అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
అనంతపురం : అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్‌ఆర్ సీపీ నమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్లను మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ వర్గీయులు అడ్డుకున్నారు. డ్రైవర్‌పై కందికుంట వర్గీయులు దాడి చేసి, ఫ్లెక్సీలు చించివేశారు. ఈ ఘటనపై సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని, తాగునీటి సమస్య తీరుస్తుంటే ఆటంకాలు సృష్టించడం దుర్మార్గమన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.