Samarlakota
-
సామర్లకోటలో సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర
-
మా జగనన్నకు అడ్డుకట్ట వేయలేరు
-
సామర్లకోట లో లాడ్జ్ బాయ్‌ను చితక్కొట్టిన యువకులు
-
నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆపన్న హస్తం
-
జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం
-
పేదల సొంతింటి కలను మనం సాకారం చేశామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అక్కచెల్లెమ్మల కళ్లల్లో సంతోషాన్ని చూస్తున్నా..
రాష్ట్రంతో బాబు బంధం ఇదీ.. ‘‘ఆ పెద్దమనిషి చంద్రబాబుకు రూ.వేల కోట్ల సంపద ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో సైతం పేదలకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా ఇవ్వలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మూడుసార్లు సీఎంగా చేశాడు. ఆయనకు ప్రజల మీద, రాష్ట్రం మీద, చివరికి కుప్పం మీద గానీ అభిమానం, అనురాగం, బాధ్యత లేదు. రాష్ట్రంలో కానీ, కుప్పంలో కానీ ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు ఇల్లు పక్క రాష్ట్రం హైదరాబాద్‌లో కనిపిస్తుంది. అదీ ఈ రాష్ట్రంతో ఆ పెద్దమనిషికి ఉన్న అనుబంధం. కుప్పంలో దాదాపు 20 వేల మందికి ఇళ్ల పట్టాలు, 8 వేల గృహ నిర్మాణాలు ఈరోజు జరిగాయి అంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పేదవాడి గడపకు మంచి జరిగిందంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే’’ – సామర్లకోట సభలో సీఎం జగన్ సామర్లకోట నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘నిరుపేద అక్కచెల్లెమ్మల కళ్లల్లో ఎనలేని సంతోషాన్ని చూశా. బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరగని మహాయజ్ఞం పేదల సొంతింటి కలను మనం సాకారం చేశాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 31 లక్షల కుటుంబాల్లో అంటే రాష్ట్ర జనాభాలో 20 శాతం పైచిలుకు ఉన్న ఇళ్లు లేని నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని తాపత్రయపడ్డా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి మంచి చేశాం. దేవుడి దయతో నా పేద అక్కచెల్లెమ్మలకు దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు దాదాపు 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే ఈ రోజు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయి. కాసేపటి క్రితం ఇక్కడ కాలనీలలో ఇళ్లను చూశా. అవి ఇళ్లు కాదు ఊళ్లు అని గర్వంగా చెబుతున్నా. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 7.43 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి మీ బిడ్డగా మీతో ఆనందాన్ని పంచుకుంటున్నా’’ అని సీఎం వైఎస్ జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలి విడతగా 7.43 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ గురువారం కాకినాడ జిల్లా సామర్లకోట ఈటీసీ లేఅవుట్లో జరిగిన పేదల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అనంతరం స్థానిక జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన సభలో లబ్ధిదారులైన మహిళలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేవుడిని ఇంతకన్నా ఏం అడగగలను? మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఉచితంగా ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో 5.85 లక్షల సాధారణ ఇళ్లు, టిడ్కో కింద మరో 1,57,566 లక్షలు కలిపి మొత్తం సుమారు 7.43 లక్షల గృహాల నిర్మాణాన్ని ఇప్పటివరకు పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా మరో 14,33,000 ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రతి పేదవాడి ముఖంలోనూ, అక్కచెల్లెమ్మల ముఖంలోనూ చిరునవ్వులు చూస్తున్నాం. దేవుడిని నేను ఇంతకన్నా ఏం అడగగలను? దేవుడు నాచేత పేదింటి అక్కచెల్లెమ్మలకు ఇంత మంచి చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. సామర్లకోటలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను చూశా. ఆ ఇళ్లను చూసి లే అవుట్లో నాన్న గారి విగ్రహాన్ని ప్రారంభించి వస్తున్నప్పుడు ఇక్కడ ఇంటి స్థలం ధర ఎంత ఉందని దొరబాబును (హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్) అడిగా. కేవలం ఇంటి స్థలం విలువ అక్షరాలా రూ.12 లక్షలు పలుకుతోందని దొరబాబు చెప్పాడు. అక్కడ 54 ఎకరాల లేఅవుట్లో పేదలకు 2,412 ఇళ్ల స్థలాలిచ్చాం. ఇప్పటికే వెయ్యికిపైగా ఇళ్లు పూర్తై గృహ ప్రవేశాలు చేశారు. రూ.32 వేల కోట్లతో కనీస వసతులు.. రాష్ట్రంలో 21.76 లక్షల గృహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పేదవాడికీ ఇచ్చే ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు రూ.2.70 లక్షలు. ఇందులో రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తూ మరో రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు వచ్చేటట్టు చేశాం. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నాం. దాని విలువ మరో రూ.15 వేలు ఉంటుంది. సిమెంట్, మెటల్ ఫ్రేమ్స్, స్టీల్ తదితర నిర్మాణ సామగ్రి అంతా కూడా ధర తగ్గించి ఇవ్వడం వల్ల ప్రతి అక్కచెల్లెమ్మకు మరో రూ.40 వేల దాకా మేలు జరుగుతోంది. మొత్తం కలిపి ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షలవుతుంది. ఇంటి స్థలం, ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు డ్రెయినేజీ, రోడ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా లాంటి కనీస వసతుల కోసం మరో రూ.32 వేల కోట్లను ఖర్చు చేస్తున్నాం. మనసున్న ప్రభుత్వం... ఇంతకు ముందెప్పుడూ జరగనిది ఈరోజు జరుగుతోందంటే అందుకు కారణం.. కేవలం ముఖ్యమంత్రి మారాడు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రికి, ఈనాడు ఉన్న ముఖ్యమంత్రికి మధ్య తేడా చూడండి. నేడు ఉన్న ముఖ్యమంత్రికి మనసు ఉంది. మీపట్ల అభిమానం, బాధ్యత ఉంది. ఇదొక్కటే గత ప్రభుత్వానికి, మీ బిడ్డకు ఉన్న తేడా. అలాంటి మనసున్న ప్రభుత్వం మనందరిది కాబట్టే ప్రతి అక్కచెల్లెమ్మకూ ఒక శాశ్వత చిరునామా ఉండాలని అనుకున్నా. ఆ శాశ్వత చిరునామా విలువ తెలిసిన ప్రభుత్వంగా నా పాదయాత్రలో చూసిన ప్రతి కష్టానికీ పరిష్కారాన్ని చూపుతూ ఈ 52 నెలలుగా పరిపాలన సాగింది. పేదింటి అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు తపనపడుతూ మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇలాంటి మనసు గత పాలకులకు లేదు. 2014–19 మధ్య చంద్రబాబు పాలన చూస్తే పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. తేడాను మీరే ఒకసారి గమనించండి. రాక్షసులు యాగాలను భగ్నం చేసినట్లుగా.. బుుషులు, మునులు, దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి దుర్మార్గంగా కుట్రలు చేస్తారని విన్నాం. అలాగే మనందరి ప్రభుత్వం పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తున్నప్పుడు, అక్కచెల్లెమ్మలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే తపనతో అడుగులు వేస్తున్నప్పుడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు వాటిని అడ్డుకుంటూ ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసి ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని అవరోధాలు తలెత్తాయో మీకు తెలుసు. ఒకవైపు చంద్రబాబు లాంటి దుర్మార్గులు కోర్టుకు వెళ్లి ఆపాలని ప్రయత్నం చేయగా మరోవైపు మీ బిడ్డ ప్రభుత్వం రాగానే కోవిడ్ వచ్చి పడింది. కోవిడ్ కారణంగా రాష్ట్రానికి రెండేళ్ల పాటు రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పెట్టాల్సిన ఖర్చు పెరిగిపోయింది. అయినా కూడా మీ బిడ్డ ఎక్కడా సాకులు చెప్పలేదు. కారణాలు వెతకలేదు. మీ బిడ్డ కింద మీదా పడి ఏదో ఒకటి చేశాడు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతో అడుగులు వేశాడు. 31 లక్షల ఇళ్ల స్థలాలలో దాదాపు 22 లక్షల ఇళ్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 7.43 లక్షల ఇళ్లు ఇప్పటికే పూర్తయిన పరిస్థితుల మధ్య ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. నా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల కోసం ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 72 వేల ఎకరాలను సేకరించి 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటి మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి స్థలం కనీసం రూ. 2.5 లక్షలతో మొదలు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా కనిపిస్తోంది. కనీసం రూ.2.50 లక్షలే అనుకున్నా దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాల రూపంలో సుమారు రూ.75 వేల కోట్లు విలువైన స్థిరాస్తిని నా అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాల రూపంలో ఇవ్వగలిగాం. ఇళ్ల పట్టాలివ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటా. పేదలపై ప్రేమ, బాధ్యతతో 35 కార్యక్రమాలు ఒక్క ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణమే కాదు.. నవరత్నాల్లోని ఏ పథకాన్ని చూసినా, డీబీటీని తీసుకున్నా అంతే ప్రేమ, బాధ్యతతో అడుగులు వేశాం. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకం, అవ్వాతాతలకు పెన్షన్లు, రైతు భరోసా.. ఇలా రాష్ట్రంలో 35 పైచిలుకు కార్యక్రమాలు మన ప్రభుత్వంలో అమలవుతున్నాయి. పేదవాడి మీద ప్రేమతో, వారి జీవితాలు మారాలి, మార్చాలనే తపన, తాపత్రయంతో 52 నెలలుగా అడుగులు వేస్తూ వస్తున్నాం. ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏనాడూ ఇలా పేదల మీద ప్రేమ, బాధ్యత చూపలేదు. కాబట్టే మనం అధికారంలోకి వచ్చేటప్పటికి 31 లక్షల కుటుంబాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా సొంత ఇళ్లు లేని నిరుపేదలుగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది. నాడు కూడా ఇదే రాష్ట్రం, కేవలం సీఎం మాత్రమే మారాడు. ఇవాళ 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం. -
సామర్లకోట బహిరంగ సభలో సీఎం జగన్ (ఫొటోలు)
-
దొరబాబు గురించి సీఎం జగన్ మాటల్లో
-
కడుతున్నవి ఇళ్లు కాదు..ఊళ్లు
-
పేదల పాలిట దేవుడు మా జగనన్న
-
సొంత పార్టీ, వర్గాన్ని అమ్ముకునే వ్యక్తి పవన్: సీఎం జగన్ కౌంటర్
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు పాలనలో పేదవాడికి ఒక్కసెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రజలపై, పేదలమీద బాబుకు ఏమాత్రం ప్రేమ లేదని దుయ్యబట్టారు. నెలరోజులు వరుసగా రాష్ట్రంలో ఉన్నారా? జగనన్న కాలనీలోని ఇళ్లను సీఎం జగన్ గురువారం సామర్లకోటలో ప్రారంభించారు. అనంతరం స్థానికంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీలో ఇళ్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు. ఈ 52 నెలల కాలంలో చంద్రబాబు ఒక నెల పాటు కంటిన్యూగా రాష్ట్రంలో కనిపించాడా? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో కనిపిస్తున్నాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వాళ్లెవవరికి ఇక్కడ సొంతిల్లు లేదు చంద్రబాబు, లోకేష్, ఆయన బావమరది బాలకృష్ణ, దత్తపుత్రుడు ఎవరూ రాష్ట్రంలో ఉండరని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు సొంతిల్లు పక్క రాష్ట్రంలో ఉందని ఆయన దత్తపుత్రిడి శాశ్వత చిరునామా కూడా హైదరాబాద్‌లోనే ఉందని తెలిపారు. ప్యాకేజీ స్టార్‌కు ఓడిపోయిన భీమవరంతో, గాజువాకతో సంబంధమే లేదని మండిపడ్డారు. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని అన్నారు. ఒకరు స్టేట్, ఒకరు నేషనల్, మరొకరు ఇంటర్నేషనల్ అంటూ సెటైర్లు వేశారు. ఇది దత్తపుత్రుడికి ఆడవాళ్లు, ఇల్లాలిపై ఉన్న గౌరవమంటూ చురుకలంటించారు. చదవండి: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం: సీఎం జగన్ ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకే ‘వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది హైదరాబాద్‌లో పంచుకుంటారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకే అప్పుడప్పుడు ప్యాకేజీ స్టార్ వస్తుంటాడు. సరుకులు అమ్ముకునే వాళ్లను చూశాం. కానీ పార్టీ, సొంతవారిని అమ్ముకునే వాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. యూజ్ అండ్ త్రో అన్నది పవన్ పాలసీ. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే వ్యాపారి పవన్. షూటింగ్ గ్యాప్‌లలో రాష్ట్రానికి వస్తుంటాడు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి రాజకీయాలు అంటే విలువలు విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, ఇప్పుడు చేస్తున్నాం, అప్పుడెందుకు చేయలేకపోయారు. రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు. ప్రతి నెల 1వ తారీకే ఇంటింటికి పెన్షన్లు. సచివాలయాల ద్వారా ఇంటి వద్దకే పరిపాలన. నాలుగేళ్లలో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం దిశ యాప్‌తో మహిళలకు అండగా నిలిచాం. ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 రోగాలకుపైగా విస్తరించాం. నాలుగేళ్లలో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం. 2.07 లక్షల ఉద్యోగాల్లో 80శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. చంద్రబాబు పేరు చెబితే గుర్చొచ్చేది స్కాంలే. జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తొస్తుంది.’ అంటూ చంద్రబాబు, పవన్‌లపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. -
రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80 శాతం ఇళ్లు పూర్తిచేశామని తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన సీఎం జగన్.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అనిచెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. సామర్లకో లేఅవుట్లో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, లక్షల విలువ చేసే ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతులో పెడుతున్నామని పేర్కొన్నారు. పేదలకు మంచి చేసే అవకాశం దేవును తనకు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయని, పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ‘గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదని సీఎం విమర్శించారు. పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారని దుయ్యట్టారు. వేలకోట్లు ఖర్చు చేసి పేదల ఇంటి కలను సాకారం చేస్తున్నామని.. పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. చదవండి: Updates: చంద్రబాబు కేసు టుడే అప్డేట్స్ -
సామర్లకోటలో జగనన్న కాలనీలో ఇళ్లు ప్రారంభం (ఫొటోలు)
-
సామర్లకోట చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
Live: సామర్లకోట జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాలు
-
చంద్రబాబు, పవన్, బాలకృష్ణకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Updates.. ఎల్లో బ్యాచ్‌కు స్ట్రాంగ్ కౌంటర్.. సామర్లకోటలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉన్నారా?. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంది. ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లకు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కోరుకునేది ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం.. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకోవడం. వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్. సినిమా షూటింగ్స్ లేని టైమ్‌లో ఇక్కడికి వచ్చి స్టోరీలు చెబుతాడు. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి పవన్. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాలంటే విలువ, విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు. సీఎం జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకువస్తాయి.. అదే చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయి. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుంది.. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది. సీఎం జగన్ మాట్లాడుతూ.. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం. ►రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం. ►రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి. ►కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు. ►రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. ►రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ►ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. ►లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ►రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ►ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నాం. మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ►ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందిస్తున్నాం. ►వేల కోట్లు ఖర్చు చేసి ఇంటి కలను సాకారం చేస్తున్నాం. ►పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ►పేదవాడికి చంద్రబాబు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. ►తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదు. ►మన ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చాం. ►సామర్లకోట లేఔట్లో వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ►నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నాం. ►మన ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయి. ►పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంలో ప్రభుత్వం పనిచేస్తోంది. ►గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదు. ►పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు. ►పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. ►సామర్లకోటలో బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్. ►జోతిప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ► జగనన్న కాలనీలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్. ► పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లను అందించిన సీఎం జగన్. ► జగనన్న కాలనీని పరిశీలించిన సీఎం జగన్ ► కాసేపట్లో సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో సీఎం జగన్ బహిరంగ సభ. ► సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న సీఎం జగన్ ►సీఎం జగన్ సామర్లకోటకు చేరుకున్నారు. పార్టీ నేతలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. Stunning Visuals of #YSRJaganannaColonies to be launched by CM @ysjagan today at Samarlakota in Kakinada. 🏠 ✨💫 Samarlakota YSR Jagananna Colony is one of the largest housing colonies undertaken by the government, with the completion of approximately 2,000 housing units.… pic.twitter.com/DJ1alSIPuN — YSR Congress Party (@YSRCParty) October 12, 2023 ►సామర్లకోటకు బయలుదేరిన సీఎం జగన్ ►రాష్ట్రవ్యాప్తంగా ఇలా రూపుదిద్దుకున్న ఇళ్లలో పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాలకు పేదలు సిద్ధమయ్యారు. ►కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా పాల్గొననున్నారు. ►మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరిటే ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు లో భాగంగా సామర్లకోటలో లబ్ధిదారులకు అందించనున్న ఇళ్ళ విజువల్స్. #YSRJaganannaColonies pic.twitter.com/1hb1PEI53I — YSR Congress Party (@YSRCParty) October 12, 2023 అడ్డంకులను అధిగమిస్తూ.. ►రాష్ట్రంలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం జగన్ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువ రూ.2.5 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టీ రూ.5 లక్షల పైనే ఉంది. అంటే ఈ లెక్కన కనిష్టంగా రూ.75 వేల కోట్లు నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూమిని పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. ►ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వమూ పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. టీడీపీ, ఎల్లో మీడియా, దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా రూ.7 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది. 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి ►పేదలందరికీ ఇళ్ల పథకం కింద రెండు దశల్లో కలిపి 21.75 లక్షలకుపైగా (19.13 లక్షల సాధారణ ఇళ్లు + 2.62 లక్షల టిడ్కో ఇళ్లు) గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకూ సాధారణ ఇళ్లు 5,85,829, టిడ్కో ఇళ్లు 1,57,566 నిర్మాణం పూర్తయ్యాయి. మరో 13.27 లక్షల సాధారణ ఇళ్లు, 1.04 లక్షల టిడ్కో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం లోగా నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది -
సీఎం జగన్ కు లబ్దిదారుల కృతజ్ఞతలు
-
అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నం సీఎం వైఎస్ జగన్ సాకారం
-
పేదింటి పండుగ.. నేడు సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాలు
సాక్షి, అమరావతి: తమకంటూ ఓ పక్కా ఇల్లు ఉండాలనేది ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నం. వారి తోబుట్టువుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీన్ని సాకారం చేస్తూ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరిటే ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా రూపుదిద్దుకున్న ఇళ్లలో గురువారం పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాలకు పేదలు సిద్ధమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా పాల్గొననున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. అడ్డంకులను అధిగమిస్తూ.. రాష్ట్రంలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం జగన్ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువ రూ.2.5 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టీ రూ.5 లక్షల పైనే ఉంది. అంటే ఈ లెక్కన కనిష్టంగా రూ.75 వేల కోట్లు నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూమిని పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వమూ పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. టీడీపీ, ఎల్లో మీడియా, దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా రూ.7 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది. 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి పేదలందరికీ ఇళ్ల పథకం కింద రెండు దశల్లో కలిపి 21.75 లక్షలకుపైగా (19.13 లక్షల సాధారణ ఇళ్లు + 2.62 లక్షల టిడ్కో ఇళ్లు) గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకూ సాధారణ ఇళ్లు 5,85,829, టిడ్కో ఇళ్లు 1,57,566 నిర్మాణం పూర్తయ్యాయి. మరో 13.27 లక్షల సాధారణ ఇళ్లు, 1.04 లక్షల టిడ్కో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం లోగా నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఉచితంగా స్థలం.. ఆపై అమిత సాయం ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో సరిపుచ్చకుండా మరో అడుగు ముందుకు వేసింది. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేస్తోంది. స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం చేస్తున్నారు. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్ధి చేకూరుస్తున్నారు. వసతుల రూపంలో మరో రూ.1.5 లక్షలు ఉచితంగా స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూరుస్తూనే ప్రతి ఇంటికి ఉచితంగా మౌలిక సదుపాయాల కల్పన ద్వారా మరో రూ.1.70 లక్షల మేరకు అదనపు లబ్ధిని ప్రభుత్వం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో ఉచితంగా నీటి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రైన్లు, రోడ్లు లాంటి సకల వసతులను ప్రభుత్వం సమకూరుస్తోంది. పార్కులు.. జిమ్.. కళ్లు చెదిరే కాలనీ! పిల్లల కోసం ప్రత్యేకంగా పార్కులు.. వ్యాయామం కోసం జిమ్ సదుపాయాలతో కాకినాడ జిల్లా సామర్లకోట–ప్రత్తిపాడు రోడ్డులో అందంగా రూపుదిద్దుకున్న జగనన్న కాలనీని చూస్తే కళ్లు తిప్పుకోలేరు! లే అవుట్ అభివృద్ధికి ఏకంగా రూ.15 కోట్లు కేటాయించారు. రూ.4 కోట్లతో విద్యుత్తు సబ్ స్టేషన్, మూడు అంగన్వాడీ కేంద్రాల భవనాలను నిర్మించారు. పిల్లలకు ఆహ్లాదం కోసం ఏకంగా ఏడు పార్కులను నిర్మించడం విశేషం. ఇందులో ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్కులు కూడా ఉన్నాయి. సామర్లకోట ఈటీసీ లేఆవుట్‌లో సుమారు 52 ఎకరాల్లో 2,412 మందికి మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేశారు. 824 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. షేర్వాల్ టెక్నాలజీ ద్వారా నిర్మాణాలను పూర్తి చేశారు. కాలనీలో ఇళ్లను సీఎం జగన్ సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. నవరత్నాలు–పేదలకు ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన జగనన్న ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. – సామర్లకోట -
12న సామర్లకోటకు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 12వ తేదీన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడి ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సామర్లకోట 54 ఎకరాల్లో జగనన్న కాలనీల నిర్మాణం
-
కళ్లెదుటే ఖరీదైన లోగిళ్లు!
కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అప్పారావు దినసరి కూలి. ఆర్నెళ్ల క్రితం వరకూ నెలకు రూ.2,500 అద్దె చెల్లించాల్సి రావడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. ఆయన భార్య రత్నం సొంత ఇంటి కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా నెరవేర్చింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడుకు వెళ్లే రోడ్డులో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని ఇవ్వడంతోపాటు గృహ నిర్మాణానికి ఆర్థికంగా చేదోడుగా నిలిచింది. ఏమ్మా ఈ ఇల్లు మీదేనా? చాలా బాగుందంటూ ఎవరైనా పలకరిస్తే చాలు.. ‘అవునండీ సీఎం జగన్ మాకిచ్చిన కానుక ఈ ఇల్లు. ఇన్నాళ్లూ అద్దెలు కట్టలేక, పిల్లల చదువులు, కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడ్డాం. కొత్త ఇంటిలోకి వచ్చాక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతున్నా. వేడినీళ్లకు చన్నీళ్లలా మా సంపాదన ఉంది’ అని ఆనందంగా చెబుతోంది. సామర్లకోట లేఔట్లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న కృష్ణకుమారి అనే మహిళను ఇక్కడికి వచ్చి ఎన్నిరోజులు అయింది? అని పలుకరించగా ‘నా భర్త చిరు వ్యాపారి. వివాహం అయిన రోజు నుంచి అద్దె ఇంటిలోనే ఉంటున్నాం. సంపాదన ఖర్చులకే సరిపోయేది కాదు. స్థలం కొనడానికే రూ.10 లక్షలు దాకా ఉండాలి. దీంతో ఇక ఇంటి కల నెరవేరదని ఆశ వదులుకున్న తరుణంలో ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇచ్చి ఇంటిని కూడా మంజూరు చేస్తోందని తెలియడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఎనిమిది నెలల క్రితం గృహ ప్రవేశం కూడా చేశాం. నా బిడ్డ చదువులకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది. ఇప్పటివరకు మూడుసార్లు అమ్మఒడి వచ్చింది. రూ.75 వేలు పొదుపు సంఘం రుణం వచ్చింది’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది. (వడ్డే బాలశేఖర్ – సామర్లకోట నుంచి సాక్షి ప్రతినిధి): ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇళ్ల స్థలాలు.. అది కూడా ఖరీదైన ప్రాంతాల్లోనే.. ఆపై గృహ నిర్మాణాలను కూడా చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక సంచలనం. అక్క చెల్లెమ్మల సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసేందుకు భూ సేకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.75,670 కోట్లను వ్యయం చేసింది. అంత విలువైన స్థిరాస్తిని మహిళల చేతుల్లో పెట్టింది. పేదల పక్కా ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68,677 ఎకరాలను పంపిణీ చేసిందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ సైతం ప్రశంసించింది. 17,005 జగనన్న కాలనీల్లో సకల సామాజిక, కనీస సదుపాయాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం దశలవారీగా దాదాపు రూ.30 వేల కోట్లను వ్యయం చేస్తోంది. ఇక ఆగస్టు నెలాఖరు వరకు 21.31 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.12,295.97 కోట్లను అక్క చెల్లెమ్మల ఖాతాలకు పారదర్శకంగా జమ చేసింది. ఉచితంగా ఇచ్చే ఇసుకతోపాటు రాయితీపై సామగ్రిని సమకూరుస్తోంది. తద్వారా మరో రూ.40 వేల మేరకు లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాన్ని బట్టి స్థలం, ఇంటి విలువ రూ.15 లక్షలు, ఆపైన పలుకుతుండటం విశేషం. ఇళ్ల లబ్ధిదారుల్లో బీసీ మహిళలే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేస్తున్నారు. పూర్తైన ఇళ్లకు మంచినీటి, విద్యుత్ సరఫరాపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా తనిఖీలు జరిపి నిర్థారించేలా చర్యలు తీసుకున్నారు. రోజు వారీ లక్ష్యాలను నిర్ధారించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షిస్తుండటంతో ఐదు లక్షలకుపైగా పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతంలో పేదలకు ఇళ్లు కాకినాడ జిల్లా సామర్లకోట – ప్రత్తిపాడు రోడ్డులో 2,412 నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 54 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. రెండు కాలనీలుగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటివరకు 800 వరకూ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 1,408 ఇళ్లు పునాదిపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన సామర్లకోట వైఎస్సార్ జగనన్న కాలనీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించి పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సామర్లకోట మునిసిపాలిటీలోని జగనన్న కాలనీల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక్కడ సెంటు స్థలం మార్కెట్ విలువ రూ.10 లక్షలపైన పలుకుతోందని చెబుతున్నారు. విద్యుత్, నీటి సరఫరాతో పాటు, ఇతర సదుపాయాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో పేద మహిళకు రూ.15 లక్షలకుపైగా విలువైన ఆస్తిని సీఎం జగన్ సమకూర్చారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో.. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలను స్మశానాలతో పోల్చుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు విషం కక్కారు. నిత్యం పేదల ఇళ్ల పథకంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా కాలనీల్లో అత్యంత నాణ్యత ప్రమాణాలతో పేదల ఇళ్ల నిర్మాణాలున్నాయి. ప్రతి ఇంటికీ హాల్, కిచెన్, బెడ్రూమ్, వరండా, స్టేర్ కేస్ లాంటి వసతులు ఉండటం విశేషం. సామర్లకోటలో మెజారిటీ లబ్ధిదారులు తామే ఇళ్లు నిర్మించుకునే ఆప్షన్ ఎంచుకున్నారు. ఆప్షన్–3 లబ్ధిదారుల ఇళ్లను షీర్వాల్ టెక్నాలజీలో అజయ వెంచర్స్ లేబర్ ఏజెన్సీ నిర్మిస్తోంది. ఉచితంగా ఇసుక.. సబ్సిడీపై సామగ్రి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రెండు విడతల్లో 21.25 (టిడ్కోతో కలిపి) లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకే రూ.35 వేలు బ్యాంక్ రుణం, రూ.15 వేలు విలువైన ఉచిత ఇసుక, సబ్సిడీపై సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామాగ్రిని అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా.. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లు 5,24,850కి చేరుకున్నాయి. మిగిలినవి శరవేగంగా కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 43,602 ఇళ్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లాలో 37,141 ఏలూరు జిల్లాలో 26,815 ఇళ్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ బిల్లులను ప్రభుత్వం వేగంగా చెల్లిస్తోంది. నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు అందచేస్తోంది. 5న సామర్లకోట లే అవుట్లో ఇళ్లకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు పేదలందరికి ఇళ్లు–నవరత్నాల్లో భాగంగా పూర్తయిన ఐదు లక్షల గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 5వ తేదీన సామర్లకోటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. అదే రోజు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లే అవుట్లలో ఇళ్లను మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారని, సామూహిక గృహ ప్రవేశాలు ఉంటాయని అజయ్ జైన్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఐదు లక్షల గృహాల లే అవుట్లలో నూటికి నూరు శాతం మంచినీటి, విద్యుత్ సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. రహదారులు, అంతర్గత రహదారులు, స్వాగత తోరణాలు కూడా పూర్తైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5.24 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. తిరగకుండానే మంజూరైంది.. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోలేదు. ఆ పార్టీ సానుభూతిపరులం కాదని సంక్షేమ పథకాల నుంచి తొలగించారు. తమ పార్టీ జెండా పట్టుకుంటే అన్నీ వస్తాయని ఆ పార్టీ నాయకులు చాలాసార్లు ఆశ పెట్టారు. ఇప్పుడు ఏ నాయకుడు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే మాకు ఇంటి స్థలం మంజూరైంది. త్వరలో గృహప్రవేశం కూడా చేయనున్నాం. ప్రభుత్వం మాకిచ్చింది సెంటు స్థలమేనని హేళనగా మాట్లాడుతున్న టీడీపీ నాయకులు వారి ప్రభుత్వంలో గజం స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. – సూర్య భాస్కర్ కుమార్, సామర్లకోట, కాకినాడ జిల్లా దశాబ్దాల కల నెరవేరింది.. మా ఆయన చిరు వ్యాపారి. ఆయన సంపాదనంతా ముగ్గురమ్మాయిల చదువులు, కుటుంబ పోషణకే సరిపోయేది. వారికి పెళ్లిళ్లు చేయడానికి తలకు మించిన భారమైంది. దీంతో మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు సీఎం జగన్ మా దశాబ్దాల ఇంటి కలను నెరవేర్చారు. ఆయన రుణం ఈ జన్మకు తీర్చుకోలేం. – లంక లక్ష్మి, వైఎస్సార్–జగనన్న కాలనీ సామర్లకోట, కాకినాడ జిల్లా ఇంతకన్నా మేలు ఏ ప్రభుత్వం చేయలేదు.. నెలకు రూ.3,500 చెల్లించి అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. సుమారు 10 ఇళ్లు మారాం. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకుని ఆత్మగౌరవంతో జీవిస్తున్నాం. మా పిల్లల చదువులకు కూడా అమ్మఒడి ద్వారా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. ఇంతకన్నా మేలు మాకు ఏ ప్రభుత్వం చేయలేదు. – వి.సతీష్, పద్మావతి, వైఎస్సార్, జగనన్న కాలనీ సామర్లకోట పేదరిక నిర్మూలనే లక్ష్యంగా.. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలిస్తున్నారు. ప్రజల కనీస అవసరాల్లో ఒకటైన గూడు కోసం ఏ ఒక్కరు బాధ పడకుండా చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనిధంగా పేదలకు ఏకంగా 30 లక్షలకు పైగా ఇంటి పట్టాలు ఇచ్చారు. ఐదు లక్షల ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందిస్తున్నాం. శరవేగంగా మిగిలిన నిర్మాణాలను కూడా పూర్తి చేస్తాం. – దవులూరి దొరబాబు, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎప్పటికప్పుడు పురోగతి పరిశీలన పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తున్నాం. సామర్లకోటలో త్వరలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీశా, ఎండీ, ఏపీ గృహనిర్మాణ సంస్థ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి సమాజంలో సముచిత స్థానం లభిస్తుంది. ఇది కేవలం గృహ నిర్మాణంగానే చూడకూడదు. ఇళ్ల నిర్మాణంతో అనుబంధ రంగాల కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. సిమెంట్, ఇనుము, ఇటుకలు.. ఇలా వివిధ పరిశ్రమల ఉత్పత్తిలో వృద్ధి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుంది. పేదలు తమ సంపాదనలో తిండికి పెట్టే ఖర్చుతో సమానంగా ఇంటి అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పక్కా ఇళ్లు సమకూరితే అద్దెల భారం తగ్గుతుంది. ఆ మొత్తాన్ని మంచి ఆహారం, ఆరోగ్యం, పిల్లల భవిష్యత్ కోసం ఖర్చు చేస్తారు. దీంతో మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుంది. – ప్రొఫెసర్ కె.మధుబాబు, ఆర్థిక శాస్త్రం విభాగాధిపతి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం -
ఒక నిమిషం ఆగనున్న రైలు
సాక్షిప్రతినిధి,కాకినాడ: రైళ్లలో తాజాగా వందే భారత్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ ఖరీదెక్కువైనా సమయం కలిసి వస్తుండటంతో ఎగువ మధ్య తరగతి వర్గాలు తగ్గేదే లేదంటూ జై వందే భారత్ అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో మాత్రమే ఇప్పటివరకూ ఈ ట్రైన్ ఆగుతుంది. కాకినాడ జిల్లాలో రైల్వేపరంగా కీలకమైన సామర్లకోట జంక్షన్లో దాదాపు చాలా సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతున్నా వందేభారత్ మాత్రం ఆగదు. ఇక్కడ హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు ఆవేదన చెందేవారు. గురువారం నుంచి వీరి వేదన తొలగిపోనుంది. సామర్లకోట రైల్వే జంక్షన్లో హాల్టుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాంతానికి చెందిన వారిలో ఆనందోత్సాహం వ్యక్తమవుతోంది. గురువారం తొలిసారి ఆగనున్న సందర్భంగా వందేభారత్‌కు ఘనంగా స్వాగతించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్–విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ రైలు స్టేషన్లో ఒక నిమిషం ఆగుతుంది. ఇక్కడి హాల్టుతో రాజమహేంద్రవరానికి రెండు గంటలు వ్యయ ప్రయాసలు పడి అటు కోనసీమ, ఇటు కాకినాడ జిల్లాల ప్రయాణీకులు రైలు ఎక్కుతున్నారు. ఆరంభం నుంచి డిమాండ్ ప్రారంభం నుంచి వందే భారత్‌కు సామర్లకోట జంక్షన్లో హాల్ట్ కావాలని ప్రయాణికులు కోరుతున్నారు. విశాఖపట్నం–విజయవాడ మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణీకులు కాకినాడకు వెళ్లాలంటే సామర్లకోట జంక్షన్లో రైలు దిగాలి. మెట్ట ప్రాంత మండలాల నుంచి సామర్లకోట వచ్చి విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం వైపు ప్రయాణిస్తుంటారు. ఈ ప్రాంత ప్రయాణీకులతో పాటు మైదాన ప్రాంతంలోని కాకినాడ, తుని, పిఠాపురం పట్టణ ప్రయాణికులు కూడా సామర్లకోటలో హాల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంత మనోభావాలను ఎంపీ వంగా గీత కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్విన్‌వైష్ణవ్ దృష్టికి తీసుకు వెళ్లారు. మంత్రి సానుకూల స్పందన ఫలితంగా రైల్వేబోర్డు హాల్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 48 గంటల వ్యవధిలోనే ఆమోదం లభించడంతో ప్రయాణీకుల సంతోషపడుతున్నారు. ఆ లోటు భర్తీ అయ్యేనా సామర్లకోట రైల్వే జంక్షన్ నుంచి విశాఖపట్నం, విజయవాడ మీదుగా రోజుకు 80 (ఆప్ అండ్ డౌన్) ఎక్స్ప్రెస్రైళ్ళు రాక పోకలు సాగిస్తున్నాయి. వీటిలో 50 సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లే కావడం విశేషం. మిగిలినవి ఎక్స్‌ప్రెస్ రైళ్లు. రోజూ ఈ జంక్షన్ నుంచి ఏడెనిమిది వేల మంది ప్రయాణిస్తున్నారని రైల్వే అంచనా. ప్రస్తుతం వందేభారత్ రైలులో ఉమ్మడి జిల్లా నుంచి రోజూ 350 మంది ప్రయాణిస్తున్నారు. అయినా రైలులో సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. సామర్లకోట జంక్షన్లో హాల్డ్కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆ లోటు భర్తీ అవుతుందని రైల్వే అధికారులు విశ్వసిస్తున్నారు. ఇకపై రాజమహేంద్రవరం వెళ్లాల్సిన అవసరం లేకుండానే సామర్లకోట హాల్ట్‌తో తమకు వందేభారత్ అందుబాటులోకి వస్తోందని కాకినాడ జిల్లా ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ సమయం గంట నుంచి రెండు గంటలు తగ్గుతుందని ఆసక్తి చూపుతున్నారు. హాల్ట్‌కు సర్వం సిద్ధం వందేభారత్ హాల్ట్ సామర్లకోట జంక్షన్‌కు ఇవ్వడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇక్కడ ఆగేది ఒక్క నిమిషమే. ఈ సమయాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలి. సామర్లకోటలో హాల్ట్‌కు ఆమోదం లభించడంతో ఇప్పటికే హాల్ట్ ఉన్న రైల్వే స్టేషన్లలో ప్రయాణ సమయాల మార్పును ప్రయాణీకులు గమనించాలి.– ఎమ్ రమేష్, స్టేషన్ మేనేజర్.సామర్లకోట. వందేభారత్ (20833) వేళలు ఇలా ఈ రైలు విశాఖ నుంచి సామర్లకోటకు ఉద యం 7–14గంటలకు చేరుకుంటుంది. 7–15 గంటలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2–15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి 20834నంబర్‌తో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 9–34 గంటలకు సామర్లకోట చేరుకుంటుంది. నిమిషం తర్వాత తిరిగి బయలుదేరి విశాఖ వెళుతుంది. -
పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణంలో సామర్లకోటకు అవార్డు
సాక్షి, అమరావతి: కేంద్ర పట్ణణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘అర్బన్ హౌసింగ్ కాన్క్లేవ్’లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో బెస్ట్ పెర్ఫార్మింగ్ మునిసిపల్ కౌన్సిల్‌గా సామర్లకోటకు జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ లభించింది. ఈ అవార్డును కేంద్ర మంత్రి హరదీప్‌సింగ్ పురీ చేతుల మీదుగా ఏపీ టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ జేఎండీ శివప్రసాద్ గురువారం అందుకున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కాన్క్లేవ్లో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తోన్న ఇళ్లు, వైఎస్సార్, జగనన్న కాలనీల స్టాల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.