తొలి అంకానికి తెర
పురపోరులో తొలిఘట్టానికి తెర పడింది. శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో చివరి రోజు నామినేషన్లు పోటెత్తాయి. అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి ఆర్భాటంగా కదిలి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.
పది చోట్లా మొత్తం 1764 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజునే 933 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 373, టీడీపీ నుంచి 280, కాంగ్రెస్ తరఫున 100 మంది, ఇండిపెండెంట్లుగా 136 మంది నామినేషన్లు వేశారు. ఇతర పార్టీల విషయానికి వస్తే బీజేపీ 26, సీపీఎం 8, లోక్‌సత్తా 5, సీపీఐ 2, ఇతరులు 3 నామినేషన్లు వేశాయి. చివరిరోజు అమలాపురంలో 97, మండపేటలో 176, రామచంద్రపురంలో 70, తునిలో 76, సామర్లకోటలో 142, పెద్దాపురంలో 60, పిఠాపురంలో 124 నామినేషన్లు దాఖలు కాగా నగర పచాయతీలకు సంబంధించి ముమ్మిడివరంలో 39, గొల్లప్రోలులో 54, ఏలేశ్వరంలో 95 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా శుక్రవారం గడువు ముగిసే నాటికి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోని 264 వార్డులకు 1764 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ 638, టీడీపీ 642, కాంగ్రెస్ 157, ఇండిపెండెంట్లు 253, బీజేపీ 40, సీపీఎం 17, సీపీఐ 4, లోక్‌సత్తా 8 తోపాటు ఇతరుల నామినేషన్లు 5 ఉన్నాయి. మున్సిపాలిటీల్లో అత్యధికంగా సామర్లకోటలో 30 వార్డులకు 253 నామినేషన్లు, అతితక్కువగా రామచంద్రపురంలో 132 దాఖలయ్యాయి. నగర పంచాయతీల్లో అధికంగా ఏలేశ్వరంలో 20 వార్డులకు 180 నామినేషన్లు పడ్డాయి.
‘కోట’లో కనుమరుగైన కాంగ్రెస్
సామర్లకోటలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేక పోయిన కాంగ్రెస్ పెద్దాపురంలో ఆఖరు రోజున అతి కష్టం మీద ఐదింటిని వేయగలిగింది. వార్డు సంఖ్యతో పోలిస్తే కాంగ్రెస్ తరఫున 55 శాతం కూడా నామినేషన్లు పడలేదు. నగర పంచాయతీలైన గొల్లప్రోలు, ముమ్మిడివరంలలో ఆ పార్టీ అభ్యర్థుల సంఖ్య ఒక్క అంకెకే పరిమితమైంది.
నేడు పరిశీలన..
నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు. ఈనెల 18 వరకూ ఉపసంహరణకు గడువుంది. అదే రోజున తుది జాబితా ప్రకటించి, అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని మున్సిపల్ ఆర్డీ రమేష్‌బాబు తెలిపారు. ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులుగా ఉన్న కమిషనర్లు అవసరమైతే న్యాయ సలహాలు కూడా తీసుకుని పరిశీలనను నిక్కచ్చిగా నిర్వహిస్తారన్నార