కందికుంట.. నీటి తంటా | water bundh in kadiri | Sakshi
Sakshi News home page

కందికుంట.. నీటి తంటా

Published Sat, Sep 9 2017 10:58 PM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

కందికుంట.. నీటి తంటా

కందికుంట.. నీటి తంటా

- ట్యాంకర్‌ డ్రైవర్‌కు బెదిరింపు
- ట్యాంకర్‌పై ఉన్న ఫ్లెక్సీల చింపివేత


కదిరి: పట్టణవాసులకు ఉచితంగా సరఫరా చేస్తున్న తాగునీటిని టీడీపీ నాయకుడు కందికుంట అడ్డుకున్నారు. ఆయన అనుచరులు శనివారం వీరంగం సృష్టించి నీటిని సరఫరా చేస్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ను బెదిరించి ట్రాక్టర్‌పై ఉన్న ఫ్లెక్సీలను బలవంతంగా తొలగించారు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణానికి మంచినీరు సరఫరా అవుతున్న పార్నపల్లి రిజర్వాయర్‌ పూర్తిగా అడుగంటడంతో కొద్ది రోజులుగా కదిరికి తాగునీరు సరఫరా కావడం లేదు. ప్రజల ఇబ్బందిని గమనించిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి కొన్ని రోజులుగా 3 ట్యాంకర్లు ఏర్పాటు చేసి పట్టణమంతా నీరు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. వీటి మూలంగా పట్టణంలో నీటి సమస్య కొంతవరకు తీరింది.

దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్‌ మంచినీటిపై కూడా దిగజారుడు రాజకీయానికి దిగారు. శనివారం సిద్ధారెడ్డికి సంబంధించిన నీటి ట్యాంకర్‌ డ్రైవర్‌ను కందికుంట అనుచరులు బెదిరించారు. చొక్కా పట్టుకుని ‘కందికుంట అన్న’ పిలుస్తున్నాడంటూ బలవంతంగా కందికుంట ఇంటి దగ్గరకు లాక్కెళ్లారు. ‘రేయ్‌ ఎవర్రా నీకు మంచినీళ్లు సరఫరా చేయమని చెప్పింది?’ అని కందికుంట ప్రశ్నించాడు. ఇందుకు ట్యాంకర్‌ డ్రైవర్‌ డా.సిద్దారెడ్డి సార్‌ చెబితే వార్డులో నీళ్లు ఫ్రీగా సరఫరా చేస్తున్నాం’ అని సమాధానమిచ్చాడు. ఇందుకు ఆగ్రహించిన కందికుంట రేయ్‌ వెంటనే ఆ ట్యాంకర్‌పై ఉన్న స్టిక్కర్‌ను తొలగించండి అంటూ ఆయన అనుచరులను ఆదేశించాడు. వెంటనే వారు స్టిక్కర్లను తొలగించారు. చేసేదేం లేక ట్యాంకర్‌ డ్రైవర్‌ భయంతో వెనుదిరిగాడు. కందికుంట జోక్యంతో మంచినీటి సరఫరా శనివారం మధ్యాహ్నం నుంచి ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement