Naminations
-
ఇస్తారా.. ఆపుతారా? నామినేటెడ్ పదవుల భర్తీపై ఉత్కంఠ!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ నేతలు గంపెడాశతో ఉన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు పొందడం కోసం ఆశావహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను రద్దు చేయగా.. జిల్లాస్థాయిలోనూ పలు పదవులను భర్తీచేయాల్సి ఉంది. ఈ నేపథ్యాన లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఆలోపే పదవులు భర్తీచేస్తారా, ఎన్నికల తర్వాతే పదవుల పందేరం ఉంటుందా అనే సందిగ్ధంలో ఆశావహులు ఉన్నారు. అయితే, పదవులు ఎప్పుడు భర్తీ చేసినా తమకే దక్కేలా నేతలు లాబీయింగ్‌లో నిమగ్నమయ్యారు.' రాష్ట్రస్థాయి పదవులే లక్ష్యం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు మిత్రపక్షమైన సీపీఐతో కలిసి కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను దక్కించుకుంది. అలాగే మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపథ్యాన జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఈ ముగ్గురు నేతల అనుచరుల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నేతలు ఉండగా.. పార్టీ అధికారంలోకి రావడంతో వీరంతా రాష్ట్రస్థాయి పదవులనే ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కూడా జిల్లాకు చెందిన కొండబాల కోటేశ్వరరావు కు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, బొర్రా రాజశేఖర్‌కు మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్, పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. దీంతో కాంగ్రెస్ హయాంలో కూడా జిల్లా నేతలకు రాష్ట్రస్థాయి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. జిల్లాస్థాయిలోనూ.. ఇక జిల్లాస్థాయి నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఏమీ లేదు. ఓ పక్క రాష్ట్రస్థాయి పదవుల కోసం ప్రయత్నిస్తూనే అది దక్కకపోతే ఉమ్మడిజిల్లా, జిల్లాస్థాయి పదవులు దక్కించుకోవాలనే వ్యూహంతో పలువురు నేతలు ఉన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలాగైనా పదవి పొందాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను రద్దు చేసిన నాటి నుంచే ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్లతో పాటు ఆలయాల పాలకవర్గాలు, ఇతర నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. త్వరలోనే లోక్‌సభ నోటిఫికేషన్! మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ తరుణాన నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే యత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను రద్దు చేయగా.. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులను కట్టబెట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. దీంతో త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని పలువురు భావించగా.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తి కావొస్తున్నా అడుగులు పడలేదు. మొదట్లో లోక్‌సభ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఎన్నికల తర్వాత జరుగుతుందా అనే మీమాంస నెలకొంది. ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే పదవులు రాని వారు పార్టీ అభ్యర్థుల తరఫున పనిచేయరనే భావనతో కొంతకాలం ఆపుతారని ప్రచారం జరుగుతుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. జాబితా పెద్దదే.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ప్రధాన అనుచరులుగా ఉన్న నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారు. భట్టికి ప్రధాన అనుచరులుగా మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో పాటు రాయల నాగేశ్వరరావు, నాగా సీతారాములు, పువ్వాళ దుర్గాప్రసాద్, జావీద్ కొనసాగుతున్నారు. అలాగే పొంగులేటికి బొర్రా రాజశేఖర్, మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మద్దినేని బేబిస్వర్ణకుమారి, మేకల మల్లిబాబు, తుమ్మలకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి, కమర్తపు మురళి, చావా నారాయణ అనుచరులుగా ఉన్నారు. ఇందులో కొందరు నామినేటెడ్, మరికొందరు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం. ఇవి చదవండి: బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం! మంత్రి కొండా సురేఖ -
అవార్డుల జాతర.. నామినేషన్ కోసం సిద్దమైన కార్లు ఇవే!
2023 అక్టోబర్ 30న 'ఆటో అవార్డ్స్ సెషన్ 3' (Auto Awards Season 3) కార్యక్రమం జరగనుంది. ఇందులో ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ కార్లు చూపరులను కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్‌తో సహా వివిధ విభాగాల్లో అవార్డుల కోసం నామినేషన్లు జరుగుతాయి. సోమవారం (2023 అక్టోబర్ 30న) జరగనున్న ఈ కార్యక్రంలో ఏ అవార్డు ఏ కారు సొంత చేసుకుంటుందనే విషయాలు అధికారికంగా విడుదలవుతాయి. ఆటో అవార్డ్స్ 2023 కార్యక్రమంలో నామినేషన్ కోసం సిద్దమైన కార్ల జాబితా (విభాగాల వారీగా): ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ (బడ్జెట్ కార్లు) టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మారుతి ఫ్రాంక్స్ హ్యుందాయ్ వెర్నా హ్యుందాయ్ ఎక్స్టర్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ (లగ్జరీ కార్లు) మెక్లారెన్ ఆర్టురా మెర్సిడెస్ ఏఎంజీ ఎస్ఎల్ 55 4మ్యాటిక్ ప్లస్ రోడ్‌స్టర్ ఆస్టన్ మార్టిన్ డీబీ12 హ్యుందాయ్ ఐయోనిక్5 ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎంజీ కామెట్ సిట్రోయెన్ ఈసీ3 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఇదీ చదవండి: రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4 మ్యాటిక్ వోల్వో C40 రీఛార్జ్ బీఎండబ్ల్యూ ఐ7 ఆడి క్యూ8 ఈ-ట్రాన్ -
ఆస్కార్ నైన్టీసిక్స్కి డేట్ ఫిక్స్
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగి నెలన్నర (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) అవుతోంది. అప్పుడే 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ప్లాన్ మొదలుపెట్టింది కమిటీ. వచ్చే ఏడాది మార్చి 10న ఆస్కార్ వేడుక జరపనున్నట్లు ప్రకటించి, ఇందుకు సంబంధించిన కొన్ని కీలకమైన తేదీలను కూడా వెల్లడించారు నిర్వాహకులు. 96వ ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్‌ను ఈ ఏడాది డిసెంబరు 21న ప్రకటిస్తారు. నామినేషన్స్‌ను వచ్చే ఏడాది జనవరి 23న వెల్లడిస్తారు. ఆస్కార్ విజేతల ఎంపికకు ఫిబ్రవరి 22న ఓటింగ్ ఆరంభించి, 27 వరకూ కొనసాగిస్తారు. అవార్డుల ప్రదానోత్సవం మార్చి 10న జరుగుతుంది. ఇక జనరల్ ఎంట్రీ కేటగిరీలో అవార్డుల దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 15 చివరి తేదీగా పేర్కొంది కమిటీ. మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందిస్తారు. -
తొలి రోజు మూడు నామినేషన్ల దాఖలు
సాక్షి , కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సంగ్రామంలో ప్రథమ ఘట్టం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజునే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్సూరి అలీ నామినేషన్ వేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ నామినేషన్‌ను పలు సాంకేతిక కారణాలతో అధికారులు స్వీకరించలేదు. కాగా.. నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వంద మీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తల్లిదండ్రుల దీవెనలు.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఆశీర్వదించి బీఫారం అందించగా, శ్రీనివాస్ శుక్రవారం ఉదయం కొమురెల్లి మల్లిఖార్జునస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కమలాపూర్ మండలం ఉప్పల్ చేరుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా 12.40 నిమిషాలకు మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి హుజూరాబాద్‌లోని ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే గెల్లు శ్రీనివాస్ తల్లిదండ్రుల మల్లయ్య, లక్ష్మి దీవెనలు తీసుకోగా, భార్య శ్వేత శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి 12.55 నిమిషాలకు మొదటి సెట్, 01.16 నిమిషాలకు రెండో సెట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదటి నామినేషన్‌ను మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రతిపాదించగా, రెండో సెట్‌కు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ప్రతిపాదించారు. కోడ్ హుజూరాబాద్‌కే పరిమితం.. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఆ నియోజకవర్గానికే అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్, వరంగల్ (హనుమకొండ) నగరపాలక సంస్థలకు వర్తించదని ప్రకటనలో స్పష్టంచేశారు. నామినేషన్ ప్రక్రియ పరిశీలన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఎన్నికల అధి కారి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నా మినేషన్ల స్వీకరణ సమయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. తుపాకులు వెనక్కివ్వాలని.. కోడ్ వెలువడిన నేపథ్యంలో పోలీసు అధికారులు లైసెన్స్డ్ తుపాకులను సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక మంది తమకు ప్రాణహాని ఉందని వెపన్స్‌ను తమతోపాటే ఉంచుకుంటామని పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. కానీ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరికీ మినహాయింపులు లేవని కరాఖండిగా చెప్పిన పోలీసులు మొత్తానికి దాదాపు 40 మందికిపైగా వ్యక్తుల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రానికి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్నికల కోడ్ పరిధిని హుజూరాబాద్‌కే పరిమితం చేస్తూ ప్రకటన రావడంతో మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని పలువురు ప్రముఖులు పోలీస్స్టేషన్లకు పరుగులు తీశారు. చెక్ పోస్ట్ తనిఖీ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్, హుజూరాబాద్ మధ్యలో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌తో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు. శుక్రవారం వరంగల్ నుండి హుజూరాబాద్ వచ్చే ప్రధాన రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ఎక్స్పెండేచర్ అబ్జర్వర్ జి.ఎలమురుగుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ద్వారా వచ్చే ప్రతీ వాహనాన్ని చెక్ పోస్టు వద్ద తనిఖీ చేయాలని స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌ను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా అక్రమంగా డబ్బులు, మద్యం రవాణా చేసే అవకాశం ఉందని, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చదవండి: BJP: వ్యూహాలు సిద్ధం.. హుజూరాబాద్‌లో గెలవాల్సిందే.. -
నోబెల్ అవార్డు నామినేషన్లలో ట్రంప్ పేరు!
స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి అవార్డు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో బహుకరించే ఈ శాంతి పురస్కారం రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోబెల్ అవార్డు నామినేషన్లో ట్రంప్ పేరు వినిపించడం ఆసక్తిని రేపుతోంది. ఆయనతో పాటు ఈ అవార్డు నామినేషన్లో స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల బాలిక, పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్, రష్యా అసమ్మతి నేత అలెక్సీ నావల్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లు కూడా ఉన్నాయి. కాగా బాల పర్యావరణ వేత్తగా గ్రెటా పలు కార్యక్రమాలు చేపుడుతున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ... అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ప్రసంగించడమే గాక పర్యావరణ అంశాలపై ధైర్యంగా ఆమె గళం విప్పుతోంది. చిన్న వయసులోనే పర్యావరణంపై ఆమెకు ఉన్న అవగాహన, ఇతరులను కూడా పర్యావరణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె ప్రసంగం ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులకు అందుకుంది. (చదవండి: అప్పుల ఊబిలో డొనాల్డ్ ట్రంప్..?) అలాగే రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ కూడా రష్యాలో శాంతియుత ప్రజాస్వాయ్యం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలను వ్యతిరేకించే నావల్నీపై ఇటీవల విషయ ప్రయోగం కూడా జరిగింది. దీంతో అయిదు నెలల పాటు ఆయన జర్మనీలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల తిరిగి రష్యా వచ్చిన నావల్నీని అరెస్టు చేయడంతో రష్యాలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే వీరితో పాటు ఈసారి నామినేషన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉండటం విశేషం. అంతేగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ ప్రారంభించిన కోవ్యాక్స్ ప్రోగ్రామ్ కూడా ఈ అవార్టు నామినీల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నోబెల్ కమిటీ మాత్రం నామినీల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. (చదవండి: గ్రెటా థంబర్గ్ : లక్ష డాలర్ల భారీ విరాళం) -
రాజధానిలో వేడెక్కిన రాజకీయం
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. నామినేషన్ పత్రాలు దాఖలకు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ తుది జాబితాపై కసరత్తు మరింత వేగవంతం చేశాయి. అధికార టీఆర్ఎస్ 25 మంది తన చివరి జాబితాను విడదల చేయగా.. మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిని చర్లపల్లి డివిజన్ నుంచి బరిలో దింపారు. బల్దియా ఎన్నికల్లో గట్టెక్కేందుకు గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పక్షాలు భారీ కసరత్తు చేశాయి. పార్టీ శ్రేణులు టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ సైతం పోటాపోటీగా గెలుపు గుర్రాల వేటలో వ్యహత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్ దక్కనివారిని చేరదీస్తున్నాయి. (చార్మినార్ వద్ద హైటెన్షన్.. సంజయ్ సవాల్) టీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా మరోవైపు అధికార టీఆర్ఎస్లో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. టికెట్ ఆశించిన భంగపడ్డ నేతలు.. రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో తెలంగాణ భవన్ వద్దకు టీఆర్ఎస్ ఆశావహులు భారీ ఎత్తున చేరుకున్నారు. టికెట్ దక్కని వారు పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బాలాజీనగర్ డివిజన్ టిక్కెట్ కోసం లక్ష్మీ మల్లేష్ యాదవ్ తీవ్రంగా పోరాడినా.. టికెట్ దక్కకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక టీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ అసంతృప్తులను, రెబల్స్‌ను తన వైపుకు తిప్పుకుంటోంది. అస్త్రశస్త్రాలు సిద్ధం నామినేషన్ల అంకం పూర్తయ్యాక ప్రచారానికి మిగిలింది వారం రోజులే కావడంతో ఉరుకులు, పరుగులు తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రచారంలోనూ వ్యూహ ప్రతివ్యూహాలు, లోపాయికారీ ఒప్పందాలు, ఇతరత్రా కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. అన్ని పార్టీల్లోనూ హేమాహేమీల ప్రచార యాత్రలూ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ, స్వతంత్రులూ సర్వసన్నాహకాల్లో మునిగారు. ఓట్ల వేట కోసం ఇంటింటి ప్రచారాలు, సోషల్‌మీడియా వేదికగానే కాక ఇతరత్రా మార్గాలూ యోచిస్తున్నారు. ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించాలని భావిస్తున్నవారితోపాటు గుంభనంగా చేయాలని భావిస్తున్నవారూ ఉన్నారు. ఇక అధికార పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే ఆయుధంగా చేసుకోనుండగా, ప్రతిపక్షాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మరోసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్, ప్రభావం చూపాలని బీజేపీ, పట్టునిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పెద్ద సంఖ్యలో నామినేషన్లు జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల రెండోరోజైన గురువారం 522 మంది అభ్యర్థులు 608 నామినేషన్లను దాఖలు చేశారు. మంచి రోజు కావడంతో ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 537 మంది అభ్యర్థులు 628 నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం నామినేషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నుంచి 140 మంది, సీపీఐ నుండి ఒకరు, సీపీఎం నుంచి నలుగురు, కాంగ్రెస్ నుండి 68 మంది, ఎంఐఎం నుండి 27 మంది, టీఆర్ఎస్ 195 మంది, టీడీపీ 47 మంది, వైఎస్సార్సీపీ ఒకరు, గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల నుండి 15 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక శుక్రవారం రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. గ్రేటర్ టీఆర్ఎస్ అభ్యర్ధుల తుది జాబితా విడుదల 25 మంది అభ్యర్ధులతో టీఆర్ఎస్ తుది జాబితా మేయర్ బొంతు రామ్మోహన్ భార్యకు చర్లపల్లి టిక్కెట్ టీఆర్ఎస్: ఏఎస్రావు నగర్-పావనిరెడ్డి, మీర్పేట్-ప్రభుదాస్ టీఆర్ఎస్: నాచారం-శేఖర్, చిలుకానగర్- ప్రవీణ్ టీఆర్ఎస్: హబ్సిగూడ-స్వప్నారెడ్డి, ఉప్పల్-భాస్కర్ టీఆర్ఎస్: అత్తాపూర్- మాధవీ అమరేందర్, కాచిగూడ-శిరీష టీఆర్ఎస్: నల్లకుంట-శ్రీదేవి, అంబర్పేట్-విజయ్‌కుమార్ టీఆర్ఎస్: అడిక్‌మెట్-హేమలతారెడ్డి, ముషీరాబాద్-భాగ్యలక్ష్మి టీఆర్ఎస్: కవాడిగూడ-లాస్య, యూసుఫ్‌గూడ-రాజ్‌కుమార్ టీఆర్ఎస్: వెంగళ్‌రావ్‌నగర్-దేదీప్యరావు, రెహమత్నగర్-సీఎన్‌రెడ్డి టీఆర్ఎస్: నేరెడ్మెట్-మీనా ఉపేందర్‌రెడ్డి, ఈస్ట్ ఆనంద్‌బాగ్-ప్రేమ్‌కుమార్ టీఆర్ఎస్: గౌతమ్‌నగర్-సునీతా రాము, గోల్నాక-లావణ్య టీఆర్ఎస్: చందానగర్-రఘునాధరెడ్డి, హైదర్‌నగర్-నార్నె శ్రీనివాసరావు టీఆర్ఎస్: తార్నాక-శ్రీలత, మౌలాలి-ఫాతిమా తుది జాబితాలో 6 సిట్టింగ్ స్థానాల్లో మార్పులు నేరేడ్మెట్, ఈస్ట్ ఆనంద్‌బాగ్, అంబర్పేట్, హైదర్‌నగర్.. గోల్నాక, తార్నాక స్థానాల్లో అభ్యర్ధులను మార్చిన టీఆర్ఎస్ -
తొలి రోజు 17 మంది.. 20 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు గాను నామినేషన్లు ప్రారంభమైన తొలిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లను దాఖలు చేశారు. దాఖలైన 20 నామినేషన్లలో టీఆర్ఎస్ 06, బీజేపీ 02, కాంగ్రెస్ 03, టీడీపీ 05, గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఒక నామినేషన్ వచ్చింది. మరో ముగ్గురు స్వంతత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 150 వార్డులకు గాను డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు అఖరు తేది నవంబర్ 20 కాగా, 21న నామినేషన్లు పరిశీలించి, 22న ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. -
ఐసీసీ చైర్మన్ బరిలో ఇద్దరే!
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసు నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ తప్పుకోవడంతో ఇప్పుడు ప్రధానంగా గ్రెగ్ బార్క్లే (న్యూజిలాండ్), ఇమ్రాన్ ఖాజా (సింగపూర్)ల మధ్య పోటీ ఏర్పడింది. డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో ఈ ఇద్దరి నుంచే ఎవరో ఒకరు చైర్మన్ అయ్యే అవకాశముంది. కాగా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లేకు బీసీసీఐ మద్దతు ఇస్తుంది. భారత బోర్డుతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు కూడా బార్క్లే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. మరోవైపు పాక్ బోర్డు (పీసీబీ) సహా ఐసీసీ స్వతంత్ర మహిళా డైరెక్టర్ ఇంద్ర నూయి, పలు బోర్డులు ఇమ్రాన్ ఖాజాకు మద్దతు పలుకుతున్నాయి. బార్క్లేకు ఐసీసీ శాశ్వత సభ్యదేశాల మద్దతు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికా బోర్డు సంక్షోభంలో ఉండటం తో వారి ఓటు పరిగణించేది లేనిది ఇంకా స్పష్టమవ్వలేదు. శశాంక్ మనోహర్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఇమ్రాన్ ఖాజానే తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎందుకనో ఈసారి ఐసీసీ స్పష్టమైన వైఖరి కాకుండా గోప్యత పాటిస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియ సాధారణ మెజారిటీతో ముగిస్తారా? లేదంటే 3/4 మెజారిటీతో నిర్వహిస్తారో చెప్పనే లేదు. ఐసీసీ అధికారిక వెబ్సైట్లో స్ట్రక్చర్ పేజీని ఉన్నపళంగా ఎందుకు మార్చారో తెలియడం లేదు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెబుతున్నా... జాబితాను మాత్రం ప్రకటించడం లేదు. -
మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు
-
బీజేపీ కూటమికి రెబెల్స్ బెడద
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది. ఈ నెల 21న పోలింగ్ జరిగే ఈ ఎన్నికల్లో సోమవారంతో నామినేషన్ గడువు ముగిసింది. బీజేపీ, శివసేనలు ఆఖరి నిమిషం వరకు తిరుగుబాటు అభ్యర్థుల్ని బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం 288 నియోజకవర్గాలకు గాను 50కిపైగా చోట్ల 100 మందికి పైగా అభ్యర్థులు బీజేపీ–సేన కూటమికి సవాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి 15–20 స్థానాల్లో రెబెల్స్ బెడద ఉంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా వినే పరిస్థితి లేదు. రెబెల్స్‌ను శాంతింపజేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినా ఫలితం లేదు. -
నామినేషన్లు వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారి బాలకృష్ణమచార్యులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి మోపిదేవి రమణ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ పదవుల నియమాకాల్లోనూ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు.పదవుల పంపకంలో వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, బాల నాగిరెడ్డి, అన్న బత్తుల శివకుమార్, కిలారు రోశయ్య, ముస్తఫా, వసంత కృష్ణ ప్రసాద్, విడదల రజనీ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు నిర్వహించడానికి ఆగస్టు 7న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. టీడీపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ నుంచి ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. 16న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 19 వరకు అవకాశం కల్పించారు. 26న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు. 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
తొలిరోజు ‘జెడ్పీటీసీ’కి 91 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తొలి విడత జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల దాఖ లు పర్వం మొదలైంది. వచ్చేనెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ విడతలో భాగంగా 195 మండలాల్లో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు తొలిరోజు సోమవారం 197 జెడ్పీటీసీ స్థానాలకు 91 మంది అభ్యర్థులు 91 నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 38, టీఆర్ఎస్ నుంచి 31 మంది, బీజేపీ నుంచి ఆరుగు రు, సీపీఐ, టీడీపీల నుంచి చెరొక అభ్యర్థి, ఇండిపెం డెంట్లు 14 మంది నామినేషన్లు వేశారు. సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా పదేసి చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నామినేషన్ల దాఖలుకు సంబంధించిన వివరాలు ప్రకటించింది. ఎంపీటీసీ 665.. తొలి విడతలో భాగంగా 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 656 స్థానాల్లో 665 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 296, కాంగ్రెస్ నుంచి 212, బీజేపీ నుంచి 30, సీపీఎం నుంచి 6, సీపీఐ, టీడీపీల నుంచి రెండే సి, ఇండిపెండెంట్లు 113, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టరయిన రాజకీయ పార్టీల నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఊర్మిళ ఆస్తులు రూ. 68 కోట్లు
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళ మటోండ్కర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో తనకు రూ.68.28 కోట్ల ఆస్తులు(మార్కెట్ విలువ మేరకు) ఉన్నట్లు ఊర్మిళ తెలిపారు. ఇందులో రూ.40.93 కోట్ల చరాస్తులు ఉండగా, రూ.27.34 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. 2013–14 ఆర్థిక సంవత్సరానికి రూ.1.27 కోట్ల ఆదాయాన్ని అర్జించినట్లు పేర్కొన్నారు. 2017–18 నాటికి తన ఆదాయం రూ.2.85 కోట్లకు చేరుకుందన్నారు. అలాగే తన భర్త పేరుపై రూ.32.35 కోట్ల చరాస్తులు, రూ.30 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. -
నెల్లూరు: సార్వత్రిక బరిలో 132 మంది
సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 132 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 182 మంది నామినేషన్లు వేశారు. 39 మందివి తిరస్కరించారు. 11 మంది విత్‌డ్రా చేసుకున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 21 మంది నామినేషను వేయగా ఏడు తిరస్కరించారు. ఒకరు విత్‌డ్రా చేసుకున్నారు. 13 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి 17 మంది నామినేషన్లు వేశారు. ఐదుగురివి తిరస్కరించారు. 12 మంది పోటీలో ఉన్నారు. కావలి అసెంబ్లీకి 14 మంది నామినేషన్లు వేయగా అందులో ఐదు తిరస్కరించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి విత్‌డ్రా చేసుకున్నాడు. ఎనిమిది మంది అభ్యర్థులు పోరులో ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఒకరిది తిరస్కరించారు. 13 మంది రంగంలో ఉన్నారు. కోవూరు అసెంబ్లీకి 11 మంది నామినేషన్లు వేయగా, మూడు తిరస్కరించారు. ఒకరు విత్‌డ్రా చేసుకున్నారు. ఏడుగురు అభ్యర్థులు తుదిపోరులో నిలిచారు. నెల్లూరు సిటీకి సంబంధించి 20 మంది నామినేషన్లు వేయగా ఆరు తిరస్కరించారు. ఇద్దరు ఉపసంహరించుకోగా 12 మంది రంగంలో ఉన్నారు. నెల్లూరు రూరల్ అసెంబ్లీకి 15 మంది నామినేషన్లు వేయగా ఒకరిది తిరస్కరించారు. ఇద్దరు ఉపసంహరించుకున్నారు. 12 మంది పోటీలో ఉన్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 12 మంది నామినేషన్లు వేయగా, రెండు తిరస్కరించారు. పదిమంది బరిలో నిలిచారు. గూడూరు అసెంబ్లీకి 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరివి తిరస్కరించారు. 12 మంది రంగంలో ఉన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబం ధించి 13 మంది నామినేషన్లు వేయగా ఇద్దరివి తిరస్కరించారు. ఇద్దరు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిపోరులో 9 మంది నిలిచారు. వెంకటగిరిలో 14 మంది నామినేషన్లు వేయగా ముగ్గురివి తిరస్కరించారు. 11 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి 17 మంది నామినేషన్లు వేశారు. వాటిలో నాలుగు తిరస్కరించారు. 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
ప్రకాశం: బరిలో నిలిచింది వీరే..
సాక్షి, ఒంగోలు అర్బన్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా శాసనసభా స్థానాలకు జాతీయ, రాష్ట్రీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలిపి 234 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో 65 నామినేషన్లు తిరస్కరించగా గురువారం 14 నామినేషన్లు ఉపసంహరణ అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాలో 155 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటున్నట్లు తుది జాబితా ఖరారైంది. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 32 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన అనంతరం 27 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఒక నామినేషన్ ఉపసంహరించుకోగా మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో ఉంటారని నిర్ధారణ అయింది. -
విజయనగరం పోరుకు సై
సాక్షి, విజయనగరం గంటస్తంభం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్లు పక్రియ పూర్తయింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు అధికారికంగా అధికారులు ప్రకటించారు. దీంతో తదుపరి సమరం మిగిలి ఉంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ తేదీలు ప్రకటిచింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 18న నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. అదేరోజు జిల్లాలో ఉన్న విజయనగరం పార్లమెంట్ స్థానానికి కలెక్టర్ హరి జవహర్లాల్, 9 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేరోజు నామినేషన్లు స్వీకరించారు. ఈ పక్రియ 24వ తేదీ వరకు సాగింది. జిల్లాలో విజయనగరం పార్లమెంట్ స్థానానికి 18 మంది, 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 30 మంది నామినేషన్లు పరిశీలనలో అధికారులు తిరస్కరించారు. బుధ, గురు శుక్రవారాల్లో జరిగిన నామినేషన్లు విత్‌డ్రా కార్యక్రమంలో 16 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను రిటర్నింగ్ అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు. గుర్తుల కేటాయింపు అధికారిక సమాచారం ప్రకారం ఎంపీ, 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 88 మంది బరిలో ఉన్నారు. విజయనగరం ఎంపీ స్థానానికి 14మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మిగతా 9 అసెంబ్లీ సిగ్మెంట్ల్లో 74మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 18 మంది స్వతంత్ర అభ్యర్ధులు కాగా మిగిలినవారంతా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలతో పాటు ఇతర పార్టీలవారు ఉన్నారు. కురుపాం నుంచి ఒకరు, పార్వతీపురం నుంచి ఇద్దరు, సాలూరు నుంచి ముగ్గురు, గజపతినగరం నుంచి ఒకరు, నెల్లిమర్ల నుంచి ముగ్గురు, విజయనగరం నుంచి ఒకరు, ఎస్.కోట నుంచి ఇద్దరు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. విజయనగరం ఎంపీ స్థానానికి ఏకంగా ఐదుగురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఇదిలాఉండగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రిటర్నింగు అధికారులు వెంటనే గుర్తులు కేటాయించారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకు పార్టీ గుర్తులు లభించగా గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించారు. ఈ మేరకు ఫారం–7ఎ జనరేట్ చేసి ఎన్నికల సంఘానికి పంపించారు. దీంతో నామినేషన్లు పక్రియ ముగిసినట్లైంది. విజయనగరం ఎంపీ బరిలో నిలిచిన అభ్యర్థులు వ.సం. అభ్యర్థి పార్టీ కేటాయించిన గుర్తు 1 అశోక్‌గజపతిరాజు పూసపాటి తెలుగుదేశం సైకిల్ 2 ఆదిరాజు యడ్ల కాంగ్రెస్‌పార్టీ హస్తం 3 బెల్లాన చంద్రశేఖర్ వైఎస్సార్ సీపీ సీలింగ్ ఫ్యాన్ 4 పాకలపాటి సన్యాసిరాజు బీజేపీ కమలం 5 పీవీఏ సాగర్ సామాన్య ప్రజాపార్టీ ఎలక్ట్రికల్ పోల్ 6 చిరంజీవి లింగాల ఆంధ్ర చైతన్యపార్టీ టూత్‌బ్రెష్ 7 ముక్క శ్రీనివాసరావు జనసేన గాజుగ్లాసు 8 లగుడు గోవిందరావు జనజాగృతిపార్టీ మైకు 9 కె.సూర్యభవాని పిరమిడ్ ఫ్లూట్ 10 సియాదుల ఎల్లారావు గ్యాస్ స్వతంత్ర సిలిండర్ 11 దనలాకోటి రమణ స్వతంత్ర అగ్గిపెట్టె 12 పెంటపాటి రాజేష్ స్వతంత్ర బ్యాటరీ టార్చ్ 13 ఇజ్జురోతు రామునాయుడు స్వతంత్ర కోట్ 14 వెంకట త్రినాథరావు వెలూరు స్వతంత్ర సితార్ అసెంబ్లీ నియోజకవర్గాలు వారీగా బరిలో ఉన్న అభ్యర్థులు వ.సం. నియోజకవర్గం పోటీలో ఉన్న అభ్యర్థులు 1 కురుపాం 6 2 పార్వతీపురం 7 3 సాలూరు 8 4 బొబ్బిలి 6 5 చీపురుపల్లి 8 6 గజపతినగరం 9 7 నెల్లిమర్ల 12 8 విజయనగరం 9 9 ఎస్.కోట 9 -
ముగిసిన నామినేషన్ల పర్వం
సాక్షి, విజయనగరం గంటస్తంభం: నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. మొత్తం ఆరు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం ఎంపీ స్థానానికి 17 మంది, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలకు 130 మంది నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు పరిశీలన మంగళవారం జరగనుంది. ఇదేరోజు నుంచి 28వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీన జరిగే తొలివిడత పోలింగ్‌కు మార్చి 18న నోటిఫికేషన్ జారీ చేయగా అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరణ జరిగింది. 18 నుంచి 22వ తేదీ వరకు వరుసుగా నామినేషన్లను అధికారులు స్వీకరించారు. 23, 24 తేదీలు సెలవులు కావడంతో ఆఖరి రోజు 25న నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. చివరిరోజు రోజు 83 నామినేషన్లు జిల్లాలో చివరి రోజు ఏకంగా 83 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతకుముందు ఐదురోజులు పాటు 64 నామినేషన్లురాగా ఆఖరి రోజు అంతకుమించి రావడం విశేషం. ఇందులో విజయనగరం ఎంపీ స్థానానికి 10 నామినేషన్లు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వేశారు. కురుపాం నియోజకవర్గానికి 5, పార్వతీపురానికి 6, సాలూరులో 12, బొబ్బిలిలో 7, చీపురుపల్లిలో 7, గజపతినగరంలో 7, నెల్లిమర్లలో 13, విజయనగరంలో 3, శృంగవరపుకోటలో 13 చివరి రోజైన సోమవారం దాఖలయ్యాయి. బొబ్బిలి నుంచి టీడీపీ అభ్యర్థి సుజయ్‌కృష్ణ రంగారావు మాత్రమే నామినేషను వేశారు. రెండు నియోజకవర్గాల్లో అత్యధికంగా 19మంది మొత్తంగా చూస్తే విజయనగరం ఎంపీ స్థానానికి 17మంది నామినేషను దాఖలు చేశారు. ఎమ్మెల్యే స్థానాల్లో ఎస్.కోట, నెల్లిమర్లలో 20మంది చొప్పున నామినేషన్లు వేశారు. అత్యల్పంగా పార్వతీపురంలో 10 మంది నామినేషన్లు సమర్పించారు. నియోజకవర్గాల వారీగా నామినేషన్ల సంఖ్య నియోజకవర్గం నామినేషన్లు విజయనగరం ఎంపీ 17 కురుపాం 13 పార్వతీపురం 10 సాలూరు 15 బొబ్బిలి 11 చీపురుపల్లి 15 గజపతినగరం 13 నెల్లిమర్ల 20 విజయనగరం 13 శృంగవరపుకోట 20 -
నామినేషన్ల దాఖలుకు తెర!
సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నామినేషన్లకు చివరి రోజైన సోమవారం 96 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. రెండు పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 173 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నెల్లూరు పార్లమెంట్‌కు 17, తిరుపతి పార్లమెంట్‌కు 16 నామినేషన్లు, పది అసెంబ్లీలకు 140 నామినేషన్లు దాఖలయ్యాయి. నెల్లూరు పార్లమెంట్‌కు కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి ఆర్ ముత్యాలరాజు నామినేషన్లు స్వీకరించారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి డీఆర్డీఏ పీడీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆర్వోలు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 18, 19 తేదీల్లో నామినేషన్లు ఎవరూ వేయలేదు. 20న ఆరుగురు నామినేషన్లు వేశారు. ఈ నెల 21వ తేదీ 12, 22వ తేదీ 59 మంది నామినేషన్లు వేశారు. 23, 24వ తేదీలు సెలవులు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. చివరి రోజు 96 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. నెల్లూరు పార్లమెంట్‌కు 17 మంది, తిరుపతి పార్లమెంట్‌కు 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 15 మంది అభ్యర్థులు, అంతకన్నా ఎక్కువ మంది పోటీలో ఉంటే రెండు ఈవీంఎలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి 2856 పోలింగ్ కేంద్రాల్లో ఎంపీలకు రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అసెంబ్లీకి సంబంధించి నెల్లూరు నియోజకవర్గంలో 20 మంది, ఉదయగిరిలో 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులందరూ పోటీలో ఉంటే పోలింగ్ కేంద్రాల్లో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణన తర్వాత ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తుంది. 29వ తేదీ తరువాత బరిలో ఉండే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయిస్తారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. గుర్తులు కేటాయించిన తరువాత బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేస్తారు. బ్యాలెట్ పత్రంలో గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటో ఉంటుంది. వచ్చే నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ అభ్యర్థులతో కిటకిటలాడాయి. ఆకరి రోజు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రేపు, ఎల్లుండి నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు 28 వరకు గడువు ఉంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మరోవైపు రెబల్ అభ్యర్థులను విత్‌డ్రా చేయించేందుకు పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగి వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో నేతలు ప్రచారంలో మునిగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ , 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల జరుగనున్నాయి. అలాగే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11న దేశ వ్యాప్తంగా తొలివిడత ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. -
కోలాహలంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లు
-
మూడో రోజు రెండు నామినేషన్లు
సాక్షి, మెదక్ రూరల్: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మెదక్ లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో పోటీ చేసేందుకు బుధవారం మూడో రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సంతోష్‌రెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థిగా సిద్దిపేటకు చెందిన బన్సీలాల్‌లు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణకు కౌటర్లను ఏర్పాటు చేశామన్నారు. కానీ 18, 19 తేదీల్లో నామినేషన్లు రాలేదన్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణకు సమయం ఉండగా 21, 23, 24 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. అందువల్ల 22, 25వ తేదీల్లో మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. -
కోలాహలంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వచ్చేనెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులంతా గురు, శుక్రవారాల్లోనే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లతో సందడి వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా మదనపల్లి శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం నవాజ్ పాషా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. కృష్ణాజిల్లా తిరువూరు శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె రక్షణ నిధి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తలారి రంగయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముదునూరి ప్రసాద్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెత్త ఎత్తున్న పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా వై వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు, మోషన్ రాజు, పాతపాటి సర్రాజు, ఏఎస్ రాజు, జాన్సన్, ఉమాబాల, రామకృష్ణం రాజు తదితరులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం నామినేషన్ వేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కృష్ణా జిల్లా నూజీవీడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు ఈ రోజు ఉదయం 11.20 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని ద్వారకా ఎస్టేట్ నుండి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. అవనిగడ్డ అభ్యర్థిగా సింహాద్రి రమేష్, పామర్రు అభ్యర్థిగా అనిల్ కూమార్‌లు నామినేషన్లు వేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ వేశారు. పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులతో భారీ ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్ నామినేషన్ వేశారు. ముందుగా ద్వారకా తిరుమల లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట జిల్లా అసెంబ్లీ అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తులు తరలివచ్చారు. రామచంద్రపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి గా చెల్లుబోయిన వేణు నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ భారీ ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్ వేశారు. గాంధీ బొమ్మ నుంచి వందలాది మంది కార్యకర్తలతో నామినేషన్‌కు తరలివచ్చారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీమంత్రి కొలుసు పార్థసారధి నామినేషన్ దాఖలు చేశారు. పోరంకి నుంచి పెనమలూరు వరకు భారీ ర్యాలీ తరలివచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు శ్రీకాకుళం టెక్కలి అభ్యర్థి పేరాడ తిలక్, రాజాం అభ్యర్థి కంబాల జోగులు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అరకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెట్టి ఫాల్గుణ భారీ ర్యాలీగా తరలి వచ్చిన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటి రమ్యశ్రీ, విద్యార్థి నాయకులు తేడబారికి సురేష్ కుమార్, యూత్ అద్యక్షులు వినయ్ రేగ మత్సలింగం,మిథుల తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి నామినేషన్ వేశారు. రామిరెడ్డితో పాటు ఎర్రబోతుల వెంకట్ రెడ్డి, పట్టణ మాజీ సర్పంచ్ లక్ష్మి రెడ్డి, శంకర్ రెడ్డి లు నామినేషన్ కార్యాక్రమనికి వెళ్లారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం పెరిగిపోయాయని రామిరెడ్డి పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల అరాచకాలు, ఎమ్మెల్యే దురగతాలు నియోజకవర్గంలో పెరిగిపోయాయని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి పాలన లో రైతులకు, మహిళలకు, ప్రతి వర్గం వారికి ఎంతో మేలు జరిగిందన్నారు. వైఎస్సార్ రుణం తీర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ని అధికారంలోకి తీసుకురావాలని గ్రామాల్లో ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం లో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని కాటసాని రామిరెడ్డి ధీమా వ్యక్తం శారు. కడపలో లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. రెండవ సారి ప్రజల ఆశిస్సులతో ఎంపీ గా పోటీ చేస్తున్నానన్నారు. ‘నికర జలాల సాధన కోసం పోరాటం తాను పోరాటం చేశానన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశానని మళ్లీ తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కోత్త రైళ్ళను జిల్లాలో నడిపించే విధంగా కృషి చేశానన్నారు. ఆలు లేదు సోలు లేదన్న చందంగా మారిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, ప్రత్యేక హోదా, విభజన హమీలు, ఉక్కు పరిశ్రమ వంటి సమస్యలపై భవిష్యత్తులో పోరాటం చేస్తానని తెలిపారు. భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం వైస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజన్నదొర నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గురువారం ఉదయం 11 గంటల ముహూర్తం సమయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా నామినేషన్ పత్రాల దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ జరజాపు ఈశ్వర్ రావు మాజీ వైస్ చైర్మన్ పువ్వుల నాగేశ్వరరావు సాలూరు జడ్పిటిసి రెడ్డి పద్మావతి మాజీ మున్సిపల్ చైర్మన్ ముగడ గంగమ్మ తదితరులు హాజరయ్యారు. మెజార్టీ అభ్యర్థులందరూ 22నే వెఎస్సార్సీపీ తరపున విశాఖ, అరకు, అనకాపల్లి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, కాండ్రేగుల సత్యవతిలు 22వ తేదీన నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. అదే విధంగా వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థులు బూడి ముత్యాలనాయుడు(మాడుగులు), అవంతి శ్రీనివాస్ (భీమిలి), గుడివాడ అమర్నాథ్(అనకాపల్లి), అన్నంరెడ్డి అదీప్‌రాజు (పెందుర్తి), కరణం ధర్మశ్రీ (చోడవరం), గొల్ల బాబూరావు(పాయకరావుపేట), తిప్పల నాగిరెడ్డి (గాజువాక), కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి(పాడేరు), అక్కరమాని విజయలక్ష్మి(విశాఖ తూర్పు), ద్రోణంరాజు శ్రీనివాస్ (విశాఖ దక్షిణం), యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబు) (యలమంచలి)లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు మెజార్టీ జనసేన, బీజేపీ అభ్యర్థులందరూ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. -
రేపు కోలగట్ల నామినేషన్
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విజయనగరం శాసనసభా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీ, ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి ఈ నెల 20న నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి కోలగట్ల తమ్మన్నశెట్టి వెల్లడించారు. సోమవారం ఎమ్మెల్సీ కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు విజయనగరం మండల తహసీల్దార్ కార్యాలయంలో కోలగట్లతో పాటు మరో ఐదుగురు వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎటువంటి ఆడంబర కార్యక్రమాలు నిర్వహించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మాట తప్పని నాయకునికి మద్దతు పలకండి రాష్ట్రంలో ఐదేళ్లపాటు జరిగిన నయవంచనకు పాలనకు స్వస్తిపలికి... తప్పని, మడమ తిప్పని నాయకునిగా గుర్తింపు సాధించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బలపర్చిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి నియోజకవర్గ ప్రజలు మద్దతు పలకాలని తమన్నశెట్టి కోరారు. జగనన్న తోనే రాజన్న రాజ్యం సాధ్యమనీ, అటువంటి సంక్షేమ రాజ్యం కోసం అందరూ తమ ఓటును కోలగట్ల వీరభద్రస్వామికి వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
రెబల్‌తో బోణీ..
సాక్షి, చీపురుపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు పర్వానికి తెర లేచిన మొదటి రోజునే బోణీ పడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా కె.త్రిమూర్తులురాజు నామినేషన్ దాఖ లు చేశారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునను అధిష్టానం ఎంపికగా చేయగా... దానిని వ్యతిరేకిస్తూ త్రిమూర్తులురాజు సోమవారం ఉదయం నామినేషన్ వేశారు. పట్టణంలోని ఆంజనేయపురంలో గల ఆయన నివాసం నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయిలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సాల్మన్‌రాజ్‌కు అందజేశారు. అంతకుముందు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 2014లో పార్టీ అధిష్టానం మృణాళినిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించి గెలిపించాలని ఆదేశిస్తే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గెలిపించామనీ, ఆమె గెలిచిన తరువాత నియోజకవర్గంలో పార్టీ భ్రష్టుపట్టిపోయిందని, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందనీ పేర్కొన్నారు. మూడేళ్లుగా ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెబుతున్నా కనీసం పట్టించుకోలేదనీ, ఆమెకు ఈసారి టిక్కెట్టు ఇవ్వొద్దని సమన్వయ కమిటీలో 80 శాతం మంది వ్యతిరేకించామనీ, అయినా ఆమె కుమారుడికి ఇవ్వడం తమను బాధించిందని చెప్పారు. మరో ఐదేళ్లు బాధలు అనుభవించలేమని, కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు అనుగుణంగా పోటీకి వెళ్లాలని భావించినట్లు తెలిపారు. ఆయనకు చీపురుపల్లి జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్ మద్దతు తెలిపారు. -
స్వతంత్ర అభ్యర్థికి చుక్కలు చూపించిన పోలీసులు