మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నాలుగో రోజు గురువారం జిల్లాలోని 11 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 323 వార్డులకు 725 నామినేషన్లు దాఖలయ్యాయి.
శుక్రవారంతో నామినేషన్ల ఘట్టానికి తెరపడనుంది. నాలుగో రోజున అత్యధికంగా గుంతకల్లు మునిసిపాలిటీలో 148 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్‌ఆర్‌సీపీ తర ఫున 193, టీడీపీ తరఫున 232, స్వతంత్ర అభ్యర్థులుగా 180, కాంగ్రెస్ తరఫున 55, సీపీఐ తరఫున 22, బీజేపీ తరఫున 2, సీపీఎం తరఫున పది మంది, ఇతర పార్టీల నుంచి 10 మంది, లోక్‌సత్తా నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు.
హిందూపురం మునిసిపాలిటీలో 74, గుంతకల్లులో 148, తాడిపత్రిలో 68, ధర్మవరంలో 75, కదిరిలో 89, రాయదుర్గంలో 32, మడకశిరలో 26, పుట్టపర్తిలో 44, గుత్తిలో 62, పామిడిలో 25, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలో 82 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, పామిడి మునిసిపాలిటీల్లో ఇప్పటి వరకు ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. కాంగ్రెస్ తరఫున హిందూపురంలో ముగ్గురు, ధర్మవరంలో ఒకరు నామినేషన్ వేశారు.
కార్పొరేషన్‌లో
ముగిసిన నామినేషన్ల పర్వం
50 డివిజన్లకు మొత్తం 403
చివరి రోజున 254, మొదటి మూడు రోజులు 149
వైఎస్సార్‌సీపీ 129, టీ డీపీ 140
స్వతంత్రులు 69, కాంగ్రెస్ 23
బీజేపీ 14, సీపీఎం 6, సీపీఐ 4
ఇతర పార్టీలు 8, లోక్‌సత్తా 6, బీఎస్‌పీ 3