అసోంః కాజీరంగా నేషనల్ పార్క్ సమీపంలో మరో ఖడ్గమృగం శవమై తేలింది. ఇప్పటికే ఎన్నోసార్లు వేటగాళ్ళ బారిన పడి ఆ మూగజీవాలు మృత్యు వాత పడ్డ విషయం తెలిసిందే. వాడిగా ఉండే వాటి కొమ్ములకోసం వేటగాళ్ళు ఏంకగా వాటి ప్రాణాలనే బలితీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కాగా తాజాగా కొమ్ములతోసహా ఓ మగ ఖడ్గమృగం కనిపించి కలకలం రేపింది.
అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్ (కేఎన్ పీ) సమీపంలో ఖడ్గ మృగం మృతదేహం కనిపించింది. పార్కు సమీపంలోని జపోరిపత్తర్ గ్రామస్థులు కొమ్ములతోపాటు ఉన్న జంతువు శరీరాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. కొహోరా రేంజ్ లోని మికిర్జన్ అటవీప్రాంతం డిప్లూ నదిలో ఖడ్గమృగం శరీరం కొట్టుకొని వచ్చినట్లు జపోరిపత్తర్ గ్రామస్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో కేఎన్పీ అధికారులు, పశువైద్యులు శరీరాన్ని పరిశీలించి.. ఆ మృగానిది సహజ మరణంగా నిర్థారించారు. ఎంతో దృఢంగా ఉండే ఖడ్గమృగం కొమ్ములను సురక్షితంగా భద్రపరిచేందుకు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శవమై తేలిన మరో ఖడ్గమృగం!
Published Sat, Jul 23 2016 8:06 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
Advertisement