నేడు కదిరి, గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ ప్లీనరీలు | today ysrcp pleanary in kadiri and guntakal | Sakshi
Sakshi News home page

నేడు కదిరి, గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ ప్లీనరీలు

Published Fri, Jun 2 2017 10:49 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

today ysrcp pleanary in kadiri and guntakal

కదిరి / గుంతకల్లు టౌన్‌ : కదిరి, గుంతకల్లు నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ ప్లీనరీలు శనివారం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కదిరి పట్టణంలోని దత్తా గార్డెన్స్‌ ప్రాంగణంలో సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ప్లీనరీకి పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి,  ప్లీనరీ ఇన్‌చార్జ్ నదీం అహమ్మద్‌ హాజరుకానున్నారు. అలాగే గుంతకల్లు పట్టణంలోని శ్రీ వివేకానంద ఎంసీఏ కాలేజీలో సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్లీనరీ జరగనుంది. ఈ కార్యక్రమానికి కూడా పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలిరానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement