విశాఖ బాలుడు కోట రైల్వే స్టేషన్‌లో గుర్తింపు
విశాఖ బాలుడు కోట రైల్వే స్టేషన్‌లో గుర్తింపు
Published Wed, Jun 28 2017 12:13 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
సామర్లకోట : అదృశ్యమైన విశాఖపట్నం గోపాలపట్నానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని సామర్లకోట ఆర్పీఎఫ్ పోలీసులు సామర్లకోట రైల్వే స్టేషన్‌లో గుర్తించా రు. ఆర్పీఎఫ్ ఎస్సై యు.దుర్గాప్రసాద్ కథనం ప్రకారం ఒక బాలుడు విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో మహిళల బోగీలో ప్రయాణిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లంకలపల్లి భువన సాయిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంట్లో చెప్పకుండా తిరుపతి వెళ్లాలని బయలు దేరినట్టు విద్యార్థి చెప్పాడని ఎస్సై తెలిపారు. కుమారుడు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు, ఆర్పీఎఫ్ పోలీసులకు, హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆ విషయం టీవీలలో ప్రచారమైంది. దాంతో విశాఖపట్నం ఆర్పీఎఫ్ సిబ్బంది నుంచి వచ్చిన సమాచారం మేరకు స్థానిక ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై విద్యార్థిని సామర్లకోటలో రైలు నుంచి దింపి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం రాత్రి విద్యార్థి చినాన్న సందీప్‌కుమార్ సామర్లకోట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. సందీప్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ డిల్లీ వెళుతున్నానని నా కోసం వెతక వద్దని లేఖ రాసి పెట్టాడని దాంతో పోలీసులకు, హెల్ప్‌లైనుకు, ఆర్ఫీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్పీఎఫ్ ఎస్సై యు.దుర్గాప్రసాద్ హెల్‌్పలైన్ సిబ్బంది సమక్షంలో విద్యార్థిని అతడి చిన్నాన్నకు అప్పగించారు.
Advertisement