డిసెంబర్‌ 11, 12 తేదీల్లో హనుమద్‌వ్రతం | December 11 and 12, respectively hanumadvratam | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 11, 12 తేదీల్లో హనుమద్‌వ్రతం

Published Tue, Oct 25 2016 12:33 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

December 11 and 12, respectively hanumadvratam

  •  నెల 31 నుంచి మండల దీక్షలు ప్రారంభం
  • గుంతకల్లు రూరల్‌:   కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో డిసెంబర్‌ 11,12 తేదీల్లో  హనుమద్‌వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు  ఆలయ ఈవో ముత్యాలరావు  తెలిపారు. సోమవారం ఆలయంలో  హనుమద్‌వ్రతం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.   ఈవో, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి  హనుమద్‌ వ్రత మండల దీక్షలు , నవంబర్‌ 21 నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు.  డిసెంబర్‌ 11న స్వామివారి తిరుఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.   డిసెంబర్‌ 12 న స్థానిక గంగా నిలయంలో  హనుమద్‌ వ్రతం కార్యక్రమాన్ని  నిర్వహించనున్నామన్నారు.  ఆలయ ప్రధాన అర్చకుడు వసుదరాజాచార్యులు,   ఏఈవో మధు, సూపరింటెండెంట్‌ మల్లయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

     

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement