Delhi Woman’s Body Found on Terrace Hours After Party - Sakshi
Sakshi News home page

బిల్డింగ్‌పై బ్యూటీషియన్‌ మృతదేహం.. రూమ్‌మెట్‌ క్షణికావేశంలో..!

Published Tue, May 30 2023 7:08 PM | Last Updated on Tue, May 30 2023 8:18 PM

Woman's Body Found On Terrace In Delhi - Sakshi

దేశ రాజధానిలో దారుణం జరిగింది. దక్షిణ ఢిల్లీ, మజ్ను కా తిల్లాలోని ఓ భవనంపై మహిళ మృతదేహం పడి ఉండటం స్థానికంగా కలకలం సృష్టించింది. పార్టీలో జరిగిన గొడవలో బాధిత మహిళను తన రూమ్‌మెంట్‌ కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. రాణి(35) గురుగ్రామ్‌లోని బ్యూటీ పార్లలో పనిచేస్తోంది. సాప్న(36) వెయిటర్‌ వృత్తి చేస్తోంది. వీరిరువురూ ఒకే గదిలో రెంట్‌కు ఉంటున్నారు. నిన్న జరిగిన ఓ పార్టీలో మద్యం మత్తులో ఉన్న సాప్న.. తన తండ్రిని దుర్భాషలాడింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అదే గొడవ మరుసటి రోజు ఉదయం 4గంటలకు మళ్లీ మొదలైంది. విచక్షణ కోల్పోయిన సాప్న రూమ్‌లో ఉ‍న్న కత్తితో రాణిపై దాడి చేసింది. రాణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

రాణి మృతదేహం భవనం టెర్రస్ పైన పడి ఉందని పోలీసులు తెలిపారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న సాప్నకు ఓ కుమార్తె కూడా ఉన్నట్లు వెల్లడించారు. సాప్న నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.         

చదవండి:రోడ్డుపై లవర్స్‌ రొమాంటిక్ వీడియో..కేసుపై పోలీసుల తంట..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement