found
-
పార్శిల్లో మృతదేహం కేసులో పురోగతి
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో పార్శిల్లో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత గురువారం తులసికి చెక్క పెట్టెలో ఓ పార్శిల్ వచి్చంది. విద్యుత్ సామాన్లనుకుని దానిని తెరచి చూడగా దానిలో గుర్తు తెలియని మృతదేహం ఉంది. రూ.1.30 కోట్లు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తూ ఆ పెట్టెకు ఓ లెటర్ కూడా అంటించి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది(సోదరి భర్త) శ్రీధరవర్మ అలియాస్ సిద్ధార్థవర్మ ఫొటోను, నేరం జరిగాక అతడు ప్రయాణించిన ఎరుపు రంగు కారు ఫొటోలను జిల్లా పోలీసు శాఖ సోమవారం విడుదల చేసింది. ఎవరైనా నిందితుడిని గానీ, కారునుగానీ గుర్తిస్తే జిల్లా పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో ఉన్న నిందితుడు శ్రీధరవర్మను, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అలాగే పార్శిల్లో వచ్చిన మృతదేహం పశి్చమగోదావరి జిల్లా కాళ్ల మండలం గాం«దీనగర్‌కు చెందిన బర్రే పర్లయ్యదిగా గుర్తించారు. పర్లయ్య చనిపోవడానికి రెండు రోజుల ముందు శ్రీధరవర్మ దగ్గరకు పనికోసం వెళ్లినట్టు చెబుతున్నారు. -
మూడువేల ఏళ్లనాటి శివపార్వతుల ప్రతిమలు లభ్యం
మధుర: యూపీలోని మధురలో అత్యంత పురాతన శివపార్వతుల విగ్రహాలు లభ్యమయ్యాయి. బెనారస్ హిందూ యూనివర్శిటీ(బీహెచ్‌యూ)లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వినయ్ కుమార్ గుప్తా మాట్లాడారు.మూడు వేల ఏళ్ల క్రితం నాటి శివుడు, పార్వతిలకు చెందిన మట్టి ప్రతిమలు మధురలో లభమయ్యాయని తెలిపారు. ఈ ఏడాది మేలో బ్రజ్‌లోని గోవర్ధన్ పర్వతం దగ్గర తవ్వకాలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా భూమికి 15 మీటర్ల దిగువన విగ్రహాలు కనుగొన్నామన్నారు. 4,800 ఏళ్ల క్రితం గణేశ్వర నాగరికత ఆధారాలు కూడా కనిపించాయన్నారు. మొదటి శతాబ్దం కాలం నాటి శివపార్వతుల ఆరాధనకు సంబంధించిన పురావస్తు ఆధారాలు లభించాయన్నారు.మధురలో మహాభారత కాలం నాటి సుమారు ఎనిమిది మీటర్ల మందపాటి పొర నిక్షేపం అంటే పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్ కనుగొన్నామన్నారు. ఎండిపోయిన ఒక పురాతన నది కాలువ 23 మీటర్ల లోతులో ఉన్నట్లు తేలిందన్నారు. ప్రపంచ పురావస్తు శాస్త్రంలో ఇది అత్యంత అపూర్వమైన విజయయమని, బలి, అగ్ని దేవతల విగ్రహాల అవశేషాలు ఆ నాటి ఆధ్యాత్మిక,సాంస్కృతిక పద్ధతులను తెలియజేస్తాయన్నారు.ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్.. తప్పిన పెను ప్రమాదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదానికి కుట్రపన్నిన వైనం వెలుగు చూసింది. డెహ్రాడూన్‌లోని రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్ లభ్యం కావడంతో కలకలం చెలరేగింది. హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ వెళ్లే రైల్వే ట్రాక్ పై ఈ డిటోనేటర్ పడివుంది.పండుగల సమయంలో ఎవరో రైలు ప్రమాదానికి కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే రైల్వే ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డిటోనేటర్‌ను ఈ వ్యక్తి అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్‌పై డిటోనేటర్ ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్థానిక పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. ఇంతలో రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న దృశ్యం సీసీ కెమెరాలో కనిపించింది. పోలీసులు వెంటనే ఆ యువకుడిని గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ యువకుడిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అశోక్‌గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్ -
ఆహారంలో బల్లి.. 50 మందికి అస్వస్థత
లాతూర్: మహారాష్ట్రలోని లాతూర్‌లో కలుషిత ఆహారం తిన్న విద్యార్థినులు అనారోగ్యం బారినపడ్డారు. ఇక్కడి పురన్మల్ లాహోటీ హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న 50 మంది విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థినులను తిరిగి హాస్టల్‌కు పంపించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం వారు తిన్న ఆహారంలో బల్లి కనిపించింది. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆస్పత్రిలో వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. లాతూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శివాజీ కల్గే మీడియాతో మాట్లాడుతూ గార్మెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్నారు. వారికి చికిత్స అందించి, అబ్జర్వేషన్లో ఉంచి తరువాత తిరిగి హాస్టల్‌కు పంపించామన్నారు. కాగా ఈ ఘటనపై హాస్టల్ అధికారులు విచారణ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: 'మూడు రెట్ల జీతం వచ్చే ఉద్యోగం' -
పడవలో కుళ్లిన 30 మృతదేహాలు.. సెనెగల్‌లో కలకలం
డాకర్ (సెనెగల్): పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌లో ఒళ్లు జలదరించే దృశ్యం కనిపించింది. సెనెగల్ సాగర తీరంలో తేలియాడుతున్న పడవలో 30 కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజధాని డాకర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ పడవ కనిపించింది. నేవీ సిబ్బంది ఈ చెక్క పడవను ఓడరేవుకు చేర్చారు.మృతదేహాలు కుళ్లిపోవడంతో వాటి గుర్తింపు కష్టంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఇవి ఎవరివనేది గుర్తించేందుకు ఉన్న మార్గాల గురించి అధికారులు అన్వేషిస్తున్నారు. ఇటీవలికాలంలో సెనెగల్ నుండి స్పెయిన్ కానరీ దీవులకు వలసలు భారీగా పెరిగాయి. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 1,500 కిలోమీటర్లకు మించిన దూరాన్ని దాటి వలస సాగిస్తున్నారు.ప్రాథమికంగా ఈ మృతదేహాలు వలసదారులవై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. చాలా రోజులుగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ పడవ ఉండివుంటుందని అధికారులు చెబుతున్నారు. గత ఆగస్ట్‌లో డొమినికన్ రిపబ్లిక్ తీరంలో ఒక పడవలో 14 మృతదేహాలు లభ్యంకాగా, అవి సెనెగల్ జాతీయులవై ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా అక్రమ వలసలను అరికట్టడానికి సెనెగల్ 10 సంవత్సరాల ప్రణాళికను ప్రకటించింది. నిరుద్యోగం, పేదరికం, అంతర్గత సంఘర్షణలతో విసిగిపోయిన యువకులు అట్లాంటిక్ మహాసముద్రంలో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటూ కానరీ దీవులకు వలస వెళుతున్నారు. ఇది కూడా చదవండి: యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం -
సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం స్వాధీనం చేసుకుంది. బ్యాగ్‌ను అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు -
రైతు పొలంలో ‘వజ్రం’ పండింది
సాక్షి, కర్నూలు: జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు బయటపడుతున్నాయి. పొలం పనులకు వెళ్లిన రైతుకు వజ్రం దొరికింది. 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. కొందరు వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారు. రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వారు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన సమాచారం.సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు..కాగా, కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. -
అయోధ్యకు అందిన విరాళాల మొత్తం ఎంతంటే?
అయోధ్యలో రామాలయ నిర్మాణపనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనుల్లో మొదటిదశ పూర్తయ్యింది. 2024 జనవరి 22న బాల రాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు భక్తులు ప్రతిరోజూ విరాళాలు అందజేస్తున్నారు.రామ్‌లల్లా ఆలయానికి భూమి పూజ 2020, ఆగస్టు 5న జరిగింది. అప్పటి నుండి రామభక్తులు ఆలయ నిర్మాణానికి రూ. 55 వేలకోట్లకు పైగా నిధులను విరాళాల రూపంలో అందజేశారు. 2021లో నిర్వహించిన ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్‌లో రామమందిర్ ట్రస్ట్ దాదాపు రూ. 3500 కోట్ల విరాళాలను అందుకుంది. గడచిన 10 నెలల్లో రామాలయ నిర్మాణానికి విదేశాల్లో ఉంటున్న రామ భక్తులు సుమారు 11 కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు.రామమందిర్ ట్రస్ట్ 2021లో 42 రోజుల పాటు ఆలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ట్రస్టు 10 వేల రసీదులను ముద్రించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి 3,500 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి. 2024 జనవరి 22న రామాలయంతో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అప్పటి నుంచి రామ భక్తులు ప్రతిరోజూ భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు కోట్ల మందికి పైగా రామ భక్తులు ఆలయాన్ని సందర్శించారు. వీరు విరాళాలతో పాటు బంగారు, వెండి కానుకలను కూడా అందజేస్తున్నారు.శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ క్యాంపు కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం రామభక్తులు ఇప్పటి వరకు ఐదువేల కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు. విదేశాలలో ఉంటున్న రామభక్తులు కూడా ఉత్సాహంగా విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రామమందిర్ ట్రస్ట్ విదేశాల నుంచి వచ్చిన విరాళాల మొత్తాన్ని లెక్కించింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి దాదాపు 11 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. -
Kedarnath: ఒక రోజంతా బండరాళ్లలో.. చివరికి వచ్చాడిలా
ప్రకృతి విపత్తులో చిక్కుకున్న అతను బండరాళ్ల కింద ఇరుక్కుపోయాడు. సహాయం కోసం రాత్రంతా అరుస్తూనే ఉన్నాడు. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆపన్నహస్తాల కోసం కొన్ని గంటపాటు ఎదురు చూశాడు. చివరికి అతని నిరీక్షణ ఫలించింది.ప్రస్తుతం కేదార్నాథ్ ధామ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత బుధవారం సాయంత్రం చీకటిపడ్డాక కేదార్నాథ్ నడకమార్గంలో వెళుతున్న చమోలీ జిల్లాకు చెందిన గిరీష్ చమోలీ ఊహించని విధంగా బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటి నుంచి సహాయం కోసం అరుస్తూనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఏడీఆర్‌ఎఫ్ సైనికులు గిరీష్ ఆర్తనాదాలను విన్నారు. అతనిని రక్షించేందుకు ఆ బండరాళ్లను పగలగొట్టే పని మొదలు పెట్టారు. తొమ్మిది గంటల పాటు శ్రమించి వారు గిరీష్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.గిరీష్ తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు చెబుతూ ‘బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బయటకట్టి ఉన్న మా గుర్రాన్ని కాపాడుకునేందుకు నేను నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఆ గుర్రం ఉన్న చోటుకు వెళ్లాను. ఇంతలో బండరాళ్ల కింద చిక్కుకుపోయాను. అయితే ఊపిరి పీల్చుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. నా శరీరమంతా బండరాళ్ల కింద చిక్కుకుపోయింది. సహాయం కోసం రాత్రంతా అరుసూనే ఉన్నాను. నా గొంతు విని రెస్క్యూ సిబ్బంది నన్ను కాపాడారు’ అని తెలిపాడు. కాగా గిరీష్‌కు చికిత్స అందించేందుకు ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ మణికాంత్ అతనిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. -
శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం
సాక్షి, నంద్యాల: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం బయటపడింది. శివలింగం పక్కనే రాయిపై తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. బయటపడిన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. శివలింగం దగ్గర ఉన్న లిపిని ఆర్కియాలజీకి పంపించారు. బయట పడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14,15 వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు.గతంలో ఇదే ప్రాంతంలో చతుర్ముఖ లింగం బయటపడింది. గతంలో పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో పలు తామ్ర శాసనాలు బయటపడ్డాయి. -
నిజంగా చల్లటి కబురు : ఇషికా ఆచూకీ లభ్యం
ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్న తరుణంలా అమెరికాలో భారత్కుకెందిన ఇండో-అమెరికన్ విద్యార్థి సురక్షితంగా బైటపడటం నిజంగా చల్లటి కబురు. టెక్సాస్‌లోని తన ఇంటినుంచి సోమవారం రాత్రి అదృశ్యమైన 17 ఏళ్ల ఇషికా ఠాకోర్‌ను ఫ్రిస్కో పోలీసులు సురక్షితంగా గుర్తించారు. అయితే ఎపుడు, ఎక్కడ, ఎలా కనుగొన్నారు అనే వివరాలను మాత్రం ఫియాస్కో పోలీసులు వెల్లడించలేదు. టెక్సాస్‌లోని ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఏప్రిల్ 8, సోమవారం తప్పిపోయింది. ఫ్రిస్కోలోని బ్రౌన్వుడ్ డ్రైవ్‌లోని తన ఇంటి నుండి ఇషికా అదృశ్యమైందంటూ క్రిటికల్ మిస్సింగ్ హెచ్చరికను జారీ చేశారు. ఈమేరకు ట్విటర్లో ఒకపోస్ట్ పెట్టారు. ఇటీవల తప్పి పోయిన పలువురు భారతీయ విద్యార్థులు ఆ తర్వాత శవమై కనిపించడంతో ఇషికా అదృశ్యం ఆందోళన రేపింది. అయితే ఆమె ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. CRITICAL MISSING-Frisco PD is seeking assistance in locating 17-year-old Ishika Thakore, last seen Monday, Apr 8 at 11:30p in the 11900-block of Brownwood Dr. in Frisco. She is approx 5’4” and 175 lbs, last seen wearing a black, long-sleeve t-shirt and red/green pajama pants. pic.twitter.com/L7fDV7HuEH — Frisco Police (@FriscoPD) April 9, 2024 కాగా గత కొన్ని నెలల్లో అమెరికాలో 11 మంది భారతీయ, భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు చనిపోయారు. ముఖ్యంగా గత నెల నుంచి తప్పిపోయిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) అనే భారతీయ విద్యార్థి మంగళవారం ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. అలాగే ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మరో భారతీయ సంతతి విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణించచాడు. -
ఈ తవ్వకాల్లో ఏం దొరికాయో తెలుసా..!?
అలనాటి బలిపీఠానికి చెందిన ఫొటోలివి. పనామా రాజధానికి 177 కిలోమీటర్ల దూరంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఈ సమాధిలో అలనాటి పాలకుడిని, అతడి భార్యను తలకిందులుగా పాతిపెట్టి బలిచేశారు. వారితో పాటు మరో ముప్పయిరెండు మందిని కూడా ఇక్కడ పాతిపెట్టారు. ఈ సువిశాలమైన సమాధిలో వారి అస్థిపంజరాల అవశేషాలతో పాటు విలువైన బంగారు వస్తువులు భారీగా బయటపడటంతో తవ్వకాలు చేపట్టిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఈ సమాధిలో బంగారు శాలువ, బంగారు పళ్లేలు, పాత్రలు, నగలు, తిమింగలం దంతాలు తదితర వస్తువులు ఉన్నాయి. భారీ పరిమాణంలో బంగారు వస్తువులు దొరకడం వల్ల ఈ సమాధి అలనాటి పాలకుడు లేదా సంపన్న కులీనుడికి చెందినది కావచ్చని ఇక్కడ తవ్వకాలు జరిపిన బృందానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జూలియా మాయో తెలిపారు. ఈ సమాధి కనీసం పన్నెండువందల ఏళ్ల కిందటిది కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవి చదవండి: ఈవారం కథ: 'తరలి వచ్చిన వసంతం'! -
ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పిన్ బాంబు లభ్యం
మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది. రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన సమాచారం మేరకు ఎస్పీ అసిత్ యాదవ్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు బాంబును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసే స్థలంలో వాలంటీర్ రామ్మోహన్ ఈ బాంబును గుర్తించారు. అక్కడున్న పిల్లలు ఆ బాంబును రామ్ మోహన్‌కు చూపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుషా, ఎస్పీ అసిత్ యాదవ్, టీఐ కొత్వాలి ప్రవీణ్ చౌహాన్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బాంబును తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాంబు చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ఫైరింగ్ రేంజ్ ఏరియా ఉండేది. అప్పట్లో ఈ బాంబు మట్టిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. -
లాటరీ టిక్కెట్ కొన్నాడు.. లక్షల బహుమతి మరిచాడు!
పంజాబ్‌లోని ఫజిల్కాలో ఓ వింత ఉదంతం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి లాటరీని గెలుచుకున్నాడు. అయితే దీనికి సంబంధించిన బహుమతి మొత్తాన్ని అందుకునేందుకు అతను రాకపోవడం విశేషం. ఈ లాటరీని పంజాబ్ స్టేట్ మంత్లీ లాటరీ డ్రా నిర్వహిస్తుంది. ఈ లాటరీలో బహుమతి మొత్తం రూ.7 లక్షలు. ఈ లాటరీలో ఫాజిల్కాకు చెందిన ఒక వ్యక్తి విజేతగా నిలిచాడు. లాటరీ టిక్కెట్ల విక్రేత బాబీ బవేజా మాట్లాడుతూ తన వద్ద ఫాజిల్కాకు చెందిన వ్యక్తి లాటరీని కొనుగోలు చేశాడని, ఆ టికెట్ నంబర్ 688558 అని, దానికి మొదటి బహుమతిగా రూ.7 లక్షలు వచ్చిందని తెలిపారు. విజేతను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే అతని చిరునామా తెలుసుకుని, అందరికీ ఆ విషయాన్ని తెలియజేసి, అతనికి రూ.7 లక్షల రివార్డు ఇస్తామని బాబీ బవేజా తెలిపారు. గతంలో తన దగ్గర లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో సొమ్ము గెలుచుకున్నవారు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో రూ. 5 కోట్లు, రూ. 2.5 కోట్లు, రూ. ఒక కోటి, రూ. 51 లక్షలు, రూ. 25 లక్షలు ఇలా భారీ మొత్తాలను గెలుచుకున్నవారున్నారని వివరించారు. అయితే లాటరీ విజేత బహుమతి మొత్తాన్ని అందుకునేందుకు తమ దగ్గరకు రాకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాగా దేశంలోని 13 రాష్ట్రాల్లో లాటరీకి అధికారిక గుర్తింపు ఉంది. వాటిలో పంజాబ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో లాటరీ డ్రాను ప్రభుత్వం నిర్వహిస్తుంది. -
ది బోమ్ జీసస్: ఎడారిలో ఓడ... బోలెడంత బంగారం!
సుమారు 500 సంవత్సరాల క్రితం బంగారం , ఇతర సంపదతో భారతదేశానికి వెళుతుండగా అదృశ్యమైన పోర్చుగీస్ ఓడ అవశేషాలు నమీబియా ఎడారి తీరప్రాంతంలో గుర్తించారు. నైరుతి ఆఫ్రికాలోని ఎడారిలో బంగారు నాణేలతో ఉన్న ఓడను గుర్తించడం పురావస్తు పరిశోధనల్లో వెలుగు చూసిన అద్భుతంగా భావించారు. రెండు వేల స్వచ్ఛమైన బంగారు నాణేలు 44 వేల పౌండ్ల రాగి కడ్డీలు దాదాపుగా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. బోమ్ జీసస్ అనేది సబ్-సహారా ఆఫ్రికాలోని పశ్చిమ తీరంలో గుర్తించిన అత్యంత పురాతనమైన , అత్యంత విలువైన ఓడ. బోమ్ జీసస్ (ది గుడ్ జీసస్) ఓడ పోర్చుగల్‌లోని లిస్బన్ నుండి 1533న మార్చి 7 శుక్రవారం బయలుదేరిన పోర్చుగీస్ నౌక. కానీ 2008లో నమీబియా ఎడారిలో దీని అవశేషాలను గుర్తించినపుడు మాత్రమే ఈ ఓడలోని అద్భుత నిధి గురించి తెలిసింది. నైరుతి ఆఫ్రికాలోని డైమండ్ మైనింగ్ పనుల్లో నామ్దేబ్ డైమండ్ కార్పొరేషన్‌లోని కార్మికులు దీన్ని గుర్తించారు. బంగారం, రాగితో వంటి విలువైన సంపదతో ఇండియాకు వెళుతుండగా భయంకరమైన తుఫానులో చిక్కుకుని ఉంటుందని భావించారు.నమీబియా తీరంలో తుఫాను కారణంగా ఒడ్డుకు చాలా దగ్గరగా వచ్చినపుడు బోమ్ జీసస్ మునిగిపోయిందని అంచనా. దీని వలన ఓడ ముందు భాగం రాయితో ఢీకొని బోల్తా కొట్టింది. అయితే తీరప్రాంత జలాలు తగ్గుముఖం పట్టడంతో, బోమ్ జీసస్ అవశేషాలు బయల్పడ్డాయి. అయితే చెల్లాచెదురుగా కనిపించిన కొన్ని మానవ ఎముకలు తప్ప మరేమీ వీటిల్లో గుర్తించకపోవడంతో ఓడలోని సిబ్బంది శిధిలాల నుండి బయటపడటమో లేక మరణించడమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్‌కి చెందిన చీఫ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ నోలీ దీనిపై మరింత పరిశోధన చేశారు. బంగారు, వెండి, రాగి కడ్డీల నిధిని గుర్తించారు. దీనిపై బ్రూనో వెర్జ్ అనే సముద్రపు పురావస్తు శాస్త్రవేత్తను సంప్రదించారు డా. నోలీ. ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించి మూడు ఖండాలకు చెందిన వస్తువులతో ఉన్న ఓడ ప్రమాదాన్ని కనుగొనడం చాలా ముఖ్యమైనదని కూడా ఆయన అన్నారు. -
బొగ్గు గని తవ్వకాల్లో అద్భుత ఖజానా..
అప్పుడప్పుడు తవ్వకాల్లో లభ్యమయ్యే పురాతన వస్తువులు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అమెరికాలోని నార్త్ డకోటాలో జరిపిన తవ్వకాల్లో ఒక కార్మికుడు అత్యంత పురాతన కాలానికి చెందిన అతిపెద్ద ఏనుగు దంతాన్ని కనుగొన్నాడు. పూర్వీకులు దీనిని మముత్ అని పిలిచేవారు. ఈ దంతం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. ఉత్తర డకోటా నగరంలోని ఒక గనిలో జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన ఏనుగు దంతం బయటపడింది. గనిలో జరుగుతున్న పనుల్లో పాల్గొన్న ఒక కార్మికుడు దాదాపు రెండు మీటర్ల పొడవైన తవ్వకం జరిపినప్పుడు ఈ అతిపెద్ద దంతం బయటపడింది. ఇది 10 వేల నుంచి లక్ష ఏళ్ల క్రితం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు. యూఎస్‌లోని ఉత్తర డకోటా గనులలో కొన్ని మిలియన్ టన్నుల లిగ్నైట్ బొగ్గును వెలికితీస్తారు. ఈ బొగ్గు గనిలోనే ఈ అమూల్యమైన నిధి దొరికింది. ఈ బొగ్గు గనుల్లో ఇంతకాలం భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నప్పటికీ ఇప్పుడు ఇంత విలువైన ఏనుగు దంతం దొరకడంపై నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే డైనోసార్లు మనుగడ సాగించిన కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగులు భూమిపై ఉండేవని పరిశోధకులు కనుగొన్నారు. ఆ ఏనుగులను మముత్లు అని పిలిచేవారు. ఇప్పుడు నాటికాలపు ఏనుగు దంతం బయల్పడటం విశేషం. దీనిని అద్భుతమైన ఆవిష్కరణగా నిపుణులు పరిగణిస్తున్నారు. అమెరికాలోని ఉత్తర డకోటాలోని బొగ్గు గనిలో దొరికిన మముత్ ఏనుగు దంతం బరువు 22 కిలోలకు మించి ఉంది. శాస్త్రవేత్తలు మముత్ ఏనుగు దంతాన్ని తదుపరి పరిశోధన కోసం సురక్షితంగా భద్రపరిచారు. కాగా ఈ ఏనుగుదంతాన్ని వెలికితీసిన బొగ్గు గని కార్మికుడు భారీ మొత్తంలో సొమ్ము అందుకోనున్నాడనే ప్రచారం జరుగుతోంది. -
శిశువును ఈడ్చుకుపోయిన సుడిగాలి.. తరువాత?
అమెరికాలో ఊహకందని అద్భుతం జరిగింది. దీనిని విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని టెన్నెస్సీని తాకిన తీవ్ర తుఫానులో ఊయలతోపాటు ఎగిరిపోయిన నాలుగు నెలల చిన్నారి ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దేవుని దయతో తమ చిన్నారి సజీవంగా తమకు దొరికాడని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. టెన్నెన్సీలో వచ్చిన బలమైన సుడిగాలి తమ ఇంటిని ధ్వంసం చేసిందని ఆ దంపతులు తెలిపారు. ఆ సమయంలో తమ ఇంటి పైకప్పు ఎగిరిపోగా, వారి పిల్లాడు ఊగుతున్న ఊయల కూడా ఎగిరిపోయింది. దీంతో ఆ చిన్నారి కుండపోత వర్షంలో.. పడిపోయిన చెట్ల మధ్య చిక్కకుపోయాడు. ఈ తుఫానులో ఆ చిన్నారితో పాటు అతని ఏడాది వయసున్న సోదరుడు, తల్లిదండ్రులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన సిడ్నీ మూర్ (22) మీడియాతో తమకు ఎదురైన అనుభవాన్ని తెలియజేశారు. తుఫాను తాకిడికి తమ ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని, ఊయలతోపాటు తమ కుమారుడు కూడా ఎగిరిపోయాడని తెలిపారు. దీనిని చూసిన తన భర్త కుమారుడిని రక్షించేందుకు పరిగెత్తారని, అయితే తుపాను తాకిడి కారణంగా కుమారుడిని రక్షించలేకపోయారని తెలిపారు. ఈ సమయంలో మూర్ తన మరో కుమారుడు ప్రిన్స్టన్కు ఎలాంటి అపాయం కలుగకుండా గట్టిగా పట్టుకుంది. పది నిమిషాల పాటు చిన్న కొడుకు కోసం ఆ దంపతులు వెదకగా.. కూలిన చెట్ల మధ్య కుమారుడు ఉండటాన్ని వారు గమనించారు. మొదట కుమారుడు చనిపోయాడని వారు అనుకున్నారు. అయితే పిల్లాడు బతికే ఉండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రభుత్వం మారగానే సీఎం కార్లకు కొత్త నంబర్లు! -
రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత?
దిక్కులేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఐదు నెలల బాలుని విషయంలో ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఒక ముస్లిం కుటుంబానికి రైలులోని టాయిలెట్లో ఒక పసిబాలుడు కనిపించాడు. వారు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు ఆ చిన్నారి సంబంధీకుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. డెహ్రాడూన్‌లోని జీఎంఎస్ రోడ్డులో నివాసం ఉంటున్న ఫర్నిచర్ వ్యాపారి ఫయాజ్ అహ్మద్ కుటుంబం ఆదివారం జ్వాలాపూర్ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో తిరిగి వస్తోంది. ఈ నేపధ్యంలో ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళకు టాయిలెట్లో ఐదు నెలల బాలుడు కనిపించాడు. దీంతో ఆ మహిళ కోచ్‌లోని వారందరికీ ఈ విషయాన్ని తెలిపింది. వారెవరూ ఆ బాలుడు తమకు చెందినవాడు కాదని స్పష్టం చేశారు. ఇంతలో డెహ్రాడూన్ స్టేషన్ వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడిని తమ ఇంటికి తీసుకువచ్చారు. ముందుగా ఆ బాలునికి వైద్య చికిత్స అందించారు. తరువాత ఇందిరానగర్ పోలీస్ పోస్ట్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ చిన్నారి సంబంధీకుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ చిన్నారిని పెంచే బాధ్యతను అధికారులు తమకు అప్పగిస్తే అందుకు తాను సిద్ధమేనని ఫయాజ్ తెలిపారు. కాగా ఆ చిన్నారికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది కూడా చదవండి: ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం! -
వికారాబాద్: అవ్వ మిస్సింగ్, చివరకు..
సాక్షి, వికారాబాద్: ఆ అవ్వ ఆయుష్షు గట్టిదే. ప్రమాదవశాత్తూ ఓ పెద్ద కాలువలో పడినా.. రోజంతా అక్కడే గడిపి క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. వికారాబాద్ తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ మున్సిపల్ పరిధిలోని గీతా మందిర్ సాయిపూర్ ప్రాంతానికి చెందిన కోస్గి భారతమ్మ (75) ఆదివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె మనవడు పట్టణంలో అంతా వెతికాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్ అంతా గాలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఉదయం ఇంటి దగ్గర్లో ఉన్న ఓ మురుగు కాలువపై అతనికి అనుమానం వచ్చింది. రోడ్డు వెడల్పు కోసం చేపట్టిన నిర్మాణం అది. వెంటనే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పిలిపించి అందులో వెతికించాడు. సోమవారం సాయంత్రం పెద్ద నాలాలో కింద మూలుగుతూ కూర్చున్న భారతమ్మ అతని మనవడికి కనిపించింది. మున్సిపల్ కార్మికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి. దగ్గర్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించగా.. ఆమె ప్రమాదవశాత్తు అందులో పడిందని మనవడు చెబుతున్నాడు. మరోవైపు.. అవ్వ మిస్సింగ్ కథ సుఖాంతం కావడంతో మృత్యువును జయించిదంటూ స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. -
ఐటీ దాడుల్లో దొరికింది కాంగ్రెస్ డబ్బే
మెదక్: కర్ణాటక నుంచి అవినీతి డబ్బును తరలించి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రి టి.హరీశ్ రావు ఆరోపించారు. బెంగళూరు ఐటీ దాడుల్లో దొరికిన రూ.42 కోట్లు అక్కడి కాంట్రాక్టర్ అంబికా పతిదని, ఆయన భార్య కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొ రేటర్ అని తెలిపారు. శుక్రవారం మంత్రి మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ధ్వజమె త్తారు. తెలంగాణలో డబ్బులు పంపిణీ చేసి, అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కుటిల ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఐటీ దాడులతో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయట పడ్డాయని, అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ల వద్ద గత బీజేపీ ప్రభుత్వం 40% కమీషన్ తీసుకుంటే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 50% కమీషన్ తీసుకుని, ఆ డబ్బు తో ఓట్లు కొనేందుకు తెలంగాణపై దండయాత్ర చేస్తోందని మండిపడ్డారు. ఐటీ దాడుల్లో దొరికిన డబ్బు గురించి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత ఈశ్వరప్పలకు అంబికాపతి అత్యంత సన్నిహితు డని తెలిపారు. కర్ణాటకలో బిల్డర్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రూ.1,500 కోట్లు వసూలు చేసి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయాల ని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చెన్నై మీదుగా హైదరాబాద్‌కు డబ్బులు పంపాలని ఆ పార్టీ పథకం వేస్తోందని అన్నారు. వ్యాపారాలు చేసుకోకుండా రాజకీయాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను ఎంపిక చేసుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని మంత్రి హరీశ్ విమర్శించారు. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. షెడ్యూల్ వచ్చినా టికెట్లు ప్రకటించలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీదన్నారు. -
375 ఏళ్లకు బయటపడిన 8 వ ఖండం ఏది?
మనిషి భూమి నలుచెరగులా తిరిగాడని, ఇక చూడాల్సినది ఏమీ లేదని అనుకుంటే అది తప్పే అవుతుంది. నేటికీ భూమిపై అన్వేషించేందుకు చాలా రహస్యాలు దాగివున్నాయి. 375 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవలే శాస్త్రవేత్తలు భూమికి గల 8వ ఖండం అయిన జిలాండియాను కనుగొన్నారు. ఈ ఖండం చాలా పెద్దది. పలు చిన్న దేశాలకు ఇందులో వసతి కల్పించవచ్చు. ఈ ఖండానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఏళ్లుగా దాగున్న ఖండం అని చెబుతారు. 2017 సంవత్సరం వరకు ఈ ఖండం గురించి ఎవరికీ తెలియదు. అయితే ఈ ఏడాది కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి ప్రస్తావించడంతో ప్రపంచం దృష్టి ఈ ఖండంవైపు మళ్లింది. ఈ 8వ ఖండం 49 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని పలు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. దీని ఉనికి విషయానికొస్తే ఈ ఖండం దాదాపు 55 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఖండంలోని 94 శాతం భూభాగం నీటిలో మునిగిపోయింది. 6 శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఇది న్యూజిలాండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఖండం చాలా ప్రత్యేకమైనది. అగ్నిపర్వత శిలలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే జంతువులు, జీవులు ప్రపంచంలోని ఇతర జీవులకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ ఖండంలో దాగున్న రహస్యాలను వెలికితీసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారత్‌లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత! -
144 ఏళ్ల మెడికల్ స్టోర్ ఎలా బయటపడింది? దానిలో ఏమేమి ఉన్నాయి?
చరిత్రకు సంబంధించిన పలు అంశాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా 114 ఏళ్ల క్రితం నాటి మెడికల్ స్టోర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1880లో ప్రారంభమైన ఈ స్టోర్ 1909 వరకూ సవ్యంగానే నడిచింది. ఈ స్టోర్‌ను బ్రిటన్‌లో విలియం వైట్ అనే వ్యక్తి నిర్వహించేవాడు. అతని మరణానంతరం ఈ స్టోర్ మూతపడింది. ఇన్నాళ్ల తరువాత ఈ స్టోర్ తలుపులు తెరవగానే లోపల ఆశ్చర్యం కలిగించే పలు వస్తువులు కనిపించాయి. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ మెడికల్ స్టోర్ గురించి 80 ఏళ్ల క్రితమే వెల్లడయ్యింది. అయితే విలియం వైట్ మనుమడు 1987లొ దీని గురించి బహిరంగంగా తెలియజేశాడు. తరువాత దీనిని ప్రజల సందర్శనార్థం తెరిచాడు. ఈ స్టోర్‌లో లిక్విడ్ మెడిసిన్‌తో నిండిన జార్లు, స్కేళ్లు, వైట్ రైటర్ మొదలైనవి లభ్యమయ్యాయి. విలియం వైట్ మరణానంతరం అతని ఇంటిని విక్రయించే సమయంలో ఈ రహస్య గదిని కనుగొన్నారు. అప్పుడు వైట్ కుమారుడు చార్లెస్ ఈ స్టోర్‌ను మూసివేశాడు. ఒక పరిశోధకుడు చెప్పిన దాని ప్రకారం స్టొర్లోని సామాను పరిశీలించి చూస్తే, విలియం ఒక కెమిస్ట్ అని తెలుస్తోంది. అలాగే అతను గ్రోసరీ సామాను కూడా భద్రపరిచేవాడు. అయితే నాటి వస్తువులు ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ దుకాణంలో కొన్ని వనమూలికలు కూడా లభించాయి. ఈ దుకాణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు? -
టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా?
టైమ్ ట్రావెల్ అనేది ఒక విచిత్ర భావన. దీని గురించి చర్చలు కూడా జరుగుతుంటాయి. టైమ్ ట్రావెల్ అనేది వాస్తవికతకు దూరంగా ఉంటుంది. సినిమాల్లో టైం ట్రావెల్‌ని చూసిన ప్రేక్షకులు ఎంతగానో ఆశ్చర్యపోతుంటారు. టైమ్ ట్రావెల్ గురించి తెలుసుకుంటే అలా ట్రావెల్ చేసి, తమ గతం చూసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. నిజానికి టైమ్ ట్రావెల్ అనేది ఇంకా సాధ్యం కాలేదు. అయితే టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటప్పుడు టైమ్ ట్రావెల్ నిజమని అనిపిస్తుంటుంది. ఇటీవల విదేశీ మీడియాలో ఇలాంటి ఒక ఫొటో వైరల్‌గా మారి, తెగ చర్చలకు దారితీసింది. ఇది టైమ్ ట్రావెల్‌ను రుజువు చేసే ఫొటో అని చెబుతున్నారు. డైలీ స్టార్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం 2016వ సంవత్సరంలో ఐస్లాండ్ దేశానికి సంబంధించిన ఫేస్బుక్ గ్రూప్‌లో ఒక ఫోటో షేర్ అయ్యింది. ఈ ఫోటోపై ఈ నాటికీ చర్చలు జరుగుతున్నాయి. అందులో కనిపిస్తున్నది టైమ్ ట్రావెలర్ అయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదన వెనుక ఒక ఆధారం కూడా ఉందని చెబుతున్నారు. టైమ్ ట్రావెల్ చేస్తున్న వ్యక్తిని పరిశీలించినప్పుడు.. అతను మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు. అయితే ఈ ఫోటో 1943లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఐస్లాండ్లోని రెక్జావిక్‌లో తీసినదని నివేదికలో పేర్కొన్నారు. అ ఫొటోలో జనం రద్దీ కనిపిస్తుంది. సైనికులు అటూఇటూ తిరుగుతూ కనిపిస్తారు. అయితే ఒక వ్యక్తి ఓ షాపు దగ్గర ఫోన్లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు. అతడే టైమ్ ట్రావెల్ చేసిన వ్యక్తి అని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకుంటే ఆ సమయంలో ఫోన్లు అందుబాటులో లేవు. ఈ ఫొటోలో అమెరికన్ సైనికులు రోడ్డు మీద వెళుతుండగా వారి ముఖాల్లో కొంచెం ఆందోళన కనిపిస్తోంది. అయితే ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ముఖంలో అలాంటి ఆందోళన కనిపించడం లేదు. కాగా రోడ్డుపై నడుస్తున్నవారు చలిని తట్టుకునేందుకు ట్రెంచ్ కోట్లు ధరించి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫొటో షేర్ చేసిన ఫేస్బుక్ బృందం ఇది 1943లో తీసిన ఫొటోగా పేర్కొంది. ఇది కూడా చదవండి: 21 కి.మీ. పరిగెత్తితే 11 కిలోలు తగ్గుతారా?.. దీనిలో నిజమెంత? -
ఇంటి తవ్వకాల్లో పురాతన బాక్సు.. తెరిచి చూడగానే..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక పురాతన ఇంటి తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. గతంలో ఈ ఇంటిలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నరేష్ అగర్వాల్ ఉండేవారు. తాజాగా ఈ ఇంటి తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు లభించాయి. అయితే ఇవి ఎవరివనే విషయం ఇప్పటి వరకూ వెల్లడికాలేదు. కాగా ఇంటి తవ్వకాల్లో అస్థిపంజరాలు లభించాయని తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంటిని సీల్ చేశారు. అస్థిపంజరాలను పరిశీలనకు ల్యాబ్‌కు పంపారు. ఇంటిలో అస్థిపంజరాలు దొరికాయన్న విషయం స్థానికంగా దావానలంలా వ్యాపించింది. దీంతో అవి ఎవరివంటూ స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ నరేష్ అగర్వాల్ ఈ ఇంటిని అశోక్ అగర్వాల్ అనే వ్యక్తికి విక్రయించారు. తాజాగా అశోక్ అగర్వాల్ ఈ ఇంటిని పడగొట్టి నూతన భవనం నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇంటి కూల్చివేతలు జరుగుతుండగా, కూలీలకు ఒక పెద్ద పురాతన బాక్సు లభించింది. ఆ బాక్సుకు ఉన్న తాళం బద్దలుగొట్టి లోపల ఏముందో చూసి, హడలెత్తిపోయారు. బాక్సులోపల మానవ అస్థిపంజరాలు ఉండటంతో వారు భయపడిపోయారు. పనులను ఎక్కడివక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బాక్సును పరిశోధనాశాలకు తరలించారు. అక్కడి నుంచి రిపోర్టు రాగానే దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అలాగే ఇంటి యజమానిని విచారిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షులపై స్మార్ట్ గాడ్జెట్ల నిషేధం ఎందుకు? -
గాంధీనగర్ లో గల్లంతైన మహిళ మృతి
-
చేతివాచీని పోగొట్టుకున్న పైలట్.. ఐదు నిముషాల్లో దక్కిందిలా!
హనా మొహ్సిన్ ఖాన్ అనే కమర్షియల్ పైలట్ ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తన రిస్ట్‌వాచీని పోగొట్టుకున్నారు. అయితే దానిని సురక్షితంగా అందజేసిన ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. హనా మొహ్సిన్ ఖాన్ దుబాయ్ నుంచి తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాపును సందర్శించారు. భద్రతా తనిఖీ సమయంలో తన చేతి గడియారాన్ని తీసినప్పుడు.. అక్కడే మరచిపోయారు. కొద్దిసేపటి తరువాత తన గడియారం మిస్సయిన సంగతి గ్రహించారు. తన గడియారం పోయినట్లేనని, ఇక దొరకదని మొదట్లో అనుకున్నారు. అయితే మిస్సయిన చేతివాచీ కోసం ఒకసారి ప్రయత్నిద్దామనే ఉద్దేశంతో ఆమె దుబాయ్‌లోని గ్రౌండ్ స్టాఫ్‌ను సంప్రదించారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్కి ఈ-మెయిల్ పంపారు. ఈ నేపధ్యంలో ఆ డిపార్ట్మెంట్ బృందం ఆమె రిస్ట్‌వాచీని కనుగొంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఆమె తన వాచీని తిరిగి తీసుకోగలిగారు. దీంతో లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్ బృందాన్ని ఆమె అభినందించారు. దుబాయ్ విమానాశ్రయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె తన పోస్ట్‌ను ముగించారు. ఈ పోస్టును చూసిన యూజర్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తాము మిస్సయిన, తిరిగి పొందిన వస్తువుల గురించిన వివరాలను షేర్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి! Last month while operating a Dubai back flight I had gone to the duty free. During the security check I had taken my watch off and forgot to pick it up. I had thought it was forever lost when I was flying back and discovered that I no longer had it. I contacted my ground staff in… pic.twitter.com/GDP2vpBcsO — Hana Mohsin Khan | هناء (@girlpilot_) September 4, 2023 -
అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ..
ఇది ఒక విచిత్ర కుటుంబానికి చెందిన కథ. వారు బాహ్యప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా బతికారు. ప్రపంచంలో ఏమి జరుగుతోందో వారికి ఏమాత్రం తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. ఈ విషయం కూడా ఆ కుటుంబానికి తెలియదు. ఈ కుటుంబంలోని వారు సెర్బియాలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుడిసె వేసుకుని జీవించారు. వారిని ఒక శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇది 1978 నాటి ఉదంతం. ఖనిజ సంపదను అన్వేషించే ప్రయత్నంలో.. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం హెలికాప్టర్ ద్వారా సెర్బియాలోని దట్టమైన అడవులతో కూడిన ఒక ప్రాంతానికి వెళ్లింది. ఖనిజ సంపదను అన్వేషించే ఉద్దేశంతో వారి ప్రయాణం సాగింది. అనుకోని రీతిలో హెలికాప్టర్ పైలెట్ ఏదో నగరానికి 155 మైళ్ల దూరంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఒక ప్రాంతాన్ని గమనించాడు. అది మనుషులు ఉంటున్న ప్రాంతంగా అతనికి అనిపించింది. 6 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై.. దీంతో శాస్త్రవేత్తల బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ వారికి ఈ విచిత్ర కుటుంబం కనిపించింది. కార్ప్ అనే వృద్దుడు, అతని నలుగురు పిల్లలు అక్కడ ఉన్నారు. ఆ వృద్ధుని భార్య అకులిన్ 1961లో విపరీతమైన చలి, ఆకలి కారణంగా మృతి చెందింది. ఈ కుటుంబం దట్టమైన అడవిలో 6 వేల అడుగుల ఎత్తున ఉన్న పర్వతంపై శాస్త్రవేత్తలకు కనిపించింది. ఇంత ఎత్తులో కేవలం ఎలుగుబంట్లు, తోడేళ్లు మొదలైన జంతువులు మాత్రమే జీవించగలవు. ఇది కూడా చదవండి: నయా దోపిడీ: సాధువు వేషంలో పాములను మనుషులపైకి వదులుతూ.. రెండవ ప్రపంచ యుద్ధం గురించి.. ఆ కుటుంబం ప్రపంచంతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. రెండవ ప్రపంచయుద్ధం, టీవీ, ఆధునిక వైద్యం మొదలైనవాటి గురించి వారికి ఏమాత్రం తెలియదు. జియాలజిస్ట్ గలీనా పిస్మెన్స్కాయ ఇక్కడకు ఖనిజ పరిశోధన నిమిత్తం వచ్చారు. ఆయన ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ కుటుంబం గురించి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ‘వారు ఎంతో భయస్తులుగా కనిపించారు. మేము ఆ వృద్దునికి నమస్కారం పెట్టాం. వెంటనే ఆ వృద్ధుడు ఏమీ స్పందించలేదు. తరువాత మెల్లగా మీరు ఇంత దూరం వచ్చారు. మీకు స్వాగతం అని అన్నాడు. తాత్కాలిక గృహాన్ని నిర్మించుకుని.. ఆ వృద్దుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్టాలిన్ పాలనా కాలంలో 1936లో కమ్యూనిస్టులు అతని తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపేశారు. అనంతరం కార్ప్ లైకోవ్ తన భార్య 9 ఏళ్ల కుమారుడు సావిన్, రెండేళ్ల కుమార్తె నటాలియాలతో పాటు ఈ దట్టమైన అటవీ ప్రాంతానికి వచ్చాడు. వారు ఇక్కడ తాత్కాలిక గృహాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడే కార్ప్ దంపతులకు 1940, 1943లలో మరో ఇద్దరు పిల్లలు కలిగారు. ఆ పిల్లలకు ఈ ప్రాంతానికి బయట మరోప్రాంతం ఉందని కూడా తెలియదు. బయటకు రావాలని కోరినా.. శాస్త్రవేత్తలు ఆ కుటుంబ సభ్యులను తమతో పాటు తమ క్యాంపునకు తీసుకువెళ్లారు. అక్కడ వారి దగ్గరున్న పలు ఆధునిక పరికరాలను చూసి, ఆ కుటుంబ సభ్యులు తెగ ఆశ్చర్యపోయారు. 1981లో సావిన్, నటాలియాలు ఆహార సమస్యతో కిడ్నీలు ఫెయిలై మృతిచెందారు. మరో కుమార్తె నిమోనియాతో మృతి చెందింది. ఇలా ముగ్గురు సభ్యులు మరణించిన నేపధ్యంలో శాస్త్రవేత్తలు కార్ప్‌ను, అతని మరో కుమార్తెను ఆ అడవిని విడిచిపెట్టి బయటకు రావాలని కోరారు. అయితే అందుకు వారు నిరాకరించారు. 1988, ఫిబ్రవరి 16న కార్ప్ మృతి చెందాడు. ఈ ఏడాది మార్చి వరకూ అందిన సమాచారం ప్రకారం అతని కుమార్తె ఇంకా ఆ దట్టమైన అడవిలో ఒంటరిగానే ఉంటోంది. ఇది కూడా చదవండి: నాడు సీమా, నేడు సానియా.. ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు! -
పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట!
ఇజ్రాయెల్‌లో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల యువతికి పురాతన అద్దం దొరికింది. ఇది 1500 ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అద్దాన్ని పురాతన కాలంనాటి ప్రజలు తమపై చెడు దృష్టి పడకుండా ఉండేందుకు ఉపయోగించేవారని సమాచారం. హైఫాకు చెందిన ఆ అమ్మాయి పేరు అవివ్ వీజ్‌మన్. ఈ అమ్మాయి ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ చేపట్టిన పురావస్తు తవ్వకాల కార్యక్రమంలో పాల్గొంది. ఈ సమయంలో ఆమెకు అద్దం లభించింది. ఇజ్రాయెల్ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ తవ్వకాల పనుల్లో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో అవివ్ వీజ్‌మన్ ఒకరు. పురావస్తు శాస్త్రానికి సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. బైజాంటైన్ కాలం నాటి అద్దం ఈ అద్దం దొరికిన ప్రదేశానికి ఉష అని పేరు పెట్టారు. ఇది బైజాంటైన్ కాలం నాటిదని సమాచారం. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ క్యూరేటర్ నెవిట్ పోపోవిచ్ తెలిపిన వివరాల ప్లేట్ మధ్యలో ఉన్న ఈ గాజు అద్దం 6వ శతాబ్దపు బైజాంటైన్ కాలం నాటి 'మ్యాజిక్ మిర్రర్'లో భాగమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అద్దం అంత్యక్రియలకు బహుమతిగా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. భవనం గోడ నుండి బయటపడిన అద్దం తవ్వకాల్లో భాగంగా డిగ్గర్లు తమ పనిలో నిమగ్నమై ఉండగా, 17 ఏళ్ల అవియాకు ఆ అద్దం కనిపించింది. ఆమె దానిని సీనియర్ అధికారులకు చూపించింది. దానిని పరిశీలించిన అధికారులు అది1500 సంవత్సరాల నాటి అద్భుత అద్దం అని, దానిని చెడు దృష్టిని పోగొట్టుకునేందుకు ఉపయోగించేవారని తెలిపారు. ఇది దెయ్యాలు తరహా దుష్టశక్తులను దూరం చేస్తుందని నాటి కాలంలో నమ్మేవారట. దుష్టబుద్ధి కలిగినవారు ఈ అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు, అద్దం యజమానిపై చెడు ప్రభావం ఉండదని నమ్మేవారట. అంత్యక్రియలకు బహుమతులుగా ఇలాంటి అద్దాలు ఇచ్చేవారని చరిత్ర చెబుతోంది. ఇది కూడా చదవండి: వింతజీవుల అకస్మాత్తు దాడులు.. గ్రహాంతరవాసులే అంటున్న జనం! -
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్..
ముంబయి: శివసేన చీఫ్(యూబీటీ), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో ఓ పాము అలజడి సృష్టించింది. ముంబయిలోని తూర్పు బాంధ్రా కాలానగర్‌లో ఉన్న థాక్రే ఇంట్లోకి ఆదివారం ఓ పాము దూరింది. విషయం గమనించి స్నేక్ క్యాచ్ర్కు ఫోన్ చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన స్నేక్ క్యాచర్ బృందాలు.. పామును పట్టుకున్నారు. కోబ్రా జాతికి చెందిన విషపూరిత పాముగా గుర్తించారు. मातोश्री में निकला सांप, पानी की टांकी के पीछे से सांप को किया गया रेस्क्यू । उद्धव ठाकरे ने किया सर्प मित्रो का शुक्रिया @IndiaTVHindi @indiatvnews pic.twitter.com/byAiNqS6yu — Namrata Dubey (@namrata_INDIATV) August 7, 2023 దాదాపు నాలుగు అడుగుల మేర పాము ఉందని చెప్పారు. పామును చూడటానికి ఉద్ధవ్ థాక్రే ఇంటి బయటకు వచ్చారు. పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ బృందాలు.. దానిని సమీప అడవిలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
వీధి కుక్కల్లో వ్యాధి కారక మొండి శిలీంద్రం.. మందులకు కూడా లొంగదు..
ఢిల్లీ: ఢిల్లీలో వీధి కుక్కల్లో అరుదైన వ్యాధి కారక మొండి శిలీంద్రాన్ని గుర్తించారు. మందులకు కూడా లొంగని కాండిడా అరిస్గా పిలిచే ఈ వ్యాధి కారకానికి వీధి కుక్కలు ఆవాసంగా ఉంటాయి. ఈ మేరకు ఢిల్లీ యూనివర్శిటీ, కెనడాకు చెందిన ఎంసీ మాస్టర్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా జరిపిన పరిశోధనలో తెలింది. ఈ శిలీంద్రంతో ఆస్పత్రుల్లో భారీగా వ్యాధి భారిన పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ నిర్దారించిన దృష్టిసారించాల్సిన ఫంగస్‌లలో ఒకటి ఇది కావడం గమనార్హం. చర్మవ్యాధి సోకిన కుక్కల చెవులు, చర్మం నుంచి షాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు హానికారక కాండిడా అరిస్ను గుర్తించినట్లు చెప్పారు. దీనికి పోలిన వేరియంట్లను కుక్కలు, మానవుల్లోనూ ఉన్నట్లు తెల్చిన శాస్త్రవేత్తలు.. దీని కారణంగా మనుషులు, జంతువుల్లో వీటి భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 'కుక్కలు పెంపుడు జంతువులు. కాండిడా అరిస్ కేవలం వీధి కుక్కల్లో మాత్రమే కనుగొన్నాం. ఇలాంటి కుక్కలు ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఉండొచ్చు. జంతువుల నుంచి మనుషులకు కాండిడా అరిస్ వ్యాప్తి చెందడానికి ఇవి కారకాలుగా మారుతున్నాయి.' అని యూనివర్శిటీకి చెందిన జర్నల్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదీ చదవండి: CM Siddaramaiah: సిద్దరామయ్యకు జలుబు, దగ్గు.. సీఎం కార్యక్రమాలన్నీ రద్దు -
మిలీనియల్స్ అబద్ధాల్లో మొనగాళ్లు.. ప్లే స్టార్ సర్వేలో ఆసక్తికర విషయాలు
న్యూయార్క్: అబద్ధాలు ఎవరు చెబుతారు? ఎందుకు చెబుతారు? అనే విషయాలపై జరిగిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మిగతా వారితో పోలిస్తే మిలీనియల్స్ ఎక్కువ అబద్ధాలు చెబుతారట..! అదేవిధంగా, మహిళల కంటే పురుషులే ఎక్కువగా అబద్ధాలు చెబుతారట! ఆఫీసులో అవమానాల నుంచి తప్పించుకునేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతా మంటూ ఎక్కువ మంది సమాధానమివ్వడం విశేషం. ఆన్లైన్ కేసినో ‘ప్లే స్టార్’జరిపిన ఓ సర్వేలో ఇవి వెల్లడయ్యాయి. అమెరికాలోని కొలరాడో, ఇలినాయీ, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టెన్నెస్సీ, విస్కాన్సిన్ రాష్ట్రాలకు చెందిన కొందరిపై ప్లేస్టార్ సర్వే చేపట్టింది. వీరిలో సగం మహిళలు కాగా, మిగతా సగం పురుషులు. పలు వయస్సుల వారు వివిధ సందర్భాల్లో ఎలా అబద్ధాలు చెబుతారో నమోదు చేసింది. ఈ విషయంలో 1981–1996 సంవత్సరాల మధ్య పుట్టిన మిలీనియల్స్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ వయస్సు వారిలో 13 శాతం మంది రోజులో ఒక్కసారైనా అబద్ధం చెబుతామంటూ ఒప్పుకున్నారు. అదే బేబీ బూమర్స్..1946–1964 సంవత్సరాల మధ్య పుట్టిన వారిలో ఇది రెండు శాతమే ఉంది. ఈ విషయంలో 1997–2021ల మధ్య జన్మించిన జనరేషన్ జెడ్, 1965–1980 మధ్య పుట్టిన జనరేషన్ ఎక్స్ వారి ప్రవర్తన ఒకే విధంగా ఉండటం గమనార్హం. ఈ రెండు గ్రూపుల వారిలో కేవలం 5 శాతం మంది రోజూ కనీసం ఒక్కసారి అబద్ధమాడుతామని చెప్పారు. ఎందుకు అబద్ధం? సర్వేలో పాల్గొన్న మిలీనియల్స్‌లో మూడో వంతు మంది ఈ ఏడాదిలో రెజ్యుమెలో వివరాలను తారుమారు చేసినట్టుగా అంగీకరించారు. పని చేసే ప్రాంతంలో అవమానకర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతామంటూ మిలీనియల్స్‌లో ప్రతి అయిదుగురిలో ఇద్దరు అంగీకరించారు. ఇంకా సోషల్ మీడియాలో కూడా. ఎదుటి వారి దృష్టిలో పడేందుకు అబద్ధాలు చెబుతామంటూ మిలీనియల్స్‌లో 23 శాతం మంది, జెడ్ జనరేషన్లో 21 శాతం మంది అంగీకరించారని ప్లే స్టార్ సర్వేలో తేలింది. మిలీనియల్స్‌లో మెజారిటీ మంది దృష్టంతా డబ్బు, కీర్తి ప్రతిష్టల సంపాదనపైనే ఉంటుందని 2012లో పర్సనా లిటీ అండ్ సోషల్ సైకాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం కూడా చెప్పిందని ప్లే స్టార్ గుర్తు చేసింది. అయితే ఇందుకు విరుద్ధంగా, సర్వేలో పాల్గొన్న 79 శాతం మంది ఆన్లైన్లో ఎన్నడూ మోసం చేయలేదని చెప్పుకున్నారని సర్వే తెలిపింది. మిగతా జనరేషన్స్ వాళ్లు మాత్రం నిజాయతీయే ఉత్తమమని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఏడాది పూర్తి స్థాయిలో నిజాయతీగా ఉంటామంటూ జనరేషన్ ఎక్స్‌కు చెందిన ప్రతి 10 మందిలో 9 మంది, బేబీ బూమర్స్ జనరేషన్‌కు చెందిన ప్రతి అయిదు గురిలో నలుగురు సమాధానమిచ్చారు. పురుషులు అబద్ధాల్లో ముందు మహిళలతో పోలిస్తే సోషల్ మీడియాలో పురుషులు 10% ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారని సర్వే గుర్తించింది. రోజులో ఒక్క సారైనా అబద్ధం చెబుతామని మహిళల్లో 23 శాతం మంది ఒప్పుకోగా, అదే పురుషుల్లో ఇది 26 శాతంగా ఉండటం విశేషం. ఎదుటి వాళ్లు చెప్పేది అబద్ధమా కాదా అనే విషయాన్ని 97% మంది వరకు గుర్తించలేక పోతున్నారని కూడా సర్వే గుర్తించింది. అదేవిధంగా, చెప్పిన ప్రతి అబద్ధమూ హానికరం కాదన్న విషయం సర్వేలో వెల్లడైంది. అవమానకర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకంటూ 58 శాతం మంది, గోప్యతను కాపాడుకునేందుకు 42% మంది, ఇతరులకు ఇబ్బంది రాకూడదని 42% మంది అబద్ధమాడుతామని చెప్పడం విశేషం. ఇదీ చదవండి: వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్! -
బిల్డింగ్‌పై బ్యూటీషియన్ మృతదేహం.. రూమ్మెట్ క్షణికావేశంలో..!
దేశ రాజధానిలో దారుణం జరిగింది. దక్షిణ ఢిల్లీ, మజ్ను కా తిల్లాలోని ఓ భవనంపై మహిళ మృతదేహం పడి ఉండటం స్థానికంగా కలకలం సృష్టించింది. పార్టీలో జరిగిన గొడవలో బాధిత మహిళను తన రూమ్మెంట్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రాణి(35) గురుగ్రామ్‌లోని బ్యూటీ పార్లలో పనిచేస్తోంది. సాప్న(36) వెయిటర్ వృత్తి చేస్తోంది. వీరిరువురూ ఒకే గదిలో రెంట్‌కు ఉంటున్నారు. నిన్న జరిగిన ఓ పార్టీలో మద్యం మత్తులో ఉన్న సాప్న.. తన తండ్రిని దుర్భాషలాడింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అదే గొడవ మరుసటి రోజు ఉదయం 4గంటలకు మళ్లీ మొదలైంది. విచక్షణ కోల్పోయిన సాప్న రూమ్‌లో ఉన్న కత్తితో రాణిపై దాడి చేసింది. రాణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రాణి మృతదేహం భవనం టెర్రస్ పైన పడి ఉందని పోలీసులు తెలిపారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న సాప్నకు ఓ కుమార్తె కూడా ఉన్నట్లు వెల్లడించారు. సాప్న నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. చదవండి:రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో..కేసుపై పోలీసుల తంట..! -
HYD: మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్యాడ్తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎక్కడో హత్య చేసి, ఇక్కడ తల తెచ్చి పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమీర్‌పేటలో దారుణం.. భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య -
కర్ణాటక ఎన్నికలో ధన ప్రవాహం
-
రష్మిక లైవ్.. మధ్యలో విజయ్ వాయిస్
-
సికింద్రాబాద్‌లో కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం
-
గుంటూరు పల్నాడు ఎక్స్ ప్రెస్ లో బ్యాగ్ లో పసికందు కలకలం
-
తిరుపతిలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యం
-
డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. అసలు ఏం జరిగింది?
బి.కోడూరు/ సిద్దవటం(వైఎస్సార్ జిల్లా): మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థిని శవమై తేలింది. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బద్వేలు నియోజకవర్గం బి.కోడూరు మండలంలోని మరాటిపల్లె గ్రామానికి చెందిన అల్లంపాటి అనూష (20) బద్వేలులోని శ్రీ చైతన్య కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండేది. ఈమె మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు బి.కోడూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. బి.కోడూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలంలోని జంగాపల్లె గ్రామం పెన్నా నది ఒడ్డున ఆదివారం మృతదేహం లభ్యమైంది. చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం మృతి చెందడానికి గల కారణాలపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో పెన్నా నదిలోనే పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబీకులకు అప్పజెప్పారు. బి.కోడూరు మండలం మరాటిపల్లె గ్రామానికి చెందిన అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకుమార్తె అనూష. కుటుంబానికి ఆసరాగా ఉంటుందని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని.. కూలీ పనులు చేస్తూ చదివించే వారు. తిరిగి వస్తుందని రేయింబవళ్లు పోలీసుస్టేషన్ల వద్ద పరిసరాల ప్రాంతాల్లో ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. దీంతో వారు గుండెలవిసేలా రోదించారు. బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. మృతిరాలి తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
Hyderabad: ఆమె కోసం.. ఎలక్ట్రిక్ మొబైల్ టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మహిళల సదుపాయార్థం ఇప్పటికే షీ టాయ్లెట్లు, మొబైల్ టాయ్లెట్లు వంటివి అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల మొబైల్ టాయ్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ మెట్రో నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మహిళల రక్షణ, భద్రతలకు సంబంధించిన సదుపాయాలు, ఏర్పాట్ల కోసం ‘నిర్భయ’ ఫండ్స్ నుంచి నిధులు అందజేస్తోంది. అలా అందిన నిధులతో మహిళల మొబైల్ టాయ్లెట్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు సమకూర్చుకున్న పోలీసు శాఖ.. వాటి నిర్వహణను జీహెచ్ఎంసీకి అప్పగించింది. గ్రేటర్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఆరు జీహెచ్ఎంసీ జోన్లలో వీటిని ఉంచారు. సికింద్రాబాద్ జోన్లో 3 వాహనాలు, ఎబీనగర్‌లో జోన్లో 3, ఖైరతాబాద్‌జోన్‌లో 2, చారి్మనార్ జోన్లో 2, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో ఒక్కొక్కటి చొప్పున ఈ ఎలక్ట్రిక్ మొబైల్ బస్సులను ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్, ధర్నాచౌక్, చార్మినార్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ప్రగతిభవన్, అసెంబ్లీ, గచ్చిబౌలి జంక్షన్, రాజేంద్రనగర్, బాలానగర్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో మహిళల రద్దీని బట్టి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని వాహనాల్లో చంటిపిల్లలకు పాలిచ్చేందుకు గదితోపాటు శానిటరీ నాప్కిన్స్ వంటివి ఉంటాయని పేర్కొన్నారు. షీ గెస్ట్‌హౌస్.. సేఫ్‌సిటీ ద్వారా అందే నిధులతో నగరంలో మహిళా యాత్రికుల సౌకర్యార్థం గెస్ట్‌హౌస్‌ను కూడా నిర్మించనున్నారు. నాంపల్లి సరాయి వద్ద 1900 చదరపుగజాల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయంతోపాటు అయిదంతస్తులతో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ పాలకమండలి ఇదివరకే ఆమోదం తెలిపింది. మొత్తం 187 బెడ్స్ కలిగి ఉండే గెస్ట్‌హౌస్‌లో సింగిల్ బెడ్స్, షేరింగ్ బెడ్స్ ఉంటాయి. గెస్ట్‌హౌస్‌లో ఏసీతోపాటు వైఫై, లాకర్లు, లిఫ్టులు, ఇంటర్నెట్ కియోస్క్‌లు, ఎమర్జెన్సీ క్లినిక్ తదితర సదుపాయాలుంటాయి. అంచనా వ్యయం రూ.11 కోట్లు. (చదవండి: ‘ఫార్మా’లిటీస్ దందా! ) -
సౌదీలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశానికి చేరుతున్న తరుణంలో దుబాయ్‌కు జాక్ పాట్ తగిలింది. సౌదీ అరేబియా పశ్చిమ భాగంలోని మదీనాలో భారీ ఎత్తున బంగారం, రాగి ధాతువు నిక్షేపాలను గుర్తించినట్టు సౌదీ ఆరేబియా ప్రకటించింది. సౌదీ జియోలాజికల్ సర్వే మదీనా ప్రాంతంలోని అబా అల్-రాహా సరిహద్దుల్లో బంగారు ఖనిజాన్ని కనుగొన్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మదీనాలోని వాడి అల్-ఫరా ప్రాంతంలోని అల్-మాదిక్ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాలలో రాగి ఖనిజాన్ని కనుగొన్నట్లు వారు తెలిపారు. కొత్త మైనింగ్ ప్రాంతాల వల్ల సుమారు 533 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఆకర్షించవచ్చు అని, దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా సౌదీ అరేబియాలో దాదాపు 5,300 మినరల్ లొకేషన్లు ఉన్నాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ బిన్ లాబోన్ గత జనవరిలో తెలిపారు, వీటిలో విభిన్నమైన మెటల్ ,నాన్-మెటల్ శిలలు, నిర్మాణ వస్తువులు, అలంకరణ శిలలు , రత్నాలు ఉన్నాయన్నారు.తాజా ఆవిష్కరణలతో, ప్రపంచ దేశాలనుంచి ఆశాజనకమైన పెట్టుబడి అవకాశాలు రానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.. కాగా సౌదీ అరేబియాలో భూగర్భ బంగారం నిల్వలు 323.7 టన్నులుగా అంచనా. వార్షిక రాగి, జింక్ ఫాస్ఫేట్ల ఉత్పత్తి 68,000 టన్నులు, 24.6 మిలియన్ టన్నులుగా ఉంటుంది అక్కడి ప్రభుత్వ అంచనా. -
కిడ్నాప్ అయిన బాలుడు ఆచూకీ లభ్యం
-
ఫేస్బుక్ పరిచయం.. ఇంట్లో పెళ్లి సంబంధాలు.. యువతి మిస్సింగ్
సూళ్లూరుపేట(నెల్లూరు జిల్లా): ఆ యువతి ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు సూళ్లూరుపేటకు వచ్చింది. కుమార్తె కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే స్పందించి ఆమెను కనిపెట్టి కుటుంబసభ్యులకు అప్పగించారు. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సర్కిల్ పరిధిలోని పెదవేగికి చెందిన యువతికి (18)కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. చదవండి: మాట్లాడుకుందామని భార్యను హోటల్ గదికి పిలిచి.. గడిచిన సంవత్సర కాలంగా ఫేస్బుక్లో పరిచయమైన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకం గ్రామానికి చెందిన వేములసాయి కోసం సోమవారం ఉదయం తన ఊరి నుంచి బయలుదేరి సాయంత్రానికి సూళ్లూరుపేటకు చేరుకుంది. ఉద్యోగం ఇప్పించాలని అతడిని కోరింది. ఉద్యోగం తీసిచ్చేవరకు తడ మండలం కొండూరులోని ఓ హాస్టల్లో ఉండమని సాయి యువతిని వదిలిపెట్టి వెళ్లాడు. సోమవారం సాయంత్రం తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసి సూళ్లూరుపేట పరిసర ప్రాంతంలో ఉన్నట్టుగా కనుక్కున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావుకు ఈ విషయంపై సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డిని అప్రమత్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఎస్సై రవిబాబు, నైట్ బీట్‌లో ఉన్న సిబ్బంది జార్జి, ప్రదీప్, కిరణ్ సమయస్ఫూర్తితో యువతి ఫోన్ ఆధారంగా లోకేషన్ గుర్తించి హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ వార్డెన్‌ను విచారించారు. పెదవేగి పోలీసులు అందించిన ఆధారాలతో యువతిని గుర్తించి నిర్ధారించుకుని మహిళా కానిస్టేబుల్ పర్యవేక్షణలో ఆమెను తీసుకొచ్చారు. ఆ యువతి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించారు. మంగళవారం బాధిత యువతి తల్లిదండ్రులు, పెదవేగి పోలీసులు సమక్షంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్ వారికి అప్పగించారు. యువతి ఆచూకీ కనుగొనడంలో ప్రతిభ చూపించిన ఎస్సై రవిబాబుకు, ఇతర సిబ్బందికి ఎస్పీ ఆదేశాల మేరకు రివార్డులు ప్రకటించగా వాటిని డీఎస్పీ అందజేశారు. -
కలకలం రేపిన మహిళ అస్థిపంజరం.. 50 రోజులుగా చెట్టుకు వేలాడుతూ..
నగరి(చిత్తూరు జిల్లా): డీవీఆర్‌కండ్రిగ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ మహిళ పుర్రె కనిపించడం ఆదివారం కలకలం రేపింది. ఎక్కువ రోజులు కావడంతో మహిళ ఎవరో గుర్తు తెలియని విధంగా ఉంది. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని జంతువులు లాక్కెళ్లి పీక్కుతిన్నట్లు పలు ప్రాంతాల్లో ఎముకలున్న ఆనవాళ్లు కనిపించింది. సీఐ మద్దయ్య ఆచారి తెలిపిన వివరాల మేరకు.. మేకల కాపరులు ఆదివారం సాయంత్రం మేకలు మేపుతూ అటవీ ప్రాంతంలో చెట్టుకు తల వేలాడుతూ ఉండటాన్ని గమనించి భయపడి పరుగులు తీశారు. చదవండి: తల్లి మరణించిందని తెలియక.. రోజూ స్కూల్‌కు వెళ్లొచ్చిన బాలుడు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు చీరకు వేలాడుతున్న పుర్రె, సమీపంగా పడివున్న పచ్చ, నీలి రంగు కలిసిన చీర, డార్క్ గ్రీన్ కలర్ జాకెట్, పూసల దండ, ఎముకలను గమనించారు. వాటిని శవపరీక్షకు పంపారు. మృతి చెంది 50 నుంచి 60 రోజులు అయ్యుంటుందని వైద్యులు తేల్చారు. వయసు నిర్ధారించలేకపోతున్నారు. మహిళ ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా చంపి వేలాడదీశారా అనే కోణాల్లో విచారిస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో గ్రామస్తులు ఎక్కువగా ఆ వైపు వెళ్లకపోవడం వల్ల 50 రోజుల వరకు విషయం బయటపడలేదు. విచారణ కొనసాగుతోంది. -
కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు.. ఐదేళ్ల తర్వాత ఆధార్ అలా కలిపింది!
పాలకొండ రూరల్(శ్రీకాకుళం): పదిహేనేళ్ల వయసు.. తెలిసీతెలియని తనం.. అమ్మానాన్న హాస్టల్లో చేర్పిస్తున్నారన్న కోపం.. ఆ కుర్రాడిని ఇంటి నుంచి పారిపోయేలా చేసింది. ఏళ్లకు ఏళ్లు గడిచినా కుమారుడి ఆచూకీ తల్లిదండ్రులకు తెలియలేదు. అమ్మతో మాట్లాడాలని ఆ బిడ్డకూ అనిపించలేదు. ఐదేళ్ల పాటు సాగిన ఈ ఎడబాటుకు ఆధార్ కార్డు ముగింపు పలికింది. తల్లీబిడ్డల మధ్య ఏర్పడిన దూరాన్ని దూరం చేసి వారిని కలిపింది. వివరాల్లోకి వెళితే.. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన బైపోతు తవిటినాయుడు, రాజేశ్వరి దంపతుల ఏకైక కుమారుడు హరి ప్రకాష్‌ను 2016లో హాస్టల్లో చేర్పించారు. అయితే హరికి అక్కడ చదవడం ఇష్టం లేదు. తల్లిదండ్రులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ పెట్రోల్ బంకులో పనికి కుదిరాడు. ఇన్నేళ్లలో కనీసం ఇంటికి ఫోన్ కూడా చేయలేదు. కాలం అలా గడిచిపోయింది. తల్లిదండ్రులు మాత్రం ఒక్కగానొక్క కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉన్నా రు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల హరికి ఆ బంకులో క్యాషియర్‌గా పదోన్నతి రావడంతో వ్యక్తిగత సెల్‌ఫోన్ కోసం యత్నించాడు. ఈ క్రమంలో సిమ్‌కార్డు కొనుగోలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్‌కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నూతన ఆధార్‌కార్డు తన పాత ఆధార్‌కార్డుకు అనుసంధానం చేసి ఉండడంతో స్వగ్రామమైన పెద్ద లక్ష్మీపురంలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి కొత్త కార్డు వచ్చింది. ఊహించని విధంగా కుమారుడి పేరిట ఆధార్ కార్డు ఇంటికి రావడంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఎస్ఐ వి.సందీప్‌కుమార్‌ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పాతపట్నం సీఐ ఎం.వినోద్‌బాబుకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ ఆధార్‌కార్డులో ఉన్న వివరాల మేరకు దర్యాప్తు ప్రారంభించారు. తప్పిపోయిన హరిప్రకాష్ హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. తమ బృందాలను పంపించి ఆయనను స్వగ్రామం తీసుకువచ్చారు. శుక్రవా రం పాలకొండ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ద్వారా డీఎస్పీ ఎం.శ్రావణి సమక్షంలో హరిప్రకాష్‌ను తల్లితండ్రులకు అప్పగించారు. ఐదేళ్ల తర్వాత కొడుకును చూసిన తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యాడు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నామని, ఏకైక కుమారుడు వదిలి వెళ్లిపోవడంతో ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నామని వారు తెలిపారు. కొడుకును అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మిస్సింగ్ కేసును ఛేదించడంలో చొరవ చూపిన సీఐ, ఎస్ఐలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: ప్రేమ పేరుతో తపస్విని వంచించిన డాక్టర్.. ఆపై.. -
ఇలా పొదల్లోకి వచ్చిపడ్డాను ఏమిటమ్మా..?
రిమ్మనపూడి (పామర్రు): ‘వెచ్చని నీ పొత్తిళ్లలో ఉండాల్సిన నేను ఇలా పొదల్లోకి వచ్చిపడ్డాను ఏమిటమ్మా.. చలి గాలులకు నా చిట్టి ప్రాణం తట్టుకోలేక పోతోందమ్మా.. వీధి కుక్కలు ఎక్కడ వచ్చి పీక్కు తింటాయోనని భయంగా ఉందమ్మా.. ఆకలేసి గుక్కపెట్టి ఏడుస్తున్నా నీకు వినిపించడం లేదా అమ్మా.. ఏడ్చీ ఏడ్చీ గొంతు తడారిపోతోందమ్మా.. పొదల్లో నన్ను ఎవరెవరో వచ్చి చూస్తున్నారు కానీ నీవు రావడంలేదు ఏమిటమ్మా..’ అన్నట్టుంది ఆ పసిగుడ్డు పరిస్థితి. పామర్రు మండలం రిమ్మనపూడి శివారు అంకామ్మగుంట గ్రామం శివారులో చెట్ల పొదల నుంచి చంటిపాప ఏడుపు విన్న స్థానికులు ఆడ శిశువును గుర్తించారు. వెంటనే పామర్రు ఎస్ఐ పండుదొరకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి రోజుల వయస్సు శిశువుగా గుర్తించి ఐసీడీఎస్ అధికారుల ద్వారా మచిలీపట్నంలోని శిశు సంరక్షణ కేంద్రానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ముళ్ల పొదల్లో, గండు చీమల మధ్య.. చిన్నారి విలవిల
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): అర్ధరాత్రి నుంచి చిన్నారి ఏడుపు సమీపంలోని వారికి వినిపిస్తూనే ఉంది.. ఎవరో ఇంట్లో పసిబిడ్డ ఏడుస్తుందిలే అనుకున్నారు. కానీ చిన్నారి ఏడుపు తెల్లవారు జాము కూడా వినిపించడంతో పలువురు లేచి చుట్టుపక్కల వెతికి ముళ్లపొదల్లో గండుచీమల మధ్య ఉన్న పాపను గుర్తించి సపర్యలు చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ కొత్తపేట ఆంజనేయవాగు కొండపై భాగంలోని బ్రహ్మంగారి మఠం వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ చిన్నారి ఘటన కలకలం రేపింది. అప్పుడే పుట్టిన బిడ్డను ఎవరో అక్కడ పడేసినట్టు భావిస్తున్నారు. వెంటనే చిన్నారిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. అనంతరం స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమికులపై దాడి ఘటన హేయం: గౌతం సవాంగ్ -
జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో తాజాగా మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు తెలిసింది. పొలం పనులకు వెళ్లిన ఓ కూలీకి దొరికిన ఒక వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన వజ్రాల వ్యాపారి రూ.70 వేలకు కొనుగోలు చేయగా, ఇంకో వ్యక్తికి దొరికిన మరో వజ్రాన్ని మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారి రూ.40 వేలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గురువారం ఇదే గ్రామంలోని ఓ రైతుకు పొలంలో రూ.1.2 కోట్ల విలువైన వజ్రం దొరికినట్లు వార్తలు వెలువడ్డాయి. రెండ్రోజుల వ్యవధిలో మూడు వజ్రాలు లభ్యమవడంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొలాల్లో వాలి పోతున్నారు. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్నా పెద్దా 50 దాకా వజ్రాలు లభ్యమవుతుంటాయి. దొరికేది ఇక్కడే.. తుగ్గలి మండలంలోని జొన్నగిరి, చిన్న జొన్నగిరి, రామాపురం, జి.ఎర్రగుడి, గిరిజన తండాలు, పగిడిరాయి, బొల్లవానిపల్లి, ఉప్పర్లపల్లి, పి.కొత్తూరు, చెన్నంపల్లి, గిరిగెట్ల, తుగ్గలి, ఉసేనాపురం, రాంపల్లి, రామలింగాయపల్లితో పాటు మద్దికెర మండలంలో పెరవలి, బసినేపల్లి ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. ఇదీ చరిత్ర.. రాయల కాలంలో ఇక్కడ రత్నాలు, వజ్రాలను రాశులుగా పోసి అమ్మే వారని నానుడి. జొన్నగిరిని స్వర్ణగిరి అని పిలిచే వారని చెబుతారు. అశోకుడు జొన్నగిరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండలో పెద్ద బండరాళ్లపై శాసనాలను చెక్కించారు. ఏటా వజ్రాలు లభ్యం.. ప్రతి ఏటా తొలకరి వానలు కురవగానే ఈ ప్రాంతంలో వజ్రాన్వేషణ కొనసాగుతుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జనం ఇక్కడి వచ్చి వజ్రాన్వేషణ చేస్తుంటారు. కొందరు రెండు మూడు నెలల పాటు ఇక్కడే ఉంటూ వెతుకుతారు. పొలం పనులు చేసే సమయంలోనూ కూలీలు, రైతులకు వజ్రాలు దొరుకుతుంటాయి. తెలుపు, ఎరుపు, తేనె వర్ణం వంటి రంగులలో వజ్రాలు లభిస్తుంటాయి. రూ.2వేల నుంచి లక్షల విలువ చేసే వజ్రాలు ఏటా దాదాపు 20 నుంచి 50కి పైగా దొరుకుతుంటాయి. ఆధారాలు ఉండవని అధికారులు పట్టించుకోరు.. వజ్రం దొరికినట్లు ఎలాంటి ఆధారాలు దొరకక పోవడంతో అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. వజ్రం దొరికినట్లు తెలుస్తుందే తప్ప అమ్మకం తర్వాత దొరకలేదని, వజ్రం కాదన్నారని చెబుతుండడంతో అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. వజ్రం దొరికితే పోలీసులు, రెవెన్యూ అధికారులకు వ్యాపారుల నుంచి కమీషన్ అందుతుందనే ఆరోపణలు ఉన్నాయి. గుట్టుగా విక్రయం.. దొరికిన వజ్రాలను కొందరు గుట్టుగా అమ్ముకుంటారు. మరికొందరు ధర నచ్చక పోతే టెండరు పద్ధతిలో అమ్ముతారు. తుగ్గలి మండల జొన్నగిరి, మద్దికెర మండలం పెరవలి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారులు వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు. వీరు సీజన్లో వజ్రాల సమాచారం తెలుసుకునేందుకు కొందరిని నియమించుకొని వారిని అన్ని విధాలా చూసుకుంటారు. వజ్రాలను కొనుగోలు చేసిన వ్యాపారులు ముంబయి, చెన్నై, బెంగళూరు తదితర రాష్ట్రాల్లో అమ్ముతారు. క్యారెట్ల రూపంలో లెక్కించి వజ్రాలను కొనుగోలు చేస్తారు. ఒక్కోసారి వ్యాపారులు కుమ్మక్కై వజ్రాలను తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. దాని విలువ ఎవరికీ తెలియక పోవడంతో ఒక్కోసారి వజ్రం దొరికిన వారు మోస పోతుంటారు. చదవండి: ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! రహదారుల అభివృద్ధికి రూ.6,421 కోట్లు -
అమ్మా నన్ను ఎందు‘కని’ పడేశారు..?
‘‘అమ్మా నన్ను ఎందుకని పడేశారు..? ఆడపిల్లగా పుట్టినందుకా.? లేక ఆర్థికంగా భారమవుతున్నందుకా.? నీ ఒడిలో ఉండాల్సిన నేను.. ఇలా అరటితోటలో పడిఉన్నానే.. నా ఈ దుస్థితికి కారణం ఎవరమ్మా..? ఏంటమ్మా?’’అని ప్రశ్నించలేని పసి మనసు తనది. రైల్వేకోడూరు రూరల్: అరటి తోటలో పడిఉన్న పసికందును ఐసీడీఎస్ అధికారులు అక్కున చేర్చుకున్నారు. ఈ సంఘటన రైల్వేకోడూరు మండలంలోని వీవీ కండ్రిక దళితవాడ సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, ఐసీడీస్ సీడీపీఓ రాజమ్మ వివరాల మేరకు.. వీవీ కండ్రిక దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుజామున అరటి తోటలో చిన్నారి ఏడుపులు వినిపించాయి. దీంతో కౌలు రైతు చంద్ర పరుగున వెళ్లి చూడగా పసికందు కనిపించింది. చంద్ర స్థానిక అంగన్వాడీ వర్కరు లక్ష్మీదేవికి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఆ బిడ్డను తీసుకెళ్లి రైల్వేకోడూరు పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ పెద్ద ఓబన్నకు విషయం తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డగా ఉందని, ఆడబిడ్డ కావడంతో ఎవరైనా పడేసి ఉంటారా? మరేమైనా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తామన్నారు. శిశువును కడప రిమ్స్‌కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించి, ఐసీడీఎస్ తరుఫున శిశు గృహలో చేర్పిస్తామని ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు.. -
ఏమైందో తెలియదు కానీ.. పాపం పసిపాప..
కావలి రూరల్: ఆడ పిల్ల భారమైందా? అనైతిక సుఖం పాపానికి రూపమై అడ్డంగా మారిందా? ఏమైందో తెలియదు కానీ.. ముక్కు పచ్చలారని మూడు నెలల పసిబిడ్డ నిర్జీవమై చెరువు నీటిలో తేలియాడింది. ఈ ఘటన మండలంలోని ఆముదాలదిన్నె సమీపంలో తాళ్లపాళెం చెరువులో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది. కావలి రూరల్ పోలీసుల సమాచారం మేరకు.. తాళ్లపాళెం చెరువు నీటిలో గుర్తుతెలియని చిన్నారి మృతదేహం ఉన్నట్లు ఆముదాలదిన్నె వీఆర్ఓ సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. 3 నెలల చిన్నారి పాపగా గురించారు. చిన్నారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరీ చిట్టి తల్లి ?
కర్నూలు (రాజ్‌విహార్): కర్నూలు జిల్లాలో లభించిన చిన్నారిని గుర్తించి తీసుకెళ్లాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కర్నూలు ఇన్చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.లీలావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాదిన్నర సహస్ర అనే చిన్నారి ప్రస్తుతం పెద్దపాడు సమీపంలోని శిశుగృహలో ఉందని, తల్లిదండ్రులు లేదా బంధువులు 30 రోజుల్లోపు గుర్తించి తగిన ఆధారాలు చూపి తీసుకెళ్లాలన్నారు. లేనిపక్షంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఆనాథగా ధ్రువీకరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దత్తత ఇస్తామన్నారు. వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. చదవండి: దుబ్బాక.. ఇక్కడ చెప్పబాక! మగువా.. బతుకు భద్రత తగదా? -
అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ
సాక్షి, ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం 'ఆంటిలియా'దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వాహనం లోపల ఒక బ్యాగును, ఒక లేఖను కనుగొన్నారు. కానీ దానిలోని విషయాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ‘ముఖేశ్ భయ్యా, నీతా భాబీ ఇదొక ట్రైలర్ మాత్రమే’’ అని లేఖలో రాసినట్టు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తరువాత గురువారం రాత్రి 1 గంటకు ఆంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా రెండు వాహనాలను ఆపి ఉంచినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆగంతకులు స్కార్పియో, ఇన్నోవా రెండు వాహనాల్లో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. స్కార్పియో డ్రైవర్ అంబానీ ఇంటి సమీపంలో వాహనాన్ని ఆపి, మరో కారులో అక్కడినుంచి ఉడాయించాడు. ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఈ వాహనంలో జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంబానీ ఇంటి వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. సీసీటీవీఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
ఉప్పొంగిన పేగుబంధం
సాక్షి, పటాన్చెరు టౌన్: ఏడాది కిందట తప్పిపోయిన ఓ బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కిషన్‌దాస్, పూజ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ మాదాపూర్‌కు వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 2019లో వినాయక చవితి రోజున బాలుడు రాజ్‌కుమార్ దాస్ తప్పిపోయాడు. ఏడుస్తూ కూర్చొన్న ఆ బాలుడిని గమనించిన పాతబట్టలు అమ్ముతున్న హరణ్.. తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. పటాన్చెరు పట్టణంలోని సాయిరాంనగర్ కాలనీలో ఉండే హరణ్ మామ యాకోబ్‌కు పిల్లలు లేని కారణంగా వారికి అప్పజెప్పాడు. ఆ బాలుడికి కిరణ్ అని పేరు పెట్టి పోషిస్తున్నారు. అయితే.. స్థానికుల ఫిర్యాదు మేరకు.. జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరణ్, యాకోబ్, సరోజపై పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని సంగారెడ్డి శిశువిహార్‌కు పంపించారు. దర్యాఫ్తులో భాగంగా బాలుడి తల్లిదండ్రులది పశ్చిమ బెంగాల్ అని గుర్తించిన పోలీసులు.. తండ్రి కిషన్‌దాస్, తల్లి పూజకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి సదరు బాలుడు వారి కొడుకే అని నిర్ధారించారు. సోమవారం సంగారెడ్డిలోని బాలరక్ష భవన్ వద్ద తల్లికి అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు, బాలల సంక్షేమ సమితి అధ్యక్షురాలు శివకుమారికి, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం
సాక్షి, బెంగళూరు: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్నవిమానాశ్రయ పోలీసులు, ఉన్నతా ధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీసులకు చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీఎస్) ఆ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. దీంతో ఆ బ్యాగ్‌ను థ్రెట్ కంటైన్మెంట్ వెహికల్లో ఉంచి, కిలోమీటరు దూరంలో కెంజార్‌లోని బహిరంగ స్థలానికి తీసుకెళ్లి పరిశీలిస్తున్నారు. బ్యాగ్‌లో మెటల్ కాయిన్ బాక్స్ ఉందని, అందులో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు ఉంచారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులను మోహిరింపచేసిన అధికారులు ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు నిందితుడి ఫోటోలను విడుదల చేశారు.అలాగే నిందితుడు వెళ్లిన ఆటోరిక్షాను ఫోటోను కూడా రిలీజ్ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) డిఐజి అనిల్ పాండే అందించిన సమాచారం ప్రకారం నిందితుడు బ్యాగ్‌ను మంగళూరు విమానాశ్రయంలో ఉంచి, ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో అక్కడినుంచి ఉడాయించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే బాంబును నిర్వీర్యం చేసేందుకు సంబంధిత సిబ్బంది పనిచేస్తున్నారని పాండే చెప్పారు. అలాగే అన్ని విమాన సర్వీసులు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని విమానాశ్రయ డైరెక్టర్ వి.వి. రావు ఒక ప్రకటనలో తెలిపారు. Karnataka: Mangaluru Police releases photographs of suspect and the autorickshaw he was seen leaving in, in the CCTV footage. A suspicious bag was found at Mangaluru Airport today. https://t.co/9X3seeADZC pic.twitter.com/NKeak3rwnz — ANI (@ANI) January 20, 2020 -
చలానాతో.. పోయిన బైక్ తిరిగొచ్చింది!
సాక్షి, ఆదోని: జరిమానా అంటే సహజంగా బాధ కలిగించే విషయమే. అయితే కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన పురుషోత్తంకి మాత్రం జరిమానా ఖుషీ కలిగించింది. అదెలాగంటే... పట్టణానికి చెందిన పురుషోత్తం 2018 మార్చిలో ఎస్కేడీ కాలనీలోని తన గది ముందు హీరో స్ప్లెండర్ బైక్ నిలిపి ఉంచాడు. కొద్దిసేపటికే అది అపహరణకు గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది గడిచినా బైక్ ఆచూకీ దొరకలేదు. ఇక దొరకదేమోనని ఆశ వదులుకున్నాడు. అయితే మూడు రోజుల క్రితం తన సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేస్తూ పట్టుబడినందున, నిర్ణీత కాల వ్యవధిలో రూ.1,235 జరిమానా చెల్లించాలని అందులో ఉంది. వెంటనే ఈ విషయం టూటౌన్ సీఐ అబ్దుల్ గౌస్ దృష్టికి తీసుకెళ్లాడు. సీఐ స్పందించి మెసేజ్ ఏ పోలీసు స్టేషన్ పరిధి నుంచి వచ్చిందో గుర్తించి.. కోసిగి పోలీసులను సంప్రదించారు. వారు బైక్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిని సీఐ వద్దకు పంపించారు. ఏడాది తరువాత తన బైక్ తిరిగి దక్కడంతో పురుషోత్తం సంతోషం వ్యక్తం చేశాడు. -
పొదల్లో పసిపాప
సాక్షి, చిత్తూరు(కొత్తకోట) : తల్లిపొత్తిళ్లలో ఉండాల్సిన ఆడశిశువు రోడ్డుపాలైంది. నవమాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లయినా తనివితీరా చూసుకుందో లేదో పుట్టిన క్షణాల్లోనే ముళ్లపొదలకు చేరింది. కన్నతల్లికి ఏ కష్టమొచ్చిందో, ఆ బిడ్డ ఎందుకు భారమైందో కాని ఈ సంఘటన మంగళవారం బి.కొత్తకోటలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. బి.కొత్తకోట పంజూరమ్మగుడివీధి, హడ్కోకాలనీ మధ్యలోని పొదల్లో తెల్లవారుజాము 3గంటల సమయంలో తల్లిరక్తం మరకలు ఆరకనే పుట్టిన ఆడబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి పొదల్లో వదిలి వెళ్లిపోయారు. ముళ్లకారణంగా గాయాలయ్యాయి. పసిబిడ్డ ఏడుపులు వినిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఉదయం అక్కడి బంకు దగ్గరకు సరుకుల కోసం ఫకృన్నీసా అనే మహిళ చెవికి ఏడుపులు వినపించడంతో అప్రమత్తమైంది. ఏడుపులు వస్తున్న చోటకు వెళ్లగా కళ్లు తెరవని ఆడశిశువును గుర్తించింది. ఈ విషయం తెలుసుకొన్న అంగన్వాడీ కార్యకర్త అనసూయ శిశువును స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించారు. సంఘటనా స్థలంచేరుకొన్న ఎస్ఐ సుమన్ స్థానికులను విచారించారు. అనంతరం ఆడశిశువును మదనపల్లెకు తీసుకెళ్లి ఐసీడీఎస్ సీడీపీఓ సుజాతకు అప్పగించారు. ఆమె శిశువును జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బుధవారం శిశువును చిత్తూరులోని శిశువిహార్‌కు తరలిస్తామని సుజాత చెప్పారు. -
మంగళగిరిలో తుపాకి కలకలం
సాక్షి, మంగళగిరి: రాజధాని ప్రాంతంలో కీలక పట్టణమైన మంగళగిరిలో తుపాకి కలకలం సృష్టించింది. తుపాకితో సంచరిస్తున్న వ్యక్తితో పాటు మారణాయుధాలు కలిగి ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను మంగళగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం పట్టణ సీఐ డి.నరేష్కుమార్ నిందితుల వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... మంగళగిరి పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, పట్టణ పరిధిలోని బాప్టిస్టుపేట ప్రాంత సమీపంలో గలాటా చేస్తున్నట్లు పోలీసులకు శుక్రవారం సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారు భయపడుతుండటంతో వారిని తనిఖీ చేశారు. వారి వద్ద మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురిలో ఇద్దరు యువకులైన ఆకురాతి వెంకట శివ రాఘవ అలియాస్ ఏవీఎస్, బండారు రవి రౌడీషీటర్లు. వీరిద్దరితో పాటు ఉన్న మరో యువకుడు ఇళ్లా రవి వద్ద మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లా రవి వద్ద ఒక తుపాకి, ఏవీఎస్, బండారు రవి వద్ద రెండు కత్తులు ఉన్నాయి. నిందితులను వెంటనే పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ముగ్గురు నిందితుల్లో ఇళ్లా రవిపై కూడా రౌడీషీటు తెరవనున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన వారిలో ఎస్సై నారాయణ, క్రైమ్ సిబ్బంది నాగాంజనేయులు, శివప్రసాద్, శాంతకుమార్ తదితరులు ఉన్నారు. -
షాహిద్ మృతదేహం లభ్యం
సాక్షి, కమలాపురం : కమలాపురం పట్టణం దర్గా వీధికి చెందిన షేక్ షాహిద్ (10) మృత దేహం లభ్యమయ్యింది. ఈ నెల 13వ తేదీన పట్టణ శివారులోని పెన్నా నదిలో నీట మునిగిన ఘటనలో ఒకరు మృతి చెందిగా మరో ముగ్గురు చిన్నారులు గల్లంతైన విషయం విధితమే. వారిలో షాహిద్ అనే బాలుని మృతదేహం గురువారం వల్లూరు మండలం చెరువుకిందిపల్లె సమీపంలో ఉన్న పెన్నా నదిలో లభ్యమైనట్లు ఎర్రగుంట్ల రూరల్ సీఐ కొండారెడ్డి తెలిపారు. కాగా అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ‘‘నిన్ను కళ్లారా చూసేందుకు కూడా వీలు లేకుండా పోయిందే చిన్నా అంటూ’’తల్లిదండ్రులు ఖాదరు, సాబిరీన్‌లు మృతదేహంపై పడి బోరున విలపించారు. బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మరో బాలుడు జాకీర్ మృతదేహం దొరకాల్సి ఉంది. మృతదేహం ఆచూకీ లభించక పోవడంతో జాకీర్ తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు సైతం ఆందోళన చెందుతున్నారు. డీఎస్పీ పరిశీలన గల్లంతైన చిన్నారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలను కడప డీఎస్పీ సూర్య నారాయణ పర్యవేక్షించారు. గురువారం వల్లూరు మండంలోని చెరువుకిందిపల్లె, ఆదినిమ్మాయపల్లె ప్రాంతాల్లో డీఎస్పీ పర్యటించారు. రిస్క్యూ టీంకు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాగా షాహిద్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించే వరకు డీఎస్పీ అక్కడే ఉన్నారు.నీటిపై తేలియాడుతున్న షాహిద్ మృతదేహం -
కలకలం రేపిన బాలిక కిడ్నాప్
సాక్షి, గుంతకల్లు : గుంతకల్లు పట్టణంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. అరగంటలోనే తిరిగి బాలిక ప్రత్యక్షం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలిక తల్లి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఆచారమ్మ కొట్టాల ఏరియాకు చెందిన ఆరోగ్యమేరీ, శాంతరాజ్ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె ఎం.అఖిలమేరీ సెయింట్ మేరీస్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతోంది. తల్లి స్కూల్ ఆవరణలో ఉన్న మదర్‌థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్‌లో ఆయాగానూ, తండ్రి రైల్వే హాస్పిటల్ క్యాంటీన్‌లోను పనిచేస్తున్నారు. రోజుమాదిరిగానే వారిద్దరూ మంగళవారం ఉదయాన్నే పనులకు వెళ్లిపోయారు. అఖిల మేరీ ఉదయం 8 గంటలకు స్కూల్ వెళ్లింది. హెల్మెట్, మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అఖిలమేరీని మధ్యలో కూర్చోపెట్టుకుని, నోటికి గుడ్డ అడ్డంగా పెట్టి పోర్టర్స్‌లైన్, ధర్మవరం గేట్, బీరప్పగుడి సర్కిల్ మీదుగా చిప్పగిరి బ్రిడ్జి వరకు తీసుకెళ్లారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చిప్పగిరి బ్రిడ్జి వద్ద వదిలిపెట్టి పరారయ్యారు. ఉపాధ్యాయుడు గుర్తించి.. బాలికను చేరదీసి బెల్డోనాలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహహ్మద్ రఫీ ఉదయం 8:30 గంటల సమయంలో ఆటోలో స్కూల్‌కు వెళ్తున్నాడు. ఒంటరిగా రోదిస్తున్న బాలిక అఖిలమేరీని గమనించాడు. ఆటో దిగి ఆ పాప ఆచూకీ, ఇతర వివరాలను ఆరాతీశారు. వెంటనే ఆ పాపను ఆటోలో ఎక్కించుకుని తనతో పాటు స్కూల్‌కు తీసుకెళ్లాడు. బాలిక మెడలోని స్కూల్ ఐడీ కార్డు ఆధారంగా బాలిక తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేశాడు. దీంతో స్కూల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు బాలికను అప్పగించి విషయాన్ని గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులకు తెలియజేశారు. పొంతన సమాధానాలు వన్‌టౌన్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి ఆ బాలికను వెంటపెట్టుకుని కిడ్నాపర్లు బైక్ మీద తిప్పిన పరిసరాలను పరిశీలించారు. అయితే ఆ బాలిక మొదట ఆలూరు పక్కనున్న తన అమ్మమ్మ గ్రామానికి వెళ్తున్నానని ఓసారి, కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారని మరోసారి పొంతన లేకుండా చెప్పడంతో కిడ్నాప్ జరిగిందా లేక తల్లిదండ్రులేమైనా మందలించి ఉంటే తనే అమ్మమ్మ దగ్గరకు వెళ్లడానికి ఈ విధంగా చెబుతోందా అనే కోణంలో విచారించారు. అయితే ఇప్పటివరకు బాలిక తల్లిదండ్రుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని, ప్రాథమికంగా తమకు అందిన సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలించామని సీఐ వెల్లడించారు. -
రెవెన్యూ అధికారుల లీలలు
సాక్షి, బెల్లంపల్లి: నియోజకవర్గంలో కాశీపేట మండల రెవెన్యూ అధికారుల లీలలతో స్థానికులు విస్మయ వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని మాయమైన రెవెన్యూ రికార్డులు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. రికార్డులు మాయం కావడంతో శనివారం రాత్రి 11 గంటలకు ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీపేట మండలంలో 22 గ్రామాలు ఉండగా.. రియల్ ఎస్టేట్‌తో భూముల ధరలు అమాంతం పెరిగాయి. అటు ఓసీపీ నిర్వాసిత గ్రామాలు కూడా ఉండటంతో పెద్దఎత్తున చేతివాటం ప్రదర్శించేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతకు ముందే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత వారం రోజులుగా పోలీసులు విచారిస్తునట్లు సమాచారం. శనివారం కూడా కాశీపేట మండల పరిధిలోని వీఆర్వోలను పోలీసులు విచారించారు. అయితే మాయమైన రికార్డులు అనూహ్యంగా ఆదివారం ప్రత్యక్షం అయ్యాయి. రికార్డులను ఇవాళ ఉదయం ఎమ్మార్వో కార్యాలయం వద్ద పడేసి వెళ్లినట్లు సమాచారం. ఉదయం అయిదు గంటలకే ఇద్దరు వీఆర్ఏలు అక్కడకు రావటంతో ...వాళ్లే ఆ రికార్డులు తెచ్చి అక్కడ పడేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్‌రూరల్ : కరీంనగర్ సమీపంలోని ఇరుకుల్ల వాగులో 29 ఏళ్ల క్రితం అదృశ్యమైన లారీ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. లారీతో పాటు ముగ్గురి అస్థిపంజరాలు దొరికాయి. ముప్పై ఏళ్ల క్రితం వరదల్లో కొట్టుకుపోయిన లారీ ఆనవాళ్లు ఇసుక తవ్వకాలతో లభించడంతో అధికారుల అనుమతితో లారీ యాజమాని కుటుంబసభ్యులు శనివారం శకలాలు వెలికితీశారు. వాగులో పది అడుగుల లోతులో తుప్పుపట్టిన లారీని వెలికితీయగా క్యాబిన్లో ముగ్గురి అస్థిపంజరాల అవశేషాలు బయటపడ్డాయి. కుటుంబసభ్యులు, అప్పటి ప్రత్యక్ష సాక్షులు, అధికారుల కథనం ప్రకారం.. 1989 జూలై 23న భారీ వర్షం వరదలతో ఇరుగుల్ల వాగు పొంగిపొర్లింది. ఇరుకుల్ల బ్రిడ్జిపై నుంచి వరద వెళ్లడంతో అప్పట్లో పెద్దపల్లి నుంచి కేశవపట్నంకు వయా కరీంనగర్ నుంచి పశువుల లోడ్‌తో వెళ్తున్న లారీ కొట్టుకోయింది. లారీలో మొత్తం పది మంది ఉండగా డ్రైవర్ అబ్దుల ఘనితో పాటు మరొకరు మృతి చెందినట్లు అప్పట్లోనే ప్రకటించారు. మల్లేశం, ఎల్లయ్య, సుదర్శనం, మొగిలి ప్రాణాలతో బయటపడగా మరో నలుగురి ఆచూకీ దొరకలేదు. గల్లంతయిన వారిలో శంకరపట్నంకు చెందిన లారీ యాజమాని ఎండి దౌలత్ ఖాన్, అతని సోదరుడు పశువుల వ్యాపారి ముక్తుంఖాన్, పశువుల కాపరి కటికె శంకర్, మరొకరు కల్లెపెల్లి వెంకటస్వామి ఉన్నారు. మరుసటి రోజే క్రేన్‌తో ప్రయత్నం చేయగా, కొంతభాగం మాత్రమే బయటకు వచ్చింది.1989 జూలైలో జరిగిన ఈ ఘటనపై క్రెమ్ నంబర్ 160/89గా కేసు నమోదు అయ్యింది. ఆ నలుగురి కోసం, లారీ కోసం కుటుంబసభ్యులు రోజుల తరబడి వెతికినా ఫలితం కనిపించలేదు. దీంతో అందరూ మరిచిపోయారు. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి.. ఇటీవల వాగులో ఇసుక తవ్వకాల చేపట్టగా లారీ ఆనవాళ్లు బయటపడ్డాయి. క్యాబిన్ ముందుగా బయటపడటంతో 1989 నాటి ఘటనను పేర్కొంటూ ‘సాక్షి’లో వెలువడిన కథనానికి కుటుంబసభ్యులు స్పందించారు. ‘సాక్షి’ పేపర్ క్లిప్పింగ్‌లతో గల్లంతయిన దౌలత్‌ఖాన్ కుమారుడు రియాజ్‌ఖాన్ రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అంతకు ముందు మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి నివేదించడంతో ఆయన రెవెన్యూ అధికారులకు సూచించారు. దీంతో తహసీల్దారు రాజ్‌కుమార్ పర్యవేక్షణలో ఇరుకుల్ల వాగులో శుక్రవారం, శనివారం జరిపిన తవ్వకాలలో లారీని వెలికితీశారు. దీంతో లారీ క్యాబిన్ లో చిక్కుకున్న మూడు ఆస్థిపంజరాల ఆనవాళ్లు, కపాలాలు (పుర్రెలు) బయటపడ్డాయి. రెండు ఆస్థిపంజరాలు ప్రాణాలు కోల్పోయిన దౌలత్ ఖాన్, అతని సోదరుడు ముక్తుంఖాన్ దుస్తులను బట్టి కుటుంబసభ్యులు గుర్తించారు. మరోటి వెంకటస్వామిది కానీ, శంకర్‌ది గానీ అయి ఉంటుందని చెప్తున్నారు. కాగా సుమారు 30 ఏళ్ళుగా వారికోసం నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులకు చివరికి అస్థికలు లభించడంతో బోరున విలపిస్తు ఇప్పటికైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి వాగంతా వెతికినా ఆచూకీ లభించలేదని, చివరకు తమకు డెత్ సర్టిఫికెట్ సైతం ఇవ్వకపోవడంతో లారీ ఇన్స్‌రెన్స్ రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎన్ఏ పరీక్షల తర్వాత వాటిని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. అప్పుడు నేను చిన్నదాన్ని మా నాన్న ఇరుకుల్ల వాగులో లారీ బోల్తాపడి చనిపోయినపుడు నేను చిన్నదాన్ని. నాతోపాటు చెల్లి,తమ్ముడున్నారు. అపుడు శవం కూడా దొరుకలేదు. ఏడాదికే అమ్మ కూడా చనిపోయింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత వాగులో లారీ బయటకు వచ్చిందని తెలిస్తే వచ్చాం. కొన్ని ఎముకలు దొరికితే వాటిలో మా నాన్నది ఉంటుందని అనుకున్నాం. అపుడు ఎట్లాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – సరిత, కటికె శంకర్ పెద్దకూతురు ప్రభుత్వం ఆదుకోవాలి మా నాన్న గొడ్ల వ్యాపారం చేస్తాడు. పెద్దపల్లి అంగడికిపోయి లారీలో తిరిగి వస్తుండగా ఇరుకుల్ల వాగులో కొట్టుకపోయింది. అప్పటి నుంచి మా నాన్న అచూకీ దొరుకలేదు. మా నాన్న లేకపోవడంతో అమ్మ ఎంతో కష్టపడింది. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం రాలేదు. మాది బాగా పేద కుటుంబం ప్రభుత్వం ఆదుకోవాలి. – గోపి, మృతుడు వెంకటస్వామి కొడుకు ‘సాక్షి’ కి రుణపడి ఉంటాం మా నాన్న దౌలత్‌ఖాన్ లారీ ఓనరు, పెద్ద నాన్న మగ్ధంఖాన్ గొడ్ల వ్యాపారం చేస్తాడు. అపుడు నేను చిన్న పిల్లగాన్ని. పదిరోజుల క్రితం సాక్షి పేపర్లో ఇరుకుల్లవాగులో 30 సంవత్సరాల కిందట పడిపోయిన లారీ ఇసుక తవ్వుతుండగా బయటకు వచ్చినట్లు వార్త రావడంతో మాకు తెలిసింది. సర్పంచును కలిస్తే పోలీసులను కలువమన్నారు. పోలీసులు మాతో కాదని కలెక్టర్‌ను కలువమని చెప్పితే రంజాన్ పండుగ కావడంతో కలువలేదు. మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి చెప్పగా రెవెన్యూ అధికారులకు చెప్పితే తహశీల్దార్‌ను కలిసి పర్మిషన్ తీసుకుని జేసీబీతో తవ్వకాలు చేపట్టాము. – రియాజ్‌ఖాన్, లారీయజమాని దౌలత్‌ఖాన్ కొడుకు -
7వ తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయనే ..
జవహర్‌నగర్: మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ తండ్రి కుమారున్ని చెరువులో పడేసి తనువు చాలించిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరి«ధిలోని చెన్నాపురంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సైదులు, స్ధానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనగాం జిల్లా, కుందారం గ్రామానికి చెందిన దారం సుధీర్(42), రజిని దంపతులు నగరానికి వలస వచ్చి జవహర్‌నగర్, శ్రీరాంనగర్‌కాలనీలో ఉంటూ బాలాజీనగర్‌లో మెడికల్‌షాప్ నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్(10), తేజ (12). పెద్దకుమారుడు తేజకు 7వ తరగతిలో తక్కువ మార్కులు రావడంతో గత కొన్ని రోజులుగా సుధీర్ బాధపడుతున్నాడు. అదేవిధంగా దీనికితోడు సుధీర్ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో తండ్రి మందలించాడు. ఈ క్రమంలోనే కుమారుడికి తక్కువ మార్కులు రావడంతో మనస్ధాపానికి గురైన సుధీర్ మూడు రోజుల క్రితం కుమారుడితో సహా ఇంటి నుంచి బైక్ తీసుకుని బయటికి వెళ్లాడు. అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన సుధీర్ సోదరుడు అనిల్‌కుమార్ ఫోన్‌ద్వారా అతను ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. రెండు రోజులుగా లేక్ పోలీసుల సహాయంతో గాలిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి సుధీర్ తన ఫోన్ నుంచి మరో 15 నిమిషాల్లో వస్తున్నట్లు మెసేజ్ చేశాడు. దీంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ చేసినట్లు సమాచారం అందింది. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున చెన్నాపురం చెరువులో రెండు మృతదేహాలను గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమీపంలో ఉన్న బైక్ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న వారు మృతదేహాలను సుధీర్, తేజలుగా గుర్తించారు. జవహర్‌నగర్‌లో విషాదచాయలు ... జవహర్‌నగర్‌లో మెడికల్‌షాపు నిర్వహిస్తూ అందరికీ పరిచయస్తుడైన సుధీర్ కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని కంటతడిపెట్టారు. -
34ఏళ్లకు బయటపడ్డ లారీ
సాక్షి, కరీంనగర్‌రూరల్ : మూడు దశాబ్దాల క్రితం.. భారీ వరదల కారణంగా ఇరుకుల్ల వాగులో గల్లంతైన లారీ ఆనవాళ్లు కనిపించాయి. ఇసుక తవ్వకాలతో లారీ విడిభాగాలు బయటపడ్డాయి. గల్లంతైన లారీ కనిపించడంతో చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు. 1984లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వారంపాటు కురిసిన భారీవర్షాలకు కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. పాత వంతెనపైనుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన లారీలో డ్రైవర్ సలీం, కటికె శంకర్ (పశువుల వ్యాపారి) వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా లారీ వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో లారీతోపాటు డ్రైవర్, పశువుల వ్యాపారి ఇద్దరూ గల్లంతరయ్యారు. అనంతరం రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగంగా ఇరుకుల్ల వాగుపై కొత్త వంతెన నిర్మించారు. దీంతో పాతవంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా ఇరుకుల్ల వాగునుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లద్వారా ఇసుక తరలిపోతోంది. పాత వంతెన సమీపంలో మూడురోజుల క్రితం ఇసుక తవ్వుతుండగా.. అప్పుడు గల్లంతయిన లారీ విడి భాగాలు బయటపడ్డాయి. లారీ క్యాబిన్ ఇనుప రేకులు కన్పిస్తున్నాయి. దాదాపు 34ఏళ్ల క్రితం వాగులో గల్లంతైన లారీ విడిభాగాలు ప్రస్తుతం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. లారీ కనిపిస్తోందనే సమాచారంతో దుర్శేడ్, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్ గ్రామస్తులు వచ్చి ఆసక్తిగా పరిశీలిస్తూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. -
బాలికను హత్య చేసి గోనే సంచిలో వేసి..
-
అదిగో చిరుత..!
రామయాయంపేట ప్రాంతంలో చిరుతలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి బారిన పడి ఇప్పటివరకు మండల పరిధిలోని పలు గ్రామాల్లో 30 వరకు దూడలతోపాటు మేకలు హతమయ్యాయి. మండల పరిధిలో దాదాపు ఏదోఒక చోట ప్రతిరోజూ చిరుత దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. రామాయంపేట(మెదక్): జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో 13 వరకు చిరుతలున్నాయి. వీటిలో రామాయంపేట మండల పరిధిలోనే ఏడుకు పైగా ఉన్నట్లు తెలుస్తున్నా ఆ శాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా బయట పెట్టడం లేదు. చిరుతల బెడదతో రాత్రివేళ రైతులు పంటచేను కాపలాకు వెళ్లడానికి జంకుతున్నారు. అక్కన్నపేట, తొనిగండ్ల, లక్ష్మాపూర్, ఝాన్సిలింగాపూర్, కాట్రియాల, ప్రగతిధర్మారం, పర్వతాపూర్, దంతేపల్లి పరి«ధిలో దట్టమైన అటవీప్రాంతం ఉంది. ఈ అడవిలో చిరుతులు, ఎలుగుబంట్లు, నీల్గాయిలు, రేసు కుక్కలతోపాటు వేల సంఖ్యలో వివిధ రకాల జీవరాశులున్నాయి. ఈ అటవీప్రాంతంలో 13 వరకు చిరుతలున్నట్లు ఇటీవల నిర్వహించిన జంతుగణనలో తేల్చారు. కాట్రియాల, దంతేపల్లి, పర్వతాపూర్, గ్రామాలను మెదక్ అటవీశాఖ పరిధిలో చేర్చగా, మిగతా గ్రామాలు మండల అటవీ రేంజీ పరిధిలోనే ఉన్నాయి. రెండు, మూడు నెలల కాలంగా చిరుతలు దాడిలో పదుల సంఖ్యలో దూడలతోపాటు మేకలు, పశువులు హతమవుతున్నాయి. తొనిగండ్ల గ్రామంలో అత్యధికంగా ఎనిమిది దూడలతోపాటు మూడు మేకలను చిరుతలు హతమార్చాయి. రాత్రి వేళ బయటకు వెళ్లొద్దని దండోరా.. కాగా ఇటీవల చిరుతల దాడులు పెరిగిపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళ అడవి పందులు, దుప్పిలు పంట చేన్లను ధ్వంసం చేస్తుండటంతో రైతులు ప్రతిరోజూ రాత్రివేళ చేన్ల కాపలాకు వెళ్తుంటారు. రెండు మూడు నెలల కాలంగా చిరుతల దాడులతో రైతులు చేన్ల కాపలాకు కూడా వెళ్లడం మానుకున్నారు. దీంతో పంట చేన్లు అడవి పందులు, దుప్పులు ధ్వంసం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రాత్రివేళల్లో పంటచేను కాపలాకు వెళ్లవద్దని ఈమేరకు గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. బోన్లకు చిక్కని చిరుతలు పశువులు, మేకలపై దాడులు చేస్తూ హతమారుస్తున్న చిరుతలను బంధించడానికిగాను అటవీశాఖ అధికారులు 15 రోజుల క్రితం ఝాన్సిలింగాపూర్, తొనిగండ్ల అటవీ ప్రాంతంలో రెండు బోన్లను ఏర్పాటు చేసి కుక్కలను ఎరగా పెట్టారు. అయినా చిరుతలు మాత్రం చిక్కలేదు. వాటిని బంధించడానికిగాను మరిన్ని బోన్లు అవసరం కాగా, ఆ దిశగా ఆశాఖ అ«ధికారులు నిర్ణయించారు. చిరుతదాడిలో చనిపోయిన లేగదూడ కుక్కను ఎరగా ఏర్పాటు చేసిన బోను కాగా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బోర్లవద్దకు తాగునీటికోసం వస్తున్న చిరుతలను చూస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా చిరుతలను బందించి తమకు రక్షణ కల్పించాలని వారు పలుమార్లు అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. చిరుతల దాడిలో మృతిచెందిన అన్ని పశువులు, మేకలకు నష్టపరిహారం అందజేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. జీవాలను అడవికి తీసుకెళ్తలేం.. అడవిల పులి తిరుగుతుందనే భయంతో జీవాలను మేతకు అడవిలోకి తీసుకెళ్తలేం. ఇప్పటికే చాలా జీవాలను పులులు చంపినయి. మేతకోసం జీవాలను మన్నెం తరలించినం. ఇక్కడ ఉంచితే ఏం లాభం లేదు. 15 రోజుల కిందట అడవిలో మేతకు వెళ్లిన మందలోనుంచి ఒక మేకను పులి ఎత్తుకపోతుండగా, కాపరి పులిని వెంబడిస్తూ కిందపడి గాయాలపాలయ్యాడు. – భీరయ్య, మేకల కాపరి,తొనిగండ్ల బంధించడానికి ప్రయత్నిస్తున్నాం. తరచూ పశువులపై దాడులకు పాల్పడుతున్న చిరుతలను బంధించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ మేరకు రామాయంపేట పరిధిలో రెండు బోన్లను ఏర్పాటు చేసినా అవి చిక్కలేదు. మరిన్ని బోన్లను ఏర్పాటు చేస్తాం. బాధిత రైతులకు నష్టపరిహారం అందజేయడానికి కృషి చేస్తున్నాం. ఈమేరకు కొందరికి నష్టపరిహారం ఇప్పడికే అందించాం. రాత్రి వేళల్లో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. – పద్మాజారాణి, జిల్లా అటవీ అధికారి -
లండన్ ఎయిర్‌పోర్టు మూసివేత!
లండన్ : బాంబు వార్తతో లండన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆదివారం సిటీ ఎయిర్‌పోర్టు వద్ద బాంబు జాడ లభ్యం కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. థేమ్స్ నది ఒడ్డున కింగ్ జార్జి వీ డాక్ వద్ద నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో ఈ బాంబు బయటపడింది. రన్ వేకు ఈ ప్రాంతంలో సమీపంలో ఇది ఉండటంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను బయటకు పంపించి వేసిన అధికారులు దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ప్రయాణికులకు కలిగిన అంతరాయంపై ఎయిర్‌పోర్టు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శక్తివంతమైన ఈ బాంబు బహుశా రెండో ప్రపంచ యుద్ధంలో ఇక్కడ పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా సెప్టెంబర్ 1940, 1941 మే నెలల మధ్య లండన్ నగరంపై దాడి చేసిన జర్మన్ ఎయిర్‌ఫోర్స్ దళాలు వేల సంఖ్యలో బాంబులను నగరంపైకి జారవిడిచాయి. ఇది కూడా చదవండి... 4000 మందిని కాపాడారు -
గోనె సంచిలో పసికందు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు గోనె సంచిలో కట్టేసి వదిలివెళ్లారు. స్థానిక పచ్చిపులుసు కళ్యాణ మండపం వద్ద ఈ ఘటన జరిగింది. గోనె సంచిలో నుంచి ఏడుపు విని అటుగా వెళ్తున్నవారు పాపను అక్కున చేర్చుకున్నారు. అనంతరం పసికందును చికిత్స కోసం నిడదవోలు ఆస్పత్రికి తరిలించారు. కాగా, ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. పాపను ఎవరు వదిలి వెళ్లారనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
ఎల్బీనగర్ సమీపంలో మహిళ మృతదేహం
-
విశాఖ బాలుడు కోట రైల్వే స్టేషన్లో గుర్తింపు
సామర్లకోట : అదృశ్యమైన విశాఖపట్నం గోపాలపట్నానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని సామర్లకోట ఆర్పీఎఫ్ పోలీసులు సామర్లకోట రైల్వే స్టేషన్లో గుర్తించా రు. ఆర్పీఎఫ్ ఎస్సై యు.దుర్గాప్రసాద్ కథనం ప్రకారం ఒక బాలుడు విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో మహిళల బోగీలో ప్రయాణిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లంకలపల్లి భువన సాయిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంట్లో చెప్పకుండా తిరుపతి వెళ్లాలని బయలు దేరినట్టు విద్యార్థి చెప్పాడని ఎస్సై తెలిపారు. కుమారుడు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు, ఆర్పీఎఫ్ పోలీసులకు, హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆ విషయం టీవీలలో ప్రచారమైంది. దాంతో విశాఖపట్నం ఆర్పీఎఫ్ సిబ్బంది నుంచి వచ్చిన సమాచారం మేరకు స్థానిక ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై విద్యార్థిని సామర్లకోటలో రైలు నుంచి దింపి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం రాత్రి విద్యార్థి చినాన్న సందీప్‌కుమార్ సామర్లకోట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. సందీప్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ డిల్లీ వెళుతున్నానని నా కోసం వెతక వద్దని లేఖ రాసి పెట్టాడని దాంతో పోలీసులకు, హెల్ప్‌లైనుకు, ఆర్ఫీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్పీఎఫ్ ఎస్సై యు.దుర్గాప్రసాద్ హెల్్పలైన్ సిబ్బంది సమక్షంలో విద్యార్థిని అతడి చిన్నాన్నకు అప్పగించారు. -
ఢిల్లీ ధర్మాసుపత్రిలో దారుణం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం. తక్కువ బరువుతోపుట్టిన శిశువు మరణించిందని అక్కడి డాక్టర్లు ప్రకటించారు. అయితే శిశువు ఖననం చేయబడటానికి తీసుకెళ్లినపుడు సజీవంగా ఉన్నట్లు బంధువులు గుర్తించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే బదర్పూర్కు చెందిన ఓ మహిళ పూర్తిగా నెలలు నిండకముందే ఆదివారం ఉదయం పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప ఊపిరితీసుకోవడం లేదని గుర్తించిన నర్సింగ్ సిబ్బంది చిన్నారి మరణించినట్టుగా ధ్రువీకరించి తండ్రి రోహిత్ కు అప్పగించారు. అయితే ఆరోగ్యం ఇంకా కుదుట పడకపోవడంతో తల్లి ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. దీంతో పాపను ఇంటికి తీసుకెళ్లి సమాధి చేయడానికి సిద్ధపడుతుండగా, పాప చిన్నగా ఏడ్వడాన్ని రోహిత్ సోదరి గమనించింది. వెంటనే అక్కడున్నవారిని అప్రమత్తం చేసింది. ప్యాప్ విప్పి చూశారు. పాప ఊపిరి తీసుకుంటూ కాళ్లూ, చేతులూ కదుపుతూ కనిపించింది. వెంటనే పీసీఆర్ చికిత్స అందింని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. డాక్టర్ల బాధ్యతారాహిత్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి అధికారులు స్పందించారు. డబ్ల్యుహెచ్వో మార్గదర్శకాల ప్రకారం 22 వారాల ముందు జన్మించిన శిశువులు 500 గ్రా. బరువుతో పుడతారని దాదాపు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని సఫ్దర్‌జంగ్ దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే రాయ్ చెప్పారు. ఇలాంటి ప్రీ మెచ్యూర్ డెలివరీ శిశువులను చనిపోయినట్లు ప్రకటించటానికి ముందు కనీసం సుమారు ఒక గంట పాటు పరిశీలనలో ఉంచాలని మరో డాక్టర్ చెప్పారు. -
హిజ్రాల వలలో 13 ఏళ్ల బాలుడు
- ఐదు రోజుల తర్వాత తల్లి చెంతకు వెంకోజీపాలెం (విశాఖ తూర్పు) : ఇంటిని వదిలి హిజ్రాల వలలో చిక్కుకున్న తగరపువలసకు చెందిన పదమూడేళ్ల బాలుడు ఎట్టకేలకు తల్లి చెంతకు చేరాడు. వివరాల్లోకి వెళ్తే..భీమిలి మండలం చిట్టివలస గ్రామం పెరుకువీధికి చెందిన జీరు రెడ్డి (13) తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో మధ్యలోనే చదువు ఆపేశాడు. అనంతరం తన బాబాయ్ నూడుల్స్ దుకాణంలో చేరి తల్లికి చేదోడుగా ఉండేవాడు. శనివారం ఎప్పటిలాగే పనికి వెళ్లినా రాత్రి ఇంటికి చేరకపోవడంతో బాలుడి తల్లి భీమిలి పోలీసులను ఆశ్రయించింది. బాలుడి కోసం తల్లితో పాటు బంధువులు కూడా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం ద్వారకానగర్ బస్‌స్టేషన్ సిగ్నల్ పాయింట్ వద్ద హిజ్రాలతో ఉన్న జీరు రెడ్డి తల్లికి కనిపించాడు. వెంటనే తల్లి వారి వద్దకు చేరుకుని ఎందుకు తన కొడుకుని ఇలా చేశారని ప్రశ్నించడంతో.. ‘‘మేం మీ అబ్బాయిని ఏమీ చేయలేదు. రోడ్డు మీద కనిపించి ఆకలిగా ఉందనడంతో మాతో తీసుకెళ్లి ఆశ్రయం కల్పించాం.’’ అని హిజ్రాలు బదులిచ్చారు. అనంతరం బాలుడిని తల్లికి అప్పగించారు. -
బయట పడ్డ ‘పేలుడు’ పాతర
బాంబ్ డిజ్పోజబుల్ స్క్వాడ్ వెలికితీత వందేసి చొప్పున డిటోనేటర్లు, పవర్ జెల్స్ స్వాధీనం అడ్డతీగల : గ్రామ శివారులోని ప్రధాన రహదారి చెంత పోలీసులు గురువారం పేలుడు పదార్ధాలను వెలికితీశారు. ఒక గోతిలో దొరికిన ఒక ప్లాస్టిక్ టబ్బు.. అందులో ఉన్న సంచిలో 25 కిలోల బరువైన వంద డిటోనేటర్లు, మరో వంద పవర్ జెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన అత్యంత రహస్య సమాచారం మేరకు రంపచోడవరం ఏఎస్పీ అద్మామ్ నయూం అస్మి ఆధ్వర్యంలో బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, ఇతర పోలీసులు అడ్డతీగల శివారున అడవుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దొరికిన ఈ టబ్బుకి ఏమైనా ఎలక్ట్రిక్ వైర్లు అమర్చారా? అంటూ నిశితంగా పరిశీలించి తరువాతే దానిని బయటకు తీశారు. ఎక్కడో విధ్వంసం సృష్టించేందుకే వీటిని ఇక్కడ భద్రపర్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఏడేళ్ళ క్రితం కోనలోవ వద్ద ఓ కల్వర్టు కింద అమర్చిన 35 కిలోల పేలుడు పదార్ధాలను పోలీసులు కనుగొన్నారు. ఆ తరువాత పేలుడు పదార్ధాలు దొరకడం ఇదే ప్రథమం. దర్యాప్తు చేస్తాం : ఏఎస్పీ అస్మి అడ్డతీగల శివారున పేలుడు పదార్ధాలు బయటపడిన విషయంపై కేసు దర్యాప్తు చేస్తామని రంపచోడవరం ఏఎస్పీ అద్నామ్ నయూం అస్మి తెలిపారు. తనిఖీల్లో బయటపడిన పేలుడు పదార్ధాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టి వీటిని కనుగొన్నట్టు చెప్పారు. పేలుడు పదార్ధాలు క్వారీ నిర్వాహుకులకు చెందినవా? లేక మావోయిస్టులు ఇక్కడ ఉంచారా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏజెన్సీలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందన్నారు. -
గాలింపు చర్యలు ముమ్మరం
లభ్యంకాని యువకుల మృత దేహాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన హోంమంత్రి రాజప్ప కాకినాడ రూరల్ : సముద్రంలో గల్లంతైన ఇద్దరు యువకుల జాడ శుక్రవారం రాత్రికి కూడా దొరకలేదు. తాళ్లరేవు మండలం కాపులపాలెం గ్రామానికి చెందిన పితాని గోవిందు కుటుంబ సభ్యులు గురువారం సముద్రంలో ముగ్గురు చనిపోగా, మరో ఇద్దరు యువకులు గల్లంతైన విషయం విదితమే. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మత్స్యశాఖ ఇ¯ŒSస్పెక్టర్ చెల్లే ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. 26 మంది గజ ఈతగాళ్ల, మరో 20 మంది మత్స్యకారులతో పెద్ద వల వేసి గాలిస్తున్నారు. తహసీల్దార్ జె.సింహాద్రి సముద్రపు ఒడ్డునే ఉండి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం హోం మంత్రి కాకినాడ క్రైం : కాండ్రకోట నూకాలమ్మవారి దర్శనం అనంతరం కాకినాడ బీచ్‌కి వెళ్లి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన కలెక్టర్ ఆరుణ్కుమార్తో కలిసి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం పరామర్శించారు. మృతి చెందిన పెద్దలకు రూ. 3 లక్షలు, చిన్నారులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. బీచ్‌లో ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయించాలి్సందిగా కలెక్టర్ అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. కాకినాడ సముద్ర తీరం ఆనుకుని బీచ్‌లో డ్రెడ్జింగ్, పోర్టు కార్యకలాపాలు అధికంగా జరగడంతో సముద్రం లోపల కరెంట్ అధికంగా ఉంటుందని, దీంతో అసాధారణ రీతిలో ఉవ్వెత్తున కెరటాలు ఎగసి పడుతాయని రాజప్ప చెప్పారు. తీరంలో రక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పర్యాటకులు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న శీలం శ్రీను, పితాని రమ్య, శీలం తనుకులమ్మను ఆయన పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆర్ఎంవో డాక్టర్ సుధీర్‌ను ఆదేశించారు. బంధువులను ఓదార్చారు. బాధితులను పరామర్శించిన వారిలో శాసన మండలి ఉపాధక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుతో పాటూ పలువురు నేతలు ఉన్నారు. రాకాసి కెరటాలకు బలయ్యారు అప్పటి వరకూ అందరం ఆనందంగా గడిపాం. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లిపోదామనుకున్నాం. పదో తరగతి పరీక్షలు అయిపోయాయి. ఒకసారి బీచ్కెళదాం నాన్నా అని నా కూతురు అనిత కోరింది. తర్వాత అందరూ వెళదామన్నారు. సరేనన్నాను. అంతా కలసి బీచ్కెళ్లాం. అందరూ ఆటోల నుంచి కిందకి దిగి గుంపులుగా బీచ్‌లో కెళి్లపోయారు. నేను ఆటో దిగి బీచ్కొస్తుంటే, ఒక్కసారిగా సముద్రం నుంచి హాహాకారాలు వినిపించాయి, గల్లంతవ్వడం, స్థానికులు సముద్రంలోకెళ్లి రక్షించడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో నా కుమార్తె అనితతో పాటూ నా తమ్ముడు పితాని శ్రీను, సోదరి పిల్లలు శీలం దేవి మృతి చెందారు. సముద్రంలో గల్లంతైన వారిలో నా కుమారుడు వీరవంశీ, జయకృష్ణ ఉన్నారు. మిగతా ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కళ్లెదుటే నా కుటుంబ సభ్యులను పోగోట్టుకున్నాను. – పితాని గోవిందు -
పది నెలల తర్వాత..
భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె ఆచూకీ పది నెలల తర్వాత లభ్యమైంది. ఒకరింట్లో పనికి కుదిరిన ఆమెను పోలీసులు గుర్తించి ఆరాతీయగా ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నట్టు తెలపడం విశేషం. పోలీసుల కథనం ప్రకారం విరాలిలా.. గణపవరం (నిడమర్రు) : అర్థవరం గ్రామానికి చెందిన గృహిణి సాగిరాజు జయ(38)గత ఏడాది జూలై 2న ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. చివరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా గాలించినా ఆచూకీ కనుగొనడం కష్టమైంది. ఈ క్రమంలో జయ మిస్సైన కేసు విషయంలో విచారణ నిమిత్తం కోర్టు ఆదేశాల మేర మరోసారి ఆమె ఆచూకీ కోసం గణపవరం సీఐ ఎ¯ŒS.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. టినర్సాపురం మండలం కె.జగ్గవరం గ్రామంలో వెలిది కృష్ణమూర్తి ఇంట్లో పని చేసుకుంటున్నట్టు తెలుసుకుని గురువారం ఆమెను గణవరం తీసుకువచ్చారు. జయను అమె తల్లి కొత్తపల్లి పార్వతికి గణపవరం తహసీల్దారు ఎస్.ఇస్మాయిల్ సమక్షంలో గణపవరం ఎస్సై డి.హరికృష్ణ అప్పగించారు. భర్త, అత్తమామలు వేధింపులు భరించలేకనే ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు జయ వాపోయింది. -
వాషింగ్ మెషిన్లో పడి ఇద్దరు చిన్నారుల మృతి
-
వనపర్తి లో చిరుతల సంచారం
పానగల్: వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం తెల్లారెళ్లపల్లి గ్రామ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన కొందరు గ్రామస్థులు చిరుతలు సంచరించడాన్ని గుర్తించారు. శివారులోని పొలాల్లో మూడు చిరుతలు సంచరిస్తున్నాయని చెప్పారు. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చిరుతల బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్ ఒకటి కలకలం రేపింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) ఆవరణలో దీనిని గుర్తించారు. మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు వచ్చిన వారు శుక్రవారం కొత్త వస్తువేదో కనిపించడంతో దానిని ఆసక్తిగా గమనించారు. చివరికి దానిని ఒక గ్రెనేడ్‌గా గుర్తించి అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అనంతరం మణిపూర్ పోలీస్ బాంబ్ స్క్వాడ్ దానిని నిర్వీర్యం చేసినట్లు అధికారులు వెల్లడించారు. చైనీస్ గ్రెనేడ్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. రిమ్స్ ఆవరణలోకి అది ఎలా వచ్చింది అనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
బాలుడి ఆచూకీ లభ్యం
అనంతపురం సెంట్రల్ : మడకశిరకు చెందిన బాలకృష్ణ (14) రెండు రోజుల క్రితం అనంతపురానికి వచ్చి కనిపించకుండా పోయాడు. బాలుడి కుటుంబ సభ్యులు టూటౌ¯ŒS పోలీస్ స్టేష¯ŒSలో శనివారం ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ అనంతపురం నుంచి వెళ్లి పెనుకొండలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. -
నదిలో వీఆర్ఏ మృతదేహం లభ్యం
ఎల్.ఎన్.పేట(శ్రీకాకుళం): రెండు రోజుల క్రితం కనిపించకుండాపోయిన వీఆర్ఏ మృతదేహం లభించింది. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట(లక్ష్మీనర్సుపేట) మండలం తురకపేట రెవెన్యూ క్లస్టర్ వీఆర్ఏ సురాన త్రినాథరావు(50) రెండు రోజుల క్రితం విధి నిర్వహణ నిమిత్తమై వెళ్లి వంశధార నదిలో గల్లంతయ్యాడు. మంగళవారం ఉదయం జలుమూరు మండలం నగరికటకం- అచ్యుతాపురం గ్రామాల మధ్య మృతదేహాన్ని గమనించిన స్థానికులు అక్కడ లభించిన ఆధారాల సాయంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని త్రినాథరావు మృతదేహాన్ని గుర్తించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ వారు ఎల్‌ఎన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వరంగల్‌లో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం
-
నటి సబర్న మృతి కేసులో పురోగతి
చెన్నై: ప్రముఖ తమిళ టీవీ, సినీనటి సబర్న, అలియాస్ సుగుణ మృతి కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. పరారీలో ఉన్న ఆమె భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై మదురవాయిల్‌లోని ఒక అపార్టుమెంట్లో ఇటీవల సబర్న అనుమానాస్పద స్థితిలో మతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలా ఉండగా ఆమె ఉత్తరాది సినీ రంగానికి చెందిన వ్యక్తిని ప్రేమించినట్టు తెలిసింది. ఏడాది క్రితం వీరు రహస్య వివాహం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కారణంగానే ఆమె తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటుందని, గత రెండు నెలలుగా సపర్నను చూసేందుకు భర్త రాలేదని పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా సపర్న ఇబ్బందులు పడ్డారని, భర్తతో సెల్ఫోన్లో మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. ఇలాఉండగా ఆమె మృతికి ముందురోజు భర్త సవర్నను చూసేందుకు వచ్చినట్టు తెలిసింది. అతను తిరిగి వెళుతున్న సమయంలో తనతోనే ఉండాలని ఆమె బెదిరించిందని, అంతేగాకుండా కత్తి తీసుకుని చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో పోలీసులకు అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. ఆమె భర్త సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో సవర్నను హత్య చేసి ఆధారాలను నాశనం చేసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సపర్ణ మృతి తర్వాత ఇంతవరకు భర్త వచ్చి చూడకపోవడం గమనార్హం. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా ఉడుంబలై పట్టైకు చెందిన సబర్న తల్లి పుష్పలత, తండ్రి ఆనంద్ కుమార్, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటుండంగా ఆమె ఒంటిరిగా ఉంటోంది. ఒక మ్యూజిక్ ఛానల్ లో టీవీ వ్యాఖ్యాత, యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన సబర్న ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో నటించారు. పూజై, కుదిరసు, కలై లాంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. -
ప్రముఖ టీవీ నటి అనుమానాస్పద మృతి
చెన్నై: ప్రముఖ తమిళ టీవీ, సినీనటి సబర్న, అలియాస్ సుగుణ (29)అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మరణించారు. ప్రాథమికంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నప్పటికీ మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. విలక్షణ పాత్రలతో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సబర్న ఆకస్మిక మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాజధాని చెన్నై, సీమతమాన్ నగర్ లో నివాసంలో మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపులు మూసివేసి వుండడం, దుర్వాసన వస్తుండడడంలో పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. అన్నాసాగర్ డిప్యూటీ పోలిస్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తలపై తీవ్రమైన గాయం, మృతదేహం కుళ్లిపోయివుండడంపై పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె మూడు రోజుల క్రితమే చనిపోయి వుంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఉడుంబలై పట్టైకు చెందిన సబర్న తల్లి పుష్పలత, తండ్రి ఆనంద్ కుమార్, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటుండంగా ఆమె ఒంటిరిగా ఉంటోంది. ఒక మ్యూజిక్ ఛానల్ లో టీవీ వ్యాఖ్యాత, యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన సబర్న ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో నటించారు. పూజై, కుదిరసు, కలై లాంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. -
కరీంనగర్లో బాంబుల కలకలం
-
చీడపీడల గుట్టు తెలిసింది!
సాక్షి, హైదరాబాద్: ఒకేరకమైన పంటలను అధిక విస్తీర్ణంలో పండిస్తే వాటికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుందని చాలా కాలం నుంచి తెలిసిందే. అయితే దీనికి కారణం ఇప్పటివరకు తెలియదు. తాజాగా కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనికి గల కారణాలను కనుక్కున్నారు. వేర్వేరు మొక్కలున్న పంటపొలాల్లో కీటకాల పోషకావసరాలు పూర్తిగా తీరవని, ఒకే తీరు పంటలు (మోనోకల్చర్) మాత్రం కీటకాలకు మంచి ఆహారంగా ఉంటాయని శాస్త్రవేత్త విలియం వెట్జెల్ తెలిపారు. అలాగే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారం అందుబాటులో ఉండటం వల్ల కీటకాలు మోనోకల్చర్ పంటలను ఇష్టపడతాయని చెప్పారు. దాదాపు 53 రకాల కీటకాలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు వచ్చామని పేర్కొన్నారు. ఒక పంటకు సంబంధించిన వేర్వేరు జాతుల మొక్కలను కలిపి పండించడం ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు. కొన్నిచోట్ల వరి, గోధుమ పంటల్లో ఇప్పటికే ఈ రకమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. అధ్యయన వివరాలు నేచర్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్ దారుణ హత్య
-
ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్ దారుణ హత్య
పనాజి: ఫోటోగ్రాఫర్ ట ర్న్డ్ పెర్ఫ్యూమ్ రీసెర్చర్ మోనికా గూర్డె (39)దారుణ హత్యకు గురయింది. హై ప్రొఫైల్ పెర్ ఫ్యూమర్ , ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్ గా పేరొందిన మోనికా .. గోవాలోని సంగోల్డాలో ఉన్న ఫ్లాట్ లో అనుమానాస్పదరీతిలో శవమై తేలారు. చేతులు కట్టేసి, బెడ్ పై నగ్నంగా పడివున్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గోవా డీఐజీ విమల్ గుప్త అందించిన సమాచారం ప్రకారం గురువారం ఉదయం పనిమనిషి వచ్చినపుడు మెనికా తలుపు తీయలేదు. దీంతో పొరుగువారికి ముంబైలో ఉంటున్న ఆమె అన్న ఆనంద్ కు సమాచారం అందించింది. అన్న ఫోన్ కాల్స్ కు మోనికా స్పందించలేదు. వెంటనే ఆనంద్ , మెనికా మాజీ భర్త ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ ను భరత్ రామామృతాన్ని సంప్రదించారు. అయినా ఫలితంలేదు. చివరికి పొరుగున నివసించే అమరికన్ మహిళ దగ్గర ఉన్న డూప్లికేట్ కీ సహాయంతో తలుపు తీయడంతో విషయం వెలుగు చూసింది. ఇంట్లో ఎలాంటి దోపిడీ జరగలేదని తెలిసినవారి పనే అయి వుంటుందని తమ ప్రాథమిక విచారణ అంచనా అని డీఐజీ చెప్పారు. శరీరంపై ఎటువంటి పొడిచిన గాయాలు లేవని, ఆమె ముఖం మీద ఎరుపు మార్కులు ఉన్నాయని తెలిపారు. దిండుతో అదిమి పెట్టి హత్య చేసిఉంటారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశామని, లైంగిక దాడి చేసి హత్య చేసి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా నాగ్‌పూర్ చెందిన మోనికా ముంబైకోర్టు మాజీ జడ్జి రమేష్ గూర్డె కూతురు. ముంబై జేజే ఇన్ట్సిట్యూట్ నుంచి ఫోటగ్రఫీ కోర్స్ చేసిన మోనికా .. జీన్ ఫ్రాంకోసిస్, క్రిస్టియన్ లాబోటిన్ ఆనంద్ కాబ్రా లాంటి ప్రముఖ డిజైనర్స్ తో కలిసి పనిచేశారు. ఈనేపథ్యంలో మో ల్యాబ్ అనే ఫెర్ ఫ్యూం కంపెనీని కూడా స్థాపించారు. కొంతకాలం చెన్నై లో నివసించిన అనంతరం గోవాకు మకాం మార్చారు. గత ఏడాది భర్తతో విడిపోయిన మోనికా గోవాలో ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం మెనికా ఒక వీడియో ను కూడా రిలీజ్ చేశారు. -
గల్లంతైన ప్రియాంక మృతదేహం లభ్యం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడకల వాగులో కొట్టుకుపోయిన తల్లీ కొడుకుల్లో తల్లి ప్రియాంక మృతదేహం లభ్యమైంది. భారీ వర్షాలకు వరదలో చిక్కుకుపోయిన తల్లి కొడుకులు శనివారం ఉదయం వరద ఉధృతికి నీటిప్రవాహంలో గల్లంతయ్యారు. వారి కోసం గ్రాస్థులు, పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా.. ఆదివారం ఉదయం ప్రియాంక మృతదేహం లభ్యమైంది. రెండేళ్ల బాబు కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
మృతిచెందిన బాలుడి ఆచూకీ లభ్యం
‘సాక్షి’లో వచ్చిన వార్త చూసి గుర్తించిన ఉపాధ్యాయులు పెనుగంచిప్రోలు/నందిగామ రూరల్ : ప్రత్యేక ఆంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మరణించిన బాలుడి పూర్తి వివరాలు తెలిశాయి. ఆ బాలుడు చందర్లపాడు మండలం తోటరావులపాడు హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మల్లెల కొండ(14)గా గుర్తించారు. ‘గుర్తు తెలియని బాలుడు మృతి’ అనే శీర్షికన ‘సాక్షి’లో బుధవారం వార్త ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తను చదివిన ఉపాధ్యాయులు వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మల్లెల కొండ మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లి పుస్తకాలు అక్కడ పెట్టి బయటకు వచ్చాడు. పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకునిపాలెం గ్రామంలో ఉన్న తన అమ్మమ్మను చూసేందుకు బయలుదేరాడు. పెనుగంచిప్రోలు వెళ్లే బస్సులో టికెట్ తీసుకున్న అనంతరం అపస్మారకస్థితిలో పడిపోయాడు. ప్రత్యేక అంబులెన్స్‌లో విజయవాడ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. బాలుడి మృతిపై పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మంగళవారం రాత్రి పోస్టుమార్టం కోసం నందిగామ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నాగమణి, సత్యనారాయణ మార్చురీ వద్దకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డకు ఎటువంటి జబ్బు లేదని తల్లిదండ్రులు తెలిపారు. -
మరింత ఆసక్తిగా టైటాన్‌పై జీవాన్వేషణ
వాషింగ్టన్: విశ్వంలో ఇప్పటివరకూ కనుగొన్న గ్రహాలు, ఉపగ్రహాల్లో అత్యంత ఎక్కువగా భూమిని పోలిన లక్షణాలున్నదిగా శనిగ్రహానికి చెందిన ఉపగ్రహం టైటాన్ ను భావిస్తారు. ద్రవరూప మీథేన్ ప్రవహించిన ఆనవాళ్లు ఉపరితలంలో కలిగి ఉండటం టైటాన్ ప్రత్యేకత. భూమిని పోలిన టైటాన్‌పై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఇప్పుడు దానికి మరింత బలం చేకూర్చేలా భూమిపై మాదిరిగానే టైటాన్‌పై అసాధారణంగా మేఘాలు కనిపించాయి. అక్కడి వాతావరణ మార్పుల్లో భాగంగా ఈ మేఘాలు ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శనిగ్రహం, దాని ఉపగ్రహాలపై పరిశోధనల కోసం నాసా పంపిన కాసినీ ఆర్బిటర్ ద్వారా టైటాన్‌పై మేఘాలు ఏర్పడటాన్ని గుర్తించారు. టైటాన్ స్ట్రాటో స్పియర్‌లో ఈ మేఘాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే దశాబ్దం క్రితం నాసా ప్రయోగించిన వయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ సైతం టైటాన్‌పై మేఘాలను గుర్తించింది. తాజాగా కనిపించిన మేఘాలు టైటాన్‌పై జీవాన్వేషణలో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
విద్యార్థినుల మృతదేహాలు లభ్యం
ఘంటసాల : ఘంటసాలలోని గుండేరు బెడ్‌రెగ్యులేటర్ వద్ద ఆదివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థినుల మునగాల నళినీ, చైతన్య మృతదేహాలు సోమవారం లభించాయి. గుండేరు చూసేందుకు వెళ్లిన మిత్ర బృందంలో నళినీ, చైతన్యలు కాలు జారి పడిపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో గల్లంతయ్యారు. ఘంటసాల ఎస్ఐ కేవీజీవీ సత్యనారాయణ పర్యవేక్షణలో గజ ఈతగాళ్లు, ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ బి.బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో మొవ్వ అగ్నిమాపక సిబ్బంది, స్థానిక జాలర్ల సాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సోమవారం ఉదయం చైతన్య మృతదేహం సంఘటన స్థలానికి సమీపంలో లభించగా, మధ్యాహ్నం నళినీ మృతదేహం దాలిపర్రులోని కోళ్లఫారాల వద్ద స్వాధీనం చేసుకున్నారు. సంఘటన ప్రాంతాన్ని తహసీల్దార్ ఎం.బాబూరావు సందర్శించారు. అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. -
కోకా కోలా ప్లాంట్‌లో 370 కిలోల కొకైన్!
లండన్: కోకా కోలా ప్లాంట్‌లో 370 కిలోల కొకైన్ బయటపడటం ఫ్రాన్స్‌లో కలకలం రేపింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్‌లో ఓ కంటెయినర్లో ఉన్న ఈ కొకైన్‌ను అక్కడి కార్మికులు గుర్తించారు. దక్షిణ అమెరికా నుంచి వచ్చిన ఆరెంజ్ జ్యూస్ సంబంధిత కంటెయినర్లో దాచిన కొకైన్ బ్యాగులను గుర్తించినట్లు మీడియా సంస్థ 'ఇండిపెండెంట్' బుధవారం వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో కొకైన్ బయటపడటం ఫ్రాన్స్ చరిత్రలోనే ఇది మొదటిసారి. దీని విలువ 50 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కొకైన్ వ్యవహారంలో కోకా కోలా ప్లాంట్ వర్కర్ల పాత్ర లేదని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని విచారణ అధికారి జీన్ డెనిస్ మల్గ్రాస్ వెల్లడించారు. కొకైన్‌ను ఎవరు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు.. అది కంటెయినర్లోకి ఎలా వచ్చింది అనే విషయాలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. -
గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యం
చింతలపూడి : చింతలపూడి మండలం యర్రగుంటపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆచూకీ లభించినట్టు ఎస్సై సైదానాయక్ మంగళవారం తెలిపారు. ఈ మృతదేహం కర్ణాటక రాష్ట్రం, రాయ్‌చూర్ జిల్లా గిలకషుగర్‌గాయ్ గ్రామానికి చెందిన బొబ్బా శేషగిరిరావు (60)కు చెందినదిగా గుర్తించామన్నారు. దినపత్రికల్లో వచ్చిన మృతుని ఫొటో చూసి ద్వారకాతిరుమలలో ఉంటున్న అతని బంధువులు గుర్తుపట్టారని చెప్పారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతుడు అనారోగ్య కారణాలతో కొద్ది కాలంగా బాధపడుతున్నట్టు బంధువులు తెలిపారని ఎస్సై చెప్పారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గిద్దలూరులో పెద్దపులి సంచారం
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లి గ్రామంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలో పెద్ద పులి కాలిముద్రలను గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని పులి కాలిముద్రలు పరిశీలిస్తున్నారు. -
దీప్తి మృతదేహం లభ్యం
గన్నవరం : మండలంలోని కేసరపల్లి వద్ద ఏలూరు కాలువలో ఆరు రోజుల క్రితం పడిపోయిన చౌటపల్లి దీప్తి మృతదేహం లభించింది. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ సమీపాన కాలువలో ఆమె మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన తన ప్రియుడు నక్కా నాగరాజుతో ఘర్షణ నేపథ్యంలో దీప్తి కేసరపల్లి వద్ద ఏలూరు కాలువలో పడిపోయింది. అప్పటి నుంచి ఆమె కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా కేసరపల్లి నుంచి బుద్ధవరం వరకు గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాపులపాడు మండలం వీరవల్లి వద్ద కాలువలో మహిళ మృతదేహం తేలియాడుతుండగా... స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించారు. దుస్తుల ఆధారంగా మృతురాలు దీప్తిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె కాలువలో పడి ఆరు రోజులు కావడంతో మృతదేహం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఈస్ట్ జోన్ ఏసీపీ డి.విజయభాస్కర్, సీఐ అహ్మద్అలీ తదితరులు దీప్తి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాయదుర్గంలో చిరుత కలకలం
-
రాయదుర్గంలో చిరుత కలకలం
రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం చిరుత కలకలం రేపింది. పట్టణంలోని మీసేవ సెంటర్ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. పట్టణంలో చిరుత తిరుగుతోందనే వార్త క్షణాల్లో పాకిపోవడంతో పట్టణ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
టేకుమట్ల పాత బ్రిడ్జి కింద మృతదేహాం లభ్యం
మృతదేహానికి తల, చేతులు, కాళ్లు లేని వైనం మూటలో కట్టి వేచినట్లు ఆనవాళ్లు సూర్యాపేటరూరల్: తల, చేతులు, కాళ్లు లేని ఓ మృతదేహాం ఆదివారం సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామ సమీపంలోని మూసీవాగు పాత బ్రిడ్జి కింద స్థానికులకు కనిపించింది. స్థానికులు వెంటనే వీఆర్ఓ, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 35 నుంచిl40 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిని ఎక్కడో హత్య చేసి తల, కాళ్లు, చేతులు నరికి వేసి మిగతా శరీరాన్ని ఓ కవర్లో మూటకట్టి బ్రిడ్జిపై నుంచి వాగులోకి వేశారు. మృతదేహాం నీళ్లల్లో పడకుండా ఓ రాయిపై పడడంతో కవర్ ఊడిపోయింది. 15 నుండి 20 రోజుల క్రితం దీనిని వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యాపేట పట్టణ సీఐ మొగిలయ్య సంఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించారు. వీఆర్ఓ విజయరామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనువాస్‌రెడ్డి తెలిపారు. -
సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం
మథుర: ఢిల్లీ- ఆగ్రా రహదారిపై శనివారం ఓ మహిళ మృతదేహం ఉన్న సూట్‌కేసు కలకలం సృష్టించింది. రహదారికి సమీపంలోని ఓ కాలువ పక్కన ఈ సూట్‌కేస్‌ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సూట్‌కేస్ తెరిచి చూడగా అందులో అర్ధనగ్నంతో ఉన్న మహిళ మృతదేహం కనిపించిందని ఎస్పీ అలోక్ ప్రియదర్శిని తెలిపారు. మృతురాలికి 35 ఏళ్లు వయసుంటుందని, శరీరంపై అక్కడక్కడ గాయాలు ఉన్నాయని చెప్పారు. మహిళను వేరేచోట హతమార్చి.. అనంతరం మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉండొచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. -
ప్రమాద స్థలికి 100 కి.మీ దూరంలో మృతదేహం
ముంబై: ముంబై-గోవా హైవేలో సావిత్రి నదిపై వంతెన కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సు డ్రైవర్ మృతదేహం గుర్తించారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో వంతెన కూలిపోవటంతో నాలుగు బస్సులు, రెండు కార్లు గ్లల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వాహనాలను గుర్తించేందుకు 300 కేజీల మాగ్నెట్ సహాయంతో గాలిస్తున్నారు. సహాయక చర్యల్లో నేవీ గజ ఈతగాళ్లు పాల్గోంటున్నారు. ఈ ఘటనలో మొత్తం 22 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. రాత్రి వేళలో వంతెన కొట్టుకుపోవడంతో హైవేపై వెళ్తున్న వారు ఎంత మంది నదిలో పడిపోయారనే విషయం స్పష్టంగా తెలియటం లేదు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు లభించాయి. కూలిన బ్రిడ్జి 1928లో నిర్మించింది. -
శవమై తేలిన మరో ఖడ్గమృగం!
అసోంః కాజీరంగా నేషనల్ పార్క్ సమీపంలో మరో ఖడ్గమృగం శవమై తేలింది. ఇప్పటికే ఎన్నోసార్లు వేటగాళ్ళ బారిన పడి ఆ మూగజీవాలు మృత్యు వాత పడ్డ విషయం తెలిసిందే. వాడిగా ఉండే వాటి కొమ్ములకోసం వేటగాళ్ళు ఏంకగా వాటి ప్రాణాలనే బలితీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కాగా తాజాగా కొమ్ములతోసహా ఓ మగ ఖడ్గమృగం కనిపించి కలకలం రేపింది. అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్ (కేఎన్ పీ) సమీపంలో ఖడ్గ మృగం మృతదేహం కనిపించింది. పార్కు సమీపంలోని జపోరిపత్తర్ గ్రామస్థులు కొమ్ములతోపాటు ఉన్న జంతువు శరీరాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. కొహోరా రేంజ్ లోని మికిర్జన్ అటవీప్రాంతం డిప్లూ నదిలో ఖడ్గమృగం శరీరం కొట్టుకొని వచ్చినట్లు జపోరిపత్తర్ గ్రామస్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో కేఎన్పీ అధికారులు, పశువైద్యులు శరీరాన్ని పరిశీలించి.. ఆ మృగానిది సహజ మరణంగా నిర్థారించారు. ఎంతో దృఢంగా ఉండే ఖడ్గమృగం కొమ్ములను సురక్షితంగా భద్రపరిచేందుకు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కవ్వలకుంట చెరువులో శవం లభ్యం
మంగపేట: వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని కవ్వలకుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది. శుక్రవారం ఉదయం చెరువులో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని బయటికి తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక ఎవరైన హత్య చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
ఛత్తీస్‌ఘడ్‌లో అరుదైన పాము
-
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
నల్లగొండ: నల్లగొండ జిల్లా నారాయణపురం మండలంలో బుధవారం రాత్రి పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. మండలంలోని మహ్మదాబాద్ గ్రామంలో లక్ష్మారెడ్డి పౌల్ట్రీలో సోదా చేయగా నాలుగు బస్తాల అమ్మోనియం నైట్రేట్, జిలెటిన్ స్టిక్స్, విద్యుత్ తీగ లభించాయి. ఇవి చిట్యాలకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే రైతుకు చెందినవిగా భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. త్వరలో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇవి వెలుగులోకి రావటం గమనార్హం. -
గౌరాయిపల్లిలో చిరుత సంచారం
యాదగిరిగుట్ట : ఓ చిరుత పులి గ్రామంలో సంచరిస్తోందని భయాందోళన చెందతున్న సంఘటన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయిపల్లిలో జరిగింది. గ్రామంలో చిరుత పులి సంచారాన్ని చూసిన జనం హడలెత్తిపోతున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అధికారులు గ్రామంలో పులి సంచరించిన అనవాళ్లను పరిశీలించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని చూచించారు. -
కృష్ణా తీరంలో పురాతన విగ్రహాలు లభ్యం
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణాతీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి గాను తవ్వకాలు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కృష్ణానదీ తీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ రూ. 5లక్షలు మంజూరు చేసింది. దాంతో ఈ రోజు ఉదయం నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రొక్లైన్‌తో తవ్వకాలు జరుపుతుండగా శివపార్వతులు, వీరభద్రస్వామి విగ్రహాలు మూడు బయటపడ్డాయి. విగ్రహాలు మూడు అడుగుల పొడవు ఉండి చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇవి 200 సంవత్సరాల నాటివని స్థానికులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణానికి తవ్వుతుండగా విగ్రహాలు బయటపడడం శుభశూచకమని వారు చెప్పారు. -
పేలుడు పదార్థాల లక్ష్యం ఆయనేనా?
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మాచవరం వద్ద పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. సుప్రీంకోర్టు న్యాయవాది వికాస్ బసచేసిన ఇంటి సమీపంలో మందుపాతర తయారీలో వినియోగించే పదార్థాలు లభ్యం కావడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వికాస్ వాదనలు వినిపించారు. ఆయనకు మైనింగ్ మాఫియా నుంచి ప్రాణహాని ఉందని గతంలో ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వికాస్ టార్గెట్‌గానే పేలుడు పదార్థాలు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చెత్తకుప్పలో పసికందు
హైదరాబాద్: అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుప్ప పాలు చేశారు. కాప్రా మున్సిపాలిటీ పరిధిలో ఈఘటన చోటుచేసుకుంది. హెచ్‌బీ కాలనీలో గల చెత్తకుప్పలో శనివారం ఉదయం స్థానికులకు పసికందు ఏడుపు వినిపించింది. వెళ్లి చూడగా చిత్తుకాగితాల మధ్య చుట్టి ఉన్న మగశిశువు ఏడుస్తోంది. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారు శిశువును వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
గోనెసంచిలో పసికందు
పెన్‌పహాడ్: నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్‌పహాడ్ మండలం చిన్నారెడ్డిపాళెం గ్రామ శివారులోని ఎస్సీ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు గోనె సంచిలో ఓ పసికందును వదిలివెళ్లారు. శుక్రవారం ఉదయం గోనేసంచిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోనె సంచి విప్పి చూడగా బొడ్డూడని పసికందు మృతదేహం కనిపించింది. పసికందు నిన్న రాత్రి పుట్టిఉండొవచ్చని బావిస్తున్నారు. బతికున్న పసికందునే సంచిలోవేసుకుని వచ్చి వదిలివెళ్లి ఉంటారని, గోనెసంచి విప్పేముందే మృతిచెంది ఉండవచ్చని పసికందును చూసిన వారు చెబుతున్నారు. -
అక్కడ ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం!
సముద్ర గర్భంలో ఎన్నో వింతలు విశేషాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం సహాయంతో పరిశోధకులు సాగర గర్భంలోని రహస్యాలను ఛేదించడం ప్రారంభించారు. లక్షల ఏళ్ళ క్రితమే చివరి మంచు యుగం ప్రకారం సముద్ర మట్టానికి అడుగున ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్విరామంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఫ్లోరిడా ఆసిల్లా నదీ గర్భంలో జరిపిన పరిశోధనల్లో అమెరికా ప్రజల ఉనికిని తెలిపే మరిన్ని సాక్ష్యాలు ఆవిష్కరించాయి. ప్రాచీన చరితకు ఆనవాళ్ళు లభించాయి. ఆరు దశాబ్దాల ముందే ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం ఉందన్నపరిశోధకుల అనుమానాలను నిజం చేస్తూ ఫ్లోరిడా ఆసిల్లా నది ఆడుగు భాగంలో ఆధారాలు దొరికాయి. మంచుయుగానికి ముగింపు సమయంలోనే అమెరికా ప్రజల ఉనికిని తెలిపే అనేక రాతి పనిముట్లు సహా పురాతన రుజువులను.. సైంటిస్టులు కనుగొన్నారు. సుమారు పదివేల ఏళ్ళ క్రితం హిమఖండాలు కరగటం ప్రారంభించి సముద్రంలో ఆపారమైన జలరాసి కలిసిపోయింది. తీర ప్రాంతాలు సహా అనేక నాగరికతలూ సమాధి అయిపోయాయి. అయితే సముద్రగర్భంలోని చరిత్రను వెలికి తీసేందుకు ఇటీవల ఆర్కియాలజిస్టులు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అవశేషాలను బయటకు తీయడంలో ప్రత్యేక శ్రద్ధ వహింస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఫ్లోరిడాలోని ఆసిల్లా నది గర్భంలో నిర్వహించిన నిర్వహించిన పరిశోధనల్లో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. నదిలోని గోధుమరంగు ముర్కీ జాలాల్లో మానవుల ఉనికిని గుర్తించే వేటగాళ్ళు వినియోగించిన ప్రాచీన రాతియుగంనాటి పనిముట్లు, అతి పెద్ద ఏనుగును తలపించే జంతువు మాస్టోడాన్ సహా ఒంటెలు, అడవిదున్నలు, గుర్రాలు, అతి పెద్ద క్షీరదాల ఎముకలు సాక్షాత్కరించాయి. సముద్ర గర్భానికి అడుగున రాతి పనిముట్టతోపాటు, జంతువుల ఎముకలు, మాస్టోడాన్ దంతాలను కనుగొన్నామని, వీటిని బట్టి ఆగ్నేయ అమెరికాలో 14,550 సంవత్సరాలకు పూర్వమే అంటే... ఇంత క్రితం తెలుసుకున్నదానికి 1500 సంవత్సరాలకు ముందే మానవ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లోవిస్ ప్రజల విలక్షణ నాయకత్వానికి గుర్తుగా సుమారు 13000 సంత్సరాల పురాతత్వ ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు. ఫ్లోరిడా రాజధాని తల్లహశ్సీ సమీపంలోని పేజ్ లాడ్సన్ సైట్లో 2012 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 890 సార్లు నీటిలో మునిగి, నదీ గర్భంలో పరిశోధనలు నిర్వహించిన సైంటిస్టులు.. 35 అడుగుల లోతులోని భూభాగంలో ఉన్న సున్నపురాయిని 11 మీటర్లమేర తవ్వకాలు జరిపామని, ఈ నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు దొరికినట్లు తెలిపారు. ఇప్పటికీ క్లోవిస్ ముందు అక్కడ అద్భుత మానవ చరిత్ర ఉన్నట్లు నమ్ముతున్న పురాతత్వ వేత్తలు తమ పరిశోధనలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో నివేదించారు. -
మంచుదిబ్బల కింద పదహారేళ్ల తర్వాత..
న్యూయార్క్: ఎట్టకేలకు అమెరికాకు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు అలెక్స్ లోవ్ మృతదేహం బయటపడింది. అతడితోపాటు మరో కెమెరామ్యాన్ మృతదేహం కూడా వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా మంచుకరిగిపోవడంతో వారి మృత అవశేషాలు బయటపడ్డాయి. వీరు చనిపోయి ఇప్పటికీ 16 ఏళ్లు. పూర్తి వివరాల్లోకి వెళితే సరిగ్గా పదహారేళ్ల కిందట అంటే అక్టోబర్ 1999లో ప్రముఖ పర్వతారోహకుడు అలెక్స్ లోవ్, మరో ఇద్దరు సాహస యాత్రికులు కార్నార్డ్ యాంకర్, డేవిడ్ బ్రిడ్జెస్‌తో కలిసి టిబెట్ లోని శిషపాంగ్మా పర్వతం(8,013 మీటర్లు-26,291 అడుగులు)ను అధిరోహణకు బయలుదేరారు. వారు మధ్యలో ఉండగా భారీ స్థాయిలో మంచుకొండచరియలు విరిగిపడి అందులోనే కూరుకుపోయి చనిపోయారు. ఒక్క కార్నార్డ్ యాంకర్ మాత్రం బతికి బయటపడ్డాడు. అయితే, మంచుకిందపడిపోయిన వారు ఏ చోటపడ్డారనే విషయం మాత్రం 16 ఏళ్లుగా తెలియలేదు. అలెక్స్ లోవ్ చనిపోవడంతో అతడి భార్య ఈ ప్రమాదంలో పడి క్షేమంగా బయటపడిన కార్నార్డ్ యాంకర్ ను 2001లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వారు మోంటానాలోని బోజెమాన్లో జీవిస్తున్నారు. అలెక్సా పేరుతో ఓ చారిటబుల్ ట్రస్ట్ ను కూడా నడుపుతున్నారు. పర్వతారోహకులు చెప్పిన వివరాల ఆధారంగా ఆ రెండు మృతదేహాలు అలెక్స్, డేవిడ్వేనని కార్నార్డ్ యాంకర్ గుర్తించారు. ఏదేమైనా పదహారేళ్ల తర్వాత వారి మృతదేహాలు లభించడం తమకు కొంత ఊరటనిచ్చిందని వారు చెబుతున్నారు. -
అరుదైన కలివికోడి లభ్యం
పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం కనంపల్లి వద్ద పొలాల్లో అరుదైన కలివి కోడి కనిపించింది. శుక్రవారం సాయంత్రం అటుగా వెళ్తున్న స్థానికులకు కలివి కోడి దర్శనమివ్వడంతో దానిని పట్టుకున్నారు. శనివారం అటవీ శాఖాధికారులకు సమాచారం అందించి కలివికోడి అప్పంగించారు. -
ఆస్పత్రి ఆవరణలో పసికందు
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ఆస్పత్రిలో పదిహేను రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి ఆవరణలో ఏడుస్తున్న ఆడ శిశువును సిబ్బంది గుర్తించారు. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. శిశువును శిశు సంరక్షణ కమిటీకి అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. -
తిరుమల పుష్కరిణిలో మృతదేహం
తిరుమల: తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో ఆదివారం తెల్లవారుజామున ఓ మృతదేహం వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీయించి అశ్వని ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఎయిర్ లైన్స్ స్టీవార్డెస్ బ్యాగ్ లో 30 కిలోల కొకైన్
లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల కొకైన్ ను పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా మహిళ తీసుకు వెడుతున్న క్యారీ బ్యాగ్ లో కొకైన్ ఉన్నట్లు గుర్తించామని డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి వెల్లడించారు. విమాన సిబ్బందిగా భావిస్తున్న ఆమె... శుక్రవారం టర్మినల్ కు వచ్చి... అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని చూసి, తనతో తెచ్చిన బ్యాగ్ లు వదిలి తప్పించుకొని పారిపోయిందని స్పెషల్ ఏజెంట్ తిమోతి మాసినో తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు డీఈఏ తెలిపింది. అయితే నిందితురాలి ఆచూకీకోసం దర్యాప్తు ప్రారంభించిన అధికారులు సోమవారం సాయంత్రానికి ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆమె ఏ ఎయిర్ లైన్స్ లో పనిచేస్తోంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఖంగారుగా ఓ ఫోన్ కాల్ చేసిన తర్వాత అక్కడినుంచీ పారిపోయిన ఆమె ఏ భాషలో మాట్లాడిందన్నది సరిగా గుర్తించలేకపోయామని, అయితే ఆమె ఎస్కలేటర్ నుంచి పారిపోయేప్పుడు ఓ జత డిజైనర్ షూ వదిలి వెళ్ళిపోయిందని ఓ వార్తా సంస్థ తమ వెబ్ సైట్ లో వెల్లడించినట్లు లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టు పోలీసులు, ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ అధికారులు తెలిపారు. -
అదృశ్యమైన విద్యార్థిని శవమై తేలింది
లక్నో: అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని శవమై తేలింది. ఈనెల 10వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఉన్నతి విశ్వకర్మ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో తమ కూతురి ఆచూకీ కోసం గత వారం రోజులుగా ఆశతో ఎదురుచూస్తున్న ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సెవార్ లోని రాణీ లక్ష్మీబాయి కాలేజీలో చదువుతున్న ఉన్నతి మొబైల్‌ను ఒక రిక్షా డ్రైవర్ దగ్గర గుర్తించారు. అయితే తనకు ఆ మొబైల్ దొరికిందని అతను చెబుతున్న చోటే అమ్మాయి చనిపోయి ఉండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. చెట్టుకు వేలాడుతూ ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి రాజేష్ పాండే తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
రాజాపేటలో చిరుత సంచారం
రాజాపేట: నల్లగొండ జిల్లా రాజాపేట మండలం చల్లూరు పడమటిగుట్ట సమీపంలో బుధవారం చిరుత సంచరిస్తుందనే వార్త కలకలం రేపింది. వ్యవసాయ క్షేత్రాల సమీపంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు ఆవు దూడ మృతిచెంది ఉండటాన్ని గమనించి గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు చిరుత దాడి చేసి ఆవు దూడను చంపిందని నిర్ధరించుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
తీర్థయాత్రలకని చెప్పి తీరని లోకాలకు
ముంబై: ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబంలోని నలుగురు సభ్యులు విగజీవులుగా మారడం విషాదాన్ని నింపింది. కళ్యాణ్ తాలూకాలోని వారి నివాసంలో రంజిత్ యశ్వంతరావు(45) భార్య స్వాతి(38), పిల్లలు,శ్రద్ధ, (14) ఆర్య (7) మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారుంటున్న ఇంటినుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. భార్య పిల్లల్ని గొంతు నులిమి హత్య చేసిన అనంతరం యశ్వంత్ ఉరివేసుకుని చనిపోయాడు ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు వెల్లడించారు. ఓ ప్రయివేటు సంస్థలో క్లర్క్‌గా పనిచేసే యశ్వంత్ ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అలాగే మూడు రోజులు ఇంట్లో ఉండమని, తీర్థయాత్రలకు వెళుతున్నామని బంధువులతో చెప్పిమరీ ఈ అఘాయిత్యానికి పాల్పడారన్నారు. -
రిటైర్డ్ ఎస్పీ దంపతుల ఆత్మహత్య?
చెన్నై: తమిళనాడులోని తిరునవ్వేలిలో మాజీ ఎస్పీ మరియప్పన్ (66), ఆయన భార్య సుందరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పలాయం కొట్టాయంలోని తమ నివాసంలో వారు చనిపోయి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియప్పన్ దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. చెన్నైలో ఉంటున్న వారి కుమార్తెకు, ఇతర బంధువులకు సమాచారం అందించారు. జర్మనీలో ఉంటున్న వారి కొడుకు ఈ మధ్యనే చెన్నై వచ్చినట్టు సమాచారం. -
రైలులో మహిళ మృతదేహం..
-
బాలుడి కిడ్నాప్ ’విషాదాంతం’
-
అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభ్యం
-
వామ్మో..మొసలి
-
భార్య మృతదేహంతో 500 కి.మీ. ప్రయాణం
-
ఆగి ఉన్న లారీలో మృతదేహం
మిర్యాలగూడ: ఆగి ఉన్న లారీలో మృతదేహం ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదుల్గూడ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం వెలుగుచూసింది. రెండు రోజులుగా అక్కడే ఆగి ఉన్న లారీపై అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా..అందులో ఓ వ్యక్తి మృతదేహం ఉంది. మృతుడు కష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన నెక్కంటి సాయిప్రసాద్(50)గా గుర్తించారు. సాయి ప్రసాద్ లారీ డ్రైవర్ గా పని చేసుకుంటుండగా.. అదే లారీలో క్లీనర్‌గా పని చేస్తున్న వ్యక్తి పరారీలో ఉండటంతో.. అతనే హత్య చేసి పారిపోయాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అయిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, హత్య
కటక్: ఒడిశాలోని జాజ్‌పూర్ లో దారుణం జరిగింది. అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన కలకలం రేపింది. రోజకూలి చేసుకుని జీవనాన్ని గడిపే పాప తల్లిదండ్రులు పనికోసం వెళ్లిన తరువాత అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడు, అనంతరం పాప గొంతు నులిపి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర పడేసి పారిపోయాడు. సాయంత్రం పనినుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఇరుగుపొరుగు వారి సాయంతో చుట్టుపక్కల వెదికారు. ఈ క్రమంలో సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర పాప మృతదేహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు చిన్నారి పడి వున్నతీరు, ప్రాథమిక విచారణ అనంతరం అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం
కొవ్వూరు: ఆదివారం సాయంత్రం గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన నందిగాం జయదేవ్(15), సూర్యసుమంత్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో.. కొవ్వూరు గోశ్పాద క్షేత్రం వద్ద స్నాన ఘట్టంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం..!
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం ఏమిటి? ఒక్కోరికీ ఒక్కోలా కనిపించే ఆ పెయింటింగ్ వెనుక దాగున్న కథను వర్ణించేందుకు శాస్త్రవేత్తలు ఒక్కోరూ ఒక్కో రకంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రిఫ్లెక్టివ్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ ఫ్రెంచ్ సైంటిస్టు ఆమె చిత్రం వెనుక కనిపించని కథను కళ్ళకు కట్టేందుకు ప్రయత్నించారు. మోనాలీసా చిత్రానికి లియోనార్డో డావిన్సీ తన కళా ప్రతిభతో ప్రాణం పోస్తే... నేటి సైంటిస్టులు డిజిటల్ శక్తితో పునర్నిర్మిస్తున్నారు. శాస్త్రవేత్త పాస్కల్ కొట్టే... మోనాలీసా చిత్రంపై షాంఘైలోని విలేకరుల సమావేశంలో మంగళవారం విశ్లేషించారు. చిత్రలేఖనానికి వెనుక భాగంలో మల్టీ లెన్స్ కెమెరా వినియోగించి లోలోపల దాగిన బహుళ రూపాలను ప్రదర్శించారు. కొన్ని ముఖ్యమైన తేడాలతో కూర్చొని ఉన్నట్లుగా దాదాపు ఒకేలా కనిపించే మరికొన్ని చిత్రాలు దీనివెనుక దాగొన్నట్లు చెప్పారు. లోపలి చిత్రంలో పక్కకు తిరిగి కూర్చొని ఉన్న ఆమె.. ప్రేక్షకులపైపు చూస్తున్నట్లుగా కనిపించడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైనుంచి ఆమె చిరునవ్వు వెనుక మర్మమేమిటో తెలియక వీక్షకులు నోరెళ్ళబెడుతూనే ఉన్నారు. ఓ నిజ జీవితానికి చెందిన పెయింటింగ్ గా జనం ఆమోదించిన మోనాలీసా... ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య అని, 16వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మహిళ.. లిసా గెరార్దిని అని తన పరిశోధనల ద్వారా తేలినట్లు సైంటిస్టు పాస్కల్ కొట్టే చెప్తున్నారు. మోనాలిసా చిత్రాన్ని నేను పునర్నిర్మించిన అనంతరం ఆమె పోర్టరైట్ ముందు నిలబడితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని, మరొక స్త్రీగా ఉంటుందని అంటున్నారు. మరో పరిశోధకుడు అండ్రూ గ్రాహమ్ డిక్సన్ కూడ పాస్కల్ కొట్టే అభిప్రాయాలను ఏకీభవిస్తున్నారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగా మోనాలీసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు. -
కొయ్యూరులో మందు పాతర్లు లభ్యం
కొయ్యూరు: విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని చెల్దిగడ్డ వద్ద మావోయిస్టులు అమర్చిన రెండు మందు పాతర్లలను పోలీసులు వెలికి తీశారు. కూంబింగ్‌లో భాగంగా సోమవారం బోదరాల అటవీ ప్రాంతంలో మందుపాతరలను గుర్తించారు. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. కొయ్యూరు, మంప సీఐ, ఎస్సై లతో పాటు స్పెషల్ పోలీసులను మావోయిస్టులు టార్గెట్ గా చేసుకున్నట్టు సమాచారం. -
రోడ్డుపై 10 లక్షలు
అది నిత్యం వందలాది మందితో రద్దీగా ఉండే ప్రదేశం. అక్కడ ఓ బ్యాగ్ పడి ఉంది. చాలా సమయం నుండి అది అలాగే ఉండటాన్ని గమనించిన స్థానికులు ఉత్సుకతను ఆపుకోలేక అందులో ఏముందో అని తెరిచి చూశారు. అంతే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బ్యాగ్ నిండా డబ్బుకట్టలు. వెంటనే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన విజయవాడలోని మొగల్ రాజ్ పురం వద్ద ఓ పాఠశాల సమీపంలో జరిగింది. డబ్బును సురక్షితంగా అప్పగించిన స్థానికులను పోలీసులు అభినందించారు. -
కశ్మీర్ సరిహద్దులో కలకలం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ సరిహద్దులో పెద్ద ప్రమాదం తప్పింది. రద్దీగా ఉండే జమ్ము సరిహద్దు ప్రాంతంలో అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడి) భద్రతా దళాలు కనుగొన్నాయి. శ్రీనగర్ ముజఫరా బాద్ హైవేపై, కల్వర్ట్ కింద అమర్చిన ఈ పేలుడు పరికరాన్ని గమనించామని రోడ్ ఓపెనింగ్ పార్టీ రక్షక దళాలు తెలిపాయి. రొటీన్ గా నిర్వహించే తనిఖీల్లో భాగంగా ఈ భారీ పేలుడు పదార్థాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. దీన్ని నిర్వీర్యం చేయడంతో ఆ మార్గంలో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నాయి. -
సంచిలో పసికందుని వదిలేశారు
-
మూడవ మృతదేహం స్వాధీనం
పారిస్ : పారిస్ ఉగ్రదాడి ఘటనలో మూడవ ఉగ్రవాది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర అలజడి రేపిన ఈ కాల్పులకు ఘటనకు పాల్పడిన మహిళా జిహాదీ మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. బుధవారం సెయింట్ డేనిస్ అపార్ట్ మెంట్ పై జరిగిన దాడిలో కీలకమైన ఉగ్రవాది హతమైన ప్రదేశంలో ఈ మూడో మృతదేహాన్ని కనుగొన్నామని విచారణ అధికారులు ప్రకటించారు. అయితే ఆ ఉగ్రవాదికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు. సంఘటనా స్థలంలో హ్యాండ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కీలక సూత్రధారితోపాటు చనిపోయిన మహిళా ఉగ్రవాది.. అతడి (కజిన్) బంధువేనని, ఆమె పేరు హస్నా ఐతబౌలాచ్న్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలంలో దొరికిన పాస్ పోర్ట్ ఆ మహిళ పేరుతో ఉండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. -
ఆ కారు దొరికింది
పారిస్: పారిస్ ఉగ్రదాడిలో కీలకమైన సాక్ష్యాలను సేకరించడంతో పోలీసులు పురోగతి సాధించారు. నగరంలో పలుచోట్ల భీకరమైన కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు వాడిన కారును పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులు ఉపయోగించినట్టుగా అనుమానిస్తున్న ఈ బ్లాక్ సీట్ కారును మౌంట్రెయుల్ కి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బటాక్లాన్ ఏరియాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని పారిస్ లో నివసించే ఒమర్ ఇస్మాయిల్ ముస్తఫా(29) గా పోలీసులు గుర్తించారు. అతడి తండ్రి, అన్న, వదిన సహా ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గ్రీస్, బెల్జియం, జర్మనీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు పారిస్ దాడికి సంబంధించి అనుమానితులుగా భావించిన పలువురిని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్జియంలో అద్దెకుతీసుకున్న గ్రే పోలో కారు బటాక్లాన్ కన్సర్ట్ హాల్ దగ్గర స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి తెలిపారు. -
కాప్రా చెరువులో వ్యక్తి మృతదేహం
కుషాయిగూడ: హైదరాబాద్ శివార్లలో ఉన్న కాప్రా చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం బయటపడింది. మృతదేహం బాగా దెబ్బతిన్న స్థితిలో ఉండడంతో దానిని గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య లేక, హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళ సజీవదహనం..!
నగరం(గుంటూరు): గుంటూరు జిల్లా నగరం మండలం దూలిపుడి గ్రామ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపంచడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దూలిపుడి పడమట పాలెం మధ్యలో గుర్తుతెలియని మహిళను దుండగులు సజీవ దహనం చేసిన ఆనవాళ్లు ఉండటంతో.. పోలీసులు మహిళల మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు. ఎక్కడైనా హత్య చేసి తీసుకొచ్చి ఇక్కడ కాల్చారా లేక ఇక్కడే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో పడిన బాలుడి మృతదేహం లభ్యం
పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లాలో కాలువ పడి గల్లంతైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. పాలకొల్లు రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన గుమ్మల రాజేష్(7) అనే రెండవ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తూ సోమవారం నర్సాపురం-నిడదవోలు ప్రధాన కాలువలో పడిపోయాడు. సోమవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టినా దొరకలేదు. మంగళవారం మధ్యాహ్నాం పెంకులపాడు గ్రామం వద్ద బాలుడి శవం కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
గల్లంతైన జీహెచ్ఎంసీ కార్మికుడి ఆచూకీ లభ్యం
హైదరాబాద్: డ్రైనేజీ శుభ్రం చేస్తూ గల్లంతైన జీహెచ్ఎంసీ కార్మికుడు రాములును అధికారులు గుర్తించారు. డ్రైనేజీలో విషవాయువుల ప్రభావంతో రాములు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నం నల్లకుంట వద్ద డ్రైనేజీని చేస్తూ రాములు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన మరో కార్మికుడు శ్రీనివాస్‌కు ఆసుపత్రిలో చికిత్స పొందున్నాడు. -
గుర్గావ్లో హృదయ విదాకర ఘటన
-
బిందెలో ఏముందోనని ..
-
పార్వతీపురంలో ఇద్దరికి డెంగ్యూ
విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో రోజురోజుకూ డెంగ్యూ జ్వరం బాధితుల సంఖ్య పెరుగుతోంది. పట్టణంలోని 24వ వార్డు బుగత వీధికి చెందిన హనుమంతు అప్పలనరసమ్మ(50), 25వ వార్డు బొగ్గులవీధికి చెందిన సౌజన్య(12)కు డెంగ్యూ జ్వరం సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వారి సూచన మేరకు బాధితులను బుధవారం సాయంత్రం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. -
రాయ్‌గఢ్ అడవుల్లో లభించిన షీనా అస్తిపంజరం?
-
ఆదిలాబాద్‌లో బాలుడి కిడ్నాప్.. సుఖాంతం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కిడ్నాప్ కు గురైన బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఇల్లు కిరాయికి కావాలంటూ వచ్చి గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని ఎత్తుకు పోయిన కిలాడీని పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ పట్టణం పిట్టలవాడకు చెందిన వీరాబాయి ఇంటికి సోమవారం ఓ మహిళ వచ్చి గది అద్దెకు కావాలంటూ లోపలికి ప్రవేశించింది. ఒంటరిగా ఉన్న ఆమెను మాటల్లోకి దించింది. వీరాబాయి వంటింట్లోకి వెళ్లగా అదను చూసుకుని ఆమె కుమారుడిని ఎత్తుకుని క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ మహిళ ఆచూకీ కనిపెట్టారు. నిందితురాలు మహారాష్ట్రలోని పాండ్రచౌడ గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని బాలుడితోపాటు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఆమెను రిమాండ్‌కు పంపారు. సంఘటన జరిగిని 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. -
ట్రెక్కింగ్ కోసం వెళ్లి...
- చిక్‌మగళూరు అడవిలో దారి తప్పిన హైదరాబాదీలు - రెండు రోజులుగా ప్రత్యేక బృందాల గాలింపు - అచేతన స్థితిలో ఉన్న ఇద్దరిని రక్షించిన పోలీసులు సాక్షి,హైదరాబాద్, బెంగళూరు: ట్రెక్కింగ్ కోసం హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరుకు వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ సభ్యులు ఇద్దరు అక్కడి అటవీ ప్రాంతంలో ఆదివారం దారి తప్పి పోయారు. రెండు రోజులుగా తిండి,నిద్ర లేక సొమ్మసిల్లి పడిపోయిన వారిని మంగళవారం రాత్రి ఎత్తై కొండ ప్రాంతంలో ప్రత్యేక బృందాలు గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్‌కు చెందిన 11 మంది సభ్యుల బృందం శుక్రవారం చిక్‌మగళూరు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడానికి వెళ్లింది. ఈ బృందంలో గచ్చీబౌలి ఐఐఐటీలో పనిచేసే వివేక్ గుప్తా, సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శశిధర్లు ఉన్నారు. వీరంతా ట్రెక్కింగ్ అనంతరం ఆదివారం సాయంత్రం ఒక చోట కలసి అక్కడి నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే అందరూ ఒక చోటకే వచ్చారు. కానీ, ఇంతలోనే మళ్లీ ఇప్పుడే వస్తామంటూ వివేక్, శశిధర్లు తమ కిట్ బ్యాగ్‌లు, సెల్ఫోన్లు అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్లారు. రాత్రి వరకు వేచిచూసినా వారిద్దరు రాకపోవడంతో బృందం సభ్యులు సోమవారం ఉదయం స్థానిక పోలీసులకు,అడ్వెంచర్ క్లబ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు, అటవీ శాఖ ప్రత్యేక బృందాలు రెండు రోజులు అడవిని జల్లెడ పట్టాయి. చివరకు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఓ జలపాతం వద్ద అచేతన స్థితిలో ఉన్న వివేక్, శశిధర్‌లను గుర్తించి, వారు క్షేమ సమాచారాన్ని హైదరాబాద్‌లోని వారి బంధువులకు తెలియజేశాయి. బుధవారం ఉదయం వారిని సురక్షితంగా తీసుకువచ్చే ఏర్పాట్లు చేశామని అడ్వెంచర్ క్లబ్ ప్రతినిధి సురేశ్ ‘సాక్షి’కి తెలిపారు. -
విశాఖలో కిడ్నాపైన యువతులు క్షేమం
విశాఖపట్నం: విశాఖపట్నంలో కిడ్నాపైన ఇద్దరు యువతులను గోపాలపట్నం పోలీసులు రక్షించి గురువారం నగరానికి తీసుకువచ్చారు. వివరాలు.. విశాఖకు చెందిన ఇద్దరు యువతులను గత నెల 31న సింహాద్రి గిరిప్రదర్శనలో నజీబ్నాథ్ అనే యువకుడు కిడ్నాప్ చేసి కేరళ తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న గోపాలపట్నం పోలీసులు అప్రమత్తమై కేరళలో యువతులను బుధవారం పట్టుకున్నారు. అక్కడి నుంచి గురువారం వారిని తీసుకు వచ్చారు. -
వేగావతి నదిలో గుర్తుతెలియని మృతదేహం
బోడిగి: విజయనగరం జిల్లా బోడిగి మండలం ఆనవరం గ్రామ సమీపంలో వేగావతి నది సమీపంలోగుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహం గుర్తుపట్టని విధంగా ఉంది. దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు హతమార్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మురికి కాలువలో పసికందు
మహబూబ్‌నగర్: గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును సోమవారం మురికికాలువలో వదిలివెళ్లారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో గాంధీనగర్ కాలనీ సిల్వర్ జూబ్లీ క్లబ్ సమీపంలోని వీరేష్ ఇంటిముందు చోటుచేసుకుంది. పాప ఏడుపు గుర్తించిన వీరేష్ భార్య పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు 108 సాయంతో చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువలో స్నానానికి దిగి గల్లంతైన మద్దిలేటి(35) అనే వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం 6 గంటలకు లభ్యమైంది. కొడుమూరు కర్నూలు బ్రాంచి కెనాల్ వద్ద మృతదేహన్ని కనుగొన్నారు. ఆదివారం సాయంత్రం మద్దిలేటి తన స్నేహితులతో కలిసి గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో పార్టీ చేసుకున్నాడు. అనంతరం స్నానం చేద్దామని కాలువలోకి దిగగా..ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయాడు. స్నేహితులంతా కలిసి నిన్నటి నుంచి వెతకటం ప్రారంభించటంతో సోమవారం ఉదయం అతని శవం బయటపడింది. -
ఆటోలో నాటు తుపాకులు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో నాటు తుపాకులు లభ్యమయ్యాయి. రహదారిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆటోలో తరలిస్తున్న 8 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పాలకొండ మండలం అన్నవరం గ్రామ శివారులో సోమవారం జరిగింది. పాలకొండ నుంచి అన్నవరం వెళ్తున్న ఆటో ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆటోను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 8నాటు తుపాకులను గుర్తించారు. ఆటోను సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువకుడి దారుణ హత్య!
హైదరాబాద్: హైదరాబాద్‌లోని గాంధీనగర్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యువకుడి(25)ని రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
అమ్మో.. రాక్షస పిరానాలు కనిపించాయి
సియోల్: పిరానా చిత్రాన్ని మీరు చూసే ఉంటారుగా. అందులో ఉండే పిరానా చేపలు ఎంతటి బీభత్సం సృష్టిస్తాయి కదా.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచేంత క్రూరంగా అవి ప్రవర్తిస్తాయి. స్వయంగా మాంసాహారులైన ఫిరానాలు ఒక చెరువులో చేరాయంటే మొత్తం చేపలన్నీ మాయమవ్వాల్సిందే. ఎందుకంటే ఇవి వాటిని అమాంతం తినేసి చెరువును డొల్ల చేస్తాయి. ఎవరైనా అందులోకి దిగారంటే కుక్కలకంటే హీనంగా పీక్కు తింటాయి. అరుదైన జలాల్లోనే ఇవి నివాసం ఉంటాయి. అలాంటి ఈ రాక్షస చేపలు నాలుగింటిని దక్షిణ కొరియాలోని ప్రభుత్వాధికారులు గుర్తించారు. ఇవి మంచి నీళ్లల్లో ఉండటమనేది అత్యంత అరుదైన విషయంకాగా.. హోంగ్సియాంగ్ రాష్ట్రంలోని ఓ పర్వత పాదం వద్ద ఉన్న పదివేల స్క్వేర్ మీటర్లు విశాలమైన మంచినీటి రిజర్వాయర్ లో ఇవి కనిపించడంతో అక్కడి వారు ఆందోళన చెందడం ప్రారంభించారు. తొలుత ఓ స్థానికుడు ఈ చేపను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకాలజీ ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించి తొలుత 19 సెంటీ మీటర్ల ఫిరానాను గుర్తించారు. ఆతర్వాత మరో రోజు 15 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్ల ఫిరానాలను గుర్తించారు. ఫిరానా చేపలు అత్యంత ప్రమాదకరమైనవి.