
వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను సాదరంగా ఆహ్వానిస్తున్న కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి
తనకల్లు : నల్లచెరువు మండలంలో టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఉబిచెర్ల, గోర్లవారిపల్లి, నడిమిపల్లి, సుబ్బరాయునిపల్లికి చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉబిచెర్లలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ మారిన వారిలో ఉబిచెర్ల నుంచి శివన్న, గంగాద్రి, శ్రీరాములు, నరసింహులు, ఆంజినేయులు, హరీష్‌కుమార్, శేఖర్, హరిప్రసాద్, శ్రీరాములు, జయచంద్ర, నరసింహులు, మహేష్, మధు, రాము, శ్రీనివాసులు, తలారి నరసింహులు, మనోహర్‌రెడ్డి, ఆనంద్, లక్ష్మీనారాయణ, గోర్లవారిపల్లి నుంచి నరసింహులు, హైదర్‌వలి, బాబ్‌జాన్, అంజనప్ప, నడిమిపల్లి నుంచి సాయికృష్ణ, మహిమరాజు, అరవిందు, జయచంద్రారెడ్డి, కుళ్లాయప్ప, తిరుపాలు, నరసింహులు, చంద్రమోహన్, సుబ్బరాయునిపల్లి నుంచి పురుషోత్తంరెడ్డి, రామయ్య, సూర్యనారాయణరెడ్డి, సూరి, బావయ్య, గంగులప్ప, సోమశేఖర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, అక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయన్నారు.
టీడీపీలో నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు. అందునా రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమనే విషయాన్ని తాము గుర్తించామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సైనికుల్లా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథనాయుడు, జిల్లా కార్యదర్శి లక్ష్మీపతియాదవ్, నాయకులు కిష్టప్ప, అక్బర్, యువజన విభాగం మండల కన్వీనర్ నాగభూషణ, ఎంపీటీసీ శివారెడ్డి పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment