అన్యాయం జరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంతకల్లు డివిజన్‌కు ఆదాయపరంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. అయినా రైళ్ల కేటాయింపు, పొడిగింపు, ప్రాజెక్టుల విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదు.రెండు దశాబ్దాలుగా రైలే ్వ మంత్రులుగా పనిచేసిన వారందరూ తమ రాష్ట్రాలకు, ప్రాంతాలకు రైళ్లను, ప్రాజెక్టులను కేటాయించుకోవడంలో సఫలీకృతులయ్యారు. డివిజన్‌కు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాయలసీమ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. నేడు రైల్వే బడ్జెట్ నిధులను రాబట్టడంలో రాయలసీమ ప్రాంత ఎంపీలు చొరవ ఏమాత్రమూ లేదన్న ఆరోపణలున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాలను దృష్టిలో ఉంచుకుని నాటి రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కర్నూలులో రైలుబోగీల మరమ్మతు కర్మాగారాన్ని రూ.110 కోట్లతో మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించింది. ఈ బడ్జెట్లోనైనా ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటులో రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్లో సీమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీలు ఢిల్లీలో గట్టిగా కోరుతున్నారు. బోర్డులో నలుగుతున్న ప్రతిపాదనలివీ.. ►పుట్టపర్తి - షిర్డీ మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలు ►హైదరాబాద్ - పుట్టపర్తి (వయా గుంతకల్లు, ధర్మవరం ) నూతన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ►కడప - షిరిడీ మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలు ►అమరావతి రాజధాని దృష్ట్యా ధర్మవరం-గుంతకల్లు-విజయవాడ మార్గంలో మరో రెండు ఎక్స్‌ప్రెస్, రెండు ప్యాసింజర్ ైరె ళ్లు ►అనంతపురం-విశాఖపట్నం, గుంతకల్లు-ధర్మవరం-తిరుపతి మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు ►గుంతకల్లు-హైదరాబాద్ మధ్య పగటి పూట ఎక్స్‌ప్రెస్ రైలు రైళ్ల పొడిగింపు ప్రతిపాదనలు సికింద్రాబాద్ - కర్నూలు మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు లేదా మంత్రాలయం నిలయం వరకు పొడిగింపు కాచిగూడ - గుంటూరు - కాచిగూడ ప్యాసింజర్‌ను ఫాస్ట్ ప్యాసింజర్‌గా మార్పు అత్యంత కీలకమైన డబ్లింగ్ మార్గాల ప్రతిపాదన గుంతకల్లు డివిజన్లోని డోన్-పెండేకల్లు, కల్లూరు-ధర్మవరం అత్యవసర డబ్లింగ్ మార్గాలు. ఈ మార్గాల గుండా రైళ్ల రద్దీ అధికం. ఈ పనులు పూర్తి చేస్తే రైళ్ల క్రాసింగ్ సమస్య తీరుతుంది.నత్తనడకన డబ్లింగ్ పనులుగుంతకల్లు-కల్లూరు వయా గూళ్యపాళ్యం, కల్లూరు-ధర్మవరం మధ్య డబ్లింగ్ పనులకు రూ.50 కోట్లు కేటాయించారు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.గుంటూరు-గుంతకల్లు డబుల్‌లైన్ పనులకు రూ.1,400 కోట్లు అవసరమని రైల్వేబోర్డు నివేదికలు తయారు చేసింది. ఈ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది. ►ధర్మవరం-పాకాల మధ్య డబ్లింగ్ పనులకు రూ.10 కోట్లు కేటాయించినా సర్వేలో జాప్యం . ►హోస్పేట-గుంతకల్లు మధ్య డబ్లింగ్ పనులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. ►రేణిగుంట-తిరుపతి మధ్య డబ్లింగ్ పనులకు రూ.1.10 కోట్లు కేటాయించారు. ► రాయచూర్-గుంతకల్లు మార్గంలో పెండింగ్‌లో ఉన్న 13 కి.మీల డబ్లింగ్ పనులకు రూ.6 కోట్లు కేటాయించారు. -
మద్యం సేవిస్తూ వ్యక్తి మృతి
-
మద్యం సేవిస్తూ వ్యక్తి మృతి
గుంతకల్లు (అనంతపురం) : మద్యం సేవిస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక కసాపురం రోడ్డులో ఉన్న స్వాగత్ వైన్స్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి(40) మద్యం సేవిస్తూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కల్తీ మద్యం సేవించడం వల్లే మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పామాయిల్ గోదాములపై దాడులు
గుంతకల్లు (అనంతపురం) : పామాయిల్ గోదాములపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని నాలుగు గోదాములపై విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 47 లక్షల విలువ చేసే అక్రమ పామాయిల్ నిల్వలను సీజ్ చేశారు. -
పోలీసులు అనుమానించారని ఆత్మహత్య
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపురంలోఇటీవల జరిగిన చోరీ కేసులో నాగశేషు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. పోలీసులు అనుమానించారని మనస్తాపం చెందిన నాగశేషు ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన స్థానికులు బాధితుణ్ని వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందులూ నాగశేషు మృతి చెందాడు. అదే విధంగా గత వారంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్‌పై ప్రభుత్వం స్పందించింది. అనుమానాస్పద స్థితిలో మరణించిన బత్తెన శ్రీరాములు మృతిపై కలెక్టర్ కోన శశిధర్ మెజిస్టిరీయల్ విచారణకు ఆదేశించారు. -
12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని మొమినాబాద్లో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం అకస్మిక దాడి చేశారు. 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 60 వేల నగదుతోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం
గుంతకల్ టూటౌన్ పోలీసుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు... గుంతకల్ పట్టణంలోని గుత్తిరోడ్డులో మణికంఠ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో జాకీర్ హుస్సేన్ అనే యువకుడు మంగళవారం ఉదయం ఇంటి దగ్గర పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. జాకీర్ హుస్సేన్ వెల్డింగ్ పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హుస్సేన్ తండ్రి జిలాన్పాషా మట్కా రాసే పని చేసేవాడు. పాషా రెండేళ్ల క్రితమే మృతి చెందాడు. అయితే, హుస్సేన్ కూడా మట్కా రాసే పని చేస్తున్నాడన్న అనుమానంతో టూటౌన్ పోలీసులు హుస్సేన్‌ను గత 15 రోజులుగా తీసుకెళ్లి విచారిస్తున్నారు. రూ.85 వేలు కట్టాలని పోలీసులు డిమాండ్ చేశారని, కట్టలేననడంతో రోజూ విచారణ పేరుతో తీసుకెళ్లి, కౌన్సెలింగ్ ఇచ్చి సాయంత్రం వదిలిపెడుతున్నారని హుస్సేన్ తల్లి మల్లికాబేగం తెలిపారు. పోలీసుల వేధింపులతో ఆందోళన చెందే హుస్సేన్ ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపించారు. -
గుంతకల్లులో 'సూది సైకోలు'
గుంతకల్లు: హైదరాబాద్, శ్రీకాకుళం, గుంటూరు ప్రాంతాల్లో సంచలనం సృష్టిస్తున్న సూది సైకోలు అనంతపురం జిల్లా గుంతకల్లులో సోమవారం ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు అపరిచిత వ్యక్తులు రెడ్ పల్సర్ వాహనంపై ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని హెల్త్‌కేర్ ప్రైవేటు క్లినిక్ సమీపాన నిర్మాణంలో ఉన్న భవనం వద్ద తచ్చాడుతూ కనిపించారు. అటువైపుగా వెళ్లిన వెంకటేష్, సుంకన్నలు అపరిచిత వ్యక్తులను గుర్తించి ఎవరు మీరు? ఏ ఊరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. అపరిచిత వ్యక్తుల చేతుల్లోని సిరంజీలు (సూదిమందు) చూసి అవాక్కయ్యారు. సూది సైకోలు అనే అనుమానంతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ద్విచక్ర వాహనంలో పారిపోయారని చెప్పారు. కొద్ది దూరం వరకు వెంబడించినా ప్రయోజనం లేకపోయిందని వెంకటేష్, సుంకన్నలు తెలిపారు. సూది సైకోలు ద్విచక్ర వాహనంలో ఉరవకొండ పట్టణం వైపు పరుగులు పెట్టారని, ద్విచక్ర వాహనం నంబరుఏపీ21యూ (కర్నూలు జిల్లా రిజిస్ట్రేషన్ కల్గిన వాహనం) మాత్రమే గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు. అపరిచిత వ్యక్తులు స్టే చేసిన భవనం వద్ద పడి ఉన్న మందు కలిపిన ఖాళీ ప్లాస్టిక్ గ్లాస్‌ను చూసి స్థానికులు భయాందోళన చెందారు. పారిపోయింది సూది సైకోలా? లేదా హెరైన్, ఇతరత్ర మత్తు మందు బానిసలా? అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
నారాయణ కాలేజీ ముందు విద్యార్థి ఫెడరేషన్ ధర్నా
గుంతకల్లు (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని నారాయణ జూనియర్ కాలేజీ ఎదుట తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ ధర్నాకు దిగింది. ఆదివారం సెలవు దినం అయినా కూడా తరగతులు నిర్వహిస్తున్నందుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తీవ్ర ఒత్తిళ్లకు గురైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. -
ఎస్బీహెచ్లో అగ్నిప్రమాదం
అనంతపురం : అనంతపురం జిల్లా గుంతకల్ మండల కేంద్రంలోని ఎస్బీహెచ్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం విధుల్లోకి వచ్చిన సిబ్బంది కంప్యూటర్ ఆన్ చేయడంతోనే కేబుల్ వైర్ ద్వారా షార్ట్‌సర్క్యూట్ అయి అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంకు అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో బ్యాంక్ సిబ్బంది స్థానికులతో సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం వల్ల ఈ రోజు బ్యాంకు లావాదేవిలకు అంతరాయం కలగనుందని ఎస్బీహెచ్ మేనేజర్ వెల్లడించారు. -
టీడీపీ నేత రెస్ట్రూమ్లో పేకాట
9 మంది అరెస్ట్ రూ. 21 లక్షల నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం - గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ తెలుగుదేశం నాయకుడి రెస్ట్‌రూంలో పెద్ద స్థాయిలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వారినుంచి రూ. 21.74 లక్షల నగుదు, 11 ఏటీఎం కార్డులు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు అర్బన్ సీఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపిన వివరాల మేరకు... జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని యస్‌యల్‌వి థియేటర్ సమీపంలో టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సోదరుడు రాణా ప్రతాప్ రెస్ట్‌రూమ్‌పై జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న పట్టణానికి చెందిన రాణా ప్రతాప్ అనుచరులు సూర్యనారాయణ, సత్యనారాయణ, హఫీజ్ ఖాన్‌లతో పాటు రాయచూరు తదితర ప్రాంతాలకు చెందిన వెంకటేశ్వర్లు, ఎండి.ఆరీఫ్, వి.వెంకటే ష్, రాఘవ, ఎం.జయరామ్, కుమార్‌లను అరెస్ట్ చేశారు. మట్కా, పేకాట ఆడుతూ రూ. 50 వేలతో పట్టుబడే నిందితులను మీడియా ముందుకి చూపే పోలీసు అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తంతో పట్టుబడిన పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులను మీడియా ముందుకు చూపడానికి వెనుకంజ వేశారు. వివరాలు చెప్పాలని పాత్రికేయులంతా గట్టిగా పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో కేవలం స్వాధీనం చేసుకున్న డబ్బును మాత్రమే చూపి చేతులు దులుపుకున్నారు. -
వితంతువుపై అత్యాచారం
గుంతకల్లు టౌన్ (అనంతపురం) : ఒంటరిగా ఉన్న వితంతువుపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటంతోపాటు, వారిలో ఒకరు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని నాగప్పకాలనీకి చెందిన వితంతువు(38) మంగళవారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో బేల్దారి మస్తానయ్య(35), మరో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. వారంతా కలసి ఆమెను చితకబాదారు. అనంతరం మస్తానయ్య ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు శుక్రవారం సాయంత్రం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
అనంతపురం: అనంతపురంలో దారుణం జరిగింది. జీవితాంతం వెంట ఉండాల్సిన భర్త కాలయముడిగా మారాడు. కిరాతకంగా కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది. వివరాలు.. సునిత (25) అనే మహిళను తన భర్త సంతోశ్ కుమార్ గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భాను మృతి చెందింది. భాను ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం. గత కొద్ది కాలంగా భార్య సునీతను సంతోశ్ అనుమానించేవాడు. పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న సంతోశ్ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులోనే భార్యను హత్య చేసి ఉంటాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఏ తల్లి కన్నబిడ్డో!
అనంతపురం(గుంతకల్లు టౌన్): ముద్దులొలికే ఓ చిన్నారిని ఓ ప్రెవేట్ ఆస్పత్రిలోనే ఎవరో వదిలివేశారు. అమ్మఒడిలో వెచ్చగా హాయిగా ఒదిగిపోవాల్సిన ఆ పసికందు గుక్క పట్టి ఏడుస్తుంటే ఆస్పత్రిలో పనిచేసే మహిళలు అక్కున చేర్చుకుని చిన్నారికి పాలు పట్టించి ఓదార్చారు. ఈ ఘటన మంగళవారం ఉదయం గుంతకల్లు పట్టణంలోని శ్రీ పద్మావతి శ్రీనివాస మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పద్మావతి ఆస్పత్రి ఓపి విభాగంలో సరిగ్గా 11 గంటల సమయంలో నెల రోజుల వయస్సు కలిగిన ఓ ఆడశిశువు గుక్కపట్టి ఏడుస్తోంది. అక్కడ ఉన్ననర్సులు ఆస్పత్రికి వచ్చిన వారే చిన్నారిని అక్కడ పడుకోపెట్టి చికిత్స చేయించుకునేందుకు వెళ్లారేమోనని భావించారు. గంటసేపయినా ఆ చిన్నారి తాలూకా వారు ఎవరూ రాలేదు. దీంతో ఆస్పత్రిలో పనిచేసే నర్సు గౌరమ్మ తన అక్కున చేర్చుకుని పాపాయికి పాలు పట్టి ఓదార్చింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు ఆస్పత్రి సిబ్బందిని విచారించారు. చైల్డ్‌లైన్‌కు చిన్నారిని అప్పగించారు. శిశువుకు వైద్యపరీక్షలు చేయించిన తరువాత వారి తల్లిదండ్రుల కోసం ఒక రోజు పాటు తమ వద్ద అబ్జర్వేషన్లో ఉంచుకుని, బుధవారం అనంతపురంలోని శిశువిహార్‌కు తరలిస్తామని చైల్డ్‌లైన్ బాధ్యురాలు చెప్పారు. ఆడపిల్ల పుట్టిందనే కారణం చేతనే శిశువును వదిలేసి వెళ్లారా? ఎవరు వదిలారు? అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు మట్కాబీటర్ల అరెస్ట్
పట్టణంలోని పోర్టర్స్ లైన్లో మట్కా నిర్వహిస్తున్న ముగ్గురు బీటర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 2.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ ఎస్ఐ నగేష్ బాబూ తెలిపారు. మంగళవారం సాయంత్రం గుంతకల్లుకి చెందిన కెఆర్. కృష్ణమూర్తి, బళ్లారికి చెందిన షాకీర్, కర్నూల్ జిల్లా ప్యాపిలికి చెందిన సుధాకర్ రెడ్డిలు మట్కా నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. -
రాజధాని ఇవ్వకపోతే మళ్లీ విభజన
రాయలసీమ రాజధాని సాధన సమితి కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి గుంతకల్లు టౌన్ : రాయలసీమ జిల్లాల్లో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయకపోతే రాయలసీమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని రాయలసీమ రాజధాని సాధన సమితి కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం జిల్లా గుంతకల్లులోని పరిటాల కళ్యాణ మండపంలో ‘ఆంధ్రప్రదేశ్ రాజ ధాని రాయలసీమ ప్రజల హక్కు’ సాధన కోసం న్యూడమోక్రసీ జిల్లా కమిటీ సభ్యు డు సురేష్ అధ్యక్షతన భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీమ ప్రాంతానికి చెందిన మంత్రులు రాయలసీమలో రాజ ధాని ఏర్పాటు కోసం నోరు విప్పే పరిస్థితి లేదని, పొరపాటున ఎవరైనా మాట్లాడితే తమ పదవులను బాబు బర్తరఫ్ చేస్తారన్న భయంతో వారంతా వణికిపోతున్నారని ఆరోపించారు. శివరామకష్ణన్ కమిటీ నివేదిక రాయలసీమకు అనుకూలంగా రానున్న నేపథ్యంలో రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయాలని రాయలసీమకు చెందిన మంత్రులతోనే ప్రతిపాదనలను పెట్టించి నాటకాలాడుతున్నారని విమర్శించారు. అన్ని రంగాల్లో అభివ ద్ధి చెందిన విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనే తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలోని కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు, మేధావులు, ప్రజా సంఘాల అభిప్రాయం మేరకు రాయలసీమ ప్రాంత అభివ ద్ధిలో భాగంగా నీళ్లు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి 350 టిఎంసిల నికర జలాలను మళ్లించాలని, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ‘సీమ’ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శులు గాదె దివాకర్, శ్యామలారెడ్డి, జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, న్యాయవాది నాగరాజులు మాట్లాడుతూ రాయలసీమ రాజధాని సాధన కోసం ప్రజలంతా ఉద్యమించని పక్షంలో రాయలసీమ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. -
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
అనంతపురం : అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. గుంతకల్లు హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడింది. ఇద్దరు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు కుటుంబం తన కుమార్తె, అల్లుడితో కలిసి ఉంటోంది. అల్లుడు బాబుకు వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆ కుటుంబం ఈ ఘటనకు పాల్పడింది. ముందుగా చిన్నారులు నవనీత్, యశశ్రీని గొంతు నులిమి చంపి అనంతరం శ్రీనివాసులు భార్య జయలక్ష్మి, కుమార్తె రాజేశ్వరి, అల్లుడు బాబు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా శ్రీనివాసులు ఆ సమయంలో ఇంట్లో లేడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. -
'అనంత'లో సాక్షి విలేకరిపై పోలీసుల జులుం
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు అరాచకంగా వ్యవహరించారు. సాక్షి విలేకరి శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ బెదిరించారు. ఎస్ఐ రామయ్య, పోలీసులు శ్రీనివాస్‌పై దాడి చేసి గాయపర్చారు. -
కుక్కలను చంపి.. కారం చల్లి..
గుంతకల్లు రూరల్, న్యూస్‌లైన్ : గుంతకల్లులో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. వీధి కుక్కలకు విషం పెట్టిన దుండగలు.. చోరీ చేసిన ఇంట్లో ఆనవాళ్లు లభ్యం కాకుండా కారం పొడి చల్లారు. గుంతకల్లు రైల్వే జిల్లా ఎస్పీ కార్యాలయానికి వంద అడుగుల దూరంలోని వివేకానందనగర్ (వీవీ నగర్) రైల్వే క్వార్టర్స్‌లో జరిగిన ఈ ఘటనలో 30 తులాల బంగారం, కిలో వెండి, రూ.22 వేల నగదు చోరీ అయ్యాయి. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కసాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీవీ నగర్ రైల్వే క్వార్టర్స్‌లో గుంతకల్లు డీజిల్ షెడ్లో పని చేస్తున్న బీఏ నాగరాజు నివాసం ఉంటున్నారు. తన సమీప బంధువు అనారోగ్యంగా ఉండడంతో చూసేందుకు ఈనెల 2న బెంగళూరుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఆదివారం ఇంటి తలుపులు తెరచి ఉండడం.. సమీపంలో మూడు వీధి కుక్కలు చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు తెలియజేయగా వారు నాగరాజుకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఇక్కడికి చేరుకున్న నాగరాజు.. ఇంట్లోకి వెళ్లిచూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇళ్లంతా కారం పొడి చల్లి ఉండడాన్ని గుర్తించి బెడ్రూంలోకి వెళ్లారు. రెండు బీరువాలను పగులగొట్టిన దుండగులు అందులోని 30 తులాల బంగారు నగలు, కిలో వెండి సామగ్రి, రూ.22 వేల నగదు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా దుండగులు పక్కా ప్రణాళికతో చోరీ చేసినట్లు స్పష్టమవుతోంది. రాత్రి వేళ వీధి కుక్కలు అరవకుండా ఉండేందుకు విషప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఆహారంలో విషం కలిపి కాలనీలో వేయడంతో అవి తిని చనిపోయాక గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేసినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. పైగా ఇంట్లో ఆధారాలు లేకుండా ఉండేందుకు కారం పొడి చల్లినట్లు తెలుస్తోంది. కాగా, శనివారం రాత్రి రైల్వే క్వార్టర్స్‌లో పోలీసులు గస్తీ నిర్వహించలేదని స్థానికులు చెబుతున్నారు. సివిల్ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. క్లూస్ టీం సిబ్బంది, కసాపురం ఎస్ఐ వెంకటరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
దొంగనోట్ల ‘ఇంజనీర్’ అరెస్ట్
గుంతకల్లు: ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగం రాకపోవడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఓ యువకుడు దొంగనోట్లు ముద్రించి, వాటిని చలామణి చేసేందుకు యత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులో డీఎస్పీ సీహెచ్ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు... స్థానిక సత్యనారాయణపేటలోని వాల్మీకినగర్‌లో నివాసముంటున్న రామాంజనేయులు కుమారుడు కళ్యాణ చక్రవర్తి కర్ణాటకలోని బెల్గాంలో మూడేళ్ల క్రితం ఇంజనీరింగ్ (బీఈ) పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఉద్యోగం రాకపోవడంతో కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో సొంతంగా సాఫ్ట్వేర్ రూపొందించుకుని నకిలీ నోట్లు ముద్రించాడు. వాటిని కర్నూలు జిల్లా ఆలూరులో చలామణి చేసేందుకు వెళుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
725/11
మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నాలుగో రోజు గురువారం జిల్లాలోని 11 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 323 వార్డులకు 725 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారంతో నామినేషన్ల ఘట్టానికి తెరపడనుంది. నాలుగో రోజున అత్యధికంగా గుంతకల్లు మునిసిపాలిటీలో 148 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ తర ఫున 193, టీడీపీ తరఫున 232, స్వతంత్ర అభ్యర్థులుగా 180, కాంగ్రెస్ తరఫున 55, సీపీఐ తరఫున 22, బీజేపీ తరఫున 2, సీపీఎం తరఫున పది మంది, ఇతర పార్టీల నుంచి 10 మంది, లోక్‌సత్తా నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. హిందూపురం మునిసిపాలిటీలో 74, గుంతకల్లులో 148, తాడిపత్రిలో 68, ధర్మవరంలో 75, కదిరిలో 89, రాయదుర్గంలో 32, మడకశిరలో 26, పుట్టపర్తిలో 44, గుత్తిలో 62, పామిడిలో 25, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలో 82 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, పామిడి మునిసిపాలిటీల్లో ఇప్పటి వరకు ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. కాంగ్రెస్ తరఫున హిందూపురంలో ముగ్గురు, ధర్మవరంలో ఒకరు నామినేషన్ వేశారు. కార్పొరేషన్లో ముగిసిన నామినేషన్ల పర్వం 50 డివిజన్లకు మొత్తం 403 చివరి రోజున 254, మొదటి మూడు రోజులు 149 వైఎస్సార్సీపీ 129, టీ డీపీ 140 స్వతంత్రులు 69, కాంగ్రెస్ 23 బీజేపీ 14, సీపీఎం 6, సీపీఐ 4 ఇతర పార్టీలు 8, లోక్‌సత్తా 6, బీఎస్పీ 3 -
గుంతకల్లు ‘దేశంలో’ క్రికెట్ బెట్టింగ్ కలకలం
అనంతపురం:గుంతకల్లు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం కలకలం రేపింది. గురువారం తాడిపత్రిలో నలుగురు చోటా క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ నలుగురూ వెంకటశివుడు యాదవ్ అలియాస్ నందపాడు శివ అలియాస్ శివయ్య యాదవ్‌ను ప్రధాన బుకీగా వెల్లడించారని పోలీసులు ప్రకటించారు. వెంకటశివుడు యాదవ్ గుంతకల్లు నుంచి టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోండటం.. ఇదే సమయంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం బయటపడటంతో సంచలనం రేపింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు వెంకటశివుడు యాదవ్ సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతో గుంతకల్లు నుంచి టీడీపీ టికెట్ ఇప్పించాలని నాలుగేళ్లుగా యనమలపై ఆయన ఒత్తిడి తెస్తున్నారు. వాటి ఫలితంగా గుంతకల్లు నుంచి టీడీపీ టికెట్ వెంకటశివుడు యాదవ్‌కు దక్కడం ఖాయమనే భావన ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఇటీవల గుంతకల్లు నుంచి వెంకటశివుడు యాదవ్‌కు టికెట్ దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు ప్రకటించడమే అందుకు తార్కాణం. టీడీపీ టికెట్ తనకే దక్కే అవకాశాలు ఉండటంతో వెంకటశివుడు యాదవ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తాడిపత్రిలో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. తాడిపత్రిలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతోన్న సుదర్శన్, జగన్మోహన్, జనార్దనరెడ్డి, శ్రీరాములును అరెస్టుచేసి వారి నుంచి నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ నాగరాజు, సీఐ సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. నలుగురు నిందితులను విచారణ చేయగా ప్రొద్దుటూరుకు చెందిన నరసింహులు, నందపాడుకు చెందిన శివయాదవ్(శివ)తోపాటు జీవరత్నంరెడ్డి, శివుడు, నూర్, లక్ష్మినారాయణ, జావేద్, లోకేశ్వరరెడ్డి, ధనేశ్వర్‌రెడ్డి, దిలీప్‌కుమార్‌రెడ్డి, ఉమాపతినాయుడు ప్రధాన బుకీలుగా వ్యవహరిస్తున్నారని వెల్లడించినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. నిందితులు చెప్పిన మేరకు ప్రధాన బుకీల బ్యాంకు అకౌంట్ నెంబర్లను.. లావాదేవీలను పరిశీలించి, నిందితులను అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఇందుకు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది వెంకటశివుడు యాదవ్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని ఓ ప్రజాప్రతినిధి సహకారం కోరినట్లు సమాచారం. ఆ ప్రజాప్రతినిధి తాడిపత్రి పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. -
కొంప ముంచుతున్న నిపుణుల కొరత
గుంతకల్లు, న్యూస్‌లైన్: రైల్వేలో ఆర్థిక సంస్కరణల పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయనే దానికి వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు బలం చేకూరుస్తున్నాయి. మిగులుబాటు, ఆదాయ ఆర్జన పేరుతో రైల్వే శాఖలో స్కిల్డ్ కార్మికుల పోస్టుల సంఖ్య తగ్గిస్తున్నారు. అదే సమయంలో రైళ్ల సంఖ్యను భారీగా పెంచుతున్నారు. పెరిగిన రైళ్ల సంఖ్య, కోచ్‌ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచకపోగా వాటి నిర్వహణను ఔట్సోర్సింగ్ పేరుతోప్రైవేటు వారికి అప్పగిస్తున్నారు. ముఖ్యంగా ట్రైన్ లైటింగ్, ఏసీ కోచ్‌ల నిర్వహణ లాంటి కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పచెబుతున్నారు. దీనికి తోడు రైల్వే అధికారుల్లో అవినీతి పెచ్చుమీరుతుండడంతో ప్రైవేటు కాంట్రాక్టర్లు రైళ్ల నిర్వహణ విషయంలో బాధ్యతగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రైళ్లు, కోచ్‌లు రెగ్యులర్‌గా నిర్వహణకు నోచుకోవడం లేదు. రైల్వేలో కేవలం నిర్వహణలోపం, మానవతప్పిదాల వల్ల సగటున వారానికి ఒక ప్రమాదం చోటు చేసుకుంటున్నట్లు రైల్వే రికార్డులు వెల్లడిస్తున్నాయి. రెండు మూడు నెలలకో ప్రమాదంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాతపడుతున్నారు. పీరియాడికల్ చెకప్ ఏదీ ? ట్రైన్ ఫార్మేషన్ కానీ, గూడ్స్ ట్రైన్ రేక్ కానీ డిపోలకు వెళ్లగానే ఒక వారం పాటు క్షుణ్ణంగా పరిశీలించి, రైల్వే నిర్దేశించిన 25 అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఒక్కో కోచ్‌కు ఒక లాగ్‌బుక్ మెయింటెన్ చేయాలి. సమస్యలు ఉంటే అందులో నమోదు చేయాలి. పాత కోచ్‌లైతే వాటి లైఫ్ సర్టిఫికెట్లు పరిశీలించాలి. పీరియాడికల్ ఓవరాలింగ్ చేయాల్సి ఉందా? లేదా? చెక్ చేయాలి. టెక్నీషియన్లు కోచ్‌ల చక్రాలు, బ్రేక్ బ్లాక్‌లను చూడాలి. చక్రాల పరిమాణాన్ని చెక్ చేయాలి. కోచ్ చక్రాల్లో ఏవైనా 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ అరుగుదల ఉంటే వెంటనే వాటిని మార్చాలి. చక్రాల వద్ద ఉంటే కప్పుల్లో ఆయిల్‌ను చూసుకోవాలి. ఎలక్ట్రికల్ విభాగం కార్మికులు పవర్ ఉందా? లేదా? బ్యాటరీల పరిస్థితి ఏమిటి? ఫ్యాన్లు తిరుగుతున్నాయా? లేదా? పరిశీలించాలి. ఏసీ మెకానిక్‌లు కూడా ఏసీ పరికరాలను, వైరింగ్‌ను చెక్ చేయాలి. ఈ పనులన్నీ కోచింగ్ డిపోలో సీఅండ్‌డబ్ల్యూ, ఎలక్ట్రిక్, ఏసీ విభాగం సెక్షన్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో సూపర్వైజర్ల పర్యవేక్షణలో నిర్ణీత కాలంలోనే చేయాలి. అయితే మానవ వనరుల కొరత పేరుతో ఈ పని సక్రమంగా జరగడం లేదు. రైలింజన్ల నిర్వహణ మరీ దారుణం.. గతంలో రైలింజన్(లోకో)లను 15 రోజులకు ఒక పర్యాయం షెడ్డుకు తీసుకువచ్చి ప్రతి పార్టును 48 గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించి, ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే చేసి పంపేవారు. అయితే లోకోల టెక్నాలజీల అప్‌గ్రెడేషన్ అంటూ కారణం చూపి లోకోల పీరియాడికల్ చెకప్‌ను 30 రోజులకు పెంచారు. రైళ్ల సంఖ్యను పెంచడంతో లోకోల సంఖ్య భారీగా పెరిగిపోయింది. కానీ సిబ్బంది సంఖ్య పెరగలేదు. దీంతో ఒక రైలింజన్ పట్టాల మీద పరుగులు తీయడం ప్రారంభించిన తర్వాత నిర్వహణ కోసం షెడ్డుకు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. దీంతో రైలింజన్లు మార్గం మధ్యలో మొరాయించడం బాగా పెరిగింది. ఇందుకు బెంగళూరు నగరమే ఉదాహరణ. బెంగళూరు నగరానికి ప్రతి రోజూ వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో 30 నుంచి 40 రైళ్లకు బెంగళూరు కోచింగ్ డిపోలో చెక్ చేయాలి. అన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను చెక్ చేయడం కష్టం. పైగా అతంతమాత్రంగా ఉన్న సిబ్బందితోనే తూతూ మంత్రంగా తనిఖీ కానిచ్చేస్తుండడంతో ఆయా రైళ్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని రైల్వేలోని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ సిద్ధాంతాలు రైల్వేకు పనికిరావు భారతీయ రైల్వేకు విదేశీ పద్దతులు, సంస్కరణలు, రాజకీయ సిద్ధాంతాలు ఏ మాత్రం సరికాదని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ మాజీ కార్యదర్శి సుబ్బనర్సయ్య అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు ఖర్చుల గురించి ఆలోచిస్తూ సంస్కరణల పేరుతో రైల్వేను పరోక్షంగా దెబ్బతీస్తూ మనుషుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా నిపుణులైన పనివారిని నియమించడం లేదన్నారు. నిర్వహణ ప్రైవేట్ వారికి వదిలేయడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. - సుబ్బనర్సయ్య, దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ మాజీ కార్యదర్శి. -
బహిరంగ కౌన్సెలింగ్ ఫలితం..
-
బహిరంగ కౌన్సెలింగ్ ఫలితం.. గ్రేహౌండ్స్‌కు డీఎస్పీ సుప్రజ
గుంతకల్లులో కొంతమందికి బహిరంగంగా కౌన్సెలింగ్ నిర్వహించినందుకు గాను డీఎస్పీ సుప్రజపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. హత్యకేసులో నిందితులకు బహిరంగంగా కౌన్సెలింగ్ నిర్వహించినందుకు గాను మూడు నెలల పాటు గ్రేహౌండ్స్ శిక్షణకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఆదివారం నాడు డీఎస్పీ సుప్రజ ఆదేశాలతో గుంతకల్లు పోలీసులు చెలరేగిపోయారు. నిందితులను ఊరేగించడంతోపాటు బహిరంగంగా రోడ్డుపైనే లాఠీలతో వారికి బుద్ధి చెప్పారు. రోడ్డు మీదే నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్ చేయించుకున్న నలుగురిలో శేఖర్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. స్వయానా పిల్లనిచ్చిన మామనే చంపాడన్న ఆరోపణ అతడిపై వచ్చింది. కొంతకాలం వైవాహిక జీవితాన్ని బాగానే అనుభవించాడు. ఆ తర్వాత అసలు గొడవలు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో విభేదాలు పొడచూపాయి. దీంతో శేఖర్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో ఆమె ఇంటికి వెళ్లి, రమ్మని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె తండ్రి మల్లన్నతో శేఖర్ గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగానే జరిగింది. ఆ తర్వాత మల్లన్నను తన స్నేహితులతో కలిసి శేఖర్ హతమార్చాడన్న ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండు రోజుల్లోనే శేఖర్, అతని స్నేహితులను పట్టుకున్నారు. వారందరినీ రోడ్డుపైనే కుళ్లబొడిచారు. గుంతకల్లు డీఎస్పీ సుప్రజ లాఠీ అందుకుని శేఖర్ వీపు విమానం మోత మోగించారు. -
గుంతకల్లులో కర్తవ్యం సినిమా సీన్
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో కర్తవ్యం సినిమా సీన్ లైవ్‌లో చూపించారు పోలీసులు. దోషులు దొరికితే దులిపేయడమే ఈ సినామాలో విజయశాంతి స్టైల్. గుంతకల్‌లో మహిళాపోలీస్ అధికారి సుప్రజ కూడా కర్తవ్యం విజయశాంతిని మరిపించారు. రక్తం రుచిమరిగిన హంతకులకు నడిరోడ్డుపై తగిన శాస్తి చేశారు. డీఎస్పి సుప్రజ ఆదేశాలతో గుంతకల్ పోలీసులు గబ్బర్ సింగుల్లా చెలరేగిపోయారు. నిందితులను పట్టుకుని ఊర్లో ఊరేగించడంతోపాటు బహిరంగంగా రోడ్డుపైనే లాఠీలతో వారికి గానాభజానా చేశారు. రోడ్డు మీదే నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ అంటే మాటలనుకునేదు. ఏకంగా లాఠీ దెబ్బలతో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. అవసరమైతే నిందితులకు లాకప్‌లోనే నాలుగు తగిలించడం పోలీసులకు అలవాటే. అయితే ఈ ప్రత్యేక కౌన్సెలింగ్ చూసే జనానికి కాస్త కొత్త అనిపించింది. ఎందుకంటే ఇది పోలీసులకు అలవాటైన పనైనా రోడ్డు మీద చేయడం కదా! ఇంతకీ ఈ కౌన్సెలింగ్ చేయించుకున్న నలుగురిలో శేఖర్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. శేఖర్ తన స్నేహితులతో కలసి ఓ వ్యక్తిని హత్య చేశాడు. శేఖర్ హత్య చేసింది ఎవరినో కాదు. స్వయానా పిల్లనిచ్చిన మామనే. పిల్లనిచ్చిన అనడం సరికాదేమో. ఎందుకంటే శేఖర్‌ది ప్రేమ వివాహం. కొంతకాలం వైవాహిక జీవితాన్ని బాగానే అనుభవించాడు. ఆ తర్వాత అసలు గొడవలు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో విభేదాలు పొడచూపాయి. దీంతో శేఖర్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో శేఖర్‌లో అసహనం పెరిగింది. ఆమె ఇంటికి వెళ్లాడు. తనతో రమ్మని అడిగాడు. ఆమె కుదరదని చెప్పింది. ఆమె తండ్రి తాపీ మేస్త్రీ అయిన మల్లన్నతో శేఖర్ గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగానే జరిగింది. దీంతో శేఖర్ మల్లన్నపై కోపం పెంచుకున్నాడు.ఎలాగైనా మల్లన్నను మట్టుబెట్టాలనుకున్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలసి మల్లన్న హత్యకు పక్కా ప్రణాళిక సిద్దం చేశాడు. గురువారం రాత్రి పని ముగించుకుని మల్లన్న ఇంటికి వెళ్తున్నాడు. ఇది ముందే ఊహించిన శేఖర్ అతని స్నేహితులు కాపు కాశారు. మాటు వేసి వేటకొడవళ్లతో మల్లన్నను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. దారుణంగా హత్య చేసిన తర్వాత శేఖర్ తన మిత్రులతో కలిసి పారిపోయాడు. విషయం తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేగంగా దర్యాప్తు జరిపారు. కేవలం రెండు రోజుల్లోనే శేఖర్, అతని స్నేహితులను పట్టుకున్నారు. హత్య చేసింది వారేనని నిర్ధారణ అయింది. అయితే ఈ సారి పోలీసులు కొంచెం కొత్తగా ఆలోచించారు. ఎప్పుడూ వారు లాకప్‌లో చేసే దాన్ని రోడ్డు మీదే చేయాలనుకున్నారు. శేఖర్, అతని స్నేహితులను రోడ్డుపైనే కుళ్లబొడిచారు. గుంతకల్లు డీఎస్పీ సుప్రజ లాఠీ అందుకుని శేఖర్ వీపు విమానం మోత మోగించారు. పోలీసులు నిందితులకు ఇచ్చిన ఈ కౌన్సెలింగ్‌ను చాలా మంది ప్రజలు సమర్థించారు. నిందితులను ఖాకీలు కుల్లబొడుస్తుంటే, కొందరు యువకులు పోలీలు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కారాగారంలో ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించినా ఇటువంటి హంతకుల మనస్తత్వం మారదని జనం చెప్పారు. ఇలాంటి బహిరంగ శిక్షలతోనే హంతకుల్లో తప్పుచేశామనే భావన కలుగుతుందన్నారు. మరెప్పుడూ తప్పుచేయకూడదనే భయం కూడా మనసులో నిలిచిపోతుందన్నారు. ఇదిలా ఉంటే ఖాకీల చర్య సమర్థనీయం కాదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని విమర్శిస్తున్నారు. -
అనంతపురంలో ఆయిల్ సంక్షోభం
అనంతపురం జిల్లాలో ఆయిల్ సంక్షోభం నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గుంతకల్‌లో ఆయిల్ సిబ్బంది సమ్మెకు దిగారు. దాంతో గుంతకల్ నుంచి ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, కదిరి,గుంతకల్, పుట్టపర్తి పట్టణాలోని పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాంతో జిల్లాలోని ఆయిల్ అక్రమ వ్యాపారులు చెలరేగిపోయారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అధిక ధరకు ఆయిల్‌ను విక్రయిస్తున్నారు. విభజనకు నిరసనగా జిల్లాలో ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగుల చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. దాదాపు 70 రోజులుగా వెయ్యికిపైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. అనంతపురం రీజియన్‌లో ఆర్టీసికి రూ. 60 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ సంస్థ అధికారులు మంగళవారం వెల్లడించారు.